జీవితం చాలా మ‌రిపోయింది..

 DDLJ : Mandira Bedi, Uday Chopra Shared  Then-And-Now Pics - Sakshi

భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రికార్డులు తిర‌గ‌రాసిన దిల్‌వాలే దుల్హానియా లే జయేంగే  సినిమా నేటికి 25 వ‌సంతాలు పూర్తి చేసుకుంది.  ఆదిత్యా చోప్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా  షారూఖ్ ఖాన్,  కాజోల్‌ల‌కి ఓవ‌ర్‌నైట్ స్టార్‌డ‌మ్‌ను తెచ్చిపెట్టింది.  4 కోట్ల రూపాయ‌ల‌తో తీసిన ఈ సినిమా ఏకంగా 250 కోట్లు క‌లెక్ట్ చేసి రికార్డుల సునామీలు సృష్టించింది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఈ ఒక్క సినిమాతో నేటికీ దేశంలోనే నెం.1 ప్రొడక్షన్‌ హౌస్‌గా నిలిచి ఉంది. లాక్‌డౌన్‌ వరకూ కూడా అంటే గత పాతికేళ్లుగా ముంబైలోని మరాఠా మందిర్‌లో మ్యాట్నీగా లేదంటే మార్నింగ్‌ షోగా ఈ సినిమా ఆడుతూనే ఉంది.  (25 ఏళ్ల దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే )

నేటితో దిల్‌వాలే దుల్హానియా లే జయేంగే చిత్రం 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఉద‌య్ చోప్రా, ప్రీతి సింగ్ పాత్ర‌లో న‌టించిన మందిరా బేడీలు సినిమాతో తమ‌కున్న అనుబంధాల‌ను గుర్తు చేసుకున్నారు. అనేక అంశాల‌లో చ‌రిత్ర సృష్టించిన ఈ సినిమాలో భాగ‌స్వామ్యం కావ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని మందిరా అన్నారు. జీవితం చాలా మ‌రిపోయింది. అన్నీ మారిపోయాయి. కానీ ప్రేమ‌కు గుర్తుగా నిలిచే ఎరుపు రంగు మాత్రం ఎప్ప‌టికీ నిలిచే ఉంటుంది అంటూ ఈ సినిమాపై త‌న ప్రేమను తెలియ‌జేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top