వెన్నుపోటు దినంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: వైఎస్‌ జగన్‌ | Tenali Tour: YS Jagan Calls On Vennupotu Dinam | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు దినంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: వైఎస్‌ జగన్‌

Jun 3 2025 1:44 PM | Updated on Jun 3 2025 4:04 PM

Tenali Tour: YS Jagan Calls On Vennupotu Dinam

సాక్షి, గుంటూరు: కూటమి పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని.. లా అండ్‌ ఆర్డర్‌ అదుపు తప్పిందని.. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎంతమాత్రం మంచిది కాదని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన.. నడిరోడ్డులో యువకులపై పోలీసుల థర్డ్‌ డిగ్రీ దాష్టికాన్ని ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు.  

మా హయాంలో ప్రతీ వర్గానికి సంక్షేమం అందింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Govt)లో ప్రతి వ్యవస్థ నీరుగారింది. ఫీజురీయింబర్స్‌మెంట్‌ కింద 3,600 కోట్ల రూపాయిలు బకాయిలు పేరుకుపోయాయి. విద్యారంగం పూర్తిగా నాశనమైంది. వైద్య రంగం దివాళా తీసింది. రైతు భరోసా లేదు. ఉచిత పంటల బీమా, ఈ-క్రాప్‌ లేదు. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏమాత్రం మంచిది కాదు. ఎంత త్వరగా సాగనంపితే ప్రజలకు అంత మేలు. రేపు రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినం(Vennupotu Dinam) నిర్వహిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో పాల్గొనాలి అని జగన్‌ పిలుపు ఇచ్చారు.

ఇదీ చదవండి: ప్రశ్నించడమే ఆ యువకుల తప్పా?

Advertisement
 
Advertisement
Advertisement