నాన్ స్టాప్ పంచులతో 2023లో విడుదలైన హిట్ సినిమా ‘మ్యాడ్’ (Mad) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇదే ఊపులో గతేడాదిలో వచ్చిన మ్యాడ్ స్క్వేర్(Mad Square) కూడా భారీ విజయం అందుకుంది. ఈ రెండు చిత్రాలలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మెప్పించారు అయితే, ఈ ఏడాదిలో మ్యాడ్ క్యూబ్ రానుంది. ఇందులో కొత్త వారు ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా మొదలైన ఈ ప్రాజెక్ట్‌ను కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మ్యాడ్ క్యూబ్ చిత్రంలోకి కొత్తవారు ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లలో ఎవరో ఒక్కరు మాత్రమే పార్ట్-3లో ఉంటారట. ఈసారి కొత్తవారితో ప్రేక్షకులను మెప్పించాలని చిత్ర యూనిట్ ఉన్నట్లు టాక్. ఈ క్రమంలోనే మ్యాడ్ క్యూబ్ ప్రాజెక్ట్‌లోకి లిటిల్ హార్ట్స్ ఫేమ్ జై కృష్ణ, కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది.

మ్యాడ్ 3ని హారర్ కామెడీగా తెరకెక్కించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుకాకముందే ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మ్యాడ్ 3 హారర్ కామెడీగా రూపొందనున్నట్లు క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాయ్స్ హాస్టల్‌లోకి ఓ లేడీ దయ్యం వస్తే ఎలా ఉంటుంది..? ఆ దయ్యం కారణంగా ముగ్గురు హీరోలు పడే ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది.


