చాలాసార్లు ఏడ్చా.. అమ్మకు మళ్లీ పెళ్లి చేస్తా: సుప్రిత | Actress Surekha Vani Daughter Supritha Opens Up About Her Mother Remarriage, Reacts To Trolls And Kumkum Controversy | Sakshi
Sakshi News home page

Supritha: నా పెళ్లయ్యేలోపు అమ్మకు పెళ్లి చేస్తా.. రోజంతా ఏడ్చేదాన్ని

Feb 7 2026 4:46 PM | Updated on Feb 7 2026 5:20 PM

Actress Surekha Vani Daughter Supritha About her Mother Wedding

తల్లికి మళ్లీ పెళ్లి చేస్తానంటోంది టాలీవుడ్‌ సీనియర్‌ నటి సురేఖావాణి కూతురు సుప్రిత. ఈమె 'చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి' మూవీతో వెండితెరపై కథానాయికగా పరిచయం కావాల్సింది. కానీ దానికంటే ముందు అమరావతికి ఆహ్వానం సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోంది. ఈ హారర్‌ చిత్రం ఫిబ్రవరి 13న రిలీజ్‌ కానుంది.

కుంకుమ పెట్టుకోవద్దా?
తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బ్యూటీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సుప్రిత మాట్లాడుతూ.. అమ్మ కుంకుమ పెట్టుకున్నందుకు సురేఖావాణికి మళ్లీ పెళ్లంట అని ఏవేవో రాశారు. నా బలవంతం వల్లే అమ్మ కుంకుమ పెట్టుకుంది. నాన్న (టీవీ షోల డైరెక్టర్‌ సురేశ్‌ తేజ) చనిపోయే సమయానికి అమ్మకు 35 ఏళ్లుంటాయి. అప్పుడే అంత వైరాగ్యం చూడాల్సిన అవసరం లేదు. 

ట్రోలింగ్‌
అందుకే కుంకుమ పెట్టుకోమన్నాను. అందరూ ఏమనుకుంటారని మొదట ఒప్పుకోలేదు. నా బలవంతం వల్ల తనకు కుంకుమ ధరించడం అలవాటైపోయింది. అమ్మ, నేను కలిసి విహారయాత్రలకు వెళ్తుంటే కూడా ట్రోల్‌ చేస్తున్నారు. మా డబ్బుతో మేము బయటకు వెళ్లడం కూడా తప్పేనా? ఈ నెగెటివిటీ చూసి మొదట్లో ఏడ్చేసేదాన్ని.

కాలు కింద పెట్టనివ్వకూడదు
కానీ, వాళ్ల మాటలు పట్టించుకుని ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటే జీవితం ముందుకు కదలదని అర్థమైంది. అలా వాటిని లైట్‌ తీసుకుంటున్నాను. అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. తనకంటూ ఓ తోడుండాలి. నేను పెళ్లి చేసుకునే సమయానికి అమ్మకు వివాహం చేయాలన్నది నా కోరిక. అమ్మకు తగిన వ్యక్తి దొరకాలి. అతడు నా తల్లిని చాలా బాగా చూసుకోవాలి. కాలు కింద పెట్టనివ్వకూడదు.

బిగ్‌బాస్‌ షో ఇష్టం
నాకు బిగ్‌బాస్‌ రియాలిటీ షో అంటే చాలా ఇష్టం. ఇంతవరకు ఒక్క ఎపిసోడ్‌ మిస్‌ అవకుండా అన్ని సీజన్లు చూశాను. ఏడో సీజన్‌లో ఫోన్‌ కాల్‌ వస్తే వెళ్లిపోదామనుకున్నాను. కానీ దగ్గరివాళ్లు వద్దనడంతో ఆగిపోయాను. ఓ సీజన్‌లో అమ్మను, నన్ను జంటగా రమ్మని పిలిచారు. కానీ, వెళ్లలేదు. ఇక మీదట కూడా వెళ్లనేమో! అని సుప్రిత చెప్పుకొచ్చింది.

చదవండి: నా సినిమా చూడరేమో అని భయపడ్డా.. ఏడ్చేసిన చంద్రహాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement