ఏగన్ హీరోగా ఫెమీనా జార్జ్, తెలుగు మూవీ ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి అప్పల్ల హీరోయిన్లుగా ‘హైకూ’ అనే చిత్రం ఆరంభం అయింది. కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించి, అనంతరం షూటింగ్ కూడా మొదలుపెట్టారు. యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో డా. డి. అరుళనందు, మ్యాథ్యూ అరుళ నందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
‘జో’ వంటి సూపర్ హిట్ మూవీతో గుర్తింపు పొందిన హరిహరన్ రామ్ అడిషనల్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘‘సాధారణంగా థియేట్రికల్ రన్ చూసిన తర్వాతే ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కోసం ప్రయత్నిస్తాం. కానీ మా సినిమా షూటింగ్ పూర్తికాక ముందే డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఇలా మా సినిమా విడుదలకు ముందే డిజిటల్ డీల్ క్లియర్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది’’ అని నిర్మాతలు పేర్కొన్నారు.


