హనీమూన్‌ చెక్కేసిన నవదంపతులు.. పెళ్లి వీడియో చూశారా? | Redin Kingsley, Sangeetha Enjoying Their Honeymoon Trip - Sakshi
Sakshi News home page

Redin Kingsley: 46 ఏళ్ల వయసులో ప్రియురాలితో కమెడియన్‌ పెళ్లి.. అప్పుడే హనీమూన్‌కు..

Published Wed, Dec 13 2023 1:28 PM

Redin Kingsley, Sangeetha Goes to Honeymoon Trip - Sakshi

జైలర్‌ నటుడు, కమెడియన్‌ రెడిన్‌ కింగ్‌స్లీ లేటు వయసులో పెళ్లి చేసుకున్నాడు. 46 ఏళ్ల వయసులో సీరియల్‌ నటి సంగీతను పెళ్లాడాడు. ఎటువంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా వివాహ శుభాకార్యాన్ని సింపుల్‌గా ముగించేశాడు. ఆదివారం నాడు (డిసెంబర్‌ 10న) బెంగళూరులో ఇరు కుటుంబాలు, అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.

సడన్‌గా పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్‌
కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరు సడన్‌గా పెళ్లి చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. దీంతో సెలబ్రిటీలు, అభిమానులు.. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించిన రెడిన్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ కొత్త జంట హనీమూన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత తొలిసారి రెడిన్‌ కింగ్‌స్లీ తన భార్యతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. మరోవైపు సంగీత తన పెళ్లి వీడియోను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఇద్దరి బ్యాగ్రౌండ్‌ ఇదే..
రెడిన్‌ కింగ్‌స్లీ.. కోలమావు కోకిల సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్ర డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లోనూ రెడిన్‌ యాక్ట్‌ చేశాడు. అలాగే ఎల్‌కేజీ, సంతనాతిన్‌ ఏ1, జాక్‌పాట్‌, నెట్టికన్‌ వంటి పలు చిత్రాల్లో యాక్ట్‌ చేశాడు. డాక్టర్‌, జైలర్‌ చిత్రాలతో మరింత గుర్తింపు సంపాదించుకున్నాడు. సంగీత విషయానికి వస్తే.. ఈ నటి అరన్మనైక్కిలి, తిరుమల్‌ వంటి సినిమాల్లో నటించింది. కానీ ఎక్కువగా బుల్లితెరపైనే సందడి చేసింది. పలు సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించింది.

చదవండి: కీరవాణితో వియ్యం.. నిజమేనన్న మురళీ మోహన్‌.. అప్పుడే పెళ్లి!

Advertisement
 

తప్పక చదవండి

Advertisement