గుండె లోతుల్లో బాధ.. ఎలా చెప్పాలో తెలీదు: నిహారిక | Niharika Konidela About Inner Peace in new Video | Sakshi
Sakshi News home page

Niharika Konidela: పైకి కనిపించట్లే కానీ మనసంతా తెలియని బాధ!

Feb 1 2026 7:30 PM | Updated on Feb 1 2026 7:34 PM

Niharika Konidela About Inner Peace in new Video

యాంకర్‌గా, నటిగా, నిర్మాతగా.. అన్నిరకాలుగా తన టాలెంట్‌ నిరూపించుకుంది నిహారిక. ప్రస్తుతం ప్రొడక్షన్‌పైనే ఎక్కువ ఫోకస్‌ చేసిన నిహారిక తాజాగా జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్న వీడియో షేర్‌ చేసింది. అయితే చెమటలు చిందించే ఎక్సర్‌సైజ్‌లను చూపించడమే కాకుండా మనసులోని సంఘర్షణను బయటపెట్టింది.

గుండె లోతుల్లో బాధ
నిహారిక మాట్లాడుతూ.. నా లోపల ఏదో తెలీని బరువు మోస్తున్నా.. అది ఒత్తిడా? బాధనా? అంటే నాకే తెలీదు. కానీ, మనసంతా బరువుగా ఉంది. దాన్ని చెప్పడానికి నాకు పదాలు కూడా దొరకడం లేదు. ఈ భారాన్ని తల్చుకుని కుంగిపోకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. కొన్నిసార్లు నేను జిమ్‌కు వెళ్తుంటాను, బరువులు ఎత్తుతాను. 

మనసు ఇప్పుడిప్పుడే..
మరికొన్నిసార్లు వాకింగ్‌ చేస్తాను. ఇందులో ప్లానింగ్‌ చేసుకోవడానికంటూ ఏమీ లేదు. గుండెనిండా ఊపిరి పీల్చుకుంటూ నడుస్తానంతే! ఇంకొన్నిసార్లు డ్యాన్స్‌ చేస్తాను, యోగా చేస్తాను. ఇవన్నీ చేస్తుంటే మనసు తేలికపడుతోంది. బయటకు ఏమీ మారలేదు అనిపించొచ్చేమో, కానీ నాలోపల మాత్రం మార్పు మొదలైంది అని చెప్పుకొచ్చింది. వ్యాయామం ద్వారా మానసిక ఒత్తిడిని జయించవచ్చని ఆమె చెప్పకనే చెప్పింది.

 

 

చదవండి: ఆడవారిపై ఇలాంటి ట్రోల్సా? చెండాలంగా ఉంది: బిగ్‌బాస్‌ బ్యూటీ

Advertisement
 
Advertisement
Advertisement