Kajol
-
రొమాంటిక్ సాంగ్.. దర్శకుడికి కాజోల్ వార్నింగ్!
ఫనా.. ఈ సినిమా వచ్చి 20 ఏళ్లవుతోంది. 2006లో వచ్చిన ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, కాజోల్ హీరోహీరోయిన్లుగా నటించారు. కాజోల్ అంధురాలిగా యాక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఆనాటి సినిమా విశేషాలను దర్శకుడు కునాల్ కోహ్లి పంచుకున్నాడు. హీరోయిన్ వార్నింగ్ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా సినిమాలో హీరోయిన్‌కు కళ్లు కనిపించవు. అలా అని తనకు కళ్లజోడు పెట్టలేదు. హీరో, ప్రేక్షకులు ఆమె కళ్లలోకి చూడాలనుకున్నాను. సినిమాలో హీరో, హీరోయిన్లపై దేఖోనా.. అని ఓ వర్షం పాట ఉంటుంది. ఆ సాంగ్ షూటింగ్ మొదటిరోజే కాజోల్ నన్ను హెచ్చరించింది. ఈ పాటను నేను నా అత్తామామలతో కలిసి చూడాల్సి ఉంటుంది, అది మైండ్‌లో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చింది. అంధురాలు ప్రేమలో పడకూడదా?అయితే నేను వెనక్కు తగ్గాలనుకోలేదు.. ఆమె అంధురాలైతే ఏంటి? అందరిలాగే తను కూడా ప్రేమలో పడింది. తనకెందుకు పరిమితులు విధించాలనుకున్నాను. పాటను విచారంగా చూపించాలనుకోలేదు. నాకు నచ్చినట్లుగానే తీశాను అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో టబు, సతీశ్ షా, లారా దత్తా కీలక పాత్రలు పోషించారు.చదవండి: రెండు ఫ్లాట్లు అమ్మేసిన ప్రభుదేవా -
బంగారంలా మెరిసిపోతున్న కాజోల్.. పొట్టి డ్రెస్‌లో జ్యోతి పూర్వాజ్ అందాలు..!
బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసిన వితికా శేరు..పొట్టి డ్రెస్‌లో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ హోయలు..బంగారంలా మెరిసిపోతున్న బాలీవుడ్ భామ కాజోల్..అమ్మకు బర్త్ డే విషెస్ చెప్పిన హీరోయిన్ శ్రీలీల..టాలీవుడ్ నటి సాహితి దాసరి లేటేస్ట్ పిక్స్.. View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) -
తమన్నా కొత్త బిజినెస్ లాంచ్.. హీరోయిన్ల సందడి (ఫొటోలు)
-
పచ్చని పొలాల్లో బిగ్‌బాస్ దివి.. శారీలో ఫుల్ గ్లామరస్‌గా నివేదా..!
సంక్రాంతి సినిమా పోజుల్లో ఆషిక రంగనాథ్..వైట్ శారీలో మరింత అందంగా నివేదా థామస్..హల్దీ ఫోటోలు షేర్ చేసిన బాలీవుడ్ భామ నుపుర్ సనన్..పచ్చని పొలాల్లో బిగ్‌బాస్ దివి హోయలు..వైట్ డ్రెస్‌లో బాలీవుడ్ హీరోయిన్ కాజోల్.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) -
బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న రకుల్.. సాక్షి అగర్వాల్ ఫిట్నెస్ మంత్ర..!
వైట్ డ్రెస్‌లో బాలీవుడ్ భామ కాజోల్ హోయలు..బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్..ఫిట్నెస్ ముఖ్యమంటోన్న హీరోయిన్ సాక్షి అగర్వాల్..సంక్రాంతి మూడ్‌లో యాంకర్ శ్రీముఖి..రెడ్ శారీలో కవ్విస్తోన్న బుల్లితెర భామ జ్యోతిపూర్వాజ్.. View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Kubbra Sait (@kubbrasait) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sakshi Agarwal |Actress |Fitness & Lifestyle (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
లండన్‌లో రాజ్... సిమ్రాన్
సినిమా ప్రేమికులందరూ అమితంగా ఇష్టపడిన ప్రేమ కావ్యం ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’. ఈ సినిమాలో రాజ్ (షారుక్ ఖాన్), సిమ్రాన్ (కాజోల్)ల ప్రేమకథ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించిందో తెలిసిందే. తాజాగా లండన్స్ లోని లీసెస్టర్ స్క్వేర్‌లో రాజ్, సిమ్రాన్‌ల కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయడం విశేషం. లండన్ లీసెస్టర్ స్క్వేర్‌లో విగ్రహ రూపంలో ఆవిష్కరింపబడ్డ తొలి ఇండియన్ సినిమా ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ కావడం ఓ అరుదైన గౌరవం. షారుక్ ఖాన్, కాజోల్ జోడీగా ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించిన చిత్రం ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’.యశ్ చోప్రా నిర్మించిన ఈ సినిమా 1995 అక్టోబరు 20న విడుదలైంది. అత్యధిక రోజులు ప్రదర్శితమైన సినిమాగా అరుదైన ఘనతను సాధించిన చిత్రం కూడా ఇదే. తెలుగులో ‘ప్రేమించి పెళ్లాడుతా’ పేరుతో రిలీజై, ఇక్కడా భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీలో షారుక్–కాజోల్‌ల సిగ్నేచర్ పోజుతో కూడిన కాంస్య విగ్రహాలను రూపొంందించారు. లండన్‌లోని లీసెస్టర్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలను షారుక్, కాజోల్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి యశ్ రాజ్ ఫిల్మ్స్ సీఈఓ అక్షయ్ విదానీ, హార్ట్ ఆఫ్ లండన్ బిజినెస్ అలయన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాస్ మోర్గన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని స్వచ్ఛమైన మనసుతో ఎంతగానో ప్రేమించి తీశాం. ఈ చిత్రం రిలీజైనప్పటి నుంచి ఇప్పటివరకు నేను, కాజోల్ ప్రేక్షకుల నుంచి ప్రేమను పొంందుతూనే ఉన్నాం’’ అని తెలిపారు. కాజోల్ మాట్లాడుతూ– ‘‘లండన్‌లో విగ్రహం ఆవిష్కరించిన దృశ్యాన్ని చూసినప్పుడు... ఆ చారిత్రాత్మక అనుభూతిని మళ్లీ పొంందినట్లుగా అనిపించింది’’ అని పేర్కొన్నారు. -
మాల్దీవుస్‌లో ప్రగ్యా జైస్వాల్.. ఫ్యామిలీ ట్రిప్‌లో ఆషిక రంగనాథ్..!
మాల్దీవుస్‌లో చిల్ అవుతోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..ఫ్యామిలీ ట్రిప్‌లో నాసామిరంగ హీరోయిన్ ఆషిక రంగనాథ్..మ్యాడ్ బ్యూటీ రెబా మోనిక జాన్ బ్యూటీఫుల్ లుక్స్..కలర్‌ఫుల్ డ్రెస్‌లో అనుపమ పరమేశ్వరన్ హోయలు..బ్లాక్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ కాజోల్.. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Aarti (@aarti.ravi) View this post on Instagram A post shared by Aaditi S Pohankar (@aaditipohankar) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
స్పిరిట్ లో ముఖ్యమైన పాత్ర చేస్తున్న కాజోల్?
-
ఒకే హీరోతో డేటింగ్ చేశాం: ఇద్దరు స్టార్ హీరోయిన్లు
బాలీవుడ్ హీరోయిన్స్ కాజోల్ (Kajol), ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna) వ్యాఖ్యాతలుగా కొనసాగుతున్న సెలబ్రిటీ టాక్ షో ‘టూ మచ్’ (Two Much) గురించి సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో తాజాగా విడుదలైన ఎపిసోడ్లో వారిద్దరూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.గతంలో వీరిద్దరు ఒకేసారి.. ఒకే హీరోతో డేటింగ్ చేసినట్లు షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే, అదంతా తమ పెళ్లికి ముందేనంటూ క్లారిటీ ఇచ్చారు. గతంలో ఇలాంటి సీక్రెట్స్ చెప్పాలంటే ఎవరైనా కాస్త ఆలోచించేవారు. అయితే, ప్రస్తుతం చాలా సింపుల్‌గా బహిరంగంగా మాట్లాడేస్తున్నారు. వారిద్దరితో డేటింగ్ చేసిన ఆ హీరో ఎవరంటూ సోషల్‌మీడియాలో చర్చలు మొదలయ్యాయి. కొందరు అభిషేక్ కపూర్ అంటూ కామెంట్ చేస్తే ఇంకొందరు మాత్రం అక్షయ్ కమార్ అని పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా వారిద్దరూ మాత్రం నిజ జీవితంలో వేరువేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్నారనేది నిజం. కాజోల్ అజయ్ దేవగన్‌ను పెళ్లి చేసుకుంటే.. ట్వింకిల్ ఖన్నా మాత్రం అక్షయ్‌ను వివాహం చేసుకుంది. -
పెళ్లికి ఎక్స్పైరీ డేట్.. ఎక్కువకాలం భరించాల్సిన పని లేదు!
మనం తినే ఆహారపదార్థాలకు, వాడే వస్తువులకు ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే పెళ్లికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉండాలంటోంది బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ (Kajol). అది తప్పేం కాదని సమర్థిస్తోంది. కాజోల్, ట్వింకిల్ ఖన్నా జంటగా హోస్ట్ చేస్తున్న షో 'టూ మచ్ విత్ కాజోల్'. తాజా ఎపిసోడ్‌కు విక్కీ కౌశల్, కృతి సనన్ గెస్టులుగా విచ్చేశారు. వీరితో ముచ్చటించే క్రమంలో పెళ్లికి ఎక్స్పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలా? అన్న ప్రశ్న తలెత్తింది.ఎక్స్పైరీ డేట్ ఉండాల్సిందే!వివాహానికి ఎక్స్పైరీ ఏంటి? అని కృతి సనన్, విక్కీ కౌశల్, ట్వింకిల్ ఖన్నా తల బాదుకుంటే.. కాజోల్ మాత్రం ఆ ఐడియాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. అది చూసిన ట్వింకిల్.. ఇది పెళ్లి, వాషింగ్ మెషిన్ కాదని గుర్తు చేసింది. అందుకు కాజోల్.. వివాహబంధానికి ఎక్స్పైరీ డేట్ ఉంటే మంచిదే అనిపిస్తోంది. కరెక్ట్ పర్సన్నే పెళ్లి చేసుకున్నామన్న గ్యారెంటీ ఏంటి? అలాంటి సందర్భాల్లో ఈ ఎక్స్పైరీ డేట్ పుణ్యమా అని జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉండదు. ఓటీటీలో టాక్ షోఅలాగే రెన్యువల్ ఆప్షన్ ఉంటే ఉన్నచోటే ఆగిపోకుండా ముందడుగు వేయొచ్చు అని పేర్కొంది. 'టూమచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' (Two Much with Kajol and Twinkle) టాక్ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ప్రతి గురువారం ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. కాజోల్ విషయానికి వస్తే.. 1999లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు కూతురు నైసా దేవ్‌గణ్ సంతానం.చదవండి: 14 ఏళ్లుగా ప్రేమ లేకపోయినా కలిసుంటున్నాం: నటి -
వివాహేతర సంబంధాలకు జై అన్న హీరోయిన్లు.. నెటిజన్స్ ఫైర్!
ఈ సినిమా తారలకు ఏమైంది? మరీ ముఖ్యంగా బాలీవుడ్ నటీమణులకు ఏమైంది? దశాబ్ధాల తరబడి భారతీయ సినిమాల్లో ప్రముఖంగా ఉంటూ మన ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతూనే మన దేశ సంస్కృతీ సంప్రదాయాల పట్ల బాధ్యతా రహితంగా ఎలా ఉండగలుగుతున్నారు?ఇలాంటి ఆలోచనలు ఇటీవలి కాలంలో చాలా మందికి వస్తున్నాయి. సినిమాల్లో శృంగార సన్నివేశాల విజృంభణతో పాటు ప్రేమ, పెళ్లి, వివాహేతర సంబంధాలు వంటి అనేక సున్నితమైన, యువతను ప్రభావితం చేసే అంశాలపై ఇష్టారాజ్యంగా వీరు వ్యాఖ్యలు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం విస్తుగొలుపుతోంది. అలాంటి బాధ్యతా రహిత సెలబ్రిటీల జాబితాలో తాజాగా సీనియర్ నటి కాజోల్, బాలీవుడ్ ప్రముఖురాలు ట్వింకిల్ ఖన్నాలు చోటు చేసుకున్నారు. పెళ్లయిన వాళ్లు వివాహేతర సంబంధాలు లేదా తాత్కాలిక శారీరక సంబంధాలు పెట్టుకోవడం తప్పులేదనే విధంగా వీరు వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది.(చదవండి: ప్రశాంత్ వర్మ సినిమా.. 'మహాకాళి'గా భూమి శెట్టి)వివరాల్లోకి వెళితే... తాజాగా జాన్వీ కపూర్, కరణ్ జోహార్, కాజోల్(Kajol), ట్వింకిల్ ఖన్నా(Twinkle Khanna ) పాల్గొన్న టాక్ షో పెళ్లయిన దంపతులు ఒకరికి ఒకరు విశ్వాసంగా ఉండడం అనే అంశంపై చర్చ నెట్టింట రచ్చను రాజేసింది .ఈ చర్చలో భాగంగా వేరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవడం ద్వారా జీవిత భాగస్వామిని మోసం చేయడం క్షమించరానిదని జాన్వీ కపూర్ అభిప్రాయపడగా దీన్ని , కాజోల్ ట్వింకిల్ ఖన్నా లు తోసిపారేశారు. ఇది దాంపత్య ఒప్పందాన్ని ఉల్లంఘించేది కాదని తేల్చేశారు. తద్వారా వీరిద్దరూ నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.(చదవండి: కొండచిలువను మెడకు చుట్టుకున్న గ్లోబల్ బ్యూటీ..)ఈ సెలబ్రిటీ టాక్ షో లో అతిధులుగా కాజోల్, ట్వింకిల్ ఖన్నా, జాన్వీ కపూర్(Janhvi Kapoor), కరణ్ జోహార్ పాల్గొన్నారు. భాగస్వామిని శారీరకంగా మోసం చేయడం కన్నా మానసికంగా మోసం చేయడం పెద్ద తప్పు అని అంగీకరిస్తున్నారా లేదా అనే చర్చ లేవనెత్తారు. దీంతో దేవర నటి జాన్వి శారీరక మోసాన్ని సహించలేమని అంటూ తన వైఖరిని గట్టిగా చెప్పింది. అయితే కరణ్ జోహార్, ట్వింకిల్ ఖన్నా కాజోల్ ఆ అభిప్రాయం సరైంది కాదని నొక్కి చెప్పారు. ట్వింకిల్ అయితే ‘రాత్ గయీ బాత్ గయీ (రాత్రి పోయింది ఆ విషయమూ అయిపోయింది )’ అంటూ తేలిగ్గా తేల్చి చెప్పింది, కాబట్టి మానసిక వ్యభిచారమే తప్పన్నట్టు మాట్లాడింది.అయితే జాన్వి తన అభిప్రాయం నుంచి వెనక్కి తగ్గలేదు. ఈ క్లిప్ ఇంటర్నెట్ అంతటా వైరల్ అయింది, ఒకవైపు, ‘పరమ సుందరి’ స్టార్ తన అభిప్రాయానికి ప్రశంసలు అందుకుంటుండగా, హోస్ట్‌లు కాజోల్ ట్వింకిల్ వారి అభిప్రాయానికి ఎదురుదాడిని ఎదుర్కొంటున్నారు. దీనిపై పలువురు మానసిక శాస్త్రవేత్తలు సైతం విశ్లేషణాత్మక విమర్శలు సంధిస్తున్నారు.పైగా జాన్వి చిన్నది, ఆమె 20 ఏళ్లలో ఉందని, కానీ ఆమె 50 ఏళ్ల వయస్సుకు చేరుకున్నప్పుడు, ఆమెకు ఇప్పుడు ఉన్న అభిప్రాయం మారుతుందని ట్వింకిల్ అనడాన్ని ప్రస్తావిస్తూ ఓ మనస్తత్వవేత్త ఇలా అన్నారు, ‘కాదు, ఇది వయస్సు లేదా పరిపక్వత గురించి కాదు, ఇది గౌరవం సరిహద్దుల గురించి.’’అంటూ గుర్తు చేశారు. ‘మోసం అంటే మోసం..అది భావోద్వేగంగా మాత్రమే కాదు శారీరకంగా లేదా సరసాలాడటం కూడా మోసమే. దానికి వేర్వేరు పేర్లు పెట్టి, సరదాగా గడపడానికి లేదా ‘మనస్సును మరల్చడానికి లేదా టైమ్ పాస్?‘ అని పిలవడం తప్పించుకోవడమేనన్నారు.పలువురు నెటిజన్లు జాన్విని అభినందించారు చాలా మంది అక్రమ సంబంధాల్ని సమర్థిస్తున్నారంటూ కాజోల్ ట్వింకిల్లను తీవ్రంగా విమర్శించారు. ‘ బాలీవుడ్ జీవనశైలిలో భాగంగా వారు దానిని సాధారణమైనదిగా చూస్తారు. వేరే విధంగా ఎవరైనా మాట్లాడటం అనేది వారికి వింతగా లేదా అమాయకంగా లేదా తెలివితక్కువగా అనిపిస్తుంది ‘ అని ఓ నెటిజన్ తీవ్రంగా దుయ్యబట్టారు. -
శారీరక సంబంధాలు తప్పే కాదన్న హీరోయిన్స్.. షాకైన జాన్వీ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna), కాజోల్ (Kajol) టూ మచ్ అనే టాక్ షో హోస్ట్ చేస్తున్నారు. పేరుకు తగ్గట్లుగానే కొన్ని విషయాల్లో కాస్త టూమచ్‌గా మాట్లాడేస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్లో వారి కామెంట్స్ విని హీరోయిన్ జాన్వీ కపూర్ షాకవ్వాల్సిన పరిస్థితి! ఇంతకీ ఏం జరిగింది? టూమచ్‌గా ఏం మాట్లాడారో చూసేద్దాం..ఎమోషనల్ చీటింగ్ పెద్ద తప్పు!'టూమచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్' షోకి జాన్వీకపూర్ (Janhvi Kapoor), కరణ్ జోహార్ హాజరయ్యారు. ఈ నలుగురు శారీరక బంధం (ఫిజికల్ రిలేషన్), ఎమోషనల్ కనెక్షన్ (ఎమోషనల్ రిలేషన్) గురించి చర్చ మొదలుపెట్టారు. ఫిజికల్ చీటింగ్ కన్నా ఎమోషనల్ చీటింగ్ పెద్ద ద్రోహం అని కాజోల్, ట్వింకిల్, కరణ్ ఏకాభిప్రాయానికొచ్చారు. కానీ, జాన్వీ ఎటూ తేల్చుకోలేకపోయింది. తన దృష్టిలో రెండూ తప్పేనని సమాధానమిచ్చింది. అందుకు హోస్ట్స్ ఒప్పుకోలేదు. పార్ట్నర్స్.. శారీరకంగా వేరేవారితో సంబంధం పెట్టుకోవడం అసలు మ్యాటరే కాదన్నట్లుగా మాట్లాడారు. ఆ ఎఫైర్స్ తప్పు కావుకరణ్ (Karan Johar) కూడా.. ఫిజికల్ చీటింగ్ వల్ల బంధాలేమీ కుప్పకూలవు అన్నాడు. దాన్ని జాన్వీ సమర్థించలేదు.. వేరేవారితో కనెక్షన్ పెట్టుకుంటే కచ్చితంగా రిలేషన్స్ పాడవుతాయని వాదించింది. ఎమోషనల్ చీటింగ్, ఫిజికల్ చీటింగ్.. రెండూ తప్పేనని బల్లగుద్ది చెప్పింది. అందుకు ట్వింకిల్ స్పందిస్తూ.. తనింకా 20'sలో ఉంది కదా.. ఇలాగే ఉంటదిలే.. 50 ఏళ్లు వచ్చాక మనం చెప్పేదే కరెక్ట్ అంటుంది. మనం చూసినవేవీ ఇంకా తను చూడలేదుకదా! అని కాజోల్, ట్వింకిల్ సెటైర్లు వేశారు. ఛీ, ఇలా ఉన్నారేంటి?వీరి అభిప్రాయాలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రియుడు లేదా భర్త ఇంకొకరితో సంబంధం పెట్టుకుని మోసం చేస్తే తప్పు కాదా? ఛీ, ఇలా ఉన్నారేంటి? అని తిట్టిపోస్తున్నారు. అదే సమయంలో జాన్వీ మెచ్యురిటీని అభినందిస్తున్నారు. కాగా హీరోయిన్ ట్వింకిల్‌కు అక్షయ్ కుమార్‌తో 2001లో పెళ్లయింది. అంతకంటే ముందు అక్షయ్‌కు రవీనా టండన్‌తో ఎంగేజ్మెంట్ అయంది, కానీ, అది పెళ్లివరకు రాకుండానే రద్దయిపోయింది. అలాగే శిల్పా శెట్టితోనూ ప్రేమాయణం సాగించాడు. కానీ అది సుఖాంతం కాలేదు.కొన్ని వినబడనట్లే ఉండాలి!కాజోల్ విషయానికి వస్తే.. అజయ్ దేవ్‌గణ్‌ను 1999లో పెళ్లాడింది. ఈ పెళ్లికంటే ముందు అజయ్.. కరిష్మా కపూర్‌తో కొంతకాలం లవ్‌లో ఉన్నాడు. ఆమెతో బ్రేకప్ అయ్యాక కాజోల్‌తో ప్రేమలో పడ్డాడు. దాదాపు 26 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారు. తన దాంపత్య జీవితం గురించి కాజోల్ ఓసారి మాట్లాడుతూ.. భర్త విషయంలో కొన్ని చూసీచూడనట్లుగా ఉండాలి, వినకూడనివి వినాల్సి వచ్చినా సరే.. వాటిని వెంటనే మర్చిపోవాలి. అదే నా సంసార జీవితం చక్కగా సాగేందుకు దోహదపడుతోంది అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.చదవండి: అల్లు అర్జున్ స్పెషల్ వీడియో.. రెండు లారీల థాంక్స్ చెప్పిన నాగ్ -
దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్
ప్రతీ ఏడాది ముంబైలో జరిగి దసరా ఉత్సవాలు, దుర్గా పూజలో బాలీవుడ్ హీరోయిన్లు ఉత్సాహంగా పాల్గొనడం ఆనవాయితీ. ముఖ్యంగా కాజోల్ , రాణి ముఖర్జీ ఈ కార్యక్రమాల్లో ముందంజలో ఉంటూ బంధుజనంతో కలివిడిగా తిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కానీ ఏడాది ఉత్సవాల్లో వారిద్దరూ తీవ్ర భావోద్వాగానికి లోనయ్యారు. అటు తన తండ్రి తరువాత అయాన్ ముఖర్జీ దుర్గా పూజ ఉత్సవాల్లో తొలిసారి పాల్గొన్నారు. తమ సమీప బంధువు, అత్యంత ఆప్తుడైన నటుడు దేబ్ ముఖర్జీ ఈ ఏడాదితమ మధ్య లేకపోవడమే ఇందుకు కారణం. ఆయనను గుర్తు చేసుకుని ఆయన మేనకోడళ్ళు నటీమణులు కాజోల్ , తనీషా రాణీ ముఖర్జీ భావోద్వాగానికి లోనయ్యారు. ఈ దృశ్యలు ఆన్లైన్లో దర్శనిమిచ్చాయి. ప్రతి సంవత్సరం దుర్గా పూజ పండల్ ఘనంగా దేబ్ ముఖర్చీ ఈ ఏడాది లేరు. ప్రముఖ బాలీవుడ్ నటుడు చిత్రనిర్మాత,బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ తండ్రి దేబ్ ముఖర్జీ. ఫ్యామిలీ అంతా ప్రేమగా 'దేబు కాకా' అని పిల్చుకునే దేబ్ ముఖర్జీ మార్చి 14, 2025న కన్నుమూసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ ఏడాది తమ కుటుంబ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లి, ఉత్సవాలను కలిసి ప్రారంభించారు కాజోల్, రాణీ ముఖర్జీ తనీషా ముఖర్జీ తదితర కుటుంబ సభ్యులు నార్త్ బాంబే సర్బోజానిన్ దుర్గా పూజ పండల్‌ను ఆవిష్కరించారు.రాణి ముఖర్జీ కుటుంబం యొక్క దుర్గా పూజ 2025 కి సహ-నిర్వాహకురాలిగా ఉన్నారు.‘‘అయిగిరి నందిని’’అనే స్తోత్రం మధ్య కాజోల్, రాణి దుర్గా మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అమ్మవారిని చూడగానే ఇద్దరూ భక్తితో చేతులో జోడించి నమస్కరించారు. అనంతర అటు అమ్మవారి రూపాన్ని చూసి, ఇటు దివంగత దేబ్ ముఖర్జీని స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. VIDEO | Mumbai, Maharashtra: Actors Kajol and Rani Mukherjee witness the unveiling of the Goddess' idol at the North Bombay Sarbojanin Durga Puja Samiti. (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/EgP2o1xVOH— Press Trust of India (@PTI_News) September 27, 2025ఈ సందర్భంగా తనీషా మాట్లాడుతూ"మా కుటుంబానికి ఇది కొంచెం విచారకరమైన సమయం, కొంచెం ఉత్సాహంతో పాటు, ఈ సంవత్సరం మా కుటుంబంలో ముగ్గురు ఆప్తులను కోల్పోయాం. ప్రతి సంవత్సరం దుర్గా పూజను నిర్వహించే మా దేబు కాకా (దేబ్ ముఖర్జీ) ఇక లేరు, ఈసారి పూజకు హాజరు కావడం కొంచెం కష్టంగానే అనిపించింది. అయినా గానీ ఆయన కలను ముందుకు తీసుకెళ్తున్నందున చాలా ఆనందంగా కూడా ఉంది." అన్నారు. View this post on Instagram A post shared by Rohit Saraiya (@rohitsaraiya.official) -
'ద ట్రయల్ 2' రివ్యూ: ఈ సిరీస్ పెద్దల కోసమే!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ‘ది ట్రయల్’ రెండో సీజన్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.ఏదైనా నేరం జరిగితే తగిన సాక్ష్యాలతో నేరస్థుడిని నిరూపించే ప్రక్రియలో న్యాయవాదులు ఉంటారు. ఆ న్యాయవాదుల సమూహంగా కొన్ని కంపెనీలు కూడా ఉంటాయి. ఆ కంపెనీలలో ఎంతో మంది న్యాయవాదులు తమ క్లయింట్ల తరఫున కోర్టులో విచారణకు హాజరవుతుంటారు. అటువంటి లా ఫర్మ్‌లపై తీసిన సిరీస్ ‘ది ట్రయల్’. 2023లో ఈ సిరీస్ మొదటి భాగం హాట్ స్టార్ వేదికగా రిలీజ్ అయింది. మళ్ళీ రెండేళ్ళకు దానికి కొనసాగింపుగా ఇప్పుడు 2025లో ‘ది ట్రయల్’ రెండో సీజన్ రిలీజ్ అయింది. కాజోల్ ప్రధాన పాత్రలో నటించగా ఆమె భర్త అజయ్ దేవగన్ ఈ సిరీస్‌కి నిర్మాతగా వ్యవహరించడం విశేషం.రెండు సిరీస్‌లు కలిపి 14 ఎపిసోడ్లతో ఉన్న ‘ది ట్రయల్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ కథాంశానికొస్తే... న్యోనికాసేన్ గుప్తా ఓ పేరున్న ఫర్మ్‌లో మంచి లాయర్. ఆమె భర్త రాజకీయ నాయకుడు. ఆమె చేస్తున్న లా ఫర్మ్‌లో ఎన్నో రాజకీయాలతో ఆమె ప్రమోషన్ని అడ్డుకుంటూ న్యోనికా కుటుంబానికి కూడా ఆపద కలిగిస్తుంటారు ఆమె ప్రత్యర్థులు. ఆ లా ఫర్మ్లోకి వచ్చే కేసులు కూడా ఈ భార్యాభర్తలకు లింకు అవుతుంటాయి. ఆ లింకులు పెద్ద పెద్ద కష్టాలనే తెచ్చిపెడతాయి. మరి... ఆ కష్టాలన్నింటినీ తట్టుకుని తన క్లయింట్ల కేసులను వాదిస్తూ, ఫర్మ్‌లోని రాజకీయాలను ఎదుర్కొంటూ న్యోనికా నిజంగా ట్రయల్ గెలుస్తుందా? లేదా అన్నది మాత్రం సిరీస్‌లోనే చూడాలి. హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ది ట్రయల్’ మంచి కాలక్షేపం. ఈ లా ఫర్మ్ కథలు పెద్దలు మాత్రమే చూడదగినవి. ఎంజాయ్..– హరికృష్ణ ఇంటూరు -
మీకెంత ధైర్యం అలా చేయడానికి?.. బాడీ షేమింగ్‌పై నటి ఆగ్రహం
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‌ను బాడీ షేమింగ్ చేయడాన్ని మరో నటి, టీవీ హోస్ట్ మిని మాథుర్ తప్పుపట్టింది. ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కాజోల్ వీడియోను పోస్ట్ చేయడంపై మండిపడింది. అసలు ఆమె బాడీని జూమ్ చేయడానికి నీకెంత ధైర్యం..తాను ఎలా కనిపించాలనేది తన ఇష్టమని.. మీరేలా డిసైడ్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాజోల్ వీడియోను జూమ్ చేస్తూ పోస్ట్ చేసిన వీడియోపై మిని మాథుర్ ఈ విధంగా స్పందించింది.కాగా.. బాలీవుడ్ నటి కాజోల్ తన లేటేస్ట్ వెబ్ సిరీస్ ది ట్రయల్ రెండో సీజన్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు, ఇందులో ఆమె నోయోనికా సేన్‌గుప్తా అనే లాయర్ పాత్రను పోషించారు. ముంబై జరిగిన ఈ ఈవెంట్లో కాజోల్ బ్లాక్ స్కర్ట్ డ్రెస్‌లో కనిపించింది. దీంతో వెంటనే డ్రెస్‌పై నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఇది చూసిన నటి మిని మాథుర్ అలాంటి వారికి ఇచ్చిపడేసింది. అయితే తనపై వచ్చిన బాడీ-షేమింగ్ వ్యాఖ్యలపై కాజోల్ ఇంకా స్పందించలేదు.మరోవైపు ది ట్రయల్ వెబ్ సిరీస్‌కు మొదటి సీజన్‌కు ప్రశంసలు వచ్చాయి. ఈ సిరీస్‌లో మరోసారి కాజోల్ న్యాయవాది నోయోనికా సేన్‌గుప్తాగా అలరించనుంది. ఈ చిత్రంలో జిషు సేన్‌గుప్తా ఆమె భర్తగా కనిపించనున్నారు. ఈ సిరీస్ మొదటి సీజన్ 2023లో విడుదలైంది. ఇందులో సోనాలి కులకర్ణి, షీబా చద్దా, అలీ ఖాన్, కుబ్రా సైట్, గౌరవ్ పాండే, కరణ్వీర్ శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ సీజన్ సెప్టెంబర్ 19, 2025న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Sunilkumar Gol (Photographer) (@goley.sunil_) -
కాజోల్ బర్త్ డే.. ఫెర్ఫెక్ట్ ఫ్యామిలీ హీరోయిన్ (ఫొటోలు)
-
బిగ్‌బాస్ సోనియా సీమంతం ఫోటోలు.. వరలక్ష్మీ శరత్‌కుమార్ ఫస్ట్ మ్యారేజ్ డే చిల్!
సీమంతం ఫోటోలు షేర్ చేసిన బిగ్‌బాస్ సోనియా..దుబాయ్‌లో చిల్ అవుతోన్న చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ..షూటింగ్లో బిజీగా బిగ్‌బాస్ అశ్విని శ్రీ..మొదటి వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్..బ్లాక్ శారీలో కాజోల్ బ్యూటీఫుల్ లుక్.. View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
అది వారి వ్యక్తిగత విషయం.. మనకు అవసరం లేదు: కాజోల్
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ తాజాగా సర్జమీన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు జంటగా కనిపించింది. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. ఈ మూవీలో ఇబ్రహీం అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి కయోజ్ ఇరానీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కాజోల్.. మెహర్ అనే పాత్రలో కనిపించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కాజోల్.. అందం, గ్లామర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీలో కాస్మెటిక్ సర్జరీ, బోటాక్స్ గురించి ప్రస్తావించింది. అందం కోసం ఇలాంటి చేయించుకోవడం అనేది వ్యక్తిగత విషయమని పేర్కొంది. అలాంటి వారిని మనం జడ్జ్ చేయకూడదని తెలిపింది. ఆ విషయాన్ని వారికే వదిలేయాలని హితవు పలికింది. కాస్మోటిక్ సర్జరీలు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాదని.. ఈ రోజుల్లో పురుషులు కూడా చేయించుకుంటున్నారని వెల్లడించింది.కాజోల్ మాట్లాడుతూ.. 'కత్తి కిందకు వెళ్లాలా, వద్దా అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం. అందుకే ఇలాంటి విషయాలను అది వారికే వదిలివేయాలి. వాటిని మనం ప్రశ్నించకూడదు. ఇది కేవలం జెండర్‌కు సంబంధించినది కాదు. చాలా మంది పురుషులు కూడా చేయించుకుంటున్నారు. ఇప్పుడున్న రోజుల్లో అందరూ సమానమే.. వృద్ధాప్యం అనేది మనస్సుకు సంబంధించిన విషయం. అయితే వృద్ధాప్యాన్ని చేరుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. కొంతమంది చిన్న వయస్సులోనే మరణించడంతో అసలు వృద్ధాప్యం పొందే అవకాశమే లేదు. అలాంటి వారు అదృష్టవంతులని కాదు. అంటే వారికి వృద్ధాప్యాన్ని అనుభవించడానికి, జీవితంలో ముందుకు పోయే ఛాన్స్ లేదు. అందుకే నాకు జీవించడానికి ఇంకా చాలా అద్భుతమైన సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. వాటి కోసమే ఎదురు చూస్తున్నా' అని అన్నారు. -
అప్పుడంత డబ్బు లేదు.. చెట్టు వెనకాలే చీర మార్చుకున్న హీరోయిన్
బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆనాటి సంగతులను నెమరేసుకున్నాడు. కరణ్ జోహార్ మాట్లాడుతూ.. "ఆరోజుల్లో షూటింగ్ చేయడం అంత ఈజీగా ఉండేది కాదు. ఇప్పుడున్నన్ని ప్రత్యేక విభాగాలు అప్పుడు లేవు. అసిస్టెంట్ డైరెక్టర్సే అన్నీ చూసుకోవాలి! దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాకు నేను సహాయ దర్శకుడిగా పని చేశాను.అన్ని పనులు ఒక్కరే..డైలాగులు రాసి నటీనటులకు ఇవ్వడం, వారిని చూసేందుకు వచ్చిన జనాల్ని అదుపు చేయడం మా పని. కొన్నిసార్లు హీరోహీరోయిన్లకు మేకప్‌మ్యాన్ కూడా మేమే అవుతాం. స్విట్జర్లాండ్‌లో సీన్స్ షూట్ చేసేందుకు మొత్తం 21 మందిమి వెళ్లాం. అందరం ఒకే బస్‌లో కూర్చునేవాళ్లం. బస్‌లో వెళ్తుండగా ఎక్కడైనా లొకేషన్ బాగుందనిపించగానే వెంటనే దిగిపోయి షూట్ చేసేవాళ్లం. హీరోహీరోయిన్లు కూడా..సరైన వసతులు లేనిచోట హీరోయిన్ కాజోల్ (Kajol) ఓ చెట్టు వెనక్కు వెళ్లి చీర మార్చుకునేది. షారూఖ్ ఖాన్ ఎక్కడపడితే అక్కడే డ్రెస్ మార్చుకుని రెడీ అయ్యేవాడు. ఎత్తైన కొండలపై షూటింగ్ ఉందంటే అందరూ సామాన్లు పట్టుకుని పైకి నడుచుకుంటూ వెళ్లాల్సిందే! షారూఖ్, కాజోల్ కూడా కొంత సామాను పట్టుకుని నడిచేవారు. అందరం ఒక టీమ్‌గా ముందుకు కదిలేవాళ్లం. మాకు సాయం చేయడానికి ఎవరూ ఉండేవారు కాదు. హీరోయిన్ డ్రెస్, జ్యువెలరీ కూడా తక్కువ రేటులో తీసుకునేవాళ్లం. హీరోయిన్ జుట్టు సరిచేశాడబ్బు ఎక్కువ లేకపోయేసరికి రైల్వే స్టేషన్ బయట అతి చవకైన ఆభరణాలు కొనుక్కొచ్చేవాడిని. కానీ ఇప్పుడంతా ఎలా మారిపోయిందో చూస్తున్నారుగా.. హీరో వానిటీ వ్యాన్‌లో కనీసం ఎనిమిది మందైనా ఉంటున్నారు. అప్పట్లో మేనేజర్, పీఆర్ అని ఎవరూ లేరు. హీరోయిన్ వెంట ఆమె తల్లి మాత్రమే ఉండేది. ఒకసారి కాజోల్ మేకప్‌మ్యాన్ లేకపోయేసరికి నేనే తన జుట్టు సరి చేశా. ఆమె తల్లి ముఖానికి మేకప్ వేసింది. ఆరోజుల్లో అంతా చాలా సరదాగా ఉండేది, ఇప్పుడంతా బోరింగ్‌గా మారిపోయింది అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.సినిమాదిల్వాలే దుల్హానియా లేజాయేంగే సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం 1995లో రిలీజైంది. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించగా యష్ చోప్రా నిర్మించారు. షారూఖ్ ఖాన్, కాజోల్ ప్రధాన పాత్రలు పోషించగా అమ్రిష్ పురి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు. కరణ్ విషయానికి వస్తే.. ఆయన బ్యానర్లో తెరకెక్కిన ధడక్ 2 మూవీ ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ చిత్రంలో సిద్దాంత్ చతుర్వేది, తృప్తి డిమ్రి హీరోహీరోయిన్లుగా నటించారు.చదవండి: సినిమాలు మానేసి క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తా: పుష్ప విలన్ -
ఆ శకం ముగిసింది : రూ. 183 కోట్ల డీల్, రూ. 3వేల కోట్ల లగ్జరీ ప్రాజెక్ట్
బాలీవుడ్లో 100 ఏళ్లకు పైగా చరిత్ర, భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన ఒక ఐకానిక్ స్టూడియో శకం ముగియనుంది. 1943లో శషధర్ ముఖర్జీ స్థాపించిన ఫిల్మిస్తాన్ స్టూడియోస్ (Filmistan Studios) ఇపుడిక కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా మారబోతోంది. దీన్ని ఆర్కేడ్ డెవలపర్స్ జూలై 3న రూ. 183 కోట్లకు కొనుగోలు చేసిందని టైమ్స్ నౌ డిజిటల్ నివేదించింది. ఈ మార్పు బాలీవుడ్ స్వర్ణయుగానికి మూలస్తంభం, ఐకానిక్ స్టూడియో శకం ముగింపును సూచిస్తుందని పలువురి సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.బ్రిటీష్ పాలనలో భారతదేశంలో ఏర్పడిన స్టూడియోలలో ఒకటి ఫిల్మిస్తాన్ స్టూడియో. దీన్ని ఏర్పాటు చేసిన శశధర్ ముఖర్జీ మరోవ్వరో కాదు బాలీవుడ్ హీరోయిన్లు కాజోల్, రాణి ముఖర్జీల తాత. ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లో ఉన్న ఈ స్టూడియోను నటుడు అశోక్ కుమార్, జ్ఞాన్ ముఖర్జీ , రాయ్ బహదూర్ చునిలాల్ వంటి దిగ్గజ వ్యక్తులతో కలిసి స్థాపించారు. బాంబే టాకీస్‌ను విడిచిపెట్టిన వీరంతా హైదరాబాద్ నిజాం సహాయంతో దీన్నిస్థాపించారు. అప్పటినుంచి అనేక ప్రతిష్టాత్మక సినిమాలకువేదికైంది. ఎకనామిక్ టైమ్స్ ఒక నివేదిక ప్రకారం ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్కేడ్ డెవలపర్స్ దీన్ని కొనుగోలు చేసింది. 4 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ స్టూడియో స్థానంలో విలాసవంతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తోంది. 2026లో షురూ కానున్నఈ ప్రాజెక్ట్‌కు దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రీమియం 3, 4 , 5 BHK అపార్ట్మెంట్లతో కూడిన రెండు ఎత్తైన 50-అంతస్తుల భవనాల సముదాయంగా నిర్మించనుంది. ఆర్కేడ్ డెవలపర్స్ ఛైర్మ, ఎండీ అమిత్ జైన్ లింక్డ్ఇన్లో ఈ విషయాన్ని ధృవీకరించారు. పట్టణ,విలాసవంతమైన జీవనానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని ఆయన పేర్కొన్నారు.చదవండి: Akhil Anand చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ కుమారుడు 14 ఏళ్లకే!మరోవైపు ఫిల్మిస్తాన్ స్టూడియోను విక్రయంపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేష్ ((AICWA) స్పందించింది. ఈ ప్రాజెక్టు వల్ల లక్షలాది మంది కార్మికులు,కార్మికులు, కళాకారులు రోడ్డున పడతారని వాదిస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ జోక్యం చేసుకుని స్టూడియో కూల్చివేతను ఆపాలని కోరింది.ఈ స్టూడియో కేవలం ఒక నిర్మాణ మైలురాయి మాత్రమే కాదు, వేలాది మంది తెరవెనుక నిపుణుల అవిశ్రాంత అంకితభావంపై నిర్మించిన గొప్ప సాంస్కృతిక వారసత్వ వేదిక అని పేర్కొంది. ఇలాంటి అనేక ఇతర చారిత్రాత్మక చలనచిత్ర స్టూడియోలు ఇదే దశలో ఉన్నాయనీ, వినోద రంగంలో ఉపాధికి విస్తృత ప్రమాదాన్ని కలిగిస్తున్నాయంటూ అసోసియేషన్ నేతలు సీఎంకు ఒక లేఖ రాశారు. ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..! -
బాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్ట్.. అభినయంతో ఆకట్టుకున్న స్టార్స్ వీళ్లే!
సాధారణంగా సినిమా జయాపజయాలను కలెక్షన్లతో ముడిపెడతారు. అలాగే ప్రతీ ఏటా కలెక్షన్లను అనుసరించి ఆ సంవత్సరపు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ సినిమా ఫలితాలను స్టార్ల స్టార్ డమ్‌ను విశ్లేషించడం కూడా రివాజు. అయితే ఈ సంప్రదాయానికి విరుద్ధంగా.. నటీనటుల అభినయం పరంగా ఈ విశ్లేషణ మొదలైనట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ మీడియా దీనికి శ్రీకారం చుట్టింది. తాజాగా ఈ ఏడాది అర్ధభాగంలో విడుదలైన సినిమాలను తీసుకుని వాటిలో అభినయం ద్వారా ప్రభావం చూపిన స్టార్స్‌ను గుర్తిస్తోంది. అందులో భాగంగా 8మంది తారల్ని ప్రకటించింది. అర్ధభాగంలో అభినయంతో ఆకట్టుకున్న ఆ నటీనటులు ఎవరంటే...అభిషేక్ బెనర్జీస్టోలెన్ సినిమాలో నటించిన అభిషేక్ బెనర్జీ ఆ సినిమాని అమాంతం ప్రేక్షకుల హృదయాల్లో కూర్చోబెట్టారు. ఈ చిత్రంలో ప్రతీ భావాన్ని నిజంగా అన్నట్టు ప్రతిబింబించాడాయన. అతని నటన ఆ చిత్ర ప్రేక్షకులు పొందిన అనుభూతిని ఆకాశానికి తాకించింది. తరచూ నిశ్శబ్ధాన్ని ఆశ్రయిస్తూ ప్రేక్షకుల మనసుల్లో నిశ్శబ్ధంగా నిలిచిపోయింది.సన్యా మల్హోత్రామిస్ట్రెస్ సినిమాలో నటించిన సన్యా మల్హోత్రా కూడా ఈ జాబితాలో స్థానాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది. ఒక మహిళగా ఈక్వాలిటీ కోసం పోరాడటం, ఊహించని ఒత్తిడి ఎదుర్కోవడం – ఆమె వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం, ఇలాంటి పాత్ర పోషించడం సులభం కాదు. కానీ ఆమె ఆ పాత్రకు జీవం పోసింది.ఆదర్శ్ గౌరవ్సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్ సినిమాలో ఆదర్శ్ గౌరవ్ పాత్రను మరచిపోవడం అంత సులభం కాదు. అందుకే అంత సులభంగా అతను ఫేమస్ అయ్యాడు. చిన్న పట్టణపు యువత కలలను ప్రతిబింబించడంతో పాటు హాస్య–భావాలను మనసుతో పలికించడం ద్వారా అతను అందరికీ గుర్తుండి పోయాడు.వామికా గబ్బీబూల్ చుక్ మాఫ్ చిత్రంలో నటించిన వామికా గబ్బీ ప్రేమచుట్టూ అల్లుకునే అనేక సమస్యలను వాటిని ఎదుర్కున్న తీరును ఆమె పాత్ర కొత్తగా పరిచయం చేస్తుంది. తెరపై అద్భుతమైన భావాలను చూపెట్టిన వామికా గబ్బీ..ఈ ఏడాది గట్టి ప్రభావం చూపిన నటీమణుల్లో ఒకరుగా నిలిచింది.రణదీప్ హుడామంచి విజయాన్ని సాధించిన జాట్ సినిమాలో రణదీప్ హుడా వీరానురాగాన్ని చూపిస్తూ విలనిజాన్ని ప్రదర్శించాడు. అతని పాత్ర అంత భయంకరంగా కనిపించకపోతే ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకునేది కాదేమో..రణదీప్ నటన జాట్‌ను ఒక సినిమాగా మాత్రమే కాదు ఒక అనుభవంగా మార్చింది. కాజోల్ఇప్పటికే అనేక పాత్రల ద్వారా తనను తాను నిరూపించుకున్న సీనియర్ నటి కాజోల్... మా సినిమాలో మరింతగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. మాతృత్వ బాధ్యతల్లో మునిగి పోయిన ఒక సగటు తల్లిగా కాజోల్, పటిష్టంగా పలికించిన భావోద్వేగాల లోతు అంతరంగాల్ని తాకుతుంది.విక్కీ కౌశల్చావా సినిమా సృష్టించిన సంచలనాల గురించి చెప్పుకోవడం ఎంత ముఖ్యమో ఆ సినిమాలో నటించిన విక్కీ కౌశల్ గురించి మాట్లాడడం అంతకన్నా ముఖ్యం. మరాఠా వీరుడు శంభూజీ మహరాజ్ ను ప్రేక్షకుల కళ్ల ముందు అతను ప్రతిష్టించిన తీరు అమోఘం. దేశంలో అత్యధిక శాతం మందికి అంతగా పరిచయం లేని ఓ వీరుని కధను పరిచయం చేయడం మాత్రమే కాదు వారి గుండెల్లో నిలిచిపోయేలా చేయడంలో విక్కీ...విజయం సాధించాడు.అమీర్‌ఖాన్...భావోద్వేగ భరిత సినిమాల ద్వారా భారీ విజయాల్ని అందుకోవడంలో తానెందుకు మిగిలిన హీరోల కన్నా ముందుంటాడో చాటి చెప్పడంలో అమీర్‌ఖాన్ మరోసారి విజయం సాధించాడు. సితారే జమీన్ పర్ లో అమీర్ ఖాన్ తన స్టార్ డమ్ ద్వారా కళ్ల ముందు మెరుపులు మెరిపించడం కన్నా... మన హృదయాలను స్పర్శించడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ పనిలో ఆయన విజయం సాధించాడు. -
11 ఏళ్ల వయసులో స్కూల్ నుంచి పారిపోయా.. ఎందుకంటే?: కాజోల్
చాలామందికి చిన్నతనంలో అమ్మ కంటే అమ్మమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం. ఆమె చేసే గారాబం, చూపించే ప్రేమకు అసలు తనను వదిలి వెళ్లబుద్ధి కాదు. బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ (Kajol)కు కూడా అమ్మమ్మ అంటే బోలెడంత ఇష్టం. తనకోసం చిన్నతనంలో చేసిన ఓ సాహసాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది.11 ఏళ్ల వయసులో సాహసంనేను బోర్డింగ్ స్కూల్లో చదివాను. ఓసారి మా అమ్మమ్మకు ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. అప్పుడు నా వయసు 11 ఏళ్లు. అమ్మకు ఫోన్ చేస్తే.. నాకు ఎగ్జామ్స్ ఉన్నందున ఇంటికి రావొద్దని చెప్పింది. డిసెంబర్లో సెలవులు ఇస్తారు కదా.. అప్పుడు ఇంటికి రావొచ్చులే అంది. నాకేమో అమ్మమ్మ గురించి తెలిశాక అక్కడ ఉండబుద్ధి కాలేదు. అప్పటికే నా స్నేహితురాలు కూడా ఎందుకో బాధగా ఉంది. దీంతో మేమిద్దరం స్కూల్ నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నాం. ఎలాగైనా ముంబై వెళ్లిపోవాలనుకున్నాం. అమ్మ ఫోన్ చేసిందని అబద్ధంనేను చదువుకుంటున్న టౌన్ పంచంగిలో మా చుట్టాలున్నారు. అలా మా మామయ్యను కలుసుకుని.. 'అమ్మ నాకు ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. నన్ను బస్టాండ్‌కు తీసుకెళ్లు' అని చెప్పాను. ఆయన నిజమని నమ్మి నన్ను బస్టాప్‌కు తీసుకెళ్లాడు. అంతా అనుకున్నట్లుగానే జరుగుతోంది.. ఇక ఇంటికి వెళ్లిపోవచ్చు అనుకునే సమయంలో ప్లాన్ రివర్స్ అయింది. బస్ కోసం ఎదురుచూస్తుండగా స్కూల్లో పనిచేసే నన్స్.. నన్ను, నా ఫ్రెండ్‌ను వెతుక్కుంటూ వచ్చారు. నా చెవులు మెలేస్తూ తిరిగి స్కూల్‌కు తీసుకెళ్లారు అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.దూరాన్ని లెక్క చేయకుండా..కాజోల్ పంచంగి పట్టణంలో హాస్టల్ వసతి ఉన్న స్కూల్లో చదువుకుంది. అక్కడి నుంచి ముంబై వెళ్లాలంటే కనీసం ఐదు గంటల సమయమైనా పడుతుంది. కానీ అమ్మమ్మపై ఉన్న ప్రేమ.. ఆ దూరాన్ని లెక్క చేయనివ్వలేదు. ఎలాగైనా ఇంటికి వెళ్లాలనుకున్న ఆమె స్కూల్ మేనేజ్మెంట్కు దొరికిపోవడంతో ప్లాన్ బెడిసికొట్టింది. కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన మా చిత్రం ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది.చదవండి: జర్నలిస్టు నుంచి నిర్మాతగా.. 25 మంది తెలుగమ్మాయిలను పరిచయం చేస్తా -
డైరెక్ట్‌గా ఓటీటీకి సలార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సలార్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఫేమ్ తెచ్చుకున్న హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆ తర్వాత ఆడుజీవితం సినిమాతో మరోసారి సినీ ప్రియులను అలరించాడు. ఈ ఏడాది ఎంపురాన్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించారు.ప్రస్తుతం మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తోన్న సర్జమీన్ అనే బాలీవుడ్లో చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీలో కాజోల్ హీరోయిన్గా కనిపించనుంది. దేశభక్తి నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారు.సర్జమీన్ మూవీని జూలై 25 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన పేరుతో ఓ వీడియోను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఇబ్రహీం అలీ ఖాన్ ఉగ్రవాదిగా కనిపంచనున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్తారు. ఈ సినిమాతోనే కాయోజ్ ఇరానీ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు.సర్జమీన్' కథేంటంటే?కశ్మీర్ నేపథ్యంతో ఈ మూవీని తెరకెక్కించారు. తన విధి పట్ల ఎంతో నిబద్ధత చూపించే విజయ్ మీనన్ (పృథ్వీరాజ్) చుట్టూ తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో మీరా పాత్రలో కాజోల్, హర్మన్ పాత్రలో ఇబ్రహీం అలీ ఖాన్ నటించారు. మాతృభూమిని కాపాడటం కంటే ముఖ్యమైనది మరొకటి లేదు అనే క్యాప్షన్‌తో జియోహాట్‌స్టార్ ఈ వీడియోను షేర్ చేసింది. Sarzameen ki salamati se badhkar kuch nahi 🇮🇳#Sarzameen, releasing July 25, only on @JioHotstar!#SarzameenOnJioHotstar@itsKajolD #IbrahimAliKhan #KaranJohar @adarpoonawalla @apoorvamehta18 @AndhareAjit @kayoze @MARIJKEdeSOUZA @somenmishra0 @Soumil1212 #ArunSingh… pic.twitter.com/qtxTBsq4Iq— Prithviraj Sukumaran (@PrithviOfficial) June 30, 2025 -
రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలున్నాయా..? భయపెడుతున్న టాప్ హీరోయిన్స్ అనుభవాలు
దక్షిణాదిలో పలువురు సినిమా షూటింగ్స్ కోసం ఎంచుకునే హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిలిం సిటీ లో దయ్యాలు ఉన్నాయా? తరచుగా సినీతారలు ఆ ఫిలిం సిటీ గురించి ప్రకటిస్తున్న భయాలు, అనుభవాలు దేనికి సంకేతం? విశేషం ఏమిటంటే, సదరు ఫిలిం సిటీలో తాము ఎదుర్కున్న భయానక అనుభవాలు వెల్లడిస్తున్న వారు కూడా ఏదో చిన్నా చితకా నటీమణులు కాకపోవడం, ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో అత్యంత పేరున్న ప్రముఖ తారలు కావడమే విశేషం. హైదరాబాద్ శివార్లలో విస్తరించిన రామోజీ ఫిల్మ్ సిటీ హంటెడ్ స్థలం అనే ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఫిలిం సిటీ గురించి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ షూటింగ్స్ సమయంలో కొన్నిసార్లు రాత్రంతా నిద్రపోలేని ప్రదేశాలలో గడిపాపనని, అలాంటి సమయంలో అక్కడ నుంచి ఎంత త్వరగా వెళ్లిపోతే అంత బాగుంటుందని భావించానని కాజోల్ చెప్పారు. అందుకు ఉదాహరణగా ఆమె రామోజీ ఫిల్మ్ సిటీని పేర్కొన్నారు, ‘‘అది ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా పరిగణించవచ్చు’’ అన్నారామె. అయితే, అదృష్టవశాత్తూ తనకు ఏ దయ్యమో భూతమో లాంటివి తనకు కనపడలేదంటూ తీవ్రమైన భయాలను ఆమె వ్యక్తం చేశారు. భారతదేశంలోనే ఒక ప్రముఖ సీనియర్ నటి, అదే విధంగా అజయ్ దేవగణ్ వంటి స్టార్ హీరో భార్య ఫిలిం సిటీ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన సంచలనం కలిగించాయి. ఇవి దేశవ్యాప్తంగా సినిమా రూపకర్తలను ఆందోళనకు గురి చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా ఉంటోందని గ్రహించిన ఫిలింసిటీ యాజమాన్యం చేసిన ప్రయత్నాలు ఫలించి కొన్ని రోజుల తర్వాత ఫిలింసిటీ చాలా గొప్ప ప్రదేశం అంటూ కాజోల్ కితాబిచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోయిందని సినీ ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... కేవలం కాజోల్ మాత్రమే కాకుండా గతంలోనూ టాలీవుడ్ కి చిరపరిచితమైన రాశి ఖన్నా తాను అక్కడ బస చేసినప్పుడు ఒంటరిగా ఉన్న సమయంలో తనను ఎవరో అనుసరిస్తున్నట్టుగా అడుగుల శబ్ధం వినిపించింది అంటూ వ్యాఖ్యానించారు. అలాగే మరో అగ్ర తార తాప్సీ పన్ను కూడా అక్కడేదో అసహజ వాతావరణ ఉంది అంటూ మాట్లాడారు. అదే విధంగా తమిళ దర్శకుడు సుందర్ సి వంటి సెలబ్రిటీలు సైతం తమకు అక్కడ షూటింగ్ సందర్భంగా ఎదురైన అనుభవాలను పంచుకోవడం... గమనార్హం. ఫిలింసిటీ...హారర్‌కి అడ్రెస్సా?రామోజీ ఫిల్మ్ సిటీని వందల ఎకరాల్లో నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాంతంలో ఒకప్పుడు నిజాం సైనికుల సమాధులు ఉండేవని కొందరు అలాగే ఆ స్థలం పూర్వపు యుద్ధభూమి అని మరికొందరు నమ్ముతున్నారు. దీనివల్ల అక్కడ చుట్టుపక్కల నివాసితులకు శాంతి లేదని, అక్కడ ఆత్మలు సంచరిస్తున్నాయని ఈ తరహా విషయాలను నమ్మేవారు చెబుతున్నారు. ఏదేమైనా ఇలాంటి మూఢనమ్మాకాలను వ్యాప్తి చెందించడం మంచిది కాదనేది నిజమే అయినప్పటికీ, ఎన్నో రకాల అనుభవాలను చవి చూసిన ధైర్యవంతులైన సినీ తారలు వ్యక్తం చేసే అభిప్రాయాలను కొట్టిపారేయలేం. మూఢనమ్మకాల సంగతెలా ఉన్నా, ఆయా తారలకు ఎదురవుతున్న అనుభవాల వెనుక ఉన్నవి అతీంద్రీయ శక్తులా? లేక అనుమానాస్పద వ్యక్తులా? అనే నిజాల నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఆ సీన్ తర్వాత గతం మర్చిపోయిన అమ్రిష్ పురి..
హీరోయిన్ కాజోల్కు మతిమరుపు ఉండేది. కుచ్కుచ్ హోతా హై సినిమా సెట్లో పదేపదే అన్నింటినీ మర్చిపోయేది. ఓసారి తనే ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే లెజెండరీ నటుడు అమ్రిష్ పురి (Amrish Puri) ఒకానొక సందర్భంలో తనెవరన్నది కూడా మర్చిపోయాడని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో కాజోల్ మాట్లాడుతూ.. అజయ్ దేవ్‌గణ్, అమ్రిష్ పురి ఓ సినిమాలో కలిసి నటించారు. అంతా మర్చిపోయిన అమ్రీష్పురిఅందులో అమ్రీష్.. జలపాతం కింద నిల్చునే సీన్ ఉంది. అందుకోసం ఆయన వాటర్‌ఫాల్ కింద నిలబడ్డారు. పైనుంచి ఎంతో వేగంగా వస్తున్న నీళ్లు ఆయన తలను కొట్టుకుంటూ కిందపడేవి. తలకు రక్షణగా ఏదీ పెట్టలేదు. సన్నివేశం అయిపోగానే ఆయన వాటర్‌ఫాల్ నుంచి వచ్చేశారు. కానీ అన్నీ మర్చిపోయాడు. అసలేదీ గుర్తులేదు. నేనెవర్ని? నేనిక్కడేం చేస్తున్నాను? అని ప్రశ్నించాడు. సెట్లో ఉన్నవాళ్లందరికీ భయంతో చెమటలు పట్టాయి. తనకు జ్ఞాపకశక్తి రావడానికి మూడు గంటలు పట్టింది. కరడుగట్టిన విలన్‌గా..ఇప్పుడు తల్చుకుంటే సరదాగా అనిపిస్తుందేమోకానీ ఆ సమయంలో మాత్రం అందరూ చాలా భయపడ్డారు అని చెప్పుకొచ్చింది. అమ్రీష్ పురి, అజయ్ దేవ్‌గణ్.. టార్జాన్: ద వండర్ కార్, ఫూల్ ఔర్ కాంటే, హల్చల్, గెయిర్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. హిందీలో వందలాది సినిమాలు చేసిన అమ్రిష్ పురి.. ఆదిత్య 369, బాబా, జగదేక వీరుడు అతిలోక సుందరి, మేజర్ చంద్రకాంత్, నిప్పురవ్వ వంటి పలు చిత్రాల్లో నటించారు. కరడుగట్టిన విలన్‌గా ప్రేక్షకులను తన ఆహార్యంతోనే భయపెట్టేవారు. 2005లో బ్లడ్ క్యాన్సర్‌తో కన్నుమూశారు.చదవండి: కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్.. రచ్చ లేపిన ఫ్యాన్స్ -
నా కూతురి జోలికొస్తే.. కాజోల్ మాస్ వార్నింగ్..!
-
నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్
నా జోలికొస్తే ఊరుకుంటానేమో కానీ నా కూతురి జోలికొస్తే మాత్రం అంతు చూస్తానంటోంది హీరోయిన్ కాజోల్ (Kajol). ప్రస్తుతం ఆమె మా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజోల్.. తన కూతురిని ట్రోల్ చేసేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా.. నా కూతుర్ని విమర్శించేవాళ్లెవరూ నా కారు ముందుకు రావొద్దు. నా కారు ముందుకొచ్చారంటే..ఒకవేళ వచ్చారే అనుకోండి.. నా కారుతో మిమ్మల్ని ఢీ కొట్టి మీ శరీరాలపై నుంచే నా కారును పోనిస్తాను. సోషల్ మీడియాలో వెయ్యి మెసేజ్‌లు వస్తే అందులో 999 తను అందంగా ఉంది, మీరు అమేజింగ్.. ఇటువంటి కామెంట్లే ఉంటాయి. కానీ ఏదో ఒక్కటి మాత్రం బ్యాడ్ కామెంట్ ఉంటుంది. అలా చెత్త వాగుడు వాగేవారు ఎందుకున్నారో అర్థం కాదు. అయినా నేను మంచి గురించే ఎక్కువగా పట్టించుకుంటాను. చెడు గురించి కాదు అని చెప్పుకొచ్చింది.హారర్ సినిమాహారర్ సినిమాలను మ్యూట్‌లో పెట్టుకునే చూసే కాజోల్.. తొలిసారి ఈ జానర్లో నటిస్తోంది. విశాల్ ఫ్యురియా దర్శకత్వం వహిస్తున్న మా చిత్రంలో రోనిత్ రాయ్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా, కెరిన్ శర్మ, నితిన్, సూర్జ్యశిఖ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాజోల్ చివరగా క్రూ సినిమాలో నటించింది. కాజోల్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్.. 1999లో పెళ్లి చేసుకున్నారు. 2003లో వీరికి కూతురు నైసా జన్మించింది. 2010లో కుమారుడు యుగ్ పుట్టాడు.చదవండి: ఎయిరిండియాకు నటుడి సపోర్ట్.. ఫ్రీ టికెట్ ఇచ్చారా? -
అత్యంత భయంకరమైన ప్రదేశం, రామోజీ ఫిల్మ్ సిటీ - కాజోల్
-
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కాజోల్.. హైదరాబాద్‌లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అదో భయంకరమైన ప్రదేశమని, జీవితంలో మళ్లీ అక్కడికి వెళ్లాలని అనుకోవట్లేదని చెప్పుకొచ్చింది. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: కారులో విజయ్-రష్మిక జంటగా.. ప్రేమని కన్ఫర్మ్ చేస్తున్నారా?)హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కాజోల్.. ప్రస్తుతం 'మా' అనే సినిమా చేసింది. జూన్ 20న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీ అత్యంత భయానక ప్రదేశం అని చెప్పుకొచ్చింది. 'ఎందుకో అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు నెగెటివ్ వైబ్స్ వచ్చాయి. కొన్ని ప్రదేశాలు చాలా భయపెడతాయి. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, మరోసారి అక్కడికి రాకూడదు అనిపిస్తుంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ అలాంటిదే. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటు అది' అని కాజోల్ చెప్పింది.మరి కాజోల్‌ని అంతలా భయపెట్టిన సంఘటన ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. కాజోల్ కెరీర్ విషయానికొస్తే.. 1992 నుంచి సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ క్లాసిక్స్‌లో ఒకటైన 'దిల్ వాలియా దుల్హానియా లే జాయేంగే' సినిమాలో హీరోయిన్ ఈమె. తర్వాత కూడా పలువురు స్టార్స్‌తో మూవీస్ చేసింది. కొన్నాళ్లకు హీరో అజయ్ దేవగణ్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ టైంలో సలాం వెంకీ, లస్ట్ స్టోరీస్ 2, దో పత్తి తదితర చిత్రాలతో కాజోల్ ఆకట్టుకుంది. ఇప్పుడు 'మా' అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.(ఇదీ చదవండి: 19 ఏళ్ల హీరోయిన్ అనంతిక.. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?)"I’ve felt negative vibes during shoots. Some places were so scary, I just wanted to leave and never come back.Like Ramoji Film City in Hyderabad itself, which is known as one of the most haunted places in the world."- Bollywood Actress #Kajol pic.twitter.com/0znOCXyQ4s— Movie Threat (@MovieThreat) June 18, 2025 -
కాజోల్ హారర్ మూవీ.. వెన్నులో వణుకు పుట్టించేలా ట్రైలర్!
బాలీవుడ్ భామ కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం మా(Maa Movie). ఈ సినిమాకు విశాల్ రేవంతి ఫూరియా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై అజయ్ దేవగన్, జ్యోతి శాంతా సుబ్బరాయన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఈ మూవీ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో దెయ్యం సీన్స్ ఆడియన్స్‌కు వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నయి. ట్రైలర్ ఆద్యంతం ఆడియన్స్‌లో అత్యంత ఉత్కంఠ పెంచేలా ఉంది. దెయ్యం బారిన పడిన తన కుమార్తెను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసిన యుద్ధమే ఈ కథ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో తనూజ దేవ్‌గణ్, రోనిత్‌రాయ్, సుభద్ర సేన్గుప్త, ఇంద్రనీల్, జితిన్ జ్యోతి గులాటీ పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది. -
సొంతంగా ఖరీదైన ప్రైవేట్ జెట్.. అజయ్ దేవగణ్ ఏమన్నారంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ రైడ్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఇవాళ విడుదలైంది. ఈ సినిమాను 2018లో వచ్చి రైడ్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ మూవీలో హీరోయిన్గా వాణి కపూర్ నటించింది.ఈ నేపథ్యంలో అజయ్ దేవగణ్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తనపై వస్తున్న రూమర్స్‌పై కూడా స్పందించారు. బాలీవుడ్లో మీరు తొలి ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేశారన్న దానిపై అజయ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి అదేం లేదని.. కానీ దానిని కొనాలని ప్లాన్ చేస్తున్నా.. ఒక ఒప్పందం కూడా చేసుకున్నా. కానీ చివరికీ అది జరగలేదంటూ అజయ్ క్లారిటీ ఇచ్చారు. అజయ్ దేవగణ్ సొంతం ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశారని బాలీవుడ్లో చాలా కాలంగా టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు.తాజాగా విడుదలైన రైడ్-2 రైమ్ థ్రిల్లర్‌లో అజయ్ దేవగణ్ ఐఆర్ఎస్ అధికారి పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్ అభిషేక్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. -
స్టార్ హీరో కూతురు.. యాక్టింగ్ నాట్ ఇంట్రెస్ట్
హీరోహీరోయిన్ల వారసులు దాదాపు ఇండస్ట్రీలోకే వస్తుంటారు. టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఇందులో పెద్ద మార్పేం ఉండదు. ఒకరో ఇద్దరు తప్పితే దాదాపు హీరోహీరోయిన్లు అయిపోతుంటారు. కానీ ఓ స్టార్ హీరో కూతురికి మాత్రం ఇండస్ట్రీ అంటే ఆసక్తి లేదట. స్వయంగా తల్లి ఈ విషయాన్ని బయటపెట్టింది.(ఇదీ చదవండి: దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్)బాలీవుడ్ స్టార్ జంట అజయ్ దేవగణ్-కాజోల్(Kajol)కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు నైషా(Nysa Devgn) పెద్దది. ఇదివరకే చాలామంది పిల్లలు నటీనటులు అవుతున్నారు కదా? మీ అమ్మాయికి కూడా ఆసక్తి ఉందా అని తాజాగా జరిగిన రైజింగ్ భారత్ సమ్మిట్ 2025లో కాజల్ కి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె.. లేదు అని సమాధానమిచ్చింది.తన కూతురు అస్సలు నటి అయ్యే అవకాశం లేదని హీరోయిన్ కాజోల్ క్లారిటీ ఇచ్చింది. తల్లిదండ్రుల్లానే అందంలో ఏ మాత్రం తీసిపోని విధంగా నైషా ఉంది. కానీ ఇండస్ట్రీలో రానని అనుకోవడం మాత్రం ఆశ్చర్యమే అని చెప్పాలి. అలాఅని రీసెంట్ టైంలో బాలీవుడ్(Bollywood)లోకి వచ్చిన నెపో కిడ్స్ చాలామంది సరైన యాక్టింగ్ చేయక ఘోరమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. బహుశా కాజల్ కూతురు ఇవన్నీ చూసి నటి కాకూడదని ఫిక్సయ్యిందేమో!(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?) -
పట్టు పరికిణిలో బిగ్‌బాస్ బ్యూటీ.. ఉప్పెన భామ కృతి శెట్టి గ్లామరస్ పిక్స్!
అవార్డ్స్ ఫంక్షన్లో మెరిసిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి..షిప్లో చిల్ అవుతోన్న ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మి..బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ అదిరిపోయే లుక్స్...జీన్స్ డ్రెస్‌లో శ్రద్ధాదాస్ పోజులు... మేకప్ ప్రాక్టీస్ చేస్తోన్న బాలీవుడ్ భామ కాజోల్.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన కాజల్.. చాన్నాళ్లకు మళ్లీ ఇలా (ఫొటోలు)
-
'26 ఏళ్లుగా ఈ ట్రెండ్‌ను అధిగమిస్తున్నాం'.. భార్యకు అజయ్ దేవగణ్ స్పెషల్ విషెస్
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో అజయ్ దేవగణ్, కాజోల్ ఒకరు. తాజాగా ఈ జంట తమ 26వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు అజయ్ దేవగణ్ మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో దిగిన పాత ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. '26 ఏళ్లుగా ఈ ట్రెండ్‌ను అధిగమిస్తున్నాం.. మనిద్దరికీ హ్యాపీ యానివర్సరీ' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు స్టార్ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. మొదట వీరిద్దరు 1995లో వచ్చిన హల్చల్ అనే మూవీ సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ చిత్రాల్లో జంటగా కనిపించారు. అదేక్రమంలోనే అజయ్, కాజోల్ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత 1999లో ఓ ప్రైవేట్ వేడుకలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరు ఇష్క్, ప్యార్ తో హోనా హి థా, యు మే ఔర్ హమ్, తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్ లాంచి చిత్రాలలో జంటగా నటించారు. వీరిద్దరి నైసా దేవగణ్, యుగ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే కాజోల్ చివరిసారిగా దో పట్టిలో కనిపించింది. మరోవైపు అజయ్ దేవగణ్ చివరిసారిగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన సింగం ఎగైన్‌లో కనిపించారు. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) -
‘నేనే ఇలా ఎందుకమ్మా..’ అని అమ్మని పట్టుకుని ఏడ్చేదాన్ని: హీరోయిన్
ట్రోల్ చేసి మనల్ని వెనక్కు లాగేవాళ్లు ఉన్నట్లే, మోటివేట్ చేసి ముందుకు నడిపించే వాళ్ళూ ఉంటారు. సోనమ్ కపూర్‌ను అలా ముందుకు నడిపించిన వ్యక్తి కాజోల్. అయితే కాజోల్ కు సోనమ్ ఆ సంగతి నేరుగా ఎప్పుడూ చెప్పలేదు. మనసులోనే ఉన్న కాజోల్ నుంచి ప్రేరణను పొందారు సోనమ్. సినిమాల్లో కాజోల్ పీక్ దశను కూడా దాటేసి ఉన్నప్పుడు సోనమ్ వయసు 16. పదహారు అంటే పుస్తకాల్లో రాసినట్లు స్వీట్ సిక్స్ టీనే కానీ, అందరి విషయంలోనూ స్వీట్ కాక΄ోవచ్చు. ఆ వయసులో సోనమ్ అందమైన, లేత ముఖం మీద వెంట్రుకలు కనిపించేవి. పెద్ద పెద్ద మొటిమలు ఉండేవి. బరువు కూడా పెరిగింది. తనకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉందనీ, ముఖంపై వెంట్రుకలు రావటం, బరువు పెరగటం, మొటిమలు.. ఇవన్నీ పీసీఓఎస్వల్లనేనని ఫ్యామిలీ డాక్టర్ తొలిసారి చెప్పినప్పుడు సోనమ్ కుంగి పోయింది. తల్లిని చుట్టేసుకుని బావురుమంది. అయితే సోనమ్‌కు అంతకన్నా పెద్ద కష్టం వచ్చి పడింది! అందరూ ఆమెను చూసి, ‘అనిల్ కపూర్ కూతురు కదా..’ అనేవాళ్లట.. ‘ఇలా ఉందేమిటి!!’ అనే అర్థంలో! (యువతుల డ్రీమ్ బాయ్ అని అనిల్ కపూర్‌కు పేరు). పాపం నాన్న పేరు పోతోందే నా కారణంగా..’ అని సోనమ్ బాధపడుతుండేది. ‘నేనే ఇలా ఎందుకు ఉన్నానమ్మా..’ అని తల్లిని పట్టుకుని కంటతడి పెట్టుకునేది.ఓరోజు తల్లి ఆమెకు కాజోల్ ఫొటో చూపించి, ‘తను స్టార్ హీరోయిన్ కదా. అయితే ఆ కనుబొమలు చూడు. రెండూ కలిసిపోయి ఉన్నాయి. కొందరికి ఇలానే ‘యూనిబ్రో’ ఉంటుంది. అయినా సరే ఆమె ఎప్పుడూ తన కనుబొమలు షేప్ చేయించుకోలేదు. అలాగే ఉంచేసుకున్నారు. అందమంటే అది బంగారం, ఆమెలోని ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పారు. తల్లి మాటలు సోనమ్‌లో బాగా నాటుకుపోయాయి. ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కాజోల్కు మనసులోనే థాంక్స్ చెప్పుకుంది. తనను ట్రోల్ చేసే వాళ్లను పట్టించుకోవటం మానేసింది. సోనమ్‌కు పదహారు దాటి 17 లోకి రాగానే దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అవకాశం వచ్చింది. ఆయన ‘బ్లాక్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు సోనమ్. తర్వాత 2007 లో నటిగా తన తొలి చిత్రం ‘సావరియా’ తో బాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి ఒక చిత్రంలో కూడా కనిపించారు. తన పీసీఓఎస్ఎప్పుడు మాయమై΄ోయిందో కూడా సోనమ్‌కి గుర్తులేదు. ట్రోల్స్ కూడా అంతే. వస్తాయి. పోతాయి. ‘అంత పెద్ద స్టార్ అయిండీ కాజోల్ తన యూనిబ్రోని ఒక సమస్యగా తీసుకోకపోవటం అన్నది నాలో అంతర్లీనంగా పని చేసి, స్ఫూర్తిని నింపింది..’ అని తాజాగా బర్ఖాదత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు సోనమ్ కపూర్. ఇదీ చదవండి: ఐపీఎల్ వేలం 2025 : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా? -
విమాన ప్రమాదంలో చనిపోయారని చెప్పారు..షాకయ్యాను : కాజోల్
సినీ తారలపై పుకార్లు రావడం సాధారణం. అయితే సినిమాల పరంగా వచ్చే గాసిప్స్ కొంతవరకు పర్వాలేదు. కానీ పర్సనల్ విషయాల్లోనూ లేనిపోని వార్తలు రావడంతో ఇబ్బందికరమే. అలాంటి ఇబ్బందులను చాలా ఎదుర్కొన్నాను అంటోంది అందాల తార కాజోల్. ఆమె నటించిన తాజా చిత్రం ‘దో పత్తి’. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రం ఈ నెల 25న నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన మంచి టాక్ సంపాదించుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆమె ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాజోల్ తన సీనీ కెరీర్ గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. తనపై చాలా గాసిప్స్ వచ్చాయని..ఒకనొక సమయంలో తాను చనిపోయినట్లు కూడా వార్తలు రాశారని, వాటిని చూసి షాకయ్యానని చెప్పారు.‘నాపై చాలా రూమర్స్ వచ్చాయి. పర్సనల్ విషయాల్లోనూ పుకార్లు రాశారు. ఓ సారి గుర్తుతెలియని వ్యక్తి మా అమ్మకు ఫోన్ చేసి ‘విమాన ప్రమాదంలో మీ కూతురు చనిపోయారు’అని చెప్పాడు. ఇంట్లోవాళ్లు చాలా కంగారు పడ్డారు. ఆ మధ్య కూడా నేను చనిపోయినట్లు యూట్యూబ్‌లో వీడియోలు పెట్టారు. అయితే ఇలాంటివి నేను పెద్దగా పట్టించుకోను. ఏదైనా ఇబ్బందికర వార్తలు రాస్తే..నా ఫ్రెండ్స్ నాకు పంపిస్తుంటారు. వాటిని చదివి ఇలా ఎలా రాస్తారు? అనుకుంటాను. అంతేకానీ పెద్దగా పట్టించుకోను’అని కాజోల్ అన్నారు. -
సినిమాలు మానేద్దామని అనుకున్నా.. అంతా షారూఖ్ వల్లే: కాజోల్
బాలీవుడ్ నటి కాజోల్ ప్రస్తుతం దో పట్టి మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజైంది. ఈ చిత్రంలో కాజోల్ తొలిసారిగా పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుంది. ఇందులో ఆదిపురుష్ భామ కృతి సనన్ కూడా నటిస్తోంది. తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న కాజోల్ అలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా షారూఖ్ ఖాన్‌తో తనతో చెప్పిన అనుభవాన్ని వివరించింది.సినీ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలోనే నటనను విడిచి పెట్టాలనుకున్నట్లు కాజోల్ తెలిపింది. నా మూడో సినిమాకే చాలా అలసిపోయినట్లు అనిపించింది.. దీంతో నటనకు గుడ్ బై చెప్పాలనుకున్నా అని వెల్లడించింది. కానీ షారూఖ్ ఖాన్ మాటల వల్లే ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగుతున్నానని పేర్కొంది.కాజోల్ మాట్లాడుతూ..' చాలా ఏళ్ల క్రితం ఉధార్ కి జిందగీ అనే సినిమా చేశా. అదే నా మూడో సినిమా. ఆ సమయంలో ఇండస్ట్రీ చాలా కొత్తగా అనిపించింది. అప్పుడు నా వయసు దాదాపు 18 ఏళ్లు ఉంటుంది. నేను ఆ సినిమాను పూర్తి చేశా. ఇప్పటికీ నాకు గుర్తుంది. నీకు నటన తెలుసు.. కానీ మీరు ఇంకా నేర్చుకోవాలి' అని సలహా ఇచ్చారని తెలిపింది.కాగా.. కాజోల్ 1992లో బేఖుడి మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బాజీగర్ , కరణ్ అర్జున్ , దిల్వాలే దుల్హనియా లే జాయేంగే , గుప్త్ , ఇష్క్ , కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్ వంటి హిందీ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం దోపట్టి మూవీతో కనిపించనుంది. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
కృతి సనన్, కాజోల్ 'దో పత్తి' ట్రైలర్ చూశారా..?
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘దో పత్తి’. కృతి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కృతి సనన్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటింది. అయితే, ఇప్పటి వరకు నటిగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న ఆమె తొలిసారి ఈ చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించింది.అక్టోబర్ 25 నుంచి ‘దో పత్తి’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. మిస్టరీ థ్రిల్లర్ కథతో రానున్న ఈ చిత్రంలో కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 2015లో దిల్వాలే సినిమాలో కృతి సనన్, కాజోల్ ఇద్దరూ కలిసి తొలిసారి నటించారు. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ 'దో పత్తి' సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు. -
ఓటీటీలో కృతి సనన్, కాజోల్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘దో పత్తి’.. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. కృతి సనన్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటింది. అయితే, ఇప్పటి వరకు నటిగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న ఆమె తొలిసారి ఈ చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.'దో పత్తి' సినిమా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. మిస్టరీ థ్రిల్లర్ కథతో రానున్న ఈ చిత్రంలో కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 2015లో దిల్వాలే సినిమాలో కృతి సనన్, కాజోల్ ఇద్దరూ కలిసి తొలిసారి నటించారు. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ 'దో పత్తి' సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు. -
స్ట్రిక్ట్ మామ్ కాజోల్: సరిగా చేస్తే హెలికాప్టర్ పేరెంటింగ్ విధానం బెస్ట్!
పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల వైఖరే వారి ఎదుగదలకు కీలకం. అందుకనే ఈ విషయంలో చాలామంది తల్లిదండ్రులు చాలా కేర్ తీసుకుంటారు. పిల్లలను మరీ గారాభం చేస్తున్నామా, మరీ కఠినంగా వ్యవహరిస్తున్నామా అని సందేహిస్తుంటారు. ఒక్కోసారి మనం వారి సంరక్షణార్థం స్ట్రిక్ట్‌గా ఉన్నా అపార్థం చేసుకునే పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులకు సెలబ్రిటీలు, ప్రముఖుల పేరెంటింగ్ విధానం కాస్త హెల్ప్ అవుతోంది. ఈ నేపథ్యంలో 90ల నాటి కుర్రాళ్ల క్రష్, బాలీవుడ్ దిగ్గజ నటి కాజోల్ విశ్వసించే పేరెంటింగ్ విధానం గురించి తెలుసుకుందామా..!బాలీవుడ్ నటి కాజోల్ అంటో ఇష్టపడని వారుండరు. తన అందమైన కళ్లతో కుర్రకారుని కట్టిపడేసింది. ఐదుపదుల వయసు దాటినా ఇప్పటికీ ఆమె క్రేజ్ తగ్గలేదనే చెప్పొచ్చు. ఇక నటుడు అజయ దేవగన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత అడపదడపా సినిమాలు చేస్తు తల్లిగా ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఇక పలు ఇంటర్వ్యూల్లో కాజోల్ స్ట్రిక్ట్ మామ్ అని ఆమె పిల్లలు నైసా, దేవగన్‌లు చెప్పడం చూశాం కూడా. అలాగే కాజోల్ కూడా పిల్లల పెంపకంలో తాను చాలా కఠినంగా వ్యవహరిస్తానని ఒప్పుకుంది కూడా. అంతేగాదు తాను పిల్లల పెంపకంలో 'హెలికాప్టర్ పేరెంటింగ్ విధానమే' సరైనది విశ్వసిస్తానని చెబుతోంది. నిజానికి కాజోల్ 'హెలికాప్టర్ ఈలా' అనే బాలీవుడ్ మూవీలో తల్లిపాత్రను పోషించింది కూడా. అయితే అందులో ఉన్నట్లు పిల్లల జీవితంలో అతి ప్రమేయం ఉన్న తల్లిగా మాత్రం వ్యవహరించకున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం స్ట్రిక్ట్‌గా పట్టించుకుంటానంటోంది కాజోల్. నిజానికి ఈ పేరెంటింగ్ విధానాన్ని నెగిటివ సెన్స్‌లో వాడతారు. ఎందుకంటే ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ విధానంలో పిల్లల ప్రతి కదలికను వారి నియంత్రణలోకి ఉంచుకునే తల్లిదండ్రులకు నిపుణలు ఈ పేరుపెట్టడం జరిగింది. ఇక్కడ పిల్లలను మరీ అంతలా కట్టడి చేయకపోయినా, ఇప్పుడున్న ఆధునిక సంస్కృతిలో కాస్త నియంత్రణ అవసరమే అంటోంది కాజోల్. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో పిల్లలు ఈజీగా దేన్నైనా నేర్చుకోగలరు, పాడైపోగలరు కాబట్టి ఆ పేరెంటింగ్ స్టైలే మంచిదని చెబుతోంది కాజోల్. ప్రతిదాంట్లో జోక్యం తగదు..వాళ్ల సొంత గుర్తింపు కోసం పాటుపడేలే మనం కాస్త కఠినంగా వ్యవహరించాలి. అలాగే కొన్ని విషయాల్లో ఓ కంట కనిపెడుతూ..ప్రశ్నించాల్సిందే. ఏమరపాటున ఉంటే దారితప్పే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తోంది. ఇక్కడ హెలికాప్టర్ విధానం మాదిరిగా వాళ్లకంటూ స్పేస్ లేకుండా పిల్లలకు సంబంధించిన ప్రతిదాంట్లో వేలు పెట్టకూడదు తల్లిదండ్రులు. వారితో టచ్‌లో ఉంటూ వాళ్ల ప్రతి విషయం తాము కనిపెడుతున్నామనే భయం వారిలో కలిగించాలని చెబుతోంది కాజోల్.భయంతో కూడిన గౌరవం..అంతేగాదు తప్పు చేయాలనే ఆలోచన, లేదా తప్పు చేసినా.. తల్లిదండ్రులకు చెప్పేయడమే మంచిది లేదంటే అమ్మ మాట్లాడదు అనే భయంతో కూడిన గౌరవం కలగచేసేలా పెంచాలని చెబుతోంది. ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ విధానం సరిగా ఉపయోగిస్తే పిల్లల పెంపకంలో మంచి హెల్ప్ అవుతుందని నమ్మకంగా చెబుతోంది. ఈ విధానం వల్ల చెడు అలవాట్లు, ఆర్థిక పరిస్థితి పట్ల కరెక్ట్‌గా వ్యవహరించడం వంటివి చేయగలుగుతారు." తాను ఇలా ఉండటం వల్లే తన కూతరు పబ్లిక్ ప్రదేశాల్లో ఎలా వ్యవహరించాలో నేర్చుకుంది. పాప్ సంస్కృతిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంది. మీ తల్లిదండ్రుల వల్లే ఇలా లగ్జరియస్‌గా బతుకుతున్నారనే విషయం పదే పదే చెబుతాను. డబ్బు విలువ తెలిపేందుకు ఎంత చిరాకు తెచ్చుకున్నా సరే.. వాళ్ల పాకెట్ మనీలో కొంత భాగం అడుగుతుంటానని చెబుతోంది." కాజోల్. ప్రతి తల్లిదండ్రలు ఇలా వ్యవహరిస్తే.. పిల్లల బంగారు భవిష్యత్తును ఎలాంటి మచ్చ లేకుండా శోభాయమానంగా ఉంటుందని నమ్మకంగా చెబుతోంది. (చదవండి: ఒకప్పుడు ట్రాన్స్ జెండర్‌గా బిక్షాటన ..నేడు ఒక అమ్మాయిని దత్తత తీసుకుని..!) -
కుమారుడి బర్త్ డే.. బాలీవుడ్ స్టార్ కపుల్ స్పెషల్ విషెస్
బాలీవుడ్ మోస్ట్ ఫేమ్ జంటల్లో అజయ్ దేవగణ్, కాజోల్ ఒకరు. వీరిద్దరికీ ఓ కూతురు నైసా, కుమారుడు యుగ్ సంతానం ఉన్నారు. ఇవాళ కుమారుడు యుగ్ తన 14వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అజయ్, కాజోల్ కుమారుడికి జన్మిదిన శుభాకాంక్షలు తెలిపారు. కొడుకుతో దిగన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. దీనికి సంబంధింటిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతుంటారు ఈ జంట. తమ పిల్లలతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తుంటారు. ఇక సినిమాల విషయానికొస్తే అజయ్ దేవగణ్ ఈ ఏడాది ప్రారంభంలో మైదాన్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సింగం ఏగైన్, దే దే ప్యార్ దే-2 చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు కాజోల్ ప్రభుదేవా సరసన మహారాగ్ని అనే చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. కాగా..కాజోల్, అజయ్ 1994లోనే డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత వీరిద్దరు 1999లో వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
అజయ్ దేవగన్ నివాసంలో అనంత్ అంబానీ - వీడియో
అనంత్ అంబానీ వచ్చే నెలలో రాధికా మర్చంట్‌ను వివాహం చేసుకోనున్నారు. వివాహ సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తమ పెళ్ళికి ఆహ్వానించడానికి అనంత్ అంబానీ స్వయంగా అజయ్ దేవగన్, కాజోల్ నివాసానికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అనంత్ అంబానీ.. అజయ్ దేవగన్ ఇంటి నుంచి బయటకు వచ్చి తన రోల్స్ రాయిస్ కారులోకి వెళ్లడం చూడవచ్చు. ఆ తరువాత తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.ఇదిలా ఉండగా అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల పెళ్లి కార్డును దేవుని చెంత ఉంచడానికి, దేవుని ఆశీర్వాదం పొందటానికి అక్కడకు వెళ్లినట్లు నీతా అంబానీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జూలై 12న పెళ్లి2024 జులై 12న వీరి పెళ్లి జరుగుతుందని ఇప్పటికే వారిరువురి కుటుంబాలు పేర్కొన్నాయి. అనంత్ & రాధికల పెళ్లి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజులు జరగనుంది. జులై 12న వివాహం, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ ఉత్సవ్ లేదా రిసెప్షన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్ళికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.ముకేశ్ & నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీతో సహా పలు రిలయన్స్ గ్రూప్ కంపెనీల బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by Voompla (@voompla) -
Maharagni Teaser: యాక్షన్‌తో అదరగొట్టిన కాజోల్
జాతర సందడిగా జరుగుతోంది. అమ్మవారి తల్లి సాక్షిగా కొందర్ని రఫ్ఫాడించింది ఆ మహిళ. అమ్మవారిలా ఆమె ఉగ్రరూపం దాల్చిన తీరుకి ఎదుట ఉన్నది ఎవరైనా వణికి΄ోవాల్సిందే. ఆ మహిళ పాత్రలో కాజోల్ చేసిన ఫైట్‌తో విడుదలైంది ‘మహారాగ్ని’ చిత్రం టీజర్. ఇంకా ఈ టీజర్లో ప్రభుదేవా ఫైట్ చేస్తూ, ఏదో పగతో ఉన్నట్లు సంయుక్తా మీనన్, సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఓ రోల్లో కనిపించారు. కాజోల్, ప్రభుదేవా లీడ్ రోల్స్‌లో నసీరుద్దీన్ షా, సంయుక్తా మీనన్, జిషు సేన్ గు΄్తా, ఆదిత్యా సీల్ ఇతర పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి ‘మహారాగ్ని’ టైటిల్ ఖరారు చేశారు. ‘క్వీన్ ఆఫ్ క్వీన్స్’ (రాణులకే రాణి) అనేది ట్యాగ్‌లైన్. ఈ టైటిల్, ట్యాగ్‌లైన్ కాజోల్ పాత్రను ఉద్దేశించి పెట్టి ఉంటారని ఊహించవచ్చు. నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో వెంకట అనీష్ దొరిగిల్లు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ టీజర్‌ని మంగళవారం విడుదల చేశారు. ‘‘భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మహారాగ్ని’. షారుక్ ఖాన్ ‘జవాన్’ చిత్రానికి పని చేసిన జీకే విష్ణు మా సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి వెన్నెముక. ఆయన మంచి సంగీతం, అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు’’ అని యూనిట్ పేర్కొంది. -
కాంబినేషన్ కుదిరింది
‘మిన్సార కనవు’ (‘మెరుపు కలలు’ – 1997) చిత్రం తర్వాత కాజోల్, ప్రభుదేవా మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇరవయ్యేడేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాతో నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి బాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నసీరుద్దీన్ షా, సంయుక్తా మీనన్, జిషు సేన్ గుప్తాఆదిత్య సీల్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చిత్రీకరణ మొదలైంది.‘‘మా సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. త్వరలోనే టీజర్‌తో పాటు మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. చరణ్ తేజ్‌కి మాత్రమే కాదు.. సంయుక్తాకు కూడా హిందీలో ఇది తొలి చిత్రం కావడం విశేషం. -
టాలీవుడ్ డైరెక్టర్ భారీ యాక్షన్ థ్రిల్లర్.. 27 ఏళ్ల తర్వాత స్క్రీన్‌పై స్టార్ జోడీ..!
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా జంటగా నటించిన చిత్రం 'మిన్సార కనవు'. 1997లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ సినిమా రిలీజై ఇప్పటికీ దాదాపు 27 ఏళ్లు పూర్తవుతోంది.తాజాగా ఈ జోడీ మళ్లీ తెరపై జంటగా సందడి చేయనుంది. టాలీవుడ్ చిత్రనిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ 27 ఏళ్ల కాజోల్, ప్రభుదేవా నటించడం సినీ ప్రియుల్లో ఆసక్తి పెంచుతోంది. వీరితో పాటు ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.మరోవైపు టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసి.. త్వరలోనే టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
టాలీవుడ్లో నిర్మాత.. బాలీవుడ్‌లోకి డైరెక్టర్‌గా ఎంట్రీ
తెలుగులో సినిమాలు నిర్మించిన చరణ్ తేజ్ ఉప్పలపాటి ఇప్పుడు హిందీలో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఓ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌ని తీస్తున్నారు. కాజోల్, ప్రభుదేవా లీడ్ రోల్స్ చేస్తున్నారు. నసీరుద్దీన్ షా, సంయుక్త మేనన్, జిషు సేన్ గుప్తా తదితరలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. చరణ్ తేజ్ తెలుగులో 'స్పై', 'మళ్లీ మొదలైంది' సినిమాలని నిర్మించారు. ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు.(ఇదీ చదవండి: స్క్రీన్‌పై సమంతతో రొమాంటిక్ సీన్స్.. చైతూ రియాక్షన్ ఏంటంటే?)ప్రభుదేవా, కాజోల్.. 27 సంవత్సరాల క్రితం 'మెరుపు కలలు' సినిమా చేశారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అప్డేట్ వదిలారు. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ పూర్తయిందని, త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. 'జవాన్' సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు, 'యానిమల్' ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తదితరలు వర్క్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' పునర్నవి ప్రేమలో పడిందా? మరి ఆ కుర్రాడెవరు?) -
స్టార్ హీరోయిన్‌పై నెటిజన్స్ ఆగ్రహం.. ఎందుకంటే?
బాలీవుడ్ భామ కాజోల్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. అజయ్ దేవగణ్‌ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఓ కూతురు కూడా ఉన్నారు. ప్రస్తుతం దో పట్టి అనే చిత్రంలో కనిపించనుంది. అయితే తాజాగా ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన కాజోల్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. దీంతో ఆమె వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలసుకుందాం.ఇటీవల ముంబయి జుహూలోని ఓ రెస్టారెంట్‌కు కాజోల్ తన ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లింది. అదే సమయంలో ఆమెకు వీరాభిమాని అయిన హోటల్ వెయిటర్ కాజోల్‌ను చూశాడు. ఆమె వద్ద నుంచి బిల్ తీసుకునే సమయంలో భావోద్వాగానికి గురయ్యాడు. తన అభిమాన నటిని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.అయితే అతని తీరుపై కాజోల్ మండిపడింది. నాటకాలు ఆపి.. ముందు బిల్ తీస్కో అంటూ ర్యాష్‌గా మాట్లాడింది. అంతే కాకుండా ఇలాంటి వారిని వెయిటర్‌గా నియమించడంపై ఏకంగా మేనేజర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కాజోల్ వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ అభిమాని అయినందుకు కనీసం అతనికి కృతజ్ఞతలు కూడా చెప్పలేకపోయారంటూ మండిపడుతున్నారు. కాజోల్ తీరుపై వెయిటర్ సోదరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
Rani Mukerji-Kajol: అక్కా-చెల్లెలు ఇద్దరు స్టార్ హీరోయిన్లే..కొన్నేళ్లుగా మాటల్లేవు, కారణం ఇదేనట!
రాణీ ముఖర్జీ, కాజోల్ బాలీవుడ్ ఇద్దరి మధ్య బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. వరుసకు వీరిద్దరు అక్కా-చెల్లెలు అవుతారు. ఇప్పుడంటే కాజోల్, రాణీముఖర్జీ చాలా క్లోజ్‌గా ఉంటున్నారు కానీ.. కొన్నాళ్ల క్రితం వీరిద్దరి మధ్య మాటల్లేవు. కలిసి ఒకే సినిమాలో(కరణ్ జోహార్ మొదటి చిత్రం 'కుచ్ కుచ్ హోతా హై') నటించినా మాట్లాడుకోలేదట. దానికి గల కారణాన్ని తాజాగా రాణీ ముఖర్జీ వెల్లడించింది. అపార్దం చేసుకోవడం వల్లే తాము కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్నామని చెప్పింది. ‘ప్రతి ఫ్యామిలీలోనూ గొడవలు సహజం. విభేదాలకు ఏదో ఒక కారణం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎలాంటి కారణం లేకుండానే విడిపోతారు. అలాంటిదే మా(కాజోల్, రాణీ ముఖర్జీ) ఫ్యామిలీలో జరిగింది. మా ఇరు కుటుంబాలు విడిపోవడానికి కారణమే లేదు. అపార్దం చేసుకోవడం వల్లే మేము కొన్నాళ్ల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మా రెండు కుటుంబాలు కలిశాయి. ఏదో ఒక సందర్భంలో అందరం కలుస్తూనే ఉంటాం’ అని రాణీ ముఖర్జీ చెప్పుకొచ్చింది. కాజోల్ కంటే ఆమె చెల్లి తనిషా ముఖర్జీ తనకు బాగా క్లోజ్ అని రాణీ ముఖర్జీ గతంలో చెప్పింది. ’చిన్నప్పుడు అందరం కలిసే ఆడుకునేవాళ్లం. తనిషా, నేను ఒక జట్టు అయితే.. మా సోదరుడు, కాజోల్ మరో గ్యాంగ్. మా సీక్రెట్స్ ఏవి వారితో షేర్ చేసుకునే వాళ్లం కాదు. కాజోల్ మాత్రం ఎక్కువగా మా సోదరులతోనే ఉండేది. చిన్నప్పుడు ఆమెతో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు’ అని రాణీ ముఖర్జీ చెప్పుకొచ్చింది. -
సముద్ర తీరంలో రకుల్.. బ్లూ డ్రెస్‌లో ఉప్పెన భామ!
►సముద్ర తీరంలో రకుల్ పోజులు ►బ్లూ డ్రెస్‌లో ఉప్పెన భామ కృతి శెట్టి ►న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో కేజీఎఫ్ హీరో యశ్ ►ఫ్యామిలీతో హీరోయిన్ కాజోల్ న్యూ ఇయర్ ట్రీట్ ►భర్తతో కలిసి కత్రినా కైఫ్ చిల్ ►జైపూర్‌లో మాళవిక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ►న్యూ ఇయర్ వైబ్స్‌తో బుట్టబొమ్మ లుక్స్ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Yash (@thenameisyash) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
ఆనంద్ పండిట్ 60వ పుట్టినరోజు వేడుకలో బాలీవుడ్ తారల సందడి (ఫొటోలు)
-
చలో కోల్కత్తా
ప్రేక్షకులను భయపెడతా అంటున్నారు బాలీవుడ్ నటి కాజోల్. ఆమె ప్రధాన పాత్రధారిగా విశాల్ ఫురియా ఓ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని బాలీవుడ్ సమాచారం. పూర్తి స్థాయి హారర్ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కావొచ్చాయని, జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేలా విశాల్ ప్లాన్ చేశారని టాక్. తొలి షెడ్యూల్ కోల్‌కతాలో మొదలవుతుందట. నెల రోజులకు పైగా అక్కడి లొకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణను ప్లాన చేశారట యూనిట్. ఇక ఈ సినిమాను కాజోల్ భర్త, దర్శక–నటుడు, నిర్మాత అజయ్ దేవగన్ నిర్మించనున్నారని బాలీవుడ్ భోగట్టా. -
బాలీవుడ్లో హిట్ హీరోయిన్ కాజోల్ దేవగన్ నయా లుక్స్ (ఫోటోలు)
-
స్టార్స్‌ను భయపెడుతోన్న డీప్ ఫేక్.. తాజాగా మరో స్టార్ హీరోయిన్!
ఇటీవలే నేషనల్ క్రష్ రష్మిక డీప్ ఫేక్ వీడియో సంచలనంగా మారింది. ఆ తర్వాత కత్రినా కైఫ్ సైతం డీప్ ఫేక్ బారిన పడింది. టైగర్-3 చిత్రంలోని ఓ సీన్‌ను ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ నటి కాజోల్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తన దుస్తులు మార్చుకుంటున్నట్లుగా వీడియోను రూపొందించారు. ఇది కూడా డీప్‌ఫేక్ సాయంతోనే ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలో ఉన్నది కాజోల్ కాదని..ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్దని ప్రముఖ ఫ్యాక్ట్ చెక్ సంస్థ బూమ్ వెల్లడించింది. ఈ వీడియో ఈ ఏడాది జూన్ 5న పోస్ట్ చేశారని తెలిపింది. అయితే మనదేశంలో టిక్ టాక్‌పై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే రష్మిక మందన్నా వీడియో వైరల్ కావడంతో.. ఈ డీప్‌ఫేక్ వీడియో తాజాగా బయటకొచ్చింది. దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియో గతంలో టిక్‌టాక్‌లో అప్లోడ్ చేశారని బూమ్ తన నివేదికలో వెల్లడించింది. అయితే ఈ వీడియోనూ ఎవరు సృష్టించారో మాత్రం తెలియరాలేదు. అయితే గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లపై ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. -
సరదా.. దసరా..
బాలీవుడ్లో దసరా సందడి జోరు బాగా కనిపిస్తోంది. ప్రతి ఏడాదీ కొందరు స్టార్స్ ప్రముఖ ఏరియాల్లో అమ్మవారిని ప్రతిష్ఠించే చోటుకి వెళ్లి, పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా కాజోల్, రాణీ ముఖర్జీ తప్పకుండా వెళుతుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఇద్దరూ అమ్మవారిని దర్శించుకున్నారు. కాజోల్ తన తనయుడు యుగ్‌తో కలిసి వెళ్లారు. ఇంకా హేమా మాలిని, ఆమె కుమార్తె ఈషా డియోల్ తన తల్లి దులారీ ఖేర్‌తో కలిసి అనుపమ్ ఖేర్ తదితరులు దుర్గా మాత ఆశీస్సులు అందుకున్నారు. -
Nysa Devgan Latest Photos: కాజోల్ కూతుర్ని చూశారా? హీరోయిన్ కన్నా తక్కువేం కాదు (ఫోటోలు)
-
కాజోల్‌తో మొదటి సినిమా.. కానీ ఆ హీరో జీవితంలో అంతులేని విషాదం!
కమల్ సదానా ఈ పేరు చాలామందికి తెలియదు. కమల్ తన నటన జీవితాన్ని స్టార్ హీరోయిన్ కాజోల్‌తో కలిసి ప్రారంభించాడు. బెఖుడి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం ద్వారానే కాజోల్ కూడా అరంగేట్రం చేసింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో కమల్‌కు బాలీవుడ్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. కానీ అనుకోకుండా జరిగిన విషాదం అతన్ని మానసికంగా దెబ్బతీసింది. ఊహించని పరిణామాలతో ఒక్కసారిగా తన కెరీర్ ముగిసినంత పనైంది. ఇంతకీ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఏమిటా విషాదం తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. (ఇది చదవండి: తల్లికి రెండో పెళ్లి చేసిన నటుడు.. నెటిజన్ల ప్రశంసలు!) బర్త్ డే రోజే విషాదం తఖ్దీర్, ఏక్ సే బద్కర్ ఏక్, యాకీన్ వంటి చిత్రాలు నిర్మించిన దర్శకుడు బ్రిజ్ సదానాకు కమల్ జన్మించారు. బ్రిజ్ 1960- 70లో బాలీవుడ్లో విజయవంతమైన డైరెక్టర్‌గా పేరు సంపాదించారు. 1980ల మధ్య నాటికి ఆయన సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. ఆ తర్వాత 1990లో కమల్ 20వ పుట్టినరోజున బ్రిజ్, అతని భార్య సయీదా ఖాన్ మధ్య గొడవ జరిగింది. బర్త్ డే వేడుకకు ఏర్పాట్లు చేసుండగానే కమల్ సదానాకు తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. దీంత వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి చూడగా.. తన తండ్రి ఆవేశంతో తల్లి, సోదరినీ చంపి.. తాను కూడా పిస్టల్‌తో కాల్చుకున్నాడు. ఆ సమయంలో కమల్ బర్త్‌డే పార్టికీ వచ్చిన స్నేహితులు వారందరినీ ఆసుపత్రికి తరలించారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఆ తీవ్ర విషాదంతో కమల్ సదానా ఒంటరివాడిగా మిగిలిపోయాడు. అయితే ఆ సమయంలో బ్రిజ్ మద్యం తాగినట్లు శవపరీక్షలో వెల్లడైంది. కమల్ సదానా సినిమా కెరీర్ కమల్ 2000లో విడుదలైన కాళీ టోపీ లాల్ రుమాల్ తర్వాత సినిమాలకు విరామం తీసుకున్నాడు. ఐదేళ్ల విరామం తర్వాత 2005లో తన దర్శకత్వం వహించిన కర్కాష్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతే కాకుండా టీవీ షో కసమ్‌లో సహాయక పాత్రను కూడా పోషించాడు. 2007లో తన తండ్రి నిర్మించిన చిత్రానికి రీమేక్‌గా విక్టోరియా నంబర్ 203ని తెరకెక్కించాడు. కానీ ఆ సినిమా బాగా ఆడలేదు. నోరా ఫతేహి బాలీవుడ్ అరంగేట్రం చేసిన రోర్ చిత్రానికి కూడా కమల్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత దాదాపు 15 ఏళ్ల తర్వాత 2022లో విడుదలైన సలామ్ వెంకీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం ద్వారా 30 ఏళ్లకు మళ్లీ కాజోల్త కలిసి తెరపై కనిపించారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపించారు. ఏది ఏమైనా స్టార్ హీరోయిన్గా ఎదిగిన కాజోల్‌తో మొదటి సినిమా చేసిన కమల్.. ఆ తర్వాత కెరీర్లో ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చూస్తే అభినందించాల్సిందే. (ఇది చదవండి: నా రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్) -
కాజోల్ కొత్త 'మిస్టరీ' మొదలైంది
బాలీవుడ్ హీరోయిన్స్ కాజోల్, కృతీసనన్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘దో పత్తీ’. మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి శశాంకా చతుర్వేది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. కృతీసనన్ , కాజోల్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు శశాంక. ఈ సినిమాను రచయిత కనికా థిల్లాన్ , కృతీసనన్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు 2015లో షారుక్ ఖాన్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘దిల్వాలే’ చిత్రంలో కాజోల్, కృతీసనన్ కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు ‘దో పత్తీ’ కోసం ఈ ఇద్దరూ సెట్స్‌లో జాయిన్ అవుతున్నారు. -
రెడ్ డ్రెస్‌లో అదితి పోజులు.. వీకెండ్ మూడ్‌లో బుట్టబొమ్మ!
►యషిక ఆనంద్ హాట్ లుక్స్! ►రెడ్ డ్రెస్‌లో ఆదితిశంకర్ పోజులు! ►జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న ప్రగతి! ►కాఫీ తాగుతూ చిల్ అవుతోన్న కాజోల్! ►వీకెండ్ మూడ్‌లో బుట్టబొమ్మ! View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
కాజోల్కు ఏమైంది?.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్!
బాలీవుడ్ భామ కాజోల్ ఇటీవలే ది ట్రయల్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్‌లో లాయర్ పాత్రలో మెప్పించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంటోంది. ది గుడ్ వైఫ్ అనే అమెకరిన్ సిరీస్‌కు రీమేక్‌గా తెరకెక్కించారు అయితే బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్‌ను పెళ్లాడిన భామ.. ఇటీవలే 49వ పుట్టిన రోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. అయితే తాజాగా కాజోల్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: అలాంటి వారే వ్యక్తుల గురించి మాట్లాడతారు.. సోనమ్ పోస్ట్ వైరల్! ) ఆమె మోచేతికి కర్ర (ఎల్బో క్రచ్) సాయంతో నడుస్తూ వీడియో కనిపించింది. కాజోల్ తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. కెమెరాల కంటికి చిక్కింది. దీంతో ఆమె ఫ్యాన్స్ కాజోల్కు ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. వీడియోలో గమనిస్తే కాజోల్ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అంతే కాకుండా గాయంతోనే షూటింగ్‌కు వెళుతున్నట్లు సమాచారం. కాగా.. కాజోల్ మిస్టరీ థ్రిల్లర్ దో పట్టిలో కృతి సనన్‌తో కలిసి నటించనుంది. ఈ ప్రాజెక్ట్ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. (ఇది చదవండి: ఆ హీరోయిన్‌కి క్షమాపణలు చెప్పిన రానా) View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) -
మృతదేహం వెలికితీసి పోస్టుమార్టంతో.. అసలు నిజాలు..!
వరంగల్: హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధి లోని బొక్కలగడ్డ ఈద్గాలో బుధవారం ఉదయం గత నెల 12న పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. సీఐ కరుణాకర్ కథనం ప్రకారం హనుమకొండ గుడిబండల్ ప్రాంతానికి చెందిన షహనజ్కు ఇద్దరు కుమార్తెలు, ఇద్ద రు కుమారులు. పెద్ద కుమార్తె కాజోల్ (20)వీణాబజార్లో ఓ బట్టల షాపులో పనిచేస్తోంది. కాజోల్ అంబాల గ్రామానికి చెందిన అబ్బాస్‌తో ఆరు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో పెండ్లి విషయంలో కాజల్, అబ్బాస్‌కు గొడవలు జరిగాయి. ఇదిలా ఉండగా అనారోగ్య కారణాల రీత్యా గత నెల 12న కాజోల్‌ను ఎంజీఎంలో అడ్మిట్ చేయగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అదే రోజు రాత్రి అబ్బాస్ బొక్కలగడ్డ ఈద్గాలో కాజోల్ మృతదేహం పూడ్చిపెట్టాడు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి షహనజ్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి హనుమకొండ తహసీల్దార్ సమక్షంలో కేఎంసీ ఫోరెన్సిక్ వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించినట్లు సీఐ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని సీఐ పేర్కొన్నారు. -
కాజోల్ సరదా వ్యాఖ్యలు.. షారుక్ ఫ్యాన్స్ ఫైర్
బాలీవుడ్లో కాజోల్, షారుక్ ఖాన్‌లది హిట్ పెయిర్. ‘దిల్వాలే దుల్హనియా లేజాయెంగే, బాజీఘర్, దిల్‌వాలేతో పాటు మరో నాలుగు చిత్రాల్లోనూ విరిద్దరు జంటగా నటించారు. అవన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇక పలు చిత్రాల్లో కలిసి నటించడం కారణంగా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పటికీ షారుక్- కాజోల్ స్నేహితులుగానే ఉన్నారు. ఆ చనువు కారణంగానే కాజోల్ సరదాగా చేసిన వ్యాఖ్యులు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. ఆమెపై షారుక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..ఇటీవల కాలోజ్ నటించిన ‘ది ట్రయల్’ మూవీ ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చిత్రబృందంతో కలిసి మీడియా ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా షారుక్ ఖాన్ గురించి అడగ్గా..‘షారుక్, నేను మంచి స్నేహితులం. అతనితో కలిసి నటించే అవకాశం వస్తే ఇప్పటికీ వదులుకోను. మళ్లీ ఆయనతో ఒక రొమాటిక్ సాంగ్ చేయాలని ఉంది’ అని కాజోల్ అన్నారు. ఒకవేళ షారుక్ ఎదురుపడితే ఆయన్ని అడిగే ఒకే ఒక విషయం ఏంటని ప్రశ్నించగా.. ‘పఠాన్’ సినిమా నిజమైన కలెక్షన్స్ ఎంతో చెప్పమంటాను’అని నవ్వుతూ బదులిచ్చింది. ఆమె సరదాగా అన్న వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదం అయ్యాయి. మా హీరో సినిమాకు వచ్చిన రూ.1000 కోట్ల కలెక్షన్స్ నిజమైనవి కావా? అబద్దం చెప్పాల్సిన అవసరం మా హీరోకి ఏముంది? అని షారుక్ ఫ్యాన్స్ కాజోల్‌ని ట్రోల్ చేస్తుంది. అయితే మరికొంతమంది మాత్రం ఇలా సరదాగా అన్న వ్యాఖ్యలను తప్పుపట్టడం సరికాదని అంటున్నారు. -
'మనకు అలాంటి వారే ఉన్నారు.. హీరోయిన్ వివాదాస్పద కామెంట్స్'
కాజోల్.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఎలాంటి కష్టతరమైన పాత్రలోకి అవలీలగా పరకాయ ప్రవేశం చేసి తన నటనా పటిమను చాటుకున్న బ్యూటీఫుల్ హీరోయిన్ ఆమె. 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్ కాజోల్. కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్, త్రిభంగ, కరణ్ అర్జున్, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి తదిర సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకుంది. ఇటీవలే లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే తాజాగా కాజోల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యల వివాదానికి దారితీశాయి. (ఇది చదవండి: మీరు 'గే' కదా?.. ప్రముఖ డైరెక్టర్‌కు షాకిచ్చిన నెటిజన్!) ఇంతకీ ఆమె ఏమన్నారంటే? ప్రస్తుతం కాజోల్ ‘ది ట్రైల్ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మహిళా సాధికారిత గురించి మాట్లాడారు. మనదేశంలో మార్పు చాలా నెమ్మదిగా జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం మన సంప్రదాయాలు, ఆలోచన విధానాలే. ఇదే మన విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతే కాకుండా మన విద్యావ్యవస్థపై సరైన అవగాహన లేని రాజకీయ నాయకులు ఉన్నారు. మనల్ని పాలించే చాలామంది నేతలకు విద్యా విధానంపై అవగాహన లేదని అన్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలను పలువురు రాజకీయ నాయకులు ఖండించారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల కాజోల్ వివరణ కూడా ఇచ్చింది. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేసింది. నేను కేవలం విద్య, దాని ప్రాముఖ్యత గురించి మాత్రమే ఒక పాయింట్ అవుట్ చేసి మాట్లాడాను. ఇందులో నా ఉద్దేశ్యం రాజకీయ నాయకులను కించపరచడం కాదు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించే కొంతమంది గొప్ప నాయకులు కూడా మనకు ఉన్నారని చెప్పుకొచ్చారు. కాగా.. 1999లో ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. (ఇది చదవండి: 'సలార్' అప్డేట్.. స్టార్ కమెడియన్ అలా అనడంతో!) I was merely making a point about education and its importance. My intention was not to demean any political leaders, we have some great leaders who are guiding the country on the right path. — Kajol (@itsKajolD) July 8, 2023 -
కృతి సనన్ న్యూ అవతార్: థ్రిల్లింగ్ గేమ్‌తో ఎంట్రీ ఇచ్చేసింది!
'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ సరసన సీతగా కనిపించిన నటి కృతి సనన్ బిజినెస్ విమెన్‌గా కొత్త అవతారమెత్తింది. త్వరలోనే ప్రొడ్యూసర్‌గా మారనుందంటూ సోషల్ మీడియాలో వార్తలను నిజం చేస్తూ తన ప్రాజెక్ట్ వివరాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పేరును బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్ గా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ సందడి మొదలైంది. (డోర్లు, టైర్లు లేని కారు, షాకవుతున్న నెటిజన్లు: వీడియో చూడండి!) నిర్మాతగా అడుగుపెట్టిన కృతి సనన్ నిర్మాణ సంస్థ బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్‌ను సోషల్ మీడియాలో ఆవిష్కరించింది. అలాగే నిర్మాతగా తన తొలి ప్రాజెక్ట్ ‘దో పట్టి’ అని ప్రకటించింది. ఇందుకోసం ముగ్గరు స్ట్రాంగ్, స్ఫూర్తిదాయకమైన, అపారమైన ప్రతిభావంతులైన మహిళలతో జత కట్టినట్టు వెల్లడించింది కృతి. ప్రొడక్షన్ హౌస్ లోగో రీల్‌తోపాటు, బాలీవుడ్ నటి కాజోల్, స్క్రీన్ ప్లే రైటర్ కనికా ధిల్లాన్, రిచిక కపూర్‌తో ఉన్న పిక్‌ను షేర్ చేసింది. ‘దో పట్టి’ మిస్టరీ థ్రిల్లర్‌గా రాబోతోందట. అంతేకాదు కృతి ఎనిమిదేళ్ల విరామం తర్వాత దిల్‌వాలేలో, రోహిత్ శెట్టి, కాజోల్‌తో తిరిగి కలుస్తున్నట్టు కూడా పేర్కొంది. కృతి నిర్మాణ రంగంలోకి ప్రవేశించడమే కాకుండా రచయిత్రి కనికా ధిల్లాన్‌కి తొలి వెంచర్‌గా నెటిఫ్లిక్స్ను ఎంచుకున్నట్టు తెలిపింది. (అంబానీ ‘రంగులు మార్చే’ లగ్జరీ కారు: వీడియో వైరల్) 9 సంవత్సరాల డ్రీమ్ సాకారంలో బేబీ స్టెప్స్ వేసాను, నేర్చుకున్నాను, యాక్టర్‌గా ఎదిగాను! ఫిల్మ్ మేకింగ్‌లోని ప్రతి బిట్‌ను, ప్రతీ అంశాన్ని లైక్ చేశా.. ఇపుడు నా కిష్టమైన, నచ్చిన ఆశాజనకంగా ఉండే మరిన్ని కథలను చెప్పడానికి,మరింత తెలుసుకోవడానికి సమయం ఆసన్నమైంది.ఈ మ్యాజికల్ జర్నీని ప్రారంభించేందుకు రడీగా ఉన్నానంటూ తన సోదరి నూపర్ సనన్‌కి ట్యాగ్ చేస్తూ నిండు హృదయంతో, బిగ్ డ్రీంకి స్వాగతం అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఫ్యాన్స్‌తో పాటు, పలువురు సినీ ప్రముఖులు అభినందనలు కురిపించారు. వరుణ్ ధావన్, హ్యూమా ఖురేషి, శోభితా ధూళిపాళ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కృతికి కంగ్రాట్స్ చెప్పారు. కాగా కృతి సనన్ టైగర్ ష్రాఫ్‌తో కలిసి సబ్బీర్ ఖాన్ హీరోపంతి (2014)లో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది.బరేలీ కి బర్ఫీ, మిమీ వంటి మూవీల్లోని నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్కమింగ్మూవీస్ విషయానికి వస్తే టబు , కరీనా కపూర్లతో కలిసి ‘ది క్రూ’, టైగర్ ష్రాఫ్‌తో కలిసి ‘గణపతి పార్ట్-1 లో నటిస్తోంది. View this post on Instagram Shared post on Time -
బ్లాక్ శారీలో సొగసులు ఒలకబోస్తున్న బాలీవుడ్ నటి కాజోల్ (ఫోటోలు)
-
'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ (ఆంథాలజీ)
టైటిల్: లస్ట్ స్టోరీస్ 2 నటీనటులు: తమన్నా, విజయ్ వర్మ, మృణాల్ ఠాకుర్, కాజోల్ తదితరులు నిర్మాణ సంస్థ: RSVP & ఫ్లయింగ్ యూనికార్న్ ఎంటర్ టైన్మెంట్ నిర్మాత: ఆషీ దువా, రోనీ స్క్రూవాలా దర్శకత్వం: ఆర్. బాల్కీ, సుజోయ్ ఘోష్, అమిత్ రవీంద్రనాథ్, కొంకణ్ సేన్ శర్మ సినిమాటోగ్రఫీ: ఆనంద్ బన్సాల్ ఎడిటర్: సన్యుక్త కజా ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ విడుదల తేదీ: 29 జూన్ 2023 ఓటీటీలు వచ్చిన కొత్తలో 'లస్ట్ స్టోరీస్' ఓ సెన్సేషన్. ఎంతలా అంటే ఈ ఆంథాలజీ దెబ్బకు కియారా అడ్వాణీ తెగ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'లస్ట్ స్టోరీస్ 2' తీసుకొచ్చారు. గత కొన్నిరోజుల నుంచి ప్రమోషన్స్ లో తమన్నా చేస్తున్న హడావుడి, ట్రైలర్లో ఆమె సీన్స్ వల్ల.. ఈ మూవీపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం... అంచనాల్ని అందుకుందా? ఫస్ట్ పార్ట్ కంటే మెప్పించిందా? లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) కథేంటి? ఇందులో నాలుగు కథలుంటాయి. మొదట దానిలో వేద(మృణాల్ ఠాకుర్), అర్జున్ (అంగద్ బేడీ) పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెళ్లి పనుల్లో పెద్దలు బిజీగా ఉంటారు. వేద బామ్మ (నీనా గుప్తా) మాత్రం.. జీవితాంతం సుఖంగా ఉండాలంటే పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనాలని వేద, అర్జున్ కి సలహా ఇస్తుంది. రెండో దానిలో ఇషిత (తిలోత్తమ షోమీ) ముంబయిలో జాబ్ చేస్తూ ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటుంది. ఓ రోజు కాస్త త్వరగా ఇంటికొచ్చేసరికి.. తన బెడ్ పై పనిమనిషి సీమ(అమృత సుభాష్) తన భర్తతో కలిసి బెడ్ పై శృంగారంలో బిజీగా ఉంటుంది. మూడో దానిలో విజయ్ చౌహాన్ (విజయ్ వర్మ)కు మహిళలంటే తెగ మోజు. ఓ రోజు లవర్ తో వీడియో కాల్ మాట్లాడుతూ కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. దగ్గరలోని ఓ ఊరికి వెళ్తే అక్కడ తన మాజీ ప్రేయసి శాంతి (తమన్నా) కనిపిస్తుంది. నాలుగో దానిలో బిజోక్పుర్ అనే ఊరిలో రాజకుటుంబీకుడు (కుముద్ మిశ్రా).. భార్య దేవయాని(కాజోల్), కొడుకు అంకుర్ (జీషాన్ నదఫ్)తో కలిసి జీవిస్తుంటాడు. ఈయన కూడా ఆడవాళ్లని చూస్తే అస్సలు కంట్రోల్ చేసుకోలేడు. ఈ నాలుగు స్టోరీల్లోనూ చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? బామ్మ.. పెళ్లీడుకు వచ్చిన తన మనవరాలిని దగ్గర కూర్చోబెట్టుకుని, శృంగారం గురించి చాలా ఓపెన్ గా చెబుతుంటుంది. 'మీ తాతగారిని దేవుడు తీసుకెళ్లిపోయాడు. లేకపోయింటే ఈ గది తలుపులకు ఈ పాటికే గొళ్లెం పెట్టి ఉండేవి' అని అంటుంది. ఈ సీన్ లో ఆ మనవరాలు నవ్వుతూ ఉంటుంది గానీ చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే నిజ జీవితంలో ఇలా జరుగుతుందా లేదా అనేది పక్కనబెడితే.. బోల్డ్నెస్ లో మరీ హద్దులు దాటేశారు బాబోయ్ అనిపిస్తుంది. ఇదే కాదు 'లస్ట్ స్టోరీస్ 2'లో ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' టైటిల్ తో తీసిన తొలి స్టోరీలో 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకుర్ నటించింది. పెళ్లికి ముందు శృంగారం అనే షాకింగ్ కాన్సెప్ట్ తో దీన్ని తెరకెక్కించారు. ఇది నిజంగా భారతీయ సంస్కృతిలో వర్కౌట్ కాదు. ఈ ఎపిసోడ్ అంతా బామ్మ పాత్ర చుట్టూనే ఉంటుంది. ఆమె మాటలు విన్న అర్జున్, వేద ఏం చేశారనేది స్టోరీ. చాలా సింపుల్, ఫ్లాట్ గా దీన్ని తీశారు. యూత్ ని ఆకట్టుకోవడం తప్పితే పెద్దగా ఏం లేదు. 'ద మిర్రర్' పేరుతో తీసిన రెండో స్టోరీ ఓ శృంగార నవల చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో చూపించిన పాయింట్.. ప్రస్తుతం సమాజంలో ఒంటరి మహిళలు లేదా అమ్మాయిల జీవితాలని ప్రతిబింబించేలా అనిపిస్తుంది! ఇందులో పదేపదే 'ఆ' సీన్సే చూపిస్తుంటారు. దీని వల్ల కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. నిడివి కూడా కాస్త ఎక్కువే. అసలు విషయం బయటపడిన తర్వాత మనుషుల మనస్తత్వాలు ఎలా మారిపోతాయి అనే పాయింట్ కూడా ఇందులో చూపించారు. (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) 'సె*క్స్ విత్ ఎక్స్' పేరుతో తీసిన మూడో స్టోరీలో రియల్ లైఫ్ కపుల్ తమన్నా, విజయ్ వర్మ జంటగా కనిపించారు. ఈ ఎపిసోడ్ మొదటంతా రొమాంటిక్ వేలో వెళ్తుంది. చివరకొచ్చేసరికి మిస్టరీ తరహాలో మారిపోతుంది. తమన్నా అయితే రెచ్చిపోయి మరీ అలాంటి సీన్స్ చేసింది. యూత్ ని టార్గెట్ చేయడం కోసం ఈ ఎపిసోడ్ లో ముద్దు, శృంగారం సన్నివేశాల గాఢత పెంచిన ఫీలింగ్ కలుగుతుంది. చివరి సీన్ మాత్రం మనల్ని అవాక్కయ్యేలా చేస్తుంది. 'టిల్చట్టా(బొద్దింక)' పేరుతో నాలుగో ఎపిసోడ్.. పైవాటితో పోలిస్తే చాలా నిదానంగా సాగుతుంది. చివరి సీన్ కి వస్తే గానీ అసలు ఏం జరుగుతుందనేది అర్థం కాదు. క్లైమాక్స్ పాయింట్ బాగున్నప్పటికీ.. దానికోసం ఎపిసోడ్ ని అరగంటపాటు సాగదీయడం బోర్ కొట్టిస్తుంది. ఇందులో కాజోల్ లాంటి స్టార్ యాక్టర్ ఉన్నప్పటికీ ఆమె పాత్రని సరిగా డిజైన్ చేయలేదు. మొత్తంగా చూసుకుంటే 'లస్ట్ స్టోరీస్' చిత్రంలో విభిన్న వ్యక్తుల భావోద్వేగాలని చూపిస్తే... ఇప్పుడీ సీక్వెల్ లో శృంగారమే ప్రధానం అన్నట్లు తీశారు. కథ కన్నా 'కామం' అనే పాయింట్ నే హైలెట్ చేశారు. దీంతో ఇది సినిమాలా కాకుండా ఓటీటీ కోసం తీసిన సెమీ బూతు చిత్రంలా అనిపిస్తుంది. ఫ్యామిలీ ప్రేక్షకులు.. ఈ ఆంథాలజీ చిత్రాన్ని పొరపాటున కూడా ఓపెన్ చేయొద్దు. ఎవరెలా చేశారు? మృణాల్ ఠాకుర్.. డిఫరెంట్ గా కనిపించింది. తిలోత్తమ షోమీ కూడా ఉన్నంతలో పర్లేదు. తమన్నా, విజయ్ వర్మ అయితే రెచ్చిపోయి నటించారు. ముద్దు, శృంగారం సన్నివేశాల్లో హద్దులు దాటేశారు. కాజోల్ తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసింది. సీనియర్ నటి నీనా గుప్తా అయితే ప్రతిఒక్కరినీ తన యాక్టింగ్, డైలాగ్స్ తో ఆశ్చర్యపరిచింది. చెప్పాలంటే ఈమె రోల్ అందరికీ పెద్ద షాక్. టెక్నికల్ గా నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ.. స్టోరీ, మిగతా విషయాల్లో దర్శకనిర్మాతలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. -చందు, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ) -
'అత్యంత కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నా'.. స్టార్ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ పరిచయం అక్కర్లేని పేరు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్ హీరోయిన్లలో ఒకరు. 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్ కాజోల్. కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్, త్రిభంగ, కరణ్ అర్జున్, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. షాకింగ్ నిర్ణయం! అయితే తాజాగా కాజోల్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది బాలీవుడ్ భామ. 'నా జీవితంలో చాలా కష్టమైన పరీక్షను ఎదుర్కొబోతున్నా' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇన్‌స్టాలో తన ఫోటోలను అన్నింటినీ డిలీట్ చేసింది. కేవలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు చేసిన పోస్ట్ మాత్రమే తన ఖాతాలో కనిపిస్తోంది. కాగా.. కాజోల్కు దాదాపు 14 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటున్నారో కారణాలు వెల్లడించలేదు. (ఇది చదవండి: పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్.. అండగా ఉంటామన్న ఏపీ సీఎంవో) ప్రచారం కోసమేనా? కానీ కొంతమంది ఫ్యాన్స్ ఆమె రాబోయే వెబ్ సిరీస్ 'ది గుడ్ వైఫ్' కోసం ఇదంతా ప్రచార వ్యూహమని భావిస్తున్నారు. 'ది గుడ్ వైఫ్ - ప్యార్, కానూన్, ధోకా' సిరీస్‌లో కాజోల్ లాయర్ పాత్రను పోషించింది. సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. కాగా.. 2016లో అమెరికాలో తెరకెక్కించిన ఈ సిరీస్‌లో జూలియానా మార్గులీస్ ప్రధాన పాత్రలో నటించారు. కాజోల్కు మద్దతు అయితే కాజోల్ నిర్ణయం పట్ల నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వడం మీకు మంచి చేస్తుందని భావిస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ మీ జీవితంలో ఎదురైన కష్టతరమైన పరీక్ష నుంచి త్వరలో బయటపడాలని కోరుకుంటున్నామంటూ కామెంట్ చేశాడు. ఈ విషయంలో నెటిజన్స్ కాజోల్కు మద్దతుగా నిలుస్తున్నారు. మీ నిర్ణయంతో ఇకపై మీ అందమైన పోస్టులను కోల్పోతామని కొందరు ఫీలవుతుండగా.. మీరు ఇన్ స్టాలో ఉన్నా, లేకున్నా, ఎప్పటికీ మీ మీద ప్రేమ, అభిమానం అలాగే ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: అజయ్ నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు.. కాజోల్ షాకింగ్ కామెంట్స్) కాగా.. కాజోల్ త్వరలోనే లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. నెటిఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా, మృణాల్, నీనా గుప్తా, కుముద్ మిశ్రా, అమృతా సుభాష్, అంగద్ బేడీ, విజయ్ వర్మ, తిలోత్తమా షోమే నటించారు. ఈనెల 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు సుజోయ్ ఘోష్, ఆర్. బల్కి, నటి కొంకణ్ సేన్ శర్మ, అమిత్రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
అత్యంత చెత్త ఫ్యాషన్ వీళ్లదే.. ఆ లిస్ట్‌లో ఎవరెవరంటే?
బాలీవుడ్ అంటే ఓ ఫ్యాషన్ ప్రపంచం. ఈవెంట్ ఏదైనా సినీ తారలు తమ ఫ్యాషన్‌ను వేదికపైనే పరిచయం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో బాలీవుడ్ తారలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. తమ ఫ్యాషన్ డ్రెస్సులతో ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంటారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) తాజాగా జరిగిన కేన్స్, ఐఫా లాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఊర్వశి రౌతేలా, ఐశ్వర్యరాయ్, పాలక్ తివారీ, కాజోల్, నోరా ఫతేహి, చాహత్ ఖన్నా వేదికలపై తళుక్కున మెరిశారు. కొందరు తమ డ్రెస్సులతో అభిమానులను మెప్పించగా.. మరికొందరు తారలు విచిత్రమైన ఫ్యాషన్‌తో దారుణ ట్రోల్స్‌కు గురయ్యారు. View this post on Instagram A post shared by Urvashi Rautela❤️ (@asliurvashians) అలా ఇటీవల జరిగిన ఐఫా, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అత్యంత చెత్త ఫ్యాషన్‌తో దారుణంగా ట్రోల్స్‌కు గురయ్యారు. వారిలో ప్రధానంగా ఊర్వశి రౌతేలా, పాలక్ తివారీ, చాహత్ ఖన్నా, కాజోల్, దివ్యాంక త్రిపాఠి, నోరా ఫతేహీ ఉన్నారు. ఈ వారంలో అత్యంత చెత్త ఫ్యాషన్ దుస్తులతో ముందు వరుసలో నిలిచారు. నోరా ఫతేహీ మొదటి రోజే ఎరుపు రంగు దుస్తులు ధరించి ట్రోల్స్‌కు గురైంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) ఐఫా వేడుకల్లో ఊర్వశి రౌతేలా గౌనులో గోధుమ రంగు ఈకలు ఉన్న డ్రెస్సుతో మెరిసింది. ఇది చూసిన నెటిజన్స్ ఆమె ఘోరమైన సెలక్షన్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక చాహత్ ఖన్నా బ్లాక్ గౌనులో ఉర్ఫీ జావెద్‌ను తలపించింటూ కామెంట్స్ చేశారు. కాజోల్ కాషాయ రంగులో డ్రెస్సులో కనిపించగా.. ఆమెదీ పనికిమాలిన ఫ్యాషన్ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నటి పాలక్ తివారీ డ్రెస్ బెడ్‌షీట్, కర్టెన్ క్లాత్‌ను తలపించేలా ఉందంటూ ట్రోల్ చేశారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
తెల్లగా కనిపించేందుకు సర్జరీ చేసుకున్న కాజోల్?
సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే అభినయం మాత్రమే కాదు, అందం కూడా ఉండాలి, ఉన్న అందాన్ని కాపాడుకోవాలి. అందుకోసం తారలు పడే తిప్పలు చెప్పనలవి కాదు. కడుపు మాడ్చుకుంటూ డైటింగ్లు, చెమటలు వచ్చేలా జిమ్‌లో కసరత్తులు సరేసరి.. కొందరు ఏకంగా సర్జరీలు కూడా చేయించుకుంటారు. అలా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ కూడా ఆ మధ్య సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై ఓ ఇంటర్వ్యూలో కాజోల్ స్పందించింది. 'ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో నన్ను చాలామాటలన్నారు. నల్లగా ఉంది, బండగా ఉంది. ఎప్పుడూ కళ్లద్దాలు పెట్టుకునే ఉంటుందని విమర్శించారు. అవేమీ నేను పట్టించుకోలేదు. నా గురించి విమర్శించేవాళ్ల కంటే నేను స్మార్ట్, బెటర్ అనే అనుకున్నాను. నేను నాలా ఉండాలనే నిశ్చయించుకున్నాను. అందం కోసం, తెల్లగా మారడం కోసం ఎటువంటి సర్జరీ చేయించుకోలేదు. కేవలం ఎండకు దూరంగా ఉన్నాను. గతంలో పదేళ్లు ఎండలోనే పనిచేయాల్సి రావడంతో స్కిన్ ట్యాన్ అయి నల్లగా అయ్యాను. ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ ఎండలోకి వెళ్లకపోవడంతో చర్మం ట్యాన్ అవడం లేదు. అందుకే తెల్లగా కనిపిస్తున్నాను. అంతే తప్ప తెల్లగా కనిపించేందుకు ఏ సర్జరీ చేయించుకోలేదు' అని చెప్పుకొచ్చింది కాజోల్. కాగా కాజోల్ 17 ఏళ్ల వయసులోనే సినీపరిశ్రమలో అడుగుపెట్టింది. 1992లో వచ్చిన బేఖుడి చిత్రంతో ఆమె వెండితెరపై అరంగేట్రం చేసింది. బాలీవుడ్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె 'ద గుడ్ వైఫ్' వెబ్ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనుంది. -
అజయ్ నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు.. కాజోల్ షాకింగ్ కామెంట్స్
కాజోల్.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఎలాంటి కష్టతరమైన పాత్రలోకి అవలీలగా పరకాయ ప్రవేశం చేసి తన నటనా పటిమను చాటుకున్న బ్యూటీఫుల్ హీరోయిన్ ఆమె. 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్ కాజోల్. కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్, త్రిభంగ, కరణ్ అర్జున్, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి తదిర సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకుంది. కాగా.. 1999లో ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వారిద్దరికి నైసా, యుగ్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అజయ్, కాజోల్ కలిసి నటించిన 'తానాజీ' సినిమా 68వ జాతీయ చలన చిత్ర అవార్డులలో మూడు బహుమతులను గెలుపొందింది. అయితే గతంలో ఓ ఈవెంట్లో మాట్లాడిన కాజోల్ వారి ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అజయ్‌ను మొదటిసారి చూసినప్పుడు తనకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదని కాజోల్ తెలిపింది. కాజోల్ మాట్లాడూతూ..'నేను అతన్ని హల్ చల్ మూవీ సెట్స్‌లో కలిశాను. అది మా షూటింగ్లో మొదటి రోజు. నిర్మాత నా దగ్గరకు వచ్చి అక్కడున్న వ్యక్తి హీరో అని చెప్పాడు. అతను ఒక మూలకు కుర్చీలో కూర్చున్నాడు. నేను అతన్ని చూసి 'నిజమా? అతనేనా హీరో? అని ఆశ్చర్యం వ్యక్తం చేశా. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. అజయ్ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడే వ్యక్తి అని గ్రహించా. ఆ తర్వాత మేం ఫ్రెండ్స్ అయ్యాం' అని అన్నారు. కాగా.. వీరిద్దరు నటించిన హల్చల్ 1995లో థియేటర్లలో విడుదలైంది. కాగా.. అజయ్ దేవగన్ ప్రస్తుతం తన తాజా చిత్రం భోలా బాక్సాఫీస్ విజయంతో దూసుకుపోతున్నాడు. లోకేష్ కనగరాజ్ చిత్రం తమిళ హిట్ మూవీని కైతిని హిందీ రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి అజయ్ దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అజయ్‌తో పాటు టబు, గజరాజ్ రావు, దీపక్ డోబ్రియాల్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. -
అదిరిపోయే లుక్‌తో కాజోల్.. నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్
బాలీవుడ్ నటి కాజోల్ పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో మూడు దశాబ్దాలుగా తనదైన నటనతో అలరించింది. ఆమె అందానికి దాసోహం కానివారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కానీ గత కొన్ని రోజులుగా ఆమెపై కొంతమంది నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. కాజోల్ తాజాగా ముంబయిలో తన భర్త నటించిన చిత్రం 'భోలా' ప్రీమియర్ షోకు హాజరైంది. (ఇది చదవండి: కాజోల్ అందంపై ట్రోలింగ్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్) ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన కాజోల్ తెల్లటి కోటుతో పాటు డిఫరెంట్ లుక్‌లో కనిపించింది. ఆమె వెంట కొడుకు యుగ్, తల్లి తనూజ, భర్త అజయ్ దేవగన్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కాజోల్ డ్రెస్‌పై కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన కొందరైతే కాజోల్ మరింత అందంగా కనిపిస్తోందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. చాలామంది ఆమె లుక్, నడకపై ట్రోల్స్ చేశారు. ఆమె దుస్తులతో పాటు నడక మరింత విచిత్రంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరు ఫ్యాన్స్ అయితే ఏకంగా కాజోల్ ప్రస్తుతం గర్భవతినా? అంటూ కామెంట్స్ చేశారు. అయితే గతంలోనూ కాజోల్ ముఖానికి సర్జరీ చేయించుకున్నారని ట్రోలింగ్స్ ఎదురయ్యాయి. #Kajol ♥️#jdreturnz pic.twitter.com/2vzI0SzcX8 — JDReturnz (@JdReturnz) March 30, 2023 -
ఆ చిత్రం చూసే అమ్మాయిలతో మాట్లాడటం నేర్చుకున్నా: రణ్‌బీర్
దర్శక-నిర్మాత యశ్ రాజ్ చొప్రా స్మృత్యంజలిగా నెటిఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ సిరీస్‌ను రిలీజ్‌చేస్తోంది. ‘ది రొమాంటిక్స్’ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరిని రేపు(ఫిబ్రవరి 14న) వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ స్టార్స్‌తో యశ్ చొప్రాతో ఉన్న అనుబంధం, ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు లవ్‌స్టోరి చిత్రాలపై వారి అభిప్రాయలను సేకరించింది నెట్‌ఫ్లిక్స్. ఈ సందర్భంగా ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాను ఉద్దేశిస్తూ ‘ది రొమాంటిక్స్’లో షారుక్ ఖాన్, కాజోల్ ఈ మూవీ విశేషాలను పంచుకోగా.. ఆయుష్మాన్ ఖురానా, రణ్‌బీర్ కపూర్ ఈ మూవీ తమని ఎంతగా ప్రభావితం చేసిందో తెలిపారు. చదవండి: శివరాత్రి స్పెషల్: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే ఈ సందర్భంగా బాలీవుడ్ లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. ‘దిల్వాలే దుల్హనియా లేజాయంగే(DDLJ) మా తరానికి నిర్వచనంగా నిలిచింది. ఈ సినిమా చూసినప్పుడు నేను పొందిన అనుభూతి మాట్లల్లో చెప్పలేను. డిడిఎల్జే నాపై ఎంతో ప్రభావం చూపింది. ఎంతగా అంటే ఈ సినిమా చూశాకే నా తల్లిదండ్రులతో ఎలా నడుచుకోవాలో తెలుసుకున్నాను. డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలో తెలిసింది. అలాగే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా ఈ సినిమా చూసే నేర్చుకున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ని ఆస్కార్, ఎమ్మీ అవార్డుల నామినీ స్మృతి ముంద్రా నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు. చదవండి: ముంబైలో సిద్ధార్థ్-కియారా గ్రాండ్ రిసెప్షెన్, బాలీవుడ్ తారల సందడి.. ఫొటోలు వైరల్ View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
కాజోల్ అందంపై ట్రోలింగ్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
అందం, అభినయంతో కట్టిపడేసిన స్టార్ హీరోయిన్లలో కాజోల్ ఒకరు. మూడు దశాబ్దాలుగా తన నటనతో అలరిస్తూ లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆమె అందానికి దాసోహం కానివారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కానీ గత కొన్ని రోజులుగా ఆమె అందంపై కొంతమంది నెటిన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె పాత ఫోటోలను.. లేటెస్ట్ ఫోటోలను పోలుస్తూ స్కి న్ వైటెనింగ్ సర్జరీ చేయించుందని కామెంట్ చేస్తున్నారు. తాజాగా ఈ కామెంట్లపై కాజోల్ ఫన్నీగా స్పందించారు. ‘మీరు ఎలా తెల్లగా అయ్యారు? అని నన్ను అడిగే వాళ్లకు ఇదే నా సమాధానం’అంటూ ముఖం మొత్తం ముసుగు వేసుకున్న ఫోటోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఈ ట్రోలింగ్ కంటే ముందే గతంలో కాజోల్ తను తెల్లగా అవ్వడం కోసం ఎలాంటి సర్జరీలు చేసుకోలేదని చెప్పింది. సినిమా షూటింగ్స్ కోసమని గతంలో ఎండలో ఎక్కువ సమయం గడిపానని.. అందుకే కాస్త నల్ల బడినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎండలోకి వెళ్లడం లేదని, అందుకే గతంలో కంటే తెల్లగా కనిపిస్తున్నాను.. అంతేకాని సర్జరీల వల్ల తాను రంగు మారలేదని కాజోల్ అన్నారు. -
కాజోల్ భర్త లేనప్పుడు ఆమెతో ఫ్రెంచ్ కిస్: నటుడు
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ త్రిభంగ సినిమాతో డిజిటల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అలాగే ద గుడ్ వైఫ్ అనే ఇంగ్లీష్ సిరీస్ హిందీ రీమేక్‌లోనూ నటిస్తోంది. ఇందులో బ్రిటీష్-పాక్ నటుడు అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సిరీస్‌లో అలీ, కాజోల్ ప్రేయసిగా నటిస్తున్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో అలీ కాజోల్కు తాను అభిమాని అన్న విషయాన్ని బయటపెట్టాడు. 'చిన్నతనంలో నేను కాజోల్కు అభిమానిని. మూడు దశాబ్దాలుగా ఆమెను వెండితెరపై చూస్తూనే ఉన్నా. ఇన్నాళ్లకు ఆమెతో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఆమెకు ప్రియుడిగా యాక్ట్ చేశా.. ఓ సీన్లో మేమిద్దరం ఫ్రెంచ్ కిస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను చూయింగ్ గమ్ నమిలాను. అజయ్ దేవ్‌గణ్ బ్యానర్లోనే ఈ సిరీస్ నిర్మితమవుతోంది. ఆరోజు అజయ్ రాలేదు. ముంబైలోని లగ్జరీ హోటల్లో షూటింగ్.. ఒక్క సెకండ్లో మేమిద్దరం దాన్ని ప్రొఫెషనల్‌గా పూర్తి చేశాం. కానీ దానికంటే ముందు మూడునాలుగు సార్లు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. ఈ సీన్ ఇంత త్వరగా పూర్తి చేయడంతో కాజోల్ థాంక్యూ డార్లింగ్ అని మెచ్చుకుంది' అని చెప్పుకొచ్చాడు అలీ. ద ఫ్యామిలీ మ్యాన్ సుపర్న్ వర్మ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. చదవండి: సౌందర్య సినిమా ఇంకెన్నిసార్లు వేస్తారు? ప్రేక్షకుడు ఫైర్ బుల్లితెర నటి వైష్ణవి సీమంతం -
తప్పతాగిన స్టార్ హీరో కూతురు.. నెటిజన్ల దారుణ ట్రోల్స్
బాలీవుడ్ సెలబ్రిటీలు వారాంతం వచ్చిందంటే ఎంజాయ్ చేయడం మామూలే. పబ్‌లు, నైట్ పార్టీలకు కొదవే లేదు. అయితే ఇటీవల బాలీవుడ్ స్టార్ నటుల పిల్లలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ కల్చర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల సుహానా ఖాన్, ఖుషి కపూర్ ఓ పార్టీలో సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అజయ్ దేవగణ్ కూతురు నైసా దేవగణ్ తన ఫ్రెండ్ ఓర్హాన్ అవత్రమణితో ముంబైలో పార్టీకి వెళ్లిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఎందుకంటే వారిద్దరూ వీడియోలో తప్పతాగి కనిపించారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్, మహికా రాంపాల్, ఇతర స్టార్కిడ్లు కూడా పార్టీలో కనిపించారు. నైసా దేవగణ్, ఓర్రీ చేతులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడుస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ వారిద్దరూ తప్ప తాగి ఉన్నారంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఓ నెటిజన్ తల్లిదండ్రులు కష్టపడి పేరు సంపాదిస్తే.. వారి పిల్లలు వాటిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మరో నెటిజన్ నైసా దేవగణ్ ఫుల్‌గా తాగి ఉందంటూ పేర్కొన్నాడు. దుస్తులు, మేకప్, ఓపెన్ హెయిర్, బోల్డ్ మేకప్‌తో ఆమె తన రూపాన్ని మార్చేసిందని కామెంట్స్ చేశారు .నైసా దేవగణ్.. అజయ్, కాజోల్‌లకు మొదటి సంతానం. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు యుగ్ కూడా ఉన్నాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
తల్లికి మర్చిపోలేని గిఫ్టిచ్చిన బాలీవుడ్ హీరోయిన్స్
బాలీవుడ్ హీరోయిన్స్ కాజోల్, తనీషా ముఖర్జీ తల్లి తనూజాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. మహారాష్ట్ర ముంబైలోని లోనావాలో ఓ కొత్తింటిని బహుమతిగా ఇచ్చారు. విలాసవంతమైన ఈ ఇల్లు నిర్మాణం పూర్తవడానికి దాదాపు 8 నెలలు పట్టగా.. తాజాగా తల్లితో కలిసి గృహప్రవేశం చేశారిద్దరూ. తల్లీకూతుర్లు కలిసి రిబ్బన్ కట్ చేసి కొత్తింట్లోకి వెళ్లారు. కుడికాలుతో ఇంట్లో అడుగుపెట్టారు. ఈ వీడియోను తనీషా సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది కాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు 'బంగారం లాంటి పిల్లలుంటే ఏదైనా సాధ్యమే', 'మీ బంధం కలకాలం ఇలాగే కొనసాగాలి', 'కొత్తింటి కల సాకారమైనందుకు శుభాకాంక్షలు' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా తనూజా- షోమూ ముఖర్జీల సంతానమే కాజోల్, తనీషా. ఇక కాజోల్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆమె సలాం వెంకీ సినిమాలో నటించింది. View this post on Instagram A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji) చదవండి: ఆత్మహత్యకు చేసుకోవాలనుకున్న చలపతిరావు అన్నయ్య కంటే ముందే పెళ్లి చేసుకున్న చలపతిరావు, ఆయన లవ్ స్టోరీ.. -
Beauty: ఈ మూడు పాటిస్తే.. 50 ఏళ్లు వచ్చినా హీరోయిన్లా.. అందంగా
Kajol- Beauty Tips: చర్మం మీద అనవసర ప్రయోగాలు చేయొద్దంటోంది బాలీవుడ్ బ్యూటీ కాజోల్. సహజ పద్ధతిలోనే కాంతులీనే చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చని చెబుతోంది. అమ్మ చెప్పిన చిట్కాలే 48 ఏళ్ల వయసులోనూ తన మోము మెరిసిపోవడానికి కారణం అంటోంది. ‘‘స్కిన్ మీద ప్రయోగాలు వద్దని మా అమ్మ (నటి తనూజ).. నా టీనేజ్ టైమ్‌లోనే సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది. సో నో ఎక్స్పరిమెంట్స్.. అన్నీ నేచురల్ థింగ్సే. వాటిలో రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల మంచినీళ్లు తాగడం ముఖ్యమైందే కాదు అత్యంత అవసరమైంది కూడా. రెండోది సమతుల ఆహారం. మూడోది కంటినిండా నిద్ర. ఒకవేళ ఎప్పుడైనా రెండోది తప్పుతానేమో కానీ మూడోది అదే నిద్ర విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్‌కాను. తల్లి, చెల్లితో కాజోల్ ఏదిఏమైనా హాయిగా ఆదమరచి నిద్రపోతాను. నిద్ర చెడగొట్టే విషయాలనేవీ క్యారీ చేయను. అవండీ మా అమ్మ నాకు, మా చెల్లి (తనీషా ముఖర్జీ)కి చెప్పిన బ్యూటీ టిప్స్!’’ అంటూ బ్యూటీ సీక్రెట్‌ను రివీల్ చేసింది కాజోల్. ఈ చిట్కాలు పాటిస్తే ఐదు పదుల వయసు దాటినా అందంలో మెరిసిపోవచ్చు అని చెబుతోంది. కాగా కాజోల్ నటించిన సలాం వెంకీ సినిమా ఇటీవలే విడుదలైంది. చదవండి: Allu Arjun Wife Sneha Reddy: చీరకట్టులో కుందనపు బొమ్మలా అల్లు స్నేహారెడ్డి! ఆ సారీ ధర ఎంతంటే! నోటి నుంచి దుర్వాసన వస్తోందా? నీటిలో తౌడు వేసి.. తెల్లారి పరగడుపున వీటిని కలిపి తాగితే.. -
కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్
Ajay Devgn Special Post On Kajol Completes 30 Years In Bollywood: కాజోల్.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఎలాంటి కష్టతరమైన పాత్రలోకి అవలీలగా పరకాయ ప్రవేశం చేసి తన నటనా పటిమను చాటుకున్న బ్యూటీఫుల్ హీరోయిన్ ఆమె. ఎన్నో చిత్రాల్లో గ్లామర్‌తోపాటు అభినయంతో విశేష అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోయిన్ బాలీవుడ్ చిత్రసీమలోకి అడుగుపెట్టి మూడు దశాబ్ధాలు (30 ఏళ్లు) పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె భర్త, నటుడు, స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఒక ప్రత్యేకమైన పోస్ట్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అజయ్ దేవగణ్-కాజోల్ కలిసి నటించిన 'తానాజీ' సినిమాలోని ఓ పిక్‌ను షేర్ చేస్తూ 'ఈ 3 దశబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు చేశావు. ఎన్నో మైలురాళ్లు దాటావు. ఈ ముప్పై ఏళ్ల సినీ కెరీర్లో జ్ఞాపకాలు నిక్షిప్తమయ్యాయి. కానీ, నిజానికి.. నువ్ ఇప్పుడే అసలైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నావు' అంటూ రాసుకొచ్చాడు అజయ్ దేవగణ్. అలాగే తన సినీ కెరీర్‌కు ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక స్పెషల్ గ్లింప్స్‌ను షేర్ చేసింది కాజోల్. చదవండి: షూటింగ్ పోటీల్లో అజిత్ సత్తా.. 4 బంగారు పతకాలు కైవసం నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్.. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) కాగా 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్ కాజోల్. కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్, త్రిభంగ, కరణ్ అర్జున్, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి తదిర సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకుంది. 1999లో అజయ్ దేవగణ్‌ను వివాహం చేసుకోగా, వారిద్దరికి నైసా, యుగ్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అజయ్, కాజోల్ కలిసి నటించిన 'తానాజీ' సినిమా 68వ జాతీయ చలన చిత్ర అవార్డులలో మూడు బహుమతులను గెలుపొందింది. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
ఒక్క ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు.. హీరోయిన్ పారితోషికంపై చర్చ !
Did Kajol Taking 5 Crore Remuneration: అందంతో పాటు అభినయంతో అభిమానుల మనసును కొల్లగొట్టింది బాలీవుడ్ దివా కాజోల్. 90 దశకంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన కాజోల్ హిందీ చిత్రపరిశ్రమను ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ 47 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోయిన్లకు అందంలో పోటీ ఇస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌తో వివాహం తర్వాత సైతం అడపాదడపా సినిమాలు చేస్తూనే ఆకట్టుకుంటూనే ఉంది. అయితే ఇప్పటికే వెండితెరపై మెరిసిన స్టార్ హీరోయిన్లందరూ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో కాజోల్ కూడా చేరిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అందిస్తోన్న ఓ థ్రిల్లర్ షోతో డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టనుంది. కొన్ని రోజులుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో ఉన్న ఈ షో సోమవారం (జులై 11) ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ఓ వార్త బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఈ షోలో ఒక్క ఎపిసోడ్‌కు రూ. 5 కోట్ల పారితోషికాన్ని తీసుకోనుందట కాజోల్. ఈ విషయంపై బాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ థ్రిల్లర్ షోకు సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా కాజోల్ ప్రస్తుతం నటి రేవతి డైరెక్షన్లో తెరకెక్కనున్న 'సలామ్ వెంకీ' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. చదవండి: ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా.. అలా మరిచిపోతే విలువ ఉండదు: నాగ చైతన్య ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్ -
ఆస్కార్ నుంచి సూర్యకు ఆహ్వానం.. తొలి సౌత్ ఇండియా హీరోగా రికార్డు
ప్రపంచ చలన చిత్ర రంగంలోని ఏ నటుడైన ప్రతిష్టాత్మకంగా భావిచే అవార్డు ఆస్కార్. జీవితంలో ఒక్కసారైన ఈ అవార్డు రావాలని కోరుకుంటారు. అలాగే ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనే అవకాశం వచ్చిన చాలనుకుంటారు. ఈ అరుదైన అవకాశం తాజాగా స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ నటి కాజోల్కు దక్కింది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు, సభ్యురాలిగా వీరిద్దరు ఛాన్స్ కొట్టేశారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు వరల్డ్‌వైడ్‌గా 397 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో సూర్య, కాజోల్‌తోపాటు గతేడాది బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా ఎన్నో అవార్డులు అందుకున్న రైటింగ్ విత్ ఫైర్ దర్శకులు సుస్మిత్ ఘోష్, రింటూ థామస్, ఇతర కళాకారులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఈ విషయాన్ని జూన్ 28న రాత్రి అకాడమీ బోర్డ్ ప్రకటించింది. 2022లో 44 శాతం మంది మహిళలు, 37 శాతం తక్కువ ప్రాతినిధ్యం ఉన్న జాతులకు చెందిన వారిని, 50 శాతం యూఎస్ఏకు వెలుపల 53 దేశాలు, భూభాగాలకు చెందిన వారిని తీసుకుంటున్నట్లుగా అకాడమీ తెలిపింది. చదవండి: గుండెముక్కలైంది.. టాలీవుడ్ ప్రముఖుల సంతాపం కాగా సౌత్ ఇండియాతోపాటు కోలీవుడ్ నుంచి ఇలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న నటుడిగా సూర్య గుర్తింపు పొందారు. సూర్య నటించిన 'జై భీమ్', 'ఆకాశం నీ హద్దురా' చిత్రాలు గతంలో ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఉత్తమ ప్రాంతీయ చిత్రాల విభాగంలో అవార్డును అందుకోలేకపోయాయి. చదవండి: మరోసారి తండ్రి అయిన నిర్మాత దిల్ రాజు.. -
రెండు లగ్జరీ ఫ్లాట్లు కొన్న స్టార్ హీరోయిన్, ధరెంతో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తాజాగా కొత్త ఫ్లాట్లు కొనుగోలు చేసింది. ముంబైలోని జుహులో మరో రెండు ఫ్లాట్లను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంది. స్క్వేర్‌ఫీట్ ఇండియా డాట్ కామ్ కథనం ప్రకారం ముంబైలోని జుహులో ఆమె నివసిస్తున్న శివశక్తి బంగ్లాకు సమీపంలోనే రెండు లగ్జరీ ఫ్లాట్లను సొంతం చేసుకుంది. ఈ ఫ్లాట్లు సదరు భవనంలోని పదవ అంతస్థులో ఉన్నాయి. 2000 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న ఆ ఫ్లాట్ల ధర సుమారు 12 కోట్ల రూపాయలని సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలోనే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా పూర్తైపోయిందట! ఇదిలా ఉంటే కాజోల్ భర్త అజయ్ దేవ్‌గణ్ కూడా గతేడాది జుహులో రూ.60 కోట్లు విలువ చేసే బంగళాను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే! కాగా కాజోల్ చివరగా నెట్‌ఫ్లిక్స్‌లో 'త్రిభంగ' సినిమాలో కనిపించింది. ఇందులో మిథిలా పాల్కర్, తన్వి అజ్మీ, మానవ్ గోహిల్, కునాల్ రాయ్ కపూర్ తదితరులు నటించారు. ప్రస్తుతం ఆమె రేవతి దర్శకత్వంలో 'సలాం వెంకీ' సినిమా చేస్తోంది. -
సీనియర్ నటి రేవతి డైరెక్షన్లో హీరోయిన్ కాజోల్
Kajol Begins Shooting For Revathy Salaam Venky Film: ‘సలామ్ వెంకీ’ అంటున్నారు నటి కాజోల్. నటి రేవతి ఈ సినిమాకు దర్శకురాలు. శుక్రవారం ఈ సినిమా ప్రారంభమైంది. ‘‘అందరికీ చెప్పాల్సిన ఓ కథతో మా జర్నీ మొదలుపెట్టాం. గమ్యం చేరుకోవడానికి తీసుకోవాల్సిన మార్గం, జీవితాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? అనే అంశాలతో ఈ సినిమా కథ ఉంటుంది. నమ్మలేని ఓ నిజమైన కథను ప్రేక్షకులకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అన్నారు కాజోల్. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
కాజోల్కు కరోనా...ముఖం చూపించలేకపోతున్నానంటూ పోస్ట్
దేశంలో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతుంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఎవరిని కరోనా వదలడం లేదు. ఇప్పటికే చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ అందాల తార కాజోల్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాజోల్ సోషల్ మీడియాలో వేదికగా అనౌన్స్ చేశారు. నాకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నా రుడాల్ఫ్ ముక్కుని ఎవరికి చూపించాలని లేదు. అందుకే ప్రపంచంలోనే అత్యంత మధురమైన నా కూతురి నవ్వును మీతో పంచుకుంటున్నాను. మిస్ యూ నైసాదేవ్గణ్’ అంటూ రాసుకొచ్చింది కాజోల్. కాజోల్ పంచుకున్న ఫోటోలో నైసా ట్రెడిషనల్ లుక్‌లో చిరునవ్వు చిందిస్తూ ఉంది. కరోనా బారిన పడిన కాజోల్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
షారూఖ్ ఖాన్‌కు ఎందుకు విషెష్ చెప్పలేదు?
ముంబై: బాలీవుడ్ కథానాయిక కాజోల్కు షారూఖ్ ఖాన్ అభిమాని ఒకరు ఆసక్తికర ప్రశ్న సంధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా షారూఖ్ ఫ్యాన్ నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. షారూఖ్ ఖాన్‌కు ఎందుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని సదరు అభిమాని ప్రశ్నించాడు. దీనికి కాజోల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘షారూఖ్ కుమారుడు ఇంటికి తిరిగి రావడంతో ఆయన ఆశలన్నీ ఫలించాయి. ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఆయనకు ఉంటుందా?’ అని జవాబిచ్చారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కుని అక్టోబర్ 2న అరెస్టైన షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్.. అక్టోబర్ 30న జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. షారూఖ్ ఖాన్ మంగళవారం 56వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. కాజోల్, షారూఖ్ పలు హిట్ సినిమాల్లో కలిసి నటించారు. 2018లో విడుదలైన ‘జీరో’ సినిమా తర్వాత షారూఖ్ మూవీస్ ఇప్పటివరకు విడుదల కాలేదు. షారూఖ్ ఖాన్ ప్రస్తుతం ‘పఠాన్’ సినిమాలో నటిస్తున్నారు. రేవతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది లాస్ట్ హుర్రా’ సినిమాలో కాజోల్ కనిపించనున్నారు. (షారుక్-గౌరీ ప్రేమకథలో ఎన్ని అడ్డంకులో.. చివరికి ఇలా ముగిసింది..) -
‘బైక్ కవర్ వేసుకున్నావా’.. కాజోల్‌ని ట్రోల్ చేసిన నెటిజన్లు
అందంతో పాటు అభినయంతో అభిమానులు కొల్లగొట్టిన నటి కాజోల్. 47 వయసులో ఉన్న ఈ నటి ఇప్పటికి కుర్ర హీరోయిన్లకి పోటీ ఇస్తూ బ్యూటీతో అదరగొడుతూనే ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌తో వివాహం తర్వాత సైతం అదపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‌కి వచ్చిన ఈమెని వీపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. డ్రెసింగ్, ఎయిర్ స్టైల్ వంటి వాటిలో ఎప్పుడూ ప్రయోగాలు చేసే కాజోల్.. తాజాగా దుబాయ్‌లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో బాడీ-కాన్ బ్లాక్ గౌన్ ధరించి రెడ్ కార్పెట్‌పై నడిచింది. కానీ ఈ సారి ఆమె చేసిన ప్రయోగం అభిమానులకు నచ్చలేదు. దీంతో విపరీతంగా ట్రోల్ చేశారు. ‘ఆమె నా బైక్ కవర్ వేసుకొచ్చింది’ అని ఒకరు అనగా.. ‘అది బ్లాంకెట్లా ఉంది.. అవార్డు రాకపోతే అది కప్పుకొని పడుకోవచ్చు’ అంటూ కామెంట్ చేశారు. ఒకరైతే కాజోల్ అవుట్ ఫిట్ ఫ్యాషన్ డిజాస్టర్ అంటూ ట్రోల్ చేశాడు. చదవండి: ‘డీడీఎల్జే’ విడుదలై 26 ఏళ్లు.. థ్యాంక్స్ చెప్పిన కాజోల్ View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap) -
ప్రేమలో పడ్డానంటున్న ‘లవ్లీ’ బ్యూటీ, ఎప్పటికీ డిలిట్ చేయనంటున్న దీపికా
► ‘నేను చెప్పేది పూర్తిగా వినే ఓపిక లేకుంటే వెళ్లిపోండి, ఎందుకంటే నేను పెద్ద పెద్ద ప్యారగ్రాప్లు రాస్తాను, ఒక్క వ్యాఖ్యంలో చెప్పడం రాదు’ అంటున్న కాజోల్ ► గత జ్ఞాపకాలతో లవ్‌లో పడ్డానంటున్న లవ్వీ బ్యూటీ శాన్వి శ్రీవాత్సవ ► క్యూట్‌గా ఉంది, ఎప్పటికీ డిలీట్ చేయనంటున్న దీపిక పదుకొనె ► తీర్థ యాత్రలు అయిపోయాయి, పెయింటింగ్‌తో బిజీ అయిపోయిన సమంత View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shanvi sri (@shanvisri) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Mishti Chakravarty (@mishtichakravarty) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) -
DDLJ: 26 ఏళ్ల తర్వాత.. మళ్లీ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’
షారుక్ ఖాన్, కాజోల్ జంటగా ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’(డీడీఎల్జే) చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 1995లో విడుదలైన ఈ క్లాసిక్‌ను మళ్లీ డైరెక్ట్ చేయనున్నారు ఆదిత్య చోప్రా. కానీ ఇది రీమేక్ కాదు.. సీక్వెలూ కాదు. ఇంగ్లిష్ ప్రేక్షకుల కోసం ఆదిత్య చోప్రా బ్రాడ్ వే (రంగస్థలం కోసం) విభాగంలో ఈ చిత్రాన్ని వీక్షకులకు అందించనున్నారు. ఈ షోకు ‘కమ్ ఫాల్ ఇన్ లవ్: ది డీడీఎల్జే మ్యూజికల్’ అనే టైటిల్ ఖరారు చేశారు. సొంత నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ పైనే ఆదిత్య చోప్రా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆదిత్య చోప్రా మాట్లాడుతూ – ‘‘డీడీఎల్జే’ను నా 23ఏళ్ల వయసులో తెరకెక్కించాను. నిజానికి ఈ సినిమాను మొదట్లో హిందీలో తీయాలనుకోలేదు. ఒకటి.. రెండు ఇండియన్ సినిమాలను తీశాక హాలీవుడ్లో టామ్క్రూజ్తో తీయాలనుకున్నాను.. కుదర్లేదు. ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత థియేటర్ ఆర్టిస్ట్‌లతో తీయనున్నాను. అయితే ఈసారి సినిమాగా కాదు.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ బ్రాడ్ వే మ్యూజికల్‌గా రానుంది. అమెరికన్ అబ్బాయి, ఇండియన్ అమ్మాయి మధ్య ఈ కథనం ఉంటుంది. మళ్లీ నా వయసు నాకు 23 ఏళ్లలా అనిపిస్తోంది. 2022లో ‘డీడీఎల్జే’ వీక్షకుల ముందుకు వస్తుంది’’ అని పేర్కొన్నారు. -
సిమ్రాన్ ట్రైన్‌ని అందుకుని 26 ఏళ్లు
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, అందాల తార కాజోల్ జంటగా నటించిన చిత్రం ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాకి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మూవీతో ఈ ఇద్దరు కూడా స్టార్స్‌గా మారిపోయారు. అయితే ఈ రోజుతో ఈ సినిమా విడుదలై 26 ఏళ్లు పూర్తి అయ్యాయి. దీంతో ఈ సినిమా గురించి ఓ వీడియోని షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది ఇందులో ‘సిమ్రాన్’గా నటించిన కాజోల్. ఆ సినిమాలో క్లైమాక్స్‌లో ట్రైన్లో వెళుతున్న షారుక్ చేతిని అందుకునే సీన్ గుర్తుండే ఉంటుంది. ఈ సీన్‌ని షేర్ చేసింది ఈ బ్యూటీ. దానికి.. ‘సిమ్రాన్ ట్రైన్‌ని అందుకుని 26 ఏళ్లు. ఇంకా మాపై ప్రేమ చూపిస్తున్నందుకు థ్యాంక్స్’ అంటూ క్యాప్షన్‌ని జోడించింది. అయితే ఈ మూవీని షాట్‌గా ‘డీడీఎల్జే’ అంటు ఉంటారు ఫ్యాన్స్. కాగా ఇప్పటికి ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చిన చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉంటారు. చదవండి: హీరోయిన్ని డైరెక్ట్ చేయనున్న నటి View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
దసరా ఉత్సవాల్లో బాలీవుడ్ ప్రముఖుల సందడి
సాక్షి, ముంబై: పవిత్ర దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో బాలీవుడ్ హీరోయిన్లు సందడి చేశారు. రానున్న విజయదశమి లేదా దసరా వేడుకల్లో భాగంగా మహర్నవమి రోజు బాలీవుడ్ స్టార్లు ప్రసిద్ధ ఉత్తర బొంబాయి సర్బోజనిన్ ఆలయానికి తరలి వచ్చారు. ప్రత్యేక పూజలు చేసి దేవి ఆశీర్వాదాలు పొందారు. ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్, అజయ్ దేవగణ్ భార్య కాజోల్, హీరోయిన్ రాణి ముఖర్జీ, అమిత్ కుమార్, సినీ గాయకుడు షాన్ అతని తల్లి, టీవీ నటి, కపిల్ శర్మ ఫో ఫేం సుమోన చక్రవర్తి, జాన్ కుమార్ సాను, డెబినా బోన్నర్జీ, గుర్మీత్ చౌదరి, బప్పా బి లాహిరి, తనీషా లాహిరి, దేబు ముఖర్జీ , శర్బానీ ముఖర్జీ తదితర స్టార్లు ఉత్తర బొంబాయి సర్బోజనిన్ దుర్గను సందర్శించుకున్నారు. ముంబైలోని పురాతన , అతిపెద్ద దుర్గా పూజా మండపాల్లో ఇది కూడా ఒకటి. కాగా కరోనా మహమ్మారి, కఠిన ఆంక్షల మధ్య ఇది వరుసగా రెండో ఏడాది కూడా వర్చువల్‌గా సాగుతోంది. రెండు డోసుల టీకాలు తీసుకున్నవారికి మాత్రమే అనుమతి నిస్తుండటం విశేషం. చదవండి : Durga Puja : బాలీవుడ్ హీరోయిన్ సందడి View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap) -
అమ్మవారికి ప్రత్యేక పూజలు: బాలీవుడ్ హీరోయిన్ సందడి
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి కాజోల్ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సందడి చేశారు. దుర్గా పూజ మండపంలో తన బంధువులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ ఆభరణాలు, పింక్ కలర్ చీరలో కాజోల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. (Sunny Leone: పీస్ ఆఫ్ హెవెన్, స్టన్నింగ్ ఫోటో) దసరా వచ్చిందంటే ప్రతీ ఏడాది ప్రత్యేక పూజలతో కాజోల్ వేడుక చేస్తారు. మహా సప్తమిని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా కాజోల్ ముంబైలో దుర్గా పూజ మండపంలో మంగళవారం అమ్మకారికి పూజలు చేశారు. కాజోల్‌తోపాటు ఆమె కజిన్, నటి శర్బానీ ముఖర్జీ కూడా ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
హీరోయిన్ని డైరెక్ట్ చేయనున్న నటి
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఇద్దరూ కలిసి ఒకే సినిమాకి పని చేయబోతున్నారు. అయితే అందులో ఒకరు నటిగా చేస్తుండగా, మరొకరు డైరెక్టర్‌గా చేయనున్నారు. వారే కాజోల్, రేవతి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కాజోల్. రేవతి దర్శకత్వంలో పని చేయనుండడం ఎంతో సంతోషంగా ఉందని నటి తెలిపింది. ఆ సినిమా పేరు ‘ది లాస్ట్ హుర్రే’. హృదయానికి హత్తుకునే ఆ సినిమా కథ వినగానే ఓకే చెప్పినట్లు బ్యూటీ చెప్పుకొచ్చింది. అయితే నటి నుంచి దర్శకురాలిగా మారిన రేవతి ఇప్పటికే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించగా.. ఐదో మూవీని కాజోల్ చేయనున్నారు. అయితే ఈ చిత్రాన్ని బీలైవ్ ప్రోడక్షన్స్, టేక్ 23 స్టూడియోస్ ప్రోడక్షన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: అమితాబ్ ముందు కంటతడి పెట్టిన జెనీలియా దంపతులు View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) pic.twitter.com/s1shrnknlK — Kajol (@itsKajolD) October 7, 2021 -
టవల్‌తో అదితి.. ఇండియా వదిలి వెళ్తున్న పునర్నవి
► ఏమీ చేయకపోయినా పర్వాలేదంటున్న కాజోల్ ► ఇండియా వదిలి వెళ్లిపోతున్న పునర్నవి ► నన్నే చూడండి అంటున్న హీనా ఖాన్ ► వింటేజ్తో పాటు ట్రెండీ లుక్‌లో శిల్పాశెట్టి ► కొంటెగా చూస్తున్న శ్రద్దా కపూర్ ► టవల్ చుట్టుకొని స్టైల్‌గా ఫోజిచ్చిన అదితి భాటియా ► కఠిన వ్యాయామాలు చేస్తున్న జాన్వీ కపూర్ ► వీకెండ్ వైబ్స్ అంటున్న సదా View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by HK (@realhinakhan) -
అందుకే అబ్‌రాంకు కాజోల్ అంటే నచ్చదు: షారుక్
బాలీవుడ్ ఆన్‌స్క్రీన్ పాపులర్ పేర్లో షారుక్ ఖాన్-కాజోల్ అగ్రస్థానంలో ఉంటారు. తెరపై ఈ జంట పండించే ప్రేమకు సినీ ప్రేమికులంత ఫిదా అవ్వక తప్పదు. దీనికి ఉదాహరణ వారిద్దరూ నటించిన ‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే, బాజీగర్, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషి కభీ ఘమ్’ చిత్రాలే. ఈ మూవీలో ప్రేమికులుగా ఈ జంట వందకు వంద శాతం మార్కులు కొట్టేశారు. అంతేగాక వారిద్దరూ నటించిన సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. అందుకే షారుక్-కాజోల్ హిట్ పెయిర్‌గా నిలిచారు. చదవండి: రోహన్‌తో శ్రద్ధా కపూర్ ప్రేమ వ్యవహరం, స్పందించిన శక్తి కపూర్ ఇక ఆ తర్వాత సుదీర్ఘ విరామంతో తర్వాత వీరిద్దరూ ‘దిల్వాలే’ మూవీతో మరోసారి జతకట్టిన సంగతి తెలిసిందే. 2015లో వచ్చి ఈ చిత్రం మంచి సక్సెస్‌ను అందుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుక్ ‘దిల్వాలే’ మూవీ సమయంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను పంచుకున్నాడు. కాగా షారుక్ ఎటు వెళ్లిన అతడి చిన్న కుమారుడు అబ్రాంను వెంట తీసుకుని వెళ్తాడనే విషయం తెలిసిందే. అయితే దిల్వాలే మూవీ షూటింగ్‌కు కూడా అబ్రాంను ప్రతి రోజు సెట్‌కు తీసుకుని వెళ్లవాడట. కాగా, తన చిన్న కుమారుడు అబ్‌రాంకు కాజోల్ అంటే ఇష్టం ఉండేది కాదంటూ షారుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: భర్త రాజ్‌కుంద్రాకు శిల్పా విడాకులు ఇవ్వబోతోందా?! ‘ప్రతి రోజు లాగే ఓ రోజు అబ్రాంను తీసుకుని ‘దిల్వాలే’ షూటింగ్‌కు వెళ్లాను. షూటింగ్ అనంతరం డైరెక్టర్ రోహిత్ శెట్టి ఆ రోజు సన్నివేశాలను కెమెరాలో చూపించేవాడు. ఈ మూవీలో నేను గాయపడిన సన్నివేశం ఆ రోజు చిత్రీకరించారు. అది చూపించేటప్పుడు ఆ సీన్ చూసి అబ్రాం ఆ గాయాలు నాకు కాజోల్ వల్లే అయ్యాయని భావించాడు. దీంతో కాజోల్ పట్ల కోపం తెచ్చుకున్నాడు. ‘పాపా తూత్ గయా(నాన్నకు దెబ్బ తగిలింది) అంటూ కాజోల్ వంక సీరియస్‌గా చూస్తూ గట్టిగా అరిచాడు. ఇక అప్పటి నుంచి కాజోల్ నేను మాట్లాడుకున్న, మేము ఇద్దరం కలిసి కనిపించిన వాడికి నచ్చేది కాదు. స్రీన్‌పై కూడా తనతో నన్ను చూసినప్పుడు అబ్రాం గుర్రుగా చూస్తుంటాడు. ఇప్పుడు అది గుర్తు చేసుకుంటుంటే చాలా సరదాగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం షారుక్ పఠాన్, సంకి సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి. -
'ఆ హీరోయిన్‌కు అంత పొగరు పనికి రాదు'
Kajol: బాలీవుడ్ నటి కాజోల్ ఈ మధ్యే 47వ పుట్టినరోజు జరుపుకుంది. కాకపోతే కరోనా వల్ల గ్రాండ్‌గా కాకుండా చాలా సింపుల్‌గా అత్యంత సన్నిహితుల సమక్షంలోనే బర్త్‌డే పార్టీ ఎంజాయ్ చేసింది. అయితే కాజోల్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో కొందరు అభిమానులు కాజోల్ కోసం ప్రేమగా కేక్ తీసుకొచ్చారు. ఆమె కేక్ కట్ చేస్తుంటే పుట్టినరోజు పాట పాడారు. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకున్న సమయంలో ఆమె ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. ఒక్క కేక్ పీస్ తినండన్న అభిమానుల రిక్వెస్ట్‌ను తిరస్కరిస్తూ అడ్డంగా తలూపింది. కేక్ తినడం కుదరదని సంకేతాలిస్తూ అక్కడ నుంచి విసవిసా వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న అభిమానులు కొంత హర్టయినట్లు కనిపించారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ తన ప్రవర్తనేమీ బాగోలేదని విమర్శిస్తున్నారు. 'ఆమెకు ఎంత అహంకారమో చూడండి, ఇందుకే ఆమె అంటే నాకు మొదటి నుంచీ గిట్టదు', 'నా సిస్టర్ ఒకసారి కాజోల్‌ను కలిసింది. అసలు ఆవిడ కనీసం మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపించలేదు. కానీ రాణీ ముఖర్జీని కలిసినప్పుడు, ఆమె ఎంతో బాగా మాట్లాడి నా సోదరితో ఒక ఫొటో కూడా తీసుకుందట.. వాళ్లిద్దరికీ ఎంత తేడా ఉందో చూడండి', 'కాజోల్ స్క్రీన్ మీద కనిపించినట్లు రియల్ లైఫ్‌లో ఉండదు, బాగా యాటిట్యూడ్ చూపిస్తోంది', 'ఎంత హీరోయిన్ అయితే మాత్రం అంత పొగరు పనికిరాదు' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా కాజోల్ చివరిసారిగా 'త్రిభంగ' సినిమాలో నటించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
హల్చల్ : సెల్ఫీ మూడ్‌లో సమీరా..యోగా ఫోజులతో మలైకా
♦ మైఖేల్ జాన్సన్ మళ్లీ పుట్టాడంటున్న యాంకర్ రవి ♦ సెట్లో చాలా గ్యాప్ తర్వాత అంటున్న కాజోల్ ♦ షాట్ బ్రేక్‌లో శ్రీముఖి ఓవర్ యాక్షన్ ♦ భర్తతో ఫర్ ఎవర్ అంటున్న సోనమ్‌కపూర్ ♦ భర్తకు చాలా పెద్ద ఫ్యాన్ అంటున్న నాజ్రియా ♦ లవ్ కొటేషన్స్ చెప్తున్న టిక్‌టాక్ బ్యూటీ బన్నీవాక్స్ ♦ పాటలో పరవశించిపోయిన సునీత ♦ యోగా ఫోజులతో మలైకా అరోరా ♦ సోమవారం మరింత షైన్ అవ్వాలంటున్న సదా ♦ సెల్ఫీ మూడ్‌లో సమీరా రెడ్డి View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Bunny Vox (@bunnyvox) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
నేనే మారానా? ప్రపంచం కూడా మారిందా?: కాజోల్
బాలీవుడ్ నటి కాజోల్ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇక తనకు, తన భర్త నటుడు అజయ్ దేవగన్‌కు సంబధించిన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ తనదైన శైలిలో చమత్కరిస్తుంది కాజోల్. తాజాగా గతేడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్‌పై స్పందిస్తూ.. 2020 నుంచి ప్రపంచ దృష్టి కోణం మారిందా అని అభిమానులను ప్రశ్నించింది. ‘‘గతేడాది నుంచి నేను మాత్రమే ఇలా ఉన్నానా?.. ప్రపంచమంతా కూడా ఇలాగే ఆలోచిస్తోందా?’’.. అంటూ మూతి ముడిచి(బుంగమూతి) ఉన్న ఫన్నీ సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక ఆమె పోస్టు చూసిన నెటిజన్లు ఆలోచనలో పడ్డారు.. ‘అవును కరెక్ట్‌గా చెప్పారు మేడం’ అంటూ కాజోల్కు మద్దతు పలుకుతున్నారు. కాగా ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ మహమ్మారితో ప్రతి అరగంటకు ఒకరు మృత్యువాత పడుతున్నారు. ఇక సినీ పరిశ్రమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొద్ది రోజులుగా ప్రతీరోజు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు కానీ, దర్శక-నిర్మాతలు కరోనాకు బలైపోతున్నారు. ఇవాళ తమిళ పరిశ్రమకు చెందిన అసురన్ మూవీ నటుడు నితీశ్ వీరాతో పాటు మరో కమెడియన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
రచ్చకెక్కిన అజయ్- రవీనా లవ్‌స్టోరీ
• మొహబ్బతే ‘ఫ్యామిలీ మెన్’గా పేరుతెచ్చుకున్న చాలా మంది బాలీవుడ్ హీరోలు పెళ్లికి ముందు ‘ప్లే బాయ్’ ట్యాగ్‌ను మోసిన వాళ్లే. వాళ్లలో అజయ్ దేవ్గన్ ఒకడు. ఆశ్చర్యపోనవసరం లేదు.. అతని లవ్ లిస్ట్‌లో కాజోల్ కంటే ముందు కరిష్మా.. ఆమె కంటే ముందు రవీనా టండన్ ఉన్నారు. అజయ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక అతని ఫస్ట్ లవ్ రవీనా టండనే. ఆ ఇద్దరూ సినిమాల్లోకి రాకముందే అజయ్ సోదరి నీలం దేవగన్ రవీనాకు అత్యంత సన్నిహితురాలు. ఆ పరిచయం, చెలిమి అజయ్, రవీనా ఒకరంటే ఒకరు ఇష్టపడ్డానికి కారణమయ్యాయి. ఆ ప్రేమ ‘దిల్వాలే’ సినిమా సెట్స్ మీద మొదలైంది. ‘ఏక్ హీ రాస్తా’తో మీడియాకు కబుర్లు పంచి పెట్టింది. సినీ పరిశ్రమలోనూ అజయ్, రవీనా లవ్వే టాపిక్ అయింది. ఆ ఇద్దరూ పెళ్లి చేసేసుకుంటారనుకుంది. రవీనా కూడా అదే ఆశించింది. అజయ్ తనను పెళ్లి చేసుకుంటాడని కలలు కన్నది. కాని అజయే అంత సీరియస్‌గా లేడు ఆ రిలేషన్ పట్ల. తారల జీవితాల్లో అలాంటి సరదాలు సాధారణం.. తమ దోస్తీ గురించి రవీనానే చాలా ఎక్కువగా ఆలోచిస్తోంది అనుకున్నాడు అతను. ఆ సమయంలోనే.. అజయ్‌కి కరిష్మా కపూర్ ఫ్రెండ్ అయింది. ఇద్దరూ కలసి ‘జిగర్’లో నటించారు. ఆ సినిమా షూటింగ్‌లోనే కరిష్మా అతణ్ణి ఆకట్టుకుంది. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఈ కొత్త ఫ్రెండ్షిప్లో పడి రవీనాను నిర్లక్ష్యం చేయసాగాడు. బిజీ షెడ్యూళ్ల వల్ల కలవలేకపోతున్నాడేమో అనుకుంది రవీనా. అందుకే ఏ మాత్రం వీలు చిక్కినా తనే అజయ్‌కి ఫోన్ చేసేది (అప్పుడు సెల్ ఫోన్లు లేవు.. ల్యాండ్ ఫోన్లే). చాలా సార్లు షూటింగ్‌కి వెళ్లిపోయాడు అనే సమాధానం వచ్చేది అతని సంబంధీకుల నుంచి. అదృష్టవశాత్తు ఎప్పుడో ఒకసారి అజయ్ ఫోన్ అందుకున్నా... పొడిపొడిగానే మాట్లాడి కట్ చేసేవాడు. అతని ఆ తీరుకూ మనసును సర్దుబాటు చేసుకున్న ఆమె.. ఆ టైమ్‌లో కరిష్మా, అజయ్ గురించి మీడియాలో వస్తున్న కథనాలను మాత్రం కొట్టిపారేయలేకపోయింది. అజయ్ చపలచిత్తం రవీనాను కలతకు గురిచేసింది. మోసం చేశాడని బాధ పడింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకూ ప్రయత్నించిందంటారు. కరిష్మాతో కలిసి ‘అందాజ్ అప్నా అప్నా’లో నటించినా అజయ్ వల్ల ఆమెతో స్నేహాన్ని కొనసాగించలేకపోయింది రవీనా. పైగా ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే నడిచిందట. పార్టీలు, ఫంక్షన్లలో ఒకరికొకరు తారసపడినా మొహం తిప్పేసుకునేవాళ్లని, ఫొటోలకు పోజులిచ్చేవారు కాదని చెప్తుంది ముంబై మీడియా. కరిష్మా కోసం రవీనాకు దూరమై.. ఆ ఇద్దరి మధ్య వైరాన్ని సృష్టించిన అజయ్ కాజోల్ కోసం కరిష్మానూ కాదనుకున్నాడు. చిరాకు, చిటపటలతోనే.. కాజోల్, అజయ్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘హల్చల్’. ఆ చిత్రం సెట్స్ మీదకు వెళ్లేనాటికి ఆ ఇద్దరిలో ఒకరంటే ఒకరికి ఆసక్తి అటుంచి సహజసిద్ధమైన కుతూహలం కూడా లేదు. ఆచితూచి మాట్లాడే అజయ్ దేవ్‌గన్‌కు గలగలా మాట్లాడే కాజోల్ వసపిట్టలా అనిపించింది. నిత్యం ఉల్లాసంగా ఉండే కాజోల్కు ఉదాసీనంగా కనిపించాడు అజయ్. పరస్పర విరుద్ధ స్వభాలున్న ఈ ఇద్దరినీ కలిపింది ఒకటే.. అప్పటికే విడివిడిగా మునిగున్న పీకల్లోతు ప్రేమ నుంచి బయటకు వచ్చేద్దామా? వద్దా? అన్న సంశయం. అవును.. అజయ్ కరిష్మాతో.. కాజోల్ కార్తిక్ మెహతాతో ప్రేమలో ఉన్నారు. అయితే ఆ భాగస్వాములతో ఇద్దరూ సంతోషంగా లేరు. వీళ్లిద్దరి మధ్య కొంచెం స్నేహం పెరిగాక కాజోలే చనువు తీసుకుంది.. కార్తిక్ మెహతాతో తన రిలేషన్‌కు సంబంధించి అజయ్‌ను సలహా అడిగి. ఆమె నిర్మొహమాటత్వం, లౌక్యంలేనితనం అజయ్‌కు నచ్చాయి. ‘జీవితాంతం ఈ అమ్మాయి తోడుంటే బాగుండు’ అనుకున్నాడు. ఆ క్షణం నుంచే కాజోల్ మీద అభిమానం కురిపించడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు ఆ అభిమానం మరింత చిక్కపడి కాజోల్కు ప్రేమ భావనను పంచింది. ‘ప్రేమిస్తున్నాను’ అనే మాటే చెప్పుకోకుండా ప్రేమించే మనసునే ‘పెళ్లి’ మంత్రంగా మార్చుకొని అన్యోన్యతను స్థిరం చేసుకున్నారిద్దరూ! అజయ్, కరిష్మా గౌరవంగానే విడిపోయినా.. అజయ్, రవీనా బ్రేకప్ మాత్రం మీడియాకెక్కింది. రవీనాతో ప్రేమలో పడ్డ విషయాన్ని అజయ్ ఎప్పుడూ ఒప్పుకోలేదు. ‘రవీనా పట్ల నేనెప్పుడూ ఆసక్తి చూపలేదు. ప్రేమనూ ఎక్స్‌ప్రెస్ చేయలేదు’ అని చెప్పాడు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. కానీ రవీనా అతని మాటలను కొట్టిపారేసింది. ‘అజయ్, నేను ప్రేమించుకున్నాం. లెటర్స్ కూడా రాసుకున్నాం’ అన్నది. ‘రవీనా పుట్టు అబద్ధాల కోరు. నేను ఆమెకు లెటర్స్ రాసిన మాట నిజమే అయితే వాటిని చూపించమనండి.. పబ్లిష్ చేయమనండి.. ఎలా రాశానో చూడాలని నాకూ ఉంది’ అని సవాలు విసిరాడు అజయ్. అక్కడితో ఆగలేదు.. రవీనాకు మానసిక వైద్యం అవసరమని, ఆమె మెంటల్ హాస్పిటల్లో చేరితే మంచిదనీ కామెంట్ చేశాడు. ఈ ఘాటు విమర్శలతో వాళ్ల మధ్య ఉన్న స్నేహం కూడా ఇగిరిపోయింది. - ఎస్సార్ చదవండి: బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌పై దాడి? -
అజయ్ దేవగణ్ బర్త్‌డే: ఆసక్తికర విషయం చెప్పిన కాజోల్
బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ నేటితో 52వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ రోజు (ఏప్రీల్ 2) ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖుల నుంచి అభిమానుల వరకు దేవగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇదిలా ఉండగా ఆయన భార్య, నటి కాజోల్ బర్త్‌డే విషెష్ మాత్రం ప్రత్యేకంగా నిలిచాయి. అజయ్ తనదైన శైలిలో చమత్కిరిస్తు శుభాకాంక్షలు తెలిపిన కాజోల్ తీరు నెటిజన్లను, అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అజయ్ కెమెరాతో ఉన్న ఓ ఫొటోలను షేర్ చేశారు. అంతేగాక అజయ్ అంత్యంత సంతోష పెట్టె విషయం ఏంటో కూడా వెల్లడించారు.‘సెల్ఫీ తీయాలని చూశాను. కానీ ఈ సెల్ఫీలో కేవలం ఆ కెమెరాతో ఆయనను మాత్రమే సెల్ఫ్ చేయగలిగాను. రోల్ కెమెరా.. ఏం చేస్తున్నారో అదే ఆయనను సంతోష పెట్టే విషయం. హ్యాపీ బర్త్‌డే ఇప్పటికి.. ఎప్పటికి’ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని జత చేసి ట్వీట్ చేశారు కాజోల్. దీని అజయ్ ‘త్వరలోనే మనం ఇద్దరం కలిసి లాంగ్ ఓవర్ డ్యూ సెల్ఫీ తీసుకుందాం’ అంటూ చమత్కరించాడు. కాగా హీరో అభిషేక్ బచ్చన్, సునీల్ శెట్టి, నటి మాధురి దీక్షిత్‌లు కూడా అజయ్ దేవగణ్‌కు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతోతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. అంతేగాక ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’లోని అజయ్ ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసి అభమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. జూనియర్ ఎన్టీర్, రాంచరణ్‌లు హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. Tried getting a selfie but the only “selfie” I could manage was his “self” with another camera 🎥 🙄.. doing what makes him happiest! Happy Birthday... today and always❤️ @ajaydevgn pic.twitter.com/PKNs8YeEY6 — Kajol (@itsKajolD) April 2, 2021 చదవండి: అజయ్ దేవగన్ మోషన్ పోస్టర్ రిలీజ్ -
పెళ్ళిలో అజయ్ దేవ్‌గణ్ డబ్బులు ఆఫర్ చేశాడు!
పెళ్ళి అనేది అందరి జీవితంలో ఒక తియ్యని అనుభూతి. బాలీవుడ్లో కొన్ని జంటలను చూస్తే ఒకరి కోసమే మరొకరు పుట్టారా! అనిపిస్తుంది. బీ టౌన్ జంట కాజోల్, అజయ్‌దేవ్‌గణ్ ఈ కోవలోకే వస్తుంది. వీరి పెళ్ళి జరిగి నేటితో 22 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కాజోల్ తమ పెళ్ళి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో నారింజ రంగు డ్రెస్సులో ఉన్న కాజోల్, తెల్లటి దుస్తుల్లో మెరిసిపోతున్న అజయ్ దేవ్గన్ ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో కాజోల్ తమ పెళ్ళినాటి మధుర క్షణాలను గుర్తుచేసుకున్నారు. పెళ్లయి ఇన్నేళ్లవుతున్నా ఏరోజు కూడా ఒంటరిగా ఫీలవ్వలేదని చెప్పుకొచ్చారు. అయితే పెళ్లి నాడు అజయ్ దేవ్గన్ ఫెరాస్(అగ్ని చుట్టూ తిరగడం) విషయంలో తొందర పెట్టాడని, వీలైనంత త్వరగా పెళ్ళితంతు ముగించడానికి పురొహితుడికి డబ్బులు కూడా ఇవ్వడానికి సిద్దపడ్డాడని సరదాగా గుర్తుచేసుకున్నారు. కాగా 1995 సంవత్సరంలో 'హల్చల్' సినిమాలో ఈ జంట తొలిసారిగా కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య స్నేహం చిగురించింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. పెద్దల అంగీకారంతో 1999లో సరిగ్గా ఇదే రోజు పంజాబీ, మహారాష్ట్ర సాంప్రదాయాల ప్రకారం వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు న్యాసా, కొడుకు యుగ్ ఉన్నారు. వీరిద్దరు కలిసి గుండరాజ్, ఇష్క్, దిల్క్యాకరే, రాజుచాచా, ప్యార్థోహోనాహిథా సినిమాల్లోనూ కలిసి నటించారు. ఈ మధ్యే వచ్చిన 'తానాజీ: ది అన్సంగ్ వారియర్'లోనూ భార్యాభర్తలుగా కనిపించారు. చదవండి: మంచుకొండల్లో కల తీర్చుకుంటున్న బాలీవుడ్ క్వీన్ -
త్రిభంగ మూవీ: ఎవరి జీవితం వారిదే!
ఒకరి అనుభవాలు ఇంకొకరికి పాఠాలు కావు. ఎవరి జీవితం వారిదే! ఇదే చూపిస్తుంది త్రిభంగ. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ చిత్రం. ఒడిస్సీ నృత్యరీతిలోని అభంగ, త్రిభంగ, సమభంగల ఆధారంగా మూడు ప్రధాన భూమికలను చిత్రీకరించిందీ సినిమా. అభంగ... పాదాల దగ్గర్నుంచి నడుము వరకు ఒక వైపు వంగి ఉండే భంగిమ. ఈ సినిమాలో తొలి తరానికి ప్రతీక. త్రిభంగ.. కాళ్లు, నడుము, భుజాలు ప్లస్ తల.. మూడు మూడు రకాలుగా వంగి ఉండే పోజు. మధ్య తరానికి చిహ్నం ఈ చిత్రంలో. సమభంగ.. బ్యాలెన్స్డ్గా ఉండే భంగిమ.. మూడో తరాన్ని సూచిస్తుంది. ఒక కుటుంబంలోని నిర్ణయాలు పిల్లల మీద చూపే ప్రభావాలు, అవి ఆ కుటుంబంలోని తల్లులను ఇంపర్ఫెక్ట్ మదర్స్‌గా.. కూతుళ్లను డిఫికల్ట్ డాటర్స్గా ఎలా చిత్రించాయో.. ఆ సంబంధ బాంధవ్యాలను చర్చిస్తుందీ సినిమా. కథ.. నయనతార (తన్వీ ఆజ్మీ) రచయిత్రి. మహిళా సమస్యల మీద రచనలతో సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటూంది. ఇద్దరు పిల్లలు అనూరాధ, రబీంద్రో. ఆమె రచనా వ్యాసంగంలో మునిగి ఉంటుంది. అయితే అందరి కోడళ్లలాగే తన కోడలూ ఇంటి బాధ్యతల్లో మునిగి, పిల్లల పెంపకం మీద దృష్టి పెట్టి, తన సేవలో తరించాలని అనుకుంటుంది ఆ అత్తగారు. ఆ అసంతృప్తిని ఒకరోజు వెళ్లగక్కుతుంది కోడలి స్నేహితుల ముందు. ఏ రచనా ప్రతిభను చూసి తనను ఇష్టపడి పెళ్లిచేసుకున్నాడో ఆ క్వాలిటీనే అత్తగారు తప్పుబడుతుంటే భర్త నోరుమెదపకుండా తననే సర్దుకుపొమ్మని చెప్పేప్పటికి తట్టుకోలేక పిల్లలను తీసుకొని ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. అనూరాధ, రబీంద్రో టీన్స్‌లోకి వచ్చేనాటికి నయనతార ఒక ఫోటో జర్నలిస్ట్‌తో ప్రేమలో పడి.. అతణ్ణి పెళ్లి చేసుకుంటుంది. అతను అనురాధ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటాడు. ఆ విషయం తల్లికి చెప్పలేక, దాచుకోలేక మానసిక వేదనకు గురవుతుంది. తన ఆ స్థితికి తల్లే కారణమన్న అభిప్రాయాన్ని స్థిరపరచుకుంటుంది అనూరాధ. తమ్ముడి బాధ్యతను తానే తీసుకుంటుంది తల్లిగా. అందుకే రబీంద్రో కూడా తల్లి పట్ల వ్యతిరేకతను పెంచుకుంటాడు. ‘త్రిభంగ’లో దృశ్యాలు అనూరాధ (కాజోల్) ఒడిస్సీ డాన్సర్ అవుతుంది. సినిమానూ కెరీర్‌గా తీసుకుంటుంది. కాంట్రవర్షియల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకుంటుంది. ఒక రష్యన్‌తో ప్రేమలో పడి సహజీవనం చేస్తుంది. కూతురిని కంటుంది. ఆ అమ్మాయే మషా (మిథిలా పాల్కర్). సహచరుడు విపరీతంగా హింసించడంతో తెగతెంపులు చేసుకొని సింగిల్ మదర్‌గా పిల్లను పెంచుతుంది. తన తల్లి వల్ల తనేం ఇబ్బందులను ఎదుర్కొందో .. ఎలాంటి అభద్రతకు లోనైందో అవేవీ తన కూతురి కలల్లోకి కూడా రాకుండా జాగ్రత్త పడ్తుంది అనురాధ. మషా.. ఒక గుజరాతీ ఉమ్మడి కుటుంబంలోని అబ్బాయి ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆ ఇంటి పరువు, మర్యాదలను కాపాడుతూ, ఆ ఇంటి సభ్యులు కోరుకుంటున్నట్టుగా మనవడినే ఇవ్వాలనే తాపత్రయంతో ఉంటుంది. కూతురి తీరు చూసి అవాక్కవుతుంది అనూరాధ. ‘‘అంత కాంప్రమైజ్ అయ్యి.. నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరమేంటి? నువ్వూ నాకు ఆడపిల్లవే కదా.. నిన్ను నేను పారేసుకోలేదు. నేనూ అమ్మమ్మకు ఆడపిల్లనే. నన్ను తను పుట్టకుండానే చంపుకోలేదు కదా?’’ అని ప్రశ్నిస్తుంది కూతురిని. ‘‘నిజమే.. అమ్మమ్మ ఇచ్చిన అభద్రత నీకో పాఠం నేర్పింది. ఆ ఒక్కదానిపట్లే నువ్వు జాగ్రత్తపడ్డావు. నీ బాయ్ ఫ్రెండ్స్ నెవరినీ మనింటికి రానివ్వకుండా కాపాడుకున్నావు. కనీసం మీ నాన్నను నువ్వు చూశావు.. నాకు మా నాన్న ఎలా ఉంటాడో కూడా తెలియదు. అందుకే నాకు భద్రమైన కుటుంబ జీవితం కావాలనుకున్నాను. దొరికింది. పణంగా ఏం పెట్టాల్సి వచ్చినా పెడ్తాను’ అంటుంది మషా. ఖిన్నురాలవుతుంది అనూరాధ. తన తల్లిలా తాను ఉండకూడదనుకుంది.. కాని తన కూతురికి ఏం కావాలనుకుంటుందో ఏనాడూ ఆలోచించలేదు అనే అంతర్మథనానికి గురవుతుంది. నయనతార బ్రెయిన్ హేమరేజ్‌తో ఆసుపత్రిలో చేరుతుంది కోమా స్టేజ్‌లో. అప్పుడు తల్లిని చూడ్డానికి వస్తుంది అనూరాధ. ఆ ఆసుపత్రి బ్యాక్‌డ్రాప్‌లో బ్యాక్ఫోర్త్గా కథనం సాగుతుంది. కూతురి మనసులో మాట విని, తల్లి తనకు, తన తమ్ముడికి రాసిన ఉత్తరం చదివి ఆమెనెంత అపార్థం చేసుకుందో గ్రహిస్తుంది అనూరాధ. కానీ అప్పుడేం లాభం ఇక! -
స్టార్ హీరో కూతురు అదిరే స్టెప్లు చూశారా!
సాక్షి, ముంబై: బాలీవుడ్ ‘సింగం’ అజయ్ దేవగణ్-కాజోల్ దంపతుల గారాల పట్టి నైసా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ప్రస్తుతం సింగపూర్‌లో తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా నైసా తన స్నేహితులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నైసా తన ఇద్దరు స్నేహితులకు సులభంగా డ్యాన్స్ స్టెప్పులు ఎలా వేయాలో నేర్పిస్తుంది. ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే అనేకమంది వీక్షించారు. ఈ వీడియో చూసిన వారంతా ‘డ్యాన్స్ మెలుకువలు నేర్పుతూ ఎంతైనా నటుడి కుమార్తె అనిపించుకుంది’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (చదవండి: అతనితో జాగ్రత్తగా ఉండమన్నారు: కాజోల్) కాగా నైసా స్టార్ సెలబ్రిటీ కూతురు అయినప్పటికీ ఆమె చాలా సాధారణంగా ఉంటారు. ఇతర సెలబ్రిటీల్లా లాగా సోషల్ మీడియాలో కూడా ఎక్కవ కనిపించరు. తన విషయాలు, ఫోటోలు అందరికి కనిపించకుండా గోప్యంగా ఉంచుతారు. ఇక కాజోల్, అజయ్ దేవగణ్ 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2003లో కూతురు నైసా, 2010లో కుమారుడు యుగ్ దేవగణ్ జన్మించారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్లో నెపోటిజంపై చర్చలు, స్టార్ కిడ్స్ పై ట్రోలింగ్ చర్చ సందర్భంగా నైసా దేవగణ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించాయి. ‘.స్టార్ హీరోల పిల్లలగా ఉండటం స్టార్డమ్ తో పాటు ఒక్కోసారి ఇబ్బందులు తెస్తాయి. తాము ఏ చిన్న తప్పు చేసినా విమర్శించేందుకు సమాజంలో చాలా మంది ఉంటార’ని సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది. (చదవండి: క్షమాపణ కోరిన ప్రముఖ ర్యాప్ సింగర్) View this post on Instagram oh @nysadevgan girl hmu and I’ll teach u how to twerk...for free! • #nysadevgan A post shared by ♡ (@nysadevganx) on Nov 11, 2020 at 10:34am PST -
'అన్నీ మారిపోయాయి.. ఆ ఒక్కటి తప్పా'
భారత చలన చిత్ర పరిశ్రమలో రికార్డులు తిరగరాసిన దిల్వాలే దుల్హానియా లే జయేంగే సినిమా నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా షారూఖ్ ఖాన్, కాజోల్లకి ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. 4 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా ఏకంగా 250 కోట్లు కలెక్ట్ చేసి రికార్డుల సునామీలు సృష్టించింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ ఒక్క సినిమాతో నేటికీ దేశంలోనే నెం.1 ప్రొడక్షన్ హౌస్‌గా నిలిచి ఉంది. లాక్డౌన్ వరకూ కూడా అంటే గత పాతికేళ్లుగా ముంబైలోని మరాఠా మందిర్‌లో మ్యాట్నీగా లేదంటే మార్నింగ్ షోగా ఈ సినిమా ఆడుతూనే ఉంది. (25 ఏళ్ల దిల్వాలే దుల్హనియా లేజాయేంగే ) నేటితో దిల్వాలే దుల్హానియా లే జయేంగే చిత్రం 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయ్ చోప్రా, ప్రీతి సింగ్ పాత్రలో నటించిన మందిరా బేడీలు సినిమాతో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. అనేక అంశాలలో చరిత్ర సృష్టించిన ఈ సినిమాలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని మందిరా అన్నారు. జీవితం చాలా మరిపోయింది. అన్నీ మారిపోయాయి. కానీ ప్రేమకు గుర్తుగా నిలిచే ఎరుపు రంగు మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది అంటూ ఈ సినిమాపై తన ప్రేమను తెలియజేశారు. View this post on Instagram #25yearchallenge !!! 🤟🏽❣️ It’s wonderful to have been a part of a film that has made cinema history on many counts. 👊🏽💥I have changed a lot, life has changed a lot. But Red is still the color of LOVE ! #25yearsofddlj I want to see some Then & Nows from all of you.. @karanjohar @kajol @anaitashroffadajania @iamsrk @yrf A post shared by Mandira Bedi (@mandirabedi) on Oct 20, 2020 at 1:04am PDT A picture of me from the sets of DDLJ. It’s been 25 years!!! Was a truly special and fun experience. The memories will last for ever... #DDLJ25 @yrf pic.twitter.com/jPohN6YdFV — Uday Chopra (@udaychopra) October 20, 2020 -
25 ఏళ్ల దిల్వాలే దుల్హనియా లేజాయేంగే
‘నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకో’ అంటుంది ఈ సినిమాలోని సిమ్రన్ పాత్ర పోషించిన కాజోల్ పసుప్పచ్చటి చేలలో. ‘అలా నిన్ను తీసుకెళ్లాలంటే ఇంత కష్టపడటం ఎందుకూ?’ అంటాడు రాజ్ పాత్రలో ఉన్న షారుక్ ఖాన్.. అప్పటికే ఆమె కోసం లండన్ వదిలి పంజాబ్‌లోని పల్లెకు చేరుకుని ఆమె కుటుంబం ఆదరణ పొందే ప్రయత్నంలో ఉంటూ. కాజోల్ తండ్రి అమ్రిష్ పురికి తన కుమార్తెను తన ప్రాంతంలో తన బంధువర్గంలో ఇచ్చి చేయాలని కోరిక. కాని ఆమె షారుక్‌ను ప్రేమించింది. షారుక్ కుటుంబం ఏమిటో అమ్రిష్ పురికి తెలియదు. వాళ్లు ఎలాంటివాళ్లో తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే కాజోల్ ప్రేమకు నో చెబుతాడు. నో చెప్పిన వెంటనే కాజోల్ షారుక్ పారిపోయి పెళ్లి చేసుకుని ఉంటే కథే లేదు. ‘మనకు మంచీ చెడు తెలుసు. మనకు ఏది సంతోషమో దానిని ఎంచుకోగలం. ఆ ఎంచుకున్నదానిని కుటుంబంలో భాగం చేయగలం. అంతవరకు ఓపికగా ఉండగలం’ అని రాజ్, సిమ్రన్ నమ్మడం వల్లే ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ భారతీయులకు అంతగా నచ్చింది. అక్టోబర్ 20, 1995లో రిలీజయ్యింది ఆ సినిమా. ఆ తర్వాత అది సృష్టించిందంతా చరిత్రే. కథ కొత్తది కాజోల్ లండన్‌లో ఉంటుంది. షారుక్ కూడా లండన్‌లోనే ఉంటాడు. కాజోల్ తండ్రి చాటు బిడ్డ. షారుక్ తండ్రిని స్నేహితుడుగా భావించే కుర్రవాడు. ఒకరికొకరు పరిచయం లేని వీళ్లిద్దరూ తమ గ్రాడ్యుయేషన్ అయిపోయాక విడివిడిగా విహారం కోసం యూరప్ యాత్రకు బయలుదేరి ట్రైన్లో పరిచయం అవుతారు. అప్పటికే కాజోల్కు పెళ్లి మాట నడిచి ఉంటుంది. పంజాబ్‌లో కుర్రాడున్నాడని తండ్రి చెప్పేసి ఉంటాడు. కాని ఆమె షారుక్‌తో ప్రేమలో పడుతుంది. షారుక్ కూడా ఆమెను ప్రేమిస్తాడు. కాని తండ్రి దీనిని అంగీకరించడు. వెంటనే కుటుంబాన్ని పంజాబ్‌కు మార్చి పెళ్లి పనులు మొదలెడతాడు. ఆమె కోసం షారుక్ పెళ్లికొడుకు స్నేహితుడిగా విడిది ఇంట్లో అడుగుపెట్టి కాజోల్ తల్లిదండ్రులను ఒప్పించి కాజోల్‌ను తనతో పాటు తీసుకువెళ్లడమే కథ. దీనికి ముందు హిందీలో వచ్చిన ‘ఏక్ దూజే కే లియే’, ‘కయామత్ సే కయామత్ తక్’ లాంటి ప్రేమ కథలు విషాదంతాలు. కాని ఇది సుఖాంతం. కుటుంబంతో పాటు సుఖాంతం. తారలు పుట్టిన వేళ బాలీవుడ్లో ఖాన్ త్రయం ఆమిర్, సల్మాన్, షారుక్ ఎస్టాబ్లిష్ అవుతున్న కాలం అది. షారుక్– కాజోల్ కలిసి అప్పటికే ‘బాజీగర్’, ‘కరణ్–అర్జున్’లలో నటించారు. కాని ఇంకా స్టార్డమ్ రాలేదు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పగ్గాలు యశ్ చోప్రా నుంచి అతని కుమారుడు ఆదిత్యా చోప్రా అందుకుంటూ మొదటిసారిగా ఒక కథ రాసి తండ్రికి వినిపించి డైరెక్ట్ చేయమన్నాడు. ‘కథ బాగుంది. నువ్వే చెయ్’ అని తండ్రి ప్రోత్సహించాడు. ఆ కథే ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’. ఈ సినిమాకు హీరోగా షారుక్‌ను అడిగితే అప్పటికి ‘డిఫరెంట్ రోల్స్’ చేయాలని కోరుకుంటున్న షారుక్ కాదన్నాడు. ‘నువ్వు స్టార్‌వి కావాలంటే ప్రతి స్త్రీ మనసు దోచే, ప్రతి తల్లి హర్షించే ఇలాంటి రోల్ చేయాలి. ఆలోచించుకో’ అని ఆదిత్య చెప్పాక ఒప్పుకున్నాడు. సినిమా సూపర్‌హిట్ అయ్యాక షారుక్ పదే పదే యశ్‌రాజ్ ఫిల్మ్స్‌కు కృతజ్ఞతలు చెప్పాడు ఈ సినిమా ఇచ్చినందుకు. కాజోల్ కథ విన్నాక వెంటనే ఒప్పుకుంది. సినిమా రిలీజయ్యాక వీరి జోడి ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన జోడీగా నిలిచింది. అందరూ తలో చేయి ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ కథను ఆదిత్యా చోప్రా మూడేళ్లు రాశాడు. మొదట ఇది ఒక అమెరికన్, ఒక ఇండియన్ ప్రేమ కథ అనుకున్నాడు. కాని యశ్ చోప్రా సూచనతో హీరో హీరోయిన్లను ఎన్ఆర్ఐలుగా మార్చాడు. ఈ కథా తయారీలో ఆదిత్య దగ్గరి బంధువు, ఇప్పటి ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ పాల్గొన్నాడు. సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. సంగీత దర్శకులుగా జతిన్–లలిత్ సూపర్‌హిట్ పాటలు ఇచ్చారు. ఆనంద్ బక్షీ వాటిని రాశాడు. కెమెరా మన్మోహన్ సింగ్. కాస్ట్యూమ్స్ మనీష్ మల్హోత్రా. సినిమాకు టైటిల్‌ని కిరణ్ ఖేర్ సూచించింది. ‘చోర్ మచాయేంగే షోర్’ సినిమాలోని ‘లేజాయేంగే లేజాయేంగే’ పాటలోని లైన్ ఇది. టైటిల్ సూచించినందుకు ఆమె పేరును టైటిల్స్‌లో వేశారు కూడా. రిలీజయ్యాక.. ఈ సినిమా బడ్జెట్ ఆ రోజుల్లో 4 కోట్లు. కాని ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? 250 కోట్లు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ ఒక్క సినిమాతో నేటికీ దేశంలోనే నెం.1 ప్రొడక్షన్ హౌస్‌గా నిలిచి ఉంది. ‘అందరూ పదే పదే చూసే సినిమాగా తీయాలి’ అనుకుని దర్శకుడు తీయడం వల్లే ఇది సాధ్యమైంది. ‘షోలే’ ముంబైలోని మినర్వా థియేటర్లో ఐదేళ్లే ఆడింది. కాని ఈ సినిమా లాక్డౌన్ వరకూ కూడా అంటే గత పాతికేళ్లుగా ముంబైలోని మరాఠా మందిర్‌లో మ్యాట్నీగా లేదంటే మార్నింగ్ షోగా ఆడుతూనే ఉంది. 25 వారాలంటే సిల్వర్ జూబ్లీ. కాని ఈ సినిమా 2014లో వేయి వారాలు దాటింది. పాటలు.. సన్నివేశాలు కాజోల్ మీద తీసిన ‘మేరే ఖ్వాబోమే జో ఆయే’, షారుక్–కాజోల్‌ల మీద ఆవాల చేలలో తీసిన ‘తుజే దేఖాహై’, ఖవాలీ స్టైల్లో తీసిన ‘మెహందీ లాగా కే రఖ్నా’... ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. క్లయిమాక్స్‌లో కాజోల్ తండ్రి చేయి వదిలి షారుక్‌ను అందుకోవడానికి ప్లాట్‌ఫామ్‌పై పరిగెత్తే సీన్ అనేక సినిమాలలో సీరియస్‌గా, స్పూఫ్గా రిపీట్ అయ్యింది. ఈ సినిమాతోనే విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలు కథల్లో భాగం కావడం మొదలైంది. ఇవాళ్టికీ టీవీలో కోట్లాది మహిళా ప్రేక్షకుల, యవతీ యువకుల ప్రియమైన సినిమా ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’. అరుదైన గౌరవం ‘దిల్వాలే....’ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఎన్నో అరుదైన రికార్డులు సృష్టిస్తూనే వస్తోంది. అయితే 25 ఏళ్ల సందర్భంగా ఓ కొత్త గౌరవం దక్కించుకుంది. లండన్‌లోని ‘సీన్స్ ఇన్ ది స్క్వేర్’లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’లో షారుక్, కాజోల్ పాత్రల కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ యానివర్సరీని పురస్కరించుకుని ప్రకటించారు. బాలీవుడ్‌కి సంబంధించి లండన్‌లోని ‘సీన్స్ ఇన్ ది స్క్వేర్’లో ఏర్పాటు చేయనున్న తొలి విగ్రహాలు ఈ సినిమాకు సంబంధించినవే కావడం విశేషం. ‘ఇది ఈ సినిమాకు దక్కిన గౌరవం’ అని చిత్రబృందం తెలిపింది. పలు ప్రముఖ హాలీవుడ్ చిత్రాల బొమ్మల చెంత మన ‘దిల్వాలే..’ చేరనుండడం భారతీయ సినిమాకు దక్కిన మంచి గౌరవం. – సాక్షి ఫ్యామిలీ -
ఇండిపెండెన్స్ డే: ఆ సినిమాను గుర్తు చేసిన కాజోల్
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్ట్స్ ఎప్పడు ఆసక్తిగా ఉంటాయి. ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2001లో వచ్చిన కాజోల్ ‘కబీ ఖుసీ కబీ గమ్’ సినిమాను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఆమె తన ట్విటర్లో శనివారం షేర్ చేశారు. ఇందులో కాజోల్ తన కుమారుడుని ‘సారే జహా సే అచ్చా హిందుస్తాన్ హమారా’ ఎప్పటికి మర్చిపోవద్దు అంటూ వారించిన సన్నివేశాన్ని పంచుకున్నారు. అలాగే వీడియో చివరిలో కాజోల్ జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. దీనిని ‘రిపీట్ ఆఫ్టర్ మీ’ అనే క్యాప్సన్‌తో షేర్ చేశారు. (చదవండి: సల్మాన్ ‘సారే జహాసే అచ్చా’ వీడియో వైరల్) అయితే ఈ సినిమాల్లో షారుక్ ఖాన్, కాజోల్ వివాహం అనంతరం విదేశాల్లో స్థిరపడిన విషయం తెలిసిందే. అక్కడ తన కొడుకుకు భారతదేశం గొప్పతనం గురించి తరచూ వివరిస్తూ ఉంటుంది. చివరిగా కాజోల్ దేవి అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించారు. ఇందులోని తన నటనకతో కాజోల్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లక్స్‌లో రాబోయే చిత్రం త్రిభంగలో నటిస్తున్నారు. రేణుకా సహనే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కాజోల్ భర్త, హరో అజయ్ దేవగన్ నిర్మిస్తున్నారు. Repeat after me!#IndependenceDay pic.twitter.com/kV21ie2wOR — Kajol (@itsKajolD) August 15, 2020 -
స్టార్ హీరోయిన్ కాజోల్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
అతనితో జాగ్రత్తగా ఉండమన్నారు: కాజోల్
ముంబై : బాలీవుడ్ సినిమాల్లో తన సత్తా చాటి స్టార్ హీరోయిన్గా కీర్తి ప్రతిష్టలు పొందారు కాజోల్. 21 ఏళ్ల కిందటే సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అజయ్ దేవగన్‌ని ప్రేమించి పెళ్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కుటుంబమంతా కలిసి ముంబైలోని తమ ఇంట్లో హాయిగా గడుపుతున్నారు. కాజోల్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో ఆమె 46వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా భర్త అజయ్ భార్యకు బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. అలాగే ప్రముఖులు, అభిమానులు కాజోల్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి వరకు సాగిన ప్రేమ ప్రయాణం, భర్త అజయ్ దేవగన్‌ను గురించి కాజోల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (‘ఆ సంఘటన నా కెరీర్‌ను నాశనం చేసింది’) Happy returns of the day, forever & always 🌹@itsKajolD pic.twitter.com/B6Z1PqJscp — Ajay Devgn (@ajaydevgn) August 5, 2020 1995లో తను మొదట అజయ్‌ను కలిసినప్పుడు అతనిపై కోపంతో మండిపడినట్లు కాజోల్ చెప్పుకొచ్చారు. ‘మేము 25 ఏళ్ల క్రితం హల్చుల్ సెట్లో కలుసుకున్నాం. నేను షాట్ కోసం సిద్ధంగా ఉండగా, నా హీరో ఎక్కడ అని అడిగాను. అతను ఓ మూలన కూర్చొని ఉన్నాడు. అతడిని కలవడానికి 10 నిమిషాల ముందు ఓ విషయంపై గొడవ పడ్డాను. అనంతరం మేము సెట్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఆ తర్వాత నుంచి స్నేహితులు అయ్యాము. అప్పటి నుంచి మా రిలేషన్ ముందుకు సాగింది. ఇద్దరం కలిసి విందులు, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లాం. మా బంధంలో సగం సమయం కారులోనే గడిచింది. నా ప్రేమ గురించి స్నేహితులకు చెప్పినప్పుడు వాళ్లు నన్ను హెచ్చరించారు. అజయ్ అప్పటికే హీరోగా మంచి పేరు ఉందని అతనితో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. కానీ నాకు తెలుసు అజయ్ ఎలాంటి వాడో. తను నాతో స్నేహంగా ఉండేవాడు’ అని కాజోల్ తెలిపారు. (సామాజిక కార్యకర్త) ‘నాలుగేళ్లు రిలేషన్లో ఉన్న తర్వాత మేము వివాహం చేసుకోవాలనుకున్నాం. ఈ విషయం మా నాన్నకు చెబితే ఆయన నాతో నాలుగు రోజులు మాట్లాడలేదు. ముందు కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. అయినప్పటికీ పట్టు సడలని దీక్షతో మా తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించాను’ అని తెలిపారు. అయితే కాజోల్, అజయ్ కలిసే సమయానికే ఇద్దరు వేరే వ్యక్తులతో రిలేషన్లో ఉన్నారు. కానీ ఆ రిలేషన్ల నుంచి విడిపోయారు. క్రమంగా వీరిద్దరి మధ్య బంధం బలపడటంతో ఇద్దరు కలిసి జీవించాలని అనుకున్నారు. చివరికి ఫిబ్రవరి 24,1999న కాజోల్-అజయ్‌లు వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి నైసా అనే కుమార్తె, యుగ్ అనే కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఈ జంట ముంబైలో ఉంటున్నారు. (‘నాకు లాక్డౌన్ మొదలై 20 ఏళ్లు’) స్టార్ హీరోయిన్ కాజోల్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు ఇక్కడ క్లిక్ చేయండి -
‘ఆ సంఘటన నా కెరీర్‌ను నాశనం చేసింది’
బాలీవుడ్ నటి మహిమా చౌదరి తన జీవితంలో జరిగిన భయానక ప్రమాదం గురించి వెల్లడించారు. ఆ యాక్సిడెంట్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని.. బతకడం కోసం పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మహిమా మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో నేను కాజోల్, అజయ్ దేవగణ్‌ల సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న ‘దిల్ క్యా కరే’ చిత్రం కోసం పని చేస్తున్నాను. బెంగళూరులో షూటింగ్ జరుగుతుంది. స్టూడియోకు కార్లో వెళ్తుండగా నాకు ఓ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఓ ట్రక్కు నా కారును ఢీకొట్టింది. గ్లాస్ మొత్తం నా ముఖం లోపలకు వెళ్లినట్లు అనిపించింది. నేను చనిపోతున్నానని అనుకున్నాను. ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్ళడానికి ఎవరూ నాకు సహాయం చేయలేదు. నేను ఆసుపత్రికి చేరుకున్న చాలా సేపటి తరువాత నా తల్లి, అజయ్ వచ్చారు. నేను లేచి అద్దంలో నా ముఖం చూసుకుని భయపడ్డాను. డాక్టర్లు నాకు శస్త్రచికిత్స చేసి 67 గాజు ముక్కలను తీశారు’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ సంఘటన యొక్క జ్ఞాపకాలు మహిమా చౌదరిని ఉద్వేగానికి గురిచేశాయి. ‘ఆ ప్రమాదం గురించి మాట్లాడేటప్పుడు నాకు దుఖం వస్తుంది. ఆపరేషన్ తర్వాత నా ముఖం మీద కుట్లు ఉన్నాయి. నేను ఇంట్లోనే ఉండాలి.. సూర్యరశ్మి తగలకూడదు. నా గది పూర్తిగా చీకటిగా ఉంటుంది. అద్దం లేదు. యూవీ కిరణాల కాంతిని వెదజల్లే లైట్లు ఉండవు’ అని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రమాదం ఆమె కెరీర్‌ను పూర్తిగా దెబ్బ తీసింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘యాక్సిడెంట్ సమయంలో నా చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. కానీ వాటిని నేను వదులు కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో జనాలు నాకు మద్దతుగా నిలవలేదు. వారు ‘ఆమె ముఖం నాశనం అయ్యింది.. ఆమెను తీసేసి మరొకరిని తీసుకుందాం’ అని భావించారు. దాంతో నేను ఆ సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది’ అన్నారు. -
‘నాకు లాక్డౌన్ మొదలై 20 ఏళ్లు’
సాక్షి, ముంబై: లాక్‌డైన్ వేళ సినీ ప్రముఖులు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో కొంతమంది తమలో ఉన్న కళలను మెరుగు పరుచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను, పాత ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను అలరిసున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో అజయ దేవగన్ ఓ త్రోబ్యాక్(పాత ఫొటో)ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇది అజయ్ దేవగన్, తన భర్య హీరోయిన్ కాజోల్ ఓ సినిమా షూటింగ్ సమయంలో దిగారు. ‘నాకు లాక్డౌన్ ప్రారంభమైన 20 ఏళ్లు అయినట్టు అనిపిస్తుంది’ అని అజయ్ దేవగన్ సరదాగా కామెంట్ జతచేసి కాజోల్‌ను ట్యాగ్ చేశారు. (అది తీవ్రంగా బాధిస్తుంది: జిమ్మీ షెర్గిల్) ‘హల్చుల్’ సినిమా చిత్రీకరణలో కలుసుకున్న కాజోల్, అజయ్ 1999లో వివాహం చేసుకొని ఒకటయ్యారు. వీరిద్దరూ గుండరాజ్, ఇష్క్, దిల్ క్యా కరే, రాజు చాచా, ప్యార్తో హోనా హి థా పలు సినిమాల్లో నటించారు. ఈ జంటకి 2003లో కుమార్తె నైసా, 2010లో కుమారుడు యుగ్ జన్మించారు. View this post on Instagram Feels like it’s been twenty two years since the lockdown began. #FridayFlashback @kajol A post shared by Ajay Devgn (@ajaydevgn) on May 8, 2020 at 6:19am PDT ది బిగ్ బుల్, మైదాన్, సూర్యవంశీ, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియాతో పాటు మరో రెండు చిత్రాల్లో ఆజయ్ దేవగన్ ప్రస్తుతం నటిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా పలు చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అదేవిధంగా చివరగా ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ సినిమాలో అజయ్ దేవ్గన్ కనిపించారు. కాజోల్ చివరగా ప్రియాంక బెనర్జీ షార్టుఫిల్మ్ ‘దేవి’లో కనిపించారు. అదేవిధంగా ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ సినిమాలో సావిత్రిబాయి మలుసారే పాత్రలో కాజోల్ అజయ్‌దేవగన్‌కి భార్యగా నటించిన విషయం తెలిసిందే. -
వైరలైన కాజోల్ మెహందీ ఫంక్షన్ ఫొటో!
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ మెహందీ ఫంక్షన్‌కు సంబంధించిన ఓ ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫొటో వైరలయ్యేంతలా అందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్. 1991లో జరిగిన ఈ మెహందీ ఫంక్షన్‌కు భార్య గౌరీఖాన్, కుమారుడ్ ఆర్యన్లతో కలిసి హాజరయ్యారాయన. కాజోల్ చేతికి గోరింటాకుతో సోఫాలో కూర్చుని ఉండగా ఆమె వెనకాల కుమారుడు ఆర్యన్‌తో షారుఖ్, అతడి పక్కన గౌరీ ఉన్నారు. కిరణ్ ఎస్ఆర్కే ఫ్యాన్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాదారుడు ఈ ఫొటోను షేర్ చేశాడు. దీంతో ఇరువురి ఫ్యాన్క్లబ్లకు చెందిన అభిమానులు ఈ ఫొటోను చూసి మురిసి పోతున్నారు. (పది మిలియన్ ఫాలోవర్స్ క్లబ్లో కాజోల్) కాగా, షారుఖ్, కాజోల్‌లు కలిసి నటించిన పలు చిత్రాలు ఆల్‌టైం బ్లాక్ బ్లాస్టర్లుగా నిలిచిన సంగతి విధితమే. వీరు నటించిన 1995 ‘దిల్ వాలే దుల్షేనియా లేజాయేంగే’ ఓ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఈ చిత్రం ముంబైలోని మరాఠా మందిర్ సినిమా హాల్లో ఇప్పటికీ ఆడుతూనే ఉండటం గమనార్హం. వీరు చివరగా కలిసి నటించిన సినిమా రోహిత్ శెట్టి ‘దిల్వాలే’. -
పది మిలియన్ ఫాలోవర్స్ క్లబ్లో కాజోల్
-
పది మిలియన్ ఫాలోవర్స్ క్లబ్లో కాజోల్
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన సినిమా విషయాలు, భర్త అజయ్ దేవగన్‌తో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా కాజోల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పది మిలియన్ల ఫాలోవర్స్ మార్క్ చేరుకున్నారు. ఇక దీనిపై స్పందించిన కాజోల్.. ‘వెండితెరపై, సోషల్‌మీడియాలో అభిమానులు చూపిన ప్రేమకు కృతజ్ఞతలు’ అని కామెంట్ చేశారు. అదే విధంగా 2001లో తను నటించిన ‘కభీ ఖుషీ కభీ గమ్’ చిత్రానికి సంబంధించిన బాంగ్రా డాన్స్ వీడియోను కాజోల్ జత చేశారు. ఆ చిత్రంలో అంజలీ అనే పాత్రలో కాజోల్ నటించిన విషయం తెలిసిందే. చత్రపతి శివాజీ సైన్యాన్ని ముందుండి నడిపించిన మరాఠా వీరుడు తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’. ఈ మూవీలో మరాఠా యోధుడిగా నటించిన అజయ్ దేవ్‌గన్‌కి సతీమణి పాత్రలో కాజోల్ నటించారు. -
కాజోల్, నైసా బాగున్నారు: అజయ్ దేవ్‌గణ్
ముంబై: తన భార్య కాజోల్, కుమార్తె నైసా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో అవాస్తవాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కోవిబడ్-19 నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెలబ్రిటీలంతా ఇంట్లోనే గడుపుతూ కుటుంబంతో కలిసి ఖాళీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. (తరచూ గర్భస్రావం.. వేదనకు గురయ్యాం: నటి) ఈ క్రమంలో కాజోల్ సైతం తన ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కాజోల్, ఆమె కూతురు నైసా ముంబై ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. సింగపూర్‌లో విద్యనభ్యసిస్తున్న నైసాను రిసీవ్ చేసుకోవడానికి కాజోల్ అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో నైసా ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారని.. కాజోల్కు కూడా ప్రమాదం పొంచి ఉందంటూ వదంతులు వ్యాపించాయి. ఈ రూమర్లపై స్పందించిన అజయ్.. ‘‘మీరు ఈ విషయం గురించి అడుగుతున్నందుకు ధన్యవాదాలు. కాజోల్, నైసా బాగున్నారు. వారి ఆరోగ్యం గురించి ప్రచారం అవుతున్న పుకార్లు అవాస్తవాలు. నిరాధారమైనవి’’అని ట్విటర్లో స్పష్టం చేశారు. కాగా హల్చల్, గూండారాజ్, ఇష్క్, దిల్ క్యా కరే, రాజూ చాచా, ప్యార్ తో హోనా హై థా వంటి సినిమాల్లో కలిసి నటించిన కాజోల్- అజయ్.. 1999లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కూతురు నైసా, కుమారుడు యుగ్ సంతానం. Thank you for asking. Kajol & Nysa are absolutely fine. The rumour around their health is unfounded, untrue & baseless🙏 — Ajay Devgn (@ajaydevgn) March 30, 2020 -
'సంపాదన' ఆడవాళ్ల పని కూడా
బాలీవుడ్ నటి కాజోల్ కూతురు నైసా. పదహారేళ్లు. కొడుకు యుగ్. తొమ్మిదేళ్లు. ఇక చూడండి. ఈ ఏజ్ పిల్లలు ఇంట్లో ఉంటే.. అదీ అక్కా తమ్ముడో, అన్నా చెల్లెలో అయి ఉంటే.. ఇంట్లో ప్రతి క్షణమూ ఒక కోర్టు సీనే. సాధారణంగా ఇలాంటి కేసుల్లో తల్లే న్యాయమూర్తి. తండ్రి.. కేసు వదిలేసుకున్న జడ్జిలా మౌనంగా బయటికి వెళ్లిపోతాడు. కాజోల్ ఇంట్లో తమ్ముడి మీద అక్క ఫిర్యాదులు తక్కువే. అక్కను ఏదో ఒకటి అని విసిగించడం మాత్రం తమ్ముడికి డైలీ రొటీన్. ‘అక్కరా.. నీకన్నా పెద్దదిరా..’ అన్నా.. వింటాడా యుగ్! ‘ఆడవాళ్లు ఆడవాళ్లలా ఉండాలి’ అంటాడు! ‘ఆడా మగా ఏంట్రా.. అక్క చేసే పనులన్నీ నువ్వూ చెయ్యాల్సిందే’ అంటారు కాజోల్. అంతే.. ముఖం మాడ్చుకుని వెళ్లిపోతాడు. కాజోల్ నిన్న ఒక ఇంటర్వ్యూలో.. ఈ సంగతే చెప్తూ.. ఇంటి పని ఎలాగైతే ఆడవాళ్ల పని మాత్రమే కాదో, అలాగే బయటికి వెళ్లి సంపాదించడం కేవలం మగాళ్ల పని మాత్రమే కాదు’ అన్నారు. పేరెంట్స్ ఈ విషయం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పగలిగితే.. సమాజంలో స్త్రీ పురుష సమానత్వం దానంతట అదే వచ్చేస్తుందని అని కూడా చెప్పారు. -
తొమ్మిదిమంది మహిళలు ఒకే గదిలో
ఏదైనా సరే, షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండాలి.. సాగదీసే వ్యవహారాలు అస్సలు గిట్టవు. ఇదీ ప్రస్తుత జనరేషన్ పరిస్థితి. ఏం చెప్పాలనుకున్నా, ఎంత చెప్పాలనుకున్నా తక్కువ సమయంలో చెప్పేయాలి. అదీ ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది. దీన్ని సినీ తారలు కూడా ఫాలో అవుతున్నారు. అందుకే కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తామని గిరిగీసుకోవట్లేదు. అవకాశాలు వస్తే ప్రయోగాలు చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోహీరోయిన్లుగా ఎదిగిన చాలామంది బుల్లితెరపై హడావుడి చేస్తున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకు వెళ్లి వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్‌లోనూ వారి సత్తా చాటుతున్నారు. (ముగ్గురికి హెల్ప్ చెయ్యండి. వారిలో ఒక్కొక్కరినీ మరో ముగ్గురికి సాయం చెయ్యమనండి) ఈ క్రమంలో తొమ్మిది మంది సీనియర్ నటీమణులతో హిందీలో ఓ షార్ట్ ఫిల్మ్ రానుంది. కాజోల్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నేహా ధూపియా, నీనా కులకర్ణి, శృతీహాసన్, ముక్తా బావ్రే, రామా జోషీ, శివానీ రఘువంశీ, సంధ్య మాట్రే, రసశ్విని దయమ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియాంకా బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్‌కు ‘దేవి’ అని నామకరణం చేశారు. సోమవారం ఈ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ విడుదలైంది. ఇందులో భిన్న నేపథ్యాలకు చెందిన తొమ్మిది మంది మహిళలు ఒకే గదిలో ఉన్నారు. అయితే దానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. ఇక రెండు కొప్పులు ఒక్కచోట ఉండలేవు అన్న చందంగా విభిన్న మనస్తత్వం గల వీళ్లు ఒకరిపై ఒకరు పోట్లాటకు దిగుతున్నారు. దీంతో వారికి సర్దిచెప్తూ మధ్యవర్తిత్వ పాత్రను పోషిస్తోంది కాజోల్. (షార్ట్ ఫిల్మ్‌లో శృతీహాసన్) తొమ్మిది మంది మహిళలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్లను ఎందుకు ఒకే గదిలో నిర్భందించారు? ఎవరు ఈ పని చేసుంటారు? అన్న విషయాలపై క్లారిటీ రావాలంటే మార్చి 2 వరకు ఆగాల్సిందే. ఈపాటికే విడుదలైన ట్రైలర్ అద్భుతంగా ఉందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది నటులను ఒకేసారి చూడటం నిజంగా కనుల విందేనని కామెంట్లు చేస్తున్నారు. దుర్గాదేవి తొమ్మిది అవతారాలను స్ఫూర్తిగా తీసుకుని, వాటి తత్వాలను తెలియజెప్పే పాత్రలేమోనంటూ కొందరు దేవీ సినిమా కథపై వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఏదేతైనేం, టైటిల్ పేరే ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటే ఇక స్టోరీ ఇంకెంత శక్తిమంతంగా ఉంటుందో చూడాలి. (హైదరాబాద్ షార్ట్‌ఫిల్మ్‌కు అంతర్జాతీయ అవార్డు) -
దీన్ని సెల్ఫీ అంటారా?
బాలీవుడ్ కపుల్ అజయ్ దేవ్గన్, కాజోల్ రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఒకరిపై మరొకరు అవాక్కులు చవాక్కులు పేల్చుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇక వీరిద్దరూ కలిసి దాదాపు పదేళ్ల తర్వాత కలిసి నటించిన చిత్రం ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’. ఇది బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. కాగా సోమవారం వీరి పెళ్లిరోజు కావడంతో కాజోల్ భర్తను సెల్ఫీ తీయమని అడిగింది. భార్య అడిగాక భర్త కాదంటాడా? ఓస్.. అదెంత పని అంటూ అజయ్ ఫోన్ చేతిలోకి తీసుకుని.. సతీమణిని మెట్లపై కూర్చోమన్నాడు.(కార్లలోనే ఎక్కువ జీవితం గడిపాం: కాజోల్) వెంటనే కాజోల్ హుషారుగా వెళ్లి మెట్లపై కూర్చుని ఫొటోకు పోజిచ్చింది. తీరా అజయ్.. భార్యను మాత్రమే క్లిక్‌మనిపించాడు. దీంతో బుంగమూతి పెట్టిన కాజోల్ ‘సెల్ఫీ అంటే నన్ను ఒక్కదాన్నే తీయమని కాదు.. మనమిద్దరం కలిసి ఒకే ఫ్రేములో కనిపించడం’ అని క్లాస్ పీకింది. ఇక ఈ విషయాన్ని ఫొటోతో సహా ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకిచ్చింది. వీరి చిలిపి చేష్టలకు అభిమానులు స్పందిస్తూ ‘ఫొటోలో కనిపించకపోతేనేం.. నీ కళ్లలో కనిపిస్తున్నాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలా అని అజయ్‌కు సెల్ఫీ తీయడం రాదేమోనని తేలికగా తీసిపారేయకండి. పండుగలు, పబ్బాలు, ఫ్యామిలీ ట్రిప్.. ఇలా చాలాసార్లు అతనూ సెల్ఫీలు క్లిక్‌మనిపించాడు. కాగా వీళ్లిద్దరూ నాలుగేళ్ల ప్రేమ ప్రయాణం అనంతరం పెద్దల అంగీకారంతో 1999లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి నైసా, యగ్ అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. (‘మైదాన్’ ఫస్ట్‌లుక్ పోస్టర్ వచ్చేసింది) -
షార్ట్ అండ్ స్ట్రాంగ్!
గాయనిగా, నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా, సంగీత దర్శకురాలిగా తనలోని విభిన్నమైన కోణాలను ప్రేక్షకులకు చూపించారు శ్రుతీహాసన్. ఇప్పుడు మరో మీడియమ్‌లోకి అడుగుపెడుతున్నట్టు తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన శ్రుతీహాసన్ తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటీమణులు కాజోల్, నేహా ధూపియా, నీనా కులకర్ణి అలాగే ముక్తా బావ్రే, రామా జోషీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రియాంకా బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్‌కు ‘దేవి’ అని టైటిల్ పెట్టారు. శక్తిమంతమైన సందేశంతో షార్ట్ అండ్ స్ట్రాంగ్‌గా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందుతోందని సమాచారం. ‘‘నా తొలి షార్ట్ ఫిల్మ్‌ను ఇంత మంది ప్రతిభ కలిగిన నటీమణులతో కలసి చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. -
అదే గొప్ప ఆస్తి: కాజోల్
బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ దేవగన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 20 ఏళ్ల ఛాలెంజ్ పేరిట ఓ ఫొటోను షేర్ చేశారు. 20 ఏళ్ల క్రితం నాటి ఫొటోతో పాటు, తన తాజా చిత్రాన్ని గ్రాఫిక్స్ ఇంటర్ చేంజ్ ఫార్మాట్లో ఇన్‌స్టాలో షేర్ చేశారు ఈ 45 ఏళ్ల నటి. సోమవారం షేర్ చేసిన ఈ పోస్టులో ఒకటి 1999 నాటిది అయితే మరొకటి గతేడాదికి చెందినది. ఒకే రకం స్టైల్లో పోజ్‌లో ఉన్న ఈ ఫొటోలకు.. "మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయమే మీ గొప్ప ఆస్తి’ అనే క్యాప్షన్‌ను కాజోల జతచేశారు. ఇక ఆమె పోస్టుకు ఫిదా అయిన అభిమానులు.. ‘అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉన్నారు.. మీ అందం ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.(తరచూ గర్భస్రావం.. వేదనకు గురయ్యాం: నటి) View this post on Instagram Whatever makes you weird is probably your greatest asset! - Albert Einstein #20YearChallenge #WeirdThenWeirdNow A post shared by Kajol Devgan (@kajol) on Jan 20, 2020 at 6:05am PST ఇక కాజోల్ దాదాపు 10 ఏళ్ల తర్వాత తన భర్త అజయ్ దేవగన్‌తో కలిసి నటించిన చిత్రం ‘తాన్హాజీ’. హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కాజోల్, అజయ్ దేవగన్, సైఫ్ అలీఖాన్‌లు కీలక పాత్రలో నటించారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్స్‌ఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. -
ఆరు రోజుల్లో రూ. 107 కోట్లు.. థాంక్యూ!
మరాఠా యోధుడు తాన్హాజీ మలుసరే జీవితం ఆధారంగా అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ . శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరి సత్తా చాటింది. నిలకడగా వసూళ్లు రాబడుతున్న తాన్హాజీ.. త్వరలోనే రూ. 150 కోట్లు సాధించే దిశగా దూసుకుపోతోందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘తాన్హాజీ’ సినిమాను విజయవంతం చేసినందుకు హీరో అజయ్ దేవగణ్ ప్రేక్షకులకు కృతఙ్ఞలు తెలిపాడు. ఈ మేరకు సినిమా కలెక్షన్లతో కూడిన పోస్టర్‌ను ట్విటర్లో షేర్ చేసిన అజయ్... ‘ ఇంతటి విజయానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, మద్దతు, ప్రశంసలను అందుకోవడం గౌరవంగా భావిస్తున్నా’ అని ఆనందం వ్యక్తం చేశాడు. చదవండి: తరచూ గర్భస్రావం.. వేదనకు గురయ్యాం: కాజోల్ కాగా దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమాలో అజయ్ దేవగణ్, ఆయన భార్య కాజోల్ రీల్ లైఫ్ భార్యాభర్తలుగా కనిపించారు. ఓం రౌత్ దర్శకత్వంలో అజయ్ దేవ్‌గణ్ ఫిల్మ్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. ఇక తాన్హాజీతో పాటు అదే రోజు విడుదలైన దీపికా పదుకొనే సినిమా ఛపాక్ మాత్రం వసూళ్లలో వెనకబడిపోయింది. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఛపాక్.. ఆరు రోజుల్లో కేవలం రూ. 26 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇదిలా ఉండగా.. ఛపాక్ విడుదలకు ముందు దీపిక.. ఢిల్లీలోని జేఎన్‌యూను సందర్శించడం వసూళ్లపై ప్రభావం చూపిందని విశ్లేషకులు అంటున్నారు. ఇక దీపిక సినిమాకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు పన్ను మినహాయింపు ప్రకటించగా.. అజయ్ తాన్హాజీకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ వెసలుబాటు కల్పించింది. తాన్హాజీ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి Thanks to each and everyone for making this happen! I'm humbled & grateful for all the love, support & appreciation for #TanhajiTheUnsungWarrior 🙏@itsKajolD #SaifAliKhan @omraut @itsBhushanKumar @SharadK7 @ADFFilms @TSeries @TanhajiFilm pic.twitter.com/QmHmJ5zBaZ — Ajay Devgn (@ajaydevgn) January 16, 2020 -
తన్హాజీ.. కలెక్షన్ల తుఫాన్!
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ హీరోగా తెరకెక్కిన పిరియడ్ డ్రామ ‘తన్హాజీ : ది అన్సంగ్ వారియర్’. బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణిస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లో ఏకంగా రూ. 61.7 కోట్లు వసూలు చేసింది. మరాఠా యోధుడి కథ కావడంతో మహారాష్ట్రలో అద్భుతంగా వసూళ్లు రాబడుతున్న ఈ మూవీ... ఇటు మెట్రో నగరాల్లోని మల్టిప్లెక్స్‌ల్లో, మాస్ థియేటర్లలో సత్తా చాటుతోంది. శుక్రవారం తొలిరోజు రూ. 15.10 కోట్లు, శనివారం రూ. 20.57 కోట్లు రాబట్టిన తన్హాజీ.. ఆదివారం మరింతగా పుంజుకొని రూ. 26.08 కోట్లు రాబట్టిందని, మొత్తంగా రూ. 61.75 కోట్లను ఈ సినిమా మూడోరోజుల్లో రాబట్టిందని ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఓం రౌత్ దర్శకత్వంలో అజయ్ దేవ్గన్ ఫిల్మ్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యాధ్యక్షుడైన తన్హాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1670లో జరిగిన సింహగఢ్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఈ మరాఠా యోధుడి పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తుండగా, ఆయన భార్య సావిత్రిబాయి ములుసరేగా కాజోల్ నటించారు. విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. 3డీ టెక్నాలజీలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. -
తరచూ గర్భస్రావం.. వేదనకు గురయ్యాం: నటి
ముంబై: పదేళ్ల తర్వాత మరోసారి వెండితెరపై భర్యాభర్తలుగా కనిపించబోతున్నారు బాలీవుడ్ జంట కాజోల్- అజయ్ దేవ్‌గణ్. ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరాఠా అధినేత ఛత్రపతి శివాజీ సామ్రాజ్యంలో సుబేదార్‌గా పనిచేసిన మరాఠా యోధుడు తానాజీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న కాజోల్.. సోషల్ మీడియా బ్లాగ్ హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో తన ప్రేమకథ, పెళ్లి గురించి చెప్పుకొచ్చారు. తానూ, అజయ్ నాలుగేళ్ల పాటు ప్రేమలో మునిగితేలామని.. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత పెద్దల అనుమతితో ఒక్కటమయ్యామని తెలిపారు. చాలా రోజులపాటు హనీమూన్ ఎంజాయ్ చేద్దామనుకుంటే.. అజయ్ అనారోగ్యం బారిన పడటంతో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చిందంటూ చిలిపి సంఘటనలను గుర్తుచేసుకున్నారు. అలా మొదలైంది.. ‘25 ఏళ్ల క్రితం హల్చల్ సినిమా సెట్లో మేం కలుసుకున్నాం. షాట్ రెడీ అనగానే.. నా హీరో ఎక్కడ ఉన్నాడు అడిగాను. అక్కడున్న వాళ్లు అజయ్ వైపు చూపించారు. ఓ మూలన గంభీరంగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్న హీరోను అప్పుడే చూశాను. తర్వాత మాటలు కలిపాం. మంచి స్నేహితులమయ్యాం. నిజానికి నేను అప్పుడు వేరే అబ్బాయితో డేటింగ్లో ఉన్నాను. అతడి గురించి అజయ్‌కు అప్పుడప్పుడు చాడీలు చెప్పేదాన్ని. కొన్నాళ్ల తర్వాత బ్రేకప్ అయ్యింది. ఒకరి గురించి ఒకరం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నేను అజయ్ చేతిని పట్టుకున్నాను. చిత్రమేమిటంటే మేం ఎప్పుడూ ఒకరికొకరం ప్రపోజ్ చేసుకోలేదు. కార్లలోనే ఎక్కువ జీవితం గడిపాం! మా ప్రేమ ప్రయాణంలో ఎక్కువ జీవితం కార్లలోనే గడిపాం. తరచుగా డిన్నర్లు, లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్లేవాళ్లం. నేనేమో దక్షిణ బాంబేలో.. తను జుహులో. తనతో కలిసి వెళ్తున్న ప్రతీసారీ నా స్నేహితులు నన్ను హెచ్చరించేవారు. కానీ తను నాతో ఎంతో మర్యాదగా ప్రవర్తించేవాడు. సరదాగా ఉండేవాడు. అలా నాలుగేళ్లు ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత మా పెద్దలకు చెప్పాం. అజయ్ తల్లిదండ్రులు వెంటనే సరే అన్నారు గానీ.. మా నాన్న మాత్రం ముందు కెరీర్ మీద దృష్టి పెట్టమని సూచించారు. అయితే నేను మాత్రం పట్టు వదలకపోవడంతో ఆయన కూడా అంగీకరించారు. పూజారికి లంచం ఇవ్వబోయాడు.. మేము ఎంతగానో ఎదురుచూసిన పెళ్లిరోజు రానే వచ్చింది. పంజాబీ, మరాఠీ సంప్రదాయాల్లో మా వివాహం జరిగింది. అగ్నిహోత్రం చుట్టూ తిరిగేటప్పుడు అజయ్.. పూజారిని వేగిరపెట్టాడు. తంతు తొందరగా పూర్తి చేయాలంటూ లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడు. అలా పెళ్లి జరిగిపోయింది. తర్వాత హనీమూన్ ట్రిప్‌లో భాగంగా సిడ్నీ, హవాయి, లాస్ ఏంజెల్స్ చుట్టివచ్చాం. ఇంకో ఐదు వారాల పాటు ట్రిప్ కొనసాగాల్సింది. ఈజిప్టు కూడా వెళ్లాలనుకున్నాం. కానీ అజయ్ ఆరోగ్యం పాడవడంతో..‘ బేబీ.. నాకు తర్వాతి ఫ్లైట్ బుక్ చెయ్యి.. వెళ్లిపోతా’ అని ముఖం పెట్టాడు. అంతే వెంటనే తిరిగి వచ్చేశాం అంటూ కాజోల్ తమ మధురు ఙ్ఞాపకాల గురించి చెప్పుకొచ్చారు.(తాన్హాజీ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) తరచూ గర్భస్రావాలు.. వేదనకు గురయ్యాం పెళ్లైన వెంటనే తాము పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నామని... అయితే వరుసగా గర్భస్రావాలు కావడంతో తీవ్ర వేదనకు గురయ్యామని కాజోల్ పేర్కొన్నారు. కొన్నాళ్ల తర్వాత నైసా జన్మించిందని.. ఆ తర్వాత యుగ్ కూడా రావడంతో తమ కుటుంబం పరిపూర్ణమైందని హర్షం వ్యక్తం చేశారు. తర్వాత అజయ్ సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టాడని.. తను ఇప్పుడు ‘సెంచరీ’ కొట్టబోతున్నాడని(వందో సినిమాలో నటిస్తున్నాడని) చెప్పుకొచ్చారు. తనతో జీవితం తృప్తిగా ఉందని.. హనీమూన్‌లో అజయ్ తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు... తనను తొందరగా ఈజిప్టు ట్రిప్‌నకు వెళ్లమని పోరు పెడుతున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. కాగా హల్చల్ సినిమా తర్వాత గూండారాజ్, ఇష్క్, దిల్ క్యా కరే, రాజూ చాచా, ప్యార్ తో హోనా హై థా వంటి సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. 1999లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు కూతురు నైసా, కుమారుడు యుగ్ సంతానం. View this post on Instagram “We met 25 years ago, on the sets of Hulchul–I was ready for the shot & asked, ‘Where’s my hero?’ Someone pointed him out–he was broodily sitting in a corner. So 10 minutes before I met him, I bitched about him! We began talking on set & became friends. I was dating someone at the time & so was he–I’ve even complained about my then boyfriend to him! Soon, we both broke up with our significant others. Neither of us proposed–it was understood that we were to be together. It went from hand-holding to a lot more before we knew it! We used to go for dinners & so many drives–he lived in Juhu & I, in South Bombay, so half our relationship was in the car! My friends warned me about him–he had quite a reputation. But he was different with me–that’s all I knew. We’d been dating for 4 years, when we decided to get married. His parents were on board, but my dad didn’t talk to me for 4 days. He wanted me to focus on my career, but I was firm & he eventually came around. Again, there was no proposal–we just knew we wanted to spend our lives together. We got married at home & gave the media the wrong venue–we wanted it to be our day. We had a Punjabi ceremony & a Marathi one! I remember, during the pheras Ajay was desperately trying to get the pandit to hurry up & even tried to bribe him! I wanted a long honeymoon–so we travelled to Sydney, Hawaii, Los Angeles… But 5 weeks into it, he fell sick & said, ‘Baby, book me on the next flight home!’ We were supposed to do Egypt, but we cut it short. Over time, we began planning to have kids. I was pregnant during K3G, but had a miscarriage. I was in the hospital that day–the film had done so well, but it wasn’t a happy time. I had another miscarriage after that–it was tough. But eventually it worked out–we had Nysa & Yug & our family’s complete. We’ve been through so much–we’ve formed our own company, Ajay’s on his 100th film & every day we’re building something new. Life with him is content–we’re not too romantic or anything–we care for each other. If I’m thinking idiotic things, it’ll come out of my mouth without a filter & vice versa. Like right now I’m thinking that he owes me a trip to Egypt!” A post shared by Humans of Bombay (@officialhumansofbombay) on Jan 8, 2020 at 4:25am PST -
ఐదుగురు గర్ల్‌ఫ్రెండ్స్... కానీ నేను వర్జిన్!
హిందీ బిగ్‌బాస్ సీజన్-13కు బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ‘తాన్హాజీ’ మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ వీకెండ్‌కు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, ఆయన భార్య, హీరోయిన్ కాజోల్‌లు ముఖ్య అతిథులుగా సల్మాన్‌తో కలిసి సందడి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులో అజయ్, సల్మాన్‌లు ట్రూత్ అండ్ డేర్ గేమ్ చేర్లో కూర్చోగా వారికి కాజోల్ ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో కాజోల్, సల్లు భాయ్‌ని.. ‘మీకు అయిదుగురి కంటే తక్కువ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారా లేదా?’ అని ప్రశ్నించారు. దానికి అజయ్ మధ్యలో కలుగజేసుకుని.. ‘ఓకే సమయంలోనా లేదా తన జీవితం మొత్తంలోనా?’ అని అడిగాడు. దీనికి సల్మాన్.. ‘నీకు తెలుసా నా జీవితం మొత్తంలో నాకు అయిదుగురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు’ అని సమాధానం ఇచ్చాడు. .@ajaydevgn aur @itsKajolD lagaane aa rahe hai #Tanhaji ka tadka on #WeekendKaVaar. Watch it tonight at 9 PM. Anytime on @justvoot @vivo_india @beingsalmankhan #BiggBoss13 #BiggBoss #BB13 #SalmanKhan pic.twitter.com/Ut4Op2YSto — Bigg Boss (@BiggBoss) January 4, 2020 అయితే ఓ ఇంటర్యూలో తాను వర్జీన్ అని చెప్పిన భాయిజాన్‌ను అజయ్ ఆటపట్టిస్తుంటే.. ‘ అవును.. అది నిజమే ఎందుకంటే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా’ అని చెప్పాడు. దానికి కాజోల్.. ‘ఇది పచ్చి అబద్ధం. నేను అస్సలు నమ్మను. ఈ మెషీన్ కూడా నీ సమాధానాన్ని స్వీకరించట్లేదు’ అంటూ సల్మాన్‌ను ఆటపట్టించారు. అంతేగాకుండా ‘నువ్వు పెళ్లి ఎప్పుడూ చేసుకుంటావు’ కాజోల్ సల్మాన్‌ను ప్రశ్నించగా.. ‘దానికి ఇంకా చాలా సమయం ఉంది’ అని ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సమాధానం ఇచ్చాడు. -
బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్తే చంపేస్తాడు: కాజోల్
సాధారణంగా అబ్బాయిలు తల్లికి అతుక్కుపోతే అమ్మాయిలు తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ బాలీవుడ్ స్టార్ జంట అజయ్ దేవ్గన్, కాజోల్ జోడీ విషయంలో ఇది కాస్త తారుమారైనట్టు కనిపిస్తోంది. తాజాగా కాజోల్ ఓ షోలో మాట్లాడుతూ.. తన పదహారేళ్ల కూతురు నైసా ఏ విషయాన్నైనా తనతో చెప్పుకోడానికే ఇష్టపడుతుందని తెలిపింది. తనకు ఎదురయ్యే సమస్యలను కానీ, బాయ్‌ఫ్రెండ్స్ గురించి కానీ తండ్రి దగ్గర అసలు ప్రస్తావించదని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఆ మరుక్షణమే అజయ్ తుపాకీ పట్టుకుని బయలుదేరుతాడంది. కొడుకు యగ్ మాత్రం చిన్న సలహాకైనా తండ్రి దగ్గరికే పరుగెత్తుకెళ్తాడని పేర్కొంది. అజయ్ ఆవేశపడుతాడు కానీ పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడంది. ఇక పేరెంటింగ్ గురించి మాట్లాడుతూ తాను పిల్లలను ఎప్పుడూ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూడలేదని, ఓ పరిధి మేరకు వారే స్వంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తానంది. కాగా ‘గూండా రాజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో అజయ్ దేవ్గన్, కాజోల్ మధ్య ప్రేమ చిగురించగా 1999లో ఫిబ్రవరి 24న పెళ్లిబంధంతో వాళ్లిద్దరూ ఒక్కటైన విషయం తెలిసిందే. -
‘శ్రీదేవి : ది ఎటర్నల్ స్క్రీన్ గాడెస్’
సాక్షి, న్యూఢిల్లీ : అతిలోక సుందరి శ్రీదేవి జీవిత చరిత్ర ఇక పుస్తక రూపంలో రానుంది. ‘శ్రీదేవి : ది ఎటర్నల్ స్క్రీన్ గాడెస్’ అనే టైటిల్‌తో ప్రముఖ రచయిత సత్యార్థ్ నాయక్ ఈ పుస్తకాన్ని రచించారు. పెంగ్విన్ ఇండియా సంస్థ ఈ పుస్తకాలను ప్రచురించింది. ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ కథా నాయిక దీపికా పదుకొనె, శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనికపూర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుసక్తానికి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ముందు మాట రాయడం విశేషం. ‘ఐకాన్ శ్రీదేవిగారి నటనా జీవితం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం. ఆమె సినిమాలను చూస్తూ పెరిగాను. నటనలో ఆమె ఒక ఇన్సిస్టిట్యూట్.. ఆమె పుస్తకానికి ముందుమాట రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’అంటూ కాజోల్ ట్వీట్ చేశారు. శ్రీదేవి చిన్నతనం నుండి స్టార్ హీరోయిన్గా ఎదిగే వరకు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను రచయిత సత్యార్థ్ నాయక్ ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ కార్యక్రమానికి శ్రీదేవి భర్త బోనీ కపూర్ హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మరాఠా యోధుడి భార్యగా కాజోల్
చత్రపతి శివాజీ సైన్యాన్ని ముందుండి నడిపించిన మరాఠా వీరుడు తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’. ఇందులో మరాఠా యోధుడిగా అజయ్ దేవ్గన్, ఆయన సతీమణి పాత్రలో కాజోల్ నటిస్తున్నారు. 2008లో ‘యు మీ ఔర్ హమ్’ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది. ఓమ్రత్ దర్శకత్వం వహిస్తుండగా టీసీరిస్తో కలిసి అజయ్ దేవ్గన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరాఠా వీరుడి పత్ని సావిత్రిబాయి మలుసరేగా కాజోల్ ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. మరాఠా మహిళ పాత్రలో ఒదిగిపోయిన కాజోల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఉదయ్ సింగ్ రాథోడ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. ఓంకార్ చిత్రం తర్వాత అజయ్ దేవ్గన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటిస్తున్న చిత్రమిది. మొదట సినిమా పేరును తానాజీగా ప్రకటించిన చిత్రబృందం న్యూమరాలజీ ప్రకారం తాన్హాజీగా మార్చింది. ఈ చిత్ర ట్రైలర్‌ను రేపు(నవంబర్ 19న) రిలీజ్ చేయనున్నారు. కాగా తాన్హాజీ చిత్రంతో అజయ్ దేవ్గన్ సెంచరీ పూర్తి చేసుకోనున్నారు. ఈ చారిత్రాత్మక చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
శ్రీదేవి ఒక యాక్టింగ్ స్కూల్
‘‘శ్రీదేవి స్టార్‌డమ్‌ని, తన మ్యాజిక్‌ని సిల్వర్ స్క్రీన్ మీద చూస్తూనే పెరిగాను. శ్రీదేవి ఒక యాక్టింగ్ స్కూల్. ఎప్పటికీ నా ఫేవరెట్ ఐకాన్’’ అని శ్రీదేవి మీద తనకున్న అభిమానాన్ని చెప్పుకొచ్చారు కాజోల్. చెప్పడమే కాదు శ్రీదేవి మీద రాబోతున్న ‘శ్రీదేవి : ద ఎటర్నల్ స్క్రీన్ గాడెస్’ పుస్తకానికి కాజోల్ ముందు మాట కూడా రాశారు. శ్రీదేవి జీవితాన్ని ఓ పుస్తకంగా మలిచారు రచయిత సత్యర్థ్. పెంగ్విన్ బుక్స్ సంస్థ ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకు రానుంది. శ్రీదేవి సౌత్‌లో హీరోయిన్గా స్టార్ట్ అయి బాలీవుడ్లో నెం. 1గా ఎలా ఎదిగారు? ఆమె ప్రయాణం, కుటుంబం ఇలా అన్ని విషయాలను ఆ పుస్తకంలో పొందుపరిచారు. ‘‘స్టార్ నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన శ్రీదేవి ప్రయాణాన్ని ఇండస్ట్రీ కిడ్‌గా కాజోల్ గమనించారు. అదంతా ముందు మాటలో అద్భుతంగా రాసుకొచ్చారు. తనకి స్ఫూర్తిని ఇచ్చిన నటికి ప్రేమతో రాసిన లేఖలా ఈ ముందు మాట ఉంది’’ అని పుస్తక రచయిత సత్యర్థ్ తెలిపారు. ‘‘ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ థ్యాంక్స్. ఈ అవకాశం రావడం గౌరవంగా ఉంది. ముందు మాట రాయడం ద్వారా తొలి లేడీ సూపర్‌స్టార్‌కు నా వంతు నివాళి అందించానని అనుకుంటున్నాను’’ అన్నారు కాజోల్. -
జోయాలుక్కాస్ గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్
అక్షయ తృతీయ సందర్భంగా జోయాలుక్కాస్ 'గోల్డ్ ఫార్చ్యూన్' పేరుతో ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ నటి బాలీవుడ్ ఐకాన్ కాజోల్ దేవ్‌గణ్ ఆవిష్కరించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని షోరూమ్స్‌లో అక్షయ తృతీయ 2019 కలెక్షన్స్‌ను ఆరంభించారు. అక్షయ తృతీయ సందర్భంగా జోయాలుక్కాస్ 'గోల్డ్ ఫార్చ్యూన్' ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ద్వారా బంగారం, పోల్కీ, డైమండ్ నగలు కొన్నవారికి ఉచితంగా బంగారు నాణేలను ఆఫర్ చేస్తోంది. ఇందులో భారతదేశంలోని జాయ్ అలుక్కాస్ ఔట్‌లెట్స్‌లో సంప్రదాయ నగలతో పాటు సమకాలీన ట్రెండింగ్ జ్యుయలరీ లభిస్తాయి. ‘‘అక్షయ తృతీయ అందరికీ ప్రత్యేకమైన రోజు. మా కస్టమర్లకు అదృష్టాన్ని, సంపదను అందించేందుకు మాకు మంచి అవకాశం లభించింది. అసమానమైన హస్తకళలు, విభిన్నమైన డిజైన్లతో రూపొందించిన అక్షయ తృతీయ కలెక్షన్‌తో జోయాలుక్కాస్‌పై కస్టమర్లకు ఉన్న నమ్మకం కొనసాగుతుంది. గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్లో భాగంగా నగలు కొని అదృష్టాన్ని ఇంటికి తీసుకెళ్లాలని కోరుతున్నాను’’ - శ్రీ జోయాలుక్కాస్, జోయాలుక్కాస్ సీఎండీ గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్లో రూ.50,000 కన్నా ఎక్కువ విలువైన డైమండ్, అన్‌కట్ డైమంగ్ నగలు కొన్న కస్టమర్లకు 22 క్యారెట్ల 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఉచితంగా లభిస్తుంది. రూ.50,000 కన్నా ఎక్కువ విలువైన బంగారు నగలు కొన్న కస్టమర్లు 22 క్యారెట్ల 200 మిల్లీ గ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందొచ్చు. ఈ ఆఫర్ అక్షయ తృతీయ రోజుఅనగా 2019 మే 6, 7,8 వరకు మే 8వరకు చెల్లుతుంది. అలాగే ప్రీ బుకింగ్ సదుపాయం కూడా ఉంది. జాయ్ అలుక్కాస్ రూపొందించిన అక్షయ తృతీయ కలెక్షన్‌కు బాలీవుడ్ నటి, కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ కాజోల్ దేవ్‌గణ్ ఆవిష్కరించడం విశేషం. ‘‘జాయ్ అలుక్కాస్‌లో శుభప్రదమైన అక్షయ తృతీయ కలెక్షన్ ఆవిష్కరించే అదృష్టం అభించినందుకు సంతోషంగా ఉంది. ఎక్స్‌క్లూజీవ్ డిజైన్స్ నగలు చూసి, వాటిని ధరించాలని అనిపించింది. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ప్రతీ ఒక్కరికీ ఆనందం సంపదలు కలగాలనికోరుకుంటున్నాను’’. - బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ దేవ్‌గణ్, జోయాలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్ జాయ్ అలుక్కాస్ ఔట్‌లెట్స్‌లో గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్ మే 8 వరకు కొనసాగుతుంది. ప్రీ బుకింగ్ అవకాశం కూడా ఉంది. జోయాలుక్కాస్ గ్రూప్ గురించి జోయాలుక్కాస్ గ్రూప్ వివిధ వ్యాపార ఆసక్తులు గల ఎన్నో బిలియన్ డాలర్ల అంతర్జాతీయ మిశ్రయం. గ్రూప్ తన వివిధ వ్యాదపార కార్యకలాపాల్ని యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైన్, ఓమన్, కువైట్, ఖతార్, సింగపూర్, మలేషియా, యూకే, భారత దేశాల్లో నిర్వహిస్తోంది. గ్రూప్ వ్యాపారాల్లో జ్యుయల్లరీ, మనీ ఎక్స్ఛేంజ్, ఫ్యాషన్ అండ్ శిల్క్, మాల్స్ భాగంగా ఉన్నాయి. జోయాలుక్కాస్‌కి ప్రపంచవ్యాప్తంగా 8 వేలమందికి పైగా ఉద్యోగులున్నారు. ప్రపపంచంలోనే మంచి గుర్తింపు పొందడంతో పాటు అనేక అవార్డులను కూడా దక్కించుకుంది జోయాలుక్కాస్. - అడ్వర్టోరియల్ -
జయలలిత ఎప్పటికీ బతికే ఉంటారు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో పలు చిత్రాలు తయారవుతున్నాయి. లేటెస్ట్గా దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ‘శశిలలిత’ టైటిల్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జయలలితగా కాజోల్ దేవగన్, శశికళగా అమలాపాల్ నటిస్తారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ టైటిల్‌ను శనివారం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజేపీ నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘కేవలం తమిళనాడు మాత్రమే కాకుండా మొత్తం దక్షిణాదిలో అభిమానులను సొంతం చేసుకున్నారు జయలలిత. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో విశిష్ట గుర్తింపు పొందారామె. ‘శశిలలిత’ చిత్రం రూపొందించడం అభినందనీయం. వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘జయలలిత ఎప్పటికీ ప్రజల గుండెల్లో బతికే ఉంటారు. ఆమె బాల్యం, సినీనటిగా ఎదగడం, ప్రేమ విఫలం, రాజకీయ నాయకురాలిగా ఆమె ఎదుర్కొన్న అవమానాలు, ఆమె మరణం వెనుక ఉన్న కారణం, 75 రోజులు ఆసుపత్రిలో ఉన్న సంఘటనలు ఈ సినిమాలో ప్రస్తావిస్తాం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి. కో–డైరెక్టర్ శివకుమార్, రైటర్ వెంకట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘ఎప్పటికి నువ్వే నా హృదయ స్పందన’
కాజోల్ - అజయ్ దేవగణ్‌ల గారాల తనయ నైసా నేటితో 16వ ఏట అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా కూతుర్ని ఉద్దేశిస్తూ కాజోల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘నా ప్రియమైన కూతురికి.. 16వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. తొలిసారి నిన్ను నా చేతుల్లోకి తీసుకున్న మధురమైన క్షణాల్ని.. అప్పటి నీ బరువును నేను ఎన్నటికి మర్చిపోలేను. ఎంత ఎదిగినా నువ్వే నా హృదయ స్పందన’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు కాజోల్. దాంతో పాటు కూతురుతో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. Happy 16th birthday to my sweet sweet baby. I still feel the weight of you in my arms and I don't think that will ever change. However old you grow know that you will always be my heartbeat. ❤always pic.twitter.com/oalYwv2ok8 — Kajol (@KajolAtUN) April 20, 2019 ప్రస్తుతం నైసా విద్యాభ్యాసం నిమిత్తం సింగపూర్‌లో ఉంటుంది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం నైసా పేరు ఇంటర్నెట్లో తెగ ట్రెండ్ అయ్యింది. నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ని తెగ ట్రోల్ చేశారు. ఈ విషయం గురించి అజయ్ దేవగణ్ మాట్లాడుతూ.. ‘తొలుత ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు నైసా చాలా బాధపడేది. కానీ రాను రాను వాటిని పట్టించుకోవడం మానేసింది. ఇలాంటి వాటిని ఎలా ఎదుర్కొవాలో తనకు ఇప్పుడు బాగా తెలిసింది. కొందరు పని పాటలేని వారు ప్రతిదాన్ని జడ్జ్ చేస్తూంటారనే విషయాన్ని తాను గ్రహించింది. ఇక అప్పటి నుంచి వాటిని పట్టించుకోవడం మానేసింద’ని తెలిపారు. -
ఏఎస్‌రావునగర్‌లో కాజోల్ సందడి
-
సందడి చేసిన కాజోల్
ఏఎస్‌రావునగర్: మనసుకు నచ్చే ఆభరణాలను తయారుచేసే జోయాలుక్కాస్ సంస్థ తన నూతన షోరూమ్‌ను ఏఎస్‌రావునగర్‌లో బుధవారం ప్రారంభించింది. జోయాలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్, బాలీవుడ్ సినీ నటి కాజోల్ దేవగన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ.. జోయాలుక్కాస్ ద్వారా ఆత్మీయ కలయిక గొప్ప మధురానుభూతిని ఇచ్చిందన్నారు. జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, ఎండీ జోయాలుక్కాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం తమకు ఎంతో ప్రత్యేకమైందన్నారు. జోయాలుక్కాస్ షో రూమ్‌ను ప్రారంభిస్తున్న కాజోల్ దేవగన్, చిత్రంలో జోయాలుక్కాస్, జోళి జోయాలుక్కాస్ వినియోగదారుల సహకారం, నిరంతర ప్రోత్సాహం వల్లే ఇంతటిస్థాయికి చేరుకున్నామన్నారు. 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 200 షోరూమ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి కొనుగోలుపై ఉచిత బహుమతులు అందజేస్తామన్నారు. ఈ ఆఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని వినియోగదారులు వినియోగించుకోవచ్చన్నారు. దీంతోపాటు అభరణాల ఉచిత నిర్వహణ, ఏడాది ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. జోయ్ అలుక్కాస్ డైరక్టర్ జోళి జోయ్ అలుక్కాస్, రీజనల్ మేనేజర్ రాబిన్టాంబీ, డీజీఎం పీడీ. ఫ్రాన్సస్స్, బ్రాంచ్ మేనేజర్ జీన్స్, అసిస్టెంట్ బ్రాంచి మేనేజర్ జీవై సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాజోల్‌ను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. -
స్క్రీన్ టెస్ట్
1. ‘ఈ జెండా పసిబోసి చిరునవ్వురా, దాస్య సంకెళ్లు తెంచిందిరా..’ అనే పాట మహేశ్‌బాబు నటించిన ఓ చిత్రంలోనిది. ఈ పాటలో ఓ పసిబాబు చేతిలో నుండి జాతీయ జెండా ఓ కొండపై నుండి కింద పడుతుంది. ఆ జెండా కింద పడకుండా హీరో పట్టుకునే ఈ సీన్ ఏ సినిమాలోనిది? ఎ) బాబీ బి) అతడు సి) ఖలేజా డి) ఒక్కడు 2. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన చిత్రం ‘వెలుగు నీడలు’. ఈ చిత్రంలోని ‘పాడవోయి భారతీయుడా’ పాట రచయితెవరో కనుక్కోండి? ఎ) కొసరాజు బి) ఆత్రేయ సి) శ్రీశ్రీ డి) సినారె 3. ‘తెలుగు వీర లేవరా, దీక్ష బూని సాగరా...’ అనే పాటలో నటించిన నటుడెవరో తెలుసా? ఎ) శోభన్‌బాబు బి) యన్టీఆర్ సి) అక్కినేని డి) కృష్ణ 4. ‘జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపీ గరీయశీ...’ అనే పాట రచించింది, దర్వకత్వం వహించింది ఒక్కరే. ఎవరా దర్శకుడు? ఎ) ముత్యాల సుబ్బయ్య బి) దాసరి నారాయణరావు సి) రవిరాజా పినిశెట్టి డి) కోడి రామకృష్ణ 5. ‘దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే...’ అనే పాటలో నటించిన నటుడెవరో తెలుసా? (చిన్న క్లూ: ఈ చిత్రానికి తేజ దర్శకుడు) ఎ) ఉదయ్‌కిరణ్ బి) నవదీప్ సి) ప్రిన్స్ డి) దిలీప్ రెడ్డి 6. ‘కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరుకొక్క వీధి పేరు కాదురా గాంధీ...’ పాట శ్రీకాంత్ నటించిన 100వ చిత్రం ‘మహాత్మ’ లోనిది. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ఈ దేశభక్తి గీతం సూపర్‌హిట్. ఈ పాటలో నటించిన క్యారెక్టర్ నటుని పేరేంటి ? ఎ) రామ్‌జగన్ బి) తనికెళ్ల భరణి సి) పరుచూరి గోపాలకృష్ణ డి) అజయ్ ఘోష్ 7. ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రంలోని ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి... జన్మ భూమి నాదేశం సదా స్మరామి...’ అనే పాటలో యన్టీఆర్ నటించారు. ఆ పాటను రచించింది జాలాది. సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) మణిశర్మ బి) యంయం కీరవాణి సి) రాజ్–కోటి డి) చక్రవర్తి 8. ‘వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా’ పాట ఏ చిత్రంలోనిది? (మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు). ఎ) బొంబాయి బి) రోజా సి) దిల్సే డి) దళపతి 9. ‘వందేమాతరం’ చిత్రంలోని ‘వందేమాతరం, వందేమాతరం... వందేమాతర గీతం వరస మారుతున్నది... తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది..’ అనే పాటతో శ్రీనివాస్ ఇంటి పేరు ‘వందేమాతరం’ అయింది. ఈ పాటలో నటించింది హీరో రాజశేఖర్, హీరోయిన్గా నటించింది ఎవరో తెలుసా? ఎ) విజయశాంతి బి) భానుప్రియ సి) సుమలత డి) జీవిత 10. ‘భారత మాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు’ పాట యన్టీఆర్ నటించిన ‘బడిపంతులు’ చిత్రంలోనిది. పీసీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యన్టీఆర్ మనవరాలిగా నటించిన బాల నటి ఎవరో కనుక్కోండి? (తర్వాత కాలంలో ఆమె యన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించారు) ఎ) విజయనిర్మల బి) జయసుధ సి) శ్రీదేవి డి) జయంతి 11. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా... పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీ జాతి నిండు గౌరవమూ...’ పాట ‘అమెరికా అబ్బాయి’ సినిమాలోనిది. అమెరికాలో షూటింగ్ చేసుకున్న ఈ క్రాస్ ఓవర్ సినిమాకు దర్శకుడెవరు? ఎ) బాలచందర్ బి) కె. విశ్వనాథ్ సి) సింగీతం శ్రీనివాసరావు డి) భారతీరాజ 12. ‘ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్లీ కావాలి...’ అనే పాట చిరంజీవి నటించిన ‘శంకర్‌దాదా జిందాబాద్’ చిత్రంలోనిది. ఈ దేశభక్తి గీతాన్ని సుద్దాల అశోక్‌తేజ రచించగా దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ఈ చిత్రానికి దర్శకుడెవరు? ఎ) బి. గోపాల్ బి) ప్రభుదేవా సి) జయంత్.సి. పరాన్జీ డి) వీవీ వినాయక్ 13. 1982లో విడుదలైన ‘గాంధీ’ చిత్రానికి రిచర్డ్ అటెన్‌బరో స్వీయదర్శకత్వం వహించారు. బెన్ కింగ్స్లే ‘గాంధీ’ పాత్రధారి. బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కస్తూర్బా గాంధీ పాత్రలో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి ఎవరో కనుక్కోండి? ఎ) బి) రేఖ సి) రోహిణి హట్టంగడి డి) హేమమాలిని 14. ఆంగ్లేయుల వద్ద సిపాయిగా పనిచేసిన ‘మంగల్ పాండే’ పాత్రలో నటించారు ఆమిర్‌ఖాన్. ఆ చిత్రంలో ఆయన సరసన హీరా పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసుకుందామా? ఎ) రాణీ ముఖర్జీ బి) కరిష్మా కపూర్ సి) కరీనా కపూర్ డి) అమీషా పటేల్ 15. ‘మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్...’ పాట ‘ఖడ్గం’ చిత్రంలోనిది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ముస్లిం పాత్రలో నటించి, మెప్పించిన నటుడెవరు? ఎ) శ్రీకాంత్ బి) రవితేజ సి) ప్రకాశ్‌రాజ్ డి) బ్రహ్మాజీ 16. ‘ఏ మేరా ఇండియా, ఐ లవ్ మై ఇండియా...’ పాట సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించిన ‘పరదేశ్’ చిత్రంలోనిది. ఆ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన నటించిన నటి ఎవరు? ఎ) మహిమా చౌదరి బి) ప్రీతి జింటా సి) కాజోల్ డి) కత్రినాకైఫ్ 17. సంజయ్‌దత్, అజయ్ దేవ్గన్, సైఫ్ అలీఖాన్, అర్మాన్ కోహ్లి, సునీల్ శెట్టి, సంజయ్ కపూర్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ఖన్నా.. ఇంతమంది బాలీవుడ్ హీరోలు నటించిన చిత్రం ‘ఎల్ఓసి కార్గిల్’. వారితో పాటు ఆ చిత్రంలో నటించిన తెలుగు హీరో ఎవరో తెలుసా? ఎ) ప్రభాస్ బి) నాగార్జున సి) రానా డి) వెంకటేశ్ 18. శంకర్ దర్శకత్వం వహించిన ‘భారతీయుడు’ చిత్రంలో స్వాతంత్య్ర సమర యోధుడు సేనాపతి పాత్రలో నటించారు కమల్‌హాసన్. మళ్లీ సేమ్ కాంబినేషన్లో ‘భారతీయుడు–2’ తెరకెక్కుతోంది. ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ సీక్వెల్ ప్రారంభించారో కనుక్కోండి? ఎ) 22 బి) 18 సి) 20 డి) 25 19. తెల్లదొరలపై తిరగబడ్డ తెలుగుబిడ్డ ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన చరిత్రను సినిమా గా రూపుదిద్దిన నటుడెవరో తెలుసా? (అతనే నిర్మాత, దర్శకుడు, నటుడు) ఎ) చంద్రమోహన్ బి) విజయ్ చందర్ సి) మురళీమోహన్ డి) నరేశ్ 20. చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా’. ఆంగ్లేయులను ఎదిరించిన తెలుగువాడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఇది. ఈ చిత్రంలోని ‘మైరారెడ్డి’ పాత్రను పోషిస్తున్న నటుడెవరో తెలుసా? ఎ) జగపతిబాబు బి) సుదీప్ సి) అమితాబ్ డి) విజయ్ సేతుపతి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (ఎ) 2) (సి) 3) (డి) 4) (బి) 5) (బి) 6) (ఎ) 7) (బి) 8) (బి) 9) (ఎ) 10) (సి) 11) (సి) 12) (బి) 13) (సి) 14) (ఎ) 15) (సి) 16) (ఎ) 17) (బి) 18) (ఎ) 19) (బి) 20) (ఎ) నిర్వహణ: శివ మల్లాల -
రక్షణ కవచం
-
పెళ్లి రోజు మర్చిపోయిన నటుడు..
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహిరించే ‘కాఫీ విత్ కరణ్ జోహార్’ కార్యక్రమం ఎంత పాపులరో తెలిసిన సంగతే. ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ సీజన్ 6 నడుస్తోంది. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఈ ఆదివారం జాన్వీ కపూర్, అర్జున్ కపూర్లు పాల్గొనగా వచ్చే ఆదివారం ఈ షోకి బాలీవుడ్ బెస్ట్ కపుల్ కాజోల్ - అజయ్ దేవగణ్‌లు హాజరవుతున్నారు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రోమోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రోమోల్లో అజయ్ తన భార్య కాజోల్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. కాజోల్ ఫోటోలు దిగడానికి 1 సెకను పడుతుంది. కానీ వాటిని పోస్ట్ చేయడానికి మాత్రం 3 - 4 గంటల సమయం పడుతుందన్నారు అజయ్. View this post on Instagram @kajol gets candid while @ajaydevgn stirs up the hornet's nest next Sunday on #KoffeeWithKaran! #KoffeeWithAjay #KoffeeWithKajol A post shared by Star World (@starworldindia) on Nov 25, 2018 at 8:38am PST యాక్టర్లు తరచుగా చెప్పే అబద్దం ఏంటని ప్రశ్నించగా ‘నా భార్యను ప్రేమిస్తున్నాను’ అని అజయ్ సమాధానం చెప్పడం.. వెంటనే ‘నేను కాదు మిగతా వారు’ అంటూ కవర్ చేసుకోవడం సరదాగా ఉంది. చివరకూ ‘మీ పెళ్లి రోజు ఎప్పుడ’ని అడగ్గా.. అజయ్ తడబటడం.. ఆఖరికి తప్పు సమాధానం చెప్పడం వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ప్రోమోలను మీరు కూడా చూడండి. View this post on Instagram Real life antics trump reel life drama when you're @ajaydevgn and @kajol! #KoffeeWithKaran #KoffeeWithAjay #KoffeeWithKajol A post shared by Star World (@starworldindia) on Nov 25, 2018 at 9:06am PST కాజోల్ - కరణ్ జోహార్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అయితే 2016లో అజయ్, కరణ్ జోహార్ సినిమాల విడుదల సమయంలో వచ్చిన వివాదం కారణంగా కాజోల్, కరణ్ కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత కరణ్ జోహార్‌కు కవల పిల్లలు రూహి, యాష్లు పుట్టిన తరువాత వీరిద్దరి మధ్య మాటలు ప్రారంభమయ్యాయి. బెస్ట్‌ఫ్రెండ్స్ ఇద్దరూ తెర మీద కనిపిస్తోంది ఈ ప్రోగ్రాం ద్వారానే. -
కూతురికి ప్రేమతో...
పిల్లలకు గిఫ్ట్‌లు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంటారు తల్లిదండ్రులు. సందర్భం ఉన్నా.. లేకున్నా... పిల్లలకు బహుమానాలు ఇవ్వడంలో పేరెంట్స్ ఆనందం పొందుతుంటారు. తాజాగా బాలీవుడ్ జంట అజయ్ దేవగన్, కాజోల్ కూడా తమ గారాల పట్టి నీసాకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి ఎంతో సర్ప్రైజ్ చేశారు. ఆ గిఫ్ట్ అలాంటి ఇలాంటిది కాదు.. సింగపూర్‌లో ఖరీదైన లగ్జరీ ఫ్లాట్ కావడం విశేషం. ఉన్నత చదువుల కోసం నిసా సింగపూర్‌లో ఉంటున్నారు. యునైటెడ్ వరల్డ్ కాలేజ్‌లో చదువుతున్న ఆమె ప్రస్తుతానికి కళాశాల హాస్టల్లోనే ఉంటున్నారు. అయితే తమ కూతురు హాస్టల్లో కాకుండా ఇండిపెండెంట్‌గా, సొంత ఫ్లాట్‌లో ఉండాలన్న ఉద్దేశంతో సింగపూర్‌లోని కాస్ట్లీ ఏరియా ఆర్చర్డ్ రోడ్లో ఓ లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసి, కూతురికి గిఫ్ట్‌గా ఇచ్చారట అజయ్–కాజోల్. వచ్చే ఏడాది జనవరిలో నిసా గృహప్రవేశం చేయనున్నారు. ∙ కూతురు నిసా, కొడుకు యుగ్‌తో అజయ్, కాజోల్ -
కూతురికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ కపుల్
బాలీవుడ్ స్టార్ కపుల్ అజయ్ దేవగన్, కాజోల్‌లు తమ కూతురు నీసా దేవగన్‌ను కాస్ట్లీ గిప్ట్‌తో సర్ప్రైజ్ చేశారు. కొంత కాలంగా ఉన్నత చదువుల కోసం సింగపూర్‌లో ఉంటున్న నీసాకు ఓ లగ్జరీ ఫ్లాట్‌ను బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం సింగపూర్‌లోని యునైటెడ్ వరల్డ్ కాలేజ్‌లో చదువుతోంది నీసా. ఆమె కోసం సింగపూర్‌లోని కాస్ట్లీ ఏరియా ఆర్చర్డ్ రోడ్లో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను తీసుకున్నారు అజయ్, కాజోల్. ప్రస్తుతం చదువుతున్న కాలేజ్‌లో బోర్డింగ్ ఫెసిలిటీ ఉన్నా తమ కూతురు సొంత అపార్ట్మెంట్లోనే ఉండాలన్న ఉద్దేశంతో ఈ గిఫ్ట్ ఇచ్చారట. వచ్చే ఏడాది జనవరిలో నీసా అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ కానుంది. -
‘నా పిల్లలు నా సినిమాలు చూడరు’
నా పిల్లలు నా సినిమాలు చూడరంటున్నారు బాలీవుడ్ నటి కాజోల్. ఓ టెలివిజన్ షోలో పాల్గొన్న కాజోల్ పలు ఆసరక్తికర ఆంశాల గురించి మాట్లాడారు. ‘నా పిల్లలు నా సినిమాలు అస్సలు చూడరు. అందుకు వాళ్లు చెప్పే కారణం సినిమాల్లో నేను ఎక్కువగా ఏడుస్తూ ఉంటానంట. అందుకే నా సినిమాలు చూడరు. ‘గోల్మాల్’ లాంటి సినిమాలు వాళ్లకి ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చారు కాజోల్. పిల్లల విషయంలో ఎవరూ కఠినంగా ఉంటారని అడగ్గా.. పిల్లల విషయంలో అజయ్ కాస్తా నయం. నేను మాత్రం వారిని ఎల్లప్పుడు కనిపెట్టుకునే ఉంటాను. వారికి కావాల్సిన స్వేచ్ఛను ఇస్తూనే వారిని హద్దుల్లో ఉంచుతాను. అయినా నా పిల్లలిద్దరూ చాలా మంచివారు. అమ్మ చెప్పిన విషయాలను అర్థం చేసుకుంటారు అని తెలిపారు. ‘మీ కూతురు నైసా సినిమాల్లోకి వస్తానంటే మీరు ఒప్పుకుంటారా’ అని ప్రశ్నించగా ‘కెరియర్ విషయంలో నా పిల్లల మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు. వారికి నచ్చిన రంగంలోనే వారు ఉన్నతంగా రాణించాలని కోరుకుంటాను’ అని తెలిపారు. -
కూతురే టీచర్ అయితే..
చిన్నప్పుడు పిల్లలకు అమ్మా, ఆవు అని పలక మీద దిద్దిస్తుంటారు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పుల వల్ల తల్లిదండ్రులతో డిజిటల్ పలక (ఐపాడ్, ఐఫోన్)పై కొత్త విషయాలను దిద్దిస్తున్నారు పిల్లలు. బాలీవుడ్ నటి కాజోల్ కూడా తన కూతురు దగ్గర టెక్నాలజీ పాఠాలు కొన్ని నేర్చుకున్నారట. కొన్ని వారాల పాటు కూతురి దగ్గర క్రాష్ కోర్స్ చేశారట. కాజోల్ లేటెస్ట్ సినిమా ‘హెలికాఫ్టర్ ఈల’. ఇందులో న్యూ జనరేషన్ మదర్‌గా యాక్ట్ చేశారామె. దాని కోసం కూతురి దగ్గర ఇన్స్టాగ్రామ్, ట్వీటర్ హ్యాష్ ట్యాగ్స్, చాటింగ్‌లో షార్ట్ కట్స్ నేర్చుకున్నారట. ఈ లేటెస్ట్ టెక్నికల్ షార్ట్‌కట్స్‌ను త్వరగానే నేర్చుకోగలిగారట కాజల్. ‘హెలికాఫ్టర్ ఈల’ ఈ నెల 12న రిలీజ్ కానుంది. -
లైంగిక వేధింపులు నిజమే : కాజోల్
మహిళల పట్ల లైంగిక వేధింపులు నిజమేనంటున్నారు నటి కాజోల్. అంతేకాక ఇవి కేవలం చిత్ర పరిశ్రమకే పరిమతం కాలేదని అన్ని చోట్ల జరుగుతున్నాయని తెలిపారు. తనుశ్రీ దత్తా - నానా పటేకర్ వివాదంపై స్పందిస్తూ ఆమె ఈ విధంగా మాట్లాడారు. పని ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపుల గురించి స్పందిస్తూ.. ‘నేను ఎప్పుడు ఇలాంటి వేధింపులు ఎదుర్కోలేదు. కానీ దీని గురించి విన్నాను. వేధించిన వారు ఎవరైనా సరే బయటకు వచ్చి ‘హే మేం ఇలాంటి పని చేశాం అని చెప్పుకోరు కదా’’ అన్నారు. అంతేకాక ఇలాంటి సంఘటనలు ‘నా కళ్ల ముందు జరిగితే చూస్తూ ఉండేదాన్ని కాదు. ఏదో ఒకటి చేసేదాన్ని. కానీ అలాంటి సంఘటనలు నా ముందేం జరగలేదు. లైంగిక వేధింపులు కేవలం చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదు.. అన్ని చోట్ల ఉన్నాయన్నా’రు. విదేశాల్లో వచ్చిన ‘మీటూ’ లాంటి ఉద్యమం మన దేశంలో కూడా రావాలన్నారు. మన కోసం మనమే నిలబడాలి, మనమే పోరాటం చేయాలని వ్యాఖ్యానించారు. ప్రసుత్తం కాజోల్ తన నూతన చిత్రం ‘హెలికాప్టర్ ఈలా’ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. -
‘మిమ్మల్ని ప్రాంక్ చేశాను బ్రో’
‘ఇదంతా ప్రాంక్ బ్రదర్.. సినిమాల్లో చూసి చూసి బోర్ కొట్టింది. అందుకే మిమ్మల్ని ప్రాంక్ చేద్దామని ఇలా చేశానంటు’న్నారు హీరో అజయ్ దేవగణ్. ఏప్రిల్ 1 ఫూల్స్ డే ఉన్నా కూడా ఈ మధ్య టీవీల్లో వచ్చే తలాతోకాలేని కార్యక్రమాల పుణ్యానా ఈ ప్రాంక్ కాల్స్ పిచ్చి అందరికి బాగానే ఎక్కేసింది. తాను కూడా అలానే చేశానంటున్నారు అజయ్ దేవగణ్. నిన్న మధ్యాహ్నం అజయ్ ‘కాజోల్ ప్రస్తుతం ఇక్కడ(భారత్) లేరు. 98******** తన వాట్సాప్ నంబర్ ఇది. ఈ నెంబర్ ద్వారా ఆమెను సంప్రదించగలరు’ అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో అభిమానులు కాజల్‌తో మాట్లాడవచ్చనే ఆనందంలో ఆమెకు మెసేజ్‌లు పెట్టి రిప్లై కోసం ఎదురు చూశారు. అంతేకాక ‘రిప్లై కోసం ఎదురు చూస్తున్నాం సార్’ అంటూ స్ర్కీన్షాట్లు తీసి అజయ్‌కు పంపించారు. ఇలా నెటిజన్లతో కాసేపు ఆడుకున్న అజయ్ దేవగణ్ ఆ తర్వాత అసలు విషయం చెప్పారు. ‘సినిమాల్లో ప్రాంక్(ఫూల్స్) చేసి చేసి బోర్ కొట్టింది. అందుకే వెరైటీగా మిమ్మల్ని ప్రాంక్ చెద్దామని భావించి ఇలా చేశానం’టూ ట్వీట్ చేశారు. దాంతో పాటు అభిమానులు నుంచి తనకు వచ్చిన రీట్వీట్స్ని కూడా పోస్ట్ చేశారు. దాంతో అజయ్ షేర్ చేసిన నంబర్ ఫేక్ అని తేలిపోయింది. ఇండస్ట్రీలో ఇలాంటి చిలిపి పనులు చేయడంలో అజయ్ దేవగణ్ ముందుంటారనే పేరుంది. -
స్త్రీలోక సంచారం
26 ఏళ్ల అమెరికన్ పాప్ గాయని సెలెనా గోమెజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో చాటింగ్ చేస్తూ.. ‘‘మీ బెస్టీ (బెస్ట్ ఫ్రెండ్) టేలర్ స్విఫ్ట్ ఎలా ఉన్నారు?’’ అన్న ప్రశ్నకు.. ‘‘ఆమె చాలా బాగున్నారు. ఐ లవ్ హర్. షి ఈజ్ అమేజింగ్. ఇవాళే తనతో మాట్లాడాను. ఆమె నాకు పెద్దక్క లాంటిది. ప్రతి విషయాన్నీ తనతో షేర్ చేసుకుంటాను. ఆమె చాలా తెలివైంది. నాకు మంచి సలహాలు ఇస్తారు. ప్రతి మనిషికీ జీవితంలో ఇలాంటి ఒక బెస్టీ ఉండాలి’’ అని రిప్లయ్ ఇచ్చారు. ప్రియాంక చోప్రాను పెళ్లి చేసుకోబోతున్న నిక్ జోనాస్ (26) కొంత కాలం సెలెనా గోమెజ్ బెస్టీగా ఉండగా, అదే సమయంలో అతడి అన్న నిక్ జోనాస్.. టేలర్ స్విఫ్ట్‌కి బెస్టీగా ఉండడంతో.. ఈ నలుగురు పాప్ సింగర్లు అరమరికల్లేకుండా ఉండేవారు. ఒక నన్‌పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల కొచ్చిలో ఐదుగురు నన్‌లు చేపట్టిన ప్రదర్శనకు మద్దతు ఇచ్చిందన్న ఆగ్రహంతో వయనాడు లోని మనంతవాడి డయోసిస్ ఆధ్వర్యంలోని సెయింట్ మేరీస్ చర్చి.. సిస్టర్ నాన్సీపై చర్య తీసుకుంది. అత్యారానికి గురయిన నన్‌కు న్యాయం జరిపించాలని డిమాండ్ చేస్తూ ఒక న్యూస్ చానల్ డిబేట్లో కూడా పాల్గొన్న సెయింట్ మేరీస్ ప్రావిన్స్ పరిధిలోని ఫ్రాన్సిస్కన్ క్లారిస్ట్ కాంగ్రెగేషన్ సభ్యురాలైన సిస్టర్ లూసీ కలప్పుర.. ఇక నుంచి చర్చికి సంబంధించిన ఏ ఒక్క విధినీ నిర్వహించడానికి వీల్లేకుండా చర్చి యాజమాన్యం ఆంక్షలు విధించింది. ప్రాచీన ఇంగ్లండ్ వివాహ సంప్రదాయంలో భాగంగా వధువు సంథింగ్ ఓల్డ్ (నిరంతరత), సంథింగ్ న్యూ (భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథం), సంథింగ్ బారోడ్ (సంతోషం), సంథింగ్ బ్లూ (స్వచ్ఛత, ప్రేమ, విశ్వసనీయత)లను గుర్తుగా ఉంచుకోవలసి ఉండగా.. ప్రిన్స్ హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్ వీటిల్లో ఒకటైన ‘సంథింగ్ బ్లూ’గా హ్యారీతో తన తొలి డేటింగ్ రోజు వేసుకున్న నీలం రంగు డ్రెస్‌లోంచి చిన్న దారం ముక్కను తీసి, వెడ్డింగ్ డ్రెస్‌కు కలిపి కుట్టించుకున్నానని ఒక టీవీ డాక్యుమెంటరీలో చెప్పారు. అయితే ఇంగ్లండ్ రాణిగారిలా పూర్తిస్థాయిలో సంప్రదాయాలను తను పాటించలేకపోవచ్చని, అయినప్పటికీ అందుకు ప్రయత్నిస్తానని ‘క్వీన్ ఆఫ్ ది వరల్డ్’ పేరుతో నేడు (మంగళవారం) బ్రిటన్‌లో ప్రసారం కానున్న ఈ డాక్యుమెంటరీలో మేఘన్ తెలిపారు. సిడ్నీ నుంచి మెల్బోర్న్ వెళుతున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఆదివారం నాడు చెక్–ఇన్ సందర్భంగా సిడ్నీ విమానాశ్రయంలో మెల్ అనే ఆస్ట్రేలియన్ మహిళా సిబ్బంది తన పట్ల జాత్యాహంకారంతో ప్రవర్తించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చూస్తూ.. మనిషి రంగును బట్టి మర్యాద ఇవ్వడం హీనాతిహీనమైన స్వభావం అని మెల్పై విరుకుపడ్డారు. శిల్ప ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. తన లగేజ్ బరువు ఎక్కువగా ఉందన్న కారణంతో తనను చాలాసేపు లోపలికి అనుమతించలేదని, మాన్యువల్‌గానైనా స్క్రీనింగ్ చెయ్యమని కోరినప్పటికీ.. తనను ఐదు నిముషాలకు పైగా అలాగే నిలబెట్టారని తన ఆవేదనను షేర్ చేసుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని సెయింట్ గ్యాలన్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో బహిరంగ ప్రదేశాలలో ముఖం కనిపించకుండా బుర్ఖా ధరించడంపై నిషేధం విధించడం సబబే అని 67 శాతం మంది ఓటు వేశారు. బుర్ఖాను నిషేధిస్తూ స్విట్టర్లాండ్ ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టంపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతుండడంతో దేశంలోని వివిధ ప్రాంతాలలో విడివిడిగా మళ్లీ రెఫరెండం తీసుకునేందుకు గత ఏడాది ఇదే గ్యాలన్ ప్రాంతంలో ప్రభుత్వం పోలింగ్ జరిపినప్పుడు కూడా.. దేశ ప్రజల భద్రత రీత్యా ముఖం కనిపించకుండా బుర్ఖా ధరించడం క్షేమకరం కాదు అని స్థానికులు తీర్పు ఇచ్చారు. మనోపాజ్ అన్నది పైకి మాట్లాడదగని విషయం కాదనీ, స్త్రీ దేహ పరిణామక్రమంలో సంభవించే ఒక స్థితి అని, స్త్రీ, పురుషులిద్దరికీ మోనోపాజ్పై అవగాహన ఉంటే స్త్రీల దైనందిన ఉద్యోగ జీవితంలో మానసిక ఒత్తిడులను మనం దూరం చేయవచ్చునని తెలియజెప్పేందుకు యు.కె.లోని ‘యూనివర్సిటీ ఆఫ్ లస్టర్’ యాజమాన్యం తన సిబ్బంది కోసం ‘మెనోపాజ్ కే ఫ్’ లను ఏర్పాటు చేసింది. యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ బిజి¯ð స్ మహిళా ప్రొఫెసర్ ఆండ్రియా డేవిస్ చొరవతో మొదలై, నెలకొకసారి జరిగే ఈ మెనోపాజ్ కేఫ్‌లలో స్త్రీ, పురుష ఉద్యోగులు మెనోపాజ్‌పై నిర్బిడియంగా తమ ఆలోచనలు పంచుకుంటారు. సౌదీ అరేబియాలో 2016లో జుమనా అల్షమీ అనే మహిళ టీవీలో ఉదయం వార్తలు చదివిన తొలి మహిళగా గుర్తింపు పొందగా.. ఇప్పుడు వియమ్ అల్ దఖీల్ అనే మహిళ సౌదీ అరేబియా అధికారిక టీవీ చానల్ ‘టీవీ 1’లో ఒమన్ అల్ నష్వాన్ అనే యాంకర్‌తో కలిసి వార్తల్ని చదవడం ద్వారా.. ఈవెనింగ్ న్యూస్ బులెటిన్‌ను సమర్పించిన తొలి సౌదీ మహిళగా రికార్డు సృష్టించారు. దేశంలో సంస్కరణలు తెచ్చే ప్రయత్నంలో మహిళలపై ఉన్న ఆంక్షలను ఒకటొకటిగా తొలగించుకుంటూ.. ఇటీవలే మహిళలు డ్రైవింగ్ చెయ్యడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తూ ఆదేశాలు జారీ చేసిన సౌదీ రాజు ముహమ్మద్ బిన్ సల్మాన్.. తాజాగా మహిళలు సాయంకాలపు వార్తలను చదవడానికి అనుమతి ఇచ్చారు. తొలి చిత్రం ‘బేఖుండి’ తో పాటు, దుష్మన్ (1998) కూడా తను నటించిన చిత్రాలతో తనకు ఇష్టమైన సినిమా అని చెబుతూ, దుష్మన్లో రేప్ సీన్ ఉన్నకారణంగా మొదట తను నటించనని చెప్పానని, అయితే దర్శక నిర్మాతలు ‘బాడీ డబుల్’తో (డూప్) ఆ సీన్‌ని లాగించేస్తామని చెప్పడంతో ఆ చిత్రంలో నటించడానికి అంగీకరించానని తాజాగా పి.టి.ఐ.కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజోల్ వెల్లడించారు. తన పాతికేళ్ల బాలీవుడ్ కెరీర్లో 30 పైగా చిత్రాలలో నటించిన కాజోల్ అక్టోబర్ 12 రిలీజ్ అవబోతున్న ‘హెలికాప్టర్ ఈలా’ చిత్రంలో కనిపించబోతున్నారు. -
భార్య నంబర్ షేర్ చేసిన హీరో!!
పొరపాటున భార్య కాజోల్నంబర్ ట్విటర్లో షేర్ చేశారు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. ‘కాజోల్ ప్రస్తుతం ఇక్కడ(భారత్)లో లేరు. 98******** తన వాట్సాప్ నంబర్ ఇది. ఈ నెంబర్ ద్వారా ఆమెను సంప్రదించగలరు’ అంటూ అజయ్ ట్వీట్ చేశారు. అంతే ఇంకేముంది కొద్ది సెకన్ల వ్యవధిలోనే అజయ్ ట్వీట్ వైరల్‌గా మారింది. రీట్వీట్లు, లైకులతో ట్రెండింగ్‌లోకి వెళ్లింది. జాగ్రత్త..! కాజోల్ నంబరును సేవ్ చేసుకున్న నెటిజన్లు ఆమెకు మెసేజ్ పెట్టి మరీ.. ‘రిప్లై కోసం ఎదురుచూస్తున్నాం సార్’ అంటూ స్క్రీన్షాట్లతో సహా అజయ్‌ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మరికొంత మంది మాత్రం.. ‘సార్.. కాజోల్ మేడమ్ నంబరు సోషల్ మీడియాలో ఎలా పెడతారు. వాట్సాప్ అనుకొని ట్విటర్లో షేర్ చేసినట్టున్నారు. కాస్త జాగ్రత్త’ అంటూ హితవు పలికారు. అయితే అజయ్ ట్విటర్ హ్యాక్ అయిందేమో అంటూ మరికొందరు అతడికి సపోర్టు చేశారు. కాగా కాజోల్ ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘హెలికాప్టర్ ఈల’ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. -
‘సల్మాన్ సినిమా అయితే రూ. 500 కోట్లు..’
ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో కాజోల్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘హెలికాప్టర్ ఈల’. ఈ సినిమాలో కొడుకు చదువుకునే కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేసే మదర్ క్యారెక్టర్లో కాజోల్ కన్పించనున్నారు. ప్రస్తుతం హెలికాప్టర్ ఈల ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన కాజోల్.. హీరో- హీరోయిన్ల పారితోషికాల వ్యత్యాసం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖాన్ సినిమాలా కాదు.. ‘సినిమా ద్వారా జరిగే బిజినెస్ మీదే పారితోషికాలు ఆధారపడి ఉంటాయని నేను నమ్ముతాను. సల్మాన్ ఖాన్ సినిమాలా.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు 500 కోట్ల రూపాయల వసూలు చేసిన దాఖలాలు లేవు. చాలా ఏళ్లుగా హీరోయిన్లు సినిమా విజయంలో ముఖ్య భాగంగా ఉంటున్నారే తప్ప.. వారే విజయానికి కారణమైన తార్కాణాలు తక్కువనే చెప్పాలి. అందుకే పారితోషికాల విషయంలో వ్యత్యాసం ఉంటుందనుకుంటున్నా. కానీ కహానీ, రాజీ వంటి సినిమాలు వీటన్నింటినీ తప్పని నిరూపించాయి. ఇందుకు కారణం ప్రేక్షకులే. వారి ఆశీర్వాదాలే ఉంటే గనుక ఏ సినిమా అయినా విజయం సాధిస్తుంది. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. హీరోయిన్ సెంట్రిక్ సినిమాలను వారు ఆదరిస్తున్నారు. ఇది మంచి పరిణామం’ అంటూ కాజోల్ వ్యాఖ్యానించారు. -
పాత ట్యూన్‌కి కొత్త స్టెప్స్
తొంభైలలో అజయ్ దేవగన్, టబు పాడుకున్న ‘రుక్ రుక్...’ పాటను లేటెస్ట్గా రీమిక్స్ చేశారు ‘హెలికాఫ్టర్ ఈల’ చిత్రబృందం. కాజోల్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘హెలీకాఫ్టర్ ఈల’. గాయని కావాలనుకునే తల్లి పాత్రలో కాజోల్ కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అజయ్ దేవగన్, టబు నటించిన ‘విజయ్‌పథ్ ’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘రుక్ రుక్..’ను రీమిక్స్ చేశారు. ఈ పాత ట్యూన్‌కు కొత్త స్టెప్స్ జోడించారట కాజోల్. ఈ సాంగ్ హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. అజయ్ దేవగన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ఆయన పాటకే ఆయన శ్రీమతి కాజోల్ డ్యాన్స్ చేయడం విశేషం. ఈ సినిమాను అజయ్ దేవగన్, జయంతీలాల్ నిర్మించారు. అక్టోబర్ 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
ఐకానిక్ సీన్ : ‘చైన్ లాగితే అయిపోయేది కదా..’
ఇక్కడేమో సిమ్రన్ తండ్రి ఆమె చేతిని పట్టుకుని నిల్చున్నాడు.. అటు చూస్తే సిమ్రన్ తన జీవితంలోకి రాలేదనే బాధతో రాజ్ బేలగా చూస్తుంటాడు. పాపం సిమ్రన్ ఇటు తండ్రిని కాదనలేక.. అటు దూరమవుతున్న ప్రియున్ని దక్కించుకోలేక అసహాయంగా చూస్తుంటోంది. ఇంతలో రైలు కదులుతుంది. అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో సిమ్రన్ తండ్రి కూతురుని చూస్తు ‘వెళ్లు సిమ్రన్ నువ్వు కోరుకున్న ప్రపంచంలోకి’ అంటూ కూతురి చేయిని వదిలేస్తాడు. అంతే దూరమవుతున్న ప్రియున్ని చేరుకోవడం కోసం సిమ్రన్ కదులుతున్న రైలుతో పాటే తాను పరిగెడుతుంది. రాజ్, సిమ్రన్ చేతిని అందుకుని రైలులోకి ఎక్కిస్తాడు. దాంతో కథ సుఖాంతం అవుతుంది. ఈ సన్నివేశం 23 ఏళ్ల క్రితం హిందీ సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసిన ఓ హిట్ చిత్రంలోనిది. ఇంతకు ఆ సినిమా ఏదో గుర్తుకొచ్చిందా.. అదే ‘దిల్ వాలే దుల్హానియే లే జాయేంగే’. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సిమ్రన్‌గా ‘కాజోల్’, ‘రాజ్’గా షారుక్ ఖాన్ జీవించారు. నాటి నుంచి కాజోల్ అబ్బాయిల ‘డ్రీమ్‌గర్ల్’గా, కింగ్ ఖాన్ షారుక్ అయితే ‘రొమాన్స్ కింగ్’గా నిలిచిపోయారు. ఈ చిత్రం విడుదలై నేటికి రెండు దశాబ్దాలు కావొస్తోన్నా ఇప్పటికీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. అయితే ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ఆదిత్య చోప్రాకే దక్కుతుందంటున్నారు ‘సిమ్రన్’ కాజోల్. ఈ మధ్యే ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా కాజల్ ‘దిల్వాలే దుల్హానియే లే జాయేంగే’ చిత్రం షూటింగ్ విశేషాలను గుర్తుచేసుకున్నారు. కాజోల్ మాటల్లో.. ‘డీడీఎల్జే చిత్రంలో నేను పరిగెత్తుతూ రైలులోకి ఎక్కే ఆ సీన్ ఒక ఐకానిక్ సీన్‌గా నిలిచిపోయింది. ఈ సీన్ ఇప్పటికే చాలా సినిమాల్లో వాడారు కూడా. అంత క్రేజ్ వచ్చిన ఈ సీన్ షూట్ చేయడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సీన్ తీసే సమయంలో వాతావరణం చాలా వేడిగా ఉండటంతో చిరాకు వచ్చేది. నా జుట్టు గాలికి ఎగురుతూ వీర విహారం చేసేది. దానికి తోడు ఆ రైలు మేము అనుకున్న స్పీడ్‌లో కాకుండా మరింత వేగంగా వెళ్లేది. రీ షూట్ చేయాలంటే మళ్లీ ఆ రైలు వచ్చే వరకూ అంటే దాదాపు 20 నిమిషాల పాటు ఎదురు చూడాల్సిందే. ఆ సమయంలో రాజ్ నన్ను అలా పరిగెత్తించే బదులు చైన్ లాగి రైలు ఆపితే అయిపోయేది కదా అనిపించేది’ అంటూ కాజల్ చెప్పుకొచ్చారు. అంతేకాక ‘ఇంత శ్రమకోర్చి తీసిన ఈ సన్నివేశం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రిలోనే ఒక మైలురాయిగా నిలిచి పోయింది. కానీ ఇందులో నా గొప్పతనం ఏం లేదు. ఈ క్రెడిటంతా ఆదిదే’(దర్శకుడు ఆదిత్య చోప్రా) అంటూ కాజోల్ వివరించారు. -
మా బ్యాచ్‌లో... ఆమిర్ ఖాన్ వద్దు!
ఎవరికైనా కాలేజీని ఎంచుకునే చాన్స్ ఉంటుంది కానీ క్లాస్మేట్స్ని ఎంచుకునే చాన్స్ రాదు. ఒకవేళ ఈ చాన్స్ వస్తే మీరు ఎవర్ని కోరుకుంటారు అని కాజోల్‌ని అడిగితే.. ‘‘నా భర్త అజయ్ దేవగన్, షారుక్ ఖాన్‌ను నా క్లాస్మేట్స్గా కోరుకుంటా. వాళ్లు నాలాగే క్లాస్‌లో బ్యాక్ బెంచ్‌లో కూర్చొని అల్లరి చేసే టైప్. బట్ ఆమిర్‌ఖాన్ నా క్లాస్మేట్గా వద్దనిపిస్తోంది. ఎందుకంటే అతను టీచర్‌కి క్లోజ్‌గా ఉండే టైప్. మా బ్యాచ్‌లో ఆమిర్ ఉంటే మాపై టీచర్‌కు కంప్లైట్ చేస్తాడు. అందుకే అతను వద్దు (నవ్వుతూ)’’ అన్నారు. ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో కాజోల్ ముఖ్య పాత్రలో నటించిన ‘హెలికాప్టర్ ఈల’ మూవీ ప్రమోషన్లో భాగంగా కాజోల్ ఈ విషయాలను చెప్పారు. కొడుకు చదువుకునే కాలేజీలో చేరి ఆమె కూడా డిగ్రీ పూర్తి చేసే ఓ మదర్ క్యారెక్టర్లో కాజోల్ నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. -
స్త్రీలోక సంచారం
కార్ల అమ్మకాలు, కొనుగోళ్లలో నాలుగో వంతు మార్కెట్ మహిళలదేనని, గత ఐదేళ్లలో మహిళల కొత్త, పాత కార్ల వినియోగం 10–12 శాతం నుంచి 25 శాతానికి రెట్టింపు అయిందని తాజా సర్వేలో వెల్లడయింది. ఈ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని మహిళలకు మరింత సులభంగా, ఫ్రెండ్లీగా ఉండే ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు కార్ల ఉత్పత్తి కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయని కూడా సర్వేలు కొన్ని పెద్ద కంపెనీల పేర్లను ఉదహరించాయి. అన్ని జాతులూ కలిసిమెలిసి, స్వేచ్ఛగా జీవించే అమెరికాలో జాతి వివక్షకు చోటు లేదని ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ ట్వీట్ చేశారు. తమను తాము ఆధిక్యజాతిగా భావించుకుంటున్న అమెరికన్లు కొందరు వర్జీనియాలోని చార్లెట్‌విల్ పట్టణంలో పరజాతులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిపి ఏడాది పూర్తయిన సందర్భంగా మళ్లీ అలాంటి ర్యాలీలే జరిగే అవకాశం ఉండటంతో స్థానికేతరులకు మనో ధైర్యాన్ని ఇచ్చేందుకు ఇవాంకా ఇలా.. (తన తండ్రి మద్దతిచ్చే ఆధిక్య భావజాలానికి పూర్తి విరుద్ధంగా).. ట్వీట్ చేయడం విశేషం. ఆగస్టు 12న మరణించిన భారత సంతతి బ్రిటిష్ రచయిత, నోబెల్ గ్రహీత వి.ఎస్.నయీపాల్.. స్త్రీల రచనా సామర్థ్యం విషయంలో తేలిక భావంతో ఉండేవారనీ, స్త్రీలోలుడని, స్త్రీలపై తరచు చెయ్యి చేసుకునేవాడని.. నివాళులలో భాగంగా జాతీయ పత్రికల్లో వరదలా వచ్చిపడిన ఆయన జీవిత విశేషాలను బట్టి తెలుస్తోంది. ‘రీడర్స్ డైజెస్ట్’ మాజీ ఎడిటర్ రాహుల్ సింగ్.. నయీపాల్లోని సత్యశీలతను కొనియాడుతూ.. సంక్లిష్టమైన ఆయన వ్యక్తిగతం జీవితానికి నిదర్శనంగా.. మొదటి భార్య ప్యాట్, పెళ్లికాకుండా ఆయనతో కలిసి ఉన్న మార్గరెట్ అనే ఒక అర్జెంటీనా మహిళ, నదీరా అనే మరో పాకిస్తానీ మహిళల గురించి ప్రస్తావించడాన్ని బట్టి నయీపాల్ జీవితంలో స్త్రీలకు పెద్ద స్థానమే ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు డెన్జెల్ వాషింగ్టన్.. తన కుమార్తె (ఆమె కూడా హాలీవుడ్ నటి) ఒలీవియాతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారి నడుము విరగ్గొడతానని హెచ్చరించారు. గత ఏడాది హార్వీ వైన్‌స్టీన్ లైంగిక వేధింపులు బహిర్గతం అయిన అనంతరం ‘మీటూ’ ఉద్యమంతో బాధిత నటీమణులంతా సంఘటితం కావడంపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. మీటూ వల్ల హాలీవుడ్ ఇప్పుడు మరింత సురక్షితం అయిందని చెబుతూ, ఒకవేళ తన కూతుర్ని ఎవరైనా లైంగికంగా వేధిస్తున్నట్లు తెలిస్తే తక్షణం వెళ్లి వారి వెన్నెముకను సున్నం చేస్తానని డెన్జెల్ అన్నారు. మేనేజ్మెంట్ డిగ్రీలు లేకపోయినప్పటికీ మహిళలు ఇంటా బయటా పనుల్ని చక్కబెట్టగలరని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. చండీగఢ్‌లో ‘భారత వికాస్ పరిషత్’ నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ.. ‘ఒక మహిళ బయటì పనికి వెళ్లి వస్తోందంటే ఆమె ఏకకాలంలో రెండు పనులు చేస్తున్నట్లు. ఇదే మాట పురుషుడి విషయంలో చెప్పలేం. ఎందుకంటే అతడు బయటి పని మాత్రమే చేస్తాడు తప్ప, ఇంట్లో పూచిక పుల్లంత పని కూడా అందుకోడు’ అని కిరణ్ జీ (చండీగఢ్ ఎం.పి. కిరణ్‌ఖేర్) అన్న మాటను సమర్థించారు. వయసొచ్చిన కొడుకు విషయంలో తల్లికి ఉండే భయాలు, బెంగలు, ఆరాలు, అనుమానాలు, నిఘాలు.. ఇవన్నీ కలిసి ‘మమ్మా కి పరిచాయి’ (అమ్మ నీడ) అనే థీమ్‌తో విడుదలైన ‘హెలికాప్టర్ ఇలా’ చిత్రంలోని టీజర్ సాంగ్ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. తల్లిగా కాజల్, కొడుకుగా రిథీ సేన్ కనిపించే ఈ పాటలో.. కొడుకును అనుక్షణం ప్రొటక్ట్ చేసే కేరింగ్ మదర్, తల్లి పోరు పడలేక సతమతమయ్యే కొడుకు కనిపిస్తారు. ‘లండన్ లోని భారత దౌత్య కార్యాలయంలో టీమ్ ఇండియా’ అనే క్యాప్షన్‌తో ఈ నెల 8న బి.సి.సి.ఐ. (బోర్ట్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ట్విట్టర్లో పెట్టిన గ్రూప్ ఫొటోలో టీమ్ సభ్యులతో పాటు విరాక్ కోహ్లీ భార్య అనుష్కాశర్మ కూడా ఉండటంపై ‘క్రికెట్‌నీ, బాలీవుడ్‌నీ కలపకండి’ అంటూ వస్తున్న ట్రోల్స్ మీద ఎట్టకేలకు అనుష్క స్పందించారు. అయితే.. ‘ఇలాంటి ట్రోల్స్‌కి నేను స్పందించను’ అన్నంత వరకే ఆమె స్పందించారు! నేడు నటి సుహాసిని 57వ పుట్టినరోజు. భర్త మణిరత్నం.. కొడుకు నందన్.. ఇదీ ఆమె ఫ్యామిలీ. సుహాసిని నాస్తికురాలు. ‘‘నాకు దేవుడి మీద నమ్మకం లేదు. దైవ ప్రార్థనల మీద నమ్మకం లేదు. నాకు, నా కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వు దేవుడా అని గుడులకు వెళ్లడం మీద నమ్మకం లేదు’’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సుహాసిని. అలాగే మల్టీ టాస్కింగ్ (ఒకేసారి అనేక పనులు నెత్తికెత్తుకునే నేర్పు) మీద కూడా ఆమెకు నమ్మకం లేదు. ‘అదెలా సాధ్యం?’ అంటారు. ‘‘ఇంట్లో పని ఇంట్లోనే. బయటి పని బయటే. ఇక్కణ్ణుంచి ఆ పని, ఆక్కణ్ణుంచి ఈ పని చెయ్యలేను’’ అని చెబుతుంటారు సుహాసిని. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ కాజోల్
-
హీల్స్ పట్టుజారి కింద పడిపోయిన నటి
-
షాపింగ్ మాల్లో కిందపడిన నటి
సీరియస్‌గా షాపింగ్ మాల్లో ఎటో చూస్తూ నడుస్తూ ఉంటారు. సడెన్‌గా మీరు వేసుకున్న చెప్పులు పట్టుపట్టుజారి కింద పడబోయారనుకోండి. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది. ఎవరైనా చూశారా? అనుకుంటూ... సిగ్గుతో తలదించుకుంటా. తాజాగా ఇదే పరిస్థితి బాలీవుడ్ నటి కాజోల్కు ఎదురైంది. ఓ ప్రముఖ షాపింగ్ మాల్లో షాపింగ్‌కు వెళ్లిన నటి, సడన్‌గా తన హీల్స్ పట్టుపట్టుజారి కింద పడిపోయారు. దీంతో వెంటనే ఆమె పక్కన ఉన్న ఓ బాడీగార్డు కాజోల్కు ఎలాంటి దెబ్బలు తగ్గలకుండా.. పట్టుకున్నాడు. ఈ ఘటన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అయింది. దీన్ని చూసిన కాజోల్ అభిమానులు షాక్ అవుతున్నారు. హెల్త్ గ్లో స్టోర్‌లోని ఈవెంట్లో పాల్గొనడానికి ఫోనిక్స్ మార్కెట్ సిటీ మాల్‌కు కాజోల్ వెళ్లారు. పొనిటైల్ వేసుకుని, మోకాలు వరకు ఉన్న తెల్లటి డ్రస్‌తో నటి ఆ మాల్లో మెరిసిపోయారు. కాజోల్‌ను చూసిన అభిమానులందరూ ఒక్కసారిగా ఆమె చుట్టూ గుమ్మిగూడారు. వారి నుంచి తప్పిస్తూ.. బాడీగార్డులు కాజోల్‌ను ఎలివేటర్ వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో కాజోల్ తాను వేసుకున్న హీల్స్ పట్టు తప్పడంతో ఒక్కసారిగా కింద పడిపోయారు. వెంటనే ఆమె పక్కన ఉన్న సెక్యురిటీ, కాజోల్‌ను పట్టుకుని ఆమెకు ఎలాంటి దెబ్బలు తగలనీయలేదు. బాడీగార్డుకు కాజోల్ కృతజ్ఞత చెప్పారు. కాజోల్ ఇలా పడటం ఇదే మొదటిసారి కాదు. దిల్వాలే ప్రమోషన్స్ సమయంలో కూడా కాజోల్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. స్టేజీపై ఆమె కింద పడబోతే, ఆమె సహ నటుడు వరుణ్ దావన్ పట్టుకున్నాడు. -
నాకంటే అజయ్ బెటర్
అజయ్ దేవగన్, కాజోల్ బాలీవుడ్ లవ్లీ కఫుల్. పిల్లల్ని చూసే విషయంలో మీ ఇద్దరిలో ఎవరు బెస్ట్? అని కాజోల్‌ని అడిగితే ‘అజయే బెస్ట అంటున్నారు కాజోల్. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నా కంటే అజయే పిల్లల్ని ఎక్కువ గారం చేస్తుంటాడు. పిల్లల్ని గారం చేసే విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ మదర్ని. వాళ్ల డైలీ రొటీన్, గేమ్స్ టైమింగ్స్‌లో, ఫుడ్ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను. వాళ్లను లిమిట్ దాటి అల్లరి సాగనివ్వను. కానీ అజయ్ మాత్రం ఆ విషయంలో వాళ్లను పూర్తిగా వదిలేస్తాడు’’ అని పేర్కొన్నారామె.


