కీరవాణి ఇంటి కోడలిగా మురళీ మోహన్‌ మనవరాలు.. | Sakshi
Sakshi News home page

Murali Mohan: కీరవాణితో వియ్యం.. నిజమేనన్న మురళీ మోహన్‌.. అప్పుడే పెళ్లి!

Published Wed, Dec 13 2023 12:12 PM

Murali Mohan Says His Granddaughter Going to Marry MM Keeravani Son Sri Simha - Sakshi

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో సెలబ్రిటీలు కూడా ఇంతకుమించిన మంచి తరుణం మళ్లీ దొరకదంటూ లైఫ్‌లో ఓ అడుగు ముందుకేస్తున్నారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌.. అన్ని వుడ్స్‌లోనూ తారలు పెళ్లి సందడితో బిజీగా ఉన్నారు. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందుకోనున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆస్కార్‌ గ్రహీత ఎమ్‌ఎమ్‌ కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహ.. నటుడు మురళీ మోహన్‌ మనుమరాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్‌ వచ్చాయి.

వచ్చే ఏడాదే పెళ్లి
తాజాగా ఈ వార్తలపై మురళీ మోహన్‌ స్పందిస్తూ అది నిజమేనని క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. 'నాకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కూతురు పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైంది. తనకు ఓ అమ్మాయి సంతానం. త్వరలో ఆమె పెళ్లి జరగబోతోంది. ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో తన వివాహం జరగనుంది. అలాగే నా కొడుక్కి ఓ కూతురు సంతానం. ఈమె పెళ్లి కూడా దాదాపు ఖాయమైపోయింది. అందరూ ఊహించినట్లుగానే కీరవాణి ఇంటికి కోడలిగా వెళ్లనుంది. పెద్ద మనవరాలి పెళ్లి ఫిబ్రవరిలో అయితే చిన్న మనవరాలి పెళ్లి వచ్చే ఏడాది చివర్లో జరగనుంది' అని పేర్కొన్నాడు.

మురళీ మోహన్‌ మనవరాలు ఏం చేస్తుంది?
కాగా మాగంటి మురళీ మోహన్‌ కొడుకు పేరు రామ్‌ మోహన్‌. ఈయన ఏకైక కుమార్తె పేరు 'రాగ'. కొద్దిరోజుల క్రితమే ఆమె బిజినెస్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం మాగంటి కుటుంబానికి సంబంధించి పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉంది. 'రాగ' కూడా అందులోనే కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. మొదటి నుంచి కూడా మురళీ మోహన్‌కు ఇండస్ట్రీలో మంచి పరిచాయాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే కీరవాణి అబ్బాయితో తన మనుమరాలు 'రాగ'ను ఇచ్చి వివాహం చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఇక శ్రీసింహ విషయానికి వస్తే యమదొంగ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించాడు. మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్‌ సినిమాలతో టాలీవుడ్‌లో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

చదవండి: 18 ఏళ్లకే పెళ్లి, ఐదేళ్లకే విడాకులు.. ముగ్గురు పిల్లలతో.. తెలుగు హీరోయిన్‌ కన్నీటి కష్టాలు..

Advertisement
 
Advertisement
 
Advertisement