ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నిరసనలు | YSRCP Women Cell Protest Against TDP Govt Updates | Sakshi
Sakshi News home page

ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నిరసనలు

Jun 10 2025 11:36 AM | Updated on Jun 10 2025 1:05 PM

YSRCP Women Cell Protest Against TDP Govt Updates

విజయవాడ :  ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా నేడు (మంగళవారం, జూన్‌ 10వ తేదీ)) రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంతో జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తున్నార  వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నేతలు. 

చిత్తూరు జిల్లా: 

కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయింది: ఆర్‌కే రోజా

  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది
  • హోం మంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదు
  • అధికారంలో ఉన్నవాళ్లు లా అండ్ ఆర్డర్  కాపాడాలి
  • అధికారంలో ఉన్నవాళ్లు వారే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారు
  • మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలు పై దారుణాలు జరగడం సిగ్గుచేటు
  • నగరి నియోజకవర్గం లో మైనర్ బాలికపై అత్యాచారం చేశారు
  • అనంతపురం జిల్లా ఇంటర్ విద్యార్ధి కనిపించకపోతే పట్టించుకోలేదు
  • పరిటాల సునీత నియోజకవర్గంలో 14 మంది టీడీపీ వాళ్లు మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే సాక్షి మీడియా బయటకు తీసుకు వచ్చింది
  • డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మహిళలు పై దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు
  • హోం మంత్రి అనిత నా చేతిలో గన్ ఉందా, నాకు పవర్ ఉందా.. అంటూ చేతకాని మాటలు మాట్లాడుతూ ఉంటే రాజీనామా. చేయాలి

 

విజయవాడలో..
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా వైస్సార్సీపీ మహిళ విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు వరుదు కళ్యాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ భాగ్యలక్ష్మి,  డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. 

కృష్ణాజిల్లా:లో..
 సేవ్‌ ఉమెన్‌-సేవ్‌ ఆంధ్రా నినాదాలతో వైఎస్సార్‌సీపీ మహిళా నేతల తమ నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూ మచిలీపట్నం లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు వైఎస్ఆర్సీపీ మహిళలు. దీనిలో భాగంగా మాజీ మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఈ రాష్ట్రం లో మహిళలపై, వృద్ధులపై, బాలికపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎవ్వరూ మమల్ని ప్రశ్నించకూడదు అని దాడులకు తెగబడుతున్నారు, 

పిల్లిని గదిలో పెట్టి దాడి చేస్తే ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో టీడీపీకి అదే గతి పడుతుంది. రాష్ట్రంలో మహిళా హోమ్ మినిస్టర్ గా ఉన్నా ఆమె పసుపు పార్టీకి కార్యకర్తగానే వ్యవహరిస్తుంది తప్పా అధికారాన్ని ఎక్కడా మహిళ ల పక్షాన్న చూపించడం లేదు’ అని మండిపడ్డారు.

చంద్రబాబు సర్కార్ పై మహిళల ఆగ్రహం

విశాఖలో..
మహిళలపై జరుగుతున్న హత్యలు హత్యాచారాలను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సిపి మహిళా నేతలు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు మహిళ నేతలు.  ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి.రాష్ట్రంలో మహిళలకు చిన్న పిల్లలకు రక్షణ కరువైంది.కూటమి పాలనలో మహిళల భద్రతను గాలికి వదిలేసారు. హోం మంత్రి అనిత మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. గత ముఖ్యమంత్రి  జగన్ మహిళల రక్షణకు పెద్దపీట వేశారు.దిశ చట్టాన్ని అమలు చేసి మహిళలకు భద్రత కల్పించారు’ అని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు స్సష్టం చేశారు. 

అనంతపురంలో.. 
అనంతపురంలో చంద్రబాబు సర్కార్ పై మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలక భద్రత కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా అనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అరాచకాలు నశించాలంటూ నినాదాలు చేశారు.  చంద్రబాబు మహిళల ద్రోహి అంటూ నిరసన చేపట్టారు.

వైఎస్ఆర్ జిల్లా:

  • కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళల ఆందోళన
  • రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, దారుణాలపై నిరసన
  • రాష్ట్ర ప్రభుత్వానికి, హోంమంత్రి అనితకి వ్యతిరేకంగా నినాదాలు
  • హోం మంత్రి మహిళ అయ్యి ఉండి కూడా న్యాయం చేయలేకపోతున్నారని మండిపాటు
  • ఆమెకు నిత్యం జగన్‌ను తిట్టి చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసే పనిలో ఉన్నారని విమర్శ
  • 32వేల మహిళలు ఇప్పుడు ఎక్కడున్నారని పవన్ కళ్యాణ్ కి ప్రశ్న
  • మహిళల మన, ప్రాణాలను కాపాడలేని హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్
  • 32వేల మంది మహిళలను డిప్యూటీ సీఎం అయ్యాక కూడా తీసుకురాలేని పవన్ కళ్యాణ్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్

కాకినాడ జిల్లా:

  • మహిళలపై జరుగుతున్న దాడులు,అఘాయిత్యాలను అరికట్టాలని కోరుతూ వైఎస్ఆర్ సిపి మహిళ విభాగం నిరసన
  • డా.బి.అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం అందజేత
  • పాల్గొన్న వంగా గీతా, జిల్లా అధ్యక్షురాలు సుజాత

ఏలూరు జిల్లా:

  • సేవ్ ఉమెన్ సేవ్ ఆంధ్ర... నినాదంతో ఏలూరులో వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం నేతల నిరసన
  • పాల్గొన్న ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ మహిళా అధ్యక్షురాలు సరిత రెడ్డి, నగర అధ్యక్షురాలు విజయనిర్మల, పార్టీ మహిళా విభాగం నాయకులు
  • ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మహిళ నాయకులు
  • మహిళలు బాలికలకు బాబు పాలనలో భద్రత కరువైంది:  సరిత రెడ్డి
  • కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి
  • కూటమి పాలనలో మహిళలు,చిన్నారులకు రక్షణ లేదు
  • జగనన్న పాలనలో మహిళకు పెద్దపీట వేశారు
  • చంద్రబాబు ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం ఒక్క పథకం కూడా అమలు చేయలేదు
  • అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారూ
  • జగనన్నదిశ యాప్ ద్వారా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే మహిళలకు అండగా నిలిచారు
  • గత వారం రోజుల వ్యవధిలోని  మహిళలు చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి
  • హోం మంత్రి మహిళ అయినా మహిళల పట్ల బాధ్యత లేదు 

కర్నూలు:

  • కర్నూలు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు ఆందోళన
  • మహిళలు, బాలికల పై‌ జరుగుతున్న అఘయిత్యాలను నిరసిస్తూ వైఎస్సార్ సిపి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన
  • రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో  అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల విభాగం నేతలు
     

చిత్తూరు జిల్లా: 

  • దర్గా సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం
  • అంబేద్కర్కు వినతి పత్రం అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  మహిళా కార్యకర్తలు, నాయకులు
  • రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు..అంజలి రెడ్డి
  • కూటమి ప్రభుత్వం పాలనలో మహిళలు పై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
  • మహిళలు పై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే హోం మంత్రి మహిళగా ఉండి ఏం చేస్తున్నట్లు.. కార్పో రేటర్ హరిణి రెడ్డి
  • వైఎస్ జగన్ పాలనలో మహిళలకు ఎంతో రక్షణ ఉండేది.సంక్షేమ పాలన అందించారు..హరిణి రెడ్డి
  • మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చారు,
  • మహిళలకు గౌరవం,సంక్షేమాన్ని ఇచ్చారు జగనన్న.. మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి ,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement