ఆవేశంతో చితక్కొట్టా.. దర్శకుడు, హీరో ఆపారు: విశాల్‌ ప్రేయసి | Actress Sai Dhanshika Says She once Beat a Drunk Man | Sakshi
Sakshi News home page

Sai Dhanshika: నా కళ్లముందే చేయి చేసుకున్నాడు.. కోపంతో చితకబాదా..

Feb 7 2026 6:08 PM | Updated on Feb 7 2026 6:14 PM

Actress Sai Dhanshika Says She once Beat a Drunk Man

సెట్‌లో ఒకసారి ఓ వ్యక్తిని చితకబాదానంటోంది హీరోయిన్‌ సాయి ధన్సిక. ఆవేశం పట్టలేక అతడిని కొడుతూ ఉంటే అది చూసి దర్శకుడు, హీరో తనను ఆపారంటోంది. సాయిధన్సిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా యోగి డా. ఫిబ్రవరి 6న ఈ సినిమా రిలీజైంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ తమిళ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఫోటో అడిగితే..
అందులో సాయి ధన్సిక మాట్లాడుతూ.. కేరళలో ఓ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఓ వ్యక్తి నాతో ఫోటో దిగాలని మా అంకుల్‌(నా పర్యవేక్షకుడు)ని అడిగాడు. అయితే అతడు తాగి ఉన్నాడని గమనించి ఫోటో ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. వెంటనే ఆ తాగుబోతు మా అంకుల్‌ను కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అదంతా చూసి నాలో కోపం కట్టలు తెచ్చుకుంది.

చితకబాదా..
ఆత్మరక్షణ కోసం నేను ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ఆ టాలెంట్‌ అంతా అప్పుడు ఉపయోగించాను. వాడ్ని పరిగెత్తి వెళ్లి మరీ పట్టుకుని చితకబాదాను. పదినిమిషాలు కొడుతూనే ఉన్నాను. డైరెక్టర్‌, హీరో నా చేతులు పట్టుకుని నన్ను కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నించారు. నా మనుషుల్ని ఏదైనా అంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే విచక్షణారహితంగా కొట్టాను అని సాయి ధన్సిక చెప్పుకొచ్చింది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో షికారు సినిమాలో నటించింది.

పెళ్లి
ఇకపోతే సాయిధన్సిక, హీరో విశాల్‌ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే! గతేడాది ఆగస్టు 29న (విశాల్‌ పుట్టినరోజున) వీరి వివాహం జరగాల్సింది. కానీ నడిగర్‌ సంఘం భవనం ఇంకా పూర్తి కాకపోవడంతో పెళ్లి వాయిదా వేసుకుని ఎంగేజ్‌మెంట్‌తో సరిపెట్టుకున్నారు. మరి ఈ ఏడాది ఆగస్టు 29కైనా సాయి ధన్సిక మెడలో విశాల్‌ మూడు ముళ్లు వేస్తాడో, లేదో చూడాలి!

చదవండి: నా సినిమా ఎఫెక్ట్‌ అవుతుందని భయపడ్డా: ఏడ్చేసిన చంద్రహాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement