కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలకు గడువులోగా సమస్యకు పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సోమవారం కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, పీజీఆర్‌ఎస్ జిల్లా కోఆర్డినేటర్ జి.జ్యోతి, ఏసీపీ వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోసిబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌ఎస్‌లో 174 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు.
మిషన్ శక్తి స్కీంతో అవగాహన
చిలకలపూడి(మచిలీపట్నం): సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి స్కీం–సంకల్ప హబ్ ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశం హాలులో వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇతర శాఖల సమన్వయంతో ఈ నెల 2నుంచి 20 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. ముఖ్యంగా మహిళా దినోత్సవం ఈ నెలలోనే రావడంతో కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. కార్యక్రమంలో జేసీ ఎం.నవీన్, మెప్మా పీడీ సాయిబాబు, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ అర్చిస్మ, డీసీపీవో కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


