సీసీఎల్ విజేతగా కర్ణాటక.. రోహిత్ శర్మ స్టైల్లో కిచ్చా సుదీప్ ఎంట్రీ..! | Kichcha Sudeep mimics Rohit Sharma Robo Walk after CCL won | Sakshi
Sakshi News home page

Kichcha Sudeep: సీసీఎల్ విజేతగా కర్ణాటక.. రోహిత్ శర్మలా కిచ్చా సుదీప్..!

Feb 2 2026 5:03 PM | Updated on Feb 2 2026 5:19 PM

Kichcha Sudeep mimics Rohit Sharma Robo Walk after CCL won

సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2026 విజేతగా కర్ణాటక బుల్డోజర్స్ నిలిచింది. ఫైనల్లో బెంగాల్ టైగర్స్‌ను ఓడించిన కిచ్చా సుదీప్ సేన టైటిల్‌ ఎగరేసుకుపోయిది. ఇది కర్ణాటక బుల్డోజర్స్‌కు మూడో టైటిల్ కావడం విశేషం. దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తర్వాత సీసీఎల్ కప్‌ను కర్ణాటక గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. కోయంబత్తూరులోని ఎస్‌ఎన్‌ఆర్ కాలేజ్ గ్రౌండ్‌లో ఈ ఫైనల్ పోరు జరిగింది.

అయితే ఈ కప్ గెలిచాక కర్ణాటక బుల్డోజర్స్ సంబురాలు చేసుకుంది. మ్యాచ్ గెలిచిన కప్‌ అందుకునేందుకు వెళ్లిన కెప్టెన్ కిచ్చా సుదీప్‌ డిఫరెంట్‌ స్టైల్లో అలరించాడు. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా రోహిత్ శర్మ రోబో వాక్ స్టైల్లో వెళ్లి కప్ అందుకున్నారు. తాజాగా సీసీఎల్‌లోనూ అదే సీన్‌ రిపీట్ చేశాడు కిచ్చా సుదీప్. రోహిత్ శర్మ స్టైల్లోనే రోబో వాక్ చేస్తూ సీసీఎల్ ట్రోఫీని అందుకున్నాడు. ఈ వీడియో నెట్టింట కాస్తా వైరల్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో అభిమానులు కిచ్చా సుదీప్‌ ట్రోఫీ వాక్ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఫైనల్‌లో కర్ణాటక బుల్డోజర్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్‌ను 129 పరుగులకే పరిమితం చేశారు. ఆ తర్వాత బరిలోకి దిగిన కర్ణాటక బుల్డోజర్స్ ఓపెనర్ రాజీవ్ హను కేవలం 35 బంతుల్లో 69 పరుగులు చేసి పరుగులు చేయడంతో సునాయాసంగా విజయం సాధించింది. ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో కర్ణాటక టీమ్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. ఈ సీజన్‌లో బెంగాల్ టైగర్స్ రన్నరప్‌గా నిలిచింది.

ఇక కిచ్చా సుదీప్ సినిమాల విషయానికొస్తే  కన్నడ యాక్షన్ ఎంటర్‌టైనర్ మార్క్‌తో అలరించాడు. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. సుదీప్ ఇటీవల సినిమాల్లో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇది మూడు దశాబ్దాల స్ఫూర్తిదాయకమైన ప్రయాణం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement