‘వ్యవసాయం దండగన్న చంద్రబాబు.. రైతులకు ఏం మేలు చేస్తాడు?’ | Peddireddy Ramachandra Reddy Fires On Chandrababu Over Mango Farmers Issue, More Details Inside | Sakshi
Sakshi News home page

‘వ్యవసాయం దండగన్న చంద్రబాబు.. రైతులకు ఏం మేలు చేస్తాడు?’

Jun 22 2025 4:52 PM | Updated on Jun 23 2025 10:22 AM

Peddireddy Ramachandra Reddy Fires On Chandrababu

సాక్షి, చిత్తూరు జిల్లా: వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతులకు ఏం మేలుచేస్తాడంటూ.. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పుంగనూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కోట్ల రూపాయలు చిత్తూరు జిల్లాలో టమోటా రైతులు నష్టపోయారన్నారు. తోతాపురి మామిడి కాయలు కిలో 2,3 రూపాయలు ధరలు ఉంటే రైతులు ఎలా బతకాలి? చంద్రబాబు చెప్పేటివి బూటకపు మాటలు’’ అంటూ మండిపడ్డారు.

‘‘ఎన్నిసార్లు చంద్రబాబు సీఎం అయిన రైతులను పట్టించుకున్నది లేదు. వ్యవసాయం దండగ అని స్వయనా ఒక సీఎంగా ఉంటూ ఆయన మాట్లాడారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే రైతులకు గిట్టుబాటు ధరలు ఎక్కడ వస్తాయి?. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా బాధాకరం. మన రాష్ట్రంలో దాదాపు 75 శాతం  రైతులు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు. రైతులకు ప్రభుత్వం చేదోడు వాదోడుగా నిలవాల్సిందిపోయి అందరి రైతుల ఉసురుతీస్తున్నారు’’ అని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.

‘‘రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వైఎస్‌ జగన్‌ వెళ్తుంటే.. వైఎస్సార్‌సీపీ నాయకులను వేధిస్తూ కేసులు పెడుతున్నారు. ప్రజలను భయబ్రాంతులకు ఈ ప్రభుత్వం గురిచేస్తోంది. మా ప్రభుత్వంలో రైతుల నుంచి టమోటా కొని రైతులను అదుకున్నాం. గతంలో రైతులు క్రాప్‌ హాలిడే అని పెట్టారు. ఇక నాలుగు సంవత్సరాలు రైతులు ఈ ప్రభుత్వంలో సెలవులో ఉండాల్సిందే. రైతులకు చేయూత ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు పట్టించుకోవడం లేదు’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిప్పులు చెరిగారు.

Advertisement
 
Advertisement
Advertisement