దలైలామాకు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డ్‌ | Dalai Lama Meditation Album Won Grammy Awards | Sakshi
Sakshi News home page

దలైలామాకు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డ్‌

Feb 2 2026 8:49 AM | Updated on Feb 2 2026 8:57 AM

Dalai Lama Meditation Album Won Grammy Awards

ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు గ్రామీ అవార్డు దక్కింది. అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా 68వ గ్రామీ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది.  ప్రపంచవ్యాప్తంగా తమ పాటలతో, ఆల్బమ్‌లతో మెప్పించిన వారు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ క్రమంలోనే బెస్ట్ ఆడియో బుక్ 'మెడిటేషన్‌- ది రిఫ్లెక్సన్స్​ ఆఫ్​ హిజ్ హోలీనెస్ ద దలైలామా' అనే ఆల్బమ్‌కు గాను దలైలామాకు ఈ అవార్డు లభించింది. 90 ఏళ్ల వయసులో  గ్రామీ అవార్డు దక్కడం ఇదే తొలిసారి.

గ్రామీ అవార్డును దలైలామా తరఫున సంగీతకారుడు రూఫస్ వైన్​రైట్ స్వీకరించారు.  దలైలామా తరుఫున ఈ అవార్డ్‌ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం గౌరవంగా  ఉందన్నారు. 'మెడిటేషన్‌- ది రిఫ్లెక్సన్స్​ ఆఫ్​ హిజ్ హోలీనెస్ ద దలైలామా' (Meditations: The Reflections of His Holiness the Dalai Lama) అనే ఆల్బమ్‌ ద్వారా దలైలామా తన ఆలోచనలను పంచుకున్నారు. జీవితంలో ధ్యానం, శాంతి వంటి అంశాలు ఎంత ముఖ్యమో ఆయన పంచుకున్నారు. ఆయన చేసిన ఈ ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement