సల్మాన ఖాన్ 'వీర్' (2010) సినిమాతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది జరీన్ ఖాన్. ఆ మరుసటి ఏడాది అతడి మూవీలోనే స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. అలా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఐటం సాంగ్స్ చేసింది. అయితే హేట్ స్టోరీ 3 మూవీ చేశాక తనను అందరూ తక్కువ చేసి చూశారంటోంది జరీన్ ఖాన్.
ముందో మాట చెప్పి..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో జరీన్ ఖాన్ మాట్లాడుతూ.. హేట్ స్టోరీ 3లో నటించాక అందరూ నన్ను చులకన చేసి మాట్లాడారు. తనకు యాక్టింగ్ రాదు కాబట్టే అలా దుస్తులు విప్పే సన్నివేశాల్లో నటించిందని కామెంట్స్ చేశారు. ఆ సమయంలో దర్శకుడు అనంత్ మహదేవన్ అక్సర్ 2 సినిమా ఆఫర్ చేశారు. అయితే ఇందులో బోల్డ్ సన్నివేశాలుండవని హామీ ఇచ్చారు. కథంతా చెప్పి ఇది హేట్ స్టోరీ మూవీలా అయితే ఉండదని నొక్కి చెప్పాడు. దాంతో సరేనన్నాను.

చెప్పిందొకటి.. చేసిందొకటి
కానీ, సెట్‌కు వెళ్లాక అంతా తలకిందులైంది. ముద్దు సన్నివేశం అంటారు.. సడన్ దుస్తులు విప్పేయమంటారు. పొట్టి దుస్తులే ధరించాలంటారు! నా బాధేంటంటే.. స్క్రిప్ట్ ఒకరకంగా చెప్పి షూటింగ్ మరోరకంగా జరిపారు. అదే వాళ్లతోనూ అన్నాను.. ఇలాంటి సన్నివేశాల్లో నటించడం నాకు సమస్య కాదు.. కానీ, మీరు నాకు చెప్పిందేంటని అడిగాను. కేవలం నా గత సినిమా చూసి కావాలని ఇందులో అలాంటి సీన్లు ఇరికిస్తున్నారన్నాను.
ఎంత అన్యాయం?
నామాట ఎవరూ పట్టించుకోలేదు. నాకు అందరూ వ్యతిరేకంగా మారారు. నిర్మాతలు పూర్తిగా అలా రెచ్చగొట్టే సన్నివేశాలే చేయమని బలవంతపెట్టారు. అదెంత అన్యాయం! అయినా నేను సహించాను. ఇప్పుడు గొడవకు దిగి వెళ్లిపోతే వాళ్ల పెట్టుబడి అంతా వృథా అవుతుందని సినిమా పూర్తి చేశాను. కానీ, చివరకు సినిమా స్క్రీనింగ్‌కు కూడా నన్ను పిలవలేదు. కానీ నేను సరిగా పని చేయనని నన్ను బద్నాం చేశారు అని జరీనా ఖాన్ చెప్పుకొచ్చింది.
చదవండి: నా సినిమాలన్నీ ఫ్లాప్.. నాకు లాభమే లేదు: విజయ్ సేతుపతి


