రొమాంటిక్‌ సాంగ్‌.. దర్శకుడికి కాజోల్‌ వార్నింగ్‌! | Kajol Warns Kunal Kohli about Dekhona Song in Fanaa Movie | Sakshi
Sakshi News home page

ఈ పాట నా అత్తామామలతో చూసేలా ఉండాలి, జాగ్రత్త!

Mar 19 2026 6:29 PM | Updated on Mar 19 2026 6:37 PM

Kajol Warns Kunal Kohli about Dekhona Song in Fanaa Movie

ఫనా.. ఈ సినిమా వచ్చి 20 ఏళ్లవుతోంది. 2006లో వచ్చిన ఈ చిత్రంలో ఆమిర్‌ ఖాన్‌, కాజోల్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. కాజోల్‌ అంధురాలిగా యాక్ట్‌ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఆనాటి సినిమా విశేషాలను దర్శకుడు కునాల్‌ కోహ్లి పంచుకున్నాడు. 

హీరోయిన్‌ వార్నింగ్‌
ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా సినిమాలో హీరోయిన్‌కు కళ్లు కనిపించవు. అలా అని తనకు కళ్లజోడు పెట్టలేదు. హీరో, ప్రేక్షకులు ఆమె కళ్లలోకి చూడాలనుకున్నాను. సినిమాలో హీరో, హీరోయిన్‌లపై దేఖోనా.. అని ఓ వర్షం పాట ఉంటుంది. ఆ సాంగ్‌ షూటింగ్‌ మొదటిరోజే కాజోల్‌ నన్ను హెచ్చరించింది. ఈ పాటను నేను నా అత్తామామలతో కలిసి చూడాల్సి ఉంటుంది, అది మైండ్‌లో పెట్టుకో అని వార్నింగ్‌ ఇచ్చింది. 

అంధురాలు ప్రేమలో పడకూడదా?
అయితే నేను వెనక్కు తగ్గాలనుకోలేదు.. ఆమె అంధురాలైతే ఏంటి? అందరిలాగే తను కూడా ప్రేమలో పడింది. తనకెందుకు పరిమితులు విధించాలనుకున్నాను. పాటను విచారంగా చూపించాలనుకోలేదు. నాకు నచ్చినట్లుగానే తీశాను అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో టబు, సతీశ్‌ షా, లారా దత్తా కీలక పాత్రలు పోషించారు.

చదవండి: రెండు ఫ్లాట్లు అమ్మేసిన ప్రభుదేవా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement