దుల్కర్-మృణాల్ మళ్లీ జంటగా.. ఈసారి గత జన్మలు | Dulquer And Mrunal Bheegi Bheegi Music Video | Sakshi
Sakshi News home page

Dulquer Mrunal: 'సీతారామం' జోడీ మరోసారి.. వీడియో రిలీజ్

Feb 2 2026 1:58 PM | Updated on Feb 2 2026 2:05 PM

Dulquer And Mrunal Bheegi Bheegi Music Video

'సీతారామం'.. టాలీవుడ్ మర్చిపోలేని సినిమాల్లో ఒకటి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ తమ యాక్టింగ్, కెమిస్ట్రీ.. దీన్ని అద్భుతమైన మూవీగా మార్చేశారు. అప్పటినుంచి వీళ్లిద్దరూ మరోసారి ఎప్పుడు కలిసి నటిస్తారా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. 'సీతారామం' సీక్వెల్ గురించి కూడా అప్పుడప్పుడు రూమర్స్ వినిపించేవి. ఆ చిత్రం కాదు గానీ ఇద్దరూ మరోసారి కలిసి నటించారు. అదీ ఓ ఆల్బమ్ సాంగ్ కోసం. అదిప్పుడు యూట్యూబ్‌లో రిలీజైంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)

'బిగీ బిగీ' అంటూ సాగే ఆల్బమ్ సాంగ్‌కి ఏఆర్ రెహమాన్ సంగీంతమందించారు. రెహమాన్ కొడుకు అమీర్, జస్లిన్ కలిసి పాడారు. మెలోడీ సాంగ్‌కి వినడానికి బాగుంది. విజువల్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే రిపీట్స్ వినేంతలా అయితే ఈ పాట లేదు. ట్రైనులో వెళ్తున్న దుల్కర్, మృణాల్.. ఒకరినొకరు చూసుకున్నప్పుడు వాళ్ల గత జన్మలు గుర్తొస్తాయి అన్నట్లు విజువల్స్ చూపించారు. కెమిస్ట్రీ కూడా పర్లేదనిపించింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)

Advertisement
 
Advertisement
Advertisement