ఓటీటీ 'కింగ్‌' శంబాల.. రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ఆది | Aadi Saikumar's Shambhala movie 100 million streaming minutes complete | Sakshi
Sakshi News home page

ఓటీటీ 'కింగ్‌' శంబాల.. రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ఆది సాయికుమార్‌

Feb 2 2026 10:36 AM | Updated on Feb 2 2026 10:47 AM

Aadi Saikumar's Shambhala movie 100 million streaming minutes complete

నటుడు ఆది సాయికుమార్‌ నటించిన 'శంబాల' థియేటర్‌లో భారీ హిట్ అందుకుంది. ఓటీటీలో కూడా దూకుడు చూపుతుంది. జనవరి 21న ఆహా తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన శంబాల ఇక్కడ కూడా మెప్పిస్తుంది. సరైన విజయం కోసం ఆది చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్రమంలోనే శంబాల సినిమాతో ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చాడు. బక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 12 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ దాటిందని తెలుస్తోంది.

జనవరి 21, 2026న ఓటీటీలోకి వచ్చిన శంబాల.. 'ఆహా'తో మరో అద్భుతమైన ఫీట్‌ను సాధించింది. 11 రోజుల్లోనే  100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటింది. ఓటీటీలో చిన్న బడ్జెట్‌ సినిమాల పరంగా భారీ రికార్డ్‌ అని చెప్పొచ్చు. కేవలం తెలుగులోనే ఈ రేంజ్‌లో ఆదరణ లభించడం అంత సులభం కాదని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఓటీటీ కింగ్‌లా శంబాల నిలిచిందని కామెంట్లు పెడుతున్నారు. హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలో అందుబాటులోకి వస్తుందని సమాచారం.

శంబాల చిత్రాన్ని మహీధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు నిర్మించారు. ఇందులో అర్చన అయ్యర్, స్వసిక, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది. అయితే, దర్శకుడు చాలా అద్భుతంగా సినిమాను ప్లాన్‌ చేసుకున్నాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement