breaking news
vennupotu dinam
-
జనాలు నలిగిపోతాన్రు!
జగనైతే ఎవరికీ ఏలోటూ లేకుండా అందరికీ అన్నీ ఏసేటోడు! బడ్డీ కొట్టు పెట్టుకున్నోళ్లకి డబ్బులిచ్చోడు.. ఒక్కడికీ లేదని పించలేదు. సంవత్సరానికి మాకు అన్ని పథకాలూ కలిపి డెబ్బై వేలదాకా వొచ్చేది. చంద్రబాబు వొచ్చాక ఇప్పుడేటీ రాలేదు. జనాలు నలిగిపోతాన్రు. చెప్పుకోకూడదు కానీ టీ సుక్కకి కూడా డబ్బులాడతం లేదు! – మంగలి సత్యం, నాయీ బ్రాహ్మణుడు, తామరాపల్లి, విజయనగరం జిల్లా ‘ఏటి సేసినారు..? రైతు భరోసా పెంచి ఇత్తామన్నారు.. అది అసలే నేదు..! చదువుకున్న కుర్రోళ్లకి డబ్బులేసేటోళ్లు..! వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మ ఒడి పథకాలన్నీ ఒచ్చియి.. అవి ఇప్పుడున్నాయేటి..? ఏయీ నేవు...! గుండికాయల మీద సెయ్యేసి తెలుసుకుంటే.. ఈడు సేసిందేముంది..? ఆడు సేసిందేముంది..? అని తెలుసుకుంతారు! ఒక తల్లికి పిల్లనేదు.. పిల్లకి తల్లీనేదు! ఎవరి చేతిలోనూ డబ్బుల్లేక నకనకనాడిపోతున్రు...! ఇప్పుడే పనీనేదు.. పేదాసాదా అంతా ఉసూరుమని ఏడుత్తాండ్రు! రెండొందలు మూడొందలు వొచ్చీ కరెంటు బిల్లు ఇప్పుడు డబలైపోనాది. కొట్టుమీద కిరాణా సామాన్లు పెరిగాయి.. నూని డబ్బా పెరిగింది.. ఇప్పుడింక బాగైనా బరాయించాల..! చెడ్డయినా బరాయించాల..! మళ్లీ మన టైమొచ్చీదాకా..! మరింకేటి సేత్తాం..!. – జట్టి మంగ, కండేపల్లి, చోడవరం మండలం, అనకాపల్లి జిల్లానేను పక్కా టీడీపీ అయినా జగన్ పథకాలు టంచనుగా అందాయి ‘కరోనా టైమ్‌లో కూడా జగన్ ఏ పథకం ఆపలేదు. అయ్యన్నపాలెంలో ఒక కుటుంబానికి ఏటా రూ.లక్ష దాకా వచ్చేది. అప్పుడు జనాలకు సొమ్మాడటంతో కొత్త బట్టలని, ఇంట్లో ఏదైనా సామాన్లని కొనుక్కునేవారు. ఇప్పుడు వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. నేను పక్కా టీడీపీ. అయినా జగన్ పథకాలు మాకు టంచనుగా అందాయి..’ – సోమేశ్వరరావు, టైలర్ షాపు, అయ్యన్నపాలెం, నర్సీపట్నంశివరామకృష్ణ మిర్తిపాటి – ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఏడాది పాలన గుండె చప్పుడు ఇది! నిజాలను భరించగలిగే శక్తి ఉంటే పేదల ఆక్రందన అర్థం అవుతుంది! గ్రామాల్లో పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఏరికోరి కష్టాల పాలయ్యామనే ఆక్రోశం ఎవరిని కదిలించినా కనిపిస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలను నిలిపివేయడం.. సూపర్ సిక్స్ హామీలు అమలు కాకపోవడంతో పేదలు నలిగిపోతున్నారు. రైతులు పెట్టుబడి ఖర్చులకు డబ్బులు లేక.. ఉచిత పంటల బీమాకు దూరమై.. గిట్టుబాటు ధరలు లభించక అల్లాడుతున్నారు. పిల్లల చదువులు మళ్లీ గుదిబండలా మారుతున్నాయి. ఆర్థిక ఆసరా కోసం ఎదురు చూస్తున్న మహిళలు విసిగిపోతున్నారు. ఏడాది క్రితం దాకా కళకళలాడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో కకావికలమవుతోంది. ఏడాదికే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం బహుశా ఇదేనేమో!ఏం ప్రభుత్వమండీ ఇది! వాహనమిత్ర పథకం అందకపోవడంతో గ్రామాల్లో ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి దుర్భరంగా ఉంది. రోజుకు ఐదారొందలు వస్తే పోలీసులు రూ.మూడు నాలుగొందలు కట్టాలని కేసు రాసేస్తున్నారని ఇక తాము ఎలా బతుకుతామంటూ విజయనగరం జిల్లా తామరాపల్లి జంక్షన్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు 8 వారాల నుంచి ఉపాధి హామీ కూలి డబ్బులు రాకపోవడంతో అప్పులు చేసి బతుకుతున్నామని విజయనగరం జిల్లా పెద్ద బోరబండ గ్రామానికి చెంది ఉపాధి హామీ కార్మి కులు చెబుతున్నారు. ఆఖరికి మూగజీవాల గోడు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ‘గొర్రెలకు కూడా మందులిచ్చేటోడు జగన్! ఇప్పుడేవీ లేవు. మట్టి పనుల డబ్బులు 4 నెలలుగా పడలేదు.రైతు భరోసా ఆగిపోయింది. ఎవరికీ ఏవీ లేక జనాలు మండిపోతున్నారు’ అని పురోహితినివలసకు చెందిన నీలబోణి లచ్చుము వాపోయాడు. ‘జగన్ ఉంటే ఏ పార్టీ అయినా కూడా అనుకున్న టైమ్‌కి అందరికీ అన్ని పథకాలూ వచ్చేవి. ఇప్పుడవన్నీ ఆగిపోయాయి. చంద్రబాబు హామీలు అమలు కావడం లేదు. పథకాలూ రాక, జనాల చేతిలో డబ్బులాడక మా వ్యాపారం సాగడం లేదు’ అని అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేటలో రోడ్డు పక్కన బెల్లం, కూరగాయలు అమ్మి జీవనం సాగిస్తున్న మాధవి నిర్వేదంగా చెప్పింది! ‘ఏం ప్రభుత్వమండీ ఇది! మాకు ఇంతకుముందు అన్ని పథకాలు వచ్చియి. మా మనవరాలికి అమ్మ ఒడి, మాయావిడికి రూ.18,500 వచ్చియి. ఇప్పుదేదీ లేదు’ అంటూ కోటవురట్లలో చిన్న కిళ్లీ బడ్డీ నడుపుకుంటున్న దాకారపు రవణ దిగాలుగా నిట్టూర్చాడు.అభివృద్ధి.. అప్పుల్లోనే!! వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్, నాడు–నేడుతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టడంతో నిత్యం అభివృద్ధి పనులు జరిగేవి. జగనన్న కాలనీలలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను చేపట్టడంతో గ్రామాలలో ఉపాధి లభించేది. కోవిడ్‌లోనూ ఈ పనులు నిరాటంకంగా సాగడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు క్షీణించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం డీబీటీ ద్వారా రూ.2.73 లక్షల కోట్లకుపైగా నేరుగా ప్రజల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేసింది.నవరత్నాల సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి మరీ అమలు చేశారు. సూపర్ సిక్స్ పేరుతో ఎడాపెడా హామీలిచ్చిన సీఎం చంద్రబాబు ఒక్క ఏడాదిలో దాదాపు రూ.1.70 లక్షల కోట్లు అప్పులు చేసి కూడా హామీలను నెరవేర్చడంలో దారుణంగా విఫలమయ్యారు. కూటమి ప్రభుత్వంలో జీఎస్టీ ఆదాయం తగ్గిపోవడం ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందనేందుకు నిదర్శనం. ఎప్పుడో చేత్తానంటే ఎలా అవుతాది?’ ‘జగనున్నప్పుడు రైతు భరోసా ఏసీవోడు! చంద్రబాబు వచ్చిన కాడ నుంచి ఏవీ రావడం లేదు. ఏదో సొంత పొలం వదిలేయలేక తిండి గింజలు పండిస్తున్నాం. అదీనేకపోతే కూడు కోసుపోయి ఉండటమే! చోడవరం పందార ఫ్యాక్టరీకి చెరుకు తోలి ఐదు నెలలైంది ఇప్పటికొచ్చి రూపాయివ్వలేదు. మరి ఏటి తింటారు? మా ఆయన ఉపాధి హామీ మట్టి పనికెళ్లి రెండు నెలలైంది. ఒక్క రూపాయి పడలేదు. మార్చి నుంచి చేసినోళ్లకే లేదు. ఇంక మాకేం పడతాయి? చంద్రబాబుది అంతా మోసమే! ఎప్పుడో చేత్తానంటే ఎలా అవుతాది?’ అంటూ అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండలం విజయరామరాజు పేటకు చెందిన అచ్చయ్య గోడు వెళ్లబోసుకుంది. 70 ఏళ్ల వయసులో రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులు, మామిడి పళ్లు, కొబ్బరిబొండాలు అమ్ముతూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తోంది! ఈ ప్రభుత్వంలో చాలా కష్టంగా ఉంది..! ‘పండిన పంటకు గిట్టుబాటు లేదు. ఒక రైతు భరోసా లేదు. క్రితం ఏడాది నువ్వులు క్వింటా రూ.12 వేలు ఉంది. ఇప్పుడు రూ.8 వేలే. కష్టం తప్ప ఏమీ ఉపయోగం లేదు. ఏ పథకాలూ లేవు. జగనున్నప్పుడు అమ్మ ఒడి అనో, 45 ఏళ్లు దాటిన ఆడోళ్లకి రూ.18,500 అనో ఏదో డబ్బులు పడేయి. ఇప్పుడు ఏవీ రావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో చాలా కష్టంగా ఉంది..!’ విజయనగరం జిల్లా తెర్లాంలో నువ్వులు నూరి్పడి చేస్తున్న రైతు దంపతులు శ్రీరాములు, లక్ష్మి ఆవేదన ఇదీ!! -
బాబూ.. 9,000 కోట్ల అప్పు కోసం.. 1,91,000 కోట్ల గనుల తాకట్టు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్ మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అప్పులు చేయడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారు.. 5,526 కోట్లను బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారని తెలిపారు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి? అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదు. చంద్రబాబు సర్కార్ అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారు. రూ. 5,526 కోట్లను బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారు. గతంలోనే ఈ రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ అప్పులు చేశారు. రానున్న రోజుల్లో మళ్ళీ మళ్ళీ ఏపీఎండీసీ ద్వారా అప్పులు చేయటానికి సిద్దమయ్యారు.ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేయటానికి వీల్లేదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పార్టీలే నేరుగా నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 203, 204, 293(1) నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. రూ.9000 కోట్ల అప్పుల కోసం ఏపీఎండీసీకి చెందిన రూ. 1,91,000 కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టటం దారుణం. అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావటం ద్వారా APMDCపై సంవత్సరానికి రూ.235 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి?. మా హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పుల్లో సగం చంద్రబాబు ఈ ఒక్క ఏడాదిలోనే చేశారు’ అని చెప్పుకొచ్చారు.Andhra Pradesh Government’s lack of fiscal discipline and disregard for the Constitutional framework.It is learnt that, on 25th June, 2025, APMDC concluded the second tranche of its NCD (bond) issuance at a coupon (interest) rate of 9.30% and raised Rs. 5,526 crores, taking the… pic.twitter.com/wiJSs6q1lK— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2025 -
వైఎస్సార్సీపీ ‘యువతపోరు’.. విశాఖలో ఉద్రికత్త
వైఎస్సార్సీపీ ‘యువతపోరు’ అప్డేట్స్.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్..నమ్మి ఓట్లు వేసిన ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారురెడ్బుక్పై ఉన్న శ్రద్ధ.. హామీల అమలులో లేదా?కర్నూలు నుంచి పారిపోయి వచ్చిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బెదిరించటం హాస్యాస్పదంటీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరుతనపై వ్యతిరేక వార్తలు రాసే వారిని రైలు పట్టాలపై పడుకోబెడతానన్న గుమ్మనూరు జయరాంపై ఏ చర్యలు తీసుకోలేదుచంద్రబాబు సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేయాలి.మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కామెంట్స్..సింగయ్య మరణంతో వైఎస్ జగన్‌కు ఏం సంబంధం?వైఎస్ జగన్ వాహనం కింద పడి కార్యకర్త చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారువైఎస్సార్సీపీ యువత పోరు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు కుట్రలుహామీల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలం అయ్యారు.హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవాలని చెప్పారుచంద్రబాబు కాలర్ పట్టుకోవాలా?పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకోవాలా?నారా లోకేష్ కాలర్ పట్టుకోవాలా?ఏడాది పాలనలోనే చంద్రబాబు ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్నారు. మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్..ఇంటింటికీ తిరిగి మోసపు వాగ్ధానాలిచ్చి చంద్రబాబు గద్దెనెక్కారుఏడాది కాలంలో కేవలం పెన్షన్లు మాత్రమే ఇచ్చారువిద్యకు ప్రాధాన్యం కల్పించిన నాయకులు వైఎస్ జగన్.చిన్నపిల్లలను కూడా ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసిందితల్లికి వందనం 15 వేలు ఇస్తామని చెప్పిన లోకేష్ 13 వేలు ఇచ్చి మోసం చేస్తున్నాడువైఎస్ జగన్ బయటికి వెళితే భద్రత లేదుఆయనపై కేసులు ఎలా పెట్టాలి.. జైల్లో ఎలా పెట్టాలనేదే కూటమి ఆలోచనసత్తెనపల్లి పర్యటనలో దొంగ సాక్ష్యాలతో జగన్‌పై కేసు పెట్టాలని చూస్తున్నారుఏం చేశారని సుపరిపాలన జరుపుకుంటున్నారుఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి విజయవాడలో ధర్నా చౌక్ ఖాళీ ఉండటం లేదులోకేష్ పేరుకే విద్యాశాఖ మంత్రిఆయన శాఖ తప్ప అన్ని శాఖల పనులూ లోకేష్ చేస్తున్నాడువిద్యార్ధుల ఆవేదనను ఇప్పటికైనా లోకేష్ గుర్తించాలి ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవినేని అవినాష్ కామెంట్స్..కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందియువకుల బాధ్యత నాది అని యువగళంలో లోకేష్ హామీ ఇచ్చాడుఈరోజు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదునేనుంటాను.. నేను చూసుకుంటానని చెప్పిన లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారుసచివాలయ వ్యవస్థ ప్రజలకు దూరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందికేవలం డైవర్షన్ పాలిటిక్స్ తో కాలక్షేపం చేస్తున్నారుసత్తెనపల్లి పర్యటనలో ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్ కారణం కాదని ఎస్పీ చెప్పారుఫేక్ వీడియో జతచేసి రాజకీయం చేస్తున్నారు..పట్టించుకోలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారుగతంలో టీడీపీ నేతలు చేసిందేంటి?కందుకూరు సభ పెట్టి ఎనిమిది మందిని బలి తీసుకున్నారుగుంటూరులో చీరలు పంచి ముగ్గురు చనిపోయేలా చేశారుప్రజల ప్రాణాలు పోతే వదిలేసి వచ్చిన చరిత్ర మీదితారకరత్న చనిపోతే యువగళాన్ని కొనసాగించిన వ్యక్తి లోకేష్మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్..యువతను ఈ ప్రభుత్వం మోసం చేసిందిప్రతీ జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు.. మెగా డీఎస్సీ అన్నారుహామీలపై చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలివైఎస్ జగన్ తెచ్చిన కంపెనీలకు మళ్లీ కొబ్బరికాయలు కొట్టడమేనా మీ అభివృద్ధిఫీజు రీయింబర్స్ మెంట్ ఇంతవరకూ చెల్లించలేదునిన్నటి వరకూ వైఎస్ జగన్ చుట్టూ ఉన్నవారిపై కేసులు పెట్టారుఇప్పుడు ఆయనతో పాటు కారులో ఉన్నవారిపైనా కేసులు పెడుతున్నారుసినిమా డైలాగ్ ను చెబితే వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేశారునీ తల నరకొచ్చుగా అన్న బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు ఎవరైనా ఖండించారా?.బుచ్చయ్య చౌదరి పై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారువైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారుఆయనను ప్రజల్లోకి వెళ్లకుండా ఆపాలని చూస్తున్నారుఎన్ని నిర్భందాలు విధించినా మేం ప్రజల పక్షాన నిలబడతాం.. ప్రశ్నిస్తాందాడిశెట్టి రాజా కామెంట్స్..ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడుప్రజలు, రైతులు, యువత, మహిళల తరపున ప్రశ్నించే ఏకైక నాయకుడు వైఎస్ జగన్వైఎస్ జగన్‌ను ఏదో విధంగా ఎలిమినేట్ చేయ్యాలనే ఉద్దేశంతోనే టీడీపీ నాయకుల మాటలు కనిపిస్తున్నాయి.వైఎస్ జగన్ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళకూడదు..ప్రజల తరుపున ప్రశ్నించకూడదని అనుకుంటున్నారు.బుచ్చయ చౌదరికి ఇంగిత జ్ఞానం.. బుద్ది లేదా?80 ఏళ్ళ వయస్సులో ఒక మాజీ ముఖ్యమంత్రి తల నరుకుతానంటున్నావ్!ప్రజలను ఏవిధంగా మోసం చేశారో వైఎస్ జగన్ చెబితే...దానికి సమాధానం చెప్పకుండా రప్పా రప్పా అంటూ డైవర్ట్ చేశారు.వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ డైవర్ట్ కోసం రప్పా..రప్పాఫీజు రియింబర్స్‌మెంట్ రప్పా..రప్పానిరుద్యోగ భృతి రప్పా..రప్పా.మచిలీపట్నం ఇంఛార్జి పేర్ని కిట్టు కామెంట్స్..విద్యార్థులను చంద్రబాబు మోసం చేశాడుఎన్నికల సమయంలో నోటి కొచ్చిన హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చాక భయం వేస్తుందని మాట మార్చాడుపవన్ కళ్యాణ్ ను అడ్డం పెట్టుకొని యువతను మోసం చేయాలని చూశావుప్రస్తుతం యువత అంత పిచ్చితనంలో లేరుయువత మిమ్మల్ని నిలదీసే రోజు వచ్చింది.విద్యార్ధులకు ఫీజులు ఎగ్గొట్టిన ఏకైక ముఖ్యమంత్రివి నువ్వే చంద్రబాబువిశాఖపట్నంలో యోగ పేరిట డబ్బు ఖర్చు పెట్టావ్ఆ డబ్బులను యువత ఫీజులకి విడుదల చేసుంటే బాగుండేదిగిన్నిస్ రికార్డు కోసం యోగ కార్యక్రమాన్ని నిర్వహించారువిద్యార్థులకు ఫీజులు ఎగ్గొటిన ఏకైక ముఖ్యమంత్రి నేనే అని గిన్నిస్ రికార్డులో ఎక్కాల్సిందివిశాఖలో ఉద్రికత్త..వైఎస్సార్సీపీ యువత పోరుబాట ధర్నాను కలెక్టరేట్ వద్దకు రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం.నాలుగు చోట్ల భారీ కేట్లు పెట్టిన పోలీసులు..వైఎస్సార్సీపీ శ్రేణులను నియంత్రించ లేకపోయినా పోలీసులు..పోలీసులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట.పోలీసులను దాటుకొని కలెక్టరేట్‌కు వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు..చంద్రబాబు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు..విజయవాడ..ధర్నాచౌక్‌లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు నిరసననిరసనల్లో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్పార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్,వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ & పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, మొండితోక జగన్మోహన్ రావు,జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు,పార్టీ విద్యార్ధి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర,వైఎస్సార్సీపీ సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ దొడ్డా అంజిరెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్లు, యువతవైఎస్సార్ జిల్లా..వైఎస్సార్సీపీ పిలుపు మేరకు కడపలో భారీ ర్యాలీవైఎస్సార్సీపీ యువజన విభాగం ర్యాలీని ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిపార్టీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీజిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొన్న యువతకూటమి ప్రభుత్వం అన్ని విధాలా యువతను మోసం చేసిందని నినాదాలుకలెక్టర్ కార్యాలయంలో యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వినతిపత్రంవిశాఖ..ప్రారంభమైన యువత పోరు కార్యక్రమం..జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ..ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత విద్యార్థులు నిరుద్యోగులు..చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు..ఏడాదికాలంగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు..నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదు..ఇంటికొక ఉద్యోగం అన్నారు..ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలి.నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాలి..విశాఖ వైఎస్సార్సీపీ పార్లమెంటు పరిశీలకుడు కదిరి బాబురావు.అనంతపురం..యువత సమస్యలపై వైఎస్సార్సీపీ పోరుబాటఅనంతపురం కలెక్టరేట్ వద్ద యువత పోరుభారీగా తరలివచ్చిన యువకులు, విద్యార్థులుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలుఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదంటూ ఆగ్రహంటీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేశారుఒక్కో నిరుద్యోగికి మూడు వేల రూపాయల భృతి ఇస్తామన్న హామీ ఏమైందిఒక్క ఏడాదిలో నిరుద్యోగ భృతి బకాయిలు 7200 కోట్లుచంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ యువత సమస్యలు పట్టవా అని ప్రశ్నలు. యువత పోరు ప్రారంభం..ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ యువత పోరు కార్యక్రమం ప్రారంభం. కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ నేతలు, నిరుద్యోగులు, యువత నిరసనల్లో పాల్గొంటున్నారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలంటూ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ ఒత్తిడి పెంచుతోంది. వివిధ అంశాలపై ఇప్పటికే నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిన వైఎస్సార్సీపీ ఈసారి యువత కోసం ఆందోళనలు చేపడుతోంది. మాట తప్పి.. వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ తీరుకు రాష్ట్రవ్యాప్తంగా యువతకు బాసటగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు వైఎస్సార్సీపీ యువజన విభాగం పిలుపునిచ్చింది. అనంతరం యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు యువతీయువకులతో కలిసి వైఎస్సార్సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించనున్నారు. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలుఅనంతరం కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయంఅధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ చంద్రబాబు హామీఉద్యోగాలు కల్పించకపోతే నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి అంటూ హామీఇప్పటికి ఏడాదైనా కనీసం జాబ్ కేలండర్ కూడా ప్రకటించని చంద్రబాబు సర్కార్నిరుద్యోగ భృతి ఊసే ఎత్తని కూటమి ప్రభుత్వంనిరుద్యోగ భృతి రూపంలో ఇప్పటికే రూ.7,200 కోట్ల బకాయి2025-26 బడ్జెట్లోనూ నిరుద్యోగ భృతికి పైసా కేటాయించని చంద్రబాబుచంద్రబాబు మోసాన్ని నిరసిస్తూ నేడు వైఎస్సార్ సీపీ ఆందోళనలుకలెక్టరేట్ల ఎదుట భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపుకృతి లేదు.. భృతి లేదు 2014 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చే వరకూ యువతీ యువకులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. చేయడానికి పని (కృతి) కల్పించకపోగా.. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అదే హామీని చంద్రబాబు ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు.. ఉద్యోగాలు వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు.నో జాబ్స్..ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. ఉద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటివరకూ నిరుద్యోగ భృతిని ఏ ఒక్కరికీ అందించలేదు. ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలను నిరుద్యోగ భృతిగా చెల్లించాలి. కానీ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నిరుద్యోగ భృతి చెల్లించలేదు. అంటే.. ఇప్పటికే నిరుద్యోగ భృతి రూపంలో 2 లక్షల మందికి రూ.7,200 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. 2025–26 సంవత్సరంలోనూ నిరుద్యోగ భృతికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అంటే.. ఈ ఏడాదికి కూడా ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వరనే విషయం స్పష్టమవుతోంది. అమలు చేసేశామంటూ అబద్ధాలు నిరుద్యోగ భృతిని స్కిల్ డెవలప్మెంట్తో అనుసంధానం చేశామని.. అందువల్ల ఆ హామీని అమలు చేసేశామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఇంకా ఎవరైనా ఆ హామీ అమలుపై ప్రశ్నిస్తే వారికి తోలు మందం తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు కాలేజీలకే ఫీజు రీయింబర్స్మెంట్ రుసుము చెల్లించి విద్యార్థులకు చిక్కులు లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఫీజు రీయింబర్స్మెంట్ రుసుం చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. 6 త్రైమాసికాలకు రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యార్థులకు ఇవ్వాలి. వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ రెండు పథకాల కింద రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చి విద్యార్థులను నట్టేట ముంచేశారు. ఇక అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం కింద ఏ ఒక్కరికీ ఇప్పటిదాకా సాయం అందించలేదు. -
అబ్రకదబ్ర.. సూపర్ సిక్స్ ఇచ్చేశా.. మాయాఫెస్టోతో నయ వంచన!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా 143 హామీలతో చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు అంతకంటే రెండింతలు అధికంగా సంక్షేమం అందిస్తామని వాగ్దానం చేశారు. వాటిని నమ్మిన ప్రజానీకం ఓట్లేసి టీడీపీ కూటమిని గెలిపించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా మేనిఫెస్టో అమలుపై దృష్టి పెట్టడం లేదు. పైగా సూపర్ సిక్స్ సహా 143 హామీలు అమలు చేసేశామని.. కాదూ కూడదని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారికి నాలుక మందం తప్ప మరొకటి కాదంటూ సీఎం చంద్రబాబు బెదిరింపులకు దిగుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారని గుర్తు చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోకు నాటి సీఎం వైఎస్ జగన్ సిసలైన నిర్వచనం చెప్పారని ప్రశంసిస్తున్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చాక, మద్య నిషేధాన్ని ఎత్తేయడం.. 1999, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడాన్ని ఎత్తిచూపుతూ చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని మళ్లీ నిద్ర లేపడమేనని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ప్రజలను జాగృతం చేశారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.వైఎస్ జగన్ చెప్పినట్లే.. ఎన్నికల మేనిఫెస్టోను సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేశారని, హామీల అమలు పూచీ నాదంటూ గ్యారంటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వాటిపై నోరు మెదపడం లేదని ఎత్తి చూపుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయక పోవడం ద్వారా ఏడాదిలోనే ప్రజలకు రూ.81,397.83 కోట్లను చంద్రబాబు ఎగ్గొట్టారు. మిగతా హామీలను తుంగలో తొక్కడం ద్వారా అంతే స్థాయిలో సీఎం చంద్రబాబు ఎగ్గొట్టారని ప్రజానీకం మండిపడుతోంది. ఏడాదిలో ఏమీ చేయకపోగా, ఎంతో చేసేసినట్లు సంబరాలకు సిద్ధమవడాన్ని తీవ్రంగా తప్పు పడుతోంది.బీసీలకు వెన్నుపోటు⇒ బీసీలే టీడీపీకి వెన్నెముక అంటూ పదే పదే చెప్పే సీఎం చంద్రబాబు.. ఆ వర్గాల ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి వెన్నుపోటు పొడిచారు. బీసీ వర్గాల ప్రజల స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.పది వేల కోట్లు వ్యయం చేస్తామని హామీ ఇచ్చారు. అంటే.. ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున స్వయం ఉపాధికి వ్యయం చేయాలి. కానీ.. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ⇒ రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ లెక్కన ఈ పథకానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఖర్చు చేయాలి. కానీ..ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ⇒ చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటి దాకా అమలు చేయలేదు. పవర్ లూమ్‌లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారే గానీ అమలు చేయలేదు. ⇒ నాయీ బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీని అమలు చేయలేదు. దేవాలయాల్లో పని చేసే నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం రూ.25 వేలు ఇస్తామన్న హామీని గాలికి వదిలేశారు. ⇒ వడ్డెరలకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్.. రాయల్టీ, సీనరేజీ చార్జీల్లో మినహాయింపు ఇస్తామని ఇచ్చిన హామీ అమలు చేయలేదు. రజకులకు దోబీఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహకం, విద్యుత్ చార్జీల రాయితీ ఇస్తామన్న హామీ అమలు జాడే లేదు.⇒ వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. తొలి ఏడాది ఆ సాయం అందించకుండా రూ.265 కోట్లు ఎగ్గొటా్టరు. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం అందిస్తామన్న హామీని తుంగలో తొక్కారు.మహిళలకు మోసం ⇒ 2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, చేయకుండా మహిళలకు మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడూ అదే రీతిలో వంచించారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ.. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు.⇒ అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని, ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారు.⇒ ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామని, విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు ఇస్తామని.. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు పునరుద్ధరిస్తామంటూ ఇచ్చిన హామీలను ఇప్పటిదాకా అమలు చేయలేదు.ఎస్సీ, ఎస్టీలకు నమ్మకద్రోహంఎస్సీ, ఎస్టీలకు కూటమి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేస్తోంది. సబ్ ప్లాన్ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తామని నమ్మబలికి.. వాటిని ఇతర పనులకు మళ్లిస్తూ అన్యాయం చేస్తోంది. చివరకు గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేయకపోవడమే అందుకు నిదర్శనం.రైతులకు తీరని ద్రోహంవ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని 2014లో హామీ ఇచ్చి వాటిని మాఫీ చేయకుండా రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు.. ఇప్పుడూ అదే రీతిలో అన్నదాతలకు ద్రోహం చేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ.. వరి నుంచి కోకో వరకూ ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించలేదు. గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. రైతు భరోసాగా కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ రూ.20 వేలు ఇస్తామని ప్రకటించి మొదటి ఏడాది రూ.10,716.53 కోట్లు్ల ఎగ్గొట్టారు.ఉద్యోగులకూ మోసం సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేస్తామని 2014లో హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేసిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడూ అదే రీతిలో ద్రోహం చేస్తున్నారు. మెరుగైన పీఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ చైర్మన్‌ను రాజీనామా చేయించారు. ఇప్పటికీ తిరిగి చైర్మన్‌ను నియమించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటిదాకా ఐఆర్ ఊసే లేదు. అలవెన్స్ పేమెంట్స్‌పైన కూడా పునఃపరిశీలన చేస్తామని హామీ ఇచ్చి, నాలుగు డీఏలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. వెరసి ఉద్యోగులకు రూ.20 వేల కోట్లకుపైగా బకాయిపడ్డారు.⇒ వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థనే రద్దు చేసి 2.60 లక్షల మంది వలంటీర్లను ఉద్యోగాల నుంచి తీసేసి వారికి ద్రోహం చేశారు.కాపులకు రూ.3 వేల కోట్లు బకాయి ⇒ కాపు సామాజిక వర్గంపై చంద్రబాబుది కపట ప్రేమేనన్నది మరోసారి స్పష్టమైంది. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపు సంక్షేమం కోసం రానున్న ఐదేళ్లలో కనీసంగా రూ.15 వేల కోట్లు నిధులు కేటాయించి.. కాపుల సాధికారత, అభివృద్ధి కోసం చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అంటే.. ఏడాదికి రూ.3 వేల కోట్లు చొప్పున ఖర్చు చేయాలి.కానీ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. అంటే.. ఇప్పటికే కాపులకు రూ.3 వేల కోట్లు బకాయిపడ్డారు. 2025–26 బడ్జెట్లోనూ కాపులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఇచ్చిన హామీకి దిక్కే లేదు.ముస్లిం మైనార్టీలకు దోఖా ⇒ హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.లక్ష సాయం అందిస్తామని, మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు, అర్హత ఉన్న ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. వాటిని ఇప్పటి దాకా అమలు చేయలేదు. విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం ఇప్పటికీ చేపట్టలేదు. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్లకు స్థలాలు కేటాయిస్తామన్న హామీకి దిక్కేలేదు. ⇒ నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. ప్రతి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని, రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న హామీ అమలు జాడే లేదు.⇒ క్రిస్టియన్ మిషనరీస్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని, చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందిస్తామని.. శ్మశాన వాటికలకు స్థల కేటాయింపు, జెరూసలెం యాత్రికులకు సాయం అందిస్తామంటూ ఇచ్చిన హామీని ఇప్పటి దాకా అమలు చేయలేదు.విద్యార్థుల జీవితాలతో చెలగాటం కాలేజీలకే ఫీజు రీయింబర్స్మెంట్ రుసుము చెల్లించి విద్యార్థులకు చిక్కులు లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఫీజు రీయింబర్స్మెంట్ రుసుం చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఆరు త్రైమాసికాలకు సంబంధించి రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యార్థులకు ఇవ్వాలి. వసతి దీవెన కింద మరో రూ.2,200 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ రెండు పథకాల కింద రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చి విద్యార్థులను నట్టేట ముంచేశారు. ఇక డాక్టర్ అంబేడ్కర్ విదేశీ విద్య పథకం కింద ఏ ఒక్కరికీ ఇప్పటిదాకా సాయం అందించలేదు.గాల్లో దీపంగా ప్రజారోగ్యం దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని, అన్ని మండల కేంద్రాలలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని.. బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. కానీ.. ఆ హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. గత ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు పూర్తిగా నీరుగార్చేశారు.ఈ పథకం కింద చికిత్స అందించడానికి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. కానీ.. గత ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేయించుకున్న వారికి రూ.3,600 కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకున్న వారు విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు వంతున ఆరోగ్య ఆసరా కింద గత ప్రభుత్వం ఇచ్చేది. ఆరోగ్య ఆసరాకు ఏటా రూ.400 కోట్లు అవుతుంది. ఆరోగ్యశ్రీ రూ.3600 కోట్లు, ఆరోగ్య ఆసరా రూ.400 కోట్లు మొత్తం రూ.4000 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు.విద్యుత్ చార్జీల బాదుడు రూ.15,485 కోట్లు విద్యుత్ చార్జీలు పెంచం.. తగ్గిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీలను తగ్గించకపోగా భారీగా పెంచేశారు. విద్యుత్ చార్జీల రూపంలో ఏడాదిలోనే రూ.15,485 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు.అగ్రవర్ణ పేదలకు అన్యాయం ⇒ వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ బ్రాహ్మణులకు యువగళం కింద నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి, ఏడాదిగా ఒక్కరికీ ఇవ్వకుండా వంచించారు. ⇒ ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదు. ⇒ భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్టుగా నామకరణం చేయలేదు. ⇒ కమ్మ, రెడ్డి, వెలమ తదితర అగ్ర కుల కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి.. వారి సాధికార, అభివృద్ధికి చర్యలు చేపడతామన్న హామీని తుంగలో తొక్కారు. చెదురుతున్న సొంతింటి స్వప్నం గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఏడాదిగా ఏ ఒక్కరికీ సెంటు స్థలం ఇవ్వలేదు. కొత్తగా ఇళ్లు మంజూరు చేయలేదు. పేదల సొంతింటి స్వపాన్ని చిదిమేస్తున్నారు.నత్తనడకన సాగునీటి ప్రాజెక్టులు పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తామని, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశధార–నాగావళి అనుసంధానం వంటి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని.. ప్రతి ఎకరాకు నీళ్లందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకే కుదించి ఆ ప్రాజెక్టును బ్యారేజ్‌గా మార్చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. గాలేరు–నగరి ఆపేశారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కుల నుంచి 3,850 క్యూసెక్కులకు తగ్గించి లైనింగ్ చేస్తున్నారు. రూ.1400 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం శీతకన్ను వేసింది.బాదుడే బాదుడు ⇒ పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తామన్న∙హామీ నిలుపుకోలేదు. ⇒ మద్యం ధరలను నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఊరూరా.. వాడవాడన బెల్ట్‌షాపులు వెలిశాయి. ⇒ రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి.. పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే ఎండీయూ వ్యవస్థను రద్దు చేశారు. 9,260 ఎండీయూ యూనిట్లు రద్దు చేశారు. దాంతో ఎండీయూ వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు 20 వేల మంది రోడ్డున పడ్డారు. రేషన్ కోసం దుకాణాల వద్ద పడిగాపులు పడే పరిస్థితి తెచ్చారు. -
అప్పుల కోసం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అప్పుల కోసం టీడీపీ కూటమి సర్కారు మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించేందుకు బరి తెగించిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) జారీ చేసే ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్) బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ (సంచిత నిధి)పై అజమాయిషీ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉన్నప్పటికీ.. ఏపీఎండీసీకి ఎన్సీడీ బాండ్ల జారీకి అనుమతి ఇవ్వడం సరికాదన్నారు.ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని స్పష్టం చేస్తూ ఆదివారం ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. అందులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మరోసారి ఉల్లంఘించింది. అప్పుల కోసం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి జూన్ 24న ఎన్సీడీ బాండ్ల జారీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. శాసనసభ ఆమోదం తీసుకున్న అంశాలకు మాత్రమే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రభుత్వం నిధులు తీసుకోవచ్చు. కానీ.. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు తీసుకునేలా ప్రైవేట్ పార్టీలను అనుమతించడం రాజ్యాంగంలోని 203, 204 అధికరణ (ఆరి్టకల్)లను ఉల్లంఘించడమే. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్‌ను తాకట్టు పెట్టి రుణం తీసుకోవడానికి ఏపీఎండీసీకి అనుమతి ఇవ్వడం రాజ్యాంగంలోని అధికరణ 293(1)ని ఉల్లంఘించడమే.ఎన్సీడీ బాండ్ హోల్డర్లకు ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలపై ప్రత్యేక హక్కు కల్పించిన తర్వాత అంతకంటే ఎక్కువ వడ్డీ ఇవ్వడమంటే దారుణం. దీనికి అదనంగా రూ.1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఖనిజ సంపదను ఎన్సీడీ బాండ్ హోల్డర్లకు తనఖా పెట్టారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు విచారణలో ఉంది. ప్రతివాదులకు కౌంటర్లు దాఖలు చేయమని హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లు కూడా తెలిసింది. హైకోర్టు విచారణలో ఉన్నప్పుడు బాండ్ల జారీని కొనసాగించడానికి ఏపీఎండీసీని ప్రభుత్వం అనుమతించడం సరి కాదు. ఇది రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టడమే. భారత రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించడమే’’. -
‘ఖర్చు రూ.300 కోట్లు.. కానీ గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేకపోయారా? చంద్రబాబు’
సాక్షి,విశాఖ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకు ఏం చేసిందో చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. యోగా కార్యక్రమాన్ని చంద్రబాబు పబ్లిసిటీకి వాడుకున్నారు. యోగాకు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించలేదు.డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు దిట్ట.హామీల అమలును ప్రజలు ప్రశ్నిస్తే చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారు. విద్యార్థులకు అండగా వైఎస్సార్సీపీ యువతపోరు కార్యక్రమం చేపడుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదు.రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ యువత పోరు నిర్వహిస్తున్నాం. చంద్రబాబును ప్రజల్ని నమ్మి నట్టేటా ముంచారు. విశాఖకు ప్రధాని మోదీని ఆహ్వానించి పెద్ద డ్రామా చేశారు. గిరిజన పిల్లల్ని యోగా పేరుతో ఇబ్బంది పెట్టారు. 300 కోట్లు ఖర్చు చేసి కనీసం బోజనాలు, మ్యాట్స్, టిఫిన్స్, మంచి నీళ్ళు ఇవ్వలేక పోయారు. ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు యోగా డ్రామాలు. తక్కువ సమయంలో ఎక్కువ అప్పలు చంద్రబాబు రికార్డ్ సృష్టించారు. వైఎస్సార్సీపీ హాయాంలో జరిగిన అభివృద్ధి తమ హాయంలోనే జరిగిందని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది’అని మండిపడ్డారు. -
‘వ్యవసాయం దండగన్న చంద్రబాబు.. రైతులకు ఏం మేలు చేస్తాడు?’
సాక్షి, చిత్తూరు జిల్లా: వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతులకు ఏం మేలుచేస్తాడంటూ.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పుంగనూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కోట్ల రూపాయలు చిత్తూరు జిల్లాలో టమోటా రైతులు నష్టపోయారన్నారు. తోతాపురి మామిడి కాయలు కిలో 2,3 రూపాయలు ధరలు ఉంటే రైతులు ఎలా బతకాలి? చంద్రబాబు చెప్పేటివి బూటకపు మాటలు’’ అంటూ మండిపడ్డారు.‘‘ఎన్నిసార్లు చంద్రబాబు సీఎం అయిన రైతులను పట్టించుకున్నది లేదు. వ్యవసాయం దండగ అని స్వయనా ఒక సీఎంగా ఉంటూ ఆయన మాట్లాడారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే రైతులకు గిట్టుబాటు ధరలు ఎక్కడ వస్తాయి?. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా బాధాకరం. మన రాష్ట్రంలో దాదాపు 75 శాతం రైతులు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు. రైతులకు ప్రభుత్వం చేదోడు వాదోడుగా నిలవాల్సిందిపోయి అందరి రైతుల ఉసురుతీస్తున్నారు’’ అని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.‘‘రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వైఎస్ జగన్ వెళ్తుంటే.. వైఎస్సార్సీపీ నాయకులను వేధిస్తూ కేసులు పెడుతున్నారు. ప్రజలను భయబ్రాంతులకు ఈ ప్రభుత్వం గురిచేస్తోంది. మా ప్రభుత్వంలో రైతుల నుంచి టమోటా కొని రైతులను అదుకున్నాం. గతంలో రైతులు క్రాప్ హాలిడే అని పెట్టారు. ఇక నాలుగు సంవత్సరాలు రైతులు ఈ ప్రభుత్వంలో సెలవులో ఉండాల్సిందే. రైతులకు చేయూత ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు పట్టించుకోవడం లేదు’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. -
రోడ్డెక్కిన టీచర్లు.. చంద్రబాబు సర్కార్ తీరుపై నిరసన
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు సర్కార్ తీరుకి నిరసనగా టీచర్లు వరుస ఆందోళనలు చేస్తున్నారు. మొన్న ఎస్జీటీలు.. నేడు ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. విశాఖలో మినిమమ్ టైమ్ స్కేల్ ఉపాధ్యాయులు రోడ్కెక్కారు. నేడు జరగాల్సిన కౌన్సిలింగ్‌ను టీచర్లు బహిష్కరించారు. డీఈవో కార్యాలయం వద్ద ఎంటీఎస్ ఉపాధ్యాయులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ఏజెన్సీ వేకెన్సీలు మాత్రమే చూపడంపై టీచర్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారుకాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులను బదిలీలు చేయొద్దని డిమాండ్ చేస్తూ చేశారు. సింగిల్ టీచర్ పోస్టులను నిరాకరిస్తున్న ఉపాధ్యాయులు.. మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో ఒక ఎంటీఎస్ టీచర్‌ను నియమించాలని డిమాండ్ చేసూ.. డీఈవో కార్యాలయం వద్ద బైఠాయించారు. -
చంద్రబాబు ముఖంలో అదే క్రూరత్వం, కుటిలత్వం: సజ్జల
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని అయిపోయిందని.. ప్రజా సమస్యలపై ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా ఆయనకు లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. యోగా డే పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారంటూ.. శనివారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మామిడి రైలు సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. చంద్రబాబు తీరుతో తీరుతో ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా?. చివరకు సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఆయనకు ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా లేకుండా పోయింది. సీఎంగా చంద్రబాబు పని అయిపోయింది. 👉జగన్ మొన్నీమధ్యే వెళ్లి వచ్చాక కేంద్ర మంత్రి వెళ్లి పొగాకు రైతులను కలిశారు. గతంలో గిట్టుబాటు ధరలు లేకపోతే జగన్ పిలిచి చర్చలు జరిపేవారు. గిట్టుబాటు ధర వచ్చేదాకా చేయాల్సిందంతా చేసేవారు. కానీ, ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదు. కేవలం మీడియా హైప్‌తోనే చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారు. 👉రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. కూటమి పాలనలో వీధుల్లోనే గంజాయి అమ్ముతున్నారు. కుప్పంలో జరిగే అరాచకాలు చంద్రబాబుకి కనిపించడం లేదా?. పోలీసుల వ్యవస్థను భ్రష్టు పట్టించారు. అమాయకులపై, వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. అడిగితే తాట తీస్తా! అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలను సజ్జల వీడియో ప్రదర్శించి చూపించారు.👉హిప్నటిస్ట్ తరహాలో చంద్రబాబు ప్రవర్తన ఉంటోంది. చంద్రబాబు తాను చేసే తప్పులను ఎదుటి వారిపై నెడతారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏది జరిగినా జగన్‌పై నెపం వేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. యోగా డే పేరుతో తండ్రీకొడుకులు డ్రామాలు చేస్తున్నారు. యోగా బాగా అలవాటు ఉండేవారికి స్థితప్రజ్ఞత కనిపిస్తుంది. కానీ, చంద్రబాబు మోహంలో అదే క్రూరత్వం, కుటిలత్వం కనిపిస్తున్నాయి. 👉చంద్రబాబు ఏడాది పాలనంతా డొల్లా. ఆయనకు అధికారం అంటే బాధ్యత లేదు. లేని స్కాం పేరు చెప్పి డ్రామా చేస్తున్నారు. ఐదేళ్లు లిక్కర్‌స్కాం పేరుతో కథ నడిపిస్తారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు విఫలం అయ్యాయి. ఆయన అధికారంలో వచ్చాక అనేక పథకాలకు కోత పట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు తప్పకుండా చంద్రబాబుని నిలదీస్తారు. 👉వైఎస్సార్సీపీ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పడం లేదు. చంద్రబాబుకి అసలు పరిపక్వతే లేదు. ప్రెస్ మీట్లో జగన్ అడిగిన ప్రశ్నలకు బాబు సమాధానం ఇవ్వడం లేదు. భూస్థాపితం చేస్తారట.. తాట తీస్తారట.. ఇవేనా ఆయన ఇచ్చే సమాధానాలు. రప్పా రప్పా ఫ్లకార్డులపై నానా రాద్దాంతం చేస్తున్నారు. ఆ ఫ్లకార్డు పట్టుకుంది టీడీపీ కార్యకర్తే. పవన్ కల్యాణ్ ఎక్కడ? రాష్ట్రంలో ఆయన ఎక్కడా కనిపించడం లేదు. 👉వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ నిబద్ధతతో ఇచ్చిన హామీలు అమలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక లక్షా 67 వేల కోట్లు అప్పు చేశారు. ఎన్నికల సమయంలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ఇంటింటికీ బాండ్లు పంపిణీ చేశారు. ఇప్పుడది చంద్రబాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ హామీలు అమలు చేసేదాకా ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తూనే.. పోరాడుతూనే ఉంటుంది అని సజ్జల ఉద్ఘాటించారు. -
ప్రజలకు.. ‘వైఎస్ జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లా,సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించి కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. వైఎస్ జగన్ రెంట పాళ్ల పర్యటనపై విడుదల రజిని శుక్రవారం మీడియా మాట్లాడారు.పల్నాడుజిల్లా చిలకలూరిపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకూ వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పెరుగుతున్న ఆదరణ, కూటమి పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహంను చూసి భయంతో రాజకీయంగా ఆయన ఉనికినే లేకుండా చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ఎటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేశాడో మొత్తం రాష్ట్ర ప్రజలంతా చూశారని అన్నారు. ఈ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఇంకా ఆమె ఎమన్నారంటే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఏకంగా మాజీ సీఎం ఎస్ జగన్‌ను భూస్థాపితం చేస్తానంటూ మాట్లాడారు. ఆయన పార్టీలోని మరో నేత బుచ్చయ్యచౌదరి విచక్షణ మరిచి వైఎస్ జగన్‌కు హాని కలిగిస్తామనే రీతిలో దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇవ్వన్నీ చూస్తుంటే టీడీపీ తెర వెనుక ఏదో కుట్ర చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి.ప్రజాధరణకు పల్నాడు పర్యటనే సాక్ష్యంపల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనను కూటమి ప్రభుత్వం అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా ప్రజలు మాత్రం ఆయనను అక్కున చేర్చుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ చెందిన నాయకుడు నాగమల్లేశ్వరరావును పోలీసుల ద్వారా తీవ్రంగా వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వస్తున్న నేపథ్యంలో మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని మోహరించి, ఆయన పర్యాటనను విఫలం చేయాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం వ్యవహరించింది. ఈ పర్యటనకు వాహనాలను అందించకూడదని ట్రావెల్ ఏజెన్సీలను బెదిరించారు, పెట్రోల్ బంక్‌లు, హోటళ్ళను బలవంతంగా మూసివేయించారు. అయినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్‌ను చూసేందుకు తరలివచ్చారు. వైఎస్ జగన్‌కు అడుగుడుగునా స్వాగతం పలుకుతూ రోడ్లపై పోటెత్తారు. వైఎస్ జగన్ అంటేనే దేశంలోనే అత్యంత ప్రజాధరణ పొందిన నాయకుడు. ఈ కూటమి ప్రభుత్వ మోసాన్ని గుర్తించామంటూ వైఎస్ జగన్‌కు ప్రజలు తమ మద్దతును ప్రకటించారు.చనిపోయిన వారిపైనా రాజకీయమా?వైఎస్ జగన్ పర్యటనలో దురదృష్టవశాత్తు ఇరువురు చనిపోతే, దానిని కూడా వివాదంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నించింది. వైఎస్ జగన్ కాన్వాయి వాహనం తగిలి సింగయ్య అనే వ్యక్తి చనిపోయారంటూ ఒక తప్పుడు ప్రచారం చేశారు. అలాగే సత్తెనపల్లిలో ఒక యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు, అతడిని ఆసుపత్రికి తరలించే సరికే అతడు చనిపోయాడు. ఈ ఘటనలు గురించి తెలియగానే వైఎస్ఆర్సీపీ నేతలు వారి కుటుంబసభ్యులను పరామర్శించడం, ఆ కుటుంబాలకు ఆర్థిక సాయంను అందచేయడం కూడా జరిగింది. ఆ కుటుంబాల పట్ల మా బాధ్యతను ఎక్కడా మరిచిపోలేదు. చివరికి వారి అంత్యక్రియల్లో కూడా పార్టీ నేతలు ఎంతో బాధతో పాల్గొని, ఆ కుటుంబాలను ఓదార్చడం జరిగింది. అమాయకుల ప్రాణాలను బలికొన్నది చంద్రబాబు కాదా?చంద్రబాబు గతంలో సీఎంగా ఉండి, గోదావరి పుష్కరాల సందర్బంగా తన ప్రచారయావతో 29 మందిని బలితీసుకున్నారు. ఇరుకుసందుల్లో సభలను పెట్టి, జనాలను ఎక్కువగా చూపాలనే ప్రయత్నంలో భాగంగా కందుకూరిలో ఎనిమిది మందిని పొట్టనపెట్టుకున్నారు. అలాగే గుంటూరులో టీడీపీ తరుఫున చీరెల పంపిణీ పేరుతో మహిళలకు ఆశచూపి, తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితిలో ముగ్గురు చనిపోయారు. చంద్రబాబు అసమర్థ పాలనలో తిరుపతి క్యూలెన్లలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వీరి కుటుంబాలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఈ మరణాలు చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలు కావా? తన వల్ల జరిగిన దారుణాలను చంద్రబాబు మరిచిపోయారా?’ అని ప్రశ్నించారు. -
మీ తప్పులు ఎత్తిచూపితే భూస్థాపితం చేస్తారా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వ మోసాలు, అబద్ధాలు, అవినీతిపై ప్రశ్నించే గొంతులను నులిమేసేందుకు తప్పుడు వాంగ్మూలాలు, సాక్ష్యాలు సృష్టించి.. అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఆయన ప్రతి మాటలోనూ అసహనం కనిపిస్తోందని, నియంతలా మారి అణచివేత అన్న పదానికి నిర్వచనంగా మారారని దెప్పి పొడిచారు.రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోందని, ఈ నెల 4న వైఎస్సార్సీపీ నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి ప్రజలు విశేషంగా స్పందించడమే ఇందుకు నిదర్శనమని ఎత్తిచూపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు, నాణేనికి రెండో వైపు ఉన్న వాస్తవాలను సాక్ష్యాధారాలతో వివరించారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను కడిగిపారేశారు. ‘ప్రజల సమస్యల పట్ల ఎవరైనా గొంతు విప్పితే చాలు చంద్రబాబు భూస్థాపితం చేస్తానంటున్నారు. 76 ఏళ్ల వయస్సున్న వ్యక్తి, సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అనాల్సిన మాటలేనా? ఒక ఎల్లో మీడియా టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మీడియా ఓనర్.. ప్రతిపక్ష నాయకుడిని ఎప్పుడు భూస్థాపితం చేస్తారు అని అడగడం.. దానికి ఇదిగో మొదలు పెట్టేశా.. త్వరలోనే చేస్తాను.. అంటూ ఈ 76 ఏళ్ల ముసాలాయన చెప్పడం ఎంత వరకు సమంజసం? ఈ వయసులో రెడ్ బుక్ పాలన ఏమిటి? ఈ బెదిరింపులు ఏమిటి? వాడిని తొక్కుతా.. వీడిని తొక్కుతా.. అనే మాటలు ఏమిటి?ప్రజలు, దేవుడి దయతో అధికారంలోకి వచ్చారు. వచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయాల్సింది పోయి.. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి, అబద్ధాలు, మోసాలతో పరిపాలన సాగిస్తున్నారు. ప్రజల కోసం ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తానంటూ బెదిరిస్తున్నారు’ అని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రజల్లో, కార్యకర్తల్లో విప్లవం వచ్చింది పల్నాడు జిల్లాలో నిన్న (బుధవారం) నా కార్యక్రమం కర్ఫ్యూ పరిస్థితుల మధ్య జరిగింది. కష్టాల్లో ఉన్న ప్రజల్ని, మా పార్టీ కార్యకర్తలను నేను పరామర్శిస్తే తప్పా చంద్రబాబూ? నా పర్యటనకు ఎందుకు అన్ని ఆంక్షలు పెట్టాలి? పోలీసులను ఎక్కడ పడితే అక్కడ పెట్టి.. నా పర్యటనకు ఎవరూ రాకూడదని ఆదేశాలు జారీ చేయడం.. వచ్చిన వాళ్లను ఎక్కడికక్కడ కట్టడి చేయడం ఎందుకు? చంద్రబాబు చేతలు, మాటలను బట్టే ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ విప్లవం వచ్చింది. నిన్న జరిగిన నా కార్యక్రమం ఎలా జరిగిందో నేను చెప్పాల్సిన పనిలేదు. మీ అందరికీ తెలిసిందే. మొన్న పొగాకు రైతులకు భరోసా ఇచ్చేందుకు పొదిలి వెళ్తే.. అక్కడ కూడా ఇదే రీతిలో వ్యవహరించారు. పొగాకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అదే సమయంలో పర్చూరు, కొండేపిలో ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ పరిస్థితుల మధ్య రైతులకు సంఘీభావం తెలిపేందుకు ప్రతిపక్ష నాయకుడు వెళ్తే పోలీసుల ద్వారా చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు రాని పరిస్థితి నెలకొంది. ధాన్యాన్ని రైతులు బస్తా రూ.300 తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది. మిరప, పత్తి, జొన్న, పెసలు, కందులు, మినుములు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశనగ, అరటి, చీని, కోకో ఇప్పుడు పొగాకు, మామిడి.. ఇలా ప్రతీ పంటకు కనీస మద్దతు ధర దక్కక రైతులు అష్టకష్టాలు పడతున్నారు. ఈ మధ్య కాలంలో కొండపిలో ఇద్దరు.. రెండు రోజుల కిందట చిలకలూరిపేటలో ఇద్దరు, వినుకొండలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.తప్పుడు ఆలోచనలు.. తప్పుడు పనులు » తప్పుడు కేసుల పరంపరలో ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు బనాయించారు. ఈయన 2009, 2012, 2014, 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. మాచర్లలో అజమాయిషీ కోసం పిన్నెల్లిని తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. మంగళగిరిలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసులు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై రెండుసార్లు కేసులు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి బెయిల్ తెస్తే, మరో కేసు పెట్టి అరెస్టు చేశారు. సురేష్ భార్యపైనా కేసు పెట్టారు. » వల్లభనేని వంశీని అక్రమ కేసులతో జైలులో పెట్టారు. దాదాపు 2 నెలలు దాటింది. ఒక కేసులో బెయిల్ వస్తే.. మరో కేసు పెడుతున్నారు. ఇప్పటికే వంశీపై 13 కేసులు పెట్టారు. జోగి రమేష్ కొడుకు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. కృష్ణమోహన్ అన్న.. ఆయన నా ఓఎస్డీ. పాపం ఆయన్ను చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. ఆయన ఓ ఆర్డీవో.. ధనుంజయరెడ్డిని చూసినా జాలి అనిపిస్తుంది. వీళ్లంతా మచ్చలేని అధికారులు. » మరొక పక్క రాజ్ కేసిరెడ్డి, బాలాజీ, గోవిందప్ప ఇలాంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మా ఎంపీ మిథున్‌రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలా అని వెంటపడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడో కాలేజ్‌లో చదువుకున్న రోజుల్లో చంద్రబాబును కొట్టారట. ఆ కోçపం ఇప్పటికీ చంద్రబాబు మనసులో ఉంది. ఆయన్ను ఏదో విధంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు. ఆయన కొడుకునూ అరెస్ట్ చేయాలని కుట్రలు చేస్తున్నాడు.» పేర్ని నానిపై తప్పుడు కేసులు పెడుతున్నాడు. ఆయన భార్య జయసుధమ్మను కూడా ఇరికించాలని ప్రయత్నం. కొడాలి నాని, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు, వైవీ సుబ్బారెడ్డి, ఆయన కొడుకు, దేవినేని అవినాష్, తలశిల రఘురాం, అంబటి రాంబాబు, విడదల రజిని, దళిత ఎమ్మెల్యే అయిన తాటిపర్తి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్, మాజీ మంత్రి, బీసీ మహిళాæ నేత ఉషాచరణ్, తోపుదుర్తి ప్రకాష్, గోరంట్ల మాధవ్, విజయవాడలో గౌతంరెడ్డి, మాజీ మంత్రి, దళిత నాయకుడు మేరుగు నాగార్జున, మరో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.. తదితరులందరిపై తప్పుడు కేసులు పెట్టి.. ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలా.. అని చూస్తున్నాడు. » జగన్ చుట్టూ ఉన్న వారిని భయపెట్టాలి. చిన్న చిన్న వ్యక్తులను భయపెట్టడం, కొట్టడం, తప్పుడు వాంగ్మూలాలు తీసుకోవడం, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని అరెస్టు చేయడం. ఇలా అన్నింటికీ ఒకటే మోడస్ ఆపరెండి (పని చేసే విధానం). అన్నీ తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు.చంద్రబాబు చెంప చెళ్లుమన్పించేలా సుప్రీంకోర్టు తీర్పు» కొమ్మినేని శ్రీనివాస్ మీడియా రంగంలో సుదీర్ఘంగా సేవలందించారు. 70 ఏళ్ల వయస్సులో ఆయన ఏం పాపం చేశారని చంద్రబాబు జైలుకు పంపించారు? ఎందుకంత ఉత్సాహం చూపించారు? ఒక డిబేట్ జరిగేటప్పుడు సహజంగానే అనుకూలంగా, వ్యతిరేకంగా కొంత మంది మాట్లాడతారు. ప్యానలిస్టు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం? ఇది మినిమం లాజిక్. అలాంటిది ఆయన్ను జైలులో పెట్టారు. కొమ్మినేనిపై చంద్రబాబుకు కోపం ఎక్కువే. గతంలో కొమ్మినేని ఉద్యోగాన్ని ఊడగొట్టడంలో చంద్రబాబు క్రియాశీలక పాత్ర పోషించారు. అంతటితో సంతోష పడకుండా ఆయన జీవితం నాశనం చేయాలని, పరువు తీయాలని, జైలులో పెట్టాలని దిక్కుమాలిన ఆలోచనలు చేశారు. » కొమ్మినేనిని అరెస్టు చేయడమే కాకుండా.. సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని వ్యవస్థీకృతంగా చేశారు. పథకం ప్రకారం సాక్షి ఆస్తులు టార్గెట్ చేసి విధ్వంసం సృష్టించారు. (ఫొటోలు చూపిస్తూ వివరాలు చదివి వినిపించారు) శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మెట్టా శైలజా, శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గుండు శంకర్ భార్య గుండు స్వాతి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, తెలుగు యువత ప్రెసిడెంట్ మెండా దాసునాయుడు వీళ్లంతా శ్రీకాకుళం సాక్షి కార్యాలయంపై దాడి చేశారు.» విశాఖపట్నం సాక్షి కార్యాలయంపై సిటీ 26వ వార్డు టీడీపీ కార్పొరేటర్ ముక్కా స్వాతి, టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు అనంతలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా సాక్షి కార్యాలయంపై అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. ఈయన పేరుకు బీజేపీనే కానీ టీడీపీ ఎమ్మెల్యే అని అందరికీ తెలుసు. రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, విజయవాడ ఆటోనగర్ సాక్షి ఆఫీసుపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య గద్దె అనూరాధ, గద్దె క్రాంతి.. మంగళగిరి సాక్షి కార్యాలయంపై ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష తదితరులు దాడి చేశారు.» అనంతపురం సాక్షి కార్యాలయంపై టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర సెక్రటరీ స్వప్న, సంగ తేజస్వీని, కడపలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేసు, తిరుపతి రేణిగుంట కార్యాలయంపై తిరుపతి డెప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, టీడీపీ అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం.. గతంలో డెప్యూటీ మేయర్ బై ఎలక్షన్ సందర్భంగా కార్పొరేటర్లను పోలీసులతో కలిసి కిడ్నాప్ చేసిన వ్యక్తులే సాక్షి ఆఫీసులు పగలగొట్టే దానిలో క్రీయాశీలకంగా వ్యవహరించారు. నెల్లూరులో టీడీపీ సిటీ అధ్యక్షురాలు కె.రేవతి, ఏలూరులో టీడీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు చింతల వెంకట రమణ సాక్షిపై దాడి చేసిన ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నారు.» ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న పత్రిక, టీవీ చానల్ గొంతు నులిమేందుకు ఎమ్మెల్యేలతో కలిసి కార్యకర్తలను ఉసిగొలిపి పథకం ప్రకారం దాడులు చేయడం ధర్మమేనా? కొమ్మినేని కేసు విషయంలో సుప్రీంకోర్టు చంద్రబాబు చెంప చెళ్లుమనిపించేలా తీర్పునిచ్చింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 32 కింద తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి కొమ్మినేనిని తక్షణమే విడుదల చేయమని ఆదేశించింది. అదే కేసులో సాక్షి కార్యాలయాలన్నింటినీ టీడీపీ కార్యకర్తలతో ధ్వంసం చేస్తే ప్రభుత్వంలోని చంద్రబాబు బాధ్యుడు కాదా? కొమ్మినేనిని అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన సమయంలో సాక్షి కార్యాలయాలను ధ్వంసం చేయడంలో చంద్రబాబు దోషికాడా? ముఖ్యమంత్రిగా ఉండి చేయాల్సిన పనా ఇది? ఇది తప్పుడు సంప్రదాయం కాదా? రేప్పొద్దున ఇదే సంప్రదాయం కొనసాగితే ఎవరైనా బతుకుతారా? ఈ రోజు సాక్షి, రేప్పొద్దున ఎన్టీవీ, టీ9 కావచ్చు.. ఎవరైనా జర్నలిస్టులు కావచ్చు.. విచ్చలవిడి రౌడీయిజం కాదా? చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజాశక్తి కావచ్చు.. ఇంకొకటి కావచ్చు.. ఎవరు రాసినా, ఎవరు చూపించినా ఇలానే వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం ఏమవుతుంది?ప్రశ్నించే గొంతు నొక్కేందుకే అక్రమ కేసులు » మీ వైఫల్యాల నుంచి డైవర్షన్ చేసేందుకు, ప్రజల సమస్యలపై ఎవరైనా గొంతు విప్పితే ఆ గొంతును నులిమేందుకు ఏడాది కాలంలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ సంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ పల్నాడు జిల్లాలో నా కార్యక్రమానికి ముందు రోజున.. టాపిక్ డైవర్షన్ చేయడం, ప్రశ్నించే గొంతు నొక్కాలన్న లక్ష్యంతోనే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. » ఏడాదిగా లిక్కర్ కేసులో ఏనాడైనా భాస్కర్‌రెడ్డి పేరు వినిపించిందా? ఏదో విధంగా భాస్కర్‌ను ఇరికించడమే లక్ష్యంగా తప్పుడు సాక్ష్యాలు పుట్టిస్తున్నారు. తొలుత భాస్కర్ గన్‌మెన్‌ను పిలిచి భాస్కర్‌కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో జరిగిందని.. దాంట్లో భాస్కర్ పాత్ర ఉందని.. స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేశారు. తాను తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలేనన్నందుకు ఆ గన్‌మెన్‌ను కొట్టి చిత్ర హింసలకు గురిచేశారు.» ఆ కానిస్టేబుల్ తనను కొట్టిన దెబ్బలన్నీ చూపిస్తూ వీడియో తీసి.. జరిగిన ఘటనపై డీజీపీ, గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. కోర్టులో కేసు వేశాడు. నిన్న ఆ కేసు విచారణకు కూడా వచ్చింది. గిరి అనే మరో కానిస్టేబుల్‌ను తీసుకొచ్చి ఆయనతో ఈ కేసు విషయమై భాస్కర్‌తో మాట్లాడినట్టు చెబుతూ సాక్ష్యం పుట్టించారు.ఈ సాక్ష్యంతో భాస్కర్‌ను అరెస్ట్ చేశారు. భాస్కర్ ఆ కానిస్టేబుల్‌తో ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడాడని చెబుతున్నారు. ఎవరైనా సరే తన డ్రైవర్తోనో, తన ఇంట్లో వారితో.. గన్‌మెన్‌తో ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడితే చాలు.. వారిని తీసుకొచ్చి ప్రలోభ పెట్టడం, భయపెట్టడం, తమకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇప్పించడం, ఆ స్టేట్ మెంట్ ఆధారంగా అరెస్ట్‌లు చేయడం చేస్తున్నారు.» స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఇష్టపడకపోతే చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఇలా ఇరికించాలనుకుంటేæ ఎవరు తట్టుకుంటారు? ఎవరినైనా ఇరికించొచ్చు. ఈ తరహా తప్పుడు సంప్రదాయానికి నాంది పలికితే వ్యవస్థ బతుకుతుందా? ఇలాంటి ఘటనల నుంచే నక్సలిజం పుడుతుంది. రాష్ట్రాన్ని బీహార్ చేయడంలో చంద్రబాబు లాంటి గొప్ప నాయకుడు మరొకరు ఉండరు. భాస్కర్‌ను ఎందుకు టార్గెట్ చేశారంటే.. ఆయన నియోజకవర్గం చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గం కాబట్టి. » భాస్కర్ మాత్రమే కాదు మొన్ననే లండన్‌లో చదువు పూర్తి చేసుకొని వచ్చిన ఆయన కొడుకుని కూడా ఈ కేసులో అన్యాయంగా ఇరికించారు. ఇదే నియోజకవర్గంలో 17 వేల ఓట్లతో ఓడిపోయి కుప్పం పారిపోయిన చంద్రబాబు.. మళ్లీ చంద్రగిరిలో రాజకీయాలు చేయాలనే కుట్రలతో భాస్కర్, ఆయన కొడుకును రాజకీయాల నుంచి తప్పించేయాలనే ఆలోచనతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఏమిటి ఈ రాజకీయాలు? వెన్నుపోటు పొడవటంలో ఆయనకు ఆయనే సాటిచంద్రబాబుకు మహిళలపై నిజంగా గౌరవం ఉంటే శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత చిన్నారిని టీడీపీకి చెందిన 14 మంది సామూహిక అత్యాచారం చేస్తే ఏం చేశారు? అదే ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఇంటర్ చదువుతున్న గిరిజన బాలిక సాకే తన్మయి కనపడటం లేదని తల్లిదండ్రులు జూన్ 3న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆరు రోజుల తర్వాత ఆ బాలిక శవమై కనిపించింది. ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేశారు. ఇలాంటి కేసులపై దర్యాప్తు చేయాలి.. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలనే ఆలోచన లేదు. ఎంత సేపు రెడ్‌బుక్ పేరుతో అమాయకులను కేసుల్లో ఇరికించాలనే ఆత్రం తప్ప. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక మహిళలకు వెన్నుపోటు పొడిచాడు. ఇలాంటి చంద్రబాబా మహిళల గౌరవం గురించి మాట్లాడేది? ప్రతి అక్కచెల్లెమ్మ తన కాళ్లపై తాను నిలబడే పరిస్థితి రావాలని, వారి కుటుంబ సభ్యులను దేవతలుగా చూసుకోవాలని ఆరాట పడింది మేము. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఏకంగా రూ.1.89 లక్షల కోట్లను 19 పథకాల ద్వారా నేరుగా డీబీటీ రూపంలో అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. వారి కుటుంబాలకు మేలు చేస్తూ మొత్తం రూ.2.73 లక్షల కోట్లు డీబీటీగా అందించాం. 32 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేశాం. ఒక్కొక్కరి పేరిట రూ.4 లక్షల నుంచిరూ.15 లక్షలకుపైగా విలువైన భూమిని ఇచ్చాం. 22లక్షల ఇళ్లు మంజూరు చేసి 10 లక్షల ఇళ్లు కట్టించాం. మా హయాంలో మిగిలిన 12 లక్షల ఇళ్ల పనులు కూడా వేగంగా జరిగాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చట్టం చేసి మరీ అక్కచెల్లెమ్మలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశాం. ఈ లెక్కన మహిళలపై గౌరవం ఉండేది ఎవరికి? మంచి చేసిన మాకా.. లేక వారి ముసుగులో దౌర్జన్యం చేసే ఆ పెద్దమనిషి చంద్రబాబుకా? రాక్షసత్వం ప్రదర్శించే ఆ వ్యక్తికా? ప్రజలకైనా, మహిళలకైనా, సొంత కూతుర్ని ఇచ్చిన మామకైనా వెన్నుపోటు పొడవటంలో ఆయనకు ఆయనే సాటి. -
QR కోడ్‌తో బాబు మోసాలను నిలదీద్దాం.. ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు
సాక్షి,గుంటూరు: ఏపీలో ఏడాదిగా కూటమి పాలనలో.. టీడీపీ, ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడే పల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు.రాష్ట్రంలో దిగజారిన లాండ్ ఆర్డర్, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోంది. చంద్రబాబు అరాచక పాలనకు వ్యతిరేకంగా మే4న ప్రజలు, వైఎస్సార్పీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేశారు. టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్లా. కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్య నా రెంటపాళ్ల పర్యటన జరిగింది. అయినా విజయవంతమైంది. మా పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా? మొన్నటి పొదిలి పర్యటనలో 40వేల మందిపై రాళ్లేసే ప్రయత్నం చేశారు. రైతులు సంయమనం పాటించారు. అయినా కేసులు పెట్టారు. రైతుల సమస్యల గురించి ఎవరూ మాట్లాడకూడదు. సంఘీభావం తెలపకూడదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు భయం.. ఎందుకు?చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. ఓ టీవీ ఛానెల్లో చంద్రబాబు అహంకార మాటలు వినండి. ప్రతిపక్షను భూస్థాపితం చేస్తారట. ప్రశ్నిస్తున్న వ్యక్తిని భూస్థాపితం చేస్తారా?. ఏడాది కాలంలోనే ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో చంద్రబాబు పాలనపై అసహనం పెరిగింది. ఆ అసహనాన్ని డైవర్ట్ చేస్తూ వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై, నేతలపై కేసులు పెడుతున్నారు. టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి అరెస్ట్ నిజంగా అశ్చర్యకరం. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని గన్‌మెన్‌ను బలవంతం చేశారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనందుకు గన్‌మెన్‌పై దాడి కూడా చేశారు. తనపై జరిగిన దాడిని గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీకి గన్‌మెన్ లేఖ రాశారు. మరో గన్‌మెన్‌ను ప్రలోభాలకు గురిచేసి వారికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు.. అరెస్టులు చెవిరెడ్డితో పాటు ఆయన కొడుకును కేసులో ఇరికించారు. సొంత నియోజవకర్గంలో గెలవలేని వ్యక్తి. చంద్రగిరిలో ఇబ్బంది ఉండకూడదనే చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకొచ్చాం. మళ్లీ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. సురేష్ భార్యపైనా కేసులు పెట్టారు. వల్లభనేని వంశీపై 11 కేసులు పెట్టారు. జోగి రమేష్ కొడుకు, కాకాణిపై తప్పుడు కేసులు. కృష్ణమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిపైనా అక్రమ కేసులు పెట్టారు. కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్నినాని, వైవి సుబ్బారెడ్డి,ఆయన కుమారుడిపై తప్పుడు కేసులు. దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే,అంబటి రాంబాబు, విడదల రజినిపై తప్పుడు కేసులు దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పైనా అక్రమ కేసులు. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిపై, ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్, గోరంట్ల మాధవ్‌పై కేసులు. ఇలా వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొమ్మినేని ఏం పాపం చేశారు.. చంద్రబాబూ?సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఏం పాపం చేశారు? ఏం చేశారని కొమ్మినేనిని అరెస్ట్ చేశారు?టీవీ డిబెట్లో అనలిస్ట్ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం? గతంలో కేఎస్ఆర్ ఉద్యోగాన్ని చంద్రబాబు ఊడగొట్టించారు. కేఎస్ఆర్ అరెస్ట్ అక్రమమేనన్న సుప్రీంకోర్టు.. తనకున్న విచక్షణాధికారాల్ని ఉపయోగించి ఆయన్ను వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలించింది. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టులాంటిది. మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా?మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా అని వైఎస్ జగన్ ప్రెస్మీట్లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు కేరాఫ్‌గా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలోని ఏడుగుర్రాలపల్లిలో ఓ దళిత బాలికపై కొందరు టీడీపీ నేతలు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాలిస్తే ఈ విషయం బయటకొచ్చింది. కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వకుండా భయపెట్టారు. కనీసం చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేదా? న్యాయం చేయాలనే తపన చంద్రబాబుకు లేదు. న్యాయం వైపు నిలిచే వ్యక్తి చంద్రబాబు కాదు. మరో ప్రాంతంలో ఇంటర్ గిరిజన బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. తర్వాత బాలిక శవమై కనిపించింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేశారు. టీడీపీ నేత.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటిప్రజల కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది. 32లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్లను మంజూరు చేసి 10లక్షల ఇళ్లు పూర్తి చేశాం. చట్టం చేసి మరి నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించ్చాం. మహిళలపై ఎవరికి గౌరవం ఉంది?. మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటి.కరెంట్ బిల్లుల బాదుడే.. బాదుడు15వేల కోట్లు కరెంట్ బిల్లుల బాదుడు,గవర్నమెంట్ స్కూళ్లు కాలేజీ కాలేజీల్ని నిర్విర్యం చేశాడు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల పేరిట బాదుడే బాదుడే. రేషన్ వెహికల్స్ వాహనాల్ని తీసేశాడు. రేషన్ ద్వారా ఇచ్చే పప్పు దాన్యాల్ని ఎగనామం పెట్టాడు. ఫలితంగా పప్పు దాన్యాల రేట్లు పెంచి బాదుడే బాదుడు. కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. సుమారు 3లక్షలపై చీలూకు ఉద్యోగాల్ని తొలగించారు.ప్రభుత్వ ఉద్యోగుల సంగతి సరేసరిపంటలకు సరైన మద్దతు లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏమైనా ఒరిగిందా అంటే? అదీ లేదు. వచ్చీ రాగానే పీఆర్సీ అన్నారు. పీఆర్సీని ఆపేశారు. ఈ జులై 1వ తారీఖుతో కలిసి నాలుగు డీఏ ఇవ్వాలి. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 20 వేలకోట్ల వరకు ఆపేశారు. చంద్రబాబు పెట్టిన తాకట్టు.. చంద్రబాబు తాను అబద్ధమాడుతూ.. తానెప్పుడూ ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడం లేదన్నాడు. మద్యం ఆదాయం తాకట్టుపెట్టడం లేదు. కానీ 4-4-2025 నాడు విడుదల చేసిన జీవో 69 కింద ఏపీఎండీసీ కింద 436 మినరల్ ప్రాజెక్ట్‌ను తాకట్టు పెట్టారు. వాటి విలువ 191,000 కోట్లు రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి ప్రెస్మీట్లో రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టో, బాండలను అందరూ రెడీగా పెట్టుకోవాలి. చంద్రబాబు తన పాలన గురించి తెలుసుకునేందుకు మీ ఇంటికి ఎమ్మెల్యేలు, ఇతర నేతల్ని పంపిస్తున్నారు. నేతలు వచ్చినప్పుడు మ్యానిఫెస్టో, బాబుష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో బాండును అందించారు. ఆ బాండు, ఎన్నికల మ్యానిఫెస్టో చూపిస్తూ ఎంత వరకు ఎన్నికల హామీలు నెరవేర్చారో అడగండి. అప్పుడైనా చంద్రబాబుకు ఎన్నికల హామీలు నెరవేర్చుతారో చూడాలి. ఒకవేళ మీ వద్ద ‘బాబు మ్యానిఫెస్టోని గుర్తు తెచ్చుకుంటూ’ అనే పేరుతో చంద్రబాబు మ్యానిఫెస్టోను డౌన్లోడ్ చేసుకునేలా క్యూఆర్ కోడ్‌ను వైఎస్సార్సీపీ అందుబాటులోకి తెస్తుంది’ అని అన్నారు. ప్రభుత్వంపై ఫైట్ చేయండి. రాష్ట్ర ప్రజల తరుఫున వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. -
‘తల్లికి వందనం’కు షాక్!
సామర్లకోట: తల్లికి వందనం పథకానికి విద్యుత్తు బిల్లుల నిబంధనల సెగ తగిలింది. గడచిన ఆరు నెలలుగా 300 యూనిట్ల వాడకం లేనప్పటికీ తమకు తల్లికి వందనం పథకం నిలిపివేశారని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు సోమవారం స్థానిక పిఠాపురం రోడ్డులోని విద్యుత్ సబ్ స్టేషన్‌కు తరలివచ్చారు. వేసవి కాలంలో ఎండలు మండిపోవడం, అదే సమయంలో శుభకార్యాలు జరగడంతో ఒక్క మే నెలలో మాత్రమే 300 యూనిట్ల బిల్లు వచ్చిందని, దానిని సాకుగా తీసుకోవడం ఎంత వరకూ సమంజసమని నిలదీశారు. ఆరు నెలల సరాసరి తీసుకొని 300 యూనిట్లు దాటితే తల్లికి వందనం నిలిపివేసినా అభ్యంతరం లేదని అన్నారు.అనేక మందికి 4 నుంచి 14 వరకూ మీటర్లు ఉన్నట్లు స్టేట్మెంట్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో వాడుకుంటున్న విద్యుత్ మీటర్లు తమ పేరిట ఉండటమేమిటని ప్రశ్నించారు. ఇలా ఉన్న మీటర్లను గుర్తించి, బాధితుల పేర్లు తొలగిస్తామని ఏపీ ఈపీడీసీఎల్ ఏఈ రమేష్ కుమార్ చెప్పారు. ఆధార్ కార్డుల ప్రాతిపదికన విద్యుత్తు బిల్లులకు సంబంధించి అదనపు మీటర్లు ఉన్నట్లు గుర్తిస్తే రూ.30 చెల్లించి స్టేట్మెంట్ తీసుకోవడం ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి తొలగిస్తామని తెలిపారు. దీంతో, ఈ స్టేట్మెంట్ల కోసం విద్యుత్ వినియోగదారులు ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద బారులు తీరారు. విద్యుత్తు వాడుతున్న వారు వారి ఆధార్ కార్డులతో మీటరుకు లింక్ చేయించుకోవాలని ఏఈ సూచించారు. ఈ మేరకు విద్యుత్తు మీటర్లకు ఆధార్ లింక్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. విద్యుత్తు వాడకం 300 లోపు యూనిట్లు ఉన్నవారికి స్టేట్మెంట్లు అందజేస్తామని చెప్పారు. అయితే, తల్లికి వందనం అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని, ఆలోగా విద్యుత్ వాడకానికి సంబంధించిన స్టేట్మెంట్లు రాకపోతే తమకు అన్యాయం జరుగుతుందని తల్లులు ఆవేదన చెందుతున్నారు. -
‘తల్లికి వందనం.. లోకేష్ తనకు తానే సవాల్ విసురుకున్నాడు’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అధికారం కోసం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేర్లు మార్చారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. 30 లక్షల మందికి తల్లులకు తల్లికి వందనం ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని ఘాటు విమర్శలు చేశారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, వైఎస్సార్ కార్పొరేటర్ విజయవాడలో జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలనుఈ పుస్తకంలో వివరించాము. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారు. చంద్రబాబు అధికారం కోసం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేర్లు మార్చారు. 30 లక్షల మందికి తల్లులకు తల్లికి వందనం ఎగ్గొట్టారు. వైజాగ్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ లేరని విద్యార్థులు ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి.చంద్రబాబు 17 వందల కోట్లు పెట్టిన బకాయిలను వైఎస్ జగన్ తీర్చారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దారుణం. జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని అందరు చదవాలి. కరెంటు చార్జీల పేరుతో చంద్రబాబు రూ.15 వేల కోట్లు వసూలు చేస్తున్నారు. బుడమేరుతో ముంపు గురైన ప్రజలకు న్యాయం చేసిన పరిస్థితి లేదు. శాతవాహన కళాశాల ను కబ్జాకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హిందూ దేవాలయాల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారు దాడి చేస్తున్నారు. సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది. లోకేష్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తల్లికి వందనంలో 87 లక్షల మంది తల్లులకు ఇవ్వాలని లెక్కలు ఉన్నాయి. లోకేష్ తనకు తానే సవాల్ విసురుకుంటున్నాడు’ అని అన్నారు.డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వైఎస్ జగన్ బటన్ నొక్కితే హేళనగా మాట్లాడారు. మీరెందుకు బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో నగలు జమ చేయడం లేదు. చంద్రబాబు ఎవరికీ మంచి చేసిన విధానం లేదు. చంద్రబాబు మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. వైఎస్ జగన్ స్కూల్ డెవలప్మెంట్ కోసం డబ్బులు కేటాయిస్తే హేళన చేశారు. మీరు.. 13 వేలు తల్లులు ఖాతాలో వేసి మోసం చేశారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చదువుకునే విద్యార్థులు, రైతులు, మహిళలను చంద్రబాబు మోసం చేశాడు’ అని తెలిపారు. -
సీమలోనూ సీను సితారే!
గెలిచి సరిగ్గా ఏడాది కాలేదు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు పదవుల్లో కూర్చుని గట్టిగా సమచ్చరం కాలేదు. అప్పుడే జనాలకు ప్రభుత్వం మీద ఏవగింపు మొదలైంది . వచ్చిన కొత్తల్లోనే ఎక్కడికక్కడ దందాలు.. రౌడీయిజం వంటివి మొదలెట్టి ఇదీ మా బ్రాండ్.. ఇదీ మా స్టైల్ అని చెప్పుకునే విధంగా అడుగులు మొదలెట్టారు. దీంతో ప్రజల్లో వీళ్ళు ఏదో చేస్తారు?.. అనుకుంటే చివరకు రౌడీయిజం చేస్తున్నారా అనే అభిప్రాయాలూ మొదలయ్యాయి. తెలుగుదేశానికి మొదట్నుంచి పట్టున్న జిల్లాల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఇదిలా ఉండగా ప్రజలకు ఏదో చేస్తాం.. పథకాలిస్తాం.. ఉద్యోగాలిస్తాం.. పారిశ్రామిక ప్రగతి చేసి చూపిస్తాం అంటూ ఘనంగా చెప్పుకుని వచ్చిన ఈ నాయకులు. వస్తూనే రెడ్ బుక్ ఓపెన్ చేసి ఒక్కో పేజీలో ఎవరి పేర్లు ఉన్నాయి.. వారిలో అధికారులు ఎవరు ? వైఎస్సార్సీపీ నాయకులూ ఎవరన్నది ఏరుకుని మరీ టార్గెట్ చేసి కేసులు పెట్టడం.. లొంగనివారిపై.. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించడం వంటి పనులు తప్ప ప్రజలకు పనికొచ్చేది ఏమీ చేయలేదన్న అభిప్రాయం మొదలైంది. దీంతోబాటు.. పల్లెల్లో చిల్లర రాజకీయాలు చేయడం.. ఆలయాల్లో విధ్వంసాలు.. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇంకా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు.. ఇలాంటి అవలక్షణాలు తప్ప కాన్ఫిడెంట్ గా ప్రభుత్వాన్ని నడిపే పనిలో లేకపోవడాన్ని ప్రజలు గ్రహించారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభుత్వ వ్యతిరేకత లోలోన నివురుగప్పిన నిప్పులా ఉంటోంది. బయటకు అందరూ ఆహా.. ఓహో అని అంటున్నా.. ప్రజల్లో మాత్రం ఇది ఉత్త డబ్బారాయుడి ప్రభుత్వం అనే అభిప్రాయం గట్టిగానే ఉంది. ఈ నేపథ్యంలో.. మొన్నటి ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించిన స్థానాల్లో సైతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్ల అబ్బే.. ఏదో అనుకున్నాం.. ఏం లేదు అనే భావన వినిపిస్తోందని అంటున్నారు. బాబు పాలన ఏడాదైన సందర్భంగా కొన్ని సంస్థలు చేపట్టిన సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. వాస్తవానికి వైయస్ జగన్‌కు గట్టిపట్టున్న రాయలసీమలో కూడా 2024 ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 52 సీట్లున్న పూర్వపు రాయలసీమ నాలుగు జిల్లాల్లో కూటమికి 45 స్థానాలు దక్కాయి. వైఎస్సార్సీపీ కడపలో 3, చిత్తూరు.. కర్నూలులో రెండేసి చొప్పున మొత్తం ఏడు స్థానాల్లోనే గెలిచింది. అయితే ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది సర్వేలు చెబుతున్నాయి. సీమలో గెలిచినా 45 మందిలో పట్టుమని పదిమందికి కూడా ప్రజల్లో పట్టు చిక్కలేదు. అందుకే ఏకంగా 33 మందిమీద తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయి. అందులో 29 మంది ఎమ్మెల్యేలకు అయితే అనవసరంగా వీళ్ళను ఎందుకు గెలిపించామురా దేవుడా అని ప్రజలు లోలోన బాధపడుతున్నారట. వాళ్ళు మళ్ళీ గెలవడం అసాధ్యమని ప్రజలు చెబుతున్నారు. ఇక ఇటు వైసిపి నేతలు.. ఓడిపోయినా ఎమ్మెల్యేలమీద ప్రజలకు గురికుదిరిందని.. వాళ్ళుంటేనే బావుణ్ణని ప్రజలు అనుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. మొత్తానికి చాలామంది టిడిపి ఎమ్మెల్యేలు వన్ టైం ఎమ్మెల్యేలుగా నిలిచిపోతారని అంటున్నారు. అధికారం వచ్చింది సొంత ఆస్తులు పెంచుకోవడానికి అనే భావనలో ఉన్న నాయకులకు గడ్డుకాలమే అని అంటున్నారు.- సిమ్మాదిరప్పన్న -
‘ఏడాదంతా మోసమే.. అంతా అభూత కల్పనే’
తిరుపతి: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిస్తూనే ఉందని విమర్శించారు తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడుడ భూమన కరుణాకర్‌రెడ్డి. తమ నాయకుడు వైఎస్ జగన్.. రూ. 2 లక్షల 80 కోట్లు డీబీటీ రూపంలో ప్రజలకు నేరుగా అందిస్తే అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేశాడన్నారు. ఈరోజు(ఆదివారం, జూన్ 15వ తేదీ) ‘జగన్ అంటే నమ్మకం- చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని భూమన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీలు సిఫాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎమ్మెల్యే సునీల్, విజయానందరెడ్డి, నూకతోటి రాజేష్, తిరుపతి పార్లమెంట్ పరిశీలకుడు చవ్వా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా భూమన మాట్లాడుతూ.. 2 కోట్ల 7 లక్షల మంది మహిళలకు నెలకు రూ. 1500 ఇవ్వకుండా మోసం చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. నిరుద్యోగ భృతి రూ. 3 వేలు ఇస్తామని చెప్పిన వ్యక్తి.. ఈ రోజు మోసం చేసిన విషయం కళ్లకు కనపడుతోందన్నారు. 30 లక్షల మంది తల్లులకు తల్లికి వందనం మోసం. రైతులకు రూ. 20 వేలు ఇస్తామని మోసం. తల్లికి వందనపై ప్రశ్నించే వాళ్లకు బెదిరింపులు. ఈ ఏడాది మొత్తం మోసాలు చేశాడు.. ఒక అభూత కల్పనతో మోసగించాడు. వైఎస్సార్సీపీ వాళ్లపై దాడులు చేయించి కేసులు పెట్టి జైల్లో పెట్టించాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారు’ అని భూమన ధ్వజమెత్తారు. -
‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలు, మోసాలపై ‘వెన్నుపోటు’ పుస్తకాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం ఆవిష్కరించారు. కన్న బాబురాజు, కంబాల జోగులు, అదీప్ రాజు, పెట్ల ఉమాశంకర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏడాది కాలంలో లక్ష యాభై వేల కోట్ల అప్పు తప్ప చేసిందేమీ లేదు.. త్వరలో అక్రమ మైనింగ్‌పై కూడా పోరాటం చేస్తాం. వైఎస్ జగన్ చెప్పిన హామీలతో పాటు చెప్పని హామీలను కూడా అమలు చేశారని గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు.కూటమి మోసాలపై వెన్నుపోటు పుస్తక ఆవిష్కరణ.. విశాఖపట్నం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎంపీ బాబురావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్ తదితరులు ఆవిష్కరించారు.అక్రమాల్లో చంద్రబాబు పీహెచ్డీ: గొల్ల బాబురావుపేద ప్రజలను మోసం చేయడం.. అక్రమాలు చేయడంలో చంద్రబాబు వేయి పీహెచ్‌డీలు చేశాడు. వైఎస్ జగన్ సంక్షేమ పాలనను ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. మోసం పోయాం అని గ్రహించి ప్రజలు మళ్లీ జగన్‌ను గెలిపించాలని అనుకుంటున్నారు. జగన్ అంటే నమ్మకం.. బాబు అంటే మోసం అని ప్రజలకు వివరించాలి.హమీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలం: కేకే రాజుఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు వైఫల్యం చెందారు. వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందించారు. నాడు ఏడాదిలో జగన్ అన్ని పథకాలను అమలు చేశారు. జగన్ ఇచ్చిన మాట మీద నిలబడితే.. బాబు మోసం చేశాడు. ఎల్లో మీడియాలో ప్రతీ రోజూ అబద్దపు కథనాలు రాస్తున్నారు. హామీల గురించి ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామని లోకేష్ బెదిరిస్తున్నాడు.అప్పులు చేయడం సంపద సృష్టించడమా?: వరుదు కల్యాణిగతంలో మూడు సార్లు సీఎంగా చేసిన బాబు ఎప్పుడూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ప్రజలను బాబు మరోసారి మోసం చేశాడు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం సరే.. మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడ పిల్లలగా పుట్టడమే పాపమా అన్నట్టు ఉంది. ప్రభుత్వ దృష్టి అంతా అమరావతి అవినీతిపైనే ఉంది. ఏడాదిలో జగన్ 90 శాతం హామీలు అమలు చేశారు. బాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది: వాసుపల్లి గణేష్ కుమార్చంద్రబాబు ఒక్కడే ఎప్పుడూ జగన్‌ను ఢీ కొట్టలేడు. పవన్, బీజేపీని కలుపుకొని బాబు గెలిచాడు. జగన్‌కు 40 శాతం ఓట్లు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయం. లోకేష్ నాయకుడిగా ఎదగలేడు.. ఆయన నాయకత్వం ముందుకు సాగదు. సంపద సృష్టిస్తా అని అధికారంలోకి వచ్చి.. అప్పు చేసి తల్లికి వందనం ఇచ్చారు. అసెంబ్లీని రబ్బర్ స్టాంప్‌లా చేస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు అనంతరం జగన్ 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారు. జగన్ మచ్చ లేని నాయకుడు.. ఆయన ఏ తప్పు చేయలేదు. నాయకులు, అధికారుల తప్పిదం వలన ఓడిపోయాం. కూటమి పాలనలో తప్పులు చేసిన వారు ఎక్కడున్నా తీసుకొస్తాం. -
ఎటెళ్లిపోయాయో.. ఆ 900 బస్తాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని టీడీపీ కూటమి నేతలు బుక్కేస్తున్నారు. రూ.కోట్ల విలువైన బియ్యాన్ని పక్కదారి పట్టించేస్తున్నారు. వెయ్యి బస్తాలకు పైగా రేషన్ బియ్యం ఉన్న ఓ గోదామును అధికారులు శుక్రవారం తనిఖీచేసి తాళం వేయగా తెల్లారేసరికి 109 బస్తాలను ఉంచి మిగిలిన వాటిని రాత్రికి రాత్రే తరలించేశారంటే పచ్చమూకలు ఎంతటి బందిపోట్లో తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో వెలుగుచూసిన ఈ బాగోతం వెనుక టీడీపీ ముఖ్యనేత కుమారుడున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.వివరాలివీ.. ఓ గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం అక్రమ బియ్యం దందాపై ఇచ్చిన సమాచారంతో పట్టణంలోని శిరుగుప్ప రోడ్డులో ఉన్న ఓ గోదామును సివిల్ సప్లయ్స్ రాష్ట్ర డైరెక్టర్ మహేష్‌నాయుడు తనిఖీ చేశారు. అందులో వెయ్యిబస్తాలకు పైగా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆయన గోడౌన్‌కు తాళం వేయించారు. దానిని సీజ్ చేసేందుకు శనివారం ఉదయం ఆయన గోదాముకు వచ్చారు. గోదాములో కేవలం 109 బస్తాలు మాత్రమే ఉండడాన్ని చూసి మహేష్‌నాయుడు, సివిల్ సప్లయ్స్, డిప్యూటీ తహసీల్దార్ బాబు, పోలీసు అధికారులు అవాక్కయ్యారు. మిగతా బియ్యం బస్తాలన్నీ రాత్రికి రాత్రే తరలిపోయాయి. రంగంలోకి టీడీపీ ముఖ్యనేత కుమారుడు!..మహేష్‌నాయుడు గోడౌన్ తనిఖీకి వెళ్లగానే ఆదోనికి చెందిన టీడీపీ ముఖ్యనేత ఒకరు ఫోన్ చేసినట్లు తెలిసింది. వెయ్యికి పైగా బియ్యం బస్తాలు పట్టుబడినట్లు తెలుసుకుని ఆయన తనకేమీ సంబంధంలేదని తప్పుకున్నట్లు సమాచారం. అయితే, ఆ వెంటనే సదరు ముఖ్యనేత కుమారుడు అక్కడికి చేరుకోవడం, తన తండ్రికి తెలీదని.. చూసీచూడనట్లుగా వదిలేయాలని డైరెక్టర్‌ను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కూడా సంపాదించుకునేందుకు అడ్డుతగిలితే ఎలాగని డైరెక్టర్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ముఖ్యనేతల కుమారుల బియ్యం దందా..వాస్తవానికి.. ఆదోని టీడీపీలో రెండు వర్గాలున్నాయి. అందులో ఒక వర్గం నేత కుమారుడు ఆదోని పట్టణం, మరో వర్గం నేత కుమారుడు ఆదోని రూరల్ ఏరియాలో బియ్యం దందా చేస్తున్నారు. వీరిని నిలువరించే వాళ్లు లేకపోవడంతో వారిద్దరూ పోటీపడి మరీ బియ్యం దందాను సాగిస్తున్నారు. సమీపంలోని కర్ణాటక సరిహద్దులు దాటించి రూ.కోట్లు దండుకుంటున్నారని ఆరోపణలున్నాయి.దోషులపై పీడీ యాక్ట్..రేషన్‌బియ్యం దందాలో ఎవరెవరి హస్తం ఉందో సోమవారం తేలుస్తాం. రాత్రి వెయ్యికి పైగా బియ్యం బస్తాలున్నట్లు గుర్తించాం. తెల్లారేసరికి అవన్నీ నిపించకుండాపోవడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. విషయాన్ని పైకి తీసుకెళ్తా. పూర్తిస్థాయి విచారణ చేయించి దోషులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయిస్తాం.– మహేష్‌నాయుడు, సివిల్ సప్లయ్స్ డైరెక్టర్కచ్చితంగా టీడీపీ నేతల ప్రమేయం..పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ దందాలో కచ్చితంగా టీడీపీ నేతల ప్రమేయం ఉంది. పూర్తిస్థాయి విచారణ చేయకుండా అసలైన దోషులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. – వై. సాయిప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆదోని -
ఏడాది పాలన.. మహిళలకు వంచన
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం సాగించిన ఏడాది పాలనలో అన్ని రంగాల్లో మహిళలు వంచనకు గురయ్యారని వివిధ రంగాలకు చెందిన మహిళా నేతలు నిప్పులు చెరిగారు. కూటమి ఏడాది పాలనంతా ఆరాచక.. విధ్వంసక.. వినాశక పాలనగా సాగిందని మండిపడ్డారు. మహిళల భద్రతకు ఏవిధంగానూ భరోసా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ‘ఏడాది కూటమి పాలన.. మహిళలకు వంచన’ అనే అంశంపై విజయవాడ రామవరప్పాడులోని ఎం.కన్వెన్షన్ సెంటర్లో శనివారం చర్చావేదిక నిర్వహించారు. మహిళా న్యాయవాదులు, వైద్యులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వలంటీర్లు, డ్వాక్రా సంఘాల నేతలు, వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు, మహిళా నేతలు పెద్దఎత్తున హాజరై తమ గళం వినిపించారు. మహిళల జీవితాలు తల్లకిందులయ్యాయివైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘రాష్ట్రం అవినీతి పాలన అప్పుల ఆంధ్రాగా మారింది. ఏడాదిలోనే మహిళల జీవితాలు తలకిందులైపోయాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. కానీ.. ఈ ప్రభుత్వంలో మహిళా భక్షక పాలన సాగుతోంది. తొలి ఏడాదిలో తొమ్మిది శాతం కూడా మహిళలకు ప్రయోజనం చేకూర్చలేదు. రోజుకు 70 మంది మహిళలపై దాడులు జరగడం స్వర్ణాంధ్ర అంటారా? సందుసందుకి మద్యం షాపులు ఉండటాన్ని స్వర్ణాంధ్ర అంటారా? 17 ఏళ్లలో చేయనంత అప్పు చేయడాన్ని స్వర్ణాంధ్ర అంటారా?, సూపర్ సిక్స్ అమలు చేసేశాను.. ఎవరైనా అడిగితే వారి నాలుక మందం ఎక్కినట్టే అని సీఎం చెబుతున్నారు. సూపర్ సిక్స్ అడిగిన వారి నాలుక మందం అయితే.. ఎగ్గొట్టిన వారిని ఏమనాలి? ఇంటింటికీ బాండ్లు పంచిన వారిని ఏమనాలి? గతంలో అమ్మఒడిపై విమర్శలు చేశారు. వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలను ఈ ప్రభుత్వం కాపీకొట్టగలదు.. కానీ జగన్ చిత్తశుద్ధిని కాపీ కొట్టలేరు. ఏడాది కాలంలో మద్యం, గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో అఘాయిత్యాలకు ఇవే ప్రధాన కారణం. అనంతపురంలో బాలిక అదృశ్యమైందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా వారం రోజులు పట్టించుకోలేదు. పోలీసుల నిర్లక్ష్యంతో బాలిక శవమై తేలింది. సత్యసాయి జిల్లాలో 14 ఏళ్ల బాలికపై టీడీపీ కార్యకర్తలు నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డారు’ అని మండిపడ్డారు..మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచనే లేదు మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచన తప్ప మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. వైఎస్ జగన్ దిశ యాప్ తెస్తే దానిపై ప్రస్తుత హోంమంత్రి హేళనగా మాట్లాడారు. అదే దిశ యాప్ పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టారు. అమ్మఒడి పథకంలో పాఠశాలల నిర్వహణకు కొంత తీసుకుంటే లోకేశ్ అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు తల్లికి వందనం పథకంలో లోకేశ్ రూ.2 వేలు కోత పెట్టారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులుపెట్టి నానా రకాలుగా వేధిస్తున్నారు. ఏడాది కాలంగా ఎంతోమంది చిన్నారులపై అఘాయిత్యాలు జరిగాయి. హోంమంత్రి అనిత కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పింది లేదు. హోంమంత్రి అనిత ఓ రబ్బర్ స్టాంప్ మాదిరి మారారు. రాష్ట్రం రావణకాష్టంలా మారింది. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు కనిపించడం లేదా. పవన్ ఎందుకు మౌనవ్రతం దాల్చారో చెప్పాలి’ అని నిలదీశారు. బడులకు దగ్గరే మద్యం షాపులు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ ప్రభుత్వంలో విద్యకు ఒక విధానమంటూ లేకుండాపోయింది. ఏడాది కాలంలోనే టీచర్లను రోడ్డు మీదకు లాగేశారు. బడులకు దగ్గర్లోనే మద్యం షాపులు పెట్టారు’ అని ధ్వజమెత్తారు. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ.. ఆరోగ్యానికి వైఎస్ జగన్ పెద్దపీట వేశారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. అమలుకాని హామీలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, మాజీ ఎమ్మెల్సీ శివకుమారి, న్యాయవాదులు లలిత, సౌమ్య, విశ్రాంత ఉపాధ్యాయిని రజనీ, కార్పొరేటర్ శశికళ, సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి, ఇంటూరి సృజన తదితరులు మాట్లాడారు. -
పొగాకు రైతుల సమస్య డైవర్ట్ చేయడానికి ఇంత దుర్మార్గమా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో నిరసనల పేరుతో ఉద్రిక్తతలకు కారణమైన వారిని వదిలేసి.. అమాయక రైతులు, ప్రజలపై కేసులు పెట్టడాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది రైతుల సమస్యను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సర్కార్ చేయిస్తున్న మరో దుర్మార్గమని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే..‘‘చంద్రబాబూ... పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి నేను ప్రకాశం జిల్లా పొదిలి వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే, మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు. కానీ... ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపై, అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబూ? రైతుల సమస్యలపై గొంతెతి్తతే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా..? ఉల్టాగా... రాళ్లు మీ వాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా? ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబూ? రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తూ కూర్చున్న చక్రవర్తి నీరో తరహాలో... ఆ రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది’’ అని మండిపడ్డారు. -
నవ్విపోదురు గాక..!
‘‘ఆరు సూపర్ సిక్స్ హామీలూ పూర్తయ్యాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరైనా సూపర్ సిక్స్ అని మాట్లాడితే, వారికి నాలుక...’’ అంటూ వాక్యం మధ్యలో చంద్రబాబు కాస్త విరామం పాటించారు. ఆ ప్రెస్ మీట్‌ను టీవీల్లో చూస్తున్న వాళ్లకు నాలుకను కోసేస్తా అంటారేమో అనే అనుమానం రావడం సహజం. ఎందుకంటే, గత ఏడాదికాలంగా హామీల అమలు గురించి గట్టిగా ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టడం, ఏదో వంకతో జైలుకు పంపించడం అందరూ గమనిస్తూనే ఉన్నారు గనుక! చంద్రబాబు పాటించిన వాక్య విరామంలో గట్టి హెచ్చరికను పంపించే ఉద్దేశం కూడా ఉండవచ్చు. విరామం తర్వాత వాక్యాన్ని ‘మందం’ అనే మాటతో ముగించారు. అంటే ఇకముందు ఎవరైనా సరే సూపర్ సిక్స్ అమలు కాలేదని మాట్లా డితే వారి నాలుక మందం అనుకోవాలి. వాక్య విరామ హెచ్చరిక కూడా వారికి వర్తిస్తుందనుకోవాలి.సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ‘తల్లికి వందనం’ నిధుల విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. ‘తల్లికి వందనం’ పథకాన్ని కూడా 2025–26 అకడమిక్ ఇయర్ కోసం విడుదల చేశారు. బకాయి పడిన గత సంవత్సరం నిధులు హుష్ కాకే! మిగిలిన ఐదు పథకాల సంగతి? వాటినెప్పుడు అమలు చేశారు? దీపం పథకం కింద ఏటా ఇవ్వాల్సిన మూడు ఉచిత సిలిండర్ల బదులు రెండు ఇచ్చారు. సరే, అది కూడా అమలైంది. ‘అన్నదాత సుఖీ భవ’ కింద రైతుకు ఇస్తానన్న రూ. 20 వేల నగదు సాయానికి కూడా ఓ అంటకత్తెర కథ చెప్పారు. ఈ నెల 20న కేంద్రం విడుదల చేసే రెండు వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక విడత విడుదల చేస్తామని చెప్పారు. కేంద్రం మూడు విడతల్లో విడుదల చేసే ఆరు వేలకు మరో 14 వేలను మూడు విడతల్లో కలిపి అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. బకాయి పెట్టిన గతేడాది సొమ్ము అటకెక్కినట్టే! మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణానికి ఆగస్టు 15న ముహూర్తం పెట్టినట్టు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాలి.సూపర్ సిక్స్‌లో భాగంగా ఉన్న మరో రెండు అతి కీలకమైన పథకాలను మాత్రం దేవుడి ఖాతాలో వేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. పందొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ ‘ఆడబిడ్డ నిధి’ కింద నెలకు రూ.1500 చొప్పున ఏటా 18,000 రూపాయలను జమ చేస్తా మని కూటమి ఇచ్చిన ఎన్నికల హామీ. ఇప్పుడు దాన్ని పీ–ఫోర్ అనే పథకంతో లింక్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ఆడబిడ్డల అదృష్టాన్ని డబ్బున్న వారి ఔదార్యంతో ముడి వేశారన్నమాట. ఎన్నికల హామీ ప్రకారం ఈ పథకానికి దాదాపు ఏటా 35 వేల కోట్లు అవసరమని అంచనా. ఇంతటి ఔదార్యాన్ని పి–ఫోర్ పథకం ద్వారా పిండుకోవాలట! ఇది అయ్యే పనేనా?సూపర్ సిక్స్‌లో మరో ముఖ్యమైన హామీ నిరుద్యోగ భృతి. ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంది. పన్నెండు నెలలు బకాయి పెట్టారు. ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంతో జత చేస్తామని చెబుతున్నారు. అసలు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది? నైపుణ్య శిక్షణ ఎంతమందికి ఇస్తారు? అందులో ఈ మూడు వేల రూపాయలు పోషించే పాత్రేమిటి? అనే మీమాంసలనవసరం. ఈ పథకానికీ పాడె కట్టినట్టే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో యాభ య్యేళ్లు నిండిన ప్రతివారికీ పెన్షన్ అమలు చేస్తామని మరో కీలకమైన వాగ్దానాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. దాని గురించి ఏడాది గడిచిపోయినా ఇప్పటికీ మాటా లేదు, ముచ్చటా లేదు. కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోను విశ్లేషిస్తే ఒక్క మొదటి యేడాదికే రూ. 80 వేల కోట్లకు పైగా వాగ్దాన భంగానికి పాల్పడినట్టు తేలింది.ఎన్నికల ప్రచారం సందర్భంగా కూటమి నాయకులు ఫ్లాగ్ షిప్‌గా పెట్టుకున్న సూపర్ సిక్స్‌లోనే అరకొరగా రెండు, అత్తెసరుతో మరో రెండు ప్రకటించారు. భారీగా వ్యయమయ్యే ఇంకో రెండు పథకాలకు తిలోదకాలొదిలేశారు. ఫ్లాగ్షిప్ సంగతే ఇట్లా ఉంటే మిగతా మేనిఫెస్టో హామీల గురించి చర్చించడానికేముంటుంది? మోసం చేశారని ఆవేశపడటం తప్ప. మేనిఫెస్టో మీద, దాని హామీల మీద చర్చ జరగడం కూడా కూటమి సర్కార్ సహించడం లేదు. మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశామని వారు చెబుతున్నారు. అందరూ అదే చెప్పాలి. ఇందుకు భిన్నంగా ఎవరూ మాట్లాడకూడదు. పత్రికల్లో గానీ, టీవీల్లో గానీ, సోషల్ మీడియాలో గానీ ఇందుకు భిన్నమైన సమాచారం రాకూడదు. వస్తే రెడ్‌బుక్ నోరు తెరుస్తుంది. రెడ్ బుక్ ఆదేశాలతో దాదాపు వెయ్యిమంది సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు నమోదయ్యాయి. పలువురిని అరెస్టు చేశారు. పలు కుటుంబాలు ఇంకా వేధింపులకు గురవు తున్నాయి. 70 మంది పాత్రికేయులపై కేసులు పెట్టారు. పదిమందిపై దాడులు చేశారు. ప్రత్యర్థి రాజకీయపక్షంపై జరుగుతున్న దాడులను ఇక్కడ ప్రస్తావించడం లేదు. వారిపై జరుగుతున్న హత్యాకాండ జోలికెళ్లడం లేదు. వారి ఆస్తుల విధ్వంసం గురించి కూడా చెప్పడం లేదు. కేవలం పాత్రికేయులపై, సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న దమనకాండను గురించి మాత్రమే ఈ నివేదన. వారి కలాలకూ, గళాలకూ బిగిస్తున్న శృంఖలాలను గురించి మాత్రమే ఈ ఆవేదన.నాలుగున్నర దశాబ్దాలు పాత్రికేయ అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు ఈ భయానక పాలనకు ఒక స్పష్టమైన ఉదాహరణ. పత్రికా రంగంలో అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కొమ్మినేని.రెండు పత్రికల్లో స్టేట్ బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. ఢిల్లీ బ్యూరోకు నాయకత్వం వహించారు. ఒక పత్రికలో ఒకే సమ యంలో సెంట్రల్ డెస్క్ ఇన్ఛార్జిగా నేను, స్టేట్ బ్యూరో చీఫ్‌గా కొమ్మినేని కలిసి పనిచేసిన అనుభవం ఉన్నది. ఈ అనుభవంతో చెప్పగలిగిన మాట ఒక్కటే. పాత్రికేయ వృత్తి పట్ల, ఆ వృత్తిలో పాటించవలసిన ప్రమాణాల పట్ల పూర్తిస్థాయి నిబద్ధత కలిగిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు. న్యూస్ ఛానెళ్ల పర్వం ప్రారంభమైన తర్వాత దాదాపు పద్దెనిమిదేళ్లుగా మూడు టీవీ చానెళ్లలో కేఎస్ఆర్ లైవ్ షో పేరుతో వర్తమాన రాజకీయాలపై చర్చా గోష్ఠులు నిర్వహిస్తున్నారు. ఈ తరహా చర్చా కార్యక్రమాల్లో అత్యంత సంయమనం పాటిస్తూ హద్దుమీరకుండా, చర్చ పక్క దారి పట్టకుండా తన నియంత్రణలో నడిపించే వారిలో అగ్ర గణ్యుడు కొమ్మినేని.అమరావతి మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడాడని కొమ్మినేని మీద, వార్తా విశ్లేషకుడు కృష్ణంరాజు మీద పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సెక్షన్ కూడా ఒకటి. పెరుగుతున్న వేశ్యల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉన్నదనే ఒక నివేదికను కృష్ణంరాజు ప్రస్తావించారు. ఈ తరహా వార్తలు గతంలో యెల్లో మీడియాలో కూడా వచ్చినవే. ఈ ప్రస్తావన సందర్భంగా అమరావతిని ఉద్దేశించి కృష్ణంరాజు మాటల్లో దొర్లిన ఒక అనుచిత వ్యాఖ్యానాన్ని షో నిర్మాహకుడైన కొమ్మినేనికి కూడా ఆపాదించి ఒక వ్యూహం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మహిళల ప్రదర్శనలనూ, సాక్షి మీడియాపై దాడులనూ ప్రభుత్వం ఆర్గనైజ్ చేసింది. కొమ్మినేని, కృష్ణంరాజు, సాక్షి మీడియాలపై కేసులు నమోదు చేశారు. కొమ్మినేనిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినప్పుడు అట్రాసిటీ కేసుపై మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సంబంధం లేని కేసులు పెట్టడంపై ఎస్పీకీ, డిఎస్పీకి మెమోలు కూడా ఇచ్చారు. ఆ సెక్షన్ తొలగించి రిమాండ్‌కు పంపారు.సుప్రీంకోర్టులో కొమ్మినేనికి ఊరట లభించింది. తాను చేయని వ్యాఖ్యలకు యాంకర్‌ను ఎలా బాధ్యుల్ని చేస్తారని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ లాయర్లను ప్రశ్నించింది. ఈ కేసులో కూడా ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లోద్రా వంటి భారీ మొత్తంలో ఫీజు వసూలు చేసే లాయర్లనే కూటమి ప్రభుత్వం మోహరించింది. కొమ్మినేనికి వెంటనే బెయిల్ లభిస్తే మిగతా పాత్రి కేయుల్లో ప్రభుత్వం పట్ల భయం మిగలదనే సందేహం కావచ్చు. ఆ బెయిల్‌ను అడ్డుకునేందుకు భారీ గానే ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. విశ్లేషకుని వ్యాఖ్యానానికి కొమ్మినేని నవ్వాడు గనుక ఆయన కూడా శిక్షార్హుడేనని కూటమి లాయర్లు చేసిన వాదన సుప్రీంకోర్టులో నవ్వుల పాలైంది. కొమ్మి నేనిని వెంటనే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.విఫల పాలనతో ప్రజామోదం కోల్పోతున్నప్పుడు అసంతృప్తిని చల్లార్చడానికి నియంత పాలకులు ఎక్కువగా నిర్బంధాన్నే నమ్ముకుంటారు. విమర్శకులు నవ్వినా, తుమ్మినా, దగ్గినా కూడా తిరుగుబాటు సంకేతంలాగానే వారికి కనిపించవచ్చు. నవ్వులే కాదు పువ్వులు కూడా వారిని భయపెడతాయి, వారి నీడలు కూడా వారిని భయపెడతాయి. ఈ భయం నుంచి బయటపడాలంటే వారి ముందున్న మార్గం ఒకటే. తాము ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను ధైర్యంగా ప్రభుత్వ కార్యా లయాల్లో అంటించుకోవాలి. ఇదిగో ఇన్ని హామీలను అమలు చేశామని ఇంటింటికీ వెళ్లి వైసీపీలాగా ధైర్యంగా చెప్పగలగాలి. లేకుంటే రాబోయే మూడునాలుగేళ్లూ నిర్భంధ కాండనే నమ్ము కోవాల్సి వస్తుంది. నిర్బంధకాండలో ఎవరూ నిలబడలేరని చరిత్ర చెబుతున్నా పాలకులకు చెవికెక్కదు. ఎంతమందిని భయపెట్టాలనుకున్నా, ఎంతమందిని జైలుకు పంపినా, ఎంత హత్యాకాండ కొనసాగించినా రాబోయే మార్పును ఆపడం సాధ్యం కాదు. ‘నువ్వు అన్ని పువ్వులనూ కోసి పారేయవచ్చు, కానీ వచ్చే వసంతాన్ని ఆపడం నీ తరం కాదు...’ చిలీ దేశానికి చెందిన సుప్రసిద్ధ స్పానిష్ కవి పాబ్లో నెరూడా చెప్పిన నిత్య సత్యాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. మందీ మార్బలంతో పత్రికా కార్యాలయంపై దండెత్తడం, అక్షరాన్ని దహనం చేసే ప్రయత్నం చేయడం ఎంత అవివేకమైన చర్యలో చరిత్ర తప్పక నిరూపిస్తుంది. టీవీలో ఓ యాంకర్ నవ్వు, ఇన్‌స్టాలో ఓ యువ కుడి సెటైర్, వేదికపై ఓ గాయకుడి పాట, పొలంలో ఓ రైతన్న ఆగ్రహం... ఇలాంటివన్నీ తనకు నచ్చలేదని కేసులు పెడుతూ పోతే జనానికి కొన్ని కామెడీ పాత్రలు గుర్తుకొస్తాయి. నవ్వి పోదురు గాక నాకేటి... అనుకుంటే ఇంకేమీ ఉండదు మరి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
చంద్రబాబు, లోకేష్ చెప్పేవన్నీ అబద్ధాలే: అంబటి
సాక్షి, గుంటూరు: ఏడాది కూటమి పాలనలో సూపర్ సిక్స్‌ను అమలు చేసేశాం అంటూ నిసిగ్గుగా సీఎం చంద్రబాబు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులోని క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, సూపర్‌సిక్స్‌తో పాటు 143 హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేని అసమర్థ పాలన చూస్తున్నామని ఆక్షేపించారు. అయినా ఎల్లో మీడియాలో అద్భుతమని పొగిడించుకోవడం, గొప్ప పాలకుడని డప్పు కొట్టించుకోవడం చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారని గుర్తు చేశారు. చివరకు తల్లికి వందనం పథకంలోనూ ఏకంగా 30 లక్షల మందిని తగ్గించారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:నిస్సిగ్గుగా ఆత్మస్తుతి:కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా చంద్రబాబు పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చారు. జాతీయ మీడియాలో సక్సెస్ స్టోరీలు రాయించారు. హైదరాబాద్ నుంచి ఎల్లో మీడియా ఛానళ్లను పిలిపించుకుని, ప్రత్యేక ఇంటార్వ్యూలు ఇచ్చి భజన చేయించుకున్నారు. ఆ మూడు ఎల్లో మీడియా సంస్థల ప్రతినిధులు చంద్రబాబే సిగ్గుపడే స్థాయిలో ఆయనను ప్రశంసించారు. అద్భుతమైన పొగడ్తలతో డప్పు కొట్టే కార్యక్రమం చేశారు. అంత నిస్సిగ్గుగా చంద్రబాబు ఆత్మస్తుతి కొనసాగింది.తల్లికి వందనంలోనూ వంచన:సూపర్‌సిక్స్‌లో తల్లికి వందనం పథకాన్ని తొలి ఏడాది ఎగ్గొట్టేశారు. ఈ ఏడాది ఇస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, తాను అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మా ప్రభుత్వంలో 84 లక్షల మంది పిల్లలకు అమ్మ ఒడి ఇచ్చాం. కానీ, ఈరోజు చంద్రబాబు కేవలం 58 లక్షల మందికే ఇస్తున్నారు. అంటే 30 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టేశారు. వైఎస్ జగన్ రూ.15 వేలు ఇస్తూ, టాయిలెట్లు, స్కూల్స్ నిర్వహణ కోసం రూ.2 వేలు మినహాయించారు. దాన్ని ఆనాడు నారా లోకేష్ పెద్ద ఎత్తున విమర్శిస్తూ రెండు వేలు లాగేశారు. రూ.13 వేలు మాత్రమే ఇచ్చారని చెప్పరాని భాషలో తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.కానీ, ఇప్పుడు కూడా అవే రూ.13 వేలు ఇచ్చారు. స్కూళ్ల కోసం, విద్యా రంగం కోసం మిగిలిన మొత్తం వ్యయం చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అంటే మేం చేస్తే తప్పు, మీరు చేస్తే మాత్రం అది ఒప్పు అవుతుందా? ఇలా ఊరసవెల్లిలా మాట్లాడటానికి నారా లోకేష్‌కు సిగ్గుందా?. తల్లికి వందనంపై ఒకవైపు తండ్రి సీఎం చంద్రబాబు మొత్తం బడ్జెట్ రూ.10,091 కోట్లు అంటుంటే, మరోవైపు ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ మాత్రం రూ.8,745 కోట్లు అని చెబుతున్నారు. మరి ఇలా ఇద్దరు వేర్వేరుగా ఎందుకు తప్పుడు లెక్కలు చెబుతున్నారో అర్థం కావడం లేదు.సూపర్ సిక్స్‌కు రూ.81 వేల కోట్లు కావాలి:సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలను ఇచ్చి, వాటిని నెరవేరుస్తామని మాట ఇచ్చి, ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. తరువాత అన్ని హామీలను గాలికి వదిలేశారు. వాటికి కావాల్సిన నిధులను కూడా కేటాయించలేకపోతున్నారు. సూపర్ సిక్స్ అమలు చేయాలంటే రూ.81 వేల కోట్లు అవసరం. వాటి అమలు లేదు. మరోవైపు ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.1,58,604 కోట్లు వివిధ సంస్థల నుంచి రికార్డు బ్రేక్ చేస్తూ అప్పులు తెచ్చారు.ఈ సొమ్ము ఏం చేశారో తెలియదు. కూటమి పాలన ఇంత దౌర్భాగ్యంగా ఉంటే, తమ పాలన అద్భుతం అని ఎల్లో మీడియాలో చెప్పుకోవడానికి సిగ్గు పడాలి. తల్లికి వందనంలో దగా, మోసం. విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అమలు చేసిన అమ్మ ఒడి లెక్కలు తనకు అర్థం కావడం లేదంటూ అమాయకంగా మాట్లాడుతున్నాడు. ఆ మాత్రం అర్థం కాని మొద్దు అబ్బాయినని లోకేష్ అంగీకరిస్తున్నారా?.నాడు పథకాలకు రూ.4.58 లక్షల కోట్లు:వైఎస్సార్సీపీ కేవలం నాలుగు పేజీల మేనిఫేస్టోను విడుదల చేసి, వాటిలో ఏడాదిలోనే 90 శాతం అమలు చేసింది. తొలి ఏడాదిలోనే 3.58 కోట్ల మంది లబ్ధిదారులకు మేలు చేసింది. రూ.40,627 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. అయిదేళ్ళలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కింద రూ.2,73,756.17 కోట్లు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశాం. నాన్ డీబీటీ కింద రూ.1,84,604.32 కోట్లు ప్రయోజనం చేకూర్చాం. అలా మొత్తం రూ.4,58,360.43 కోట్లతో అయిదేళ్ళలో ప్రజలకు వివిధ పథకాల కింద ప్రయోజనం కలిగించాం.మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఏదీ?:ఆడబిడ్డ నిధి ప్రకారం 18 ఏళ్లు నిండిన మహిళలు రాష్ట్రంలో 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ళ వారు 1.80 కోట్ల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాల్సి వస్తే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరం. గత ఏడాది పూర్తిగా ఈ పథకం ఎగ్గొట్టారు. ఈ ఏడాది ఇస్తారో లేదో తెలియదు. దీపం పథకం కింద 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.ఒక్కో కుటుంబానికి మూడు సిలెండర్లు ఇవ్వాలంటే ఒక్కో సిలెండర్ రూ.850 చొప్పున మొత్తం ఏడాదికి రూ.4,083.48 ఖర్చు చేయాల్సి ఉంది. కానీ చంద్రబాబు కేవలం ఒక్క సిలెండర్ మాత్రమే ఉచితంగా ఇచ్చి, దానికి చేసిన వ్యయం రూ.865 కోట్లు మాత్రమే. దీపం పథకాన్ని అమలు చేసేశామని చెప్పుకున్నారు. ఈ పథకంలో మొత్తం రూ.3218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఉచిత బస్సు అన్నారు. ఈ పథకం అమలు చేస్తే ఏడాదికి రూ.3500 కోట్లు అవసరం. గత ఏడాది పూర్తిగా దీనిని ఎగ్గొట్టేశారు.హామీల అమలుకు కేటాయింపులు ఏవీ?:యాబై ఏళ్ళకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ అన్నారు. రాష్ట్రంలో ఈ కేటగిరిలో మొత్తం 20 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.4000 చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే ఏడాదికి రూ.9600 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3000 భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అలా ఇవ్వాల్సి వస్తే రూ.7200 కోట్లు కేటాయించాల్సి ఉంది. కానీ, ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే రైతుభరోసా కింద కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.1,716 కోట్లు ఇవ్వాల్సి ఉంటే, దానికీ పంగనామాలు పెట్టేశారు.సాక్షి కార్యాలయాలపై దాడులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి:కొమ్మినేని శ్రీనివాసరావు వంటి సీనియర్ జర్నలిస్ట్‌ను కక్ష సాధింపుతో అరెస్ట్ చేసిన ఘటనపై సుప్రీంకోర్డు మొట్టికాయలు వేసింది. అయినా గుంటూరులో తెలుగుదేశం పార్టీ మహిళలు వైయస్ భారతమ్మ క్షమాపణలు చెప్పాలని ధర్నా చేశారు. అంతకు ముందు టీడీపీ కార్యకర్తలు పలుచోట్ల సాక్షి మీడియాపై విషం చిమ్మారు. కార్యాలయాలపై దాడులు చేశారు. తక్షణం వీటికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.సభ్యత, సంస్కారంతో వ్యవహరించాలని చంద్రబాబు, లోకేష్‌ను హెచ్చరిస్తున్నాం. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీని భూ స్థాపితం చేయాలని చంద్రబాబు కలలు కంటున్నారు. తెలుగుదేశం తప్ప ఈ రాష్ట్రంలో మరే రాజకీయ పార్టీ ఉండకూడదని ఆయన అనుకుంటున్నారు. కానీ, అది ఏ మాత్రం సాధ్యం కాదు. నిజానికి రాబోయే రోజుల్లో చంద్రబాబు మళ్లీ రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితి వస్తుందని అంతా అంటున్నారని అంబటి రాంబాబు చెప్పారు. -
ఏడాది కూటమి పాలన-మహిళలకు వంచన!
విజయవాడ: వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ‘ఏడాది కూటమి పాలన-మహిళలకు వంచన’ పై చర్చా వేదిక నిర్వహించారు విజయవాడ వేదికగా జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్సీ భాగ్యలక్ష్యి, పార్టీ మహిళా నేతలు, వైద్యులు, వాలంటీర్లు, విద్యావంతులు, మహిళలు పాల్గొన్నారు అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించిన అనంతరం చర్చా వేదికను ప్రారంభించారుదీనిలో భాగంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘అవినీతి పాలన, అప్పుల ఆంధ్రాగా మారింది ఏడాదిలోనే మహిళల జీవితాలు తలకిందులైపోయాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సాధికారితకు పెద్దపీట వేశారు. ఈ ప్రభుత్వంలో మహిళా భక్షక పాలన సాగుతోంది. మహిళలకు దశ,దిశా లేకుండా పోయింది. తొలియేడాదిలో తొమ్మిది శాతం కూడా మహిళలకు ప్రయోజనం చేకూర్చలేదు. రోజుకు 70 మంది మహిళల పై దాడులు జరగడం స్వర్ణాంధ్ర అంటారా?, సందుసందుకి మద్యం షాపులు ఉండటాన్ని స్వర్ణాంధ్ర అంటారా?, 17 ఏళ్లలో చేయనంత అప్పు చేయడాన్ని స్వర్ణాంధ్ర అంటారా?,సూపర్ సిక్స్ చేసేశాను..ఎవరైనా అడిగితే వారి నాలుక మందం ఎక్కినట్లే అని సీఎం చెబుతున్నారు. నాలుక మందం ఎక్కడమేంటి దృశ్యం సినిమా మాదిరి ఒకే విషయాన్ని పదేపదే ఒకే విషయాన్ని చెప్పి నమ్మించాలని చూస్తున్నారు. సూపర్ సిక్స్ అడిగిన వారి నాలుక మందం అయితే... ఎగ్గొట్టిన వారిని ఏమనాలిఇంటింటికీ బాండ్లు పంచిన వారిని ఏమనాలి గతంలో అమ్మఒడి పై విమర్శలు చేశారు. ఇప్పుడు అవే నిబంధనలు తల్లికి వందనం పథకంలో అమలు చేస్తున్నారు. డ్రాప్ అవుట్స్ ను తగ్గించేందుకు దేశచరిత్రలో తొలిసారి జగన్ అమ్మ ఒడిని ప్రవేశపెట్టారు. జగనన్న పథకాలను ఈ ప్రభుత్వం కాపీకొట్టగలదు..కానీ జగనన్న చిత్తశుద్ధిని కాపీ కొట్టలేరు. ఏడాది కాలంలో మద్యం, గంజాయి,డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో అఘాయిత్యాలకు ఇవే ప్రధాన కారణం, గతంలో జగనన్న దిశా యాప్ ను తెచ్చి మహిళలకు రక్షణ కల్పించారు. దిశా చట్టాన్ని ఆమోదం కోసం కేంద్రానికి పంపించారు. అనంతపురంలో బాలిక అదృశ్యమైందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా వారం రోజులు పట్టించుకోలేదు పోలీసుల నిర్లక్ష్యంతో బాలిక శవమై తేలింది. సత్యసాయి జిల్లాలో 14 ఏళ్ల బాలిక పై టిడిపి కార్యకర్త ఆరునెలలుగా అత్యాచారం పాల్పడ్డారు’ అని వరుదు కళ్యాణి మండిపడ్డారు.సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఏం మెసేజ్ ఇస్తున్నారు?రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచనే తప్ప మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచన కూటమి నాయకుల్లో లేదని ధ్వజమెత్తారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. జగనన్న మహిళలకు పెద్ద పీట వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె మరోసారి గుర్తుచేశారు. జగనన్న దిశా యాప్ తెస్తే ఆ యాప్‌ను ప్రస్తుత హోంమంత్రి హేళనగా మాట్లాడారు. అదే దిశా యాప్‌ను పేరు మాత్రమే మార్చి శక్తి యాప్ అని పేరు పెట్టారు. దిశా చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తే లోకేష్ తెలుగు మహిళలందరినీ పోగేసి ఆ ప్రతును తగలబెట్టించారన్నారు. ‘ ఏపీని శ్రీలంక చేసేస్తున్నారు.... ప్రజలను సోమరిపోతులను చేసేస్తున్నారని బురదజల్లారు జగనన్నను విమర్శించి అంతకంటే ఎక్కువ పథకాలిస్తానని నమ్మించి ప్రజలను మోసం చేశారు. ప్రజలకు పథకాలు ఇవ్వాలని ఉన్నా కానీ భయమేస్తోందని చంద్రబాబు చెబుతున్నారు. 40 ఏళ్ల సీనియర్‌నని చెప్పుకునే నాయకుడు అలా చెప్పడమేంటి?, అమ్మఒడి పథకంలో 1000 రూపాయలు పాఠశాలల నిర్వహణకు తీసుకుంటే లోకేష్ అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు తల్లికివందనం పథకంలో లోకేష్ రూ. 2 వేలు కోత పెట్టారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులుపెట్టి నానా రకాలుగా వేధిస్తున్నారు ఏడాది కాలంగా ఎంతోమంది చిన్నారుల పై అఘాయిత్యాలు జరిగాయి. హోంమంత్రి అనిత కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పింది లేదు. హోంమంత్రి అనిత ఓ రబ్బర్ స్టాంప్ మాదిరి మారారు. వైఎస్సార్సీపీ వాళ్లకు ఏ పనీ చేయొద్దని చంద్రబాబు చెబుతున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు?, కులం,మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందించాలని జగన్ చెప్పారు. చంద్రబాబుకి...జగన్‌కి ఉన్న తేడా ఇదే. రాష్ట్రం రావణకాష్టంలాగా మారింది.క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనవ్రతం దాల్చారు. పవన్ ఎందుకు మౌనవ్రతం దాల్చారో చెప్పాలి’ అని వనిత డిమాండ్ చేశారు. ఏపీఐడీసీ మాజీ చైర్మన్ బండి పుణ్యశీల మాట్లాడుతూ.. చంద్రబాబుకి అమరావతిలో ఉన్నవారు మాత్రమే మహిళలుగా కనిపిస్తారని, రాష్ట్రంలో ఉన్న మహిళలు గురించి చంద్రబాబుకు మనం గుర్తుచేయాలని ఎద్దేవా చేశారు. అనని మాటలను వైఎస్సార్సీపీకి, సాక్షికి ఆపాదించి నానా రాద్ధాంతం చేశారని మండిపడ్డారు.ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ ఈ ప్రభుత్వంలో విద్యకు ఒక విధానమంటూ లేకుండా పోయింది. విద్యాశాఖను గాడి తప్పిస్తున్నారు. ఏడాది కాలంలోనే టీచర్లను రోడ్డుమీదకు లాగేశారు. టీచర్ల బదిలీల్లో అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్కూల్స్ కు దగ్గర్లోనే మద్యం షాపులు పెట్టారు. జగన్ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యం కల్పించారు. విద్యకు సంబంధించి అనేక సంస్కరణలు తెచ్చారు’ అని స్పష్టం చేశారు. తిరుపతి మేయర్ శిరీష మాట్లాడుతూ.. ‘ ఆరోగ్యానికి జగన్ పెద్దపీట వేశారు. వైద్య విభాగంలో 47 వేల మంది నియామకాలు చేపట్టడం ఒక చరిత్ర. నాడు -నేడులో 16 వేల కోట్లతో ఆసుపత్రుల రూపురేఖలు మార్చేశారు. ఉద్ధానంలో కిడ్నీ బాధితుల కోసం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. రూ. 750 కోట్లతో ఉద్ధానం ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించారు. డాక్టర్ అవ్వాలనే పేద విద్యార్ధుల కలను నెరవేర్చడానికి వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. మెడికల్ సీట్ల కోసం ప్రభుత్వాలు పోరాడుతుంటాయి. కానీ వచ్చిన మెడికల్ సీట్లను వద్దని చెప్పిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే’ అని ధ్వజమెత్తారు. -
కూటమి ఏడాది పాలనపై వైఎస్సార్సీపీ బుక్ రిలీజ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ ఏడాది విధ్వంస పాలనపై వైఎస్సార్సీపీ బుక్ రిలీజ్ చేసింది. జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం పేరుతో పుస్తకాన్ని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, విడదల రజని, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి, జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమే. కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్నే అమలు చేశారు. దీనికి వాస్తవాలు, ఆధారాలతో వైఎస్సార్సీపీ పుస్తకాన్ని తెచ్చాం. ఐదు కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారో వివరించాం. ఆధారాలతో సహా అన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి.జగన్ అంటే నమ్మకం.. బాబు అంటే మోసం.. బుక్ కోసం క్లిక్ చేయండిజగన్ పాలన రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తులాంటిది. కానీ, ఈ ఏడాది చంద్రబాబు పాలన అంతా చీకటిమయమే. చంద్రబాబు దుష్టపాలన మొత్తం బుక్ వేస్తే కనీసం 5వేల పేజీలు అవుతుంది. చంద్రబాబు దుష్ట పాలనకు ముకుతాడు వేయాలి. ఇంకా నాలుగేళ్లు ఉంది కదా అని ఆలోచించ కూడదు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయటం లేదని గట్టిగా ప్రశ్నించాలి. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి’ అని కోరారు. -
ఢిల్లీలో బాబు డాబు
సాక్షి, న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 20 సార్లు ఢిల్లీకి వచ్చారు. ప్రతిసారీ అభివృద్ధే అజెండా అంటూ ప్రచారం చేసుకుంటున్నా.. కొత్త అప్పులకు మద్దతు కోరడమే లక్ష్యంగా ఆయన పర్యటనలు సాగాయి. ఈ మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ పెద్దలను కలుస్తూ వచ్చారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని ధ్వంసం చేసిందని విమర్శిస్తూ.. ఆ వంకతో కేంద్రం మద్దతుతో రూ.కోట్లు అప్పులు తెచ్చారు. అమరావతి పేరుతో ఇప్పటివరకు రూ.31 వేల కోట్లు తీసుకోవడం గమనార్హం. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి రూ.15 వేల కోట్లు పొందారు. ఇవికాక బడ్జెటేతర అప్పులు రూ.19,410 కోట్లు. ఏడాదిలో భారీగా అప్పు చేయడంలోనే చంద్రబాబు తన మార్క్ చూపారు. ఇకప్రతిసారీ చంద్రబాబు ప్రత్యేక విమానంలోనే ఢిల్లీ వచ్చారు. దాదాపు 15–17 సార్లు రెండు రోజుల పాటు మకాం వేశారు.ఐదుసార్లు ప్రధాని మోదీని, ఆరుసార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ఐదుసార్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిస్తున్నట్లు కేంద్రం పేర్కొన్నా.. చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఎన్డీఏ నేతలు ఎవరూ నోరు మెదపలేదు. పైగా దీనిని వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ ఎంపీలపై కూటమి ఎంపీలు పార్లమెంట్లో వ్యక్తిగత దూషణలకు దిగారు. ఎత్తు తగ్గిస్తున్నట్లు కేంద్రం స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొందని మీడియా ప్రశ్నించినా... కూటమి నేతల నుంచి సమాధానం రాలేదు.మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించడంలోనూ చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. ఈ విషయంలో ఒక్కోసారి ఒక్కోలా స్పందించారు. క్వింటాకు రూ.11,600 ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా... రూ.10,025 కంటే రూపాయి కూడా ఎక్కువ ఇచ్చేది లేదని కేంద్రానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) తేల్చి చెప్పింది. అయినా మిర్చికి మద్దతు ధర లభించిందని, కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఏపీలో రేటు పెంచితే దేశం మొత్తం పెంచాల్సి వస్తుందని కేంద్రం చెప్పడంతో... చంద్రబాబు మళ్లీ ఈ విషయం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ దోబూచులాటల కారణంగా మిర్చి రైతులకు రూ.8,827 కోట్లు నష్టం వాటిల్లింది.సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల సమయంలో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆపై యూటర్న్ తీసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తల ద్వారానే సంపద సృష్టి జరుగుతుందని, వారు పెట్టుబడులు పెడితే తద్వారా వచ్చిన ఆదాయంతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించొచ్చు అని చెప్పుకొచ్చారు. -
ఏరువాక సందడి ఏది?
సాక్షి, అమరావతి: ఏరువాక పౌర్ణమి.. మరోపేరు జ్యేష్ట పౌర్ణమి.. ఇది తెలుగు రైతుల పండుగ. తొలకరి పంట సాగుకు సన్నద్ధమయ్యే సందర్భంగా రైతులు సంప్రదాయబద్ధంగా ఉత్సాహంగా జరుపుకునే వేడుక.. కాడెద్దులను సిద్ధంచేసి వ్యవసాయ పరికరాలను అలంకరించుకుని పూజలుచేసి సాగును ఆరంభిస్తారు. అలాంటి సంప్రదాయ పండుగ వాతావరణం ఈ ఏడాది రైతుల లోగిళ్లలో ఎక్కడా కన్పించడంలేదు. గడిచిన ఏడాదిగా టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణి రాష్ట్రంలోని రైతులందరి పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ నిర్వాకంవల్ల సాగుభారంగా మారడంతో రైతులు తొలకరి సాగుకు ఉసూరుమంటూ బుధవారం ఏరువాకకు శ్రీకారం చుట్టారు.పెట్టుబడి సాయం లేకుండా ఏరువాక ఎలా?తాము అధికారంలోకి వస్తే ఏటా ప్రతీ రైతు కుటుంబానికి రూ.20వేల చొప్పున అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల్లో ఊదరగొట్టింది. ఎన్నికల్లో గెలిచాక 2024–25 సీజన్‌కు ఇవ్వాల్సిన రూ.10,717 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టింది. కనీసం ఈ ఏడాదైనా సీజన్‌కు ముందు ఇస్తుందేమోనని రైతులంతా ఆశగా ఎదురుచూసారు. కానీ, ఇప్పటివరకు ఆ ఊసేలేదు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఇప్పటివరకూ జారీచేయలేదు. మరోపక్క.. గడిచిన ఖరీఫ్, రబీ సీజన్లలో వరదలు, అకాల వర్షాలు, కరువు ప్రభావంతో పంటలు నష్టపోయిన దాదాపు ఏడు లక్షల మంది రైతులకు రూ.850 కోట్లకు పైగా పంట నష్టపరిహారం సీజన్ ముగిసినా చెల్లించలేదు. రూ.వెయ్యి కోట్లకు పైగా ధాన్యం బకాయిలుఇక 48 గంటల్లోనే.. కాదు కాదు 24 గంటల్లోనే ధాన్యం సొమ్ములు జమచేస్తున్నామంటూ గొప్పలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. గడిచిన రబీ సీజన్‌కు సంబం«ధించి పేరుకుపోయిన రూ.1,000 కోట్ల బకాయిల చెల్లింపు ఊసెత్తడం లేదు. అలాగే, 2023–24 సీజన్‌కు సంబంధించి ప్రీమియం బకాయిలు రూ.930 కోట్లు చెల్లించకుండా ఎగ్గొట్టడం వల్ల రైతులకు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండాపోయింది. కనీసం ఖరీఫ్–2024 సీజన్‌కు సంబంధించిన పంటల బీమా ప్రీమియం మొత్తం రూ.838 కోట్లు చెల్లించి ఉంటే బీమా పరిహారమైనా ఈపాటికి చేతికొచ్చేది. ఇలా దాదాపు రూ.25 వేల కోట్లకు పైగా రైతులకు అందాల్సిన సాయం జమకాకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం మోకాలడ్డింది. పైగా.. రబీ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేసింది. స్వచ్ఛంద బీమా నమోదు చేయాలని చెప్పడంతో ఆ భారం భరించలేక రైతులెవరూ రబీలో నమోదు చేసుకోలేదు. మరోపక్క.. ధాన్యం, పత్తి, మిరప, పొగాకు, టమాటా ఇలా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వ నిర్వాకంవల్ల రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కనీసం అదునుకైనా విత్తనం అందించారా అంటే అదీ లేదు.విత్తనం అందక అగచాట్లుఇదిలా ఉంటే.. గత సీజన్ నుంచే నాన్ సబ్సిడీ విత్తన సరఫరాకు మంగళం పాడేశారు. 6.32 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం అవసరం కాగా.. నిధులలేమి సాకుతో 5.38 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేశారు. వేరుశనగ విత్తనం 30 శాతానికి కుదించారు. కనీసం ఆ విత్తనమైనా సీజన్‌కు ముందు అందుబాటులో ఉంచారా అంటే అదీలేదు. ఇప్పటివరకు కనీసం 30 శాతం విత్తనాన్ని కూడా పొజిషన్ చేసిన పాపాన పోలేదు. రైతు సేవా కేంద్రాల్లో సబ్సిడీ విత్తనమే కాదు.. ఎరువులూ కానరావడంలేదు. అయినాసరే, ఏరువాక పౌర్ణమిని పండుగ వాతావరణంలో చేసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం విస్మయానికి గురిచేస్తోంది. రైతులు చేసుకోవాల్సిన ఈ పండుగను అంతా బాగుందంటూ వారిని ఏమార్చి మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో కూటమి కార్యకర్తలు హంగామా చేశారు. -
తల్లికి వందనం 30 లక్షల మందికి ఎగనామం
సాక్షి, అమరావతి: ‘నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు.. నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం.. అధికారంలోకి రాగానే తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం కింద ఈ మొత్తాన్ని జమ చేస్తాం’ అని ఊరూరా.. ఇంటింటా ఎన్నికల ముందు ప్రచారం చేసిన చంద్రబాబు అండ్ గ్యాంగ్.. ఇప్పుడు మాట తప్పింది. ఏకంగా దాదాపు 30 లక్షల మందికి ఈ పథకాన్ని ఎగ్గొట్టనుంది. అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టడమే కాకుండా.. రెండో ఏడాది తూతూ మంత్రంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. రూ.15 వేల స్థానంలో రూ.13 వేలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించిందని తెలిసింది. రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్ లెక్కలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం. అయితే ఈ పథకం అమలు కోసం రూ.8,745 కోట్లు మాత్రమే కేటాయించినట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ లెక్కన ఈ మొత్తం 58 లక్షల మంది విద్యార్థులకే సరిపోతుంది. అంటే దాదాపు 30 లక్షల మందికి ఈ పథకాన్ని ఎగ్గొట్టడానికి రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ రూ.13 వేలను ఒకేసారి ఇస్తారా.. లేక వాయిదాల పద్దతిలో ఇస్తారా.. అన్నది ఇంకా స్పష్టం చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా సూపర్ సిక్స్ అమలు చేయక పోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా.. ప్రజలు ఈ పథకం గురించి ఎక్కడికక్కడ ప్రశ్నిస్తుండటంతో అరకొరగా అమలు చేయనుందని తెలుస్తోంది. అయితే అంతుబట్టని అంకెల గారడీతో తల్లుల కళ్లకు ప్రభుత్వం గంతలు కట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులున్నట్టు చెబుతోంది. ఈ లెక్కన తీసుకున్నా, తలో రూ.15 వేల చొప్పున రూ.10,090.74 కోట్లకు పైగా అవసరం. కానీ కేటాయింపులు మాత్రం ఆ మేరకు కూడా లేక పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. తీరా నగదు జమ చేసే సమయానికి ఇంకెంత మందికి ఎగ్గొడతారోననే అనుమానం వ్యక్తమవుతోంది.గత ఏడాది ఎగ్గొట్టి.. ఈ ఏడాది కోతలు పెట్టి.. ‘‘ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ అమలు చేస్తాం. ఒక్కరుంటే రూ.15 వేలు ఇస్తాం. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి పథకాలు అందుకోండి’’ అంటూ ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదే హామీని ‘సూపర్–6’లోనూ పేర్కొన్నారు. అందరికీ తల్లికి వందనం ఇస్తామన్న హామీ ప్రకారం.. ఇప్పుడు చెప్పిన విద్యార్థుల సంఖ్య, నిధుల లెక్క సరిపోవడం లేదు. విద్యార్థుల లెక్కలు చెప్పేందుకు దేశంలో యూడైస్ డేటానే ప్రామాణికం. అన్ని జిల్లాల్లోని స్కూళ్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందించే నివేదిక ఇది. ఈ లెక్కలను స్వయంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారానే అప్లోడ్ చేస్తారు. రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్ లెక్కలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం.గతేడాది ఒక్క విద్యార్థికీ ఈ పథకం ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఈసారి విద్యార్థుల సంఖ్యలో కోత పెట్టి గొప్పలు చెబుతోంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్ నెలలో అమ్మఒడి జమయ్యేది. గతేడాది ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం రావడంతో పథకం ఆగిపోయింది. కానీ సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తామన్నారు. అలాగే, ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామన్నారు. హామీ ప్రకారం రెండేళ్లకు ఒక్కో విద్యార్థికి రూ.30 వేల చొప్పున ఇవ్వాలని తల్లులు డిమాండ్ చేస్తున్నారు.నేడు ‘తల్లికి వందనం’ నిధులు జమసమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయంసాక్షి, అమరావతి: తల్లికి వందనం పథకాన్ని గురువారం నుంచి అమలుచేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సచివాలయంలో బుధవారం ఈ పథకం అమలు, విధివిధానాలపై మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, అధికారులతో సీఎం సమీక్షించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గురువారమే తల్లులకు కానుకగా ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అర్హులైన విద్యార్థుల ప్రతి తల్లి ఖాతాలో తల్లికి వందనం నిధులను జమచేయాలని ఆయన ఆదేశించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. అర్హులైన విద్యార్థులను ఇప్పటికే గుర్తించామన్నారు. పథకాన్ని ఎలా అమలుచేయబోతున్నామనే విషయాన్ని వివరించారు. పథకం అమలుకు అవసరమైన నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద గురువారం నగదును తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. -
చదువు చతికిల బడింది
విజయనగరంలోని నారాయణ స్కూల్లో గత ఏడాది 3వ తరగతికి స్కూల్ ఫీజు రూ.48 వేలు, పుస్తకాలకు రూ.7,500, రిజర్వ్ నగదు రూ.1,000 (మొత్తం రూ.56,500) వసూలు చేశారు. ఈ ఏడాది స్కూల్ ఫీజును రూ.55 వేలు చేశారు. పుస్తకాలకు రూ.8,500 కట్టించుకున్నారు. రిజర్వ్ నగదు రూ.వెయ్యితో కలిపి రూ.64,500 వసూలు చేస్తున్నారు. ఇదే స్కూల్లో నిరుడు 4వ తరగతికి స్కూల్ ఫీజు రూ.50 వేలు, పుస్తకాలకు రూ.8,500,(రిజర్వ్ నగదు రూ.1,500) మొత్తం రూ.60 వేలు తీసుకున్నారు. నేడు స్కూల్ ఫీజును రూ.60 వేలకు పెంచారు. పుస్తకాలకు రూ.9,500 తీసుకున్నారు.ఏడాదిలోనే ఎంత తేడా...? అప్పుడు అంతా ప్రగతి బాట.. ఇప్పుడు మొత్తం అస్తవ్యస్తం..! నాడు సంస్కరణల పథం.. నేడు నిర్వీర్యం..! వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక విప్లవంలా విద్యారంగాన్ని ముందుకుతీసుకెళ్లగా... టీడీపీ కూటమి సర్కారు అంతా కుప్పకూల్చింది..! పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తపించగా.. ప్రైవేటుమయం చేయాలని ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీంతో నాడు–నేడు అభివృద్ధి పనులు అటకెక్కాయి.. సర్కారీ చదువులు చట్టుబండలవుతున్నాయి..! అమ్మ ఒడికి వీడ్కోలు పలికారు...ఇంగ్లిష్ మీడియంకు మంగళం పాడారు... డిజిటల్ క్లాస్‌రూమ్‌కు బైబై అన్నారు... టోఫెల్ క్లాసులకు టాటా చెప్పారు...సబ్జెక్ట్ టీచర్లపై వేటు వేశారు... గోరుముద్దను ఘోరంగా మార్చారు... ఆసాంతం విద్యా వ్యవస్థను నీరుగార్చారు... ఫలితం... ఫలితాలు దారుణంగా పడిపోయాయి. దీంతో ప్రభుత్వ బడులను వీడి విద్యార్థులు ప్రైవేటు బాట పడుతున్నారు. ⇒ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో స్వాతంత్య్రం అనంతరం ఎవరూ చేయని స్థాయిలో... వైఎస్ జగన్ పాలనలో సమూల విద్యా సంస్కరణలు ఉద్యమంలా సాగాయి. నాణ్యమైన విద్యను పేద పిల్లల ముంగిటకు తెచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోటాపోటీ చేరికలతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విలసిల్లాయి. సర్కారీ బడుల్లో ఖాళీలు లేక.. ‘నో వేకెన్సీ’ బోర్డులు పెట్టేంత వరకు వెళ్లాయి. కానీ, కూటమి పాలనలో సంస్కరణలు నిలిచిపోయి.. సంక్షేమ పథకాలు అమలు కాక.. పరిస్థితులు తలకిందులయ్యాయి. రాష్ట్రంలో గురువారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..సాక్షి, అమరావతి : సంవత్సరం క్రితం వరకు ఎంతో గొప్ప ఫలితాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఏపీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి నేడు దిగజారిపోయింది. వైఎస్సార్సీపీ పాలనలో మనబడి నాడు–నేడు పనులతో సకల సదుపాయాలతో వెలుగొందిన బడులు ఇప్పుడు జీవం కోల్పోయాయి. రికార్డు వ్యవధిలో ఫలితాలు అంటూ.. ఘనంగా చెప్పుకొన్న పదో తరగతి ఫలితాల్లోనే కూటమి సర్కారు డొల్లతనం బయటపడింది. మోడల్ స్కూళ్ల పేరుతో వందల ప్రాథమిక పాఠశాలలను దూరంగా ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడంతోనే పనితీరు తేటతెల్లమైంది. సర్కారీ బడుల్లో ప్రమాణాలు పెంచే పనులను పక్కనపెట్టడంతోనే.. చంద్రబాబు ప్రభుత్వానిది ప్రైవేటు మోజు అని స్పష్టమైంది. ఇదే అదనుగా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు చెలరేగుతున్నాయి. ఈ ఏడాది ఫీజులను భారీగా పెంచేశాయి. ఇక కార్పొరేట్ స్కూళ్లలో చదివించాలంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి. సగటున ఒక్కో స్కూల్లో 10 నుంచి 30 శాతంపైగా ఫీజులు పెంచేశాయి. వీటికి పుస్తకాలు, యూనిపారం ఖర్చులు అదనం. ప్రైవేటులో ఫీజులను నియంత్రించాల్సిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్నది లేదు. పిల్లల చదువులు భారంగా మారడంతో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అంటేనే తల్లిదండ్రులు దిగాలు చెందుతున్నారు. –2024 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులే అత్యధిక మార్కులతో టాపర్లుగా నిలిచారు. ఈ ఏడాది అధిక శాతం ప్రైవేటు విద్యార్థులే ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. దీంతో ‘షైనింగ్ స్టార్’ అవార్డులు వారికే దక్కాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సమూల విద్యా సంస్కరణలు స్వాతంత్య్రం అనంతరం ఎవరూ చేయని స్థాయిలో అమలు నాణ్యమైన విద్యను పేద పిల్లల ముంగిటకు తెచ్చిన వైఎస్ జగన్ పోటాపోటీ చేరికలతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నాడు సర్కారీ బడుల్లో ఖాళీలు లేక.. ‘నో వేకెన్సీ’ బోర్డులు విద్యార్థుల యూనిఫాం సైతం వైఎస్ జగన్ స్వయంగా పరిశీలించి ఎంపిక నేడు నిలిచిపోయిన సంస్కరణలు.. అమలు కాని పథకాలు వైఎస్సార్సీపీ పాలనకు, ఇప్పటికీ పూర్తి భిన్నంగా పరిస్థితులు ప్రజా వ్యతిరేక విధానాలే మేలంటూ.. 2024 జూన్ 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటి రోజు నుంచి 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కూటమి వచ్చిందే తడవుగా.. అప్పటిదాకా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలు, విద్యా సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను నిలిపివేసింది. పథకాలకు పేర్లు మార్చింది. విద్యా కానుక తప్ప ఇతర అన్నింటినీ రద్దు చేసింది. 16 రకాల పదార్థాలతో విద్యార్థులకు అందజేసిన ‘జగనన్న గోరుముద్ద’ను డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకంగా పేరు మార్చిందేగాని నాణ్యతను గాలికి వదిలేసింది. దీంతో 50 శాతం మంది కూడా విద్యార్థులు తినలేని పరిస్థితి. ⇒ రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు మూడు రకాల మెనూ అందిస్తామని రూ.కోట్ల ఖర్చుతో ప్రయోగాలు చేసిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేసింది. ⇒ ఇంట్లో విద్యార్థులు ఎంతమంది ఉంటే అందరికీ రూ.15వేలు తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఏడాదిగా ఎగ్గొట్టింది. ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.8 వేల కోట్లతో మనబడి నాడు–నేడు రెండో దశ పనులు ప్రారంభించింది. 20 వేల పాఠశాలల అభివృద్ధి పనులను చేపట్టి, 4 వేల స్కూళ్లలో పూర్తిచేసింది. మిగిలిన పాఠశాలల్లో పనులను కూటమి ప్రభుత్వం అర్థంతరంగా నిలిపివేసింది. ⇒ గత ఏడాది జూలైలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించి ప్రాథమికోన్నత స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ బోధనను తొలగించింది. విద్యా సంవత్సరంలో దాదాపు 9 నెలలపాటు ఉపాధ్యాయుల సర్దు బాటు తోనే కాలంవెళ్లదీసి బోధనను బలహీనం చేసింది. ⇒ ప్రమాణాల మెరుగు కోసం 3–5 తరగతుల విద్యార్థులకు వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన సబ్జెక్టు టీచర్ చదువులను సైతం కూటమి సర్కారు రద్దు చేసింది. ⇒ వైఎస్సార్సీపీ వెయ్యి స్కూళ్లలో ప్రారంభించిన సీబీఎస్ఈ బోధనను కూటమి వచ్చాక ఎత్తివేశారు. ⇒ పేద విద్యార్థుల కోసం తెచ్చిన టోఫెల్, అంతర్జాతీయ ఐబీ విద్యను చంద్రబాబు ప్రభుత్వం దూరం చేసింది. డిజిటల్ క్లాస్రూమ్ కాన్సెప్‌్టను పక్కనపెట్టింది.టెన్త్ పరీక్షల్లో ఘోరంగా ‘ఫెయిల్’పరీక్షలు జరుగుతుండగానే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో ప్రత్యక్షం... ఆపై ఫలితాల వెల్లడిలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోర వైఫల్యం..! ఇదీ 2024–25 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలను కూటమి ప్రభుత్వం నిర్వహించిన తీరు. ఈ ఒక్క ఉదాహరణ చాలు... ప్రభుత్వం ఎంత ఘోరంగా ఫెయిలైందో చెప్పేందుకు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనిది... కూటమి ప్రభుత్వంలో ప్రశ్నపత్రం లీక్ కావడం ఒకప్పటి టీడీపీ పాలనను గుర్తు చేసింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, రికార్డు కక్కుర్తిలో తక్కువ రోజుల్లోనే ఫలితాల ప్రకటనతో తప్పిదాలు జరిగాయి. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఏకంగా 66 వేల దరఖాస్తులు అందాయి. పునః పరిశీలనలోనూ మళ్లీ తప్పులు జరిగాయి.నాడు నో వేకెన్సీ బోర్డులు.. నేడు సర్కారు బడికి రాంరాంచక్కగా సాగుతున్న సంస్కరణలను పక్కకుపెట్టి... సంక్షేమ పథకాలను ఎత్తివేసిన కూటమి.. ప్రభుత్వ విద్యలో ప్రయోగాలు చేస్తూ 2025–26 విద్యా సంవత్సరం నుంచి 9 రకాల పాఠశాలలను ప్రవేశపెట్టింది. ప్రజలు, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నా ఇదే మేలంటూ పాఠశాల విద్యను అంధకారంలోకి నెట్టేసింది. గత ఏడాది ప్రభుత్వ చర్యలతో ఏకంగా 4 లక్షల మందిపైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల నుంచి వెళ్లిపోయారని ముఖ్యమంత్రికే జిల్లాల కలెక్టర్లు నివేదిక ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని.. ఇదే విధానాలు కొనసాగితే ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి భిన్నంగా వైఎస్సార్సీపీ పాలనలోని పరిస్థితులను ప్రస్తావిస్తున్నారు. నాడు చేపట్టిన విద్యా సంస్కరణలు అద్భుత ఫలితాలు ఇచ్చాయని, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా నిలిచాయని గుర్తుచేస్తున్నారు. విద్యార్థులతో కిటకిటలాడాయని పేర్కొంటున్నారు. ‘‘మా పాఠశాలలో సీట్లు లేవు’’ అంటూ గేట్లకు నో వేకెన్సీ బోర్డులు కూడా పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ విద్యార్థుల యూనిఫాంను స్వయంగా పరిశీలించి ఎంపిక చేసిన అంశాన్ని ఉదహరిస్తున్నారు.విద్యార్థుల ప్రైవేటు బాట... ఫీజుల బాదుడు బాధకూటమి ప్రభుత్వ విద్యా విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు దిగజారడంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రైవేటు స్కూళ్లల్లో ప్రవేశాలు తీసుకుంటున్నారు. దొరికిందే చాన్సుగా ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు ఫీజులు భారీగా పెంచేశాయి. ఏడాది కాలంలో సగటున 10 నుంచి 30 శాతం పైగా స్కూల్ ఫీజులు పెంచేయడంతో మధ్య తరగతి వర్గం తీవ్ర ఆందోళన చెందుతోంది. గత ఏడాది ఓ కార్పొరేట్ స్కూల్లో 3వ తరగతి ఫీజు రూ.45 వేలు ఉంటే, ఇప్పుడు రూ.55 వేలకు పెరిగింది. పుస్తకాల ధర రూ.7 వేల నుంచి రూ.8,500కి చేరింది. ఏడాది కాలంలో వందపైగా కొత్త ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ అనుమతినిచ్చినట్టు అంచనా. సాధారణ బడ్జెట్ పాఠశాలల్లో ఒకటో తరగతికి రూ.12 వేలు ఫీజు, పుస్తకాలకు మరో రూ.3 వేలు వసూలు చేస్తుండగా, ఆరో తరగతికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు తీసుకుంటున్నారు. పుస్తకాలకు మరో రూ.5 వేలు వెరసి రూ.30 వేలు అవుతోంది. వ్యవసాయ కుటుంబాలు, మధ్య తరగతి వర్గాల పిల్లలను చదివించే సెమీ కార్పొరేట్ పాఠశాలలు ఒకటో తరగతికి రూ.25 వేల నుంచి రూ.38 వేలు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలు నాన్ ఏసీ, ఏసీ తరగతులు అంటూ ఫీజులు బాదుతున్నాయి. పిల్లల చదువులతో ఆర్థిక కష్టాలు ఎలక్ట్రీషియన్‌గా కుటుంబాన్ని పోషిస్తున్న నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి 6వ తరగతి, అబ్బాయి 5వ తరగతికి వచ్చారు. ఇద్దరినీ స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నా. ఏడాదికి రూ.50 వేలు ఖర్చవుతున్నాయి. పిల్లలను చదివించేందుకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫీజులతో పాటు బుక్స్, యూనిఫాం, బ్యాగ్‌లు, బూట్లు, సాక్సులు వంటి సామగ్రి కొనుగోలు భారంగా మారింది. ఫీజులను ఇష్టారాజ్యం పెంచుకుంటూ పోతున్నారు. –షేక్ బాజీ, గుంటూరుచదువు భారంగా మారుతోంది నాకు ముగ్గురు పిల్లలు. మా పెద్దబ్బాయి హాలహర్విలోని ఓ ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. ఏడాదికి రూ.20 వేలు ఫీజు చెల్లించాలి. ఫీజుతోపాటు బుక్స్, యూనిఫాం, షూకు రూ.4 వేలు ఖర్చు అవుతోంది. మాకున్న రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ.. కూలి పనులు చేసుకుని బతుకుతున్నాం. పిల్లల చదువుకు, వ్యవసాయానికి ఏటా రూ.50వేలు అప్పు చేయాల్సిన దుస్థితి. – గాదిలింగప్ప, నిట్రవట్టి గ్రామం, హాలహర్వి మండలం, కర్నూలు జిల్లా -
సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళనల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. మంగళవారం ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న నాటినుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు వినతిపత్రాలు సమర్పించారు. కూటమి పాలనలో రాష్ట్రంలో స్త్రీలు, బాలికల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని మహిళలంతా నినదించారు. హోం మంత్రి అనిత మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఆమె వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ ఆంక్షల నడుమ పోటెత్తిన ర్యాలీలు గుంటూరులో నిరసన తెలిపేందుకు వెళుతున్న మహిళలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళలు బారికేడ్లను నెట్టుకుని వెళ్లి నిరసన తెలియజేశారు. లాడ్జి సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మహిళా విభాగం అధికార ప్రతినిధి శ్రీదేవిరెడ్డి పాల్గొన్నారు. విజయవాడలో పోలీసులు అడుగడుగునా అడ్డుపడినా ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ నినాదాలు చేస్తూ మహిళలు అంబేడ్కర్ స్మృతి వనానికి తరలివెళ్లారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మహిళలపై అఘాయిత్యాలు, హత్యలను నిరసిస్తూ వినతిపత్రం సమర్పించారు. బాపట్లలో అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ నినాదాలతో కూడిన ప్లకార్డులు, బ్యానర్లు చేతబట్టి మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో భారీ ర్యాలీ జరిగింది. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద మహిళలు భారీఎత్తున నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిõÙకం చేసి వినతిపత్రం సమర్పించారు. భీమవరంలోనూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహిళలు భారీ నిరసన చేపట్టి గోకవరం బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా నలుమూలల నుంచి మహిళలు తరలివచ్చి ‘సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా’ కార్యక్రమం చేపట్టారు. ఒంగోలులో అంబేడ్కర్ భవన్ నుంచి ప్లకార్డులు పట్టుకుని మహిళలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌కు చేరుకుని నిరసన తెలిపారు. ఉత్తరాంధ్రలో నిరసనల వెల్లువ విశాఖపట్నంలో మహిళలు, వైఎస్సార్సీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనకాపల్లిలో మహిళలు రింగ్ రోడ్ నుంచి ర్యాలీగా రైల్వే జంక్షన్‌కు వెళ్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద ‘రెడ్‌బుక్ పాలన పోవాలి.. మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు అరికట్టాలంటూ వినతిపత్రం అందజేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ కూడలి వద్ద మహిళలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు.రాయలసీమ జిల్లాల్లో నిరసన గళం మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై అనంతపురం అంబేడ్కర్ విగ్రహం ఎదుట రోడ్లపై బైఠాయించారు. రాప్తాడు, హిందూపురంలో మహిళలు నిరసన తెలిపారు. కడప కోటిరెడ్డి సర్కిల్లో మహిళలకు రక్షణ కల్పించాలని మహిళలు నినదించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ర్యాలీ జరిపారు. కర్నూలులో నల్లబ్యాడ్జీలు ధరించి కొండారెడ్డి బురుజు నుంచి పాతబస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. మహిళలపై అఘాయిత్యాల విషయం కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. చిత్తూరు జిల్లాలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. -
ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసనలు
విజయవాడ : ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా నేడు (మంగళవారం, జూన్ 10వ తేదీ)) రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంతో జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తున్నార వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు. చిత్తూరు జిల్లా: కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయింది: ఆర్కే రోజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందిహోం మంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదుఅధికారంలో ఉన్నవాళ్లు లా అండ్ ఆర్డర్ కాపాడాలిఅధికారంలో ఉన్నవాళ్లు వారే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారుమహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలు పై దారుణాలు జరగడం సిగ్గుచేటునగరి నియోజకవర్గం లో మైనర్ బాలికపై అత్యాచారం చేశారుఅనంతపురం జిల్లా ఇంటర్ విద్యార్ధి కనిపించకపోతే పట్టించుకోలేదుపరిటాల సునీత నియోజకవర్గంలో 14 మంది టీడీపీ వాళ్లు మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే సాక్షి మీడియా బయటకు తీసుకు వచ్చిందిడిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మహిళలు పై దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదుహోం మంత్రి అనిత నా చేతిలో గన్ ఉందా, నాకు పవర్ ఉందా.. అంటూ చేతకాని మాటలు మాట్లాడుతూ ఉంటే రాజీనామా. చేయాలి విజయవాడలో..రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా వైస్సార్సీపీ మహిళ విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు వరుదు కళ్యాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. కృష్ణాజిల్లా:లో.. సేవ్ ఉమెన్-సేవ్ ఆంధ్రా నినాదాలతో వైఎస్సార్సీపీ మహిళా నేతల తమ నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూ మచిలీపట్నం లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు వైఎస్ఆర్సీపీ మహిళలు. దీనిలో భాగంగా మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఈ రాష్ట్రం లో మహిళలపై, వృద్ధులపై, బాలికపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎవ్వరూ మమల్ని ప్రశ్నించకూడదు అని దాడులకు తెగబడుతున్నారు, పిల్లిని గదిలో పెట్టి దాడి చేస్తే ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో టీడీపీకి అదే గతి పడుతుంది. రాష్ట్రంలో మహిళా హోమ్ మినిస్టర్ గా ఉన్నా ఆమె పసుపు పార్టీకి కార్యకర్తగానే వ్యవహరిస్తుంది తప్పా అధికారాన్ని ఎక్కడా మహిళ ల పక్షాన్న చూపించడం లేదు’ అని మండిపడ్డారు.విశాఖలో..మహిళలపై జరుగుతున్న హత్యలు హత్యాచారాలను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సిపి మహిళా నేతలు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు మహిళ నేతలు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి.రాష్ట్రంలో మహిళలకు చిన్న పిల్లలకు రక్షణ కరువైంది.కూటమి పాలనలో మహిళల భద్రతను గాలికి వదిలేసారు. హోం మంత్రి అనిత మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. గత ముఖ్యమంత్రి జగన్ మహిళల రక్షణకు పెద్దపీట వేశారు.దిశ చట్టాన్ని అమలు చేసి మహిళలకు భద్రత కల్పించారు’ అని వైఎస్సార్సీపీ మహిళా నేతలు స్సష్టం చేశారు. అనంతపురంలో.. అనంతపురంలో చంద్రబాబు సర్కార్ పై మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలక భద్రత కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా అనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అరాచకాలు నశించాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు మహిళల ద్రోహి అంటూ నిరసన చేపట్టారు.వైఎస్ఆర్ జిల్లా:కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళల ఆందోళనరాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, దారుణాలపై నిరసనరాష్ట్ర ప్రభుత్వానికి, హోంమంత్రి అనితకి వ్యతిరేకంగా నినాదాలుహోం మంత్రి మహిళ అయ్యి ఉండి కూడా న్యాయం చేయలేకపోతున్నారని మండిపాటుఆమెకు నిత్యం జగన్‌ను తిట్టి చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసే పనిలో ఉన్నారని విమర్శ32వేల మహిళలు ఇప్పుడు ఎక్కడున్నారని పవన్ కళ్యాణ్ కి ప్రశ్నమహిళల మన, ప్రాణాలను కాపాడలేని హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్32వేల మంది మహిళలను డిప్యూటీ సీఎం అయ్యాక కూడా తీసుకురాలేని పవన్ కళ్యాణ్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్కాకినాడ జిల్లా:మహిళలపై జరుగుతున్న దాడులు,అఘాయిత్యాలను అరికట్టాలని కోరుతూ వైఎస్ఆర్ సిపి మహిళ విభాగం నిరసనడా.బి.అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం అందజేతపాల్గొన్న వంగా గీతా, జిల్లా అధ్యక్షురాలు సుజాతఏలూరు జిల్లా:సేవ్ ఉమెన్ సేవ్ ఆంధ్ర... నినాదంతో ఏలూరులో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం నేతల నిరసనపాల్గొన్న ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు సరిత రెడ్డి, నగర అధ్యక్షురాలు విజయనిర్మల, పార్టీ మహిళా విభాగం నాయకులుఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మహిళ నాయకులుమహిళలు బాలికలకు బాబు పాలనలో భద్రత కరువైంది: సరిత రెడ్డికూటమి ప్రభుత్వ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయికూటమి పాలనలో మహిళలు,చిన్నారులకు రక్షణ లేదుజగనన్న పాలనలో మహిళకు పెద్దపీట వేశారుచంద్రబాబు ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం ఒక్క పథకం కూడా అమలు చేయలేదుఅంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారూజగనన్నదిశ యాప్ ద్వారా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే మహిళలకు అండగా నిలిచారుగత వారం రోజుల వ్యవధిలోని మహిళలు చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయిహోం మంత్రి మహిళ అయినా మహిళల పట్ల బాధ్యత లేదు కర్నూలు:కర్నూలు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు ఆందోళనమహిళలు, బాలికల పై జరుగుతున్న అఘయిత్యాలను నిరసిస్తూ వైఎస్సార్ సిపి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసనరాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల విభాగం నేతలు చిత్తూరు జిల్లా: దర్గా సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంఅంబేద్కర్కు వినతి పత్రం అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు, నాయకులురాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు..అంజలి రెడ్డికూటమి ప్రభుత్వం పాలనలో మహిళలు పై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.మహిళలు పై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే హోం మంత్రి మహిళగా ఉండి ఏం చేస్తున్నట్లు.. కార్పో రేటర్ హరిణి రెడ్డివైఎస్ జగన్ పాలనలో మహిళలకు ఎంతో రక్షణ ఉండేది.సంక్షేమ పాలన అందించారు..హరిణి రెడ్డిమహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చారు,మహిళలకు గౌరవం,సంక్షేమాన్ని ఇచ్చారు జగనన్న.. మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి , -
పాలనలో ఫెయిల్.. అందుకే ఈ డైవర్షన్
సాక్షి, అమరావతి: మహిళలు అంటే ఏమాత్రం గౌరవంలేని చంద్రబాబు, టీడీపీ నేతలు ఒక్కసారిగా నక్కజిత్తులతో సూక్తి ముక్తావళి వల్లిస్తుండటం తాజా రాజకీయ వైచిత్రి. తమ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుయుక్తిలో భాగంగానే ఈ పన్నాగానికి తెరతీశారు. అసలు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, బావమరిది బాలకృష్ణతో సహా ఆ పార్టీ నేతలు ఏనాడూ మహిళలకు తగిన గౌరవం ఇవ్వలేదనన్నది బహిరంగ రహస్యం. 2014–2019 మధ్య చంద్రబాబు సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ స్వయంగా వివక్షాపూరిత వ్యాఖ్యలు చేయడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైన తీరు అందరికీ గుర్తింది. ‘కోడలు కొడుకును కంటాను అంటే అత్త వద్దంటుందా’ అని ఆయన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. తద్వారా కుమార్తెలను తక్కువ చేసి అవమానించారు. స్త్రీ పురుష సమానత్వం కోసం అందరికీ ఆదర్శవంతంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారు. ఇక చంద్రబాబు బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తాను తన బావకంటే నాలుగాకులు ఎక్కువే చదివానన్నట్టుగా వ్యవహరించారు. ‘ఆడది కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి’ అని ఓ సినిమా వేడుకలో వేదిక ఎక్కి మరీ అత్యంత జుగుప్సాకరంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు కుమారుడు, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్ అటు తండ్రినీ ఇటు మామనూ మించిపోయారు. విదేశాల్లో ఆయన పలువురు యువతులతో స్విమ్మింగ్ పూల్‌లో సాగించిన వ్యవహారాలు ఫొటోలు, వీడియోలతో సహా వెలుగులోకి రావడంతో అంతా అవాక్కయ్యారు. పైగా బాలకృష్ణ ఓ చానల్ కోసం నిర్వహించే రియాల్టీ షోలో పాల్గొన్న చంద్రబాబు తన కుమారుడి బాగోతాన్ని వెనకేసుకువచ్చారు. బాలకృష్ణ కూడా లోకేశ్‌కే వంతపాడారు. ప్రస్తుతం హోమ్ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గతంలో టీడీపీ సభల్లో ప్రసంగిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి గురించి అసభ్యకరంగా వ్యాఖ్యానించారు. ఓ మహిళ, అందులోనూ ప్రజాప్రతినిధిగా చేసిన ఆమె సాటి మహిళలను పత్రికల్లో రాయలేని భాషతో అసభ్యకరంగా మాట్లాడటం విభ్రాంతి కలిగించింది. అదే టీడీపీ సంస్కృతి అని ఆ పార్టీ వర్గాలు ఘనంగా చెప్పుకోవడం మరింత విస్మయానికి గురి చేసింది. అటువంటి చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్, అనిత ప్రస్తుతం ఒక్కసారిగా మహిళలపై లేని ఆపేక్షను చూపిస్తూ కొంగజపం చేస్తుండటం టీడీపీ కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనం.» టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ మహిళా తహశీల్దార్ జట్టు పట్టుకుని మరీ ఈడ్చుకొచ్చి దాడి చేశారు. అయినా సరే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఎమ్మెల్యే చింతమనేని అరచకానికి అండగా నిలిచారు. తహశీల్దార్ వనజాక్షిని బెదిరించి మరీ పంచాయతీ చేశారు.» 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు రాష్ట్రాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అయినా సరే ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు.. వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం కోసం మాత్రం రోజుకో డ్రామాకు తెరతీస్తున్నారు.నివేదికలను ప్రస్తావించి.. మహిళలను కించపరిచిన ఈటీవీ..సాక్షి టీవీ చానల్ చర్చా గోష్టిలో ఆ టీవీ ప్రతినిధులు ఎవరూ మహిళలను కించపరిచేలా మాట్లాడనే లేదు. ఓ స్వతంత్ర విశ్లేషకుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల పత్రిక ప్రచురించిన నివేదికను ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అప్పుడే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన్ను వారించారు. సాక్షి టీవీ యాజమాన్యం వెంటనే స్పందించి ఆ స్వతంత్ర విశ్లేషకుడి వ్యాఖ్యలతో తమకే మాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ కూడా ఆయన వ్యాఖ్యలతో తమ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయినా సరే వక్రీకరిస్తూ సాక్షి టీవీ యాజమాన్యం, కొమ్మినేని శ్రీనివాసరావుపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పలువురు పరిశీలకులు గతంలో ఈటీవీ ప్రసారం చేసిన ఓ వార్తా కథనాన్ని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యభిచారం, ఎయిడ్స్ వ్యాప్తిపై ఓ నివేదిక వెల్లడించిందంటూ ఈటీవీ ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. యావత్ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలా కథనాన్ని ప్రసారం చేయడం గమనార్హం. ఎవరో స్వతంత్ర విశ్లేషకుడు చెప్పింది కాదు.. ఈటీవీ స్వయంగా రూపొందించిన వార్తా కథనంగా ప్రసారం చేసింది. అసలు రాష్ట్రంలో మహిళలను కించపరిచేలా ఏదైనా చానల్ వార్త కథనాన్ని ప్రసారం చేసిందంటే అది ఈటీవీ మాత్రమేనని పరిశీకులు స్పష్టం చేస్తున్నారు. ఈటీవీ ప్రసారం చేసిన ఆ వార్తా కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటువంటి దిగజారుడు పాత్రికేయం చంద్రబాబుకు ఇంపుగా కనిపిస్తుంది. ఎందుకంటే అది తన రాజగురువు రామోజీ కుటుంబం నిర్వహిస్తున్న చానల్. కానీ ఎవర్నీ కించపరచకుండా, గౌరవమైన రీతిలో చార్చా గోష్టి నిర్వహించే సాక్షి టీవీపై మాత్రం అక్రమ కేసు నమోదు చేయడం టీడీపీ మార్కు కుతంత్రం.బాబు గుండెల్లో రైళ్లు» పతిపక్ష వైఎస్సార్సీపీ ఈ నెల 4న నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమాలు విజయవంతం కావడంతో ప్రభుత్వ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే టీడీపీ కూటమి ప్రభుత్వ పుట్టి మునగడం ఖాయమని చంద్రబాబు గుర్తించారు. » డైవర్షన్ రాజకీయాల కోసం కాచుకుని ఉన్న చంద్రబాబు ఈ నెల 6న సాక్షి టీవీ నిర్వహించిన చర్చా గోష్టిని వక్రీకరిస్తూ కుట్రకు తెరతీశారు. సాక్షి టీవీలో చర్చా గోష్టి ముగిసిన 24 గంటల తర్వాత ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ కుతంత్రానికి తెరతీశారు. బాబు ఆదేశాలతో టీడీపీ సోషల్ మీడియా కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీకి, వైఎస్సార్సీపీకి ఆపాదిస్తూ టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని వైరల్ చేసింది. టీడీపీ అనుకూల టీవీ చానళ్లు ఈటీవీ, ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి, టీవీ 5 తదితర చానళ్ల ద్వారా వైఎస్సార్సీపీపై విష ప్రచారానికి పాల్పడ్డారు. » చంద్రబాబు కుట్రలో భాగంగా మంత్రి లోకేశ్ తెరపైకి వచ్చారు. సాక్షి టీవీ, వైఎస్సార్సీపీపై నిరాధార ఆరోపణలు చేశారు. ఆ వెంటనే టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనల పేరుతో గూండాగిరీకి పాల్పడ్డాయి. చర్చా గోష్టిలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో తమకే మాత్రం సంబంధం లేదని సాక్షి టీవీ యాజమాన్యం ఖండించింది. వాస్తవానికి అంతటితో ఆ అంశం ముగిసిపోయినట్టే. కానీ చంద్రబాబు కుట్ర మరోలా ఉంది.» జూన్ 8 (ఆదివారం) కూడా ఈ అంశంపై రాద్ధాంతం కొనసాగేలా కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్వయంగా ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో కామెంట్ పోస్టు చేశారు. ఫలితంగా అక్రమ కేసులు, సాక్షిపై దాడులు కొనసాగాయి. -
Ambati Rambabu: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది
-
వెన్నుపోటు దినం కేవలం ట్రైలర్ మాత్రమే.. రాచమల్లు శివప్రసాద రెడ్డి మాస్ కౌంటర్
-
‘లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్భుతమైన స్పందన లభించిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినా, దాన్ని అధిగమించి ప్రజలు సక్సెస్ చేశారనే విషయం కూటమి ప్రభుత్వం గ్రహించాలన్నారు. ఈరోజు(గురువారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. ఇప్పటికైనా చంద్రబాబు పాలన గురించి ఆలోచించాలని హితవు పలికారు. ‘ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించాం.వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనంనుంచి అద్బుతమైన స్పందన లభించింది.వెన్నుపోటు దినం కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులతో ప్రయత్నించారు.ఏడాదిగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై వందలాది తప్పుడు కేసులుపెట్టి వేధించారు.సోషల్ మీడియా యాక్టివిస్టులను జైళ్లకు పంపించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పండగలా నిర్వహించాలని పిలుపునిస్తే పెద్దగా స్పందన రాలేదు.ఇప్పటికైనా కూటమి నేతలు బుద్ది తెచ్చుకోవాలి. దోచుకునే బ్యాచ్‌కే పండుగ. చంద్రబాబు ఇప్పుడైనా తన పాలన గురించి ఆలోచించాలి .రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండో ఏడాది పూర్తైన సమయంలో వెన్నుపోటు-2 సమయానికి జనం తిరగబడొచ్చు.వెన్నుపోటు దినం కార్యక్రమానికి వెళ్తున్న నన్ను పట్టాభిపురం సీఐ అడ్డుకున్నారు. సీఐకి మంత్రి లోకేష్ సపోర్ట్. బెదిరించి, భయపెట్టాలని చూశారు. అనివార్య పరిస్థితుల్లో ఎదురుతిరగాల్సి వచ్చింది. నేను చేసిన రెండు ఫిర్యాదుల గురించి అడిగితే సీఐ దురుసుగా మాట్లాడారు. లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాపై కేసు నమోదు చేశారు’ అని అంబటి స్పష్టం చేశారు. -
‘కుప్పంలో బ్లడ్ బుక్ రాజ్యాంగం సడుస్తోంది’
చిత్తూరు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో బ్లడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ భరత్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపిన కూటమి ప్రభుత్వం.. కుప్పంలో మాత్రం బ్లడ్ బుక్ రాజ్యాంగంతో మరింత అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై వైఎస్సార్ సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీకి వేలాదిగా ప్రజలు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారని స్పష్టం చేశారు.‘ కుప్పంలో 32 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. పోలీసులు ఒత్తిడి చేసి మరీ వేధింపులు పర్వం కొనసాగిస్తున్నారు. కుప్పంలో మేం ప్రశాంతంగా నిరసన ర్యాలీ చేపట్టాం. మేము పోలీసులపై దాడి చేసినట్లు తప్పుడు కేసులు పెడుతున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే వరకూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం’అని ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. -
చంద్రబాబు, పవన్, లోకేష్ పై బియ్యపు మధుసూదన్ రెడ్డి పంచులే పంచులు
-
జగన్‌ని చూస్తే వాళ్లకు వెన్నులో వణుకు చంద్రబాబుపై పోతిన మహేష్ ఫైర్
-
Vennupotu Dinam: ఉదయగిరిలో YSRCP భారీ ర్యాలీ
-
Buchepalli Sivaprasad: దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్, నీకు పాలన చేతకాకపోతే దిగిపో
-
ఏపీలో ఆ పండగేదో వీళ్లకు మాత్రమే! మరి జనాలకు..?
ఏడాదికాలంగా ఏపీ ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందని వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు చేపడితే.. కూటమి నేతలు , ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రంలో ప్రజలు పండగ చేసుకోవాలని అంటున్నారు. ఎవరు సత్యం చెబుతున్నారు? ఎవరు అసత్యం చెబుతున్నారు?. ఈ ఏడాదికాలంగా జరిగిన వివిధ పరిణామాలను పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది వాస్తవం అని ఆధారసహితంగా కనిపిస్తోంది. అదే టైంలో ప్రజలకు పండగ కాదు కాని.. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, పవన్ కల్యాణ్‌లకు మాత్రం పండగే అని ఒప్పుకోవాలి. ఈ ముగ్గురితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కూటమి నేతల అక్రమ సంపాదనకు రహదారి వేసిందని కూడా అంగీకరించాలి. అందువల్ల వీరికి కూడా పండగే అని చెప్పుకోవాలి. ఏ మాటకు ఆ మాట.. ఎల్లోమీడియా పంట కూడా బ్రహ్మాండంగా పండుతోంది. వారి సంపాదనకు తిరుగులేదు కనుక వారికే పండగే!. కూటమి నేతలుకాని, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి నిర్దిష్టంగా ఫలానా కారణాల వల్ల ప్రజలు పండగ జరుపుకుంటారని చెప్పలేకపోతున్నారు. అందుకే గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ముందుగా ఏ రకంగా ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందో విశ్లేషిద్దాం.ఏపీలో తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ తో పాటు భారీ ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు ప్రకటించారు. ఆ ప్రకారం తాము అమలు చేశామని వీరు ఎక్కడైనా చెప్పగలరా?. వృద్దాప్య పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచిన మాట మాత్రం వాస్తవం. కానీ అదే సమయంలో లక్షల పెన్షన్లు కోత పెట్టింది నిజమే కదా!. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు ఇస్తామని చెప్పి ఒక్కటి మాత్రం ఇచ్చారు. అది కూడా అందరికి అందలేదన్నది నిజం. ఈ రెండూ తప్ప ఫలానా ఘన కార్యాలు సాధించామని కూటమి నేతలు కాని, ఎల్లో మీడియా కాని చెప్పలేకపోతోంది. అందుకే సోషల్ మీడియాలో కూటమి వాగ్దానాలపై వ్యంగ్య పాటలు, వ్యాఖ్యలు భారీగా కనిపిస్తున్నాయి.సూపర్ సిక్స్ లో బాగంగా యువతకు నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. ఇచ్చారా?లేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడపీకారు. జగన్ టైంలో ఏర్పర్చిన వలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని.. పైగా పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పారా?లేదా?. అధికారంలోకి వచ్చాక.. ఏవో దొంగ కారణాలు చూపుతూ ఆ వ్యవస్థకు మంగళం పాడారా?లేదా?. దాంతో రెండున్నర లక్షల మందికి గౌరవ వేతనం రాకుండా పోయింది. ఇది యువతకు వెన్నుపోటు పొడిచినట్లే కదా!. జగన్ తీసుకు వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు,వ్యవస్థలు అన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు,పవన్ లు పదే,పదే ప్రకటించారు. కాని పవర్ వచ్చిన వెంటనే ప్రజలకు ఇళ్లవద్దే అందే సేవలను దాదాపు రద్దు చేశారు. చివరికి రేషన్ బియ్యం తదితర సరుకులు అందించే వాహనాలను కూడా ఎత్తివేశారు. ఫలితంగా సుమారు ఇరవైవేల మంది వాహన నిర్వాహకులు, వారి కుటుంబాలు వీధినపడ్డాయి. రేషన్ కోసం ప్రజలు ముఖ్యంగా పేదలు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడి ఉండాల్సి వస్తోంది. ఇది వెన్నుపోటు కాదా!. అమ్మ ఒడి కింద పదిహేనువేల రూపాయల చొప్పున జగన్ ఇస్తుంటే.. చంద్రబాబు ఏమని అన్నారు. జగన్ ఒక్క విద్యార్దికే ఇస్తున్నారు..అది అన్యాయం.తాము వస్తే ప్రతి విద్యార్ధికి పదిహేనువేల చొప్పున ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికి ఇస్తామని అన్నారు. జనం అమాయకంగా నమ్మారు. కాని అధికారం వచ్చి ఏడాది అయినా దాని అతీగతి లేదు. ఈ జూన్ లో ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారు. కాని ఇప్పటికే ఒక ఏడాది ఎగవేశారు కదా?ఇది వెన్నుపోటే కదా!. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున డబ్బులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాని ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు.ఇది వెన్నుపోటే కదా!అలాగే మహిళలకు ఉచిత బస్, రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయలు ఇస్తామని చెప్పారు. అదీ జరగలేదు. దీనిని వెన్నుపోటు కాదని అనగలరా?. విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ సకాలంలో చెల్లించి వారి సర్టిఫికెట్లకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ ఎంతవరకు అమలు చేశారు?. ఉచిత ఇసుక విధానం అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేదా?. ఇసుకను కూటమి నేతలకు ఆదాయవనరుగా మార్చడం ప్రజలకు వెన్నుపోటా ?కాదా?. పండగ కానుకలు వస్తాయని, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ అని, పెళ్ళి కానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని, ఇలా ఒకటేమిటి! చేతికి ఎముక లేని చందంగా చంద్రబాబు పధకాలు అమలు చేస్తారేమోలే అని భావించిన ప్రజలకు అవేవి చేయకపోవడం వెన్నుపోటు అవ్వదా?. అసలే చంద్రబాబు నాయుడికి వెన్నుపోటులో సిద్దహస్తుడు అనే పేరు ఉంది. తన మామ ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పటి నుంచి ఆయన ప్రత్యర్ధులు ఈ విషయాన్ని తరచూ చెబుతుంటారు. 2014-2024లలో ఆయనకు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. ఇద్దరు కలిసి హామీల విషయంలో చేసిన వెన్నుపోటు ఒక రకం అయితే.. ప్రభుత్వాన్ని నడపడంలో, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. నేతలపై కేసులు పెడుతూ రెడ్ బుక్ అంటూ లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకం మరో ఎత్తుగా ఉంది. జగన్ రూ. 14 లక్షల కోట్ల అప్పు చేశారని అంటూ పచ్చి అబద్దాలు చెబుతూ.. అయినా తాము అన్ని హామీలు అమలు చేస్తామని, సంపద సృష్టించడం తెలుసునని ప్రచారం చేసుకున్నారు చంద్రబాబు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండని ప్రజలనే అడగడం వెన్నుపోటే అవుతుంది కదా!. ఏకంగా ఏడాదిలో లక్షన్నర కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడం ప్రజలను మోసం చేసినట్లు కాదా?. తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందంటూ పచ్చి అబద్దాన్ని చెప్పడం ద్వారా దేవదేవుడిని కూడా వెన్నుపోటు పొడవడానికి వెరవలేదే!. ఇలా ఒకటేమిటి?.. అమరావతి పేరుతో లక్ష ఎకరాలు సమీకరించి, లక్షల కోట్లు ఆ గ్రామాలలోనే ఖర్చు పెట్టడానికి తయారవుతున్న తీరు చూస్తే ఇతర ప్రాంతాల ప్రజలను వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని అర్దం అవుతుంది కదా!. దీనికన్నా ప్రభుత్వానికి అవసరమైన పదివేల ఎకరాలో, అంతకు కాస్త ఎక్కువో భూమిని మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేసి ఉంటే లక్షల కోట్లు ఆదా అయ్యేవి కదా అనేదానికి సమాధానం దొరకదు. ఉర్సా వంటి ఊరుపేరులేని కంపెనీలకు విశాఖలో విలువైన భూములు కట్టబెట్టడం ఆ ప్రాంతానికి వెన్నుపోటు అవుతుందా? కాదా?. ఆర్థికంగా బలంగా ఉన్న టీసీఎస్ కంపెనీ తనకు లీజుకు భూమి ఇవ్వాలని అడిగితే 99 పైసలకే భూమి అమ్మేస్తామని ఉదారంగా చెప్పడం ప్రజలకు వెన్నుపోటు కాదా!. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పోలీసులు కొందరు ఇష్టారాజ్యంగా పెడుతున్న కేసులు బహిరంగంగా చట్టంతో సంబంధం లేకుండా నిందితులను దారుణంగా హింసిస్తున్న వైనం ఇవన్ని వెన్నుపోటుకు బోనస్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే జగన్ రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన ప్రభుత్వం తమకు చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏ రకంగా కూటమి నేతలకు పండగ అని చూస్తే.. ప్రభుత్వం వచ్చీ రాగానే లక్షల టన్నుల ఇసుకను ఊదేసి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించగలిగారు. అది ఏ స్థాయిలో ఉందంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక టీడీపీ కార్యకర్తే జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరుల దందాను అరికట్టాలని కోరుతున్నానని, అలా చేయడానికి లంచం ఇవ్వడానికి కూడా సిద్దమని చెప్పి ,లక్షన్నర రూపాయల ఇవ్వడానికి సిద్దపడ్డారు!. దీనిని ఏమని అనుకోవాలి?. ఈ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోంది. మద్యం మాఫియా ఎలా విజృభిస్తోందో, లిక్కర్ షాపులలో కూటమి ఎమ్మెల్యేలకు వాటాలు, ఊరూరా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కూటమి కార్యకర్తలకు పండగే కావొచ్చు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లు తమ పదవులను ప్రజాసేవకు కాకుండా తమ ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ల దర్జాలకు వాడుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. అది వారికి పండగే కదా?. పిఠాపురంలో దళితుల బహిష్కరణ జరిగితే కనీసం పలకరించకుండా సనాతని వేషం కట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పవన్‌కు పండగే కదా?. పైళ్లను భారీగా పెండింగ్ లో పెట్టి, షూటింగ్ లలో కాలం గడుపుతున్న ఆయనను ప్రశ్నించేదెవ్వరు. అందుకే ఆయనకు ఇది పండగే. అమరావతి నిర్మాణాల వ్యయం రెట్టింపు చేసి కాంట్రాక్టర్లకు పందెం చేస్తున్నందున వారికి పండగే. టీడీపీ కార్యకర్తల పెండింగ్ అక్రమ బిల్లుల పేరుతో వందల కోట్లను ఇస్తూ పండగ చేసుకోండని చెబుతున్నారు. చంద్రబాబు, పవన్‌ల కన్నా తానే పవర్ ఫుల్ అని రెడ్ బుక్ పాలన చేస్తున్న లోకేష్ కి వీరిద్దరి కన్నా పెద్ద పండగగానే ఈ ఏడాది సాగిందని ఒప్పుకోవాలి. ఏతా వాతా చూస్తే ప్రజలకు వెన్నుపోటు, కూటమి నేతల అక్రమార్జనకు పండగే అని చెప్పొచ్చు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పబ్లిసిటీ కాదు పనులు చేయాలి.. వెన్నుపోటు దినం నిరసనల్లో భారీగా పాల్గొన్న విద్యార్థులు
-
వంచనపై గర్జన
ఎన్నికల హామీలను గాలికొదిలి చంద్రబాబు సర్కారు చేస్తున్న మోసాలు, అరాచకాలపై జనాగ్రహం పెల్లుబికింది. వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన ‘వెన్నుపోటు దినం’కు అనూహ్య స్పందన వచ్చింది. మండుటెండను లెక్కచేయకుండా భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు కూటమి దగాపై కదం తొక్కారు. ర్యాలీలు, నిరసనలతో హోరెత్తించారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతులు అందజేశారు.సాక్షి, భీమవరం: వెన్నుపోటు దినం వేదికగా కూటమి ఏడాది పాలనపై ప్రజల్లోని వ్యతిరేకత బుధవారం సుస్పష్టంగా కనిపించింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునందుకుని సూర్యప్రతాపం, ఉక్కపోతను ఖాతరు చేయకుండా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, పేదవర్గాలు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలకు చేరుకుని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొట్టు సత్యనారాయణ, వెన్నుపొటు దినం ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ నవుడు వెంకటరమణ, పాలకొల్లు ఇన్చార్జి గుడాల గోపి, మహిళ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల తదితరులు మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనపై జనాగ్రహానికి వెన్నుపోటు దినం ఘన విజయం సాధించడమే నిదర్శనమన్నారు. ఎన్నికల ముందు హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక వాటికి గాలికొదిలేసి మోసం చేయడం చంద్రబాబు నైజమని విమర్శించారు. ఇప్పుడు దానినే రిపీట్ చేశారన్నారు. చెప్పినవి చేయకపోగా ప్రజా సంక్షేమం కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేసిన పథకాలను నిలిపేసి రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు తదితర అన్ని వర్గాల వారిని ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు, నిత్యావసరాల ధరలను పెంచేశారని, ఇంటింటికి రేషన్ రద్దు చేశారని, విపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వంచనపై సమాధానం చెప్పాలి: ముదునూరి నరసాపురం: వైఎస్సార్సీపీ హయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పులు చేసి సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని అబద్ధపు ప్రచారాలు చేసిన కూటమి సర్కార్ ఇప్పుడు నెలనెలా అప్పులు చేస్తూ అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండింటిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారో సమాధానం చెప్పా లని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు డిమాండ్ చేశారు. నరసాపురంలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి పార్టీ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం ముదునూరి మాట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్ట్ ఊసే లేకుండా చేశారు. జగనన్న కాలనీలో నిరుపేదకుల ఇళ్లస్థలాలు ఇస్తే, నేడు ఆ కాలనీల అభివృద్ధిని ఎండమావి చేశారు. నీకు 15వేలు, నీకు 15వేలు అంటూ ఊదరగొట్టి మహిళలను మోసం చేసిన కూటమి నేతలు నేడు మాట్లాడడం లేదు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని మోసం చేశారు. అమ్మఒడి పథకం ఎగ్గట్టారు. విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి, ఏడాదిలోనే వేల కోట్ల భారం మోపారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన ఎగ్గొట్టారు. అక్రమ కేసులు పెడుతూ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.’ అని దుయ్యబట్టారు.చంద్రబాబుది వెన్నుపోటు రాజకీయం: కారుమూరి తణుకు అర్బన్: సంక్షేమం, అభివృద్ధి పథంలో ఏపీని నడిపిస్తానంటూ హామీలు గుప్పించిన చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో బుధవారం నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసనలో ఆయన మాట్లాడారు. జగన్ హయాంలో ముసలమ్మ బటన్ నొక్కుతుందని చంద్రబాబు హేళన చేశారని, కూటమి ప్రభుత్వం రాగానే ముసలోడు గట్టిగా నొక్కేస్తాడేమో అని ప్రజలు ఆశపడ్డారని కానీ అసెంబ్లీకి వెళ్లి ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుందని అనడం ఆయన చేతకానితనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబుకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య అని, రైతు భరోసా లేదు, ఫీజురీయింబర్స్‌మెంట్ లేదు, ధాన్యం డబ్బు వేయలేదు, బీమా లేదు, తల్లికి వందనం వేస్తానని, ఉచిత బస్సు ఇస్తానని చెప్పి ఏడాది గడిచినా ఇవ్వలేదు అని నిలదీశారు. ఎండీయూ ఆపరేటర్లకు వెన్నుపోటు పొడవలేదా అని ప్రశ్నించారు. తణుకు ఎమ్మెల్యే పశువధ శాలలో మూగజీవాలను బలి ఇస్తుంటే, స్థానికంగా ఉండలేకపోతున్నామని మహిళలు మొరపెట్టుకున్నా డబ్బుకోసం ఫ్యాక్టరీ యాజమాన్యానికి సహకరించడం వెన్నుపోటు కాదా అన్నారు. ఏ పనిచేయాలన్నా కమిషన్, తణుకులో ఆర్కే ట్యాక్స్ విచ్చలవిడిగా అమలవుతుందని చెప్పారు. తణుకులో ఏ పని జరగడం లేదని ప్రజానీకం అల్లాడుతున్నారని, టీడీపీ కార్యకర్తలు సైతం తిడుతున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గాల్లో నిరసన జ్వాలలు పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు ఆధ్వర్యంలో నరసాపురంలో వెన్నుపోటు దినం విజయవంతంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు రెండు కిలోమీటర్లు మేర భారీ నిరసన ప్రదర్శన సాగింది. వాగ్దానాల అమలుకు అధికారులకు వినతిపత్రం అందజేశారు. పార్టీ సీజీసీ సభ్యుడు పీడీ రాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో తణుకు రాష్ట్రపతి రోడ్డులోని చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి నరేంద్ర సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు. ధర్నా అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఎండీయూ వాహన ఆపరేటర్లు ర్యాలీకి మద్దతు పలికారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయం నుంచి హెడ్‌పోస్టాఫీస్ రోడ్డు, కేఎన్ రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ఫ్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి వైఫల్యాలపై ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో ఆచంట నియోజకవర్గం తూర్పుపాలెంలోని పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి ఆచంట వరకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. భీమవరంలో పట్టణంలోని ప్రకాశంచౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నవుడు వెంకటరమణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, ఎంపీపీ పేరిచర్ల విజయనర్సింహరాజు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాదయాత్ర చేసి వినతిపత్రం అందజేశారు. పాలకొల్లు ఇన్చార్జి గుడాల గోపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ మూడు కిలోమీటర్ల మేర భారీగా పాదయాత్ర చేశారు. సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు, చెల్లెం ఆనంద ప్రకాష్ యడ్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ∙ఉండిలోని వెన్నుపోటు దినం నిరసనలో పార్టీ నరసాపురం పార్లమెంట్ అబ్జర్వర్ మురళీకృష్ణంరాజు, మహిళ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉమాబాల, ఆకివీడు నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యా లయానికి చేరుకుని వినతిపత్రం అందజేశారు. -
వెన్నుపోటుపై జనాగ్రహం!
సాక్షి నెట్వర్క్: ‘కూటమి ప్రభుత్వం ఏడాది పాలనంతా నయవంచన, ద్వేషం, కక్షపూరితం. నమ్మి ఓటేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. సూపర్ సిక్స్ పథకాలని ఊదరగొట్టి.. ఉత్తచేయి చూపారు. అందుకే ఏడాదిలోనే కూటమి ప్రభుత్వాన్ని జనం ఛీ కొడుతున్నార’ని వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. కూటమి ఏడాది పాలన.. ప్రజలకు చేసిన మోసంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ నిర్వహించారు. ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో వేలాది మందితో ర్యాలీలు చేపట్టారు. దగా ప్రభుత్వ తీరును ఎండగడుతూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీకి వేలాది మంది హాజరయ్యారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై నిరసన గళం వినిపించారు. స్థానిక సీఎంఆర్ కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ సాగింది. అనంతరం ఇన్చార్జి తహసీల్దార్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ఎంపీపీ మామిడి.అప్పలనాయుడు, జెడ్పీటీసీ కెల్ల శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు పాల్గొన్నారు. చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతమైంది. చీపురుపల్లి పట్టణంలోని ఆంజనేయపురం పెట్రోల్ బంక్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా మూడురోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు హాజరైన ర్యాలీలో దాదాపు 5 వేల మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వ మోసపూరిత పాలన, ఇచ్చిన హామీలు అమలుచేయక పోవడం తగదంటూ తహసీల్దార్ ఎన్.రాజారావుకు వినతిపత్రం అందజేశారు. గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వెన్నుపోటు దినం ర్యాలీ సాగింది. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో సాగిన ర్యాలీలో పార్టీ శ్రేణులు, ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తక్షణమే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ పథకం, మహిళలకు ఉచిత బస్సు వంటి హామీలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఐదు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, నాయకులు పాల్గొన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటిరేగ పోస్టాఫీస్ నుంచి ప్రారంభమైన వెన్నుపోటు దినం ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది.అబద్ధపు హామీ లతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. కూటమి మోసపూరిత పాలనపై తహసీల్దార్ తాడ్డి గోవింద్‌కు వినతిపత్రం అందజేశారు. రాజాం నియోజకవర్గ కేంద్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. రాజాం పట్టణ కేంద్రంలో నిర్వహించిన వెన్నుపోటుదినం కార్యక్రమానికి వేలాదిగా వైఎ స్సార్సీపీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. పాలకొండ రోడ్డులోని సన్‌రైజ్ ఆస్పత్రి నుంచి శ్రీకాకుళం రోడ్డులోని తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఎస్.కె.రాజుకు వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి తలే రాజేష్, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ వినతిపత్రం అందజేశారు. హామీలను నమ్మి ఓటేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు రాష్ట్రాన్ని ఏలే హక్కు లేదని, సీఎం డౌన్‌డౌన్ అంటూ ఎస్.కోట నియోజకవర్గ ప్రజలు నినదించారు. ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నేతృత్వంలో ఆకుల డిపో నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. కార్యక్రమంలో పార్టీ నేతలు శోభాహైమావతి, వేచలపు చినరామునాయుడు, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. టీడీపీ కూటమి పాలనలో కష్టాలు, నష్టాలు, అదనపు విద్యుత్ చార్జీలు, ఇంటి పన్నుల భారం తప్ప చేసినది శూన్యమని ప్రజలు విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో సాగిన వెన్నుపోటు దినం ర్యాలీలో పాల్గొని కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ శ్రీనుకు వినతిపత్రం అందజేశారు. టీడీపీ అక్రమాలకు కొమ్ముకాస్తున్న బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ కూడా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించడం లేదు. టీడీపీ చేపడుతున్న రెడ్‌బుక్ పాలన వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నా, బీజేపీ నాయకులు చూసీచూడనట్లు వ్యవహరించడం సిగ్గుచేటు. సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకపోడంతో ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారు. – బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ నమ్మించి ‘వెన్నుపోటు’ ఉత్తుత్తి హామీలతో నమ్మించారు. ఓట్లు దండుకున్నారు. తీరా హామీలు అమ లు చేయమని అడి గిన జనంపై రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఇది అన్యాయం. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్‌సిక్స్ పథకాలను వెంటనే అమలుచేయాలి. ప్రజలను సంక్షేమ పథకాలతో ఆదుకోవాలి. – కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే, ఎస్.కోటకూటమి పాలనలో ప్రజలకు కష్టాలే.. అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ వ్యవస్థను రద్దుచేసి వేలాది మందిని నిరుద్యోగులుగా మార్చింది. ఇప్పుడు ఎండీయూ వ్యవస్థను రద్దు చేసింది. చిరుద్యోగులపై వేధింపులకు పాల్పడుతోంది. ప్రజాసంక్షేమ పథకాలకు కోత పెట్టింది. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు కష్టాలు, నష్టాలే ఎదురవుతున్నాయి. ఏడాది పాలనపై ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతోంది. – శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యేమేనిఫెస్టో అంటే లెక్క లేదు.. ఎన్నికల మేనిఫెస్టో అంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లెక్క లేదు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. కాని ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. – బొత్స సత్యనారాయణ,శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి -
Vennupotu Dinam: పెల్లుబికిన ప్రజాగ్రహం
సరిగ్గా ఏడాది క్రితం అబద్ధపు హామీలతో అధికారాన్ని దొరకబుచ్చుకున్నారు. ప్రజల నుంచి ఓట్లు దండుకుని.. వారికే పంగనామాలు పెట్టారు. ఇచ్చిన హామీలు కాకుండా.. ఏడాది కాలంగా కొత్త కథలు చెబుతూ నమ్మి అధికారం కట్టబెట్టిన ప్రజలకే వెన్నుపోటు పొడిచారంటూ జనం రోడ్లపైకి వచ్చారు. వెన్నుపోటు సర్కారుపై నిరసన ప్రకటిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజావాహిని నిరసనల జోరుతో ఊరూవాడా దద్దరిల్లింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు బుధవారం వెన్నుపోటు దినం నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రోజిది. ఓట్లేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచిన రోజిది. అప్పుడు మామ ఎనీ్టఆర్‌కు వెన్నుపోటు పోడిచారనుకుంటే.. ఏడాది కాలంగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు’ అంటూ వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి జిల్లా ప్రజలు గొంతెత్తారు. మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత పాలనపై కదం తొక్కారు. కిలోమీటర్ల మేర పాదయాత్రగా ర్యాలీ చేశారు. నిరసన ర్యాలీలతో జిల్లా హోరెత్తిపోయింది. కూటమి ప్రభుత్వం అనేక ఆంక్షలు, అడ్డంకులు సృష్టించినా ఎక్కడా తగ్గలేదు. అన్నింటిని అధిగమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. నిరసనపై ఉక్కుపాదం మోపేందుకు గత వారం రోజులుగా అనుమతుల విషయంలో కుట్ర పన్నినా పారలేదు. వైఎస్సార్సీపీ కేడర్‌తో పాటు సామాన్య జనం నిరసన ర్యాలీల్లో వేలాదిగా పాల్గొన్నారు. దీంతో పారీ్టలో నూతనోత్తేజం కనిపించింది. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది.మహిళా ద్రోహి చంద్రబాబు ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పడం.. అధికారం చేపట్టాక మోసం చేయడం చంద్రబాబుకు అలవాటైపోయింది. చంద్రబాబు బూటకపు హామీలను నమ్మి మహిళలంతా ఓటేసి మోసపోయాం. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి అమాయక ఆంధ్రా ప్రజలకు వెన్నుపోటు పొడవడం పెద్ద వింతకాదు. సూపర్‌సిక్స్ హామీలు అమలుచేయకుండా వెన్నుపోటు పొడిచారు. – బెండి పూర్ణ, పాత్రునివలస జగనన్న కాలనీ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ.. నమ్మిన ప్రజలను నట్టేట ముంచారని జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చి నినదించారు. వేలాది మంది ఏడు రోడ్ల కూడలి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. దీంతో ప్రధాన రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ర్యాలీ అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నిరసన ప్రదర్శనలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎం.వి.పద్మావతి, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, రాష్ట్ర తూర్పు కాపు విభాగం అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, రాష్ట్ర కళింగ వైశ్య విభాగం అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, చిట్టి జనార్ధన్ రావు, అంబటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురంలో.. ఇచ్ఛాపురంలోని దాసన్నపేట జంక్షన్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ నిరసన ప్రదర్శన చేశారు. వేలాది మంది తరలిరావడంతో ఇచ్ఛాపురం కిటకిటలాడింది. హామీల అమలు చేసేదెప్పుడు? రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రతి విద్యార్థికి నీకు రూ.15వేలు.. నీకు రూ.15వేలు అని చెప్పారే తప్ప ఏడాదవుతున్నా ఇవ్వలేదు. మిగిలిన అన్ని వర్గాలను మోసం చేశారు. – పిరియా విజయ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పాతపట్నంలో.. పాతపట్నంలోని పాతబస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. కోర్టు కూడలి, వైఎస్సార్ విగ్రహం జంక్షన్ వద్ద నిరసన ప్రదర్శన చేసి, ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు.. చంద్రబాబు మోసాలను ఎండగట్టారు. మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త రెడ్డి శాంతి నేతృత్వంలో జరిగిన నిరసన ప్రదర్శనలో ప్లకార్డులు పట్టుకుని కూటమి ప్రభుత్వం తీరుపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. -
నిరసన హోరెత్తి.. వెన్నుపోటుపై గళమెత్తి!
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజా వ్యతిరేకత మిన్నంటింది. సూపర్ సిక్స్ పేరిట అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు తీరుపై నిరసన హోరెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ ప్రభుత్వంపై ప్రజాగ్రహానికి అద్దం పట్టింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్పంచుకోగా.. ప్రజలు, ముఖ్యంగా మహిళలు రోడ్డెక్కి మద్దతు పలికారు. ఎక్కడికక్కడ మోటార్ సైకిళ్లతో ర్యాలీలు నిర్వహిస్తూ.. సీఎం డౌన్‌డౌన్ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆయా నియోజకవర్గాల్లో వలంటీర్లు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కర్నూలులో ఎండీయూ వాహన ఆపరేటర్లు తమ వాహనాలతో నిరసన ర్యాలీలో మద్దతు తెలిపారు. ఏడాదంతా రెడ్ బుక్ పాలనే.. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన తప్ప కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా వెన్నుపోటు నిరసన దినం చేపట్టారు. కర్నూలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ధర్నా చౌక్ నుంచి బుధవారపేట, కర్నూలు ప్రభుత్వాసుపత్రి, ఎనీ్టఆర్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్‌కు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా గంగుల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన అట్టర్‌ఫ్లాప్ అయ్యిందన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కూటమి నేతలు ఆచారణ సాధ్యం కాని హామీలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం గ్రామాల్లో మరింత వ్యతిరేకత ఉందని, కూటమి నేతలు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. ఎక్కడికక్కడ తిరగబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ర్యాలీ అనంతరం వైఎస్సార్సీపీ నేతలు కలెక్టరేట్లో డీఆర్ఓ వెంకట నారాయణమ్మకు వినతిపత్రం అందజేశారు.జిల్లా వ్యాప్తంగా నిరసనలు మంత్రాలయం: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం చేరుకొని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి పురుషోత్తం రెడ్డి, ప్రదీప్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలూరు: ఎమ్మెల్యే బి.విరూపాక్షి వెన్నుపోటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పాణ్యం: కల్లూరులో నంద్యాల పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్యతో కలిసి వెన్నుపోటు నిరసన ర్యాలీ పెద్ద ఎత్తున చేపట్టారు. కల్లూరులోని తన స్వగృహం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్దారు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదోని: పట్టణంలో వెన్నుపోటు నిరసన కార్యక్రమం ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్‌ను వినతిపత్రం అందజేశారు. పత్తికొండ: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కోడుమూరు: నియోజకవర్గంలోని గూడురులో పార్టీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీ‹Ùఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ కుడా చైర్మన్ కోట్ల హర్షవర్దన్ పాల్గొన్నారు. పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎమ్మిగనూరు: పట్టణంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుకా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రకోట జగన్నోహాన్ రెడ్డి పాల్గొన్నారు.పోరాటాన్ని కొనసాగిస్తాం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేందుకు సూపర్ సిక్స్ పథకాల పేరిట ప్రజలను మోసం చేశాడు. రూ.1.60 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో ఏ ఒక్కరికీ రూ.1000లు కూడా సంక్షేమ పథకాల కింద ఇవ్వలేకపోయాడు. మరి అంత డబ్బు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏడాది గడిచినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు నిరసన దినం చేపట్టింది. నిరసనలను ఇంతటితో ఆపం.. ప్రజలతో కలిసి ఇక మీదట కూడా చంద్రబాబు మెడలు వంచేందుకు పోరాటాన్ని కొనసాగిస్తాం. – ఎస్వీ మోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడుచంద్రబాబు నైజం ప్రజలకు తెలిసిపోయింది ఏడాది గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. తాము మోసపోయామనే విషయం ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. కూటమి నాయకులు ప్రజల వద్దకు వెళితే తిరగబడటం ఒక్కటే మిగిలింది. పోలీసులను అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. – మధుసూదన్, ఎమ్మెల్సీ సంక్షేమ పథకాల కోసం ఎదురుచూసినట్లుంది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చెప్పింది చెప్పినట్లు చూసి చూపించారు. ఈ ప్రభుత్వం అంతకంటే గొప్పగా చేస్తామని చెప్పడంతో ఓట్లేశాం. ఇప్పుడు చూస్తే ఒక్కటంటే ఒక్క పథకం కూడా ప్రజలకు అందింది లేదు. సంవత్సరమైనా ఎదురుచూడటంతోనే సరిపోతుంది. సూపర్‌సిక్స్ పథకాలని చెప్పి ప్రజలందరినీ మోసం చేసినారు. ఈ నాయకులకు మళ్లీ మా దగ్గరికి రావాలంటే మొహం ఎలా వస్తుంది. బుద్ధి ఉంటే ఇంకోసారి నమ్ముతామా?. – దస్తగిరి, హాలహర్వి గ్రామం, నందవరం మండలం -
ఈవీఎంల ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతాం
కూటమి ఏడాది వెన్నుపోటు పాలనపై సింహపురి.. జనభేరి మోగించింది. అసమర్థ ప్రభుత్వాన్ని దించే వరకు విశ్రమించబోమని రణన్నినాదం చేసింది. ఊరూవాడాల్లో పెల్లుబుకిన ప్రజాగ్రహం.. ఉద్యమ కెరటమై గర్జించింది. జిల్లా వ్యాప్తంగా బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో ప్రజలు మండుటెండను సైతం లెక్క చేయకుండా పాల్గొని అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టించారు. కొన్ని చోట్ల పోలీసులు ర్యాలీలకు ఆటంకాలు సృష్టించారు. సర్వేపల్లిలో అయితే ఏకంగా తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎంపీలనే అడ్డుకున్నారు. ప్రచార రథం డ్రైవర్‌ను బెదిరించి ముందుకు కదలనీయకుండా ఆపేశారు. కోవూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో వినూత్నంగా నల్లబెలూన్లతో భారీ సంఖ్యలో ఎండీయూ వాహనాలు, కూటమి హామీల మోసాలపై ఫ్లకార్డుల బాక్స్‌లతో నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. కోవూరు: ఈవీఎంలతో గద్దె ఎక్కిన చంద్రబాబు ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దించి తీరుతామని, ఏడాదిలోనే ప్రజల నుంచి వచ్చిన ఆగ్రహం ట్రైలర్ మాత్రమే అని రాష్ట్ర పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఏడాది పాలన అంతా కుట్రలు, కుతంత్రాలతోనే పూర్తయిందని విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలు వెన్నుపోటు పొడిచిన కూట మి ఏడాది పాలనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కోవూరులో ‘వెన్నుపోటు దినం’ దిక్కులు పిక్కటిల్లేలా నిర్వహించారు. అనంతరం మీడియాతో ప్రసన్న మాట్లాడారు. ఏడాది కాలంలో ఒక్క పథకం కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. సిగ్గులేని ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజు వస్తుందన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. దళితులు, మహిళలు, ఆడబిడ్డలకు రక్షణ కరువైందన్నారు. ప్రతి హామీని నెరవేర్చేలా కూటమి ప్రభుత్వంపై వత్తిడి తెస్తామన్నారు. పవన్ కళ్యాణ్.. చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయ్ డీసీఎంగా పవన్‌కళ్యాణ్ ప్రజలకు చేసిందేమీ లేదని, గత ఎన్నికల ప్రచార సమయంలో 30 వేల మంది మహిళలను వలంటీర్లు కిడ్నాప్ చేశారని తప్పుడు ప్రచారం చేశారని, ఏడాదైనా వారిని తిరిగి రప్పించలేకపోయాడని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కాపు ఉద్యమ కారులపై అక్రమ కేసులు బనాయిస్తే ఆ సమస్యలపైన పోరాడాల్సింది పోయి కూటమి ప్రభుత్వానికి వంత పాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు వీరి చలపతిరావు, రాధాకృష్ణారెడ్డి, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్‌కుమార్, అనూప్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, శ్రీనివాసులురెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, శేషగిరిరావు, సతీష్‌రెడ్డి, షాహుల్, వైస్ ఎంపీపీ నరసింహులురెడ్డి, దినే‹Ùరెడ్డి, అహమ్మద్ తదితరులు ఉన్నారు. మోసం చేయడంలో దిట్ట ∙మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆత్మకూరు: ప్రజలను మోసం చేయడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సూపర్‌సిక్స్ పథకాలకు మంగళం పాడుతూ ఏడాదిలోనే రూ.1.50 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత చంద్రబాబు దక్కించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బాబు మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఏడాదిలోనే ఆయన నిజస్వరూపం తెలుసుకున్నారని, దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. వీటి గురించి ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్‌లు చేస్తున్నారని, ప్రజలు చంద్రబాబుకు త్వరలోనే సరైన బుద్ధి చెబుతారని అన్నారు.నమ్మించి నట్టేట ముంచాడు∙కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి కావలి (జలదంకి): ఏడాది కూటమి పాలన అడుగడుగునా కుట్రలు, కుతంత్రాలు, దగా, దౌర్జన్యాలతో సాగిందని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం కావలి పట్టణంలో వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగింది. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల నిరసన నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. ఆయన నివాసం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందించారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను నమ్మించి నట్టేట ముంచిందన్నారు. బాబును నమ్మిన ప్రజలకు కన్నీటి కష్టాలే మిగిలాయన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ అరెస్ట్‌లు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తునే ఉంటుందని తెలిపారు.వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ బాబు∙బుర్రా మధుసూదన్‌యాదవ్ కందుకూరు: వెన్నుపోటుకు సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని వైఎస్సార్సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని బుధవారం కందుకూరులో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో వివరించారు. ఎన్నికల్లో ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. నియోజకవర్గంలో ఏ పల్లెకు, గ్రామానికి, వార్డుకు వెళ్లినా చంద్రబాబునాయుడు నమ్మించి మోసం చేశారంటూ ప్రజలు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగతున్న అరాచకపాలనపై ప్రశి్నస్తున్నందుకే వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్తులపై అక్రమ కేసులు ప్రభుత్వం పెడుతుందని బుర్రా అన్నారు. ఇటువంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదని, ఎంతో మంది నియంతలు సైతం కనుమరుగైన విషయాన్ని ప్రభుత్వం గుర్తించుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్‌సిక్స్ హామీలను అమలు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ సబ్‌కలెక్టర్ తిరుమాణి శ్రీపూజకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్‌తో పాటు, ఇతర నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రజలకే పంగనామాలు∙ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి నెల్లూరు (అర్బన్): ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి.. ఆ ప్రజలకే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కిందని నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం ‘వెన్నుపోటు దినం’ నిర్వహించారు. వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లో ఏఓ విజయకుమార్‌కు వినతి పత్రం ఇచ్చారు. చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దొంగ హామీలు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. సంక్షేమ పథకాలను అటకెక్కించారన్నా రు. అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి నేతలు ఖలీల్ అహ్మద్, అంజాహుస్సేని, మొయిళ్లగౌరి, సురేష్, సమీర్‌ఖాన్, అబ్దుల్ మస్తాన్, సిద్దిఖ్, నేతాజీ సుబ్బారెడ్డి, మజ్జిగ జయకృష్ణారెడ్డి, ఊటుకూరు నాగార్జున, అశ్రిత్‌రెడ్డి, చీదెళ్ల కిషన్, కొణిదెల సు«దీర్, కోటేశ్వరెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు పాల్గొన్నారు. వంచన ఆయన నైజం ∙మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఉదయగిరి: బిడ్డనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజలను మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం పెద్ద లెక్క కాదని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఉదయగిరిలో బుధవారం పార్టీ జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలతో జనాన్ని బోల్తా కొట్టించి అధికారంలోకి వచ్చారు. ఏడాది అయినా ఒక్క హామీ అమలు చేయలేదు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను హించిస్తూ తప్పడు కేసులు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పిందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. -
కూటమి ప్రభుత్వ పాలనపై వెల్లువెత్తిన నిరసన
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వ వెన్నుపోటుపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది.. ప్రభుత్వ మోసాలను ఎండగట్టింది.. భారీ స్థాయిలో రోడ్డుపైకి వచ్చింది.. ప్లకార్డులు, నిరసన ప్రదర్శనలతో కదం తొక్కింది. ఏడాది పాలనలో ఏం సాధించారు..? ఏం ఇచ్చారు..? అంటూ ప్రశ్నించింది.. ఏ వర్గం వారిలో సంతోషం లేదని ఆవేదన చెందింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు చేసిన నయ వంచనను ఎత్తి చూపుతూ భారీ ర్యాలీలు చేపట్టింది.. కూటమి అరాచకాలను ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రజలకు చేసిన దగాపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ గ్రాండ్ సక్సెస్ అయింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్, నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల్లో బుధవారం నిరసన ప్రదర్శనలు, భారీ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రాలు సమరి్పంచారు. రాజమహేంద్రవరం సిటీ: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిందేమీ లేదని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు చేసిన మోసం, సాగిస్తున్న అరాచకాలకు నిరసనగా జాంపేట ఆజాద్ చౌక్, జెండాపంజా రోడ్, సూర్య హోటల్, సబ్ కలెక్టరేట్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘బాబు ష్యూరిటీ మోసం, ఉచిత పంటల బీమాకు పంగనామాలు, నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తావ్ బాబూ’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ప్ల కార్డులు, నల్లబెలూనుŠల్ చేతబట్టి, నల్ల కండువాలు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. పోలీసుల ఆంక్షలు నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. బెలూన్లు, నల్ల కండువాలను లాక్కున్నారు. డీజేను సీజ్ చేశారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంతో పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు లాక్కెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తొక్కిసలాట చోటు చేసుకుంది. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే, పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఎక్కడి న్యాయమని మాజీ ఎంపీ భరత్ నిలదీశారు. పార్టీ శ్రేణులను లాక్కెళ్లడాన్ని అడ్డుకున్నారు. ర్యాలీ అనంతరం వైఎస్సార్ సీపీ జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డితో కలిసి ఆర్డీఓ కృష్ణానాయక్‌కు వినతి పత్రం సమరి్పంచారు. అనపర్తినియోజకవర్గ కేంద్రమైన అనపర్తిలో వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ రైల్వే స్టేషన్ రోడ్ మెయిన్ రోడ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. పార్టీ జెండాలు, ప్లకార్డులతో ర్యాలీ సాగింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం సమరి్పంచారు. -
వెన్నుపోటు దినం సూపర్ హిట్టు.. టెన్షన్ లో బాబు, పవన్
-
వెన్నుపోటుపై ప్రజాగ్రహం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలి.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి.. అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ ‘వెన్నుపోటు దినం’పేరిట నిరసన తెలపాలని వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపునకు అన్ని వర్గాల నుంచి స్పందన లభించింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో తూర్పు, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. జెడ్పీ జంక్షన్ వద్ద ప్రారంభమైన వెన్నుపోటు నిరసన ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. ‘వెన్నుపోటు చంద్రబాబు.. మోసగాడు చంద్రబాబు’అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణే‹Ùకుమార్, విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, కోలా గురువులు, రవిరెడ్డి తదితరులు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేయడం తప్ప మరేమీ చేయలేదని, వారి వైఫల్యాలకు నిరసనగా చేపట్టిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం కూటమి ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందని నేతలు హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కె.సతీష్ పార్టీ కార్యాలయం పర్య వేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షుడు విజయచంద్ర, కార్పొరేటర్లు బానాల శ్రీనివాసరావు, అల్లు శంకరరావు, రెయ్యి వెంకటరమణ, కోరుకొండ వెంకట స్వాతి, కె.అనిల్ కుమార్రాజు, మొల్లి లక్ష్మి, మువ్వలలక్ష్మి, సాడి పద్మారెడ్డి, చెన్నా జానకీ రామ్, కోడిగుడ్ల పూర్ణిమ, వావిలపల్లి ప్రసాద్, శశికళ, ఉత్తరాంధ్ర యువజన విభాగం రీజనల్ ప్రెసిడెంట్ అంబటి శైలేష్, పార్టీ ముఖ్య నాయుకులు కోలా గురువులు, రొంగలి జగన్నాథం, ఎండీ ఫరూఖీ, వుడా రవి, గొలగాని శ్రీనివాస్, రవి రాజు, సతీష్ వర్మ, తాడి జగన్నాథ్‌రెడ్డి, శ్రీని వాసరెడ్డి, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు పేడాడ రమణి కుమారి, బోని శివరామకృష్ణ, సనపల రవీంద్ర భరత్, బర్కత్ అలీ, ఎస్.ప్రసాదరావు, రామిరెడ్డి, బొండా ఉమా మహేశ్వరరావు, దేవరకొండ మార్కండేయులు, కాళిదాస్ రెడ్డి, అల్లంపల్లి రాజాబాబు, రామన్నపాత్రుడు, కిరణ్ రాజు, పల్లా దుర్గారావు, డా.మంచా నాగ మల్లీశ్వరి, మనలత జాబ్దాస్(చిన్ని), నీలి రవి, కొట్యాడ సూర్య, మహేష్‌బాబు, వార్డు నాయకులు పాల్గొన్నారు. కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చిందా? తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు మాట్లాడుతూ.. ‘సూపర్ సిక్స్ సహా 143 హామీలిచ్చి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు మోసం చేసినందుకే ఇది వెన్నుపోటు ప్రభుత్వం. మూడు లక్షల పింఛన్లు తొలగించి, కొత్తగా ఒక్క పింఛను అయినా ఇచ్చిందా? రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైన ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వ పతనానికి తొలి అడుగు’ అని అన్నారు.విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోమాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. గాజువాక పాత చెక్‌పోస్టు ప్రాంతం నుంచి ప్రారంభమై శాంతిగిరి కాలనీ, ములగాడ హౌసింగ్ కాలనీ మీదుగా ములగాడ తహసీల్దార్ కార్యాలయం వరకూ ఈ ర్యాలీ సాగింది. అక్కడ ఆర్ఐ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్, నియోజకవర్గ మహిళా విభాగం ఇన్చార్జి పేడాడ జ్యోత్స్న, జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ, ఎస్సీ సెల్ నాయకులు మల్లేశ్వరరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి చుక్కా వరలక్ష్మి, కార్పొరేటర్లు పి.వి.సురేష్ బల్లా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.గాజువాక నియోజకవర్గంలో గాజువాక సమన్వయకర్త దేవన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాతగాజువాక జంక్షన్ నుంచి నేషనల్ హైవే మీదుగా చినగంట్యాడ 100 అడుగుల రోడ్డులోని తహసీల్దార్ కార్యాలయం వరకూ ఈ ర్యాలీ సాగింది. తహసీల్దార్ తోట శ్రీవల్లికి వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉరుకూటి అప్పారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకూటి చందు, కార్పొరేటర్లు ఇమ్రాన్, భూపతిరాజు సుజాత తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాంపురం నుంచి పెందుర్తి జూనియర్ కళాశాల వరకూ బైక్‌లు, కార్లతో ర్యాలీగా తరలివచ్చారు. అక్కడ నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయ రోడ్డు, బీఆర్టీఎస్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ గా సాగారు. ముఖ్య నేతలు బి.భగవాన్ జైరాం, పైలా శ్రీనివాసరావు, కొటాన రాము, జెడ్పీటీసీ సభ్యుడు పి.ఎస్.రాజు, ఎంపీపీలు. నేతలు హాజరయ్యారు.సంపద సృష్టి పేరుతో మోసంరాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ‘వెన్నుపోటు దినం’.. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వా న్ని గద్దె దించేందుకు ఒక మలుపు అవుతుంది. కూటమి ఏడాది పాలనలో మోసాలు, దౌర్జన్యా లు, అవినీతి, దోపిడీలు తప్ప మరేమీ లేవు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకూ ప్రతిపక్షంగా పోరాడుతూనే ఉంటాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా చంద్రబాబు అమలుకాని హామీలిచ్చారు. సంపద సృష్టిస్తానంటూ ప్రజలను మోసం చేశారు’ అని విమర్శించారు. బాబూ మీ కుమారుడు లోకేష్‌కు సంపద సృష్టిస్తున్నావా? అని ప్రశ్నించారు. విశాఖ నగరంపై చిన్నచూపుపార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడుతూ.. ‘అన్ని వర్గాలను దగా చేసిన చంద్రబాబు, మంత్రి లోకే‹Ù, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడేమి సమాధానం చెబుతారు. యువగళంలో లోకేష్ ఇచ్చిన యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయి. వెనుకబడిన ఉత్తరాంధ్రను కూటమి నేతలు దోచుకుంటున్నారు. విశాఖ నగరంపై చిన్నచూపు చూస్తున్నారు. అమరావతి భ్రమలో ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలను వెన్నుపోటు పొడవడం పెద్ద లెక్క కాదు! గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతీ హామీని అమలు చేసింది. ఈ ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను నిరీ్వర్యం చేసింది. రైతులను అప్పుల పాల్జేసింది. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి వచ్చిన స్పందన.. కూటమి ప్రభుత్వ పతనానికి నాందిగా మారుతుంది’ అని అన్నారు. చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు హయాంలో రాష్ట్ర జీడీపీ 3.8 శాతానికి పడిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇది 8.9 శాతంగా ఉండేది. ఇది చాలదా చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం అని చెప్పడానికి.? గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.2.75 లక్షల కోట్లను సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించింది. ప్రస్తుతం చంద్రబాబు కూటమి నేతల జేబులు నింపుతున్నారు. పవన్ కల్యాణ్ సిని మా ప్రపంచం నుంచి ఇంకా బయటకు వచ్చినట్లు లేరు. ఏడాది పాలనలో మోసాలు, దౌర్జన్యాలు జరిగితే.. అట్టర్ ప్లాప్ సిని మా(ఏడాది పాలన)కు బాణసంచా కాల్చి పండగ చేసుకోవా లని పిలుపునివ్వడం ఆశ్చర్యంగా ఉంది’ అని ఎద్దేవా చేశారు. ప్రజలే చీపుర్లతో పండగ చేస్తారు పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురా లు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. ‘కూటమి ఏడాది పాలనలో మోసా లు, మహిళలపై దాడులు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో పండగలు నిర్వహిస్తారా? మ్యానిఫెస్టో పట్టుకుని ప్రజల ముందుకు వెళితే వారే చీపుర్లు, గరిటెలతో మీకు అన్ని పండగలు చేస్తారు. మహిళల భద్రతను గాలికొదిలేశారు. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు’ అని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సుపరిపాలన కాదని.. ప్రజలు తప్పుడు హామీలకు మోసపోయారని కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.భీమిలి నియోజకవర్గంలో భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. భీమిలి వుడా మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పోలీస్‌స్టేషన్, మెయిన్ రోడ్డు, గంట స్తంభం మీదుగా నూకాలమ్మ ఆలయం వరకు ర్యాలీ సాగింది. అక్కడ వేదిక వద్ద శ్రీనివాసరావు ప్రసంగించారు. అనంతరం భీమిలిలోని ఆర్డీవో కార్యాలయంలో ఏవో మనోరంజినికి వినతిపత్రం సమర్పించారు. ఈ నిరసన ర్యాలీకి నియోజకవర్గం నలుమూలల నుంచి వందలాది ఆటోలు, 100 కార్లు, 1000 బైక్‌లతో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చారు. జెడ్పీ వైస్ చైర్మన్ సుంకరి గిరిబాబు, ముఖ్య నేతలు దాట్ల పెదబాబు, చెన్నాదాస్, ఎంపీపీలు దంతులూరి వాసురాజు, కె.రాంబాబు, మజ్జి వెంకట్రావ్, పోతిన హనుమంతురావు, అక్కరమాని రామునాయుడు, గండిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
Vennupotu Dinam: నిరసన హోరు
జిల్లాలో వెన్నుపోటు దినాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసనలతో బుధవారం జిల్లా , నియోజకవర్గ కేంద్రాల్లో కదం తొక్కారు. పోలీసుల బెదిరింపులు, హెచ్చరికలు, నిషేధాలు పక్కనపెట్టి హామీలు అమలు చేయాలని కార్యకర్తలు గర్జించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో వైఎస్సార్సీపీ శ్రేణులు జెండాలతో దండులా కదిలివచ్చింది. ఎక్కడికక్కడ బారికేడ్లను ఛేదించుకొని నిరసనలకు కదిలివచ్చారు. ఉవ్వెత్తున కార్యకర్తలు తరలిరావడంతో ఆయా ప్రాంతాల్లో నిరసన హోరుతో దద్దరిల్లింది.చిత్తూరు అర్బన్ : హామీల పేరిట ప్రజలను దగా చేసి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టేలా వెన్నుపోటు దినం నిర్వహించారు. మండు టెండను లెక్కచేయని జగనన్న సైన్యం రోడ్డెక్కి కూటమి సర్కారు మోసాన్ని ఎండగట్టింది. వేల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వెన్నుపోటు దినంతో ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేసి హామీల అమలుపై ప్రభుత్వ తీరును తూర్పారబట్టింది. ∙చిత్తూరులో జరిగిన నిరసనలో సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయలేదు. పార్లమెంటు పరిశీలకులు చువ్వా రాజశేఖర్‌రెడ్డితో కలిసి కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, నాయకులు కెపి.శ్రీధర్, జగదీ‹Ù, గాయత్రీదేవి, లీనారెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి, విజయసింహారెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ∙పుంగనూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా హాజరు కావడంతో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు వెన్నుపోటు దినంలో కదంతొక్కారు. పాత బస్టాండు, పోలీస్ స్టేషన్, గోకుల్ సర్కిల్, అంబేడ్కర్ కూడలి వరకు నిరసన కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, నాయకులు పెద్దిరెడ్డి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి , అనూషారెడ్డి, పోకల అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. నగరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే గంగాధర నెల్లూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులకు నిరసనకు దిగారు.ఈకార్యక్రమంలో సమన్వయకర్త కృపాలక్షి్మ, మండల కనీ్వనర్లు పాల్గొన్నారు. అలాగే కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో వెన్నుపాటు నిరసనలకు కదం తొక్కారు. ఇక పలమనేరులో సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ , జెడ్పీ చైర్పర్సన్ శ్రీనివాసులుతో కలిసి పలమనేరు సెంటర్లో వెన్నుపోటు నిరసన కార్యక్రమం హోరెత్తించారు. రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, మండల కన్వీనర్లు పాల్గొన్నారు. పూతలపట్టులో మాజీ ఎమ్మెల్యే డా.సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో బంగారుపాళ్యం తహసీల్దార్ కార్యాలయం వద్ద వెన్నుపోటు దినం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, పార్టీ నేతలు కుమార్‌రాజా, ధనంజయరెడ్డి, బుజ్జిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోసమే బాబు నైజం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసగించడం చంద్రబాబు నైజం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగభృతి, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏడాది అవుతున్నా ఇచ్చిన దాఖలాలు లేవు. – రాజశేఖర్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులు ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కూటమి ప్రభుత్వం సిగ్గులేకుండా ఏడాది పండుగ నిర్వహిస్తోంది. ప్రజల్లో ఏడాది తిరగకుండానే తిరుగుబాటు మొదలయింది. నాణ్యమైన మద్యం, తక్కువ ధరలకు అందిస్తామని ఎరగా చూపి చంద్రబాబు ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు అంతా మద్యం కుంభకోణమే నడుస్తోంది. కూటమి పాలనకు తెరపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. – నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రజలు నిలదీసే రోజులు వస్తాయి 30 యాక్టు అమల్లో ఉందని, కేసులు పెడతామనే బెదిరింపులు, పోలీసుల హెచ్చరికలను కార్యకర్తలు లెక్కచేయలేదు. కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయాలి. హామీల నుంచి పాలకులు తప్పించుకోలేరు. ప్రజలే నిలదీసే రోజులు త్వరలో వస్తాయి. – భరత్ , ఎమ్మెల్సీ, కుప్పం అప్పులు తీసుకురావడమే సంపద సృష్టా? సంపద సృష్టించడమంటే ప్రతి మంగళవారం అప్పు లు తీసుకురావడమేనా..? పోలీసులు 110 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినా ..వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. గతంలో గగ్గోలు పెట్టిన పెద్దలు ఇప్పుడు అప్పులు చేయడం దేనికో ప్రజలకు చెప్పాలి. ఏడాదిలో ఒక్క హామీ అమలు చేయలేదు. – వెంకటేగౌడ, మాజీ ఎమ్మెల్యే పలమనేరు -
గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును అడ్డుకున్న పోలీసులు
-
వంచనపై గర్జన
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు, కమలాపురం, బద్వేల్, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో “వెన్నుపోటు దినం’ కార్యక్రమం బుధవారం భారీ ఎత్తున నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఆందోళనకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు. సీఎం చంద్రబాబు వ్యవహారశైలిపై వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను కూడా కొనసాగించకుండా దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఒరిగింది శూన్యమని చంద్రబాబు ఏడాదికే విఫలమయ్యారని ఆరోపించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లోని అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. వైఎస్సార్ కడప జిల్లా కేంద్రమైన కడపలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈర్యాలీ కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ కూడలి, ఏడురోడ్ల కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరింది. ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో ఏఓ శంకరయ్యకు వినతి పత్రం సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేష్ పాల్గొన్నారు. పులివెందుల పట్టణంలో ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి జనం పోటెత్తారు. కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీ‹Ùరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా పాత ఆర్టీసీ బస్టాండు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకూ చేరింది. అనంతరం ఆర్డీఓ వెంకటేశంకు వినతి పత్రం సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో అతిపెద్ద ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి సర్కిల్ నుంచి మొదలైన ఈ ర్యాలీ శ్రీరాములుపేట మీదుగా మున్సిపల్ కార్యాలయానికి చేరింది. అనంతరం కమిషనర్ మల్లికార్జునకు వినతి పత్రం సమర్పించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ లక్షి్మదేవి, మాజీ ఆప్కాబ్ ఛైర్పర్సన్ మల్లేల ఝాన్సీ, పార్టీ నేతలు పోరెడ్డి నరసింహారెడ్డి, కల్లూరు నాగేంద్రారెడ్డి, కోనేటి సునంద తదితరులు పాల్గొన్నారు. మైదుకూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్ల రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ అంకాలమ్మ దేవాలయం మీదుగా ఎంపీడీఓ కార్యాలయం వరకూ సాగింది. అక్కడ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మెన్ రామగోవిందరెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. బద్వేల్ పట్టణంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవో కాలనీలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నాలుగురోడ్ల కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకూ సాగింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏఓ ఉదయభారతికి వినతి పత్రం సమరి్పంచారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యరెడ్డి, మున్సిపల్ ఛైర్మెన్ రాజగోపాల్‌రెడ్డి, కుడా మాజీ ఛైర్మెన్ గురుమోహన్ తదితరులు పాల్గొన్నారు. జమ్మలమడుగు పట్టణంలో ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి మొదలైన ఈ ర్యాలీ నారాపురం దేవాలయం, తేరు రోడ్డు, పెద్ద పసుపుల మోటు, సంజామల మోటు, ఎస్బీఐ, పాతబస్టాండు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకూ సాగింది. అక్కడ ఆర్డీఓ సాయిశ్రీ కి వినతి పత్రం సమరి్పంచారు. అలాగే యర్రగుంట్లలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సు«దీర్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతి పత్రం సమరి్పంచారు. ఆయా పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల నేతలు హృషికేశవరెడ్డి, రఘునాథరెడ్డి, లక్ష్మయ్య పాల్గొన్నారు. కమలాపురం పట్టణంలోని ఖాజీపేట రోడ్డులో ఉన్న గయాజ్ ఫిల్టింగ్ స్టేషన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ వైఎస్సార్సీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పోచంరెడ్డి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శివరామిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మెన్ బాలయ్య, మండల పార్టీ అధ్యక్షులు ఉత్తమారెడ్డి, వీరారెడ్డి, జీఎన్ భాస్కర్‌రెడ్డి, రమణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రఘునాథరెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు సంబటూరు ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోసం గ్యారంటీ అని రుజువు చేశారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కటీ అమలు చేయలేదు. సూపర్‌సిక్స్ పేరుతో ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోనికి వచ్చాక వాటి అమలు మరచిపోయారు. బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారంటి అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ అంటూ రుజువు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్షా 75 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అమరావతి అభివృద్ధి అంటూ టెండర్లు ప్రక్రియ ప్రారంభించి కమీషన్ రూపంలో కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. ఎంత మంది పిల్లలు చదివితే అందరికీ తల్లికి వందనం అన్నారు. ఇప్పటి వరకు వేయకుండా తల్లులకు వెన్నుపోటు పొడిచారు. ఆడబిడ్డ పథకం ఊసేలేదు. , రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ. 20 వేలు ఇస్తామన్నారు. అదీ లేదు. నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు అన్నారు. వాలంటీర్లకు నెలకు పదివేల ఇస్తామన్నారు. ఇంత వరకు ఈ పథకాలను అమలు చేయకుండా ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారు. మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలందరికీ వెన్నుపోటు పొడవడం నైజంగా మారింది. పథకాలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. – పి.రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రైతులను నిండా ముంచారు.. రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు ఇవ్వలేదు. చంద్రబాబు , పవన్ కల్యాణ్, బీజేపీ కూటమి ఇచ్చిన హామీలను మరచిపోయారు. జమ్మలమడుగు లో దాలి్మయా పరిశ్రమ వల్ల మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి ఆ గ్రామాల ప్రజలకు న్యాయంజరిగిన తర్వాతే దాలి్మయా రెండోప్లాంట్ ప్రారంభం అవుతుందని ప్రజాభిప్రాయ సేకరణకు ముందు గ్రామాల్లో తిరిగి చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణలో మాట మార్చి సిమెంట్ పరిశ్రమకు మద్దతు పలికి గ్రామ ప్రజలను మోసం చేశారు. కూటమి నేతలు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోనికి రాగానే వాటిని తుంగలోతొక్కారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల తరపున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. – రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీవెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు సూపర్ సిక్స్ హామీలతోపాటు 143 హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, ప్రజలను వెన్నుపోటు పొడవటం పెద్ద లెక్కకాదు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. ముస్లిం మైనారీ్టలకు అన్యాయం చేసే వక్ఫ్ బిల్లుకు బాబు మద్దతిచ్చి మోసం చేశారు. హామీలు పక్కనబెట్టి అక్రమ కేసులు బనాయిస్తూ.. అరాచక పాలన చేస్తున్నారు. చిన్నారులపై , మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. అభివృద్ధిని పక్కనబెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. కచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. – అంజద్‌బాషా, మాజీ డిప్యూటీ సీఎం ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారు గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజలకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టారు. ఏడాది పాలన నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే కడపలో మహానాడు నిర్వహించారు. మహానాడు సందర్భంగానైనా ఈ జిల్లాకు ఏం చేస్తారో చెప్పలేదు. బిర్యానీ ప్యాకెట్లు, మద్యం, నగదు ఇచ్చి జనాన్ని మహానాడుకు తరలించారు. మేము నిర్వహిస్తున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టి కూటమి నేతలు అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. – సురేష్ బాబు, కడప మేయర్ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలేదీ.. ? కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3 వేలు హామీల సంగతి ఏమైంది. ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు బకాయి ఉన్న 4 డీఏలను విడుదల చేసి పీఆర్సీ వేసి, ఐఆర్ ఇవ్వాలి. గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయగా, ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి మళ్లీ ప్రజలను క్యూ లైన్లలో నిలబెడుతూ ఇబ్బందులు పెడుతోంది. – ఎంవీ రామచంద్రారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ -
‘వెన్నుపోటు దినం’ జయప్రదం
సూపర్ సిక్స్‌తో సహా అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదు. ప్రజా సంక్షేమం విస్మరించి అరాచక పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో కడుపు మండిన ప్రజలు కూటమి సర్కారు వంచనపై గర్జించారు. కూటమి నేతల కుట్రలను ఛేదించుకుని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘వెన్నుపోటు’ దినం కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి ఉప్పెనలా కదం తొక్కారు. అధికారులకు వినతిపత్రాలతో నిరసన తెలియజేశారు. అనంతపురం కార్పొరేషన్: కూటమి సర్కారు నయ వంచనను ఎండగట్టేందుకు,చంద్రబాబు సర్కార్‌ను మేలుకొలిపేందుకు వైఎస్సార్ సీపీ బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది.అనంతపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వ ర్యంలో జరిగిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. పాతూరు చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగింది. అనంతపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమే‹Ùగౌడ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్ రిజ్వాన్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర తదితరులు పాల్గొన్నారు. ట నార్పలలో మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ స్థానిక వాలీ్మకి ఆలయం నుంచి ప్రారంభమై తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. శైలజానాథ్ మాట్లాడుతూ చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, జెడ్పీటీసీలు భాస్కర్, బోగాతి ప్రతాప్‌రెడ్డి, నాయకులు సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆధ్వర్యంలో రాప్తాడులో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. ⇒ ఉరవకొండలో సమన్వయకర్త వై. విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఉరగాద్రి ఆలయం నుంచి టవర్ క్లాక్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సూపర్‌సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ⇒ గుంతకల్లులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డి ఆ«ధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమికి డిపాజిట్లు రావన్నారు.కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ భవాని, వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి, గుంతకల్లు ఎంపీపీ మాధవి, గుత్తి పట్టణ కనీ్వనర్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ⇒ రాయదుర్గంలో సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ వినాయక సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది.ఎమ్మెల్సీ శివరామి రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత విధానాలతో ప్రజలను మభ్యపెడుతోందన్నారు. సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి మాట్లాడుతూ మహిళలు, రైతులు, యువత ఇలా అన్ని వర్గాలకూ చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. ⇒ కళ్యాణదుర్గంలో సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. రంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో ముందుకెళ్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు. ఏడాదిగా ఒక్క హామీ అమలు చేయకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ రాజ్‌కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్ రెడ్డి, నేతలు ఉమా, వెంకటేశులు, తిమ్మరాయడు పాల్గొన్నారు. ⇒ యాడికి మండల కేంద్రంలో ‘వెన్నుపోటుదినం’ నిరసన ర్యాలీ... కార్యక్రమ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆధ్వర్యంలోజరిగింది. వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. సుధాకర్ బాబు మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్ సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు తప్పక బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు హర్షవర్దన్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడలు వంచుతాం.. అనంతపురంలో జరిగిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులతో కాలయాపన చేసిందని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలను గుప్పించి ఇంత వరకు ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా పథకాలు అమలు చేయించేలా వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. అనంతపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు నరే‹Ùకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. హంద్రీ –నీవా కాలువ సామర్థ్యాన్ని 3,800 క్యూసెక్కులకే పరిమితం చేసి భవిష్యత్తులో నీటి అవసరాలకు తీవ్ర ఇబ్బంది తలెత్తేలా చేశారన్నారు. -
చంద్రబాబు అబద్ధాలపై తిరగబడ్డ ప్రజలు జగన్ పిలుపుతో దద్దరిల్లిన ఏపీ
-
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటు... వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలకు ఉప్పెనలా తరలివచ్చిన జనం
-
బాబును నమ్మితే.. వెన్నులో కత్తి గ్యారెంటీ
-
పెల్లుబికిన ప్రజా వ్యతిరేకత
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏడాదిగా టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను నిలదీస్తూ బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిర్వహించిన నిరసన ర్యాలీలకు ప్రజలు ఉప్పెనలా కదలివచ్చి, కదంతొక్కి విజయవంతం చేయడంపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిరసన ర్యాలీలను విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను అభినందిస్తూ.. కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘సరిగ్గా ఏడాది క్రితం, జూన్ 4న చంద్రబాబు నాయుడు గొప్ప వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారు. కానీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా తనను నమ్మిన ప్రజలకే ద్రోహం చేశారు. మోసపు హామీలు, ఆయన తప్పుడు ప్రకటనలతో ప్రజలకు వెన్నుపోటు పొడవడం ద్వారా రాష్ట్రాన్ని నిరాశ, నిస్పృహల్లోకి నెట్టారు. అందుకే జూన్ 4ను మనం వెన్నుపోటు దినంగా పాటించాలని పిలుపునిచ్చాం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు ఉప్పెనలా కదలివచ్చి.. తమ వేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవలం నిరసన కాదు. అబద్ధాలు చెప్పి మోసం చేస్తే మౌనంగా ఉండబోమంటూ శక్తివంతమైన సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ నిరసన ద్వారా చాటిచెప్పారు. మోసపోయిన ప్రజల బాధ, నిరాశ, ఆగ్రహం, పెల్లుబుకుతున్న వ్యతిరేకతను ఈ ర్యాలీలు ప్రతిబింబించాయి. ప్రజల హక్కులు, న్యాయం, గౌరవం కోసం వైఎస్సార్సీపీ ఎప్పుడూ జనంతో కలిసి పోరాడుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల తరఫున నిలదీస్తూ నిరసన ర్యాలీలను విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు నేను హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. -
బాబు 'సూపర్ 6' వెన్నుపోటుపై తిరుగుబాటు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా 143 వాగ్దానాలతో నమ్మించి, ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేతృత్వంలో ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. కూటమి ప్రభుత్వం కుట్రలు.. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని ఉప్పెనలా కదలివచ్చి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’లో కదంతొక్కారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ.. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. అంటూ ప్లకార్డులు చేతబూని.. తక్షణమే హామీలు అమలు చేయాలని.. లేదా మోసం చేసిన సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీల్లో నినదించారు. అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి.. తక్షణమే హామీలు అమలు చేయాలని కోరుతూ అధికారులకు వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ పత్రాలను అందజేశారు. ‘సూపర్ సిక్స్ పేరుతో మహిళలు, రైతులు, నిరుద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరికీ వెన్నుపోటు పొడిచావు. నువ్వు మోసం చేయని వర్గం అంటూ ఉందా బాబూ? వైఎస్ జగన్ ఇస్తున్న పథకాలన్నింటినీ ఎత్తేశావు.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు.. శాంతి భద్రతలను నిర్వీర్యం చేశావు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికి రెడ్‌బుక్‌తో టెర్రర్ సృష్టిస్తున్నావు.. ఇక చాలు మీ నిర్వాకం. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో తమ వాహనాలతో కూటమి ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్న రేషన్ వాహనాల డ్రైవర్లు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలి’ అని ఊరూరా ప్రజలు డిమాండ్ చేశారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా నిరసన ర్యాలీలకు తండోప తండాలుగా జనం కదలి రావడమే కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే పెల్లుబుకుతున్న ప్రజావ్యతిరేకతకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ 26 జిల్లాల్లోనూ వెన్నుపోటు దినం, నిరసన ర్యాలీలు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ కదనోత్సాహాన్ని మరింతగా రగిల్చింది. ఆ పిలుపే ప్రభంజనమై.. సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఓట్లేయించుకుని చంద్రబాబు కూటమి విజయం సాధించి బుధవారం (జూన్ 4)తో సరిగ్గా ఏడాది పూర్తయింది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ప్రభుత్వం ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ జూన్ 4ను వెన్నుపోటు దినంగా పాటించాలని.. కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీస్తూ అన్ని నియోజకవర్గాల్లో నిరసన తెలుపుతూ ర్యాలీలు నిర్వహించి, తక్షణమే హామీలు అమలు చేయాలని అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన పథకాల బోర్డులను ప్రదర్శిస్తూ నెల్లూరు సిటీలో నిరసన తెలుపుతున్న ప్రజలు అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. జగన్ పిలుపు ప్రభంజనమై.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కడానికి సిద్ధమవుతున్నారని గ్రహించిన కూటమి ప్రభుత్వం దాన్ని విఫలం చేయడానికి కుట్రలు చేసింది. వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం–నిరసన ర్యాలీలను అడ్డుకోవడానికి యధావిధిగా రెడ్ బుక్‌తో భయానక వాతావరణం సృష్టించేందుకు విఫలయత్నం చేసింది. గుంతకల్లు ప్రశ్నించే గొంతును నొక్కేయడానికి పోలీసులను ఉసిగొల్పింది. బుధవారం ఉదయమే అనేక ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు వారిని హౌస్ అరెస్టు చేశారు. మాచర్లలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని దిగ్బంధించిన పోలీసులు.. బయటకు వస్తే కేసులు పెడతామని నాయకులు, కార్యకర్తలను తీవ్ర స్థాయిలో బెదిరించారు. గుంటూరులో నిరసన ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు దౌర్జన్యం చేశారు. కూటమి కుట్రలు.. పోలీసుల ఆంక్షలను చిత్తు చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జనం కదం తొక్కారు. -
విదేశాల్లోనూ వెన్నుపోటు దినం విజయవంతం
సాక్షి, అమరావతి/జి.కొండూరు: ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంపై తొలి ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చిందని, వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఇది సుస్పష్టంగా కనిపించిందని ఆ పార్టీ యూకే కమిటీ కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా తెలిపారు. 30 ఏళ్లుగా చంద్రబాబు ఇలాగే ఎన్నికల సమయంలో మోసపు మాటలతో అమాయక తెలుగు ప్రజలను వంచిస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు విదేశాల్లోనూ వెన్నుపొటు దినం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వ ర్యంలో బుధవారం లండన్‌లో డా.ప్రదీప్ చింతా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అభిమానులు కదంతొక్కారు. లెస్టర్‌లో వైఎ స్సార్సీపీ యూకే కమిటీ కో కన్వీనర్ చలపతి సర్ప ఆధ్వ ర్యంలో.. నల్ల చొక్కాలు ధరించి, ప్లకార్డులతో నిరసన తెలిపారు.ఈస్ట్ లండన్‌లో వైఎస్సార్సీపీ యూకే కమిటీ కో కన్వీనర్ మలిరెడ్డి కిషోర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ఎన్ఆర్ఐల నుంచి విశేష స్పందన లభించింది. ‘‘నీకు రూ.15 వేలు నీకు రూ.15 వేలు ఏదీ’’, ‘‘ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఎక్కడ?’’, ‘‘50 ఏళ్లకు పెన్షన్ ఏది బాబూ?’’ ‘‘రెడ్‌బుక్ రాజ్యంగంతో అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు’’, ‘‘ఉచిత బస్సు తుస్సు, ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 అన్నావ్.. ఆడపడుచులనూ మోసం చేశావ్..’’ అంటూ ప్లకార్డులతో నినాదాలుచేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున తరలివచ్చి విజయంతం చేశారు. జేబులు నింపుకోవడమే కూటమి కార్యక్రమంకూటమి ప్రభుత్వం గద్దెనెక్కి సంవత్సరం పూర్తి అయినా ఏ ఒక్క హామీని కూడా అమలుచేయకుండా కూటమి నేతల జేబులు నింపుకొనే కార్యక్రమం చేపట్టిందని ప్రదీప్ చింతా దుయ్యబట్టారు. వికలాంగుల పింఛను నుంచి రైతన్నలకు అందించే సాయం వరకు, మహిళలకు ఫ్రీ బస్సు నుంచి తల్లికి వందనం వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చక కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మలిరెడ్డి కిషోర్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత పథకాలను అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వమేనన్నారు.ఎన్నికల ప్రచార సభల్లో ఒకరికి ముగ్గురు చొప్పున బాబు, పవన్, పురందరేశ్వరి చెప్పిన అబద్ధాన్ని పదేపదే చెప్పి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేపట్టి హామీలను నెరవేర్చకుండా ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారని చలపతి సర్ప విమర్శించారు. కార్యక్రమంలో చల్లా మధు సూదన్ యాదవ్, ప్రణయ్ గడిమే, ఆనంద్ అక్కి దాసు, రామిరెడ్డి జయచంద్రారెడ్డి, చలపతి గుర్ర, యశ్వంత్ గరికపాటి, సాయి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. అట్లాంటాలో వెన్నుపోటు దినంసీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐలు, వైఎస్సార్ అభిమానులు, వైఎస్ జగన్ అభిమానులు అమెరికాలోని అట్లాంటాలో బుధవారం వెన్నుపోటు దినం నిరసనను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘2019–24 మధ్య ఏ రంగంలోనైనా సమస్య ఏర్పడినప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం తక్షణం స్పందించింది. నిరంతరం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి చురుగ్గా నడిపించారు. సమస్యలను పరిష్కరించే దాక విశ్రమించలేదు. కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచనే చేయడం లేదు. ఎక్కడా ప్రజా సమస్యల గురించి మాట్లాడటం, వాటి పరిష్కారాన్ని చూపే ప్రయత్న చేయడం లేదు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు’’ అని విమర్శించారు. కార్యక్రమంలో వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆలూరులో వెన్నుపోటు దినం
-
‘వెన్నుపోటు దినం’ సక్సెస్‌పై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ‘వెన్నుపోటు దినం’ సక్సెస్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సంవత్సరం క్రితం చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కానీ, హామీని కానీ అమలు చేయలేదు. తనను నమ్మిన రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశారు’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారు. అందుకే ఈరోజు వెన్నుపోటు దినం కార్యక్రమానికి పిలుపునిచ్చాం. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తీవ్ర ఆవేదన, కోపాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవలం నిరసన మాత్రమే కాదు.. మోసం చేస్తే మౌనంగా ఉండరనే శక్తివంతమైన సందేశాన్ని ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చారు...బాధిత ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీలోని ప్రతి నాయకుడు, కార్యకర్త, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజల న్యాయబద్దమైన హక్కుల సాధన కోసం వైఎస్సార్సీపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.Exactly a year ago, on June 4, Chandrababu Naidu came to power with grand promises, but not a single one has been fulfilled. Instead, he has betrayed the very people who believed in him. His false statements, broken assurances, and blatant backstabbing have pushed the state into… pic.twitter.com/H5Q80sjqrd— YS Jagan Mohan Reddy (@ysjagan) June 4, 2025 -
MLA Deepika: బాలయ్య అడ్డాలో బాబుకు సవాల్..!
-
Vennupotu Dinam: పోలీసుల ఓవర్ యాక్షన్ దుమ్ములేపిన పేర్ని కిట్టు
-
చంద్రబాబుకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య: శ్యామల
-
వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ
-
చంద్రబాబు చరిత్ర పూర్తిగా మోసపూరితం : ఎంపీ మిథున్ రెడ్డి
-
ప్రజల చేతికి చిప్ప తప్పు... బాబు, లోకేష్ పై రోజా సంచలన వ్యాఖ్యలు
-
ప్రజా శంఖారావం.. ఇది ఆరంభం మాత్రమే!
-
Sajjala Ramakrishna: బాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సుస్పష్టం
-
Usha Sri: బాబుకు వెన్నులో వణుకు వచ్చేలా పెనుకొండలో వెన్నుపోటు దినం ర్యాలీ
-
Perni Nani: మీ వల్ల ప్రతి ఇంట్లో ఎన్ని దీపాలు ఆగాయో తెలుసా?
-
నా ఆరోగ్యం బాగానే ఉంది.. ఆందోళన వద్దు: బొత్స
సాక్షి, విజయనగరం: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో వెన్నపోటు దినంలో పాల్గొన్న బొత్స.. ప్రసంగిస్తుండగానే సొమ్ముసిల్లి పడిపోయారు. వెంటనే తిరిగి కోలుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏపీలో వెన్నుపోటు దినం విజయవంతం అయ్యిందన్నారు. సభను విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. సభలో ప్రసంగిస్తుండగా.. స్వల్ప అస్వస్థతకు గురయ్యానని.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన తెలిపారు. తన ఆరోగ్యం పట్ల ఎవరూ ఆందోళన చెందొద్దని.. దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదంతో కోలుకున్నానని బొత్స సత్యనారాయణ అన్నారు. -
Vennupotu Dinam: చంద్రబాబు వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటు
-
కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు రోజా
-
Ambati: ఏడాదైనా ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయని చంద్రబాబు
-
రాష్ట్ర ప్రజలను నిలువునా వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వం
-
దమ్ముంటే ఆపు .. అంబటి VS పోలీసులు
-
బాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సుస్పష్టం: సజ్జల
సాక్షి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వంపై తొలి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత వచ్చిందని, ఇవాళ అది స్పష్టంగా కనిపించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Rama Krishna Reddy) అన్నారు. వైఎస్సార్సీపీ ఇవాళ(బుధవారం, జూన్ 4) చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలు విజయవంతమైనట్లు మీడియా ముఖంగా ప్రకటించారాయన. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏడాది గడిచినా అమలు కాలేదు. ఏడాది కాలంలోనే ప్రజా వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ఇవాళ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది. వైఎస్సార్సీపీ కష్టాల నుంచే పుట్టింది. మా హయాంలో 15 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధి.. మూడేళ్లలోనే జరిగింది. అధికారంలోకి రాగానే మేం తొలి ఏడాదిలోనే 99 శాతం హామీలు అమలు చేశాం. కోవిడ్ రెండేళ్లలోనూ సంక్షేమ పథకాలు అమలు చేశాం. మిగిలిన మూడేళ్లలోనే 10, 15 ఏళ్ల అభివృద్ధి చూపించాం. విద్య, వైద్య, వ్యవసాయం రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం. కానీ.. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు అన్నీ సర్వనాశనం అయ్యాయి. తొలి ఏడాదిలోనే రికార్డ్ స్థాయిలో(రూ.లక్షా 50వేల కోట్లకు పైగా) చంద్రబాబు అప్పులు చేశారు. ఆ అప్పు ఏం చేశారో తెలియదు. ఏడాదిలోనే రైతులను సంక్షోభంలోకి నెట్టేశారు. పంటలకు కనీస మద్ధతు ధరలు లేవు. ఇప్పటికే 4 లక్షల పెన్షన్లు కట్ చేశారు. వైఎస్ జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలను సైతం ఎత్తేశారు. చంద్రబాబు తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది’’ అని సజ్జల అన్నారు. -
ప్రజలకే వెన్నుపోటు.. బాబును క్షమించే ప్రసక్తే లేదు (చిత్రాలు)
-
Vennupotu Dinam మళ్లీ పొడిచాడురా బాబూ.. ఎన్ఆర్ఐల నిరసన
-
ఏపీకి ట్రబుల్ మేకర్‌గా చంద్రబాబు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమం కంటే ఎక్కువే అందిస్తానంటూ ఏపీ ప్రజలను చంద్రబాబు నాయుడు దారుణంగా మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం నిరసనల్లో భాగంగా.. బుధవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవహార శైలి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించాడు. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలమయ్యారు. జగన్ అందించిన నవరత్నాలను పూర్తిగా నాశనం చంద్రబాబు చేశారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని ప్రజలను మోసం చేశారు. చంద్రబాబువి మోసపూరితమైన హామీలు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చంద్రబాబు ప్రచారం చేయించారు. మరి ఇప్పుడు ఏడాది పాలనకే రూ.లక్షా 60 వేల కోట్ల అప్పు చేశారు. అలాంటప్పుడు ఏపీ ఇప్పుడేం అవుతుంది?. రైతులు, వలంటీర్లు, ఎండీయూ వాహనదారులు.. ఇలా అందరినీ దగా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేయడం దుర్మార్గం. .. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది. తెనాలిలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలను పోలీసులు రోడ్లమీద కొట్టడం దారుణం. అమాయక ప్రజలపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం. జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతాం.... విజయవాడ నగరాన్ని చెత్త నగరంగా మార్చింది కూటమి ప్రభుత్వమే. బుడమేరుకు వరద వస్తుందని తెలిసి కూడా ప్రజలకు ఎలాంటి సమాచారం అందించలేదు. శాతవాహన కాలేజీకి ప్రిన్సిపల్ కిడ్నాప్ వ్యవహారం కూటమి ప్రభుత్వంలోనే సంచలనగా మారింది. ఎన్నికల మేనిఫెస్టో, సూపర్ సిక్స్, ఇంటింటికి రేషన్ ఇవన్నీ గోవిందా!. అప్పట్లో ఎన్టీఆర్‌ను ఎలా మోసం చేశారో.. ప్రజలను కూడా చంద్రబాబు ఇవాళ అలాగే మోసం చేశారు. ఈ రోజు వెన్నుపోటు దినం.. వంచన దినం. కాపుల ఉద్యమాన్ని కూటమి ప్రభుత్వం అణచివేసింది. రాష్ట్ర ప్రభుత్వం భూములు, ఇసుక కొట్టేసిన కూటమి నేతలు హ్యాపీగా ఉన్నారు. రాష్ట్రమంతా అవినీతిమయంగా మారింది అని వెల్లంపల్లి అన్నారు. డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సంవత్సర కాలంలో ప్రజలు కూటమి ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ సిక్స్‌లో ఇప్పటిదాకా ఎన్ని హామీలు నెరవేర్చారు?. చంద్రబాబే స్వయంగా చెప్పారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని.. పథకాలు ఇవ్వలేనని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. మల్లాది విష్ణు ఆధ్వరంలో ధర్నా చౌక్ నుండి గాంధీనగర్ ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. -
వెన్నుపోటు దినం గ్రాండ్ సక్సెస్.. భారీగా జన సంద్రం..
-
అప్పుడు.. మళ్లీ ఇప్పుడు.. అధికారం కోసమే బాబు వెన్నుపోటు: పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు జిల్లా: ఏడాది కాలంలో చేసిన అప్పులకు చంద్రబాబులో జవాబుదారితనం లేదని.. కానీ, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరులో ఆయన ఆధ్వర్యంలో వెన్నుపోటు నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. తహసీల్దార్‌కు వినతిపత్రం అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిరసన ర్యాలీల్లో పాల్గొంటున్నారు. దీనిని బట్టే ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అర్థమవుతోంది. అప్పుడు చంద్రబాబు అధికారంకోసం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు మళ్లీ అధికారం కోసం ఉచిత హామీలు పేరుతో ఏడాది కాలంగా ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారు. ఏడాది కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు తెచ్చిన లక్షా 51వేల కోట్ల రూపాయాల అప్పులకు జవాబు చెప్పే పరిస్థితిలో ఆయన లేరు. కానీ, ప్రజలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు కాగ్ కూడా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తెలిపింది. .. రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి లోకేష్ విలాసాలకు హెలికాప్టర్లను, విమానాలను కొనుగోలు చేశారు. సాయంత్రం కాగానే హైదరాబాద్‌కు, పగలు అమరావతికి తిరుగుతున్నారు. సెకీతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం యూనిట్ కు సోలార్ ఎనర్జీ 2.49 పైసలు ఒప్పందం చేసుకుంటే పెద్ద రాద్దాంతం చేసిన ఎల్లో మీడియా.. ఇవాళే చంద్రబాబు సర్కారుకు యూనిట్ కు 4.60 పైసల కు కొనుగోలుకు ఒప్పందం చేసుకుని 11వేల కోట్లు అవినీతికి పాల్పడింది. ఏడాది కాలంలో ఎన్నికోట్లు ఉచిత గ్యాస్ కు ఖర్చు చేశారో వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది’’ అని పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. సీఎం సొంత జిల్లాలో మామిడి రైతులు సరైన ధర లేక పొలాల్లో మామిడి పంట విడిచి పెట్టేశారు. పొగాకు, మిర్చి , టమోటో రైతులుది ఇదే పరిస్థితి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల్ని టార్గెట్ చేసుకుని అక్రమ అరెస్టులు చేస్తున్నారు. పార్టీకి చెందిన దళిత నేతలు ను తప్పుడు కేసులతో అరెస్ట్ చేయిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి 26 లక్షలు మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే ఎంతో సక్రమంగా ఫలితాలు పారదర్శకంగా ప్రకటించారు. కానీ, ఇవాళ పదో తరగతి పరీక్షలు ఫలితాలు తప్పడు తడకగా ప్రకటించి విద్యార్ధులు జీవితాలతో ఆటలు ఆడుతున్నారు. గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హయంలో పదో తరగతి పరీక్షలు ఫలితాల్లో తప్పిదాలు జరిగితే.. నాటి మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడితో రాజీనామా చేయించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు పదో తరగతి తప్పుడు ఫలితాలు పై కొడుకు మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయించాలి అని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. వెన్నుపోటు దినం నిరసనల్లో అనీషా రెడ్డి, పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
వెన్నుదినంలో పెద్ద ఎత్తున పాల్గొన్న నెల్లూరు ప్రజలు
-
పులివెందులలో దుమ్మురేపుతున్న వెన్నుపోటు దినం ర్యాలీ..
-
రాష్ట్ర ప్రజల ఉసురుతో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది
సాక్షి,గన్నవరం: పథకాలు అడిగితే ఖజానా ఖాళీ అంటారు. లోకేష్, పవన్, చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు. లోకేష్ భార్య పిల్లలను చూడడానికి, చంద్రబాబు సొంత ఇల్లు చూడటానికి ప్రజల సొమ్ముతో తిరుగుతారు. అమ్మఒడి అడిగితే ఇవ్వరు. ప్రశ్నిస్తే నోరుమెదపరని కూటమి నేతలపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు.వెన్నుపోటు దినం కార్యక్రమంలో పేర్నినాని మాట్లాడుతూ.. ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేశారు. వైఎస్ జగన్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తా అని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా తానే తీర్చుతానని చెప్పాడు. 12 నెలల కాలంలో లక్ష 51వేల కోట్లు అప్పు చేసారు.ఉచిత బస్సు తుస్సు మంది. సంక్రాంతిలోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు. రోడ్ల మీద తిరిగితే నడుం నొప్పులు వస్తున్నాయి.పనులు పూర్తి అయినవి బిల్లులు ఇంకా రాలేదు.పథకాలు అడిగితే ఖజానా ఖాళీగా ఉంది.. రూపాయి లేదని చెబుతారు. ప్రజల సొమ్ముతో విలాస జీవితం గడుపుతారు. భార్య పిల్లల్ని చూసేందుకు, దోచుకున్న డబ్బు దాచుకోవడానికి ప్రత్యేక విమానంలో తిరుగుతారు. చికెన్‌లో కమిషన్ అడుగుతారు. ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు లిక్కర్ వ్యాపారంలో మునిగి తేలుతున్నారు.ప్రజలనే కాదు దేవుడిని కూడా మోసం చేస్తున్నారు.రాష్ట్రంలో ఉన్న దేవుడి ఆలయాలను దోచేస్తున్నారు.దేవుడి ఆస్తి ని కూడా నామినేషన్ పద్దతిలో అద్దెకు 99 ఏళ్లకు ఇస్తామని అంటున్నారు. అన్ని మతాలు మావే అని ఇప్పుడు హిందువులు కు మాత్రమే అంటున్నారు. ప్రధాని మోదీని,ఆయన సతీమణినీ తిట్టిన చంద్రబాబుకు పవన్ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు.లోకేష్ ధగాకోరు అవినీతి పరుడు అన్న పవన్ చంద్రబాబు మరో 15ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు. లక్ష కోట్లు అప్పు చేసి రాష్టాన్ని అప్పుల పాలు చేసిన కూటమి దిగిపోవాలి. గన్నవరంలో తప్పుడు కేసులు లేవని చర్చకు సిద్ధం అన్న నేత చర్చ కు రమంటే పారిపోయాడు. వంశీపై తప్పుడు కేసులు పెడుతున్నారు.2019లో ఇళ్ల దొంగపట్టాలు చంద్రబాబుకు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా? తప్పు ఉంటే ఎమ్మార్వోని జైల్లో వేయాలన్నారు. వంశీపై తప్పుడు కేసు పెట్టాడు. ఆస్తి తగాదాలో ఇప్పుడు వంశీపై కేసుపెట్టారు. వంశీపై 11 కేసులు పెట్టారు. మైనింగ్ కేసులో అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు. వంశీపై పెట్టిన ప్రతి కేసు తప్పుడు కేసు.. దొంగ కేసు. కూటమి తక్షణమే హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తాం. కూటమి పతనానికి గన్నవరంలో నాంది పడింది. ప్రజల అగ్రహావేశాలలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది. -
ఏం చేశారని దీపావళి చేసుకోవాలి.. వెన్నుపోటుపై వినూత్న నిరసన
-
ఏడాదికే కూటమి ప్రభుత్వ పతనం మొదలైంది: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి పాలనలో జరిగిన అన్యాయాలపై పేద ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల్లో భాగంగా తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవోకు ఆయన కూటమి ప్రభుత్వ హామీల వినతి పత్రం సమర్పించారు. వంచన, మోసం ఏడాది కాలంలో తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో ప్రజలు మోసపోయారు. 143 హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేయలేదు. వైఎస్సార్సీపీ నేతలపై ఇప్పటిదాకా 2,466 కేసులు పెట్టారు. ఆరోగ్యశ్రీని నాశనం చేశారు. ప్రజలకు జరిగిన అన్యాయం పై పేద ప్రజలు పక్షనా పోరాటాలు కొనసాగిస్తాం.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు పూరించిన సమరశంఖంలో ఏడాదికే కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభం అయ్యింది అని భూమన అన్నారు. ఈ కార్యక్రమంలో భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
సిగ్గు లేదు మీకు! కౌంట్ డౌన్ మొదలైంది.. గుర్తు పెట్టుకో చంద్రబాబు
-
చీపురుపల్లిలో బొత్స నిరసన
-
కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ పోలీసుల తీరుపై ఆగ్రహం
-
అలాంటి నీచ చరిత్ర చంద్రబాబుది: వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: ఏడాది కాలంలో ఎన్నో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక పథకం అందించలేకపోయిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారాయన. ఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు. కానీ, ఏడాది తిరిగేలోపే.. బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలోని ఐదేళ్లలోని ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలోనే లక్షా 55,000 కోట్ల రూపాయల అప్పు చేసింది. ఇంత అప్పు చేసినా ప్రజలకు ఒక పథకం అందిచలేకపోయింది. .. మహిళలకు ఉచిత బస్సు, నెలకు 1500, రైతన్నలకు ఏడాదికి 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. పులివెందుల మెడికల్ కాలేజ్‌కి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుది. పులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తి అయితే.. మిగిలిన పది శాతం పనులను కూడా ఈ ప్రభుత్వం చేయలేదు’’ అని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. కూటమి వైఫల్యాలకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
NRI News : వెన్నుపోటు దినం యూకేలో ఎన్ఆర్ఐల నిరసన
జూన్ 4 వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా వైస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో UK లోని ఈస్ట్ లండన్ మరియు లెస్టర్ నుంచి నిరసన తెలియజేసారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అనేక సంక్షేమ పథకాలనుతుంగలోకి వైనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మలిరెడ్డి కిషోర్ రెడ్డి , చల్లా మధుసూదన్ యాదవ్ , ప్రణయ్ గడిమే ఆనంద్ అక్కిదాసు, రామిరెడ్డి జయచంద్రా రెడ్డి , చలపతి గుర్రం,యశ్వంత్ గరికపాటి,సాయి ప్రదీప్ పాల్గన్నారు.ఒకరికి ముగ్గురు చొప్పున( చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పురందరేశ్వరి ) చెప్పిన అబద్దాన్ని పదే పదే చెప్పి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేపట్టిన ఏపీ సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆర్థిక విద్వంసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తా
సాక్షి,నగరి: ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తామని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినం కార్యక్రమాన్నిపెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో నగరి నిర్వహించిన వెన్నుపోటు దినంలో ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంత వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు. ప్రజల్ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసాలపై ఆర్డీఓకి అర్జీ ఇచ్చాం. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి.రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని వదిలి ప్రజలకు సంక్షేమ కోసం పనిచేయాలి. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, మహిళలపై పైశాచికాలు తప్ప సురక్ష పాలన కరువైయింది. విద్యార్థులను,మహిళలను వెన్నుపోటు పొడిచారు కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఆంద్రప్రదేశ్‌గా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఎన్నికల ముందు ఊగిపోయినా పవన్ కళ్యాణ్ నేడు మహిళలపై దారుణాలు జరుగుతున్న మాట రావడం లేదు.పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ కోసం చూపిస్తున్న చొరవ ప్రజలపై లేదు.పదవ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నెరవేర్చలేని నారా లోకేష్ పప్పు. రెడ్ బుక్ రాజ్యాన్ని పక్కన పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలి.కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతాం’అని హెచ్చరికలు జారీ చేశారు. -
ఇచ్చిన హామీలు ఎక్కడ.. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలి?
-
చెవిలో పూవ్వులతో వెన్నుపోటుదినం RK రోజా మాస్ ర్యాగింగ్
-
కూటమిపై తిరుగుబాటు.. బాబుకు కౌంట్ డౌన్
-
పవన్ కల్యాణ్.. ఇలాగేనా మహిళలతో ప్రవర్తించేది? వెన్నుపోటు దినానికి మా మద్దతు
-
Vennupotu Dinam: వెన్నుపోటుకు ఏడాది.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
-
నేడు ఏపీవ్యాప్తంగా వెన్నుపోటు నిరసనలు
-
Vennupotu Dinam: నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం
సాక్షి, గుంటూరు: సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చి.. ఏడాది అవుతున్నా కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) ఏడాదిగా ఆ హామీలను అమలు చేయలేదు. చంద్రబాబు చేసిన ఈ మోసంపై ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజైన ఇవాళ (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’(Vennupotu Dinam)గా పాటించాలని నిర్ణయించి నిరసనలకు దిగింది.👉చంద్రబాబు వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటుకూటమి ప్రభుత్వత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆందోళనవెన్నుపోటు దినంలో పాల్గొంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, సాధారణ ప్రజలుకూటమి సర్కార్ ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిందని ప్రజాగ్రహంచంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని నినాదాలు👉ప్రకాశం జిల్లా:చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రోజుఓట్లేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచిన రోజు ఈరోజుఅప్పుడు మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారనుకుంటే.. ఏడాది కాలంగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారుచంద్రబాబు గతంలో కూడా చెప్పిన హామీలను నెరవేసిన ఘనత ఎప్పుడూ లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారుచంద్రబాబు మారాడు మారాడు అనుకుంటే చంద్రబాబు ఎప్పటికీ మారడుచంద్రబాబు ఎప్పటికీ మారకపోవడం, వెన్నుపోటు ఆయన రక్తంలోనే ఉందిఅందుకే ఈరోజు వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నాం అన్నారు- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 👉నంద్యాల జిల్లా డోన్‌లో వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినంవెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందిఅధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారుగత ప్రభుత్వంలో మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే నేడు కూటమి ప్రభుత్వం సంవత్సరంలోనే లక్ష యాభై వేల కోట్లు అప్పు చేశారు.కరెంట్ బిల్లులు పెంచబోమని చెప్పి ఇష్టం వచ్చినట్లు పెంచి, సూపర్ సిక్స్ అంటూ పిల్లల నుంచి ముసలి వారి వరకు మోసం చేసారు.సంపద సృష్టిస్తాం అని చెప్పి చివరకు పథకాల హామీలలో చేతులు ఎత్తేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై విమర్శలు 👉వైఎస్ఆర్ జిల్లాపులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంకూటమి వైఫల్యాలకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలువెన్నుపోటు దినం సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగంఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారుబాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారుగత ఐదు సంవత్సరాలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు లక్షల కోట్లు పైగా అప్పు చేసిందిబాబు ప్రభుత్వం ఏడాదిలోనే రూ.లక్ష 55000 కోట్లు అప్పు చేసిందిఇంత అప్పు చేసిన ప్రజలకు ఒక పథకం అందివ్వలేదుమహిళలకు ఉచిత బస్సు, నెలకు రూ. 1500, రైతన్నలకు ఏడాదికి ూ. 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు.పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుదిపులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు అయితే మిగిలిన 10శాతం పనులను ఈ ప్రభుత్వం చేయలేదు👉తిరుపతి జిల్లా :నేడు వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినానికి పిలుపు.కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదుప్రజలను వెన్నుపోటు పొడిచారు చంద్రబాబునాయుడు.చంద్రబాబునాయుడు చేసిన మోసాలపై ఆర్డీఓకి అర్జీ ఇచ్చిన మాజీ మంత్రి రోజా.ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలిరెడ్బుక్ రాజ్యాంగాన్ని వదిలి ప్రజలకు సంక్షేమ కోసం పనిచెయ్యాలికూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాముకూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, మహిళలపై పైశాచికాలు తప్ప సురక్ష పాలన కరువైయింది.విద్యార్థులను, మహిళలను వెన్నుపోటు పొడిచారు కూటమి ప్రభుత్వంఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంద్రప్రదేశ్‌గా మార్చింది ఈ కూటమి ప్రభుత్వంఎన్నికల ముందు ఊగిపోయినా పవన్ కళ్యాణ్ నేడు మహిళలపై దారుణాలు జరుగుతున్న మాట రావడం లేదుపవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ కోసం చూపిస్తున్న చొరవ ప్రజలపై లేదుపదవ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నెరవేర్చలేని నారా లోకేష్ పప్పు రెడ్ బుక్ రాజ్యాన్ని పక్కన పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలికూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతాం👉పశ్చిమగోదావరి జిల్లా:వైఎస్ జగన్ పిలుపు మేరకు భాగంగా తణుకులో వెన్నుపోటు దినం మాజీ మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రజలు👉పశ్చిమగోదావరి జిల్లా:పార్టీ అధినేత జగన్ పిలుపు మేరకు వెన్ను పోటు దినంపాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జీ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి గాంధీ బొమ్మల సెంటర్ మీదుగా తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్‌కు వినతిపత్రంవెన్నుపోటు దినం ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఎస్ఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేవర్మ, రాష్ట్ర మహిళా కార్యదర్శిప్రధాన కార్యదర్శి కర్ర జయ సరిత, పట్టణ అధ్యక్షుడు కోరాడ శ్రీనివాసరావు, వైసీపీ శ్రేణులు👉పశ్చిమగోదావరి జిల్లా:పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంఅంబేద్కర్ సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు👉డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా:రావులపాలెంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ఆగ్రహం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవటాన్ని నిరసిస్తూ వెన్నుపోటు దినం పేరిట పెద్ద ఎత్తున నిరసనపెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు రావులపాలెం పార్టీ కార్యాలయం నుంచి రావులపాడు జంక్షన్ మీదుగా ఎమ్మార్వో కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ..👉ఎన్టీఆర్ జిల్లాతిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి బోసుబొమ్మ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకూ ర్యాలీర్యాలీలో పాల్గొన్న నాలుగు మండలాల పార్టీ శ్రేణులు..బొసబొమ్మ సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సర్కిల్ కార్యాలయం వైఎస్సార్ విగ్రహానికి నల్లగట్ల స్వామిదాస్ నివాళులు చంద్రబాబు పాలనను వ్యతిరేకిస్తూ నినాదాలు👉అనకాపల్లి జిల్లా: అనకాపల్లిలో ప్రారంభమైన వెన్నుపోటు దినం కార్యక్రమం పాల్గొన్న అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు👉విశాఖ .. ఈస్ట్. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెన్నుపోటు దినంగురజాడ కళాక్షేత్రం నుంచి జిల్లా పరిషత్ వరకు నిరసన కార్యక్రమం ఈస్ట్ ఇంచార్జి మళ్లీ అప్పారావుభారీ ఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు👉గుంటూరు:గుంటూరు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినంపాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోతన మహేష్ ,గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు👉విజయవాడతూర్పు నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంభారీ ర్యాలీ నిర్వహించిన వై ఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు👉గన్నవరంఎమ్మార్వో ఆఫీస్ ముందు బైటాయించి నిరసన తెలుపుతున్న పేర్ని నానిముగ్గురు కలిసి ప్రజలను మోసం చేశారుజగన్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తా అని చెప్పారుజగన్ చెప్పిన అప్పులు కూడా తానే తీర్చుతానని చెప్పాడు 12 నెలల కాలంలో లక్ష 51వేల కోట్లు అప్పు చేసారు ఉచిత బస్సు తుస్సు మందిసంక్రాంతిలోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారురోడ్ల మీద తిరిగితే నడుం నొప్పులు వస్తున్నాయిపనులు పూర్తి అయినవి బిల్లులు ఇంకా రాలేదుపథకాలు అడిగితే ఖజానా ఖాళీగా ఉందిరూపాయి లేదని చెపుతారులోకేష్ పవన్ చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారులోకేష్ భార్య పిల్లలను చూడడానికి, చంద్రబాబు సొంత ఇల్లు చూడనైకి ప్రజల సొమ్ముతో తిరుగుతాడుఅమ్మ ఓడికి ఇవ్వలేదు ఒక్కరు నోరు మెదపరుదోచుకున్న డబ్బు దాచుకోవడానికి ప్రత్యేక విమానంలో తిరుగుతారుచికెన్లో కూడా కమిషన్ అడుగుతారుMla లు MLC లు బ్రాందీ యాపరంలో మునిగి తెలుతున్నారు ప్రజలనే కాదు దేవుడిని కూడా మోసం చేస్తున్నారురాష్ట్రంలో ఉన్న దేవుడి ఆలయాలను దోచేస్తున్నారుదేవుడి ఆస్తిని కూడా నామినేషన్ పద్దతిలో అద్దెకు 99 ఏళ్లకు ఇస్తామని అంటున్నారుఅన్ని మతాలు మావే అని ఇప్పుడు హిందువులకు మాత్రమే అంటున్నారుమోడీని, మోడీ భార్యని తిట్టి. మోడీకి చంద్రబాబు, పవన్ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు లోకేష్ ధగాకోరు అవినీతి పరుడు అన్న పవన్ చంద్రబాబు మరో 15ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు లక్ష కోట్లు అప్పు చేసి రాష్టాన్ని అప్పుల పాలు చేసిన కూటమి దిగిపోవాలిగన్నవరంలో తప్పుడు కేసులు లేవని చర్చకు సిద్ధం అన్న నేత చర్చకు రమంటే పారిపోయాడు వంశీపై తప్పుడు కేసులు పెడుతున్నారు 2019లో పట్టాలు దొంగపట్టాలను ఇప్పుడు చంద్రబాబుకి గుర్తుకు వచ్చింది తప్పు ఉంటే MROని జైల్లో వేయాలని వంశీపై తప్పుడు కేసు పెట్టాడు ఆస్తి తగదాలో ఇప్పుడు వంశీపై కేసుపెట్టారు వంశీ పై 11 కేసులు పెట్టారు మైనింగ్ కేసులో అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు వంశీపై పెట్టిన ప్రతి కేసు తప్పుడు కేసు.. దొంగ కేసు.. కూటమి తక్షణమే హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తాం కూటమి పతనానికి గన్నవరంలో నాంది పడింది ప్రజల అగ్రహావేశాలలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది👉ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా ప్రారంభమైన వెన్నుపోటు దినంమైలవరం పట్టణంలో మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమంభారీగా హాజరైన కార్యకర్తలు అభిమానులు నాయకులుకూటమి పాలనను నిరసిస్తూ నినాదాలు👉అనంతపురం:చంద్రబాబు మోసాలపై ఉరవకొండలో వెన్నుపోటు దినంవైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉరగాద్రి ఫంక్షన్ హాల్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన.👉అనంతపురం: రాయదుర్గంలో వెన్నుపోటు దినంవైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమంవినాయక సర్కిల్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన👉గన్నవరంవైఎస్సార్ ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమంకార్యక్రమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నానివెన్నుపోటు కార్యక్రమానికి భారీగా హాజరైన వైఎస్సార్సీపీ కార్యకర్తలువైఎస్సార్‌సీపీ కార్యాలయం నుండి ఎంఆర్ఓ ఆఫీస్‌కు ర్యాలీగా బయలుదేరిన పార్టీ శ్రేణులు👉విశాఖ:పశ్చిమ నియోజకవర్గంలో వెన్నుపోటు నిరసనగాజువాక డిపో వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలు,నాయకులు సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్ 👉కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ..పార్టీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ భారీ ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు సబ్ కలెక్టర్‌కు మెమోరాండం అందజేత 👉అన్నమయ్య జిల్లా:రాజంపేటలో పెద్ద ఎత్తున వెన్నుపోటు దినం వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలో ఎంపీ మేడా రఘునాథ రెడ్డి, ఎంఎల్ఏ ఆకేపాటి అమరనాథ్ రెడ్డి,ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూటమి పాలనపై నిరసనగా విశేషంగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు, పట్టణ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలో ప్రజలు పాల్గొంటున్నారు👉తిరుపతి: ఈ ప్రభుత్వంపై ప్రజలు పూరిస్తున్న మొదటి శంఖారావంచంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంటాంమాపై తప్పుడు కేసులు పెట్టినా ప్రజలు పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటాంప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు, అమ్మకు వందనం, నిరుద్యోగులకు 3వేల రూపాయలు ఇవ్వలేదుఏడాది కాలంలో పార్టీ నాయకులపై 2666 పై కక్ష్య సాధింపు చర్యలు చేశారు796 మందిపై హత్య ప్రయత్నం చేశారు 380 మందిని అరెస్ట్ చేయించారుఅక్క చెల్లెమ్మలు తో ఈరోజు నుంచి పోరాటాలు ప్రారంభం అయ్యాయితిరుపతిలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా పోరాటాలు చేస్తాం , వారికి అండగా నిలుస్తాముడాక్టర్ శిరీష, మేయర్ కామెంట్స్వైఎస్ జగన్ పిలుపుతో వెన్నుపోటు దినంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారుఅమలు కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారుసంక్షేమ పథకాలు ఇచ్చి పేదలను ఆదుకోవాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు ఈరోజు కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందిభూమన అభినయ్ రెడ్డి ఈరోజు తిరుపతి లో ఈ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకతతో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారురాష్ట్రంలో మొదటిగా ప్రభుత్వంపై గళం విప్పిన నియోజకవర్గం తిరుపతి కూటమి ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూనే ఉంటాం👉శ్రీసత్యసాయి జిల్లా:పెనుకొండలో చంద్రబాబు మోసాలపై వెన్నుపోటు దినం కార్యక్రమంమాజీమంత్రి, జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో భారీ ర్యాలీపార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ. నిరసన ప్రదర్శన.👉వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో..పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంకూటమి వైఫల్యాలకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలువెన్నుపోటు దినం సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగంఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారుబాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారుగత ఐదు సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వం మూడు లక్షల కోట్లు పైగా అప్పు చేసిందిబాబు ప్రభుత్వం ఏడాదిలోనే లక్ష 55000 కోట్లు అప్పు చేసిందిఇంత అప్పు చేసిన ప్రజలకు ఒక పథకం అందివ్వలేదుమహిళలకు ఉచిత బస్సు, నెలకు 1500, రైతన్నలకు ఏడాదికి 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు.పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుదిపులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు అయితే మిగిలిన 10% పనులను ఈ ప్రభుత్వం చేయలేదు 👉అనంతపురం జిల్లా:కళ్యాణదుర్గం మండల కేంద్రంలో చంద్రబాబు మోసాల పై మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ విన్సెంనెట్ పెరర్ విగ్రహం నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన👉అనంతపురం గుంతకల్లులో చంద్రబాబు మోసాలపై గుంతకల్లులో వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన. పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి.👉శ్రీ సత్య సాయి జిల్లాలో.. చంద్రబాబు మోసాలపై వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్ రెడ్డి వైఎస్ఆర్సిపీ నేతలు వెన్నపూస రవీందర్ రెడ్డి, పూల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన👉వైఎస్సార్ జిల్లాలో..వైఎస్సార్ పార్టీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన వెన్నుపోటు దినం ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న వైఎస్సార్ పార్టీ అభిమానులుప్రొద్దుటూరు శివాలయం సెంటర్ నుండి మునిసిపల్ కార్యాలయం వరకు ర్యాలీమునిసిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వనున్న మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు👉శ్రీ సత్యసాయి జిల్లా: చంద్రబాబు మోసాలపై పుట్టపర్తి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ👉అనంతపురంలో.. చంద్రబాబు మోసాలపై వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, అనంతపురం నగరంలోని చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ దాకా నిరసన ప్రదర్శన👉తిరుపతి, సత్యనారాయణపురంలో.. సత్యనారాయణ పురం సర్కిల్ నుంచి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో వెన్నుపోటు దినోత్సవం నిరసన ర్యాలీ కార్యక్రమం. పాల్గొన్న భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు👉విజయనగరం జిల్లా, బొబ్బిలిలో..బొబ్బిలిలో మొదలైన ర్యాలీబొబ్బిలి వైయస్సార్సీపి ఆద్వర్యంలో వెన్నుపోటు దినం ర్యాలీ.అబద్దపు హామీల కూటమి ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ నిరసన.హాజరైన మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, భారీ ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు.👉అనకాపల్లి. నర్సీపట్నంవెన్నుపోటు కార్యక్రమంనకు ఆటంకాలు పెడుతున్న కూటమి ప్రభుత్వం.నర్సీపట్నం లో నిరసనకు బైక్ ర్యాలీ కి నెల రోజులముందు దరఖాస్తు చేసిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్.నిన్నటి వరకు సమాధానం చెప్పని పోలీస్.నిన్న సాయంత్రం బైక్‌లతో కాకుండా పాదయాత్ర కు మాత్రమే అనుమతి అంటూ నోటీసులు ఇచ్చిన పోలీస్.ర్యాలీ కి వస్తున్న ప్రజలపై కేసులు రాస్తూ భయాందోళన కలిగిస్తున్న పోలీసులు.👉అనంతపురం:మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినంచంద్రబాబు సర్కార్ మోసాలపై యాడికిలో నిరసన కార్యక్రమం ఏర్పాట్లు ఏర్పాట్లు చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అప్రమత్తమైన పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ ఇప్పటికే తాడిపత్రి నియోజకవర్గంలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి హైకోర్టు అనుమతిఅయినా, అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం 👉విజయనగరం జిల్లా: శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణనేడు విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలుకూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ నిరసనలుచీపురుపల్లిలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంపాల్గొననున్న శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ 7 వేల కోట్లు మంగళవారం అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం7 వేల కోట్లు మంగళవారం అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వంఆర్బీఐ సెక్యురిటీల వేలం ద్వారా అప్పుల సమీకరణచంద్రబాబు సీఎం అయ్యాక రికార్డ్ స్థాయిలో అప్పులుఇప్పటివరకు లక్ష 51 వేల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వంప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా రికార్డ్ స్థాయిలో అప్పులు చేసిన ప్రభుత్వంఏపీ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటునమ్మించి.. నట్టేట ముంచిన బాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంసూపర్ సిక్స్ సహా 143 హామీలను తుంగలో తొక్కిన సీఎం చంద్రబాబు‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో నాడు ఇంటింటా బాండ్లు పంపిణీఏడాదిలో రూ.1,51,604 కోట్లు అప్పు చేసినా ఒక్క హామీ అమలు చేయని సర్కారుహామీల అమలుపై ప్రశ్నించే గొంతులను రెడ్‌బుక్ కుట్రలతో నొక్కేస్తున్న వైనంటీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై వైఎస్సార్సీపీ ఉద్యమబాటఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని వైఎస్ జగన్ పిలుపుఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలుతక్షణమే హామీలు అమలు చేయాలని కోరుతూ కలెక్టర్లకు, అధికారులకు ఆ హామీల డిమాండ్ పత్రాలు ఇవ్వనున్న నేతలు -
ప్రజలకే వెన్నుపోటు
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆ హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. ఇందులో భాగంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో వెన్నుపోటు దినంగా పాటిస్తూ.. అన్ని వర్గాల ప్రజలతో కలిసి భారీగా నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గాల కేంద్రాల్లోని ఉన్నతాధికారులకు వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ పత్రాలు అందించనున్నారు. పోలీసుల వేధింపులు, నిర్బంధాలను వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు లెక్క చేయకుండా ప్రజల పక్షాన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కదంతొక్కుతున్నాయి. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు. ఆ హామీలపై ప్రజలను నమ్మించేందుకు ఆ పథకాల వల్ల ఆ కుటుంబానికి ఒనగూరే ప్రయోజనంపై టీడీపీ నేతలు, కార్యకర్తల ద్వారా ఇంటింటా.. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో బాండ్లు పంపిణీ చేశారు. సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల్లో 143 హామీలు ఇస్తూ మేనిఫెస్టో విడుదల చేశారు. మోసపు హామీలతో ప్రజలను నమ్మించి, గోబెల్స్ సిగ్గుతో చచ్చిపోయేలా అబద్ధాలు వల్లె వేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.1,51,604 కోట్లు అప్పు చేసి టీడీపీ కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ‘నది దాటే వరకు ఓడ మల్లన్న.. నది దాటాక బోడి మల్లన్న’ సామెతను అవపోసన పట్టిన సీఎం చంద్రబాబు.. అప్పుల్లో రికార్డులు సృష్టించినా ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా తన నైజాన్ని చాటుకున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే.. మద్యపాన నిషేధం హామీకి తిలోదకాలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. 1999, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అదే రీతిలో తుంగలో తొక్కి ప్రజల చెవిలో పువ్వు పెట్టారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలదీ అదే పరిస్థితి. బాబు ష్యూరిటీ అంటే.. మోసం గ్యారంటీ అన్నది ప్రజలకు అర్థమైంది. వెన్నుపోటుకు అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్ తానేనని చంద్రబాబు ఎప్పటికప్పుడు చాటిచెప్పుకుంటూనే ఉన్నారు.తల్లికి వందనం పేరుతో అమ్మలకు మోసం స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఆ తల్లి ఖాతాలో జమ చేస్తామని సూపర్ సిక్స్ హామీల్లో చంద్రబాబు నమ్మబలికారు. కానీ.. ఇప్పటిదాకా ఈ పథకం కింద ఏ ఒక్కరికీ రూ.15 వేలు ఇచ్చిన పాపాన పోలేదు. తల్లికి వందనం పేరుతో అమ్మలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.మహిళలకు ద్రోహం ⇒ ఆడబిడ్డ నిధి కింద 19 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందిస్తామని సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా చెప్పారు. కానీ.. ఇప్పటిదాకా ఆడబిడ్డ నిధి ఊసే లేదు.. ⇒ మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఏడాది అయినా ఉచిత బస్సు జాడే లేదు. ⇒ ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని నమ్మబలికారు. గతేడాది కొందరికి ఉచితంగా ఒక సిలిండర్‌తో సరిపెట్టి, మహిళలకు సీఎం చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు. పెన్షన్ మాటే లేదు..అన్నదాతకు వెన్నుపోటు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సూపర్ సిక్స్ హామీల్లో చంద్రబాబు ప్రకటించారు. కానీ.. ఇప్పటిదాకా ఏ ఒక్క రైతుకూ రూ.20 వేలు అందించలేదు. తొలి ఏడాది రూ.20 వేల చొప్పున ఇవ్వాల్సిన రూ.10,718 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. రెండో ఏడాది సీజన్ ప్రారంభమైనా పైసా పెట్టుబడి సాయం అందించకుండా నిలువునా ముంచేశారు. ఐదేళ్లుగా పైసా భారం లేకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి వారిపై బీమా భారం మోపారు.ఖరీఫ్ 23 సీజన్‌కు సంబంధించి ప్రీమియం బకాయిలు చెల్లించక పోవడంతో రూ.1,385 కోట్ల మేర పంటల బీమా పరిహారం రైతులకు దక్కకుండా చేశారు. కరువు బకాయిలతో సహా గడిచిన ఏడాదిలో వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న 8.94 లక్షల మంది రైతులకు రూ.554 కోట్ల పంట నష్టపరిహారం ఎగ్గొట్టారు. ప్రభుత్వ నిర్వాకంతో దాదాపు 150 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఏ ఒక్కరికి పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర కల్పించకుండా రైతులను నట్టేట ముంచారు. ఆక్వా రైతులకు వెన్నుపోటు పొడిచారు. ఐదేళ్ల పాటు పాడి రైతులకు అండగా నిలిచిన అమూల్ ప్రాజెక్టును అటకెక్కించి.. కార్పొరేట్, ప్రైవేటు డెయిరీల దోపిడీ బారిన పడేలా చేశారు.నిరుద్యోగ భృతి పేరుతో యువతకు టోపీ సూపర్ సిక్స్ హామీల్లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని– ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందిస్తామన్న హామీ ఒకటి. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలో నిరుద్యోగుల సంక్షేమం కోసం ఒక్కపైసా కూడా విదిల్చలేదు. ఏపీలో గతేడాది 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి ఒకరిని గుర్తించినా, నెలకు రూ.3 వేల చొప్పున రూ.4,800 కోట్లు అయితే ఏడాదికి రూ.57,600 కోట్లు కేటాయించాల్సి ఉండగా మొండి చెయ్యి చూపించింది. 2025–26 బడ్జెట్‌కు వచ్చే సరికి కుటుంబాల సంఖ్య 1.70 కోట్లకు చేరింది. ఈ లెక్కన నెలకు రూ.5,100 కోట్లు చొప్పున ఏడాదికి రూ.61,200 కోట్లు నిరుద్యోగుల సంక్షేమానికి వ్యయం అవుతుంది. ఇచ్చిన హామీలో భాగంగా ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్లు నిరుద్యోగుల కోసమే వెచ్చించాలి. కానీ, చంద్రబాబు చాణిక్యంతో నిరుద్యోగులు ఏళ్ల తరబడి మోసపోతూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలోనూ దగాకు గురయ్యారు.జాబ్ క్యాలెండర్ హుష్‌కాకి..వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. 2019 అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అప్పటి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగులను నియమించారు. 2019–24 మధ్య శాశ్వత, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో 6,38,621 మందికి కొలువులిచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ద్వారా 30.99 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇదిలా ఉంటే.. ‘ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం.రికార్డు చేసుకో.. డేటు, టైము రాసుకో.. జగన్‌లా పారిపోయే బ్యాచ్ కాదు మేము’ అని చంద్రబాబు, లోకేష్ బీరాలు పోయారు. జనవరి పోయి 5 నెలలు దాటినా జాబ్ కేలండర్ దేవుడెరుగు.. ఒక్క ఉద్యోగం భర్తీ చేసింది లేదు. ఏపీపీఎస్సీ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. పైగా గత ప్రభుత్వంలో ఇచి్చన గ్రూప్–1, 2 మెయిన్స్‌ను పలుసార్లు వాయిదా వేసి, అభ్యర్థులను నిలువునా మోసం చేసి గ్రూప్–2 మెయిన్స్ నిర్వహించారు. సంస్కరణల పేరుతో గ్రూప్–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో కలిపే నిర్ణయం తీసుకుని గ్రామీణ నిరుద్యోగులకు అన్యాయం చేసేందుకు ప్రణాళిక వేశారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ దాదాపు వెయ్యి పోస్టుల భర్తీకి అనుమతించింది. వాటికి నోటిఫికేçÙన్లు ఇచ్చేందుకు కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. బాబొచ్చారు.. జాబేదీ? బాబు వస్తే.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కలి్పస్తామని కల్లబొల్లి మాటలు చెప్పారు. ఏడాదయినా ఒక్కరికీ ఉద్యోగం వచి్చంది లేదు. ఉద్యోగం ఇచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని సైతం గాలికి వదిలేశారు.బట్టబయలైన దుష్ప్రచారంగుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో 2019 ఆగస్టు 15న నాటి సీఎం వైఎస్ జగన్ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2.60 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారకముందే తలుపుతట్టి వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు పెన్షన్ అందించడం దగ్గరనుంచి అన్ని ప్రభుత్వ సేవలను వాలంటీర్ల ద్వారా సమకూర్చారు.పరిపాలన సంస్కరణల్లో ఇదో విప్లవమనే ప్రశంసలు పొందారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండడంతో ఆ వ్యవస్థపై అప్పట్లో చంద్రబాబు, పవన్ విషం చిమ్మారు. 2023 అక్టోబరు 7న రెండో విడత వారాహి యాత్రలో భాగంగా ఏలూరు రోడ్ షోలో.. 33 వేల మంది మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమంటూ పవన్ హేయంగా మాట్లాడారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 నవంబరు 16న అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు 2019–24 మధ్య మహిళల అక్రమ రవాణా కేసులు కేవలం 34 మాత్రమేనని.. 46 మంది బాధితులని వెల్లడించడం గమనార్హం. ఇసుక దోపిడీ.. అడ్డగోలు తవ్వకాలువైఎస్సార్సీపీ ప్రభుత్వం తక్కువ ధరలకు ఇసుక సరఫరా చేసింది. దీంతో రూ.750 కోట్ల ఆదాయం వచి్చంది. 2024 అవసరాల కోసం 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ పెట్టింది. కూటమి ప్రభుత్వం వచి్చన కొద్ది రోజుల్లోనే 80 లక్షల టన్నుల ఇసుకను పచ్చ మాఫియా దోచేసి, జేబులు నింపుకొంది. ఉచిత ఇసుక ముసుగులో నదులు, వాగులు, వంకలను చెరబట్టిన ఇసుక మాఫియా పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా తవ్వేసి.. అధిక ధరలకు అమ్ముకుంటూ భారీఎత్తున దోచేస్తోంది. లిక్కర్ నుంచి సిలికా, క్వార్ట్జ్ వరకు వ్యవస్థీకృతమైన పచ్చ మాఫియా ఆకాశమే హద్దుగా దోపిడీకి పాల్పడుతూ రాష్ట్ర ఆదాయానికి గండికొడుతోంది.రెడ్‌బుక్‌తో టెర్రర్ సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచి్చన 143 హామీల అమలు.. పరిపాలన వైఫల్యాలపై ప్రశి్నంచే గొంతును నొక్కేందుకు రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణించి వెంటాడి, వేటాడి హత్యలు, హత్యాయత్నాలు, దాడులతో భీతావహ వాతావరణం సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో 390 మందిని చంపేశారు.హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు 766 మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు బనాయించి.. 500 మంది నాయకులు, కార్యకర్తలను జైలుకు పంపారు. సోషల్ మీడియా కార్యకర్తలు 440 మందిపై అక్రమ కేసులు పెట్టి.. 79 మందిని జైలు పాల్జేశారు. 11 మంది జర్నలిస్టులపై దాడి చేశారు. 63 అక్రమ కేసులు నమోదు చేసి.. 8 మందిని జైలుకు పంపారు. ప్రజాసంఘాల నాయకులపై 73 అక్రమ కేసులు పెట్టి.. ఇద్దరిని జైలుపాల్జేశారు. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198 నమోదయ్యాయి.మద్యం మాఫియా బయటకు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాతాళంలో పాతిపెట్టిన ప్రైవేటు మద్యం సిండికేట్ భూతానికి చంద్రబాబు సర్కారు మళ్లీ ఊపిరిపోసి వదిలింది. మద్యం ఏరులై పారించడం ద్వారా భారీ దోపిడీకి టీడీపీ మద్యం సిండికేట్ పన్నాగం పన్నింది. ప్రైవేటు దుకాణాలను తిరిగి తెచి్చంది. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలే ఏకపక్షంగా మొత్తం 3,396 మద్యం షాపులను దక్కించుకున్నారు. ఇతరులు ఎవరూ దరఖాస్తు చేయకుండా టీడీపీ గూండాలతో పాటు పోలీసులతో బెదిరింపులకు పాల్పడ్డారు. 3,396 మద్యం దుకాణాల పరిధిలో దాదాపు 55 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసింది.ఎంఆర్పీ కంటే 20 శాతం నుంచి 30 శాతం వరకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తోంది. అన్ని దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు అనుమతినివ్వాలని నిర్ణయించింది. 2024–25లో మద్యం విధానం ద్వారా ఎక్సైజ్ శాఖకు వచి్చన రూ.24 వేల కోట్ల ఆదాయాన్ని 2025–26లో రూ.35 వేల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏటా కనీసం రూ.10 వేల కోట్లు చొప్పున మద్యం ఆదాయం పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2028–29 నాటికి ఏకంగా రూ.75 వేల కోట్లకు చేరాలన్న ఉద్దేశంలో ఉంది.రాజధాని నిర్మాణంలో అడ్డగోలు దోపిడీ..తాను, తన సన్నిహితులు, బినామీలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి తక్కువ ధరలకే కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో నుంచి అధిక వడ్డీలకు రూ.31 వేల కోట్లు అప్పు తెస్తున్నారు. మరో రూ.21 వేల కోట్లు అప్పునకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారు. రాజధాని తొలి దశ నిర్మాణానికి రూ.77 వేల కోట్లు అవసరమని ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజంటేషన్ ఇచ్చారు.అధిక వడ్డీలకు తెచి్చన నిధులతో.. అంచనా వ్యయాన్ని పెంచేసి.. అధిక ధరలకు సిండికేటు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి నీకింత నాకింత అంటూ పంచుకుంటున్నారు. దేశంలో ఎన్హెచ్ఏఐ కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున జాతీయ రహదారులను నిరి్మస్తుంటే.. రాజధానిలో మాత్రం కి.మీ.కు రూ.66 కోట్లు చొప్పున కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టేశారు. చదరపు అడుగు రూ.1,800 నుంచి రూ.2 వేల లోపు వ్యయంతో భవనాలను నిరి్మంచవచ్చు. కానీ.. ఏకంగా చదరపు అడుగు రూ.పదివేల చొప్పున పనులను కాంట్రాక్టర్లకు అప్పగించేశారు. ఇదంతా చూస్తే.. రాజధాని నిర్మాణ పనుల్లో అధిక వడ్డీలకు తెచి్చన అప్పులను ఏ స్థాయిలో దోచుకుంటున్నారో స్పష్టమవుతోంది. పప్పులు బెల్లాల్లా.. అత్యంత విలువైన భూములను సన్నిహితులు, బినామీలకు పప్పులు, బెల్లాల్లా టీడీపీ కూటమి ప్రభుత్వం పంచిపెడుతోంది. ఊరూపేరూ లేని ఉర్సా అనే సంస్థకు రూపాయికి ఎకరం చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఉర్సా.. మంత్రి నారా లోకేశ్ సన్నిహితుడిది. ఇక లులూ సంస్థకు మాల్ నిర్మాణానికి విశాఖలో రూ.2 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా అప్పగించేస్తుండడం భూదోపిడీకి పరాకాష్ట. మొదటి సంతకమే దగా.. దగాఅధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పిన చంద్రబాబు సీఎం హోదాలో 16,437 పోస్టుల భర్తీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. గత ఏడాది డిసెంబరు నాటికి భర్తీ చేస్తామని హామీ ఇచ్చినా దాదాపు 11 నెలలు కాలయాపన చేసి మార్చి చివరి వారంలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులోనూ అనేక కొర్రీలు పెట్టారు. 50 శాతం అర్హత మార్కుల నిబంధన తెచ్చి అర్హులైన డీఈడీ, బీఈడీ జనరల్ అభ్యర్థులు 3 లక్షల మందిని డీఎస్సీకి దూరం చేశారు. టెట్ ఉత్తీర్ణులైన అందరికీ డీఎస్సీ రాసే అవకాశం ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదు.ఎన్నడూ లేని విధంగా ఎస్జీటీ పోస్టులకు ఇంటరీ్మడియట్‌లో, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి చేశారు. 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ చేసినవారికి ఈ నిబంధన వర్తించదని 2019లో కేంద్రం గెజిట్ విడుదల చేసింది. ఇవేమీ పట్టించుకోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థుల ఉసురు తీసింది.తొలుత ఇంటర్, గ్రాడ్యుయేషన్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, రిజర్వుడ్ అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులు తప్పనిసరి చేసింది. అనంతరం టీచర్ అర్హత పరీక్ష (టెట్)లో రిజర్వుడ్ అభ్యర్థులకు 40 శాతం మార్కులే పేర్కొన్నందున డీఎస్సీ అర్హత మార్కులను 40 శాతానికి తగ్గిస్తూ అనుబంధ జీవోలు ఇచి్చంది. జనరల్ అభ్యర్థులకు మాత్రం అర్హత మార్కులను 50 శాతంగా అలాగే ఉంచింది. జనరల్ అభ్యర్థులకు టెట్‌లో అర్హత మార్కులు 45 శాతం ఉన్నా ఆ మేరకు తగ్గించకపోవడం గమనార్హం.పాలనలో అట్టర్ ప్లాప్.. డైవర్షన్ పాలిటిక్స్ సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచి్చన 143 హామీల అమలు చేయకపోవడం.. పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగుతున్నారు. కూటమి వచి్చన వెంటనే పచ్చమూకలు.. వెంటాడి, వేటాడి 36 మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చంపేశాయి. 300 మంది నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి.ఈ దారుణాన్ని దేశానికి చాటిచెప్పేందుకు జూలై 24న ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నాకు దిగారు. దీన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యులంటూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగారు. కృష్ణా, బుడమేరు వరద నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవడంతో విజయవాడను వరద చుట్టుముట్టి 50 మంది పైగా బలితీసుకుంది. దీన్నుంచి పక్కదారి పట్టించేందుకు ప్రకాశం బ్యారేజీని బద్దలు కొట్టేందుకు వైఎస్సార్సీపీ నేతలు పడవలతో గేట్లను ఢీకొట్టే కుట్ర చేశారని ఆరోపించారు. వంద రోజుల పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి.. తిరుమల లడ్డూ కల్తీ అంటూ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారు. ఇంటింటికీ కరెంట్ షాక్ కరెంటు చార్జీలు పెంచం.. తగ్గిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజలను నమ్మించి.. ఓట్లేయించుకుని గెలిచాక.. కరెంటు చార్జీలను పెంచేసి.. ఇంటింటికీ కరెంట్ షాక్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల భారాన్ని మోపారు. గతేడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని వసూలు చేస్తుండగా, ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. దీంతో ప్రజలకు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి.ఇంటింటికీ రేషన్ రద్దు.. మద్యం సరఫరా ఇంటి వద్దకే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే ఎండీయూ(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వ్యవస్థను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. 9,260 ఎండీయూ యూనిట్లను రద్దు చేయడంతో 20 వేల మంది రోడ్డున పడ్డారు. ఎండీయూ వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రేషన్ బియ్యం, సరుకులు సరఫరా చేసేది. ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేయడంతో మళ్లీ రేషన్ దుకాణం వద్ద గంటల కొద్దీ లబ్ధిదారులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. అయితే బెల్ట్ షాపుల ద్వారా ఇంటింటికీ మద్యం మాత్రం నిరాటంకంగా సరఫరా చేస్తోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.వలంటీర్లపై సమ్మెట దెబ్బ తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు ప్రతి నెల ఇచ్చే గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని.. నెలకు రూ.50 వేలు సంపాదించేలా ఆదాయ మార్గాలు కల్పిస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతి నెలా రూ.పది వేల వేతనం ఇస్తామని పవన్ కళ్యాణ్ సైతం వాగ్దానం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను రద్దు చేసి వారిని నట్టేట ముంచేశారు. అప్పుల్లో చంద్రబాబు రికార్డులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందని.. శ్రీలంకగా మార్చేసిందంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు తీవ్ర స్థాయిలో దుష్ఫ్రచారం చేశారు. ఈ మేరకు ఎల్లో మీడియా సైతం తప్పుడు కథనాలను వండివార్చింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రంలో రాష్ట్ర అప్పు రూ.9,74,556 కోట్లు అంటూ ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.పది లక్షల కోట్లు అని వెల్లడించారు. 2024–25 బడ్జెట్ ప్రవేశపెడితే.. రాష్ట్ర అప్పుపై వాస్తవాలు బహిర్గతమవుతాయనే నెపంతో జాప్యం చేశారు.చివరకు గతేడాది నవంబర్ 11న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లేనని అధికారికంగా అంగీకరించారు. కానీ.. ఆ తర్వాత కూడా అప్పులపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూనే వచ్చారు. మొన్నటికి మొన్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన రాష్ట్ర అప్పు రూ.9.74 లక్షల కోట్లు అంటూ చంద్రబాబు బొంకారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు, గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పు మొత్తం కలిపి 2024 మార్చి నాటికి రూ.7,21,918 కోట్లే. ఈ లెక్కన 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు మాత్రమే. ఇందులో రూ.2.73 లక్షల కోట్లను సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో జమ చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.1,51,604 కోట్లు అప్పు చేసింది. సంపద సృష్టిలో తిరోగమనం సంపద సృష్టించి.. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త సంక్షేమ పథకాలు ఇస్తానని చంద్రబాబు నమ్మలికారు. కానీ.. సంపద సృష్టి మాటలకే పరిమితమైంది. సంక్షేమ పథకాలపై ప్రశ్నించిన ప్రజలనుద్దేశించి.. సంపద సృష్టించడం ఎలాగో తన చెవిలో చెప్పాలంటూ చంద్రబాబు రంకెలేస్తున్నారు. వాస్తవానికి.. రాష్ట్రాన్ని 2019–24 మధ్య సంక్షేమం, అభివృద్ధిని మేళవించి వైఎస్ జగన్ ప్రగతిపథంలో నిలిపారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారు.లోక్‌సభ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో.. కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిరాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. 2023–24లో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించి.. 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. 2024–25లో మరో ఐదు కాలేజీలు ప్రారంభించడానికి సిద్ధం చేశారు. కానీ.. కూటమి సర్కార్ ఒక కాలేజీ మాత్రమే ప్రారంభించి.. 50 సీట్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. మిగతా మెడికల్ కాలేజీల పనులను ఆపేసింది. ప్రైవేటుపరం ముసుగులో సన్నిహితులు, బినామీలకు వాటిని కట్టబెట్టే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై యూటర్న్ ప్రజల భూములు లాక్కునేందుకే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తెచ్చారని, దస్తావేజులు కూడా ప్రభుత్వం వద్దే ఉంటాయని దారుణమైన అబద్ధాలతో కూటమి నేతలు ప్రజలను భయాందోళనలకు గురిచేశారు. 13 వేల గ్రామాలకుగాను 8 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి తెచ్చింది గత ప్రభుత్వం. ప్రతి రైతుకు ఒక యూనిక్ ఐడీ నెంబర్ ఇవ్వడంతోపాటు భూములను జియో ట్యాగింగ్ చేసి సరిహద్దు రాళ్లు పాతారు. డ్రోన్, విమానాలతో కోటి ఎకరాలను కొలిచారు. వివాదాలకు ఆస్కారం లేని రీతిలో టైటిల్ గ్యారంటీ కల్పించేందుకు టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చారు. కానీ చంద్రబాబు రాజకీయ కుట్రలో ఈ చట్టం బలైపోయింది. తాను చెప్పిన అబద్ధాలను నిజమని చెప్పుకునేందుకు అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని రద్దు చేశారు. ఈ చట్టంతో ముడిపడి ఉన్న భూముల రీ సర్వేను కూడా రద్దు చేయాలని ప్రయత్నించారు. కానీ అది విజయవంతమవడం, కేంద్ర ప్రభుత్వం జగన్ హయాంలో చేపట్టిన సర్వేకు ఇప్పుడు రూ.500 కోట్ల వరకు నిధులు విడుదల చేయడంతో యూటర్న్ తీసుకుని కొనసాగిస్తున్నారు. -
నేడు ఊరూరా వెన్నుపోటు దినం
చిత్తూరు అర్బన్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజలను అబద్దపు హామీలతో మోసగించి, ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినంను నిర్వహిస్తోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపుతో జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ సమన్వయకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసనలు చేపడుతున్నారు.నిరసనలు తెలిపే ప్రాంతాలు ఇవే..● చిత్తూరులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 9.30 గంటలకు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. వేలూరు రోడ్డుపై పాదయాత్రగా కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరుకుంటారు. అక్కడ నిరసన తెలిపి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తారు.● పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఉదయం 9 గంటలకు పట్టణంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీగా బయలుదేరి, అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీ నిర్వహిస్తారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి వినతిపత్రం అందచేస్తారు.● నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు టవర్ క్లాక్ సెంటర్లోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి.. అక్కడి నుంచి నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేస్తారు. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చి, ఓంశక్తి ఆలయ కూడలి మీదుగా రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు ర్యాలీ చేపట్టనున్నారు.● గంగాధర నెల్లూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సమక్షంలో అయిదు మండలాల్లోని నాయకులు ఉదయం 9 గంటలకు కొత్తపల్లెమిట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీగా వెళ్లి గంగాధర నెల్లూరులో అధికారులకు వినతిపత్రం ఇస్తారు.● పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాళ్యంలో మాజీ ఎమ్మెల్యే డా.సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు పార్టీ కార్యకర్తలు, ప్రజలతో కలిసి అంబేడ్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం కార్యాలయం వద్ద నిరసన తెలిపి వినతిపత్రం అందజేస్తారు.● పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు పట్టణ నడిబొడ్డు నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం కార్యాలయం ఎదుట నిరసన తెలిపి వినతిపత్రం ఇస్తారు.● కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్టాండులోని వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పించి ర్యాలీగా బయలుదేరుతారు. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుచేయాలని వినతిపత్రం ఇస్తారు.‘ఖాకీ’లపై ప్రభుత్వం ఒత్తిడివైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వెన్నుపోటు దినంకు ఆ పార్టీ నాయకులు, తటస్తులు వెళ్లకుండా చేయాలని ప్రభుత్వం నుంచి పోలీసులకు అనధికారిక ఆదేశాలు అందాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ అమల్లో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ర్యాలీలు, ఊరేగింపులు నిషేధిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రధాన నాయకులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి, ర్యాలీలు చేయొద్దని పోలీసులు హుకు జారీ చేస్తున్నారు. అయినా సరే తమ పార్టీ నాయకుడు ఇచ్చిన పిలుపుతో నిరసనలో పాల్గొనే తీరుతామని కార్యకర్తలు పోలీసులకు తెగేసి చెబుతున్నారు. -
వెన్నుపోటు దినంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: కూటమి పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని.. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని.. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎంతమాత్రం మంచిది కాదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన.. నడిరోడ్డులో యువకులపై పోలీసుల థర్డ్ డిగ్రీ దాష్టికాన్ని ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. మా హయాంలో ప్రతీ వర్గానికి సంక్షేమం అందింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Govt)లో ప్రతి వ్యవస్థ నీరుగారింది. ఫీజురీయింబర్స్‌మెంట్ కింద 3,600 కోట్ల రూపాయిలు బకాయిలు పేరుకుపోయాయి. విద్యారంగం పూర్తిగా నాశనమైంది. వైద్య రంగం దివాళా తీసింది. రైతు భరోసా లేదు. ఉచిత పంటల బీమా, ఈ-క్రాప్ లేదు. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏమాత్రం మంచిది కాదు. ఎంత త్వరగా సాగనంపితే ప్రజలకు అంత మేలు. రేపు రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినం(Vennupotu Dinam) నిర్వహిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో పాల్గొనాలి అని జగన్ పిలుపు ఇచ్చారు.ఇదీ చదవండి: ప్రశ్నించడమే ఆ యువకుల తప్పా? -
బాబు వెన్నుపోటు: ఏపీలో తిండిగింజలకు పరేషాన్ (చిత్రాలు)
-
AP Belt Shops: ఏడాది పాలనలో దశాబ్దాల విధ్వంసం
-
ఏపీలో తాలిబాన్లను తలదన్నేలా ఎల్లోబాన్ల అరాచకాలు
-
బాబు పాలన చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది : ఎన్ఆర్ఐలు
సిడ్నీ: ఏపీలో కొనసాగుతున్న రాక్షస పాలనతో ప్రజలు పడుతున్న బాధలను చూస్తుంటే తమ కడుపు తరుక్కుపోతుందని ఆస్ట్రేలియా ఎన్నారైలు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాలను చూసి చలించిపోతున్నామన్న ఎన్ఆర్ఐలు.. మరో నాలుగేళ్లు ఈ రాక్షస పాలనలో బాధలు పడడం వారి దురదృష్టమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ రాజకీయాలతో కూటమి నేతలు కాలయాపన చేస్తున్నారని ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ కూడా సాధించలేదని వారు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి , హరి ఎడనపర్తి, దూడల లోక కిరణ్ రెడ్డి, కృష్ణ చైతన్య కామరాజు, బుర్ర ముక్కు రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు -
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ‘బాబు’
కడప సెవెన్‌రోడ్స్: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా వంచించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా ధ్వజమెత్తారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుని ఆయనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసగించారని విమర్శించారు. అందుకే ఈనెల 4వ తేదీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయిన సందర్భాన్ని పురస్కరించుకుని వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.ఎన్నికల హామీలు తుంగలో..తాను అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు.. లేదంటే రూ. 3 వేల భృతిగానీ చెల్లిస్తామని బాబు చెప్పిన హామీ ఏమైందని అంజద్‌బాషా ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద యేటా రూ. 20 వేలు చొప్పున పెట్టుబడిసాయం అందించడం ద్వారా రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామి ఎక్కడికి పోయిందన్నారు. పంటలకు గిట్టుబాటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. పంటలు నష్టపోయిన వారికి పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడం లేదన్నారు. ఒక ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకునే వారు ఉంటే అంత మందికి తల్లికి వందనం కింద రూ. 15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. సీ్త్ర శక్తి కింద 18+, 60 ఏళ్లలోపు మహిళలకు రూ. 15 వేలు ఇస్తామని మాట తప్పారని విమర్శించారు. సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని చెప్పి కొందరికి మాత్రమే ఇప్పటికి ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇంతవరకు అమలు చేయలేదన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వకపోవడం వల్ల చాలామంది పేద విద్యార్థులు మధ్యలోనే చదువులుకు స్వస్తి చెప్పే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వసతి దీవెన పూర్తిగా రద్దు చేయడం అన్యాయమన్నారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పెన్షన్ ఇస్తామన్న హామి ఇంతవరకు అమలు కాలేదన్నారు. ఉద్యోగులకు నాలుగు డీఏ బకాయిలు, పీఆర్సీ, ఇంటీరియం రిలీఫ్ ఇవ్వలేదన్నారు. ఉద్యోగులకు రూ. 20 వేల కోట్ల అరియర్స్ ఇవ్వాల్సి ఉందన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే రేషన్ సరఫరా చేశారని తెలిపారు. కానీ చంద్రబాబు రేషన్ డోర్ డెలివరీ రద్దు చేసి పాత పద్దతిని పునరుద్దరించడం వల్ల పేదలు, మహిళలు రాత్రి 8.30 గంటల సమయంలో కూడా ఎఫ్పీ షాపుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.సమావేశంలో వైఎస్సార్ సీపీ చేతివృత్తుల విభా గం రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్, కార్పొరేటర్ షఫీ, నాయకులు యానాదయ్య, వేణుగోపాల్ నాయక్, తోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.అమరావతి తప్ప సీమ, ఉత్తరాంధ్ర పట్టడం లేదుముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి తప్ప ఏమి పట్టడం లేదని అంజద్‌బాషా విమర్శించారు. తన కోటరీలో ఉన్న రియల్టర్లు, బాబు సామాజిక వర్గానికి చెందిన వారికి మేలు చేసేందుకే అమరావతి నిర్మిస్తున్నారని ఆరోపించారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అయితే ఎంతో వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని విస్మరించడం అన్యాయమన్నారు. టెన్త్ పరీక్షా ఫలితాలు వచ్చాక 66 వేల మంది విద్యార్థులు రీ కరెక్షన్ కోసం దరఖాస్తు చేయడం మంత్రి లోకేష్ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 4వ తేది ఉదయం 10 గంటలకు కడప నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిర్వహించనున్న ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
రేపు రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’.. డీజీపీకి వైఎస్సార్సీపీ లేఖ
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చక పోవడంతో పాటు, అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం బుధవారం (4వ తేదీ) నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త శాంతియుత ర్యాలీలకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది.పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరుతో విడుదలైన లేఖలో ముఖ్యాంశాలు ‘వెన్నుపోటు దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుత ర్యాలీలు నిర్వహించి, ఆయా చోట్ల ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ కార్యక్రమం కోసం ముందస్తు అనుమతి కోరుతూ, చాలా రోజులకు ముందే స్థానికంగా ఆయా పోలీస్ స్టేషన్లలో దరఖాస్తు చేసినా, ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు. నిరంకుశంగా వ్యవహరిస్తూ, మా పార్టీ కార్యక్రమం నిర్వహించకుండా చేయాలని చూస్తున్నారు. ఇది కచ్చితంగా ఇండియన్ పోలీస్ యాక్ట్, సెక్షన్– 30 ఉల్లంఘన కిందకే వస్తుంది. ప్రధాన విపక్షంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పూర్తి శాంతియుతంగా తాము తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి చట్ట ప్రకారం అనుమతి ఇవ్వాల్సి ఉన్నా, స్థానిక పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, మా విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదు. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేలా, తాము ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిర్వహించే ర్యాలీలకు స్థానికంగా పోలీసు అధికారులు అనుమతి ఇచ్చేలా ఆదేశించాలివ్వాలని వైఎస్సార్సీపీ కోరుతోంది. ఆ విధంగా ప్రభుత్వం పట్ల ప్రజలు తమ భావాన్ని వ్యక్తం చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తోంది’ అని పేర్కొన్నారు. -
ప్రజలకు ఏడాదంతా వెన్నుపోటే
సాక్షి, న్యూఢిల్లీ: మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మాయలోపడేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్సీపీ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి పేర్కొన్నారు. ఏడాదంతా సీఎం చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే పాలన సాగించారని మండిపడ్డారు. బాబు వెన్నుపోటు రాజకీయాలను ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ోమవారం ఢిల్లీలోని ఆమె నివాసంలో తనూజ రాణి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు జూన్ 4న ఏపీవ్యాప్తంగా ‘వెన్నుపోటు’ దినం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆరోజు ప్రజలంతా కూటమి మోసాల్ని నిలదీసేందుకు లోక్‌సభ నియోజకవర్గం కేంద్రాల్లో నిర్వహించే భారీ ర్యాలీకి హాజరై జయప్రదం చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.ఏడాది గడిచినా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఇంకా కల్ల»ొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వెన్నుపోటు దినాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగుతోందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాము వెన్నుపోటు దినాన్ని ఘనంగా నిర్వహించి, చంద్రబాబు మోసాలను ప్రపంచానికి చాటిచెబుతామని స్పష్టం చేశారు. -
మీ అనుభవం నేర్పింది ఇదేనా బాబూ?
సాక్షి, అమరావతి: ‘‘దశాబ్దాల రాజకీయ అనుభవంతో పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి పాలనపై లోతైన అవగాహన ఉందని మీరు చెప్పుకొంటున్నారు. కానీ, ఆ దశాబ్దాల అనుభవం ఈ ఏడాదిగా రాష్ట్రానికి ఏం ఇచ్చింది?’’ అంటూ ‘ఎక్స్’వేదికగా సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన రుణంలో.. కేవలం ఏడాదిలోనే టీడీపీ కూటమి సర్కారు 44 శాతం అప్పు చేసిందని దెప్పిపొడిచారు. ‘‘ఏడాదిగా మీ ప్రభుత్వం అడ్డగోలుగా, భారీగా అప్పు చేసినా సంక్షేమం ఊసేలేదు.అభివృద్ధి జాడే లేదు. దశాబ్దాల అనుభవం మీకు నేర్పింది ఇదేనా?’’ అంటూ వ్యంగ్యా్రస్తాలు సంధించారు. మీ ప్రభుత్వ ఆర్థిక అసమర్థతపై కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్), ఎంవోఎస్పీఐ (కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ) నివేదికలు దిగ్భ్రాంతికర వాస్తవాలను బహిర్గతం చేస్తున్నాయని తెలిపారు. కాగ్, ఎంవోఎస్పీఐ నివేదికలు, ఆ సంస్థలు వెల్లడించిన గణాంకాలను ఉటంకిస్తూ.. ఏడాదిగా చంద్రబాబు కూటమి ప్రభుత్వ ఆర్థిక అసమర్థతను కడిగేస్తూ ‘ఎక్స్’లో తన ఖాతాలో వైఎస్ జగన్ సోమవారం పోస్టు చేశారు. ఆ పోస్టులో ఏమన్నారంటే..1. జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి)లో ద్రవ్య లోటు 4.08 శాతం నుంచి ఏడాదిలోనే 5.12 శాతానికి పెరిగింది. 2. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 2.65 శాతం నుంచి ఏడాదిలోనే 3.61 శాతానికి చేరింది. 3. కరోనా మహమ్మారి వ్యాప్తి వంటి ప్రతికూల పరిస్థితులు లేనప్పటికీ జీఎస్డీపీలో అప్పుల వాటా 35.64 శాతానికి పెరిగింది. 4. 2024–25లో భారీగా చేసిన అప్పుల్లో కేవలం 23.49 శాతం మాత్రమే మూలధన వ్యయం కోసం ఖర్చు చేశారు. కానీ.., మా ప్రభుత్వ హయాంలో 33.25 శాతం మూల ధన వ్యయం చేశాం. -
‘ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి’
తాడేపల్లి : వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు(సోమవారం, జూన్ 2) వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా ఆధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులతో సజ్జల టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు బుధవారం(జూన్ 4వ తీదీ) చేపట్టబోయే వెన్నుపోటు దినం కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ రేపు మండల స్థాయిలో కూడా వెన్నుపోటు దినం పోస్టర్ రిలీజ్ చేయాలి. ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమం చేయాలి. ఎక్కడైనా అడ్డంకులు కల్పిస్తే న్యాయస్థానాల ద్వారా అధిగమిద్దాం. నిరసన ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ అధికారులకు వినతి పత్రం అందజేయాలి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడైన ఆపే ప్రయత్నం చేస్తే అక్కడ మీడియాతో మాట్లాడి వివరించాలి. ఎలాంటి శషబిషలు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రభుత్వంతో ఘర్షణ పడటానికి కాదు.. ప్రజల ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టాలి’ అని సజ్జల పేర్కొన్నారు. -
‘అధికారాన్ని అనుభవించడం కోసమే బాబు పనిచేస్తున్నారు’
కాకినాడ జిల్లా గత ఏడాది కాలంలో ఇచ్చిన హామాలను అమలు చేయకుండా కుడి, ఎడమలగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్ని దగా చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. ఈ రోజు(సోమవారం, జూన్2) కాకినాడ రూరల్‌లో వెన్నుపోటు దినం పోస్టర్‌ను ఆవిష్కరించారు కురసాల కన్నబాబు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఎన్ని మంచి పనులు చేసినా వాటిని చంద్రబాబు దుర్మార్గంగా చిత్రీకరించారు. చెప్పిన హమీని ఒక్కటైనా నెరవేర్చారా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పధకాలను నిలిపివేశారు. వైఎస్ జగన్ పై ఉన్న కోపాన్ని ప్రజలపై చూపిస్తున్నారు. అధికారాన్ని అనుభవించడం కోసమే గత ఏడాదిగా చంద్రబాబు పని చేశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి..రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు* అని విమర్శించారు. -
మందు.. బాబు
-
మహిళలకు ఉపాధి కల్పించటమంటే మద్యం అమ్మటమా బాబూ..
-
బాబు హయాం కన్నా జగన్ పాలనలో సగానికి తగ్గిన మద్యం అమ్మకాలు
-
ఆ రోజు జగన్ పై నిందలు వేశావ్ ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి?
-
జాబులు ఎందుకు తమ్ముళ్లు.. 24 గంటలు మద్యం ఉండగా!
-
మద్యం అక్రమ కేసు కుట్రకు మరింత పదును పెడుతోన్న చంద్రబాబు
-
ఆంధ్రప్రదేశ్ లో ఏరులై పారుతున్న మద్యం
-
కూటమి ప్రభుత్వం వేధింపులపై YSRCP కార్యకర్త ప్రవీణ్ సెల్ఫీ వీడియో
-
బాబుగారూ.. మీ అనుభవం ఏం నేర్పింది?
గుంటూరు, సాక్షి: చంద్రబాబు పాలన ఏడాదికి చేరువవుతున్న వేళ.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దశాబ్దాల అనుభవానికి ఏమైందని.. ఈ ఏడాది కాలంలోనే అడ్డగోలుగా అప్పులు చేసినా ప్రజలకు ఎలాంటి మంచి చేయలేకపోయారని ఎక్స్ ఖాతాలో లెక్కలతో సహా సోమవారం ఆయన ఓ పోస్ట్ చేశారు. ఏడాది పాలనలో ఏపీ ఆర్థిక స్థితి.. చంద్రబాబు ప్రభుత్వం దిగజార్చటంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. దశాబ్దాల మీ అనుభవానికి ఏమైంది?. రాజకీయానుభవంతో పాటు ముఖ్యమంత్రిగా పని చేసి పాలనను లోతుగా అర్థం చేసుకున్నానని మీరే తరచూ చెబుతుంటారు కదా. కానీ, ఆ అనుభవం ఈ ఏడాదిగా ఏం రాష్ట్రానికి ఏం ఇచ్చింది?. కేవలం ఈ ఏడాది పాలనలో మీరు చేసిన అప్పులు.. ఐదేళ్ల మా హయాంలో చేసిన అప్పుల మొత్తంలో 44 శాతంగా ఉంది. ఒకవైపు వాస్తవం ఇలా ఉంటే.. మరోవైపు ఈ ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షేమం జాడే లేదు. మీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేదనే వాస్తవాలను కాగ్, మోస్పి (CAG & MOSPI) గణాంకాలే చెబుతున్నాయి’’ అంటూ ఒక పోస్ట్ చేశారాయన. . @ncbn garu, you claim that you possess decades of experience as CM and your so-called deep understanding of governance, but what have those decades of experience delivered?In just one year, your Government availed a debt equivalent to 44% of the total debt our Government… pic.twitter.com/UD8lWn2SBE— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2025 -
అమాయక ప్రజలను బాబు మోసం చేశారు: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, రౌడీలు.. పోలీసుల రాజ్యమే నడుస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సోమవారం వెన్నుపోటు దినం (Vennupotu Dinam) నిరసన పోస్టర్ ఆవిష్కరణ జరిపి ఆయన మాట్లాడారు. ‘‘ప్రజలకు హామీ ఇచ్చి చంద్రబాబు వెన్నుపోటు(Chandrababu Vennupotu) పొడిచారు. అందుకే జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిరసన చేపడతాం. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి నష్టపోయారు. రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన దోపిడీతో మొదలైంది. సూపర్ సిక్స్ రాష్ట్రంలో ఫెయిల్యూర్ అయ్యింది. ఆస్తి పన్ను, కరెంటు చార్జీలు కూటమి ప్రభుత్వం విపరీతంగా పెంచింది.. .. చంద్రబాబు ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత ఒక మాట చెబుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే సచివాలయాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అమలు జరగట్లేదు. రేషన్ డోర్ డెలివరీ(Ration Door Delivery System) విధానాన్ని కూడా చంద్రబాబు తొలగించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం దారుణం. .. ఉచిత బస్సు, అమ్మకి వందనం అంటూ ప్రజలను మోసం చేశారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. రౌడీరాజ్యం , పోలీసు రాజ్యం నడుస్తోంది. విజయవాడలో శాతవాహన కళాశాల 5 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం కబ్జా చేయడానికి చూస్తోంది. శాతవాహన కళాశాల ప్రిన్సిపల్‌ను కిడ్నాప్ చేయడం దారుణం. అసలు బెజవాడ నగరంలో శాంతి భద్రతలు ఉన్నాయా?. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల విజయవాడ నగరంలో బుడమేరు వరదల్లో 12 డివిజన్లు నీట మునిగాయి అని మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి(Vijayawada Deputy Mayor Sailaja Reddy) మాట్లాడుతూ.. ‘‘జగన్‌ను ఒంటరిగా ఢీ కొనలేక మూడు పార్టీలు ముందుకు వచ్చాయి. చంద్రబాబు అమాయక ప్రజలను మోసం చేశారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో ఒక్క హామీ అమలు చేయలేదు. టీడీపీ మహానాడుతో ప్రజలకు ఏం ఉపయోగం లేదు. జగన్‌ను తిట్టేందుకు.. లోకేష్ ను పొగడ్తలతో ముంచేందుకే మహానాడు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తున్నారు అని అన్నారామె. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.ఇదీ చదవండి: అలాంటి వారిని ఇలాగే శిక్షస్తారా?.. మేడమ్! -
ఆంధ్రప్రదేశ్ ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేసిన చంద్రబాబు
-
వెన్నుపోటుకు ఏడాది
-
ఈ దుష్ట సంప్రదాయం చంద్రబాబును వదలదు: సజ్జల
సాక్షి, గుంటూరు: ఆటవిక దేశాల్లోని నియంతల పాలనలో కొనసాగే అరాచకాన్ని ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Rama Krishna Reddy) మండిపడ్డారు. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత తురకా కిషోర్‌లను ఆయన పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ.. రెడ్‌బుక్ పేరుతో అధికార దుర్వినియోగానికి పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకోవడం అత్యంత ప్రమాదకరమనే విషయాన్ని చంద్రబాబు (Chandrababu) గ్రహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాల ప్రకారం పనిచేయాల్సిన పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటే ఏర్పడే దారుణాలను ఇప్పటికే రాష్ట్రం అంతా చూస్తున్నారని అన్నారు. దీనిపై పౌరసమాజం కూడా గళం విప్పాలని, లేని పక్షంలో సమాజానికే రక్షణం లేకుండా పోతుందని సజ్జల ఆందోళన వ్యక్తం చేశారు.ఇంకా ఆయనేమన్నారంటే... గత ఏడాది ఎన్నికల ఫలితాలు ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో హింసాకాండ ప్రారంభమైంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే లోగానే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండలతో టీడీపీ శ్రేణులు చెలరేగిపోయాయి. ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాటి కొనసాగింపుగా పోలీసులతో అక్రమ కేసులు బనాయించడం, అరెస్ట్‌లు చేయించడం వంటి రాజ్యహింస ప్రారంభించారు. ముందుగా సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లపై అధికార దుర్వినియోగంకు పాల్పడుతూ పోలీసుల ద్వారా తప్పుడు కేసులు బనాయించారు. పెద్ద ఎత్తున వారిని అరెస్ట్ చేసి జైలుపాలు చేశారు. తరువాత దశలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దృష్టి సారించారు. అసలు ఎటువంటి తప్పు చేయకపోయినా సరే, ఒక ప్రణాళిక ప్రకారం స్క్రిప్ట్ సిద్దం చేయడం, దానికి అనుగుణంగా అరెస్ట్‌లు, జైళ్ళకు పంపడం చేస్తున్నారు.ఇక మూడోదశలో భాగంగా సామాన్యులు, జర్నలిస్ట్‌లపై కూడా రాజ్యహింసను ప్రయోగిస్తున్నారు. ఈ మొత్త వ్యవహారానికి చట్టాలకు అనుగుణంగా పనిచేయాల్సిన పోలీస్ వ్యవస్థను, రాజకీయ ఒత్తిళ్ళతో ఇష్టారాజ్యంగా పనిచేయాలంటూ ప్రోత్సహించారు. దాని పరిణమాలే ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్. ఇది ఇలాగే కొనసాగితే మొత్తం సమాజమే అశాంతిమయం అవుతుంది. రక్షించాల్సిన పోలీసులే చట్టాలను తమ చెప్పుచేతల్లోకి తీసుకుని, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలకు రక్షణ లేని పరిస్థితి ఎదురవుతుంది. తక్షణం పౌరసమాజం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ విపరిణామాలు ప్రజాస్వామిక వ్యవస్థకే చేటు కలిగిస్తాయి. రాజకీయ కక్షసాధింపులతోనే పాలనమాజీ ఎంపీ నందిగం సురేష్ మీద పన్నెండు కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులో అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. ఒకదాని తరువాత మరొకటి చొప్పున కేసులు నమోదు చేయడం, బెయిల్ పై బయటకు రాగానే పాత కేసులో అరెస్ట్ అంటూ జైలుకు పంపడం చేస్తున్నారు. పార్టీ నాయకుడు తురకా కిషోర్ మీద కూడా ఇలాగే గతంలో జరిగిన సంఘటనలను తవ్వితీసి, వాటికి బాధ్యుడుగా చూపుతూ అర్థంలేని ఘటనల్లో అరెస్ట్ చూపుతున్నారు. ఆయన బెయిల్ తెచ్చుకునేందుకు సిద్దపడుతుండటంతో, బయటకు రాగానే మరో పీటీ వారెంట్‌తో సిద్దంగా ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక స్క్రిప్ట్ ను సిద్దం చేసుకుని దాని ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు.రాజకీయ అవసరాల కోసం పోలీసులను వినియోగించుకోవడం మొదలుపెట్టడంతో మొత్తం పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది. దానికి నిదర్శనమే తెనాలిలో ముగ్గురు యువకులను నడిరోడ్డుపై పట్టపగలు సీఐ స్థాయి అధికారులే లాఠీలతో హింసించడం. ఎక్కడో ఆటవిక రాజ్యం ఉన్న దేశాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయని తెలుసు. కానీ ప్రజాస్వామిక వ్యవస్థలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు, న్యాయస్థానాలు చేసే విచారణను, నేర నిర్ధారణను, శిక్షను కూడా తామే అమలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఇక న్యాయ వ్యవస్థ ఎందుకు ఉన్నట్లు? మొత్తం రాజకీయ నాయకత్వం ఇచ్చిన దన్నుతో పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర సీఎం, ఆయన కుమారుడు స్వయంగా రెడ్‌బుక్ పాలనను సాగిస్తున్నామని బహిరంగంగా ప్రకటించి, దాని ప్రకారం పనిచేసిన వారికే రివార్డులు ఉంటాయని చెప్పడం వల్లే ఇటువంటి దారుణమైన పరిణామాలు జరుగుతున్నాయి. దీనినే కొనసాగితే సమాజంలో అరాచకం ప్రబలుతుంది. సామాన్యుడు బతకడమే కష్టమవుతుంది.ఈ దుష్ట సంప్రదాయం చంద్రబాబును వదలదు నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. దానిపై ఇద్దరు ఎమ్మెల్సీలు, కాకాణి కుమార్తె జిల్లా కలెక్టర్‌ను కలవడానికి వెడితే వారిపైన కూడా కేసులు పెట్టడం చూస్తుంటే, ఇక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానమే కలుగుతోంది. ఇటువంటి దుష్ట సంప్రదాయం తమను కూడా చుట్టుముడుతుందనే ఆలోచన చంద్రబాబుకు కలగడం లేదు. చట్టాలను పక్కకుపెట్టి, ఒక మాఫియా సైన్యాన్ని తయారు చేసుకుంటున్నారు. తాము చెప్పినట్లు వినని వారిని వీఆర్‌కు పంపడం, సస్పెండ్ చేయడం వంటివి చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిని దారుణమైన స్థితికి తీసుకువచ్చారు. అలాగే పల్నాడు జిల్లాలో హరికృష్ణ అనే యువకుడిని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టి చిత్రహింసలకు గురి చేశారు.పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి తన కుమారుడిని చూపించమంటే, అసలు మా ఆధీనంలోనే లేడని పోలీసులు జవాబు చెప్పారు. స్టేషన్ వద్ద నుంచి వెళ్ళకపోతే హరికృష్ణ కుటుంబసభ్యులపైనే కేసులు పెడతామని పోలీసులు బెదిరించారు. హరికృష్ణపై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మేజిస్ట్రేట్ వద్ద తనను హింసించారని చెబితే ఆయనను ఆసుపత్రికి పంపారు. ఆ ఆసుపత్రిలోని వైద్యాధికారులను పోలీసులకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయి. హరికృష్ణ నడవలేని స్థితిలో ఉన్నారు. ఇప్పటి వరకు హరికృష్ణను కలిసేందుకు ఆయన తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు కనీసం ములాఖత్ కూడా ఇవ్వకుండా కక్షసాధిస్తున్నారు. ఫిర్యాదు ఇచ్చిన వారిని వదిలేసి, ఎవరిమీద ఫిర్యాదు ఇచ్చారో వారితోనే ఫిర్యాదు తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. పులివెందులలో వైఎస్సార్సీపీ వారిపై ఇలాగే హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. వెన్నుపోటు దినం(Vennupotu Dinam) పేరుతో శాంతియుతంగా నిరసనలు చేపడతామంటే ఈ ప్రభుత్వం భయపడుతోంది. వాటికి అనుమతులు ఇవ్వకూడదని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఏడాది దుష్ట పాలనకు ప్రజల నుంచి వ్యక్తమయ్యే నిరసనలను అడ్డుకోలేరు’ అని సజ్జల స్పష్టం చేశారు. -
‘కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైంది’
ఎన్టీఆర్ జిల్లా: ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పతనం మొదలైందన్నారు మైలవరం నియోజవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి జోగి రమేష్. కూటమి ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో వివరించడానికే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 4వ తేదీన వైఎస్సార్ సీపీ చేపట్టబోయే వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా ఈరోజు(ఆదివారం) పోస్టర్ ను ఆవిష్కరించారు జోగి రమేష్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ కూటమి ప్రభుత్వం ఏడాదిగా చేసిన మోసాలను ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కూటమి ప్రభుత్వ చేసిన మోసాల్ని ప్రజల సమక్షంలో ఎండగడతాం, మైలవరం నియోజకవర్గంలో జూన్ 04 న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. జూన్4తో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది.. ప్రజల నుంచి వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇచ్చిన హామీలన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. ప్రజలను నమ్మబలికిన కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైంది. జూన్ 04 న మైలవరం డాక్టర్ లక్కిరెడ్డి హనిమి రెడ్డి కాంప్లెక్స్ వద్ద నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు జరిగే ర్యాలీని జరుగనుంది’ అని జోగి రమేష్ తెలిపారు. -
‘వెన్నుపోటు దినం’పై చంద్రబాబు కుట్రలు
సాక్షి, విజయవాడ: జూన్ 4న వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగింది. ఇందులో భాగంగా వెన్నుపోటు దినం రోజున వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనల్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం పోలీసుల్ని ప్రయోగిస్తోంది. జూన్ 4 న వైఎస్సార్సీపీ నేతలు చేపట్టే నిరసనలకి పోలీసులు అనుమతి నిరాకరించారు. శ్రీకాకుళం, ఒంగోలు, తిరుపతి జిల్లాల్లో వెన్నుపోటు దినం నిమిత్తం వైఎస్సార్సీపీ నేతలు అనుమతుల కోసం పోలీసులకు విజ్ఞప్తులు చేశారు. అయితే, నేతల విజ్ఞప్తుల్ని పోలీసులు నిరాకరించారు. పలుచోట్ల సెక్షన్ 30 అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇలా ప్రజాస్వామ్య విధానాలు,రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాసేలా కూటమి ప్రభుత్వం అరాచకానికి దిగింది. వైఎస్సార్సీపీ నాయకులు కోరుతున్న అనుమతులు తిరస్కరించేలా చంద్రబాబు పోలీసుల్ని వాడుకోవడం గమనార్హం.కూటమి ప్రభుత్వంపై నిరసన గళం వినిపించేలా వెన్నుపోటు దినంప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినం(Vennupotu Day)గా నిర్వహిస్తామని ప్రకటించారు. ‘జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ఆరోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం. కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తాం. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని వైఎస్ జగన్ కోరారు. -
కూటమిపై కన్నెర్ర
-
ఆ పదానికి పేటెంట్ చంద్రబాబే: వైఎస్సార్సీపీ
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ వంచనకు పాల్పడిందని.. సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేశారంటూ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వెన్నుపోటు దినం పోస్టర్‌ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గొల్ల బాబురావు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పండుల రవీంద్రబాబు, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు, కార్పొరేటర్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు 175 నియోజక వర్గాల్లో ‘వెన్నుపోటు దినం’ పాటిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఏడాదిలో వైఎస్ జగన్ 80 శాతం హామీలను అమలు చేశారు. జూన్ 4న జిల్లా పరిషత్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తాము’’ అని బొత్స పేర్కొన్నారు.అన్నమయ్య జిల్లా: వెన్నుపోటుకు చంద్రబాబు పేటెంట్ అని.. కూటమి సర్కార్.. మోసాలకు, అరాచకాలకు నిరసనగా జూన్ 4న రాజంపేట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అకేపాటి అమరనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జూన్ 4వ తేదీన చేపట్టే వెన్నుపోటు దినం పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.వైఎస్సార్ జిల్లా: పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ‘వెన్నుపోటు దినం’ పోస్టర్‌ను వైఎస్సార్సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 4వ తేదీన చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపడుతున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతపురం: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు మోసకారి అంటూ దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని.. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. హామీలంటే ఇప్పుడు భయమంటున్నారు. సూపర్ సిక్స్ హామీలను ఎందుకు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా ఈనెల 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నాం. వైఎస్సార్సీపీ నిరసన ప్రదర్శన ను విజయవంతం చేయాలని తోపుదుర్తి పిలుపునిచ్చారుకృష్ణా జిల్లా: 4న చేపట్టే ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమ పోస్టర్‌ను కానూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని.. అబద్దపు హామీలతో సీఎం అయ్యారంటూ మండిపడ్డారు.‘‘సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయి?. వెన్నుపోటుకి నిర్వచనం చంద్రబాబు. ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కొని వెన్నుపోటు పొడిచాడు. అబద్దానికి నిలువెత్తు రూపం చంద్రబాబు. నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని పార్టీ నేతలకు దేశభక్తుని చక్రవర్తి పిలుపునిచ్చారు. -
గన్నవరం లో సౌండ్ చేస్తే.. అమరావతికి వినపడాలి
-
వెన్నుపోటు దినం పోస్టర్ ను ఆవిష్కరించిన YSRCP నేతలు
-
వెన్నుపోటు దినంగా జూన్ 4.. పోస్టర్ ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జూన్ 4న పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన 'వెన్నుపోటు దినం' కార్యక్రమం పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ఒక దుర్మార్గమైన పాలనను దేశంలోనే మొదటిసారిగా చూస్తున్నామని అన్నారు. ఈ వంచనను ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నపోటు దినం నిరసనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ, అరాచక విధానాలను పరిచయం చేసింది. కూటమి పార్టీలు మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చి జూన్ 4వ తేదీకి ఏడాది అవుతోంది. ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా, అడ్డంగా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దానిని ప్రశ్నించకుండా రాష్ట్రంలో ప్రభుత్వమే భయోత్పాతాన్ని సృష్టించిన చరిత్ర కూడా ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు.అధికారంలో వచ్చిన తొలి రోజు నుంచే ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ, ఏడాదిలోనే తొంబై తొమ్మిదిశాతం అమలు చేసిన ఘనత వైయస్ జగన్‌ది. అలాగే విప్లవాత్మక వ్యవస్థలను సృష్టించి, ఆచరణలోకి తీసుకువచ్చి, ప్రజల వద్దకే సుపరిపాలనను తీసుకువెళ్ళి అందించి చరిత్ర సృష్టించారు. దానికి భిన్నంగా ఆ వ్యవస్థలను విధ్వంసం చేస్తూ, అరాచక పాలనను ఏడాదిలోనే చంద్రబాబు ప్రజలకు చవిచూపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎటువంటి దారుణాలకు పాల్పడవచ్చో కూడా చంద్రబాబు నిరూపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఆనాడే వైఎస్ జగన్ స్పందిస్తూ, వాటిని అమలు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదని, ప్రజలను మోసం చేయడానికే ఇటువంటి హామీలు ఇస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పారు.ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం చాలా కష్టమని చెబుతున్నారు. సంపద సృష్టిస్తానని, పేదల బతుకుల్లో వెలుగులు తీసుకువస్తానంటూ మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు పీ-4 అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. పేదరికాన్ని నిర్మూలించే బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి మోసం బహుశా ఎక్కడా మనకు కనిపించదు. 1995లో సొంత మామనే వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తరువాత 1999, 2014, 2024లోనూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. గతంలొ హామీలను అమలు చేస్తానంటూ అబద్దాలు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు బరితెగించి, హామీలను అమలు చేయడం కుదరదంటూ అడ్డంగా మాట్లాడుతున్నాడు.రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం ర్యాలీలుచంద్రబాబు సీఎంగా తొలి ఏడాదిలోనే రూ.1.49 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆ సొమ్ము దేనికి వినియోగించారో తెలియదు. ఆనాడు మామాకు వెన్నుపోటు పొడిస్తే, ఈ రోజు నేరుగా తనను నమ్మి ఓటు వేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచారు. దీనిని ప్రశ్నిస్తూ వైయస్ఆర్సీపీ వెన్నుపోటుదినంను నిర్వహిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు ర్యాలీలుగా వెళ్ళి స్థానికంగా ఉన్న అధికారులకు మెమోరాండంలు సమర్పిస్తాయి. ఎన్నికల హామీలను అమలు చేయాలని, ఈ ఏడాది కాలంగా ప్రజలకు ఇస్తామన్న అన్ని పథకాల లబ్ధిని దానిని తక్షణం విడుదల చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు మోసపోయిన ప్రజలు కూడా పాల్గొని, ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, సాకె శైలజానాథ్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, కుంభా రవి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నాయకులు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, కొమ్మూరి కనకారావు, చల్లా మధుసూధన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, పేరాడ తిలక్ తదితరులు పాల్గొన్నారు.