breaking news
NTR district Latest News
-
సమ్మెలోకి పీహెచ్సీ వైద్యులు
మచిలీపట్నంఅర్బన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి సమ్మె బాట పట్టారు. ఈ క్రమంలో ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేస్తూ, అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్ అసోసియేషన్ (ఏపీపీహెచ్‌సీడీఏ) ప్రకటించింది. ఈ నెల 26 వ తేదీ నుంచి పీహెచ్సీ డాక్టర్లు దశలవారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే కలెక్టరు బాలాజీ, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.వెంకట్రావులకు సంఘం తరఫున జిల్లా నాయకులు సమ్మె నోటీసు అందజేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీ వైద్యులు సమ్మె చేపట్టారు. పీజీ కోటా తగ్గింపుపై ఆగ్రహం సర్వీస్ వైద్యుల పీజీ కోటాను తగ్గించిన కూటమి ప్రభుత్వ నిర్ణయంపై డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 30 శాతం క్లినికల్, 50 శాతం నాన్ క్లినికల్ సీట్లు ఉండగా, వాటిని 15 శాతానికి తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యులకు తక్కువ కాలంలోనే ప్రమోషన్లు లభిస్తుంటే, 20 ఏళ్లుగా పీహెచ్‌సీల్లో పని చేస్తున్న డాక్టర్లు ఇంకా సీనియర్ మెడికల్ ఆఫీసర్లుగానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 49 పీహెచ్‌సీలు, 14 అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో దాదాపు 110 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్న సమయంలో సమ్మె ప్రారంభం కావడంతో పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వైద్యుల డిమాండ్లు వైద్యుల ప్రధాన డిమాండ్లలో పీజీ కోటాను పునరుద్ధరించడం, టైం బౌండ్ ప్రమోషన్లు కల్పించడం, మారుమూల ప్రాంతాల్లో పనిచేసేవారికి బేసిక్‌పై 50 శాతం అలవెన్స్ ఇవ్వడం, చంద్రన్న సంచార చికిత్స పథకానికి ప్రత్యేక భృతి కేటాయించడం ఉన్నాయి. అదనంగా అర్బన్, నేటివిటీ కౌన్సెలింగ్ గడువును ఆరేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించాలని కోరుతున్నారు. సేవలను గుర్తించని కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన సర్వేలు, పల్స్ పోలియో కార్యక్రమాలు, వరదలు, విపత్తుల సమయంలోనూ క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు ఉద్యోగోన్నతులు అందకపోవడం వైద్యులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. జాయిన్ అయినప్పుడు ఉన్న అదే కేడర్‌లో ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తమ సేవలకు సరైన గుర్తింపు లభించడం లేదని పీహెచ్సీ వైద్యులు ఆరోపిస్తున్నారు. -
యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యోగ సాధనను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలో జరుగుతున్న 6వ జాతీయ జూనియర్, సీనియర్–సీ యోగాసన చాంపియన్‌షిప్–2025–26లో పతకాలు పొందిన పలు విభాగాల క్రీడాకారులకు మంత్రి రవీంద్ర సోమవారం పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాను ఒలింపిక్స్‌లో ప్రవేశపెడితే భారత్‌కు తప్పకుండా పతకాలు వస్తాయన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా పోటీలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకష్ణ ప్రసాద్ ,ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎ.రాధిక, ఉపాధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్‌కుమార్, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి పాల్గొన్నారు. విజేతల వివరాలు... హ్యాండ్ బ్యాలెన్స్ మహిళల వ్యక్తిగత విభాగంలో పి.ప్రసూన (ఆంధ్రప్రదేశ్) ప్రథమ, ఆష్మా దాస్ (పశ్చిమ బెంగాల్) ద్వితీయ, పంపం దేవి (గోవా)తృతీయ స్థానంలో నిలిచారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో ఇంద్రజిత్ (ఏఐపీఎస్ సీబీ), వినాయక్ ఎం.కొంగి (కర్ణాటక), తన్మే అధికారి (ఉత్తరాఖండ్), బ్యాక్ బెండింగ్ మహిళల వ్యక్తిగత విభాగంలో అర్చన కవాటేకర్ (మహారాష్ట్ర), బిన్నీ కుమారి బాల (బీహార్), శీతల బైస్య (అసొం), పురుషుల వ్యక్తిగత విభాగంలో అయ్యంపిళ్ళై (తమిళనాడు), బీరేంద్రకుమార్ యాదవ్ (హరియాణ), రాహుల్ శాండోర్ (మహారాష్ట్ర) ఒక్కో విభాగంలో వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారి పడి ఒకరు మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని షాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. ఘటనపై మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జక్కంపూడి షాబాద్ గ్రామానికి చెందిన పేరం పాండురంగారావు గ్రామానికి సమీపంలోని టిడ్కో ఇళ్లకు వాచ్‌మెన్‌గా పని చేస్తుంటాడు. ఈనెల 27వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో పాండురంగారావు టిడ్కో ఇళ్ల చుట్టూ పరిశీలించేందుకు వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై పాండురంగారావు భార్య వెంకటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం కొండపై ఎవరో మనిషి ఉన్నాడని తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లారు. పాండురంగారావును కిందకు తీసుకువచ్చే క్రమంలో కాలు జారి కింద పడి తలకు గాయాలయ్యాయి. వెంకటేశ్వరమ్మ అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా, వారు వచ్చే సమయానికి పాండురంగారావు చనిపోయాడు. వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర -
పంట పొలాల్లోకి వరద నీరు
పెనమలూరు: కృష్ణానదిలో సోమవారం దాదాపు 6.5 లక్షల క్యూసెక్కులు వరద నీరు రావటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. మండలంలోని యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం గ్రామాల్లో వరద నీరు పంట పొలాల్లోకి వచ్చాయి. ప్రస్తుతానికి పంటలకు ఇబ్బంది లేకపోయినా వరద నీరు ఇంకా పెరిగితే పంటలు నీట మునిగే పరిస్థితి ఉందని రైతులు తెలిపారు. పసుపు, కంద, వరి, కూరగాయల పంటలకు ప్రమాదం పొంచి ఉంది. పల్లపు ప్రాంతాల్లో వరద నీరు ఇప్పటికే ఇళ్ల వద్దకు చేరుకుంది. వరద ఉధృతి పెరిగితే వరద నీరు నేరుగా ఇళ్లను ముంచెత్తే ప్రమాదం ఉంది. పెదపులిపాక, యనమలకుదురు ప్రాంతాల్లో కరకట్ట దిగువన ఉన్న నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. వరద నీరు పెరుగుతుండటంతో పంట పొలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. -
విమానాశ్రయంలో కెఫే స్టాల్ ప్రారంభం
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. స్థానిక విమానాశ్రయంలోని టెర్మినల్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉడాన్ యాత్రి కెఫే స్టాల్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం విమానాశ్రయ ఆవరణలో ఎంపీ కేశినేని శివనాథ్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ విమానాశ్రయాల్లో సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటు ధరల్లో టీ, కాఫీ, స్నాక్స్ విక్రయించేందుకు ఉడాన్ యాత్రి కెఫేను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల్లో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రయాణికుల వృద్ధి రేటు 15 శాతం పెరిగిందన్నారు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త విమాన సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్‌కు మరో నెలలో విమాన సర్వీస్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. దేశీయంగా అహ్మదాబాద్, వారణాసి, కొచ్చి, పుణేకు సర్వీస్‌లు నడపనున్నట్లు చెప్పారు. ఏడాదికి 35 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యంతో నూతన టెర్మినల్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. తొలుత ఉడాన్ యాత్రి కెఫే స్టాల్ మెనూ కార్డును ఆయన ఆవిష్కరించారు. ఏఏఐ బోర్డు సభ్యులు డాక్టర్ హెచ్.శ్రీనివాస్, డాక్టర్ శరద్‌కుమార్, విమానాశ్రయ సలహా కమిటీ సభ్యుడు పొట్లూరి బపసరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రామాచారి, ఎయిర్పోర్ట్ డెరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, పలువురు ఎయిర్పోర్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
పొంగి పొర్లుతున్న చంద్రమ్మ కయ్య
జగ్గయ్యపేట: ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం మండలంలోని ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు నుంచి 5.69 లక్షల క్యూసెక్కుల వరద నీటిని 16 గేట్ల ద్వారా విడుదల చేస్తుండటంతో మండలంలోని కృష్ణానది పరివాహక గ్రామాలైన ముక్త్యాల, వేదాద్రి, రావిరాల గ్రామాలలో కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ముక్త్యాల–జగ్గయ్యపేట రహదారిలోని చంద్రమ్మ కయ్య పొంగి పొర్లుతుండటంతో రెండవ రోజు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కేసీపీ కర్మాగారంలో నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. రావిరాల బీసీ కాలనీ ప్రజలు రెండవ రోజు కూడా పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్నారు. ముక్త్యాల, రావిరాల, కె.అగ్రహారం గ్రామాలలోని పత్తి, మిర్చి పంటలు వరద నీటిలో మునిగాయి. మరో మూడు రోజుల పాటు వరద ఉధృతి ఉంటుందని అధికారులు చెబుతుండటంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులు సూచనలు చేస్తున్నారు. -
తక్కువ ధరలకు సూక్ష్మ సేద్యం సాగు పరికరాలు
కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తు సేవల పన్ను జీఎస్టీ –2.0తో తక్కువ ధరలకు సూక్ష్మ సేద్యం సాగు పరికరాలు లభిస్తున్నాయని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీడీ రత్నాచార్యులు ముద్రించిన వాల్‌పోస్టర్లను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సూక్ష్మ సేద్యం పద్ధతిలో సాగు చేపట్టే రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్లు తక్కువ ధరకే లభిస్తాయని, ఆ పరికరాలపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గిందని. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 2.5 శాతం తగ్గింపుతో పరికరాలను అందిస్తోందన్నారు. జేసీ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ జాహిద్ ఫర్హీన్, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డీవో కె.స్వాతి, ఉద్యానశాఖ అధికారి జె.జ్యోతి పాల్గొన్నారు. రవాణాశాఖ అవగాహన ర్యాలీ ధరల తగ్గింపుపై రవాణాశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం కలెక్టరేట్లో జెండా ఊపి ప్రారంభించారు. జీఎస్టీ –2.0 ద్వారా వాహనాలు తక్కువ ధరలకు లభిస్తున్నాయని, వీటిని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఎం.నవీన్, జిల్లా రవాణాధికారి యూ ఎన్ఎస్ శ్రీనివాసరావు, కమర్షియల్ డెప్యూటీ కమిషనర్ రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణమ్మ కన్నెర్ర
ఏటిపాయకు భారీగా వచ్చిన వరద లంక గ్రామాలను చుట్టుముట్టింది. పెనమలూరు మండలంలో కరకట్ట వెంబడి గ్రామాల్లో నివాసం ఉంటున్న వేలాది నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా గ్రామాల్లోని నివాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. తోట్లవల్లూరు మండలంలో రొయ్యూరు శివారు తోడేళ్లదిబ్బ లంక, వల్లూరుపాలెం శివారు రావిచెట్టు లంక, పాములలంక, తుమ్మలపచ్చిక లంక, చాగంటిపాడు శివారు పిల్లివానిలంక, దేవరపల్లి శివారు పొట్టిదిబ్బలంక, ఐలూరు శివారు కనిగిరిలంక, ములకల లంక గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు పడవలపై ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి. కాసరనేనివారిపాలెం వద్ద నీట మునిగిన శివాలయం గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/కంకిపాడు: ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా కృష్ణమ్మ పోటెత్తింది. రెండు రోజులుగా బ్యారేజ్‌కు వరద ఉద్ధృతి అంత కంతకూ పెరుగుతోంది. దీంతో బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటల సమయానికి 6,54,876 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఇందులో 6,39,737 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలివేశారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి 6,74,971 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో సాయంత్రానికి స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 15.9 అడుగుల నీటి మట్టం ఉంది. వరద కారణంగా నది పరీవాహక ప్రాంతంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి.. ఏడిపిస్తున్న ఏటిపాయ.. పెనమలూరు, పామర్రు, దివిసీమ ప్రాంతాల్లో ఏటిపాయ వెంబడి ఉన్న ప్రాంతాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వరదనీరు కరకట్ట అంచులు తాకుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు, పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు, కంకిపాడు మండలాల్లో కరకట్ట వెంబడి సాగులో ఉన్న పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. ప్రధానంగా అరటి, కంద, పసుపు, కూరగాయల పంటలు నీట మునిగాయి. గతేడాది సెప్టెంబర్ ఏటిపాయకు వరద భారీగా రావటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరలా ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే వరద ముంచుకురావటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ రోజులు వరదనీరు పంట పొలంలో నిలిచిపోతే పంటలు కుళ్లిపోయే ఆస్కారం ఉందని వాపోతున్నారు. అయ్యో ఎడ్లంక.. దివిసీమ పరిధిలోని ఎడ్లంక గ్రామంలోకి వరదచొచ్చుకొచ్చింది. దీంతో రహదారి మార్గం మూసుకుపోవటంతో రాకపోకలకు నిలిచిపోయాయి. ఇక్కడి పలు నివాసాల్లోకి సైతం నీరు చేరటంతో ఇళ్ల చుట్టూ నీరు చేరింది. దీంతో నివాసితులు సామాన్లను తరలించి భద్రపర్చుకుంటున్నారు. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో లంక గ్రామాలు, కరకట్ట వెంబడి ప్రాంతాలు ముంపు బారిన పడే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అవనిగడ్డ మండలంలోని పలు ప్రాంతాల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం విస్తృతంగా పర్యటించారు. పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించారు. పులిగడ్డ, పల్లెపాలెం ప్రాంతాల్లో వరదను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. -
ఆనంద పరవశం
అశేష భక్తజనావళి జయజయధ్వానాలతో ఇంద్రకీలాద్రి మార్మోగింది. అక్షర ప్రదాయిని వైదేహి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో దుర్గమ్మ ఆలయం పోటెత్తింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో సోమవారం జగన్మాత జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవిగా కొలువుదీరారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలో బారులు తీరారు. ఉదయమంతా భక్తి భావం.. సాయంత్రం వేళ సాంస్కృతిక వైభవంతో భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఆమూలాగ్రం.. అక్షర ప్రదాయినికి భక్తి హారతి పట్టిన జనం దుర్గగుడిపై నేడు ఆలయం బయట కంపార్ట్మెంట్లలో వేచియున్న భక్తులు (ఇన్సెట్) సరస్వతీదేవిగా దుర్గమ్మఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో కీలకమైన అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని అశేష భక్తజనం ఇంద్రకీలాద్రికి తరలివచ్చి సర్వసతీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి 11గంటల నుంచే భక్తులు క్యూలైన్లో వేచి ఉండటం కనిపించింది. తెల్లవారుజామున అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం 1.30గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. రెండు సర్వ దర్శనం క్యూలైన్లతో పాటు రూ. 100, రూ. 300 టికెట్ క్యూలైన్లో సైతం భక్తులకు ఉచితంగా దర్శనానికి అనుమతించారు. రాత్రి 12గంటలకే వినాయకుడి గుడి క్యూలై న్లు నిండిపోవడంతో భక్తులను సీతమ్మవారి పాదాలు, వీఎంసీ కార్యాలయం సమీపంలోని కంపార్టుమెంట్లలోకి మళ్లించారు. దుర్గమ్మ సేవలో డీకే శివకుమార్.. అమ్మవారిని తెల్లవారుజామున పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దంపతులు దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, విజయవాడ మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర భక్తుల రద్దీని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. హోల్డింగ్ పాయింట్ల నుంచి కొండపైకి చేరుకునేందుకు నాలుగు గంటలకు పైగా సమయం పట్టిందని భక్తులు పేర్కొంటున్నారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సీఎం చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలను సమర్పించారు. మధ్యాహ్నం ఒంటి గంటల నుంచే ఘాట్‌రోడ్డుపైకి ఎటువంటి వాహనాలను అనుమతించలేదు. సర్వ దర్శనంలో ఉన్న భక్తులకు గోశాల వద్ద నుంచి వీఐపీ క్యూలైన్లోకి అనుమతించారు. కుమ్మరిపాలెం క్యూలైన్లలో రద్దీ.. ఈ ఏడాది దసరా ఉత్సవాలలో వినాయకుడి గుడి క్యూలైన్లతో పాటు కుమ్మరిపాలెం క్యూలైన్లను దేవస్థానం ఏర్పాటు చేసింది. గతంలో హెడ్ వాటర్ వర్క్సు వరకు మాత్రమే క్యూలైన్లు ఏర్పాటు చేసేవారు. అయితే ఈ ఏడాది కుమ్మరిపాలెం సెంటర్ వరకు క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో వన్‌టౌన్, గట్టువెనుక ప్రాంతాల భక్తులకు సులభంగా అమ్మవారి దర్శనం అయిందనే చెప్పాలి. కుమ్మరి పాలెం వైపు ఉన్న క్యూలైన్లోకి చేరుకున్న భక్తులకు రెండు నుంచి మూడు గంటలలోపే అమ్మవారి దర్శనం పూర్తి కావడం విశేషం. ఆర్జిత సేవలకు డిమాండ్.. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించిన పలు ఆర్జిత సేవలలో ఉభయదాతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెల్లవారుజామున ఆరు గంటలకు నిర్వహించిన ప్రత్యేక ఖడ్గమాలార్చనకు 63 మంది ఉభయదాతలు, ప్రత్యేక చండీయాగానికి 52 మంది ఉభయదాతలు, ప్రత్యేక కుంకుమార్చనకు 174 మంది, ప్రత్యేక శ్రీచక్రనవార్చనకు 25 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ప్రత్యేక ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఉచిత లడ్డూ పంపిణీ.. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం సోమవారం ఉచితంగా చిన్న లడ్డూలను పంపిణీ చేసింది. కొండపై రాయబార మండపం, అన్న ప్రసాద వితరణ వద్ద లడ్డూలను భక్తులకు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. సాంస్కృతిక అంశాల్లో ప్రదర్శన ఇస్తున్న కళాకారిణిఆది దంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి పూలు, పండ్లతో అలంకరించిన పల్లకీపై ఇంద్రగిరి వీధుల్లో విహరించారు. సోమవారం యాగశాల నుంచి ప్రారంభమైన నగరోత్సవం.. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కనుల పండువగా సాగింది. మహా మండపం, గోశాల, కనకదుర్గనగర్, ఘాట్‌రోడ్డు మీదగా ఆలయానికి చేరుకుంది. ఆలయ ప్రాంగణంలో రాజగోపురం ఎదుట ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ మంగళవారం శ్రీదుర్గాదేవిగా దర్శనమిస్తారు. శరన్నరరాత్రులలో దుర్గాదేవిని అర్చించటం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. -
దుర్గమ్మ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు
సాక్షి,అమరావతి: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడటం హేయమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆలయాల వద్ద రాజకీయాలు మాట్లాడకూడదని కనీస ఇంగిత జ్ఞానం సీఎం చంద్రబాబుకి లేదా అని ఆయన ప్రశ్నించారు. పైగా అమ్మవారి సమక్షంలోనైనా నిజాలు మాట్లాడకుండా సీ్త్రశక్తి పథకం సూపర్ హిట్ అని పచ్చి అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం మల్లాది విష్ణు మీడియాకు ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఉచిత బస్సు పచ్చి మోసం.. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని హామీ ఇచ్చిన చంద్రబాబు గతేడాది పథకాన్ని అమలు చేయలేదని మల్లాది గుర్తు చేశారు. ఈ ఏడాది ఆగస్టు 15న సీ్త్ర శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తూ కేవలం 5 రకాల బస్సులకే వర్తింపజేసి మహిళలను తీవ్రంగా వంచించారన్నారు. రాష్ట్రంలో 11,256 బస్సులుంటే సగం బస్సులకు కూడా పథకం వర్తించడం లేదని చెప్పారు. అంతర్ జిల్లాలకు, ఎక్కువ దూరం ప్రయాణించే సూపర్ లగ్జరీ, వెన్నెల, గరుడ, వెన్నెల వంటి బస్సులకు పథకం వర్తించడం లేదన్నారు. తూతూమంత్రంగా పథకాన్ని అమలు చేసి దాదాపు 2కోట్ల మంది మహిళలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన దానికి భిన్నంగా ఆంక్షలతో పథకాన్ని వర్తింపజేయడమే తప్పయితే, అమ్మవారి సమక్షంలో పచ్చి అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకి దేవుళ్లన్నా భయం లేదు, భక్తి లేదని చెప్పడానికి నిదర్శనమని మల్లాది విష్ణు అన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025భక్తి భావం.. జన ప్రవాహం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దసరా ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.విద్యార్థులకు దసరా సెలవుల నేపథ్యంలో అందరూ సొంతూరు బాట పట్టారు. దీంతో ఆదివారం విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. కోనేరుసెంటర్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయు డు అన్నారు. ఆదివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సిబ్బందికి యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు.దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆదివారం అర్ధరాత్రి భక్తజనం పోటెత్తారు. ఆలయ పరిసరాలతో పాటుగా పాతబస్తీలోని ప్రధాన వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజామున అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం రాత్రి పది గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున రావడంతో వారందరినీ నగరపాలకసంస్థ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన హోల్డింగ్ ప్రాంతం వైపు అధికారులు మళ్లించారు. రద్దీ కారణంగా తొక్కిసలాట లేకుండా బ్లాక్‌లుగా భక్తులను విడదీస్తూ ఎక్కడికక్కడ నిలిపివేశారు. సుమారు 12గంటల సమయంలో వారిని వినాయకునిగుడి వద్ద ఉన్న క్యూలైన్లలోకి అనుమతించారు. ఆలయ పరిసరాలతో పాటుగా బయట వైపు భక్తులెవరిని ఉంచకుండా వినాయకునిగుడి వైపునకు మళ్లించారు. – వన్‌టౌన్(విజయవాడపశ్చిమ) ఆదివారం అర్ధరాత్రి 12గంటల సమయంలో కంపార్ట్మెంట్ బయట వేచి ఉన్న భక్తులు7 -
రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి
వయస్సు 40 ఏళ్లు దాటిన వారు బీపీ, షుగర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. 50 ఏళ్లు దాటితే సీటీ కాల్షియం స్కోర్ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఒక్కోసారి ఈసీజీ నార్మల్ వచ్చినా గుండెపోటు రావచ్చు. చాలా మందికి గుండెపోటు గ్యాస్ నొప్పిలానే ఉంటుంది. ఛాతీలో వచ్చిన నొప్పిని అశ్రద్ధ చేయకుండా, వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహం ఉన్న వారు తరచూ గుండె పరీక్షలు చేయించుకోవాలి. ప్రీ డయాబెటీస్ ఉన్న వారు కూడా గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. – డాక్టర్ జె.శ్రీమన్నారాయణ, కార్డియాలజిస్ట్, సెంటినీ విజయవాడ ● -
ఇక తాడోపేడో!
సాక్షి టాస్క్ ఫోర్స్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పెత్తనం ఏంటని, ఎమ్మెల్యే వర్గం భగ్గుమంటోంది. దీంతో ఇటీవల బహిరంగంగానే ఎమ్మెల్యే కొలికపూడి తన అనుచరులతో కలిసి రాష్ట్ర టీడీపీ కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. పార్టీ కమిటీలు, ఇతర పదవులు నియోజకవర్గంలోని నాయకుల కార్యకర్తల ప్రమేయం లేకుండా నడుస్తున్నాయని ఎమ్మెల్యే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కనీసం వార్డు కమిటీల నియామకంలో కూడా సంప్రదించలేదని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు చర్చ సాగుతోంది. పైకి బాగానే ఉంటున్నా.. ఎమ్మెల్యే, ఎంపీ పైకి చెట్ట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తున్నా, లోలోపల మాత్రం కత్తులు దూసుకొంటున్నారు. తిరువూరు టీడీపీలో ఎమ్మెల్యేకు సమాంతరంగా, ఎంపీ ఓ వర్గాన్ని ప్రోత్సహించటంతోపాటు, వారికి షెల్టర్‌గా ఎంపీ కార్యాలయం మారటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. దీంతో ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్యే మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఎస్సీ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి కావడంతోనే, ఎంపీ కర్ర పెత్తనం చేస్తున్నారని టీడీపీ నాయకులే పెదవి విరుస్తున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కూడా కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత లేకుండా, ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా సీల్డ్ కవర్లలో పదవులు కేటాయించి పంపిచటం ఏంటని పలువురు నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అవినీతిలోనూ అంతా ఆయనే.. అవినీతి దందాల విషయంలో పార్లమెంట్ ముఖ్యనేతదే పైచెయ్యిగా మారింది. రేషన్ బియ్యం మాఫియా చేసే వ్యక్తిని, తన కార్యాలయంలోనే ఉంచుకొని రేషన్ బియ్యం, నెలవారీ మామూళ్లు దండుకోవటాన్ని ఎమ్మెల్యే సహించలేకపోతున్నారు. తిరువూరు నియోజకవర్గంలో పెద్దవరం చెక్‌పోస్టు నుంచి తెలంగాణకు బియ్యం రవాణా చేస్తున్నది పార్లమెంట్ ముఖ్యనేత అనుచరులేనని, ఎమ్మెల్యే వర్గీయులు కారాలు, మిరియాలు నూరుతున్నారు. తిరువూరులో గంజాయి మాఫియాకు పార్లమెంట్ ముఖ్యనేత వత్తాసు పలుకుతున్నారనే భావన ఎమ్మెల్యే వర్గీయుల్లో వ్యక్తం అవుతోంది. నియోజకవర్గంలోని పార్టీ పదవులు, దేవాలయాల చైర్మన్ పదవులు పార్లమెంట్ ముఖ్యనేత బేరం పెట్టి అమ్ముకున్నారని, ఆది నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎన్నికల సమయంలో పార్లమెంట్ ముఖ్యనేత ఓ ఎన్ఆర్ఐతో డబ్బులు ఖర్చు పెట్టించి, గెలిచాక కరివేపాకులా తీసి వేశారనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. మొత్తం మీద ఎమ్మెల్యే వర్గం తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం అవుతోంది. తిరువూరు టీడీపీలో తారస్థాయికి విభేదాలు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే కొలికపూడి ఫిర్యాదు నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ పెత్తనంపై ఆగ్రహం ఎవరి మాట వినాలో తెలియక ఇరుకున పడుతున్న అధికారులు పార్టీ, నామినేటేడ్ పదవులకు సీల్డ్ కవర్లో పేర్లు పంపడంపై రగిలిపోతున్న ఎమ్మెల్యే వర్గీయులు -
కృష్ణమ్మ ఉగ్రరూపం
జగ్గయ్యపేట: ఎగువ నుంచి కృష్ణానదికి వరద నీటిని విడుదల చేయటంతో పులిచింతల ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గత రెండు రోజులుగా క్రమక్రమంగా పెరుగుతూ వస్తుండటంతో మండలంలోని నదీ పరివాహక గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి 7లక్షల క్యూసెక్కుల నీటిని పులిచింతల నుంచి విడుదల చేయటంతో నది పరీవాహక గ్రామామైన రావిరాల జలదిగ్బంధంలో చిక్కుకుంది. అంతే కాకుండా ముక్త్యాల, జగ్గయ్యపేట గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. చుట్టుముట్టిన వరద.. కృష్ణానది ఒడ్డున ఉన్న రావిరాల గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. ఆ సమీపంలోని ఒడ్డున ఉన్న గృహాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో నది ఒడ్డున నివాసం ఉంటున్న ప్రజలను పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతేకాకుండా ముక్త్యాల, వేదాద్రి, రావిరాల గ్రామంలోని మత్స్యకారులు తమ పడవలను ఒడ్డుకు చేర్చారు. ముక్త్యాల వద్ద కోటిలింగ హరిహర మహాక్షేత్రం సమీపంలోని చంద్రమ్మకయ్య ఉద్ధృతంగా ప్రవహించడంతో జగ్గయ్యపేటకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. పరీవాహక ప్రాంత గ్రామాలను ఇన్చార్జ్ తహసీల్దార్ మనోహర్, చిల్లకల్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ ప్రజలను అప్రమత్తం చేశారు. -
పాఠశాల విద్యపై మంత్రి చూపే శ్రద్ధ ఇదేనా?
భవానీపురం(విజయవాడపశ్చిమ): ‘‘విద్యాశాఖ మంత్రిగా దాన్ని వదిలేసి మిగిలిన అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్న నారా లోకేష్ గారూ..పాఠశాల విద్యపై మీరు చూపే శ్రద్ధ ఇదేనా’’ అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. విజయవాడ భవానీపురం ఐరన్ యార్డ్‌లో గత నాలుగేళ్లుగా ఉన్న ఏపీ గురుకుల పాఠశాల (మైనార్టీ బాలికలు)ను ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామం పరిధిలోని పొలాల మధ్యగల మూతబడిన కాలేజీ భవనంలోకి తరలించటంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆదివారం పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. వారికి వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ లతోపాటు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. దొంగచాటుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి? వెలంపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల(శ్రీకాకుళం నుంచి నెల్లూరు)కు చెందిన మైనార్టీ బాలికలు చదువుకుంటున్న ఈ గురుకుల పాఠశాల యాజమాన్యం, కూటమి ప్రభుత్వం తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసుల భద్రతతో మారుమూల ప్రాంతానికి తరలించటం బాధాకరం అన్నారు. పేరెంట్స్ కమిటీని సంప్రదించి ఎందుకు మార్చాల్సి వస్తుందో చెప్పాల్సిన కనీస బాధ్యత విద్యా శాఖ అధికారులకు లేదా అని ప్రశ్నించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ విజయవాడ ఉత్సవ్ పేరుతో బిజీబిజీగా ఉండటంతో విద్యార్థినుల తల్లిదండ్రుల ఘోష పట్టించుకునే పరిస్థితుల్లో ఎవరూ లేరన్నారు. స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే చదివించండి లేదా టీసీలు తీసుకుని పొమ్మని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం బాధాకరమన్నారు. విద్యార్థినుల జీవితాలతో ఆడుకుంటున్నారు విద్యా సంవత్సరం మధ్యలో అర్ధంతరంగా స్కూల్‌ను తరలించటం విద్యార్థినుల జీవితాలతో ఆడుకోవడమేనని వెలంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఉంది.. పూర్తి రక్షణ ఉంటుదని పిల్లలను ఇక్కడ చదివిస్తుంటే, సుమారు 40 కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్యలో స్కూల్ పెడితే వైద్యం, ఇతర సహాయం కావాలంటే పట్టించుకునే వారెవరని మండిపడ్డారు. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు స్కూల్‌ను ఇక్కడే ఉంచాలని, లేదంటే తల్లిదండ్రులను పిలిచి మీటింగ్ పెట్టి వారికి అభ్యంతరం లేదని చెబితే తప్ప మార్చటానికి వీలు లేదని వెలంపల్లి స్పష్టం చేశారు. స్కూల్ మార్చాల్సివస్తే తల్లిదండ్రులకు ఎందుకు తెలియపరచరు? ఇదేనా ఆడపిల్లల భద్రత గురించి కూటమి ప్రభుత్వం ఆలోచించేది? మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల తరలింపుపై మాజీ మంత్రి వెలంపల్లి ఆగ్రహం -
లయ తప్పుతున్న లబ్ డబ్
లబ్బీపేట(విజయవాడతూర్పు): గుండె స్పందన అదుపు తప్పుతోంది. యుక్త వయస్సులోనే గుండెపోటు మరణాలను చూస్తున్నాం. కారణం ఏదైనా... ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండానే నడుస్తూ నడుస్తూనే కుప్పకూలి మరణించే వారిని ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. ఉమ్మడి కృష్ణాలో ప్రతిఏటా ఐదు వేల మందికి పైగానే గుండెపోటుకు గురవుతున్నారు. వారిలో మరణాలు సంభవిస్తున్నాయి. గుండె ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రతిఏటా ఒక నినాదంతో సెప్టెంబరు 29న వరల్డ్ హార్ట్ డేను జరుపుకొంటున్నాం. ఈ ఏడాది నినాదం డోంట్ మిస్ ఎ బీట్. ప్రతి గుండె స్పందన కీలకమని, గుండె ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, చెకప్‌లను ఆలస్యం చేయొద్దని, గుండె సంబంధిత సమస్యల హెచ్చరిక సంకేతాలపై అప్రమత్తంగా ఉండాలనేది ఈ నినాదం అర్ధం. యువతలో గుండెపోటు ప్రస్తుతం యువత గుండెపోటుకు గురవడం ఆందోళన కలిగించే అంశంగా ఉంది. గుండెపోటుకు గురయ్యే వారిలో 25 శాతం మంది 40 ఏళ్ల లోపు వారే ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. యువత గుండెపోటుతో మరణిస్తే ఆ ప్రభావం కుటుంబంపై, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రతి మూడు మరణాల్లో గుండెపోటు మరణం ఒకటిగా నమోదవుతోంది. అన్ని రకాల క్యాన్సర్ల కంటే గుండెపోటు మరణాలే ఎక్కువగా ఉంటున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండెపోటు మరణాల్లో 80 శాతం నివారించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఇలా చేయాలి... ● క్రమబద్ధమైన వ్యాయామం చేయాలి. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. ● వత్తిడిని తగ్గించుకోవాలి. ● ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. ● ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ●బీఎంఐ 18.5–25 మధ్య ఉండేలా చూసుకోవాలి. ● ప్యాక్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, జంక్‌ఫుడ్, రెడ్‌మీట్ తీసుకోకుండా ఉండటం మంచిది. ● ఆహారంలో ఉప్పును తగ్గించాలి. వ్యాధులను ఇలా అదుపులో ఉంచుకోవాలి ● మధుమేహం ఉన్న వారు హెచ్‌బీఏ1సీ 6.5 లోపు ఉండేలా చూసుకోవాలి. హెచ్‌బీఏ1సీ ఒక శాతం పెరిగితే గుండె జబ్బులు వచ్చే రిస్క్ 11 శాతం ఉంటుంది. ● మధుమేహం, కిడ్నీ జబ్బులు ఉన్న వారు బీపీ 120/80 ఉండేలా చూసుకోవాలి. మామూలు వ్యక్తులకు 130/80 ఉండొచ్చు. ● మధుమేహుల్లో ఎన్డీఎల్ కొలస్ట్రాల్ 50 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. సాధారణ వ్యక్తుల్లో 100 లోపు ఉండొచ్చు. జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, కొలస్ట్రాల్ వంటివి గుండెపోటుకు ప్రధాన కారణాలు. ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి మధుమేహం ఉండగా, ప్రతి పది సెకన్లకు ఇద్దరు మధుమేహం బారిన పడుతున్నారు. మధుమేహం అదుపులో లేని వారిలో 75 శాతం మందికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహులు సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు గురవడం వలన గుండెపోటు వచ్చినట్లు కూడా తెలియదు. మధుమేహుల్లో 25 శాతం మందిలో హార్ట్ ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చు. ప్రీ డయాబెటీస్ ఉన్న వారికి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు ఉన్న వారికి గుండె పెరగడం వంటి సమస్యతో పాటు గుండెపోటుకు గురవుతున్నారు. మెటబాలిజం సిండ్రోమ్ కూడా గుండెపోటుకు కారణమే. నేడు వరల్డ్ హార్ట్ డే.. ఈ ఏడాది నినాదం డోంట్ మిస్ ఎ బీట్ మీ గుండె స్పందన తెలుసుకోండి రెగ్యులర్‌గా గుండె చెకప్ చేయించుకోండి గుండెపోటుకు గురయ్యే వారిలో 25 శాతం యువకులే జీవనశైలి వ్యాధులే కారణం అంటున్న వైద్యులు ఛాతీలో నొప్పిని అశ్రద్ద చేయొద్దు ప్రతి ఏటా ఉమ్మడి కృష్ణాలో ఆరు వేల మందికి పైగా గుండెపోటుకు గురవుతున్నట్లు అంచనా -
అక్టోబర్ 7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నా
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై అక్టోబర్ ఏడో తేదీన విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎ.సుంద రయ్య, డాక్టర్ రాజు తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ధర్నా పోస్టర్, ఆవిష్కరణ, జిల్లా స్థాయి సమావేశం జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన డెప్యూటీ సెక్రటరీ జనరల్ నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి అప్లోడ్, డౌన్లోడ్, బయోమెట్రిక్, మెగా పీటీఎం, యోగాంధ్ర, పరీక్షలు బుక్స్‌లో రాయటం, గ్రీన్ పాస్‌పోర్ట్ తదితర కార్యక్రమాలు బోధనకు ఆటంకాలుగా మారాయన్నారు. అక్టోబర్ 10 లోపు బోధనేతర పనులు తగ్గించకపోతే ఫ్యాప్టో ఆధ్వర్యంలో బహిష్కరణకు పిలుపునిస్తామని నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఎ.సుందరయ్య మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలు, డీఏలు, పీఆర్సీ నియామకం, మధ్యంతర భృతి అంశాలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. ఫ్యాప్టో జిల్లా కార్యదర్శి డాక్టర్ రాజు మాట్లాడుతూ విజయవాడ కార్పొరేషన్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన వైఎస్సార్ కాలనీ మహిళలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీకి చెందిన పలువురు మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాలనీకి చెందిన పెద్ది రాంబాయిమ్మ ఆధ్వర్యంలో 30 మంది మహిళలు తెలుగు దేశం పార్టీ నుంచి వైఎస్సార్ సీపీలో జాయిన్ అయ్యారు. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ జోగి రమేష్ నివాసంలో ఆదివారం ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన మహిళలను ఆయన సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండలం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు బయ్యారపు రవికిషోర్, ఎంపీటీసీలు కొరగంజి సత్యనారాయణ, షేక్ సైదాబీ వలీ, కాలనీ నాయకులు నక్కా ప్రభుదాస్, మారపాక రాంబాబు, కుంభా నాగరాజు, ముళ్ల లాజర్, టీఎల్ రాజు, ఎస్కే షరీఫ్, గద్దల లాజర్, విన్నపాల రంగారావు, చల్లా అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మహిళలు జోగి రమేష్‌ను సత్కరించారు. చిల్లకల్లు(జగ్గయ్యపేట): పద్నాలుగేళ్ల మైనర్ బాలికను గర్భవతిని చేసిన కేసులో ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు చిల్లకల్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక అదే గ్రామానికి చెందిన నాదెండ్ల నాగరాజు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో నాగరాజు స్నేహితుడు అమరబోయిన గోపి పరిచయమై శారీరకంగా కలిశారు. ఇటీవల బాలికకు కడుపునొప్పి రావటంతో తల్లి వైద్య పరీక్షలు చేయించటంతో ఏడు నెలల గర్భవతి అని తేలింది. దీంతో ఆమె ఆదివారం పోలీసులకు ఫిర్యాదుచేయగా నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణంమరొకరికి తీవ్ర గాయాలు కంచికచర్ల: వేగంగా వెళుతున్న కారు ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహ నాన్ని ఢీకొనగా ఒక వ్యక్తి మృతి చెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గా యాలయ్యాయి. ఈ ఘటన కంచికచర్లలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాఽథ్ కథనం మేరకు హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపునకు వెళుతున్న కారు కంచికచర్ల ఫ్లైఓవర్ సమీపంలోకి రాగానే ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని వేగంగా వచ్చి ఢీ కొంది. ఈ ఘటనలో కారులో వెనుక సీట్లో కూర్చున్న హైదరాబాద్‌కు చెందిన వట్టికూటి చలపతిరావు(45) అక్కడికక్కడే మృతిచెందారు. విజయవాడకు చెందిన కారు డ్రైవర్ విశ్వనాథపల్లి గణేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని వైద్య చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కారు ఢీకొని మహిళ మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆగి ఉన్న ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా పామూరు మండలం, మార్కొండపురం గ్రామానికి చెందిన రాగిపిండి విజయదుర్గ (35), చంద్రశేఖర్‌రెడ్డి భార్యాభర్తలు. వారు మరమరాలు విక్రయిస్తూ జీవిస్తున్నారు. వారి కుమారుడు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలో ఒక ప్రైవేట్ ఇంటర్మీడియెట్ కళాశాలలో చదువుతున్నాడు. దసరా సెలవుల సందర్భంగా కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు భార్యాభర్తలు ఇద్దరు శనివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో బందరురోడ్డులోని వివంతా హోటల్ వద్దకు ఆదివారం తెల్లవారుజాము ఒంటి గంట సమయంలో చేరుకున్నారు. చంద్రశేఖర్‌రెడ్డి ఆటో దిగి డ్రైవర్‌కు డబ్బులు ఇస్తుండగా విజయదుర్గ లగేజీ తీసుకుంటూ ఆ వాహనంలోనే ఉండిపోయింది. అదే సమయంలో బెంజిసర్కిల్ వైపు నుంచి కంట్రోల్ రూమ్ వైపు అతివేగంగా ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో కొంచెం ముందుకు వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆటోలో ఉన్న విజయదుర్గ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. ఆటోడ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెన్షన్ పొందడం ప్రతి ఉద్యోగి నైతిక హక్కు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాజ్యాంగ బద్ధంగా విశ్రాంత ఉద్యోగులకు కల్పించిన హక్కుల పరిరక్షణకు పెన్షనర్లందరూ సమష్టిగా కృషి చేయాలని విశ్రాంత సెంట్రల్ జీఎస్టీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సి.పి.రావు అన్నారు. ఆదివారం విజయవాడ గాంధీనగర్‌లోని ఓ హోటల్లో ఆదివారం జరిగిన ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సె్స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఆంధ్రప్రదేశ్ యూనిట్ ఐదో సర్వ సభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పెన్షన్ పొందటం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నైతిక హక్కు అన్నారు.మరో అతిథి విశ్రాంత కస్టమ్స్ చీఫ్ కమిషనర్ బి.హరేరామ్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు సమాజంలో గౌరవంగా బతకడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1871లో పెన్షన్ పథకాన్ని అమలులోకి తెచ్చిందని గుర్తు చేశారు. సమావేశంలో సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్, పెన్షనర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గద్దె తిలక్, టి.వివేకానంద తదితరులు మాట్లాడారు. అనంతరం 75 ఏళ్లు నిండిన పెన్షనర్లను సత్కరించారు. క్రీడల్లో మెడల్స్ సాధిస్తున్న విశ్రాంత ఉద్యోగి కరాడే శివ ప్రసాదరావుకు జ్ఞాపికను అందించారు. కార్యక్రమంలో సెంట్రల్ జీఎస్టీ అసి స్టెంట్ కమిషనర్లు ఎం.నాగరాజు, రవి కుమార్, పెన్షనర్ల సంఘ నాయకులు పాల్గొన్నారు. మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని శాసనసభ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సూచించారు. విజయవాడ సిద్ధార్థ కళాశాల మైదానంలో ఆరో జాతీయ జూనియర్, సీనియర్– సీ యోగాసన చాంపియన్‌షిప్ పోటీలను ఆయన ఆదివారం ప్రారంభించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ నగరంలో జాతీయ స్థాయి యోగాసన పోటీలు జరగడం విజయవాడకు గర్వకారణమన్నారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు 1,500 మందికి పైగా హాజరవుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎ.రాధిక, గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రదర్శించిన యోగ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. -
గుట్టుగా గురుకుల పాఠశాల తరలింపునకు యత్నం!
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ (మైనార్టీ బాలికల గురుకుల విద్యాలయం)ను గుట్టుగా తరలించేందుకు చేస్తున్న యత్నం వివాదాస్పదమైంది. విజయవాడ భవానీపురంలోని ఐరన్యార్డ్ పారంతంలో ఉన్న గురుకుల పాఠశాలను ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామం బొద్దనపల్లెకు మార్చాలని ఏపీఆర్ స్కూల్ సెక్రటరీ వి.ఎన్.మస్తానయ్య ఈ నెల ఐదో తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ గీతాంజలి సన్నాహాలు చేపట్టారు. ప్రస్తుతం దసరా సెలవులకు విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. ఈ తరుణంలో తమకు సమాచారం ఇవ్వకుండా స్కూల్ తరలించే యత్నాలను తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న పాఠశాలను మారుమూల గ్రామంలో సుమారు ఏడేళ్ల క్రితం మూతబడిన కుంద ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన ఎటువంటి రక్షణ లేని కాలేజీ భవనంలోకి తరలిస్తే, అక్కడ పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. గతంలో వద్దని.. ఇప్పుడు కావాలని.. విద్యాధరపురంలోని ఆర్టీసీ ట్రైనింగ్ స్కూల్ భవనంలో గురుకుల పాఠశాల 16 ఏళ్లు నడిచింది. ఆర్టీసీ యాజమాన్యం ఖాళీ చేయాలనటంతో నాలుగేళ్ల క్రితం భవానీపురం ఐరన్యార్డ్లోని ఒక భవనంలోకి మార్చారు. ప్రస్తుతం ఇక్కడ వివిధ జిల్లాల నుంచి సుమారు 211 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఈ ఏడాది జూలైతో భవనం అద్దె అగ్రిమెంట్ గడువు ముగిసింది. అంతకు ముందు నుంచి వేరే భవనం కోసం గాలిస్తున్నారు. ఈదర గ్రామంలో ఉన్న కుంద ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన డిగ్రీ కాలేజీ భవనాన్ని గతంలో పరిశీలించగా ఎక్కడో దూరంగా మారుమూల ఉండటంతో ఏపీఆర్ స్కూల్స్ సెక్రటరీ వి.ఎన్.మస్తానయ్య తిరస్కరించారని సమాచారం. ఆయనే ఇప్పుడు అదే భవనంలోకి మార్చాలని ఉత్తర్వులు జారీ చేయడానికి ఈ గురుకుల పాఠశాలలో గతంలో ప్రిన్సిపాల్‌గా పని చేసిన వ్యక్తి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న స్కూల్‌ను వేరే జిల్లాకు మార్చకూడదన్న జీఓ ఉంది. అయినా అధికారులు దానికి వ్యతిరేకంగా వ్యవహరించడం గమనార్హం. పాఠశాల తరలింపు విషయం తెలిసిన వైఎస్సార్ సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ స్కూల్ వద్దకు వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఏడేళ్ల క్రితం మూతబడిన కాలేజీలో ఏర్పాటుకు చర్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో ఇదే భవనాన్ని తిరస్కరించిన ఏపీఆర్ స్కూల్ సెక్రటరీ -
దుర్గమ్మను దర్శించుకున్న చత్తీస్ఘడ్ వాసులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు చత్తీస్ఘడ్ నుంచి భక్తులు విచ్చేశారు. సుమారు 50 మందికి పైగా భక్తులు ప్రత్యేక వాహనంపై విజయవాడకు విచ్చేసి వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని తమ సాంప్రదాయం ప్రకారం పూజలు చేసి తాము పండించిన పలు పండ్లను అందచేశారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఏటా పిల్లా పాపలతో అమ్మవారి దర్శనానికి వస్తుంటామని చెప్పారు. అమ్మవారి దయతో తామంతా ఏ ఇబ్బంది లేకుండా సుఖసంతోషాలతో ఉంటున్నామని పేర్కొన్నారు. దర్శనం అనంతరం కొండపై ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్ వద్ద లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేశారు. తమ గ్రామానికి చెందిన వారితో పాటు బంధువులందరికీ అమ్మవారి ప్రసాదాలు అందచేస్తామన్నారు. -
ఆదిదంపతుల నదీ విహారంపై సందిగ్ధం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్స వాల ముగింపును పురస్కరించుకుని ఆది దంపతులు నదీ విహారం చేసేందుకు అవసరమైన హంసవాహనం ముస్తాబవుతోంది. దుర్గాఘాట్‌లో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. విజయ దశమిని పురస్కరించుకుని అక్టోబర్ రెండో తేదీ సాయంత్రం ఐదు గంటలకు శ్రీగంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లు కృష్ణా నదిలో విహరిస్తారు. ఇందు కోసం హంసవాహనాన్ని రంగులతో ముస్తాబు చేయడం పూర్తగా, విద్యుత్ దీపాలంకరణ పనులు జరుగుతున్నాయి. అయితే నదికి వరద పోటెత్తిన నేపథ్యంలో నదీ విహారం అనుమానమేనని దేవస్థానం అధికారులు పేర్కొంటున్నారు. రెండు రోజులుగా మూడు లక్షల క్యూసెక్కు లకు పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో హంసవాహనం (ఫంట్) నదిలోకి వెళ్లడం ఇబ్బందికరమేనని అధికారులు పేర్కొంటున్నారు. దుర్గాఘాట్ వద్దే హంసవాహనంపై ఆదిదంపతులకు పూజలు నిర్వహించి, ఫంటును మూడు సార్లు ముందుకు, వెనక్కి నడిపించి కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం సమాచారం. -
లారీ ఢీకొని పాత్రికేయుడు దుర్మరణం
గన్నవరం: లారీ ఢీకొని సీనియర్ జర్నలిస్ట్ దుర్మరణం చెందిన సంఘటన మండలంలోని కేసరపల్లి శివారు దుర్గాపురం వద్ద శనివారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం...స్థానిక గౌడపేటకు చెందిన నెక్కలపు శ్రీనివాసరావు(50) ప్రజాశక్తి విలేకరిగా, వీకేఆర్ కళాశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కళాశాల విధులకు హాజరై తిరిగి బైక్‌పై గన్నవరం బయలుదేరారు. దుర్గాపురంలోని హెచ్‌సీఎల్ వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బీవీ. శివప్రసాద్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం శ్రీనివాసరావు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మూడు దశాబ్దాలుగా పాత్రికేయుడిగా పనిచేసిన శ్రీనివాసరావుకు పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.హనుమాన్‌జంక్షన్ రూరల్:చైన్నె–కోల్కత్తా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం అంపాపురం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొటనంతో భవానీ మాల ధరించిన వ్యక్తి దుర్మరణం చెందాడు. అంపాపురంలోని పతాంజలి పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న టీ స్టాల్లో శనివారం టీ తాగి రోడ్డు దాడుతుండగా ఓ వాహనం భవానీ మాల ధరించిన వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోతుందని స్థానికుల నుంచి సమాచారం అందటంతో వీరవల్లి పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడు సుమారు 55 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నాడని, మృతుడి దుస్తుల్లో అడ్రస్‌కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయిన వాహనాన్ని పట్టుకునేందుకు వీరవల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
నేటి నుంచి జాతీయ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్‌షిప్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలో ఆదివారం నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు 6వ జూనియర్, సీనియర్–సీ విభాగాల నేషనల్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్ షిప్–2025–26 నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ చెప్పారు. కళాశాల ఆవరణలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యోగాసన భారత్, ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. జూనియర్స్ (14 నుంచి 18 ఏళ్లు), సీనియర్–సీ (45 నుంచి 55 ఏళ్లు) వారు ఈ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 618 మంది క్రీడాకారులు పాల్గొంటారని వెల్లడించారు. బాల బాలికల విభాగంలో ట్రెడిషనల్ వ్యక్తిగత, గ్రూపు, ట్రెడిషనల్ స్పెసిఫికేషన్, ఆర్టిస్టిక్, సోలో, ఆర్టిస్టిక్ పెయిర్, రిథమిక్ పెయిర్ ఈవెంట్లతో పాటు సీనియర్–సి విభాగంలో ట్రెడిషనల్ వ్యక్తిగత, స్పెసిఫికేషన్ కేటగిరీల్లో పోటీలు ఉంటాయని వివరించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని అంతర్జాతీయ యోగాసన పోటీల్లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేస్తామన్నారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.రాధిక, యోగాసన భారత్ స్పోర్ట్స్ ప్రతినిధి శ్రేయస్ మార్కండేయ, ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎం.రాజశేఖరరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కె.రామకృష్ణ, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు డి.దుర్గారావు, ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి పాల్గొన్నారు. -
హస్తకళలు కాపాడుకోవాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ):దేశ సంస్కృతిలో భాగమైన హస్తకళలు కనుమరుగవ్వకుండా కాపాడుకోవాలని సీఆర్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్‌లో ‘అపిటికో’, రాష్ట్ర హస్తకళాకారుల సంస్థలు శనివారం సంయుక్తంగా నిర్వహించిన ఒక రోజు వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ భిన్న మతాలు, జాతులు, తెగల సంస్కృతుల మధ్య దేశంలో కొనసాగతోన్న ఏకత్వానికి హస్తకళారూపాలు, నాట్య, సంగీత, సాహిత్యాలు దోహదపడతాయని పేర్కొన్నారు. తరతరాల నుంచి వస్తున్న హస్తకళల వారసత్వాన్ని భవిష్యత్ తరాలు అందిపుచ్చుకునేలా కృషి చేయాలని సూచించారు. హస్తకళల వృత్తి నైపుణ్యాన్ని, వ్యాపార ధోరణులను నేర్చుకోవాలని కోరారు. ప్రస్తుత అధునాతన వాణిజ్య పోకడలతో తమ ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేసేలా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలని తెలిపారు. మన హస్త కళాకృతులను అమెజాన్ వంటి సంస్థల సహకారంతో దేశవిదేశాల్లో ఖ్యాతి గడించాలని ఆకాంక్షించారు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న శిక్షణ, మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లాభపడాలని కోరారు. ప్రొఫెసర్ ఆదినారాయణ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి, మార్కెటొంగ్ సదుపాయాలపై హస్తకళాకారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ సీనియర్ కన్సల్టెంట్ పి.సుధీర్‌కుమార్ పాల్గొన్నారు. -
సీఎం పర్యటనపై సమీక్ష
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ):దసరా ఉత్సవాల నేపథ్యంలో మూలానక్షత్రం, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకొని అధికారులు బందోబస్త్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. కమాండింగ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశా, నగర పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఆలయ ఈవో శీనానాయక్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. 29వ తేదీన మూలనక్షత్రం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని సూచించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా అమ్మవారి దర్శనం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. చివరి ఐదు రోజుల్లో స్థానిక భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం నిమిత్తం వస్తారని పేర్కొన్నారు. నీరు, పాలు, ఆహారం మొదలైనవి అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
సామాన్య భక్తులకే పెద్దపీట
లబ్బీపేట(విజయవాడతూర్పు):దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. అందుకోసం అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా శనివారం జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశాతో కలిసి పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు సామాన్య ప్రజలు ఏ విధంగా దర్శనం చేసుకుంటున్నారు, వారికి క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయాలను పరిశీలించారు. సామాన్య భక్తులు లాగా వినాయక టెంపుల్ నుంచి ఉచిత క్యూ లైన్లో నడుచుకుంటూ పర్యవేక్షించారు. అంతరాలయం, శివాలయం ఏరియా, మహామండపం, లిఫ్ట్ మార్గం, అన్నదానం, ప్రసాదం తయారు చేసే ఏరియాలను, కనకదుర్గా నగర్, ప్రసాదం కౌంటర్లు, రథం సెంటర్, వినాయక టెంపుల్, కేశఖండనశాల, హోల్డింగ్ ఏరియాలను పరిశీలించారు. ఈ క్రమంలో కొందరు అనధికారికంగా లిఫ్ట్ మార్గం ద్వారా దర్శనాలకు తీసుకువెళుతున్నారనే సమాచారం మేరకు లిఫ్ట్ మార్గాన్ని పరిశీలించి అక్కడి సిబ్బందికి కచ్చితమైన ఆదేశాలను జారీ చేశారు. అన్నదానం జరిగే ప్రదేశం వద్ద భక్తులను ఏర్పాట్లను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రసాదం క్యూలైన్లను పరిశీలించి అక్కడి సిబ్బందికి భక్తులతో మర్యాదగా వ్యవహరిస్తూ సంయమనం పాటించాలని ఆదేశించారు. వారి వెంట ఎస్పీ గంగాథర్, పశ్చిమజోన్ ఏడీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సీఐ గురుప్రకాష్ తదితరులు ఉన్నారు. -
ప్రజాప్రతినిధులకు విన్నవించాం
పాఠశాల తరలింపును వ్యతిరేకిస్తూ విద్యా శాఖ మంత్రి, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ ఆఫీసుల్లో వినతి పత్రాలు అందజేశాం. ఇంత వరకు ఎవరూ స్పందించలేదు. నగరానికి 20 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న ప్రాంతానికి స్కూల్‌ను మారిస్తే, అక్కడ ఏదైనా జరిగితే మేము వెళ్లాలన్నా గంట సమయం పడుతుంది. స్కూల్ భవనం ఎక్కడున్నా సమస్యలు ఎదురవుతుంటాయని ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా చెబుతున్నారు. – భూమన రామకృష్ణ, స్కూల్ పేరెంట్స్ కమిటీ వైస్ చైర్మన్ -
డిజిటల్ బుక్ అంటే ఏమిటో చూపిస్తాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘ఇప్పుడు రెడ్‌బుక్ పేరుతో మా కార్యకర్తలను ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, వారికి డిజిటల్ బుక్ అంటే ఏమిటో చూపిస్తాం’ అని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సామాన్యులను కూటమి పార్టీల నాయకులు వేధిస్తున్నారని విమర్శించారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ నాయకులతో కలిసి దేవినేని అవినాష్ డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. ఈ నెల 24వ తేదీన తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారని గుర్తుచేశారు. రెడ్ బుక్ తరహాలో తాము చిల్లరగా వ్యవహరించబోమని స్పష్టంచేశారు. కూటమి నాయకులతో పాటు కొంత మంది అధికారులు కూడా వైఎస్సార్ సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటా మని స్పష్టంచేశారు. అసెంబ్లీకి తాగొచ్చిన బాలకృష్ణ నూటికి నూరు పాళ్లు బాలకృష్ణ అసెంబ్లీకి తాగి వచ్చాడని వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బాల కృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్ అని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్, నాగబాబు ఏం చేస్తు న్నారు, తమ అన్నయ్య చిరంజీవిని వాడూ వీడూ అని బాలకృష్ణ హేళన చేసినా స్పందించరా అని ప్రశ్నించారు. నాగబాబు, పవన్‌కల్యాణ్ తమ అమ్మను తిట్టించిన వారికి ఊడిగం చేస్తున్నారని ఎద్దేవాచేశారు. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ చేస్తున్న దుర్మార్గాలకు చెక్ పెట్టేలా డిజిటల్ బుక్ తీసుకొచ్చామన్నారు. కొందరు అధికారులు కూటమి ప్రభుత్వానికి బానిసలుగా పని చేస్తున్నారని, డిజిటల్ బుక్‌లో ఏ అధికారి పేరు వస్తుందో వారిపై తాము అధికారంలోకి వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, పార్టీ జగ్గయ్య పేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పలువురు పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ -
నేటి అలంకారం శ్రీమహాచండీదేవి
● వైభవంగా దసరా ఉత్సవాలు ● శ్రీలలితాత్రిపురసుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం ● ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్న భక్తులు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ శనివారం శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులను కరుణించారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం మూడున్నర గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. దుర్గమ్మ దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లు, ఆలయ పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. తెల్లవారుజాము టైం స్లాట్‌కు ప్రముఖులు, వీఐపీలు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన వీఐపీ టైం స్లాట్‌లో ఎక్కువ రద్దీ కనిపించింది. దుర్గగుడి అధికారులను అడ్డుకున్న పోలీసులు శనివారం రెండో షిప్టు విధులకు హాజరయ్యే ఆలయ అధికా రులు, ఇంజినీరింగ్ సిబ్బందిని పోలీసులు లిఫ్టు వద్ద అడ్డుకున్నారు. లిఫ్టు మార్గంలో ఎవరినీ అనుమతించబోమని పోలీసులు చెప్పడంతో గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. లిఫ్టు మీదగా కొండ పైకి ఎవరినీ అనుమతించొద్దన్న ఉన్నతాధికారుల ఆదేశాలనే తాము పాటిస్తున్నామని పేర్కొన్నారు. పోలీసులు తీరుతో ఏఈఓలు, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. కనకమహాలక్ష్మి, ద్వారకా తిరుమల ఆలయాల నుంచి పట్టువస్త్రాలు దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మకు విశాఖపట్నం శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి తరఫున ఆ ఆలయ అధికారులు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. కనకమహాలక్ష్మి ఆలయ ఈఓ కె.శోభారాణి, ఆలయ అర్చకులు, అధికారులు పట్టువస్త్రా లతో ఇంద్రకీలాద్రికి చేరుకోగా దుర్గగుడి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆలయ అర్చకులకు పట్టు వస్త్రాలు, పూలు, ఉత్తరాంధ్ర సంప్రదాయం ప్రకారం కావడితో అరటిపళ్ల గెలలను అందజేశారు. అనంతరం దుర్గగుడి అధికా రులు అమ్మవారి ప్రసాదాలను అందించారు. దుర్గమ్మకు శనివారం ద్వారకా తిరుమల దేవస్థానం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ ఈఓ ఎన్.వి.ఎస్.ఎన్. మూర్తి దంపతులు, చైర్మన్ కుమారుడు నివృత్తి రావుతో పాటు కుటుంబ సభ్యులు ఇంద్రకీలాద్రికి రాగా దుర్గ గుడి ఈఓ శీనానాయక్, ఆలయ వైదిక కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఈఓ తదితరులు దుర్గగుడి ఈఓకు పట్టు వస్త్రాలు అందజేశారు. అర్చక సత్కారం దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అర్చకలను ఘనంగా సత్కరించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాలు, దేవస్థానాలకు చెందిన 200 మంది అర్చకులను సత్కరించి, నగదు పురస్కారాలు అందజేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ విచ్చేసి అర్చకులను ఘనంగా సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.4,500 చొప్పున మొత్తం రూ.9 లక్షలను అర్చకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శీనానాయక్, దేవస్థాన వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. గాలిగోపురం వద్ద పుష్పాలంకరణ ఆలయ ప్రాంగణంలోని గాలిగోపురం వద్ద పత్యేక పుష్పాలంకరణ చేశారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో పుష్పాలంకరణ చేయకపోవడంపై వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం గాలిగోపురంతో పాటు లక్ష్మీగణపతి ప్రాంగణంలోనూ పుష్పాలంకరణపై ఆలయ అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపారు. చూసిన కనులదే భాగ్యం శ్రీగంగాపార్వతి సమేతంగా మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవం శనివారం సాయంత్రం కనుల పండువగా సాగింది. ఈ వేడుకలో ఆదిదంపతుల వెంట అడుగులో అడుగు వేయాలని భక్తులు పరితపించారు. దసరా ఉత్సవాల వేళ తమకు కలిగిన భాగ్యాన్ని తలుచుకుని మురిసిపోయారు. సారెతో విశాఖపట్నం మహాలక్ష్మి ఆలయ ఈఓ శోభారాణి తదితరులుఅమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న ద్వారకా తిరుమల చైర్మన్, ఈఓలు శరన్నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మ ఆదివారం శ్రీమహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీమహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్లే. అమ్మవారి అనుగ్రహంతో విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయి. సంకల్పాలు నెరవేరి భక్తులకు విజయం సిద్ధిస్తుంది. -
లక్షమందికి రుణాలివ్వడమే లక్ష్యం
భవానీపురం(విజయవాడపశ్చిమ): కాల్‌మనీ, అధిక వడ్డీలతో సతమతమవుతున్న చిరు వ్యాపారులకు తమసంస్థ తరఫున అతితక్కువ వడ్డీతో రుణాలిచ్చి చేయూత ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని గోదావరి–కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ (జీకె) లిమిటెడ్ చైర్మన్ మేడూరి జీవన్ వెంకట్రావ్ తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా లక్ష మంది చిరువ్యాపారులకు రుణాలు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి శివారులోని సీఎ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం జరిగిన ఆసంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ రూ.83.60 కోట్ల డిపాజిట్లు కలిగి ఉన్నామని, అందులో రూ.59.41 కోట్లు మేర రుణాలను ఇచ్చి లాభాల బాటలో అడుగుపెట్టామని తెలిపారు. ధర్మ నిధి ఇన్‌కం స్కీమ్ ద్వారా ఆలయాలు, చర్చిలు, మసీదులు, వృద్ధ, అనాధ ఆశ్రమాలు వంటి స్వచ్చంద సేవా సంస్థల నిర్వాహకుల నుంచి సేకరించే డిపాజిట్లపై 14.4 శాతం వడ్డీ అందించున్నట్లు తెలిపారు.సొసైటీజనరల్ సెక్రటరీ పూర్ణిమ దామెర్ల, డైరెక్టర్లు, సభ్యులు, ఖాతాదారులు పాల్గొన్నారు. మేడూరి జీవన్వెంకట్రావ్ -
‘విజయ’ అవుట్లెట్లలో డ్వాక్రా ఉత్పత్తుల విక్రయం
హనుమాన్‌జంక్షన్ రూరల్: మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న నాణ్యమైన ఆహార ఉత్పత్తులను ‘విజయ’ బ్రాండ్ పేరిట విక్రయించేందుకు కార్యాచరణ చేపట్టామని కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. స్థానిక విజయవాడరోడ్డులోని కాకాని భవనంలో చలసాని అధ్యక్షతన 35వ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు చేయడంతోపాటు నూతన ఉత్పత్తులను ఆవిష్కరించారు. గత ఆరేళ్లలో గణనీయమైన వృద్ధి సాధించామని తెలిపారు. 2018–19లో పాల సేకరణ 6.04 కోట్ల లీటర్లు కాగా, ప్రస్తుతం 10.29 కోట్ల లీటర్లకు చేరిందని పేర్కొన్నారు. యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వరబాబు, పాలకవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, పాలకవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
బాధితులకు అండగా ఉండటం అందరి బాధ్యత
రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినిత గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాధితులకు అండగా నిలవడంతోపాటు వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినిత అన్నారు. విజయవాడ హనుమాన్‌పేట ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని వన్‌స్టాప్ సెంటర్‌ను శుక్రవారం ఆమె సందర్శించారు. మహిళలకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలను పరిశీలించారు. వన్‌స్టాప్ సెంటర్ పనితీరును సమీక్షించారు. రికార్డులు తనిఖీ చేశారు. సెంటర్ సిబ్బంది స్వప్న, డబ్ల్యూఎస్ఐ ప్రేమలత ఇతర సిబ్బందితో సమావేశమై బాధితులకు అందుతున్న సాయం, కేసుల పరిష్కారం గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె వివరించారు. ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని వినీత పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతోపాటు, ఆమెకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలి కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎనస్థీషియాలజిస్ట్స్(ఐఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ వై.అచ్యుతరావు, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ డీవీ మహేశ్వరరావు ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి డాక్టర్ యు.తారక ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా డాక్టర్లు అల్లు పద్మజ, డి.రాజశేఖర్, కె.అపరంజి, సీహెచ్ రాకేష్, పి.అనిల్ కుమార్, కె.వినీలనాథ్, ఉదయ్‌శంకర్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి ఐఆర్సీఎఫ్ చైర్మన్ డాక్టర్ ఎస్ఎస్సీ చక్రరావు, ఐఎస్ఏ నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎ.కామేశ్వరరావు తదితరులు అభినందనలు తెలిపారు. -
దుర్గమ్మ సన్నిధిలో జర్నలిస్టుల ఆందోళన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో పుష్పాలంకరణ సరిగా లేదంటూ భక్తుల అభిప్రాయాలను కథనాలు, స్క్రోలింగ్‌లు ప్రసారం చేయడంపై ఈవో శ్రీనానాయక్ ఆగ్రహం వ్యక్తంచేయడంపై మీడియా ప్రతినిధులు ఆందోళన చేశారు. ప్రజాభిప్రాయాన్ని ప్రసారం చేయడం చేయడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే..ఆలయంలో పుష్పాలంకరణ గతేడాది బాగా చేశారు. ఈ ఏడాది నామమాత్రంగా ఉందంటూ భక్తులు విషయాన్ని మీడియా ప్రతినిధులకు తెలియజేయడంతో వారు తమ చానళ్లలో స్క్రోలింగ్‌లు ఇచ్చారు. ఈక్రమంలో మీడియా ప్రతినిధులు పెట్టిన స్రోల్లింగ్పై ఆలయ ఈవో శీనానాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది పుష్పాలంకరణ బాగా చేశారనేందుకు సాక్ష్యాలు ఉన్నాయా? అని మీడియా ప్రతినిధులను ప్రశ్నించడమే కాకుండా తనను అడగకుండా స్క్రోల్లింగ్ ఎలా పెడతారని ప్రశ్నించారు. దీంతో మీడియా ప్రతినిధులంతా ‘మీకు చెప్పి ఎందుకు స్రోల్లింగ్ పెట్టాలి...చేసే పనిసరిగా లేదని మాత్రమే చెబుతామని ఈవోకు బదులివ్వడంతో ఆయన మిన్నకుండిపోయారు. ఆలయ ప్రాంగణంలో బైఠాయింపు.. మరోవైపున ఆర్డీవో మాధురి ఆలయంలోకి వెళ్లే మార్గాలకు తాళాలు వేయడం, మహిళా ప్రతినిధులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు సైతం వెళ్లకుండా అడ్డుకోవడం, మీడియా ప్రతినిధుల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో నిరసన వ్యక్తమైంది. దీంతో ఆలయ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులు బైఠాయించారు. ఆలయ ఈవో శీనానాయక్ మీడియా ప్రతినిధుల వద్దకు వచ్చి వారిని సముదాయించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మరో వైపున వీఐపీ దర్శనాల పేరిట ఇష్టానుసారంగా కొండపైకి వచ్చే వారిని మీడియా ప్రతినిధులు నిలువరించారు. వీఐపీ టైం స్లాట్ లేకపోయినా ఇష్టానుసారం దర్శనాలకు వస్తున్నారని దీంతో సామాన్య భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటూ వారిని కూడా క్యూలో వచ్చి దర్శనం చేసుకోవాలని పేర్కొనడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఏడీసీపీ జీ.రామకృష్ణ, వన్‌టౌన్ సీఐ గురుప్రకాష్ వచ్చి మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. చివరకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దుర్గగుడికి చేరుకుని మీడియా ప్రతినిధులు, మహిళా మీడియా ప్రతినిధులతో మాట్లాడి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ శాఖలకు చెందిన అన్ని విభాగాలు తమ బంధువులను దర్శనానికి తీసుకువస్తున్నా పట్టించుకోకుండా, మీడియా ప్రతినిధులు ఎందుకు అన్నిసార్లు తిరుగుతున్నారని ప్రశ్నించడమే కాకుండా ఆంక్షలు విధించడం సరికాదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మరో మారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని, ఉత్సవాలలో ఇటువంటి పరిస్థితి చోటుచేసుకోవడం బాధకరమని కలెక్టర్ పేర్కొన్నారు. ఆందోళన గంటపాటు సాగగా, చివరికి కలెక్టర్ సముదాయించడంతో మీడియా ప్రతినిధులు ఆందోళనను విరమించారు. -
నృత్యరూపకం
నయన మనోహరం.. విజయవాడ కల్చరల్: దసరా మహోత్సవాల సందర్భంగా ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం (సిద్ధార్థ అకాడమీ అనుబంధ సంస్థ) ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని సిద్ధార్థా అకాడమీ కళావేదికపై శుక్రవారం ప్రదర్శించిన మహాకాళి నృత్యరూపకం నయన మనోహరంగా సాగింది. హైదరాబాద్ ఆర్ట్ ఇండియా ఫౌండేషన్ అనూరాధ బృందం ప్రదర్శించిన రూపకం ఆసక్తికరంగా సాగింది. దేవీభాగవతం, దేవీ సప్తశతి ఆధారంగా కథను రూపొందించారు.అనూరాధ జొన్నలగడ్డ, నృత్యపర్యవేక్షణలో కాత్యాయని, అపర్ణ, వైష్ణవి, అనూషా తదితరులు నృత్యాలను అభినయించారు. నాట్యాచార్యుడు, వేదాంతం రాధేశ్యాం. డాక్టర్ చింతా రవి బాలకృష్ణ కళాపీఠం నిర్వాహకులు లలిత్నారాయణ ,వెల్లంకి నాగభూషణరావు, బీవీఎస్ ప్రకాష్ కళాకారులను సత్కరించారు. -
దుర్గమ్మ సేవలో శాసన మండలి చైర్మన్
వించిపేట(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను శుక్రవారం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు దర్శించుకున్నారు. ఆలయ వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజానీకం సుఖసంతోషాలతో ఉండాలని, పకృతి వైపరీత్యాలు లేకుండా పాడిపంటలు, పరిశ్రమలతో అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. కబడ్డీ పోటీలు ప్రారంభం మైలవరం: కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల కబడ్డీ పోటీలు మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని 12 కళాశాలలోని విద్యార్థులు పాల్గొంటున్నట్లు కళాశాల పీడీ మేజర్ మన్నే స్వామి తెలిపారు. మొదటి రోజు ఈ పోటీలను లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. అప్పారావు ప్రారంభించారు. డాక్టర లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మేజర్ మన్నే స్వామి మాట్లాడుతూ నాకవుట్ పద్ధతి పోటీలు నిర్వహించామని, దీనిలో కేబీఎన్ కళాశాల, సిద్ధార్థ కళాశాల, ఎస్ఆర్ఆర్ కళాశాల, విజయ కళాశాల లీగ్ దశకు అర్హత సాధించాయని తెలిపారు. నాట్యాచార్య పిళ్లాకు ప్రతిష్టాత్మక పురస్కారం విజయవాడ కల్చరల్: నగరానికి చెందిన నాట్యాచార్యుడు పిళ్లా ఉమామహేశ్వర పాత్రుడుకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆంధ్రనాట్య రూప శిల్పి నటరాజ రామకృష్ణ పురస్కారం లభించింది. 2024 సంవత్సరానికి గానూ తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఉమామహేశ్వరపాత్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీ గురువారం హైదరాబాద్‌లో జరిగిన సభలో అవార్డ్‌తోపాటు నగదు బహుమతిని విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య వెలిదండ్ల నిత్యానందరావు, తెలంగాణ ఉన్నత విద్యాకార్యదర్శి డాక్టర్ యోగితారాణా, ఉస్మానియా విశ్వవిద్యాలయం సంచాలకులు డాక్టర్ ఎస్. భూపతిరావు చేతులమీదుగా అందజేశారని పేర్కొన్నారు. -
బాలకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ిసనీ హీరో చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసెంబ్లీ సాక్షిగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనాలని, తక్షణమే బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ, కూటమి ఎమ్మెల్యేలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ దేవినేని అవినాష్ వందలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి శుక్రవారం విజయవాడలోని భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ మంచి చేసిన వారిని తూలనాడటం బాల కృష్ణకు అలవాటేనన్నారు. బెజవాడ సాక్షిగా మోదీ తల్లిని తిట్టి.. మళ్లీ వాటేసుకున్న వ్యక్తి బాలకృష్ణ అన్నారు. సభలో లేని వ్యక్తినే కాకుండా, అసలు సంబంధంలేని చిరంజీవిని కూడా తూలనాడారన్నారు. చిరంజీవిని కించపరిచేలా మాట్లాడినా.. కనీసం ఖండించలేని స్థితిలో జనసేన అధినేత, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండటం సిగ్గుచేటన్నారు. గౌరవం పోయింది.. ఎన్టీఆర్, వైఎస్సార్ అంటే తమకు దైవ సమానమని అవినాష్ అన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడిగా బాలకృష్ణపై ఉన్న గౌరవం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో పోయిందన్నారు. రాష్ట్రంలో కోట్లాది మంది పేదలకు మంచి చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని, ఆయనపైనా దుర్భాషలాడటం దారుణమన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఫార్మసిస్టులు ప్రాణదాతలు
సెంటర్(మచిలీపట్నం): నేటి ప్రపంచంలో వెలుగు చూస్తున్న భయంకరమైన వైరస్ల బారి నుంచి ప్రజల ప్రాణాలు ఫార్మాసిస్టులు కాపాడుతున్నారని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రపంచ ఫార్మసీ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దేశంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న రంగం ఫార్మా అని, అందులో రూ.3 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు జీతం పొందేందుకు అవకాశం ఉందన్నారు. అనంతరం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ ఎస్.ఎల్.ఎన్.ప్రసాదరెడ్డి ఫార్మా రంగంలో దేశీయంగా చోటుచేసుకుంటున్న మార్పులను వివరించారు. తొలుత ఫార్మసీ పితామహుడుగా పేరొందిన స్కాఫ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష, ఫార్మసీ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. దుర్గమ్మను బంగారు వాకిలి నుంచి దర్శించుకున్న కలెక్టర్వన్టౌన్(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దంపతులు క్యూలైన్లో వెళ్లి బంగారు వాకిలి నుంచి దర్శనం చేసుకున్నారు. గురువారం రాత్రి తొమ్మిది గంటల తరువాత వీఐపీ టైం స్లాట్ ముగిసిన తరువాత క్యూలైన్ ద్వారా బంగారు వాకిలి నుంచి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీఐపీ దర్శనాలకు దేవస్థానం కేటాయించిన సమయాల్లో మాత్రమే దర్శనం చేసుకోవాలని సూచించారు. వీఐపీలు గర్భగుడిని కాకుండా బంగారు వాకిలి దర్శనం చేసుకుంటే సామాన్య భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యం కల్పించొచ్చని పేర్కొన్నారు.బందోబస్త్ ఏర్పాట్ల పరిశీలనలో డీజీపీవన్టౌన్(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను సమన్వయంతో విజయవంతం చేయాలని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. శ్రీదుర్గామళ్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని కమాండింగ్ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఇతర సాంకేతిక అంశాలను డీజీపీ గురువారం పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆయనకు సీసీ కెమెరాలను చూపిస్తూ ఆయా ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లు, బందోబస్తు గురించి వివరించారు. ఆధునిక ఏఐ ఆధారిత కెమెరాల ఏర్పాటు, రద్దీ సమయంలో తీసుకునే చర్యలు ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లను వివరించారు. -
కృష్ణమ్మ విలవిల.. కాసులు గలగల
నదీగర్భాన్ని తోడేస్తున్న ఇసుకాసురులు వాల్టా చట్టానికి తూట్లు ఇసుక తవ్వకాల నిబంధనలు గాలికి రోజుకు రూ.లక్షల్లో సంపాదన కృష్ణానది నుంచి తవ్విన ఇసుకను రోజుకు 500 ట్రాక్టర్లు అక్రమ మార్గాన తరలించి రూ.లక్షల్లో వెనకేసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. ఒక్కొక ట్రాక్టర్ లోడింగ్‌కు రూ.800 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.4 లక్షలు సంపాదిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాదారుల నుంచి మునిసిపాలిటీ ఆశీలు టెండర్ దారులు ట్రాక్టర్‌కు రూ.100 లెక్కన వసూలు చేస్తూ అక్రమ సంపాదనలో భాగమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ తవ్వకాలు అరికట్టాల్సిన వారే అక్రమ వసూళ్లకు పాల్బడటం విడ్డూరంగా ఉంది. ఇసుక రవాణాకు ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉండ టంతో మైనింగ్ రెవెన్యూ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. మైనింగ్ ఏడీ వీరాస్వామి ఆరు నెలల క్రితం ఇదే ఇసుక రేవులో దాడిచేసి 24 ట్రాక్టర్లు, 18 క్రేన్లు, 10 పడవలను సీజ్ చేసి డ్రైవర్లపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా తిరిగి యథేచ్చగా ఇసుక రవాణాతో అక్రమ సంపాదనకు తెరతీశారు. -
రెచ్చిపోతున్న
ఇసుక మాఫియా మండలంలోని గ్రామీణ ప్రాంతాలు, ఫెర్రీ వద్ద నదిలో ఇసుక తవ్వుతూ కూటమి నాయకులు రెచ్చిపోతున్నారు. భారీసైజు పడవల్లో డ్రెడ్జింగ్ యంత్రాలు బిగించి ఇసుక తోడేస్తున్నారు. ఒడ్డుకు చేరిన ఇసుక మ్యాన్యువల్ క్రేన్ల ద్వారా ట్రాక్టర్లలో లోడింగ్ చేస్తున్నారు. 20 పడవల ద్వారా కృష్ణానది గర్భంలో ఇసుక తవ్వకాలు జరిపి కృష్ణమ్మకు గర్భశోకం మిగుల్చుతున్నారు. 20 పడవల ద్వారా వచ్చిన ఇసుకను 18 మ్యాన్యువల్ క్రేన్లతో ట్రాక్టర్లకు లోడింగ్ చేస్తున్నారు. పడవల యజమానులు క్రేన్, తాము ఆక్రమించిన స్థలానికి నెలకు రూ.3 లక్షల అద్దె డిమాండ్ చేస్తున్నారంటే ఫెర్రీ రేవులో ఇసుకకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. -
పర్యాటకుల పులకింత..
బంగాళాఖాతం –కృష్ణానది సంగమ తీరంలో లైట్‌హౌస్ మడ అడవుల సోయగం నదీ తీరాన రామలింగేశ్వర మండపం ప్రకృతి పలకరింత.. ●ఆహ్లాదంగా నాగాయలంక తీరం● సూర్యాస్తమయం సందర్శకులకు నిత్య వసంతం ●పెరుగుతున్న పర్యాటకులు నాగాయలంక: మండలంలోని తీర ప్రాంతం పర్యాటకులకు పులకింత కలిగిస్తుంది. ప్రకృతి రమణీయత మధ్య సందర్శకులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక అనుభూతికి, ఆహ్లాదకర సందర్శనకు దక్షిణ బంగాళాఖాతం, పశ్చిమ కృష్ణా పరీవాహక తీర ప్రాంతం నిత్యం సందర్శకులకు ఆహ్వానం పలుకుతోంది. దివిసీమ ద్వీపంతో అనుసంధానమైన నాగాయలంక మండలంలో మరో రెండు దీవులు (ఎదురుమొండి– ఈలచెట్లదిబ్బ) భౌగోళికంగా ఈ ప్రాంత పర్యాటక ఔన్నత్యానికి భరోసా ఇస్తున్నాయి. నిత్యం ఆహ్లాదకరం చేకూరుస్తూ కృష్ణానది, నౌకా దిక్సూచి లైట్‌హౌస్, స్థానిక శ్రీరామ పాదక్షేత్రం ఘాట్, నవలంక పర్యాటక వేదికలయ్యాయి. గ్రామ పంచాయతీ సహకారంతో స్వచ్ఛ నాగాయలంక సొసైటీ టీమ్ సఫలం కావడంతో స్వచ్ఛతా పర్యాటకానికి ఎనలేని ప్రాచుర్యం చేకూరింది. 2016 పుష్కరాల తర్వాత ఈ ఘాట్‌ను సంరక్షించడంలో స్వచ్ఛ సేవా కార్యకర్తలు కీలకపాత్ర వహించటంతో క్రమేణా సందర్శకుల రాకకు ప్రాధాన్యం పెరిగింది. సందర్శకులు కృష్ణానదిలో బోటు షికారు చేసేందుకు అమిత ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రైవేటు బోట్లను కిరాయికి మాట్లాడుకుని సరదాగా నదిలోకి సమీపంలోని నవలంకలోకి వెళ్లి రౌండ్స్ కొడుతున్నారు. ఈ 17 ఎకరాల ఐలెండ్‌ను ఆధునిక ఫ్రీ వెడ్డింగ్ షూట్లకు సైతం వినియోగిస్తున్నారు. ప్రధానంగా కృష్ణానది ఆవల పశ్చిమ తీరంలో ప్రతి నిత్యం కనిపించే సూర్యాస్తమయ విభిన్న దృశ్యాలకు సందర్శకులు మంత్ర ముగ్ధులవుతూ ఫోటోలు, సెల్ఫీలతో సందడి చేయడం పరిపాటిగా మారింది. దృష్టి పెట్టని పర్యాటక శాఖ.... ఇంతగా పర్యాటక వైచిత్యం కనిపిస్తున్నా సంబంధి పర్యాటకశాఖ మాత్రం ఇటువైపు దృష్టి పెట్టడంలేదు. పర్యాటక శాఖ రూ.1.25 కోట్లతో ఫుడ్ కోర్టు భవనాన్ని 90 శాతం పూర్తి చేసినప్పటికీ నిర్వహణ విస్మరించి టీడీపీ నాయకులకు అప్పగించడం గమనార్హం. అన్ని జాగ్రత్తలతో పర్యాటక శాఖ ఇక్కడ బోటు షికారు పాయింట్ నిర్వహిస్తే మంచి ఆదరణ అభిస్తుందని సందర్శకులు అంటున్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో నెలకొల్పిన వాటర్ స్పోర్ట్స్ అకాడమీ జలక్రీడల శిక్షణ చాలాకాలంగా ఆగిపోయింది. సందర్శకుల దిక్సూచిగా కూడా అలరిస్తున్న మరో పర్యాటక సువర్ణావకాశం కృష్ణా సాగర సంగమ తీరంలో ఆకర్షించేది కేంద్ర నౌకాయాన శాఖకు చెందిన నాగాయలంక లైట్‌హౌస్. కృషానది దక్షిణ పాయ నాగాయలంక దిగువున మరో మూడు పాయలుగా చీలిక ఏర్పడి సాగర సంగమం చెందే సమీపంలో ఈ దీప స్తంభం విశేషంగా అలరిస్తుంది. సొర్లగొంది, గుల్లలమోద నుంచి సముద్ర పాయల్లో బోట్లపై ప్రయాణిస్తే లైట్‌హౌస్ పరిసరాల్లో విస్తరించిన వేలాది ఎకరాల మడ అడవుల సౌందర్యం తనివితీరా చూడవచ్చు. దశాబ్దాల కలగా కృష్ణానదిపై తలపెట్టిన ఎదురుమొండి వంతెన నిర్మాణం జరిగితే రెండు దీవుల నడుమ ఉన్న ఈప్రాంతం అలరించే పర్యాటక ప్రదేశంగా మారడంలో అతిశయోక్తి ఉండదు. -
ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే మాకేం లాభం?
విజయవాడ జాతీయ ప్రధాన రహదారిలో గొల్లపూడి మార్కెట్ యార్డ్ ఎదురుగా పెద్ద గుంత ఊర్మిళనగర్ నుంచి కబేళా సెంటర్‌కు వెళ్లే మార్గంలో రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలుడబ్బు దండుకునే దార్లు వెతుక్కోవడమే అధికార పార్టీ నేతలకు లక్ష్యంగా మారింది. ప్రజాప్రయోజన కార్యక్రమాల జోలికి వెళ్లకుండా ఉత్సవాల పేరిట జనం జేబులు ఖాళీ చేసే పనులకే పెద్దపీట వేస్తున్నారు. విజయవాడ ఉత్సవ్ పేరుతో కోట్లాది రూపాయలు నిధులు కేటాయించి నగరంలో వివిధ ప్రదేశాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 27వ తేదీ నుంచి గొల్లపూడి వై జంక్షన్ సమీపంలో పంటకాలువ రోడ్డులో ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నారు. ఇంత హడావిడి చేస్తున్న నేతలకు కనీసం ఈ ప్రాంతానికి చుట్టుపక్కల అధ్వానంగా ఉన్న రహదారులను బాగు చేయాలన్న కనీస స్పృహ లేకపోవడం విచారకరం. ఈ రోడ్లపై వెళ్లే వాహనదారులు ఉత్సవాల స్వాగత ద్వారాలు చూసి డబ్బు దండుకోవడానికే ఈ కార్యక్రమాలంటూ అధికార పార్టీ నేతల తీరును బహిరంగంగానే విమర్శిస్తున్నారు. – నడిపూడి కిషోర్, సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ -
బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ లబ్బీపేట(విజయవాడతూర్పు): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాష్ట్ర శాసనసభలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. శాసనసభలో హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని హితవు పలికారు. అలా తాము కూడా మాట్లాడగలమని, కానీ మాకు సంస్కారం ఉందన్నారు. ప్రజా సమస్యలు చర్చించేందుకు శాసన సభ నిర్వహిస్తున్నారా... మాజీ ముఖ్యమంత్రిని విమర్శించడానికి సభ నిర్వహిస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా, చెప్పుకోవడానికి చేసిందేమి లేక, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ విస్మరించి, సూపర్‌సిక్స్‌ను సూపర్ ప్లాప్ చేసి వాటి నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని తెలిపారు. హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి విచ్చలవిడిగా దొరు కుతుందని, వాటిని అరికట్టడంతో విఫలమైన ప్రభుత్వం, రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టారన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే బాలకృష్ణ శాసనసభలో ఎలా హుందాగా వ్యవహరించాలో తెలుసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ పామర్రు:అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ తెలిపారు. స్థానిక కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అపాయింట్మెంట్ కోసం మాజీ మంత్రి పేర్రి నానికి కాల్ చేయటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ పెద్ద సైకో అని ధ్వజమెత్తారు. అభిమానులు సెల్ఫీ దిగడానికి వస్తే వారి సెల్ ఫోన్ లాక్కొని పగలగొట్టి సైకోలా ప్రవర్తించింది బాలకృష్ణనే అన్నారు. వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడికీ లేదన్నారు. తమ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
ఎడ్లంకలో మరో నాలుగు ఇళ్లు ఏటిపాలు
అవనిగడ్డ: మండలంలోని పాత ఎడ్లంక గ్రామస్తులు భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు. వరద ఉధృతికి ఎప్పుడు ఏ ఇల్లు కృష్ణా నదిలో కలిసిపోతుందోనని భయాందోళనకు గురవుతు న్నారు. ఈ ఏడాది పలు సార్లు వచ్చిన వరదలకు తిరుపతమ్మ ఆలయంతో పాటు నాలుగిళ్లు కొట్టుకు పోయాయి. మునిపల్లి వెంకట నాగేశ్వరరావు, మునిపల్లి గణేష్ కుమార్, మునిపల్లి రాజేంద్రప్రసాద్, పెమ్మడి మాధవి, పెమ్మడి లక్ష్మికి చెందన మరో నాలుగు ఇళ్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాదిలో పలుసార్లు వచ్చిన వరదలకు గ్రామం చుట్టూ గట్టు భారీగా కోతకు గురైంది. మూడు ఎకరాల వరకు భూభాగం కృష్ణా నదిలో కలిసిపోయింది. ఇప్పటి వరకూ ఇళ్లు కోల్పోయిన వారికి వారికి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయ లేదని బాధితులు ఆరోపించారు. -
కుక్క దాడిలో బాలుడికి తీవ్రగాయాలు
గుడివాడ టౌన్: ఆడుకుంటున్న ఏడే ఏళ్ల బాలుడిపై కుక్క దాడికి తెగబడిన ఘటన గుడివాడ పట్టణంలో బుధవారం జరిగింది. స్థానిక లీలామహల్ రోడ్డులోని ఒక అపార్ట్మెంట్లో బాలుడు సైకిల్‌పై ఆడుకుంటుండగా వీధి కుక్క దాడికి పాల్పడింది. దీంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వస్తున్న కొందరు వ్యక్తులు దీనిని గమనించి కుక్కను తరిమి బాలుడిని రక్షించారు. వీధి కుక్కల బారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు మునిసిపల్ కమిషనర్‌ను కోరారు. కృత్తివెన్ను: గ్రామంలోని ప్రధాన సెంటర్లో 216 జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ తెలగంశెట్టి వెంకటరమణ నాగేశ్వరరావు (58) దుర్మరణం చెందారు. పాలకొల్లు నుంచి బంటుమిల్లి వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి రమణను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. రమణకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ పైడిబాబు తెలిపారు. మండల పరిసర గ్రామాల్లో పేద ప్రజలకు డబ్బులు డిమాండ్ చేయకుండా ఇచ్చినంత తీసుకుని వైద్యం చేయడంలో రమణకు మంచి పేరు ఉంది. ఆయన మరణవార్త తెలుసుకుని మండలం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. గూడూరు:ేస్నహితులతో కలసి మంగళవారం స్నానం చేసేందుకు జొన్నలరేవు దగ్గర రామరాజుపాలెం కాలువలో దిగి గల్లంతైన వెలుపూడి జీవన్‌కుమార్ (12) బుధవారం శవమై తేలాడు. మంగ ళవారం రాత్రి నుంచి తల్లిదండ్రులతో పాటుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం తెల్లవారుజామున మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారిపై రామరాజుపాలెం వంతెన కింద కట్టిన వలకు జీవన్‌కుమార్ మృతదేహం చిక్కింది. పోలీసులు శవపంచనామా నిర్వహించి, మృతదేహాన్ని బందరు సర్వజన ఆస్పత్రికి తరలించి పోస్ట్‌మార్టం చేయించారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కళ్లెదుట ఆడుతూ పాడుతూ తిరిగిన పిల్లవాడు విగతజీవిగా మారడం పట్ల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. గూడూరు ఏఎస్ఐ స్వామి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
క్యూలు కిటకిట
దర్శనం కటకట శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజు శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిచ్చింది. అమ్మను దర్శించుకునేందుకు బుధవారం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 11 గంటల వరకు సర్వ దర్శనం క్యూలైన్లో రద్దీ ఏకధాటిగా కొనసాగింది. చిన్నపిల్లల తల్లిదండ్రులు, భవానీలకు ప్రత్యేక క్యూలైన్లు లేకపోవడంతో సర్వదర్శనం క్యూలైన్ కిటకిటలాడింది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూలైన్ ఎంతకూ ముందుకు కదలకపోవడంతో నిలబడలేక పలువురు భక్తులు నేలపై కూర్చుండిపోయారు. మరోవైపు రద్దీ, ఉక్కపోత కారణంగా చిన్నపిల్లలు అల్లాడారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
ఆధునిక సాంకేతికతతో పటిష్ట బందోబస్తు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. ఆయన బుధవారం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి క్యూలైన్లు, భక్తుల రద్దీ వంటి అంశాలను పరిశీలించారు. డీసీపీ కె.జి.వి.సరిత క్యూలైన్లను పరిశీలించి పోలీసు అధికారులు, దుర్గగుడి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. ఎంతో వ్యయప్రయాసలు పడుతూ వచ్చే దివ్యాంగులు, వృద్ధులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనే సదుద్దేశంతో పోలీస్ సేవాదళ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో డ్రోన్ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ తగు ఆదేశాల జారీ చేశారు. పున్నమీ ఘాట్‌లో ఉత్సవాలకు సైతం ఉపరాష్ట్రపతి వెళ్లిన దృష్ట్యా అక్కడ కూడా బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. -
కేఎల్‌యూ ప్రొఫెసర్లకు ప్రపంచ శాస్త్రవేత్తలుగా గుర్తింపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తలుగా కేఎల్‌యూ ప్రొఫెసర్లకు గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాత అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఎల్సెవియర్ డేటాబేస్ విడుదల చేసిన జాబితాలో 20 మంది కేఎల్ యూ ప్రొఫెసర్లు ఉన్నారు. తమ అధ్యాపక బృందంలో 20 మంది ప్రపంచంలోని అత్యున్నత రెండు శాతం శాస్త్రవేత్తలుగా గుర్తింపు పొందారని ప్రకటించడానికి గర్వంగా ఉందని కేఎల్‌యూ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జి.పార్థసారథివర్మ తెలిపారు. విజయవాడ మ్యూజియం రోడ్డులోని సంస్థ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 44 ఏళ్లుగా ఉన్నత విద్యా రంగంలో విశేష సేవలందిస్తున్న కేఎల్ యూనివర్సిటీకి అంతర్జాతీయ స్థాయి పరిశోధనల్లో భాగస్వామ్యం నానాటికీ పెరుగుతోందన్నారు. తమ అధ్యాపకుల శ్రమ, కృషి, పరిశోధనలపై ఉన్న నిబద్ధత వల్లే ఈ గౌరవం దక్కిందన్నారు. ఇది విద్యార్థులకు ప్రేరణాత్మకంగా మారుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలతో సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగుతామన్నారు. కెరీర్లో ఉత్తమ ర్యాంకింగ్‌ను సాధించినందుకు డాక్టర్ బి.టి.పి.మాధవ్, డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ ఎం.నాగేశ్వరరావు, డాక్టర్ రాగిణి సింగ్, డాక్టర్ గంధర్బా స్వైన్, డాక్టర్ ఎం.జానకి రామయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారు. డాక్టర్ హసనే అహమ్మద్, డాక్టర్ ఎస్.షణ్ముగన్, డాక్టర్ జియా ఉర్ రెహమాన్, డాక్టర్ డి.వెంకటరత్నం, డాక్టర్ అర్పిత్ జైన్, డాక్టర్ చల్లా సంతోష్, డాక్టర్ మొహమూద, డాక్టర్ అతుల్ కుమార్, డాక్టర్ ఎస్.ఆర్.ఆర్.రెడ్డి, డాక్టర్ బి.ఉషారాణి, డాక్టర్ ప్రియారంజన్ సమల్, డాక్టర్ అతుల్ భట్టాడ్ను టాప్టూ జాబితాలో ప్రకటించిన సందర్భంగా అభినందించారు. యాంటెన్నాలు, బయోసెన్సార్లు, అయానోస్పిరిక్ సింటిలేషన్లు, థర్మల్ ఇమేజింగ్ రంగాల్లో వారి మార్గదర్శక ఆవిష్కరణలతో కేఎల్‌యూ స్కోపస్ రీసెర్చ్ డిస్కవరీ ద్వారా ప్రత్యేక గుర్తింపుతో దేశంలో మొదటి స్థానం, ప్రపంచ స్థాయిలో రెండో స్థానంలో తమ అధ్యాపక సభ్యులు నిలిచినందుకు గర్వంగా ఉందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్డీ డీన్ డాక్టర్ బి.టి.పి.మాధవ్, డాక్టర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
గోడు పట్టదు.. గోస తీరదు!
ఎయిర్పోర్ట్ నిర్వాసితులకు తప్పని నిరీక్షణ గన్నవరం: విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్నప్పటికీ నిర్వాసితులకు ఎటువంటి న్యాయం జరగలేదు. వారికి కేటాయించిన ఆర్అండ్ఆర్ స్థలంలో మౌలిక వసతుల కల్పనకు, గృహ నిర్మాణాలకు నిధులు కేటాయించలేదు. కనీసం అద్దె బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం తమ గోడును పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తొమ్మిదేళ్లుగా ఎదురుచూపులు.. విమానాశ్రయ విస్తరణ కోసం 2016లో దావాజిగూడెం, అల్లాపురం, బుద్ధవరం గ్రామాల్లో 423 కుటుంబాలకు చెందిన ఇళ్లు, స్థలాలను సేకరించేందుకు ప్రభుత్వం గుర్తించింది. వీరికి ప్రత్యామ్నాయంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద గృహ నిర్మాణాలు చేపట్టేందుకు 51 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. సదరు భూమిని మెరక చేసి ఐదు సెంట్లు చొప్పున ప్లాట్లుగా విభజించినప్పటికీ ప్లాట్లు కేటాయించలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముందడుగు.. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం లాటరీ పద్ధతిలో నిర్వాసితులకు ప్లాట్లు కేటాయించింది. స్టాంప్ డ్యూటీ మినహాయించి ఉచితంగా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి నిర్వాసితులకు దస్తావేజులను పంపిణీ చేసింది. గృహ నిర్మాణాలు చేసుకునేందుకు రెండు విడతలుగా రూ. 9లక్షలు ఇచ్చేందుకు ముందుకువచ్చింది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ స్థలంలో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి, విద్యుత్ వంటి సదుపాయాల కల్పనకు రూ. 80.48కోట్లు కేటాయించింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా నిధులు మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పాలనలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ విషయంలో అడుగు ముందుకు వేయకపోవడంతో నిర్వాసితుల్లో ఆందోళన మొదలైంది. నిధులు కోసం.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను కూటమి ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. మౌలిక సదుపాయలు కల్పించి తొలి విడత సాయం మంజూరు చేస్తే గృహ నిర్మాణాలు చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు నిర్వాసితులు పేర్కొంటున్నారు. ఈ విషయమై ప్రజా ప్రతి నిధులు, అధికారులను పలుమార్లు కలిసి విన్నవించుకున్నట్లు చెబుతున్నారు. ఎయిర్పోర్ట్ మైక్రో కెనాల్ కోసం దావాజీగూడెం ఎస్సీ కాలనీలో 54 కుటుంబాలకు చెందిన గృహాలను ఖాళీ చేయించారు. వీరికి ఏడాదికి రూ. 50వేలు చొప్పున ప్రభుత్వం అద్దె చెల్లించే విధంగా ఒప్పందం చేసుకుంది. ఈ అద్దె బకాయిలు కూడా సక్రమంగా చెల్లించకపోవడం కారణంగా ఒక్కొ కుటుంబానికి రూ. లక్షల్లో ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది. మా ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ విమానాశ్రయ విస్తరణ కోసం తమకు వారసత్వంగా వచ్చిన ఇళ్లు, స్థలాలను ప్రభుత్వం అడిగిన వెంటనే ఇచ్చేందుకు ముందుకు వచ్చాం. ప్రత్యామ్నాయంగా గృహ నిర్మాణాలు చేసి న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంత వరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అద్దె ఇళ్లలో బతుకుతున్నాం. గృహ నిర్మాణాలు చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ కనికరించడం లేదు. – టి. ఏసురత్నం, ఎస్సీ కాలనీ, దావాజీగూడెం విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల గోడును ఎవరూ పట్టించుకోవడం లేదు. మైక్రో కెనాల్ నిర్మాణంలో మా ఇంటిని తొలగించడంతో ఆరేళ్లుగా కుటుంబంతో అద్దె ఇంట్లో ఉంటున్నాం. ప్రభుత్వం ఏటా ఇస్తామని చెప్పిన అద్దెను కూడా చెల్లించడం లేదు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. పాలకులు స్పందించి, ఆదుకోవాలి. – ఎన్. కోటేశ్వరరావు, దావాజీగూడెం -
మంచి సేవలు అందిస్తా..
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నవీన్ చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలపై దృష్టిసారించి, జిల్లా ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేస్తానని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్ అన్నారు. జాయింట్ కలెక్టర్‌గా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ తాను 2019 బ్యాచ్‌కు చెందినవాడినని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలైన ప్రజాసమస్యలు, భూ సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో ఎటు వంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ నియమాల ప్రకారం పనిచేస్తానన్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారుల సహకారంతో ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. తాను తిరుపతి జిల్లాకు చెందిన వాడినని, తన విద్యాభాస్యం అక్కడే జరిగిందన్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా శిక్షణ పొంది మొదటిగా సత్యసాయి జిల్లా పెనుగొండ సబ్‌కలెక్టర్‌గా పనిచేశానన్నారు. అనంతరం శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా బదిలీపై వెళ్లి అక్కడ పనిచేసిన అనంతరం ఏపీ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా అమరావతికి వచ్చానన్నారు. అక్కడి నుంచి కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించారని, జేసీగా రెండోసారి బాధ్యతలు నిర్వహిస్తున్నానని తెలిపారు. మర్యాదపూర్వకంగా.. అనంతరం జేసీ నవీన్ కలెక్టర్ డీకే బాలాజీని ఆయన చాంబర్లో కలిసి మర్యాదపూర్వకంగా మొక్కను అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జేసీ నవీన్‌ను డీఆర్వో చంద్రశేఖరరావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జి. శివరామప్రసాద్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్, జిల్లా వ్యవసాయాధికారి ఎన్. పద్మావతి, ఆర్డీవో కె. స్వాతి, డీఎస్వో మోహనరావు, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం, కలెక్టరేట్ ఏవో రాధిక, సిబ్బంది కలిసి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
అభయ ప్రదాయిని
అన్న ప్రసాదిని..అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు.. ఎవరు ఆకలితో అలమటిస్తున్నా వారికి సాయం చేయమని చెబుతుంటారు.. అయితే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడికే భిక్షను ప్రసాదించిన అమృత మూర్తి అన్నపూర్ణాదేవి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు అమ్మవారు ఆ ఆది దేవత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. చేతిలో అక్షయపాత్ర ధరించి, ఆదిభిక్షువుకు అన్నాన్ని ప్రసాదిస్తున్న అవతారంలో కొలువైన అమ్మ దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించిన భక్తులు ఆనందంతో అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఇల ప్రకాశం.. ఇంద్ర వైభోగం.. విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతున్న ప్రకాశం బ్యారేజీ, దుర్గమ్మ కొండ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజైన బుధవారం దుర్గమ్మ శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు, బాలభోగం నివేదన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. సర్వ దర్శనం మూడు క్యూలైన్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం అమ్మవారి మహా నివేదన, పంచ హారతుల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది. సర్వ దర్శనం క్యూలైన్లలో రద్దీ.. తెల్లవారుజాము నుంచి సర్వ దర్శనం క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగింది. సాధారణ భక్తులతో పాటు భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు క్యూలైన్లో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ఉపవాసంతో ఉండే భవానీలకు ప్రత్యేక ఏర్పాటు చేయకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకలకు చెందిన భక్తులు అమ్మవారి దీక్షలను స్వీకరించి దర్శనానికి వచ్చారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 11గంటల వరకు సర్వ దర్శనం క్యూలైన్లో రద్దీ ఏకధాటిగా కొనసాగుతూనే ఉంది. వీఐపీ క్యూలైన్లోకి.. సేవా బృంద సభ్యులు, పోలీసు సిబ్బంది ఎవరైనా వీఐపీ క్యూలైన్ ద్వారానే అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈవో శీనానాయక్, ఏడీసీపీ జి.రామకృష్ణ సూచించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని స్కానింగ్ పాయింట్, మీడి యా పాయింట్ల వద్ద పలుమార్లు తనిఖీలు నిర్వహించారు. సిఫార్సులతో అమ్మవారి దర్శనం కోసం నేరుగా వస్తున్న వారిని ఆపి కార్డులు తనిఖీలు చేశారు. అన్నదాన భవనంలో తనిఖీలు.. అమ్మవారి అన్నప్రసాదం కోసం తరలివచ్చిన భక్తులతో మహా మండపం ఎదుట నూతనంగా నిర్మించిన అన్నదాన భవనం కిటకిటలాడింది. మరో వైపున అన్న ప్రసాద నాణ్యతలలో ఎటువంటి లోటు పాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్‌కలెక్టర్ ఎస్. ఇలక్కియ తనిఖీలు నిర్వహించారు. మూడో రోజు ఆదాయం రూ.31.08లక్షలు దసరా ఉత్సవాలలో మూడో రోజైన బుధవారం దేవస్థానానికి రూ. 31.08లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. రూ. 300 టికెట్ల విక్రయం ద్వారా రూ.10.56లక్షలు, రూ.100 టికెట్ల విక్రయం ద్వారా రూ.3.46లక్షలు, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 2.98లక్షలు, ఆరు లడ్డూ బాక్స్‌ల విక్రయం ద్వారా రూ.11.89లక్షలు, ఆర్జిత సేవా టికెట్ల విక్రయం, ఇతర సేవల ద్వారా రూ.2.10 లక్షల మేర ఆదాయం లభించిందని పేర్కొన్నారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు 58 వేల మంది భక్తులు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శించుకున్నారని, అన్నప్రసాదం 22,506 మందికి పంపిణీ చేశామని చెప్పారు. -
కానూరులో గంజాయి పట్టివేత
పెనమలూరు/ఉయ్యూరు: పెనమలూరు మండలం కానూరులో గంజాయి నిల్వ ఉంచిన ఇంటిపై ఉయ్యూరు సర్కిల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సీహెచ్.శేషగిరిరావు తన సిబ్బందితో కలిసి బుధవారం దాడి చేశారు. 14 కిలోల 950 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోని కానూరులో రెండంతస్తుల భవనంలో గంజాయి ఉంచారన్న సమాచారంతో దాడులు నిర్వహించామని సీఐ తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని పానెం రామమోహన్‌రావు, యలమంచిలి మురళీకృష్ణప్రసాద్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి ఉయ్యూరు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించారని తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది నంది కేశవరావు, వేణుగోపాలరావు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డున పడుతున్న ఆటో కార్మికుల కుటుంబాలు
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం ఆటో కార్మికుల కుటుంబాలకు పెను శాపంగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు అన్నారు. ఉచిత బస్సు వల్ల ఆటోలకు కిరాయిలు తగ్గిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆటో ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక మంగళవారం ఆత్మహత్య చేసుకున్న సింగ్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ పసుపులేటి సుబ్బారావు(23) మృతదేహాన్ని సీపీఎం, సీఐటీయూ నాయకులు బుధవారం సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ.. అత్యధిక మంది ఆటో కార్మికులు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల వద్ద రుణాలు తీసుకుని వాహనాలు కొనుగోలు చేసుకున్నారని, ఉచిత బస్సుల వల్ల కిరాయిలు లేక అప్పులు తీర్చే పరిస్థితిలేక ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. రూ.45 వేల అప్పునకు రూ.55 వేల వడ్డీ వేసి రూ.లక్ష చెల్లించాలని ఫైనాన్స్ కంపెనీలు వేధించడం వల్లే సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిచి ఆటో కార్మికుల ఇబ్బందులను గుర్తించాలని, వాహన మిత్ర పథకం ద్వారా రూ.25 వేల సాయం అందించాలని కోరారు. సీఐటీయూ నాయకుడు కె.దుర్గారావు, ఆటో కార్మిక సంఘం నాయకులు దుర్గావలి, కోటయ్య, జి.వి.రెడ్డి, పీర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. -
కనుల పండువగా నగరోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేదమాత గాయత్రీదేవిగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవ రాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం దుర్గమ్మను శ్రీగాయత్రీదేవిగా అలంకరించారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. వేకువ జాము నుంచి ఉదయం ఆరు గంటల వరకు భక్తులతో అన్ని క్యూలైన్లు కిక్కిరిశాయి. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు, ఉభయదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు కొండపైకి చేరుకోవడం ఇబ్బందికరంగా ఉందని పలువురు ఉభయదాతలు నేరుగా కలెక్టర్ లక్ష్మీశకు ఫిర్యాదు చేశారు. ఉదయం ఆరు గంటల తర్వాత సర్వ దర్శనం క్యూలో భక్తుల రద్దీ కొనసాగింది. అయితే రూ.100, రూ.300 టికెట్ల క్యూలైన్లు ఖాళీగానే దర్శనమిచ్చాయి. రద్దీని కట్టడి చేసేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు భక్తులను రూ.100 క్యూలోకి అను మతించారు. అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక ఖడ్గమాలార్చన, శ్రీ చక్రనవార్చన, చండీయాగం, కుంకుమార్చనలో ఉభయదాతలు పాల్గొన్నారు. ప్రత్యేక కుంకుమార్చనను మొదటి షిఫ్టునకే పరిమితం చేశారు. వీఐపీ దర్శనాలకు బ్రేక్ తొలి రోజు ఆలయ ప్రాంగణంలో ఇష్టానుసారంగా వీఐపీల పేరిట జరిగిన దర్శనాలకు మంగళవారం బ్రేక్ పడింది. ప్రొటోకాల్ ఉన్న వారిని సీఎం గేటు, వీఐపీల పేరుతో వచ్చే వారిని గాలిగోపురం వద్ద ఉన్న క్యూలైన్ ద్వారానే ఆలయంలోకి అనుమతించారు. కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం ఉదయం లడ్డూ తయారీ పోటులను తనిఖీ చేశారు. ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్న పదార్థాల నాణ్యతను పరిశీలించారు. రోజుకు ఎన్ని లడ్డూలు తయారు చేస్తున్నారు? మొదటి రోజు ఎన్ని విక్రయించారు? ఇంకా ఎన్ని నిల్వ ఉన్నాయన్న వివరాలను ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నిత్యం 2.50 లక్షల లడ్డూలను తయారీ చేసేలా దేవస్థానం మూడు లడ్డూ పోటులను సిద్ధం చేసిందని, ఉత్సవాల్లో 36 లక్షల లడ్డూలు అవసరమయవుతా యని అంచనా వేశామని తెలిపారు. లడ్డూ విక్రయ కేంద్రాలను మంగళవారం నుంచి మరి కొన్నింటిని అందుబాటులోకి తీసుకొచ్చామ న్నారు. ప్రస్తుతం కనకదుర్గనగర్‌లో పది కౌంటర్లు ఉండగా, అక్కడ మరో రెండు కౌంటర్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్‌తో పాటు రథం సెంటర్లో వృద్ధులు, దివ్యాంగుల కోసం కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కౌంటర్లకు లడ్డూలు రవాణా చేసే తరుణంలో ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి ప్రసాదం కేంద్ర సహాయ అధికారి ఎం.ఎస్.ఎల్.శ్రీనివాస్ తీసుకెళ్లారు. అన్న ప్రసాద వితరణను పరిశీలించిన కలెక్టర్ భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నగరోత్సవంలో దుర్గామల్లేశ్వర స్వామివార్లు రెండో రోజు ఆదాయం రూ.25.48లక్షలు వించిపేట(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల సన్నిధిలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో రెండో రోజు మంగళవారం శ్రీగాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్.సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, వేమి రెడ్డి ప్రశాంతి రెడ్డి, బండారు శ్రావణి, గల్లా మాధవి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ దర్శించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వేద పండితులు వేదాశీర్వచనం, ఆలయ ఈఓ శీనా నాయక్ అమ్మవారి చిత్రపటాలు అందజేశారు. దసరా ఉత్సవాల్లో రెండో రోజున దేవస్థానానికి రూ.25.48 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. రూ.300 టికెట్ల విక్రయం ద్వారా రూ.8.99 లక్షలు, రూ.100 టికెట్ల ద్వారా రూ.3.16 లక్షలు, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1.86 లక్షలు, ఆరు లడ్డూల ప్రత్యేక ప్యాక్‌ల ద్వారా రూ.9.66 లక్షలు, ప్రత్యేక కుంకుమార్చన టికెట్ల ద్వారా రూ.69 వేలు, ఇతర సేవా టికెట్ల విక్రయం ద్వారా ఈ ఆదాయం లభించిందని వివరించారు. రెండో రోజు సాయంత్రం ఐదు గంటలకు 60 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, 19,629 మందికి అన్న ప్రసాదం అందజేశామని తెలిపారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీగంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన నగరోత్సవం కనుల పండువగా సాగింది. మంగళవారం సాయంత్రం మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, ఘాట్‌రోడ్డు మీదుగా ఆలయానికి చేరుకుంది. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట ఆదిదంపతుల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో నగరోత్సవం పరిసమాప్తమైంది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, చిన్నారుల కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలతో నగరోత్సవం ఆద్యంతం భక్తిభావనతో సాగింది. -
వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు బలి
వేటగాళ్ల ఉచ్చులో పడి మృతి చెందిన చుక్కల జింక, కొండముచ్చు కొండపల్లి(ఇబ్రహీంపట్నం): పచ్చని అడవుల్లో స్వేచ్ఛగా తిరగాల్సిన వన్య ప్రాణులు వేటగాళ్ల ఉచ్చులో పడి ప్రాణాలు వదులుతున్నాయి. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోని మూలపాడు సమీపంలో వేటగాళ్లు పెట్టిన ఉచ్చులో పడి చుక్కల జింక, కొండముచ్చు మంగళవారం మృత్యువాత పడటం సంచలనంగా మారింది. అటవీశాఖ అధికారులు కనుసన్నల్లోనే ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మూలపాడు గ్రామం నుంచి ఏసీఏ క్రికెట్ స్టేడియం, సీతాకొకచిలుకల పార్క్‌కు చక్కటి రహదారి ఏర్పాటు చేయడంతో వేటగాళ్లు అడవికి వెళ్లేందుకు రాజమార్గంగా మారింది. అడవి పందుల మాసం వారంలో కనీసం మూడు రోజుల పాటు మూలపాడులో అందుబాటులో ఉండటం గమనార్హం. కొండముచ్చు మాంసాన్ని వేట మాసంగా విక్రయించడం ఈ ప్రాంతంలో పరిపాటిగా మారింది. వన్యప్రాణుల మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రదర్శనకే సరి.. ప్రేక్షకులేరి మరి..!
విజయవాడ కల్చరల్: వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చేపట్టిన విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలకు స్పందన కరువైంది. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం, దుర్గాపురంలోని సంగీత కళాశాలలో మంగళవారం నృత్యప్రదర్శన, సంగీత కచేరి, హరికథలు ప్రదర్శించారు. అయితే ఈ రెండు కేంద్రాల వద్ద ప్రముఖ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చినా, ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువైంది. సంగీత కళాశాలలో పట్టుమని 50 మంది ప్రేక్షకులు కూడా లేరు. సంగీత కళాశాల, తుమ్మలపల్లి కళాక్షేత్రం నిర్వహణ బాధ్యతలను టీడీపీ నాయకుడు వర్ల రామయ్య, తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్ పొగడపాటి తేజస్వి, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచరులకు అప్పగించారు. వారు కనీసం కళాకారులకు మంచినీటి సౌకర్యం కల్పించకపోవడం గమనార్హం. ఉత్సవ్ నిర్వాహకులకు తెలుగు ఆవశ్యకతపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్షింతలు వేసినా ఇప్పటికీ కార్యక్రమాల బోర్డు ఆంగ్లంలోనే ఉండటం గమనార్హం. -
జీవనోపాధి అవకాశాలు పెంపొందించేందుకు చర్యలు
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీచిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కృష్ణా జిల్లాలో జీవనోపాధి అవకాశాలను పెంపొందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జీవనోపాధి అవకాశాలను పెంపొందించడానికి స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించడం, కొత్త వ్యాపారాలను ప్రోత్సహించడం, సాంప్రదాయ జీవనోపాధి మార్గాలను మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టలన్నారు. కేవలం సబ్సిడీ రాయితీల కోసం కాకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించి యూనిట్లు గ్రౌండయ్యేలా చర్యలు తీసుకుని, వారి మెరుగైన జీవనప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలన్నారు. పొలాల్లో ఐదు నుంచి పది సెంట్ల స్థలంలో కొరమేను సాగు చేపట్టి అధిక లాభాలు పొందొచ్చని, ఇందుకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని, ఆసక్తి కలిగిన వారిని గుర్తించాలని ఎంపీడీఓ, మత్స్యశాఖ అధికారులకు సూచించారు. తీరప్రాంత మండలాల్లో పీతల సాగు, సముద్రనాచు పెంపకం, డ్రోన్ సాంకేతికతతో వ్యవసాయ సేవలు అందించడానికి ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ, ఏపీఎంఐపీ పీడీలు హరిహరనాథ్, ఎస్.వి.రత్నాచార్యులు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, ఉద్యానశాఖ అధికారి జె.జ్యోతి, పశుసంవర్ధకశాఖ అధికారి ఎన్.చిననరసింహులు, ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఈడీ షేక్ షాహిద్‌బాబు, ఎల్డీఎం రవీంద్రారెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగ మహిళలకు బ్యూటీషియన్, బ్యూటీషియన్ అడ్వాన్స్డ్ కోర్సుల్లో తమ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఏ.పూర్ణిమ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉచిత శిక్షణ మూడు నెలల పాటు కొనసాగుతుందని, 15 నుంచి 45ఏళ్ల లోపు వారు అర్హులని తెలియజేశారు. ఆసక్తి ఉన్న వారు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డుతో తమ కార్యాలయానికి అక్టోబర్ 3వ తేదీలోగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలని, అక్టోబర్ 4వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ అందజేస్తామని తెలియజేశారు. ఇతర వివరాలకు తమ కార్యాలయంలో నేరుగా గానీ 0866–2470420లో సంప్రదించాల్సిందిగా ఆమె కోరారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన ఉయ్యూరు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉయ్యూరు ప్రధాన సెంటరులో కుటుంబ సభ్యులు, సహచరులు మంగళవారం రాస్తారోకో చేశారు. విజయవాడ–మచిలీపట్నం జాతీయరహదారిపై గండిగుంట వద్ద సోమవారం రాత్రి కారు ఢీకొని విన్నకోట శ్రీరాములు (55) మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. మృతుని కుటుంబానికి ఆర్థికపరంగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, కార్మికులు ఉయ్యూరు సెంటరులో ఆందోళనకు దిగారు. రూ. 15 లక్షలు పరిహారం కారు యజమాని నుంచి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో సెంటరులో ట్రాఫిక్ స్తంభించింది. సీఐ టీవీవీ రామారావు, రూరల్ ఎస్ఐ సురేష్‌బాబు ఆందోళనకారులతో సంప్రదింపులు జరిపారు. చట్టప్రకారం కేసు నమోదుచేసి కారును సీజ్ చేశామన్నారు. మృతునికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనకారులపై ప్రజలకు అసౌకర్యం కలిగించింనందుకు గానూ కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
ఆయుర్వేదంపై ప్రజల్లో పెరిగిన అవగాహన
ఆయుష్ విభాగం రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ గురుమూర్తి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజల్లో ఆయుర్వేదం పట్ల అవగాహన పెరిగిందని ఆయుష్ విభాగం రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ గురుమూర్తి అన్నారు. మంగళవారం బీఆర్టీఎస్ రోడ్డులో విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని 3కే రన్ జరిగింది. బీఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల ట్రాఫిక్ సిగ్నల్ నుంచి ఘంటసాల కళాశాల జంక్షన్ వరకు సాగింది. ఈ రన్లో ఆయుర్వేద వైద్యులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ‘ప్రజల కోసం – ప్రకృతి కోసం ఆయుర్వేదం’ థీమ్‌తో 3కే రన్ నిర్వహించినట్లు పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ నల్లు ధరణి కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆయుర్వేదంపై మరింత ప్రచారం కల్పించాలన్నారు. రన్లో పాల్గొన్న వారికి సాయి సంజీవి హెర్బల్స్ – డ్రై ఫ్రూట్స్ బహుమతులను అందజేశారు. అనంతరం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు. విజయవాడలోని గాయత్రి ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి జెర్సీలని అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్, శారద డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ నాగేశ్వర శర్మ, రాష్ట్ర విశ్వాయుర్వేద పరిషత్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ సాహితీ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణానదిలో బాలుడు గల్లంతు
కృష్ణలంక(విజయవాడతూర్పు): సరదాగా కృష్ణానదిలోకి ఈతకు దిగిన ఓ బాలుడు వరద ప్రవాహానికి గల్లంతయ్యాడు. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మావతిఘాట్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. సేకరించిన వివరాల మేరకు కృష్ణలంక, 21వ డివిజన్లోని వల్లూరివారి వీధిలో నివాసం ఉంటున్న చొప్పవరపు ప్రసాద్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య గీత, ఒక కుమార్తె, ఒక కుమారుడు సాయి సందీప్(14) ఉన్నారు. సందీప్ ఐదో నంబర్ రూట్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. స్కూల్‌కు దసరా పండుగ సెలవులు ఇవ్వడంతో సందీప్ మంగళవారం మధ్యాహ్నం 1గంట సమయంలో తన ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న ఒక స్నేహితుడితో కలిసి ఆడుకుంటూ కృష్ణానది ఒడ్డున ఉన్న మర్వాడీ శివాలయం పరిసరాల్లోని పద్మావతి ఘాట్‌లోకి వెళ్లాడు. ఘాట్ మెట్లపై ధర్మాకోల్ పెట్టెను గమనించి దానితో నదిలోకి దిగి సరదాగా ఈతకొట్టాలని నిర్ణయించుకున్నాడు. అంతటా సందీప్ ధర్మాకోల్ పెట్టెను తీసుకుని నదిలోకి దిగి సరదాగా ఈత కొడుతుండగా పెట్టె జారిపోయింది. దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి వస్తున్న వరద ఉద్ధృతికి అతను ఒడ్డుకు చేరుకోలేక నీటిలో మునిగి గల్లంతయ్యాడు. లభించని ఆచూకీ.. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలించినా ఫలితం లేకపోయింది. అనంతరం ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా బాలుడి ఆచూకీ లభించలేదు. నదిలో గల్లంతయ్యాడన్న విషయాన్ని తెలుసుకున్న బాలుడి కుటుంబంలో, ఆ వీధిలో విషాద ఛాయలు అలముకున్నాయి. కృష్ణానది ఒడ్డుకు చేరుకున్న తల్లిదండ్రులు గల్లంతైన కుమారుడు కనిపించకపోవడంతో బోరున విలపించారు. -
తిరుమలకు 10 టన్నుల కూరగాయలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో జరిగే నిత్యాన్నదానానికి కృష్ణాజిల్లా లారీ ఓనర్స్ అసోసియే షన్ ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలు విరాళంగా పంపించారు. కూరగాయల లారీని మంగ ళవారం బెంజిసర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సంఘ అధ్యక్షుడు నాగ మోతు రాజా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ఎ.వి.వి.సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు, బి.ఎ.నాగు పాల్గొన్నారు. విమానాశ్రయం(గన్నవరం): ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన విజయ వాడ వస్తున్న సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ముందస్తు భద్రత ఏర్పాట్లపై మంగళ వారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రత్యేక భద్రత అధికారి సీహెచ్.రామకృష్ణ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు సీఎం చంద్రబాబునాయుడు, పలువురు ప్రముఖులు విమానాశ్రయానికి వస్తారని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికే విషయంలో లైనప్ జాబితాలో పేర్లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించాలని, వారి వాహనాలకు సరైన పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మంగళగిరి ఏపీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ పి.వి.హనుమంతు ఆధ్వర్యంలో పోలీస్ బ్యాండ్, కవాతు రిహార్సల్స్ నిర్వహించారు. ఐసీఎస్ అధి కారి జి.ఆర్.రాధిక పర్యవేక్షణలో వాహన శ్రేణి ట్రయిల్ రన్ జరిపారు. గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, కృష్ణా జిల్లా డీఎంహెచ్ఓ ఎ.వెంకటరావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏసురత్నం, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): జానపద కళలకు పునరుజ్జీవం కల్పించి సజీవంగా నిలుపుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర జానపద, సృజనాత్మకత అకాడమి చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య భవానీపురం హరిత బెరంపార్క్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గంగు లయ్యతో మంత్రి దుర్గేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. గంగులయ్య మాట్లాడుతూ.. రంప చోడవరం నుంచి భద్రాచలం వరకు ఐటీడీ అధికారులతో సమావేశమై ప్రాచీన కళలను ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ఏపీ నాటక అకాడమీ చైర్మన్ జి.గోపాలకృష్ణ, ఏపీ సృజనాత్మకత, సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి, రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషదేవి పాల్గొన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన కె.బుచ్చి రాంప్రసాద్ గొల్లపూడిలోని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ కార్యాలయంలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమక్షంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాంప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలి పారు. వెనుకబడిన తరగతుల కాలనీల్లో వెయ్యి హిందూ ఆలయాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి ఆనం మాట్లాడుతూ.. బ్రాహ్మణుల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి చేయూత ఇస్తామన్నారు. దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఏపీ ఎన్నారై చైర్మన్ వేమూరి రవి, బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీ ఎం.చిన్నబాబు, సీఈఓ నాగసాయి, సీనియర్ మేనేజర్ హెచ్ఆర్ఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నదీ జలాలు చంద్రబాబు ఆస్తి కాదు
ఏబీ వెంకటేశ్వరరావు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘‘మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి. మా ప్రాజెక్టులను మేము కట్టుకుంటాం. మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి చంద్రబాబుకు హక్కులేదు. ఇది చంద్రబాబు సొంత ఆస్తి కాదు. రాష్ట్ర ప్రజలందరి నీటి హక్కుల సమస్య’’ అని ఆలోచనాపరుల వేదిక సభ్యుడు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు అన్నారు. ఎగువనున్న తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఆయన మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా నదీ జలాల విషయంలో బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘిస్తూ ఎగువ రాష్ట్రాలు అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే చంద్ర బాబు ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ఆరోపించారు. బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రానికి కేటాయించిన 512 టీఎంసీల నీటి వాటాను వినియోగించుకోవడంలోనూ ప్రభుత్వం విఫల మైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 34ను చూపి రాయలసీమ ప్రజలను బెదరగొట్టి బనకచర్ల ప్రాజెక్టు అనే గుదిబండను ఏపీ మెడకు చుట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఆలోచనాపరుల వేదిక సభ్యులు టి.లక్ష్మీనారాయణ, అక్కినేని భవానీప్రసాద్ పాల్గొన్నారు. -
వైద్యం వికటించి నిండు గర్భిణి మృతి
రూ. 12 లక్షలకు సెటిల్మెంట్ చేసుకున్న ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం! జగ్గయ్యపేట అర్బన్: ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యంతో ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్టణంలో సోమవారం రాత్రి జరిగింది. కాగా మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డెక్కి ఆందోళన చేయడంతో ఆస్పత్రి యాజమాన్యం రూ.12 లక్షలకు సెటిల్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సేకరించిన సమాచారం ప్రకారం.. పట్టణంలోని విలియంపేటకు చెందిన గర్భిణి అయిన జరుగుమల్లి జాయ్(28)కు నెలలు నిండటంతో ప్రసవం కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం జాయిన్ అయ్యారు. కాగా రాత్రి సమయంలో వైద్యులు ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతో జాయ్‌తో పాటు కడుపులో ఉన్న శిశువు కూడా మృతిచెందింది. దీంతో ఆగ్రహానికి గురైన మృతురాలి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) రంగంలోకి దిగి ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి రూ.12లక్షల సెటిల్మెంట్కు మృతురాలి కుటుంబ సభ్యులను ఒప్పంచారని తెలుస్తోంది. మృతురాలికి భర్త వంశీ, ఏడేళ్ల కూతురు ఉంది. పర్యవేక్షణ లేకనే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలపై జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు అంటున్నారు. ఇష్టం వచ్చిన రీతిలో మందులను ఉపయోగిస్తూ అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఆస్పత్రులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే పర్యవేక్షణ సరిగా చేయని అధికారులపై కూడా శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
మహిళపై కత్తితో దాడి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహిళపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన భవానీపురం వర్క్‌షాపు రోడ్డులో జరిగింది. భవానీపురానికి చెందిన లక్ష్మీదేవి ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. కొంత కాలంగా భర్త వివాదాల కారణంగా అతని నుంచి విడిగా ఉంటూ.. అప్పారావు అనే వ్యక్తితో చనువుగా ఉంటోంది. మంగళవారం రాత్రి పనులకు వెళ్లి వస్తుండగా వర్క్‌షాపు సమీపంలోకి రాగానే ఆమైపె మద్యం మత్తులో అప్పారావు కత్తితో మెడపై దాడి చేశాడు. అతని నుంచి తప్పించుకునేందుకు ఆమె పరుగెత్తుకుంటూ వచ్చి వర్క్‌షాపు రోడ్డులో పడిపోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు ఆమెను గొల్లపూడిలోని ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఆమెను సిటీలోని ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. ఆమైపె కత్తితో దాడి చేసిన అప్పారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
కాలువలో స్నానానికి దిగిన బాలుడు గల్లంతు
గూడూరు: దసరా సెలవులు ఇవ్వడంతో స్నేహితులతో కలసి కాలువలో స్నానానికి దిగిన విద్యార్థి గల్లంతైన ఘటన మంగళవారం గూడూరులో చోటు చేసుకుంది. గూడూరు గ్రామానికి చెందిన వెలిపూడి జీవన్‌కుమార్(12) గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఇవ్వడంతో స్నేహితులతో కలసి జొన్నలరేవు దగ్గర రామరాజుపాలెం కాలువలో స్నానానికి దిగారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వెళ్లిన జీవన్ కుమార్ పొద్దుపోయే వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు సావిత్రి, విజయ్‌లు స్నేహితుల ఇళ్లకు వెళ్లి ఆరా తీశారు. వారిచ్చిన సమాచారంతో జొన్నలరేవు దగ్గర గాలించగా జీవన్‌కుమార్ టీషర్టు, చెప్పులు లభించాయి. దీంతో కాలువ వెంబడి గాలించినా అతని ఆచూకీ దొరకకపోవడంతో గూడూరు పోలీసులను ఆశ్రయించారు. ఏఎస్ఐ స్వామేలు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు ఎలాంటి ఫలితం లేదని ఏఎస్ఐ వెల్లడించారు. -
పోలీసుల కళ్లుగప్పి నిందితుడు పరారీ
పట్టుకునేందుకు మూడు బృందాలు ఏర్పాటు లబ్బీపేట(విజయవాడతూర్పు): పటమట పోలీసు స్టేషన్లో పరిధిలో చోరీ కేసులో రిమాండులో ఉన్న బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్‌రెడ్డి అలియాస్ రాజు అలియాస్ బయ్యపురెడ్డి పోలీసుల నుంచి తప్పించుకోగా, వెతికి పట్టుకునేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏఆర్ఏడీసీపీ కుంబా కోటేశ్వరరావు నేతృత్వంలో ఆ బృందాలు కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ప్రభాకర్‌ను పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు. అసలేం జరిగిందంటే.. చోరీ కేసులో నిందితుడిగా ఉన్న బత్తుల ప్రభాకర్ రాజమండ్రి జైలులో రిమాండు ముద్దాయిగా ఉన్నాడు. విజయవాడ కోర్టులో సోమవారం వాయిదా ఉండటంతో తీసుకు వచ్చారు. తిరిగి తీసుకెళ్తున్న సమయంలో దేవరపల్లి గ్రామ శివారులో ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసుల కళ్లుగప్పి రాత్రి 7.30 గంటల సమయంలో ముద్దాయి పరారయ్యాడు. దీంతో నగర పోలీసులకు ఎస్కార్ట్‌గా వెళ్లిన పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ సస్పెన్షన్.. చోరీ కేసులో నిందితుడు బత్తుల ప్రభాకర్‌ను విజయవాడ నుంచి రాజమండ్రి తీసుకెళ్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్స్ కె. సుగుణాకరరావు, కేజే షడ్రక్‌లను సస్పెండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించి ముద్దాయి తప్పించుకుపోవడానికి కారణమైనట్లు సీపీ ఎస్వీ రాజశేఖరబాబు పేర్కొన్నారు. వివరాల సేకరణ.. చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం ఇలా పలు ప్రాంతాల్లో నివశించాడు. ఒంటరిగా వెళ్లి పట్టపగలు ఇళ్లలో చోరీ చేయడంలో నిష్ణాతుడైన ప్రభాకర్.. హైదరాబాద్, నెల్లూరు, చైన్నె, కాకినాడల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇతనికి భార్య ఉండగా.. మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. విశాఖపట్నం, చిత్తూరు, బెంగళూరు ప్రాంతాల్లో ఉన్న వారి వివరాలు, ఫోన్‌నంబర్లను పోలీసులు సేకరించారు. వారిలో ఎవరితో టచ్‌లో ఉన్నాడో దృష్టి సారించారు. అంతేకాక ఇటీవల ప్రభాకర్‌తో సన్నిహితంగా ఉండే మరో మహిళతో కచ్చితంగా మాట్లాడి ఉంటాడని భావించి ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయి. కాగా ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం అందిస్తామని పోలీసులు ప్రకటించారు. ఆచూకీ తెలిసినవారు రిజర్వ్ ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్‌కు 94407 96482కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
క్యూలోనే కనిపిస్తున్న దేవుడు!
ఇంద్రకీలాద్రిపై భక్తులు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. అమ్మవారి దర్శనం సంగతి అటుంచితే.. క్యూలోనే గంటల తరబడి నిరీక్షించి నీరసించిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, వారి తల్లిదండ్రుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. దసరా ఉత్సవాల్లో సాధారణ భక్తులే తమ ప్రాధాన్యమంటూ ఊదరగొట్టిన నాయకులు, ఆలయ, జిల్లా అధికారులు మాటలు నీటి మూటలే అయ్యాయి. వీఐపీ దర్శనాల పేరుతో అడ్డదారిన అడ్డగోలుగా దర్శనాలకు పంపుతుండటంతో క్యూలోనే భక్తులు తిప్పలు పడుతున్నారు. ఉక్కపోత వాతావరణంతో గాలి కూడా అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంగళవారం ఇలాగే పలువురు సొమ్మసిల్లి పడిపోగా.. వారిని పోలీసులు భూజాలపై మోసుకొని వెళ్లి, వైద్య శిబిరంలో అత్యవసర చికిత్స అందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జంబో సేవా కమిటీ సభ్యులు కూడా భక్తుల సేవలో కాకుండా తమకు సంబంధించిన వారికి దర్శనం చేయించే పనిలో నిమగ్నమవడంతో సాధారణ భక్తులు నరకం చూస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
నయనానందకరం.. నగరోత్సవం..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్‌కు స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజల అనంతరం దర్శనాలకు అనుమతించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనాచౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, దుర్గగుడి ఈవో శీనానాయక్‌లతో పాటు పలువురు జిల్లా అధికారులు తొలి దర్శనం చేసుకున్నారు. ఉదయం 8 గంటలకు అన్ని క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ప్రధాన ఆలయంలోని అమ్మవారి ఉత్సవ మూర్తిని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా మహా మండపం ఆరో అంతస్తుకు తీసుకువెళ్లి ప్రతిష్టించారు. ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం సమీపంలోని యాగశాలలో కలశస్థాపన, పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. జన హృది బాలా.. నిత్యకల్యాణశీలా.. బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దుర్గమ్మకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. మహా మండపం ఆరో అంతస్తులో ప్రత్యేక కుంకుమార్చనలో 104 మంది ఉభయదాతలు ఆలయ ప్రాంగణంలో శ్రీచక్రనవార్చనలో 13 మంది, చండీయాగంలో 29మంది ఉభయదాతలు పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న వారికి రూ.300 క్యూలైన్లో బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఇక పరోక్ష చండీ హోమానికి 57మంది, కుంకుమార్చనకు 18మంది రుసుం చెల్లించి ఆన్లైన్లో పూజను వీక్షించారు. ఏర్పాట్ల పరిశీలన..ఉత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. తొలుత కలెక్టర్, కమిషనర్ క్యూలైన్లో ఉన్న భక్తులతో ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో చర్చించారు. అనంతరం నూతన అన్నదాన భవనంలో జరుగుతున్న అన్న ప్రసాద వితరణను పరిశీలించారు. అన్న ప్రసాదం స్వీకరించారు. తొలి రోజు రూ.22 లక్షల ఆదాయం ఉత్సవాల తొలి రోజు సాయంత్రం ఐదున్నర గంటల సమయానికి 47,418మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. పలు సేవలు, దర్శన టికెట్ల ద్వారా రూ.22,72,214 ఆదాయం వచ్చిందన్నారు. ఆది దంపతుల నగరోత్సవ సేవ సోమవారం సాయంత్రం కనుల పండువగా సాగింది. శ్రీగంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలతో పాటు కేరళ వాయిద్యాలు, కోలాట నృత్యాలు, కావడి నృత్యా లతో పలువురు కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, రథం సెంటర్, దుర్గాఘాట్, దుర్గగుడి ఘాట్‌రోడ్డు మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంది. -
దద్దరిల్లిన ధర్నా చౌక్
మచిలీపట్నంఅర్బన్: కూటమి ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ ఉద్యోగులు, వీఆర్ఏలు రోడ్డెక్కారు. బందరులోని కలెక్టరేట్ వద్ద నున్న ధర్నా చౌక్‌లో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏలు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా వీఆర్ఏల సమస్యలు పరిష్కరించలేదన్నారు. వీఆర్ఏలకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షుడు బొడ్డు వెంకటరత్నం, కార్యదర్శి చాట్లు రమేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల ధర్నా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికుల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద నున్న ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్ఓకు వినతిపత్రం అందించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గెలవకముందు విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం చేస్తా మని, అధికారంలోకి వచ్చాక పట్టించుకోవట్లేదన్నారు. జేఏసీ చైర్మన్ బి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
టిప్పర్‌ను ఢీకొని పాస్టర్ ప్రేమ్ రాజ్ దుర్మరణం
ఘంటసాల: మండలం లోని లంకపల్లి జాతీయ రహదారిపై టిప్పర్‌ను ఢీకొని మచిలీపట్నం మండలం బుద్దాలపాలెంలో పాస్టర్‌గా పని చేస్తున్న కె.సుబ్బారావు (ప్రేమ్ రాజ్)(41) దుర్మరణం పాలయ్యారు. పోలీసులు, సేకరించిన వివరాల మేరకు ఆదివారం రాత్రి చల్లపల్లి వైపు నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్ మరమ్మతులకు గురి కావడంతో లంకపల్లి వద్ద జాతీయ రహదారిపై నిలిపివేశారు. పాస్టర్ ప్రేమ్‌రాజ్ తన స్వగ్రామమైన బాపట్ల జిల్లా మోర్తోట గ్రామంలోని చర్చిలో ఆదివారం రాత్రి ప్రార్థన ముగించుకుని బుద్దాలపాలెంకు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. లంకపల్లి గ్రామం వద్ద చీకట్లో ఉన్న టిప్పర్‌ను గమనించిక వెనుక నుంచి ఢీ కొట్టడంతో ప్రేమ్‌రాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెనుక ఉన్న భార్య, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారు ముగ్గురిని చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు ప్రేమ్‌రాజ్ మృతి చెందినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న ఘంటసాల ఎస్ఐ కె.ప్రతాప్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ్ రాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దివిసీమ పరిసర ప్రాంతాల పాస్టర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రేమ్ రాజ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం బుద్దాలపాలెంలో పాస్టర్ ప్రేమ్‌రాజ్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. పెడన: పెడన–గుడివాడ జాతీయ రహదారిలో ఉన్న పల్లోటి ఇంగ్లిష్ మీడియం హైస్కూలు వద్ద సోమవారం రాత్రి ద్విచక్ర వాహనదారుడు విద్యార్థుల సైకిళ్లను ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు, ద్విచక్ర వాహనదారుడు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన, సేకరించిన వివరాల మేరకు పట్టణానికి చెందిన జల్లూరి గిరిష్, గుత్తి లోహిత్, షేక్ మతీన్, మహమ్మద్ ముదాసిర్ పదో తరగతి చదువుతున్నారు. స్పెషల్ క్లాసులు అనంతరం రాత్రి 8 గంటల సమయంలో నలుగురు నాలుగు సైకిళ్లపై పెడన వైపుగా బయల్దేరారు. పల్లోటి కాలనీ నుంచి ద్విచక్రవాహనంపై యార్లగడ్డ వీరబాబు మద్యం తాగి లైటు లేని ద్విచక్ర వాహనంపై వస్తూ వీరిని ఢీకొట్టి కింద పడిపోయాడు. గిరిష్ కాలికి తీవ్ర గాయం కాగా మిగిలిన ముగ్గురు విద్యార్థులకు కూడా కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. వీరబాబుకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్కూలు ఉపాధ్యాయు లు పెడనలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. పెడన పోలీసులు వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవాలలో భాగంగా సోమవారం శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మను డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శ నానికి విచ్చేసిన పవన్‌కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. ఆలయ అర్చకుల అత్యుత్సాహం డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆలయానికి విచ్చేసిన క్రమంలో అర్చకులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. మహా నివేదనలు సాయంత్రం ఆరున్నర గంటలకు పూర్తి కాగా, వెంటనే పంచహారతులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పవన్‌కళ్యాణ్ అమ్మవారిని దర్శించుకుని వెళ్లిన తర్వాత పంచహారతులు జరిపించడంపై భక్తులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. -
అసెంబ్లీలో నూతన కౌలు చట్టం ఆమోదించాలి
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ప్రదర్శన, ధర్నా గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నూతన కౌలు రైతు చట్టం తీసుకువచ్చి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించాలని, అన్నదాత సుఖీభవ ప్రతి కౌలురైతుకూ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు డిమాండ్ చేశారు. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రదర్శన, ధర్నా జరిగింది. కౌలు రైతులు రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు ప్రదర్శన చేశారు. ధర్నా చౌక్‌లో రోడ్డుపై బైఠాయించి, ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, కౌలురైతు సంఘం రాష్ట్ర నాయకుడు బి.బలరాం, రైతు సంఘం సీనియర్ నాయకుడు వై.కేశవరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణ్ణయ్య తదితరులు మాట్లాడారు. అనంతరం వ్యవసాయ శాఖా మంత్రి పేషీలో వినతిపత్రం సమర్పించారు. -
సిఫార్సులకే ప్రాధాన్యం!
సామాన్య భక్తులకు తప్పని పాట్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి విచ్చేసే వీఐపీలకు ప్రత్యేక టైం స్లాట్ కేటాయించిన అధికారులు, దానిని అమలు చేయడంలో విఫలమయ్యారు. సోమవారం ఉదయం 8 గంటలకు అమ్మవారి దర్శనం ఆరంభమైన కొద్ది గంటలలోనే ప్రముఖులు, సిఫార్సులపై వచ్చే వారు నేరుగా కొండపైకి చేరుకున్నారు. దీంతో చిన్న గాలిగోపురం, స్కానింగ్ పాయింట్‌తో పాటు సీఎం గేటు వద్ద వందల సంఖ్యలో భక్తులు వేచి ఉండటం కనిపించింది. ప్రముఖుల సిఫార్సుతో వచ్చిన వారు సైతం నేరుగా స్కానింగ్ పాయింట్ వద్ద ఉన్న వీవీఐపీ గేట్ వైపే మొగ్గు చూపుతున్నారు. సీపీ ఆదేశాలు బేఖాతర్.. మరో వైపు పోలీసు సిబ్బంది యూనిఫారంలో దర్శనాలు చేయిస్తే వారిపై కఠిన చర్యలుంటాయని సీపీ రాజశేఖరబాబు హెచ్చరించారు. అయితే పోలీసు సిబ్బంది సాధారణంగా కనిపించే యూనిఫారం, సఫారీని వదిలి సివిల్ డ్రస్‌పై దర్శనాలకు రావడం కనిపించింది. పదే పదే వస్తున్న సివిల్ పోలీసు సిబ్బందికి ఎటువంటి ఆంక్షలు లేకుండా గేట్లను తీసి ఆలయంలోకి అనుమతిస్తున్నారు. రూ.300, రూ.100 టికెటు క్యూలైన్లు ఖాళీగా దర్శనమివ్వడంతో సిఫార్సులపై వచ్చే వారిని ఆ క్యూలైన్లోకి మళ్లించాలని ఏడీసీపీ జి.రామకృష్ణ ఎన్ని సార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తాము ఫలానా వాళ్ల తాలుకా అంటూ నేరుగా సీఎం గేటు వైపు నుంచే ఆలయానికి చేరుకుంటామని పట్టుబట్టారు. వీఐపీ టైం స్లాట్ మినహా మిగిలిన సమయంలో అంతరాలయ దర్శనాన్ని నిలిపివేస్తామని చెప్పిన దేవస్థాన అధికారులు ఉత్సవాల తొలి రోజే అది అమలు కానిదని తేల్చి చెప్పేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, వారి బంధుగణం వచ్చిన ప్రతి సారి అంతరాలయానికి పంపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగిల్ ఎంట్రీ కార్ పాస్‌లు.. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఆలయ అధికారులు కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఉత్సవాలలో వీఐపీలకు దేవస్థానమే వాహనాలను ఏర్పాటు చేస్తుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ముఖ్యమైన అధికారులకు వారి సొంత వాహనాలను కొండపైకి అనుమతిస్తారు. అయితే ఈ ఏడాది దేవస్థాన అధికారులు, పోలీసులు సింగిల్ ఎంట్రీ కార్ పాస్‌లను జారీ చేశారు. ఈ కార్ పాస్ ఉన్న కార్లను ఓం టర్నింగ్ వరకు అనుమతించడంతో అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. సంగీత దర్శకుడు మణిశర్మకు చేదు అనుభవం ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, టీవీ నటుడు ఆటో రాంప్రసాద్ అమ్మవారిని దర్శించుకునేందుకు మధ్యాహ్నం 1.30గంటల సమయంలో ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. అయితే ఆ సమయంలో వీఐపీ టైం స్లాట్ లేదని చెప్పాల్సి ఉండగా, వారిని నేరుగా దర్శనానికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే సీఎం గేటు వద్ద పెద్ద ఎత్తున భక్తులు దర్శనం కోసం వేచి ఉండటంతో వారు అక్కడే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో వైపున మణిశర్మ వచ్చారనే విషయం ఆలయ సిబ్బందికి చెప్పకుండా ఎమ్మెల్యే కార్యాలయ అనుచరులు నేరుగా సీఎం గేటు వద్దకు తీసుకెళ్లారు. దీంతో మణిశర్మకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. చివరకు సీఎం గేటు తాళాలు తీసిన తర్వాతే భక్తులతో కలిసి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. -
దుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ రఘునందన్‌రావు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల్లో బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు సోమవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన జస్టిస్ రఘునందన్‌రావు దంపతులకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శీనానాయక్, వేదపండితులు పాల్గొన్నారు. -
గల్లంతయిన యువకుడి మృతదేహం లభ్యం
కంచికచర్ల: ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లవాగులో పడి ఆదివారం గల్లంతయిన యువకుడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం సోమవారం బయటకు తీశారు. ఎస్ఐ పి.విశ్వనాథం కథనం మేరకు కంచికచర్ల నేషనల్ హైవే సమీపంలో ఎగువన కురిసిన వర్షాలకు ఆదివారం నల్లవాగు పొంగి పొర్లింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లవాగులో మండలంలోని బత్తినపాడు గ్రామానికి చెందిన కామా శ్రీనివాసరావు(35) కంచికచర్ల నుంచి స్వగ్రామమైన బత్తినపాడుకు బైక్‌పై బయలుదేరాడు. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నా ఆగకుండా బైక్‌ను వేగంగా వాగులో నడిపాడు. దీంతో బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు వెతుకులాట ప్రారంభించారు. బైక్ మాత్రమే దొరికింది. గల్లంతయిన శ్రీనివాసరావు ఆచూకీ తెలియలేదు. ఈ విషయం గురించి ఎన్డీఆర్ఎప్ బృందానికి సమాచారం అందించగా వారు సోమవారం ఉదయం 6 గంటల నుంచి నల్లవాగులో వెతుకులాట ప్రారంభించారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 2 గంటలకు గల్లంతయిన శ్రీనివాసరావు మృతదేహాన్ని కనుగొన్నారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని చూసిన బంధువులు, కుటుంబసభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య ఉన్నారు. పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బంతి పూల సోయగం
పెనుగంచిప్రోలు: బతుకమ్మ పండుగ రానే వచ్చింది. ఇటీవల కాలంలో తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంతంలో కూడా మహిళలు బతుకమ్మ ఆటలు విశేషంగా ఆడుతున్నారు. ఈ పండుగకు పూలే కీలకం కావటంతో రైతులు పూలసాగుపై దృష్టి పెడుతున్నారు. అయితే స్థానికంగా పూలు లభించకపోతే ధరలు పెరుగుతాయి. ఇటీవల కొందరు రైతులు సంప్రదాయ పంటలైన మిర్చి, పత్తి తదితర పంటలు సాగు చేసి నష్టపోవటంతో పూల సాగును చేపట్టారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతులు బంతిపూల సాగు చేపట్టి లాభాలు అందుకుంటున్నారు. వాణిజ్య పంటలకు బదులుగా... వాణిజ్య పంటల సాగుకు అధిక పెట్టుబడులు, పలు రకాల తెగుళ్ల తో పాటు వాతావరణ మార్పులతో దిగుబడులు తగ్గుతున్నాయి. దీంతో రైతులు ప్రత్యామ్నాయంగా పూలు, కూరగాయల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. వీటి ద్వారా తక్కువ పెట్టు బడితో పాటు తక్కువ సమయంలో పంట చేతి కొస్తుండటంతో రైతులు పూల సాగుపై దృష్టి పెడుతున్నారు. ఆదాయం వస్తుందనే నమ్మకం... ప్రస్తుతం బతుకమ్మ ఉత్సవాలు, దీపావళి రానుండటంతో పూలకు మంచి గిరాకీ ఉంటుందనే ఆశ ఉందని రైతులు అంటున్నారు. నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు మండలంలో పెనుగంచిప్రోలు, కొళ్లికూళ్ల, కొ.పొన్నవరం గ్రామాలతో పాటు వత్సవాయి మండలంలోని వత్సవాయి, మక్కపేటతో పాటు పలు గ్రామాల్లో రైతులు బంతిపూల సాగు చేస్తున్నారు. నారు నాటిన రెండు నెలల్లో పూలు కోతకు వస్తాయని, రెండు నెలల వరకు ఎకరానికి రోజుకు క్వింటా పూలు వస్తాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒకటి, రెండు కిలోలు అయితే కిలో రూ.70 నుంచి రూ.80కు తోట దగ్గరే విక్రయిస్తున్నామని, 50 కిలోలు పైన అయితే కిలో రూ.50 నుంచి రూ.60కు ఇస్తున్నామని రైతులు తెలిపారు. ఈ బతుకమ్మ సీజన్లో మంచి ఆదాయం వస్తుందని పక్క గ్రామాల నుంచి కూడా పూల కోసం వస్తారని అంటున్నారు. రైతులకు ప్రభుత్వం నారు సరఫరాతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే బంతి పూల సాగు రైతుకు మరింత లాభసాటిగా ఉంటుంది. ప్రకృతి సహకరిస్తే రోజుకు ఎకరానికి క్వింటా దిగుబడి వస్తుంది. ఇప్పుడిప్పుడే ధర పెరుగుతోంది. ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి పెట్టాను. నాలుగు ఎకరాల్లో బంతి పూల సాగు చేశాను. కొందరు పొలం వద్దే పూలు కొంటుండగా, మిగతా పూలు మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముతున్నాను. –గుడిమెట్ల శంకర్, రైతు, పెనుగంచిప్రోలు -
ఉపరాష్ట్రపతి పర్యటనకు భద్రతా ఏర్పాట్ల పరిశీలన
విమానాశ్రయం(గన్నవరం): ఈ నెల 24వ తేదీన ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ విజయవాడ పర్యటన సందర్భంగా సోమవారం గన్నవరం విమానాశ్రయంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. సీఆర్పీఎఫ్ డీఐజీ కమలేష్ సింగ్ నేతృత్వంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, రాష్ట్ర ఇంటిలిజెన్స్ భద్రతా విభాగం డీఐజీ హఫీజ్, కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చేయాలని కమలేష్ సింగ్ సూచించారు. ఉపరాష్ట్రపతి పర్యటించే మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో రాష్ట్ర పోలీసు విభాగంతో కేంద్ర భద్రతా దళాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని, బాంబ్, డాగ్ స్క్వాడ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఉపరాష్ట్రపతి ఈ నెల 24న సాయంత్రం 4.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డుమార్గం ద్వారా ఐదు గంటలకు విజయవాడ చేరుకుని శ్రీకనకదుర్గమ్మను దర్శించుకుంటారని కలెక్టర్ తెలిపారు. అనంతరం పున్నమి ఘాట్‌ను సందర్శించిన తర్వాత 7.20 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని తిరుపతి బయలుదేరి వెళ్తారని చెప్పారు. విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి పోలీసు గౌరవ వందనం ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ రహదారి మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. సదరు మార్గంలో రహదారిపై గుంతలు లేకుండా మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.ఎల్.కె.రెడ్డి, సీఆర్పీఎఫ్ కమాండెంట్ ధర్మబీర్ జకర్, అసిస్టెంట్ కమాండెంట్ తేజ్ బహదూర్, డీపీఓ డాక్టర్ జె.అరుణ, డీఎస్ఓ మోహన్‌బాబు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో కేసులకు సత్వర పరిష్కారం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దీర్ఘకాలికంగా పరిష్కారం కాని రైల్వే సంబంధిత వివాదాలను సత్వరమే పరిష్కరించేందుకు లోక్ అదాలత్ మంచి వేదికగా నిలుస్తుందని రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, అమరావతి బెంచ్ సభ్యురాలు (జ్యుడిషియల్) డాక్టర్ ఆర్.సత్యభామ అన్నారు. ఈ నెల 22, 23 తేదీలలో గుంటూరులో రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సత్యభామ మాట్లాడుతూ రైల్వే బాధితులకు పరిష్కారాలను వేగవంతం చేయడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 31 ప్రతిపాదిత కేసులను ఎంపిక చేసి వాటిలోని బాధితులకు రైల్వే సంబంధిత క్లెయిమ్స్, వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా కేసులు వేగవంతమైన పరిష్కారంతో పాటు చట్టపరమైన పక్రియను తగ్గించడం, బాధితులకు అనుకూలమైన పరిష్కారం లభిస్తుందన్నారు. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ నిర్వహించే లోక్ అదాలత్ సేవలను రైల్వే సంబంధిత బాధితులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోమవారం జరిగిన లోక్ అదాలత్‌లో అమరావతి బెంచ్ అదనపు రిజిస్ట్రార్ రాజేంద్ర ప్రసాద్, డెప్యూటీ సీసీఎం బాలాజీ కిరణ్ కార్యకలాపాలను పర్యవేక్షించారు. -
గీతాంజలి శర్మ గొప్ప కార్యశీలి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా పూర్వ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గొప్ప కార్యశీలి అని ఆ జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ కొనియాడారు. తన బాధ్యతలను అంకితభావంతో నెరవేర్చారని పేర్కొన్నారు. జేసీగా పనిచేసి బదిలీపై వెళ్తున్న సందర్భంగా గీతాంజలి శర్మకు సోమవారం రాత్రి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ బాలాజీ ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. భవిష్యత్తులో గొప్ప విజయాలను అందుకోవాలని కలెక్టర్ అభిలాషించారు. గీతాంజలి శర్మ మాట్లాడుతూ ఒక ఉద్యోగి చేసే ప్రతి పనికి సహకారం అందించడం తొలి నుంచే నేర్చుకున్నానని, దానినే తాను తిరిగి పొందానని అన్నారు. డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, సర్వే ఏడీ జోషిలా, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, పర్యాటక శాఖ జీఎం రామలక్ష్మణరావు, ఉద్యా న శాఖ అధికారి జె.జ్యోతి, ఆర్డీఓలు తదితర అధికారులు పూర్వ జేసీతో పని చేసిన నాటి అనుభూతులను ఈ సందర్భంగా పంచుకున్నారు. అనంతరం ఆమెను సత్కరించారు. కార్మిక హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్మిక హక్కులను కాలరాసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప, ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మండిపడ్డారు. కార్మికుల పని గంటలు పెంచుతూ.. రాత్రి వేళ మహిళా కార్మికులు పనిచేయాలంటూ అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వం చట్ట సవరణ చేయడాన్ని తప్పుబడుతూ వారు సోమవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పెట్టుబడిదారులను సంతృప్తి పర్చడానికి కార్మిక వర్గంపై కూటమి ప్రభుత్వం ముప్పేట దాడి తీవ్రతరం చేయడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికవర్గం ఏకతాటిపైకి వచ్చి ఐక్య సమరశీల పోరాటాలకు పూనుకోవాలని కేవీపీఎస్ నేతలు నల్లప్ప, మాల్యాద్రి విజ్ఞప్తి చేశారు. పల్లెపాలెంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కృత్తివెన్ను: మండల పరిధిలోని పల్లెపాలెం గ్రామంలో గత వారంరోజులుగా జ్వరపీడితుల సంఖ్య అధికం కావడంతో గ్రామంలో పరిస్థితిని జిల్లా మలేరియా అధికారి బి. రామారావు సోమవారం పరిశీలించారు. గ్రామంలో జ్వరపీడితుల గృహాలను సందర్శించి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. ఈ పరిశీలన సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రామంలో జరుగుతున్న ఆరోగ్య పరీక్షల శిబిరం గురించి, ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవల గురించి వైద్యురాలు హేమను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు సబ్యూనిబ్ అధికారి మురళీ, వైద్యులు సంతోష్‌కుమార్, డీవైహెచ్ఈవో ప్రభావతి, ఎంపీహెచ్ఎస్ రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ కృష్ణలంక(విజయవాడతూర్పు): అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్(యూపీహెచ్సీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.సింహాచలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో యూపీహెచ్సీ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సింహాచలం మాట్లాడుతూ యూపీహెచ్సీ ఉద్యోగులు డీఎస్సీ, ఆర్ఓఆర్ ప్రకారం విధులు నిర్వహిస్తున్నప్పటికీ వేతనాల్లో తీవ్ర వ్యత్యాసం వల్ల అన్యాయానికి గురవుతున్నారన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగులంతా ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గౌరవాధ్యక్షుడు విజయ్‌కుమార్, రాష్ట్ర కన్వీనర్ రాజా రత్నరాజు, కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
బూడిద పోరుబాటకు మంత్రి వ్యాఖ్యలు దన్ను
ఇబ్రహీంపట్నం: ఇటీవల ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అక్రమ బూడిద డంపింగ్, కాలుష్యం నివారణపై వైఎస్సార్ సీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యలు బలం చేకూర్చాయి. బూడిద అక్రమ నిల్వలు, రవాణా, కాలుష్యం, ప్రజల ఆరోగ్యం, లారీ ఓనర్ల ఇబ్బందులపై మాజీ మంత్రి జోగి రమేష్ పోరుబాట పట్టి కార్యకర్తలతో కలసి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ వేదికగా సోమవారం బూడిదపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఈ ప్రాంత సమస్యలపై లేవనెత్తిన అంశాలు కూడా ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ బూడిద పోరుబాటలో భాగంగా వెల్లడించిన కాలుష్యం, ప్రజల ఇబ్బందులనే ప్రస్తావించారనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. అవసరమైతే బూడిద టెండర్ నగదు రూ.2.8 కోట్లు తన సొంత డబ్బులు చెల్లిస్తానని చెప్పడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొండపల్లి మున్సిపాలిటీలో చిరు వ్యాపారుల నుంచి ఆశీలు వసూలు చేయొద్దని, వారి ద్వారా రావాల్సిన ఆశీలు పైకం తన సొంత డబ్బులు మున్సిపాలిటీకి చెల్లిస్తానని ప్రకటించారు. ఆ తర్వాత ఆ నగదు చెల్లించకుండా మున్సిపాలిటీ ఆశీల ప్రక్రియనే రద్దు చేయించారనే అపప్రథ ఆయన మూటగట్టుకున్నారు. బూడిద విషయంలో ఎమ్మెల్యే వసంత లేవనెత్తిన అంశాలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. పైగా ఎన్టీటీపీఎస్ చెరువు నుంచి బూడిద రవాణా, జాతీయ రహదారి పక్కన బూడిద డంపింగ్ యార్డుల వలన గ్రామాల్లో కాలుష్యం పెరిగిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదిక ఆధారంగా బూడిద రవాణా ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ చేపట్టిన బూడిద పోరుబాటకు మంత్రి రవికుమార్ బలం చేకూర్చారనే చర్చ ఈ ప్రాంతంలో విస్తృతంగా జరుగుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి జాతీయ రహదారి పక్కన అక్రమ బూడిద డంపింగ్‌ల వలనే కాలుష్యం పెరిగిందని, అందువలనే ఏపీ జెన్కో బూడిద రవాణా ప్రైవేట్ సంస్థకు టెండర్ ద్వారా అప్పగించిందని ఇటీవల కాలంలో జోగి రమేష్ అక్రమ బూడిద పోరుబాట ద్వారా పదేపదే వెల్లడించిన విషయం తెలిసిందే. -
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ యశోదలక్ష్మి బదిలీ
ఉద్యోగోన్నతిపై శ్రీకాకుళం డీసీవోగా నియామకం గన్నవరంరూరల్: మండలంలోని వీరపనేని గూడెం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వై.యశోదలక్ష్మి ఉద్యోగోన్నతిపై శ్రీకాకుళం జిల్లా కో ఆర్డినేటర్ ఆఫీసర్(డీసీవో)గా బదిలీ అయ్యారు. 2023లో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె వీరపనేనిగూడెం గురుకుల పాఠశాలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత, 10వ తరగతిలో విద్యార్థులు 500 మార్కులు పైబడి సాధించారు. పదవ తరగతిలో నూరు శాతం, జూనియర్ ఇంటర్లో నూరు శాతం, సీనియర్ ఇంటర్లో 97 శాతం ఉత్తీర్ణతతో పాటు, అత్యధిక మార్కుల సాధన ఆమె కృషికి నిదర్శనం. జిల్లాలో గురుకులాన్ని మొదటి స్థానంలో ఉంచారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఢిల్లీలో నిర్వహించిన సదస్సుకు ఆంధ్రప్రదేశ్ తరఫున హాజరయ్యారు. బెంగళూరు అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీలో ఎడ్యుకేషనల్ లీడర్‌షిప్‌పై ఆమె చేసిన ఉపన్యాసం మేధావులను ఆకట్టుకుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో స్థానిక సంస్కృతి సంప్రదాయాలు, పండుగలు భాగం చేయాలని చేసిన సూచనలు సమగ్ర శిక్షలో స్వీకరించటం ఆమె ప్రతిభకు నిదర్శనం. గడచిన మూడేళ్లలో రాష్ట్రంలోనే ఉత్తమ ప్రిన్సిపాల్‌గా, అవార్డులు, రివార్డులు ప్రభుత్వం నుంచి ఆమె స్వీకరించారు. ఉద్యోగోన్నతిపై శ్రీకాకుళం జిల్లా డీసీవోగా బాధ్యతలు చేపడుతున్న యశోదలక్ష్మిని పలు సంస్థలు అభినందించాయి. పామర్రు: ఉమ్మడి కృష్ణాజిల్లా ఓపెన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పామర్రు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచారని హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు అన్నారు. స్థానిక హైస్కూల్లో విజేతలైన విద్యార్థులను సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన పోటీలలో ఏడు మెడల్స్‌ను విద్యార్థులు సాధించారన్నారు. విజయశ్రీ స్వర్ణ పతకం సాధించగా, శ్యామ్, పవన్‌కుమార్ రజత పతకాలు సాధించారని, హారిక, ఆశ్లేషిత, శర్మిక, త్రివేణి, రచన కాంస్య పతకాలు సాధించారని అన్నారు. విజేతలైన విద్యార్థులకు, వారికి శిక్షణ ఇచ్చిన పీడీ జి.మురళిని హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. -
విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డివిజన్ వ్యాప్తంగా రైల్వే ఉద్యోగుల పిల్లలకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ నెల 14, 21 తేదీల్లో విజయవాడ, సామర్లకోట, తుని, ఏలూరు, రాయనపాడు, తెనాలి, ఒంగోలు, భీమవరం, మచిలీపట్నంలో నిర్వహించిన పోటీల్లో 400 మంది ఉద్యోగుల పిల్లలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజన్ ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైషన్ అధ్యక్షురాలు వర్షా సోనాకియా మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లల్లోని ప్రతిభ, నైపుణ్యాలు మెరుగుపడతాయని చెప్పారు. అలానే కుటుంబ బంధాలు బలోపేతం అవుతాయని తెలిపారు. అనంతరం పోటీల్లో విజేతలకు రైల్వే అధికారుల చేతుల మీదుగా బహుమతులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ స్వప్న వరుణ్, జాయింట్ సెక్రటరీ వాసంతిక, కృష్ణ చైతన్య, రమ్య తదితరులు పాల్గొన్నారు. -
షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా పరిచయం శుభపరిణామం
కృష్ణలంక(విజయవాడతూర్పు):కొత్త ఆలోచనలు, ఆశలతో ఎంతో మంది కళాకారులు షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కావడం శుభపరిణామమని ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌భీమన అన్నారు. మహాకవి గురజాడ జయంతి సందర్భంగా రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలుగు షార్ట్ ఫిల్స్ అసొసియేషన్ ఆధ్వర్యంలో చిన్న సినిమా–పెద్ద సందేశం పేరుతో జాతీయ స్థాయి తెలుగు షార్ట్ ఫిల్మ్, ప్రైవేట్ పాటల వీడియోలు, రీల్స్ పోటీలు నిర్వహించారు. షార్ట్‌ఫిల్మ్ పోటీలను అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు యడ్ల పార్థసారథి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్‌భీమన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొత్త తరానికి ప్రోత్సాహమిస్తూ షార్ట్‌ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు. తనతో పాటు చాలామంది నటీనటులు, దర్శకులు షార్ట్ ఫిల్మ్‌ల ద్వారానే సినీపరిశ్రమకు పరిచయం అయ్యామన్నారు. మరింత మంది నూతన నటీనటులు, టెక్నీషియన్స్, దర్శకులు, సంగీత దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం కావడానికి ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలు ఉపయోగపడతాయని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన 15 షార్ట్ ఫిల్మ్‌లు, 31 రీల్స్, 9 ప్రైవేట్ పాటల వీడియోలను ప్రదర్శించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వీరశంకర్, మాజీ ప్రధాన కార్యదర్శి వి.ఎన్.ఆదిత్య, ప్రజా వైద్యశాల వైద్యుడు డాక్టర్ మాకినేని కిరణ్, అమరావతి బాలోత్సవం కార్యదర్శి కొండలరావు, ఎం.బి.విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.మురళీకృష్ణ, తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, డి.వి.రాజు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణానదికి మళ్లీ వరద
ఆందోళనలో కరకట్ట వాసులు కంచికచర్ల: బాలికపై బ్లేడ్‌తో దాడి చేసి గాయపర్చిన ఘటనకు సంబందించి ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.విశ్వనాఽథ్ ఆదివారం తెలిపారు. అంబేద్కర్‌నగర్‌కు చెందిన బాలిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. అదే కాలనీకి చెందిన యువకుడు బాలిక ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో శనివారం రాత్రి వెళ్లి బ్లేడుతో దాడి చేసి గాయపర్చాడు. ఆ యువకుడు పాఠశాలలో బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బాలుతో ప్రయాణం మధుర జ్ఞాపకం
విజయవాడ కల్చరల్: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో ప్రయాణం తన జీవిత గతినే మార్చిందని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ అన్నారు. రాగలహరి కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని ఆశీష్ స్టూడియోలో ఆదివారం సినీ నిర్మాత, సంగీత దర్శకుడు, గాయకుడు బాల సుబ్రహ్మణ్యం సంస్మరణసభ, సినీ సంగీత విభావరి, సినీ, టీవీ నటుడు శుభలేకసుధాకర్కు ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శుభలేక సుధాకర్ మాట్లాడుతూ బాలుతో ప్రయాణం ఓ మధురజ్ఞాపకం అని చెప్పారు. ఆయన వద్దే క్రమశిక్షణ, నిజాయతీ నేర్చుకున్నానని తెలిపారు. బాలు పేరుతో పురస్కారం అందుకోవడం తన జీవితంలో మరచిపోలేని విషయం అన్నారు. సంస్థ వ్యవస్థాపకురాలు మల్లాది స్వాతి మాట్లాడుతూ బాలు మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటు అన్నారు. గాయని కామేశ్వరి, న్యాయవాది ముష్టి శ్రీనివాస్, మీరాకుమార్, చింతకాయల చిట్టిబాబు పాల్గొన్నారు. నిర్వాహకులు శుభలేక సుధాకర్‌ను సత్కరించారు. అయ్యప్పన్ ఆధ్వర్యంలో గాయనీ గాయకులు పలు చిత్ర గీతాలను ఆలపించారు. -
పర్యావరణ పరిరక్షణలో మొక్కలు కీలకం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పర్యావరణ పరిరక్షణలో మొక్కల పెంపకం కీలకమని, ప్రతి ఒక్కరూ వారి దైనందిన జీవితంలో మొక్కలు నాటాలని విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా పేర్కొన్నారు. ‘స్వచ్చతా హీ సేవా–2025’ కార్యక్రమంలో భాగంగా విజయవాడ డివిజన్ వ్యాప్తంగా 41 ప్రాంతాలలో మొక్కల పెంపకంపై డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా పలు రైల్వేస్టేషన్లు, కాలనీలు, హాస్పిటల్స్, హెల్త్ యూనిట్లతో పాటు విజయవాడలోని ఎలక్ట్రికల్ లోకో షెడ్, డిజిల్ లోకో షెడ్, కోచింగ్ డిపో, కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ మొక్కలు నాటడం కేవలం పర్యావరణ పరిరక్షణే కాదని, అది మన ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడి అని తెలిపారు. ఈ రోజు నాటిన మొక్క భవిష్యత్తులో పరిశుభ్రమైన, పచ్చని ఆహ్లాదకర, ఆరోగ్యవంతమైన సామాజం వైపు అడుగును సూచిస్తుందన్నారు. నాటిన ప్రతి మొక్కను రైల్వే సిబ్బంది పర్యవేక్షించాలని, తద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని, మెరుగైన సమాజం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు బ్రాంచ్‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.డీఆర్ఎం మోహిత్ సోనాకియా -
2 హోల్డింగ్‌లు.. 5 క్యూలైన్లు
వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని భావిస్తున్న అధికార యంత్రాంగం సీతమ్మవారి పాదాల వద్ద, వీఎంసీ కార్యాలయం సమీపంలో హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఈ రెండు హోల్డింగ్ పాయింట్లలో సుమారు 12వేల మంది భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇక వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్లకు చైనా వాల్ వద్ద మరో క్యూలైన్, ఓం టర్నింగ్ వద్ద మరో క్యూలైన్ కలిసి మొత్తంగా ఐదు క్యూలైన్లు అలయం వరకు కొనసాగుతాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉన్న ఈ క్యూలైన్లలో అత్యవసరమైన సేవలతో పాటు అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు చేరుకుంటారు. -
కీలకంగా మారనున్న కుమ్మరిపాలెం క్యూలైన్లు
ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో కుమ్మరిపాలెం క్యూలైన్లు కీలకం కానున్నాయి. గతంలో భవానీపురం వైపు నుంచి వచ్చే భక్తుల కోసం హెడ్ వాటర్ వర్కు నుంచి క్యూలైన్లు ప్రారంభమయ్యేవి. అయితే ఈ ఏడాది ఈ క్యూలైన్లలను కుమ్మరిపాలెం సెంటర్ వరకు ఏర్పాటు చేశారు. తెలంగాణ వైపు నుంచి వచ్చే భక్తులతో పాటు భవానీపురం, గట్టు వెనుక ప్రాంతం, సింగ్‌నగర్, వాంబే కాలనీ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కుమ్మరిపాలెం క్యూలైన్లే కొండపైకి చేరుకునేందుకు దగ్గర మార్గం అవుతాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరూ మహా మండపం, గోశాల, కనకదుర్గనగర్ మీదగానే బయటకు వెళ్లేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. -
వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి అభివృద్ధిని వికేంద్రీకరించాలని జనవిజ్ఞాన వేదిక(జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 13, 14 తేదీల్లో విజయనగరంలో జరిగిన జేవీవీ 18వ రాష్ట్ర మహాసభలలో చేసిన తీర్మానాలపై ఆదివారం రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ విజయనగరంలో ఉన్న మహాకవి గురజాడ అప్పారావు గృహాన్ని పరిరక్షించి స్మారక కేంద్రంగా మార్చాలని, ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని, ఆయన పేరుతో విజయనగరంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో నూతనంగా నిర్మించిన 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే నిర్మించి నిర్వహించాలని, ప్రభుత్వ విద్యా సంస్థలను పటిష్ట పరచి టీచింగ్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని తీర్మానం చేశామన్నారు. జేవీవీ రాష్ట్ర నాయకులు డాక్టర్ దార్ల బుజ్జిబాబు, రాజశేఖర్, గౌరు నాయుడు, శోభన్ కుమార్, లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025Iగాంధీనగర్(విజయవాడసెంట్రల్): దసరా ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్ఎస్)ను రద్దు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదివారం తెలిపారు. ఈ నెల 29వ తేదీన కూడా ఈ కార్యక్రమం జరగదని పేర్కొన్నారు.ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. కాంతుల కనకధార.. విద్యుత్‌దీపాలంకరణలతో ధగధగలాడుతున్న ఇంద్రకీలార్రిఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం శ్రీ దేవీ శరన్నవరాత్రి (దసరా) మహోత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాల తొలి రోజైన సోమవారం శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం ఎనిమిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. తొలుత అమ్మవారి ప్రధాన ఆలయంలోని ఉత్సవమూర్తిని మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకొస్తారు. అక్కడ ఉత్సవమూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాల నిర్వహణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చనలు, చండీయాగం, శ్రీచక్ర నవార్చనలు మొదలవుతాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో సాయంత్రం వేళ అమ్మవారికి పంచహారతుల సేవ సమయంలో క్యూలైన్లు యథావిధిగా నడిపించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశతో పాటు దేవదాయ శాఖ అధికారులు నిర్ణయించారు. అంతరాలయంలో పంచహారతులు జరుగుతుండగానే రూ.300, రూ.100 క్యూలైన్‌తో పాటు సర్వ దర్శనం క్యూలైన్లు నడుస్తూ ఉంటాయి. ఏర్పాట్లను దేవదాయ శాఖ, దుర్గగుడి అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులు ఆదివారం మరో మారు తనిఖీ చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం శ్రీబాలా త్రిపురసుందరీదేవిగా అలంకరణ, పూజా కార్యక్రమాలు, బాల భోగ సమర్పణ ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి దర్శనం ఉదయం 9 గంటలకు కలశస్థాపన ఉదయం 9 గంటలకు ప్రత్యేక శ్రీచక్రనవార్చన ఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం ఉదయం 10 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన సాయంత్రం 4 గంటలకు శ్రీగంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవం సాయంత్రం 6 గంటలకు పంచ హారతుల సేవ రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనందుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీపీ -
11 అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం
ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ 11 విశేష అలంకారాల్లో భక్తులను కరుణించనున్నారు. తిథుల హెచ్చుతగ్గుల కారణంగా అలంకారాల్లో మార్పులు వస్తుంటాయని ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. మొదటిగా శ్రీబాలా త్రిపుర సుందరీదేవి, రెండో అలంకారంగా శ్రీగాయత్రిదేవి, మూడో అలంకారంగా శ్రీఅన్నపూర్ణాదేవి, నాల్గో అలంకారంగా శ్రీకాత్యాయనిదేవి, ఐదో అలంకారంగా శ్రీమహాలక్ష్మీదేవి, ఆరో అలంకారంగా శ్రీ లలితా త్రిపురసుందరీదేవి, ఏడో అలంకారంగా శ్రీమహాచండీదేవి, ఎనిమిదో అలంకారంగా శ్రీసరస్వతిదేవి, తొమ్మిదో అలంకారంలో శ్రీదుర్గాదేవి, పదో అలంకారంలో శ్రీ మహిషాసుర మర్దినీదేవి, పదకొండో అలంకారంలో శ్రీరాజరాజేశ్వరిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ ఏడాది కాత్యాయని దేవి అలంకారం అదనం కావడంతో పండుగ 11 రోజులకు వచ్చింది. నిరంతరం ప్రసాద వితరణ.. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని కొండ దిగువన మహా మండపం ఎదుట నూతన అన్నదాన భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలోనే ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని భక్తులకు అందజేస్తారు. ఒకే దఫా వెయ్యి మంది అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. ఇక క్యూలైన్లో చిన్నారుల కోసం పాలు, పెద్దల కోసం బిస్కెట్లు, మంచినీటి బాటిళ్లను అందజేయనున్నారు. -
యువ పరిశోధకులు కొత్త ఆలోచనలతో ముందుకురావాలి
పెనమలూరు: యువ పరిశోధకులు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కృష్ణా యూనివర్సిటీ ఉపకులపతి కూనా రాంజీ అన్నారు. గంగూరు ధనేకుల ఇంజినీరింగ్ కాలేజీలో శనివారం జాతీయ స్థాయిలో ఇన్నోవేటివ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉపకులపతి రాంజీ మాట్లాడుతూ ప్రపంచస్థాయిలో సవాళ్లను ఎదుర్కొవటానికి పరిశోధనలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచించారు. పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులు చదివితే ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ చాటిన వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కాలేజీ డైరెక్టర్ డీఆర్కేఆర్ రవిప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కడియాల రవి, డీన్లు ఆర్.సత్యప్రసాద్, రాజేష్ గోగినేని, ఈడూకేర్ ప్రతినిధులు పి.వెంకట రమేష్, సంతోష్, కోఆర్డినేటర్ డాక్టర్ కోనేరు సౌమ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పెన్షన్ వ్యాలిడేషన్ క్లాజ్ రద్దుకు డిమాండ్
మధురానగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన పెన్షన్ వ్యాలిడేషన్ క్లాజ్‌ను వెంటనే రద్దు చేయాలని ఫోరమ్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.వరప్రసాద్, కన్వీనర్ ఎన్.రామారావు డిమాండ్ చేశారు. స్థానిక చుట్టుగుంట బీఎస్ఎన్ఎల్ భవన్లో శనివారం ఫోరమ్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ క్లాజ్ వల్ల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్‌ను పాత, కొత్త పెన్షనర్స్గా విడగొట్టి.. వేతన సవరణ జరిగితే కేవలం కొత్త పెన్షనర్స్‌కు మాత్రమే వేతన సవరణ జరుగుతుందన్నారు. దీనివల్ల పాత పెన్షనర్స్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌లో అన్ని సంఘాలు కలిసి అసోసియేషన్‌గా ఏర్పడి పెన్షన్ వ్యాలిడేషన్ రద్దు చేయాలని దశలవారీ పోరాటం చేస్తున్నామన్నారు. 8వ పే కమిషన్‌కు చైర్మన్, సభ్యులను నియమించాలి సుప్రీంకోర్టు నకారా వర్సెన్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పెన్షనర్లందరూ సమానం అని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాము వచ్చే నెల 10వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని యూనియన్ల పెన్షనర్స్ చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం జనవరిలోనే ప్రకటించినప్పటికీ ఇంత వరకు సంఘానికి కనీసం చైర్మన్, సభ్యులను విధి విధానాలను ఏర్పాటు చేయలేదన్నారు. దీని వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఎన్.నాగేశ్వరరావు, ఎ.చంద్రశేఖర్, కోటేశ్వరరావు, ఎంఆర్ఎస్ ప్రకాశరావు, వీకే ప్రసాదరెడ్డి, శివరావు, ఎస్.జమిలిరెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. -
సర్వదర్శనం క్యూలైన్లో అధికారుల దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, అధికార బృందం శనివారం సాయంత్రం సర్వదర్శనం క్యూలైన్లో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత కెనాల్‌రోడ్డులోని రథం సెంటర్ వద్ద క్యూలైన్ పనులను పరిశీలించారు. కలెక్టర్ లక్ష్మీశతో పాటు జేసీ ఇలక్కియ, ఆర్డీవోలు కె.చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురి, డీఆర్వో లక్ష్మీ నరసింహం, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లో నడక మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. మార్గ మధ్యలో చైనావాల్ వద్ద నుంచి కృష్ణానదిని, ఓం టర్నింగ్ వద్ద నగర అందాలను కలెక్టర్ బృందం వీక్షించింది. ఉచిత క్యూలైన్లలో ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిల వద్ద కొత్త గ్లాసులను ఏర్పాటు చేయాలని, అదే విధంగా సింక్‌లను యాసిడ్‌తో శుభ్రం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లక్ష్మీగణపతి ప్రాంగణంలో గోవులను తరలించిన ప్రదేశాన్ని శుభ్రం చేయకుండా వదిలేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటర్లలో పోస్టర్లు చినిగి ఉండటంతో వారిని వెంటనే సరి చేయాలన్నారు. క్యూలైన్లలో కొన్ని చోట్ల ఎత్తు పల్లాలుగా ఉందని, దీని వల్ల భక్తులు ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. సర్వదర్శనం క్యూలైన్లో ధ్వజస్తంభానికి మొక్కిన అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన మార్పులను అక్కడ ఉన్న సిబ్బందికి వారు సూచనలు చేశారు. నందిగామటౌన్: వరి పొలంలో మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో రైతు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు పట్టణ శివారు అనాసాగరానికి చెందిన రైతు కొమ్మినీడి నాగేశ్వరరావు(57) రోజూ మాదిరిగానే శనివారం మధ్యాహ్నం వరి పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. మోటార్ స్విచ్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతు పక్కనే ఉన్న పంట పొలంలో పడిపోవడం చూసిన సమీపంలోని రైతులు, వ్యవసాయ కూలీలు హుటాహుటిన నందిగామలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ నాగేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఆనవాళ్లు లేవని చెప్పినట్లు సమాచారం. విద్యుత్ షాక్‌తో మృతి చెందాడా లేక వేరే కారణాలున్నాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. -
ప్రమాదవశాత్తు రూ.10 లక్షల అద్దాలు ధ్వంసం
ఆటోనగర్(విజయవాడతూర్పు): అద్దాల లోడుతో వెళ్తున్న లారీలోని అద్దాలు ప్రమాదవశాత్తు కిందపడిన సంఘటన శనివారం రామవరప్పాడు రింగ్‌రోడ్డు వద్ద జరిగింది. ఈ సంఘటనలో రూ.10 లక్షల నష్టం సంభవించింది. ట్రాఫిక్ సీఐ రమేష్‌కుమార్ వివరాల మేరకు.. మద్రాస్ నుంచి నందిగామ వెళ్తున్న అద్దాల లారీ రామవరప్పాడు రింగ్ వద్దకు రాగానే లారీకి ఇరువైపులా అమర్చిన కర్రలు పక్కకు ఒరగడంతో ఒక్కసారిగా లారీలో ఉన్న సరకు కొంత కిందపడడంతో పాటు లారీ దెబ్బతింది. సగానికి పైగా అద్దాలన్నీ పూర్తిగా పగిలిపోయాయి. అద్దాలు పనికి రాకుండా పోయాయని సీఐ చెప్పారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో జేసీబీతో పగిలిపోయిన అద్దాలను నగరపాలకసంస్థ వారితో చెత్త యార్డుకు తరలించామన్నారు. లారీకి ఇన్సూరెన్స్ ఉందని, సకాలంలో సిబ్బంది సహకరించడం వల్ల ట్రాఫిక్‌ను నియంత్రించామని సీఐ చెప్పారు. -
సామాన్య భక్తులకు దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పించాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): సామాన్య భక్తులకు సంతృప్తికరంగా దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పించడం మన బాధ్యతని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. దసరా మహోత్సవాల విధుల నిర్వహణపై శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దిశనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. నగరంలోని ప్రతి సెక్టార్లో జిల్లా అధికారులు, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్యం, వీఎంసీ శాఖల సిబ్బంది మూడు షిప్టులలో విధులు నిర్వర్తిస్తారన్నారు. ఆయా సెక్టార్లలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా తక్షణమే స్పందించి కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సమాచారం ఇవ్వాలని, యుద్ధప్రాతిపదికను సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పారు. ఐదు నిముషాల ముందే డ్యూటీ పాయింట్‌కు చేరుకుని ముందు షిఫ్ట్ ఆఫీసర్‌ను రిలీవ్ చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం లభించేలా అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలని చెప్పారు. సమష్టిగా పనిచేయాలి.. మొత్తం 36 సెక్టార్ల బాధ్యతలు చూస్తున్న ఇన్‌చార్జ్‌లు, సిబ్బంది కలిసి భక్తుల భద్రత, సురక్షిత మంచినీరు. శుభ్రమైన ఆహారం, అహ్లాదకర పరిసరాలు, సురక్షిత క్యూ లైన్లు, మహిళలు, చిన్నారుల భద్రత, సూచిక బోర్డులు, సమాచార బోర్డులు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ వంటి అంశాలపై దృష్టి సారించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ఎప్పటికప్పుడు భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. భక్తుల క్షేమం, భద్రతపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీపీ ఎస్వీ రాజశేఖరబాబు పలు సూచనలు చేశారు. అందరూ సమష్టిగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, డీఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహం, ఆర్డీవోలు కావూరి చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురి పాల్గొన్నారు. కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు -
ప్లాస్టిక్ నియంత్రణకు పాటుపడండి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ప్లాస్టిక్ నియంత్రణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర, అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవంలో భాగంగా పర్యావరణం కోసం జీవనశైలి.. సేవా పర్వ్–2025’ పేరుతో కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా శనివారం ఆయన కార్యాలయ సిబ్బందితో కలిసి నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణం నుంచి మంగినపూడి బీచ్ వరకు జరిగిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈనెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాలను జరుగుతుందని చెప్పారు. విజేతలకు జ్ఞాపికలు అందజేత.. కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత గురించి అవగాహన కల్పిస్తూ మంగినపూడి బీచ్‌లో తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవంగా పాటిస్తున్నామని చెప్పారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీల విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేసి అభినందించారు. అనంతరం బీచ్‌లో చెత్తాచెదారాన్ని కలెక్టర్ తదితరులు శుభ్రం చేశారు. కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ సెక్షన్ అధికారి అశోక్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీనివాస్, జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, డీఎస్డీవో ఝాన్సీ లక్ష్మి, సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ వెంకటేశ్వరప్రసాద్, వివిధ విభాగాల అధికారులు, ఆక్వా ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలను సద్వినియోగించుకోవాలి
నందిగామరూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని పాడి రైతులు ఆర్థికంగా ఎదగాలని ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ షణ్ముఖ కుమార్, అడిషనల్ కమిషనర్ శివప్రసాద్, జాయింట్ కమిషనర్ శివరామ్ పేర్కొన్నారు. మండలంలోని మునగచర్ల గ్రామంలోని సామూహిక పశు వసతి గృహాన్ని శనివారం వారు పరిశీలించారు. ముందుగా సామూహిక పశు వసతి గృహ నిర్వహణ, పశుగ్రాస పెంపకంపై చేస్తున్న అధ్యయనం తదితర అంశాలను కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాడి పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయన్నారు. అనంతరం గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ పంగలూరి నరసింహారావు, డ్వామా పీడీ రాము, జేడీ హనుమంతరావు, ఎంపీడీవో ప్రసాదరావు, డెప్యూటీ ఎంపీడీవో నామేశ్వరరావు, ఏపీవో శరత్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ షణ్ముఖ కుమార్ -
మద్యం షాపులో ఘర్షణ.. వెల్డర్ మృతి
పెనమలూరు: మద్యం షాపులో ఇద్దరి మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నించిన వ్యక్తి బీరు సీసాతో దాడిలో అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు..కృష్ణా జిల్లా యనమలకుదురు వినాయక్‌నగర్‌కు చెందిన వెల్డర్ అవనిగడ్డ సత్యనారాయణ(34)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం అతడు కానూరులో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్ఎల్టీ మద్యం షాపునకు వెళ్లాడు. అక్కడ యనమలకుదురుకి చెందిన కార్పెంటర్ దేవరపల్లి భవానీ శంకర్, ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసే అయ్యప్ప మద్యం తాగుతున్నారు. అక్కడే మరో పక్కన యనమలకుదురుకు చెందిన మోకా నాగరాజు, నాగశ్రీను కూడా మద్యం తాగుతున్నారు. ఈ క్రమంలో భవానీ శంకర్‌కు, నాగరాజుకు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దిగారు. నాగరాజుతో భవాని శంకర్ కలపడుతుండగా సత్యనారాయణ గొడవ వద్దని వారిని వారించాడు. గొడవ పెరగడంతో సత్యనారాయణ గొడవపడుతున్న నాగరాజును విడదీసి పక్కకు తీసుకువెళ్లే యత్నం చేశాడు. ఈలోగా భవానీశంకర్ ఆగ్రహంతో బీర్ బాటిల్ విసిరేయడంతో అది సత్యనారాయణ తలకు బలంగా తగిలింది. ఆయన తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. -
నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోని కాపులకు నామినేటెడ్ పదవుల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చల్లమల్ల ప్రసాదరావు డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్‌లోని ఐలాపురం హోటల్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాపులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించని పక్షంలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. జేఏసీ నేతలు అమ్మ శ్రీనివాస్ రావు, చందు భవన్నారాయణ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కాపులకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాపులను వాడుకుంటున్నారని, ఎన్నికల తర్వాత కూరలో కరేపాకుల విసిరేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు 95 శాతం ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాపులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు నామినేటెడ్ పదవుల విషయంలో కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సమావేశంలో కాపు జేఏసీ నేతలు జానపాముల నాగబాబు, కర్రి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి -
నిరసన తెలిపితే 400 మందిపై కేసులా?
చిలకలపూడి (మచిలీపట్నం): ప్రజాహితం కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మచిలీపట్నం మెడికల్ కళాశాల సందర్శనకు శాంతియుతంగా వెళ్తే 400 మందిపై కేసులు నమోదుచేయడం ఏమిటని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలిపితే ఇంత మందిపై పదేళ్ల శిక్షకు సంబంధించిన కేసులు నమోదు చేయడాన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూడలేదని అన్నారు. నగరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే విధానమని ప్రశ్నించారు. మెడికల్ కళాశాల నిర్మాణం ఎంత వరకు జరిగింది? అక్కడ ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియజెప్పేందుకే తాము వెళ్లామని నాని చెప్పారు. పేద విద్యార్థులకు మేలు చేకూర్చేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుని రాష్ట్రంలో ఐదు వైద్య కళాశాలల నిర్మాణం పూర్తిచేసి కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయించారని గుర్తుచేశారు. ఫీజులతో వచ్చే మొత్తంతో కళాశాలల నిర్వహణ చేసేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. తాము అధికారంలోకి వస్తే మెరిట్ పద్ధతిన సీట్లు అందిస్తామని లోకేశ్ ప్రగల్భాలు పలికారని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెడుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన చేపడితే ఏకంగా 400 మందిపై, పదేళ్లు శిక్షపడేలా సెక్షన్లు నమోదుచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల కోసం తాము పోరాటం చేసేటప్పుడు ఎన్నిరోజులైనా శిక్ష అనుభవిస్తామని స్పష్టంచేశారు. ఇప్పుడు తమపై పెట్టిన కేసుల్లాగే జనసేన, టీడీపీ అరాచకాలపై కూడా కేసులు నమోదు చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఇక పరిపాలనాధికారికి చుట్టూ ఉన్న వ్యవస్థ వాస్తవాలను చూడనివ్వదని పేర్ని నాని అన్నారు. ఏడాదిన్నర కాలంగా బందరులోని స్టేషన్ హౌస్ అధికారులు పొలిటికల్ వ్యవస్థకు దారుణంగా కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఒకాయన పేకాట శిబిరాలు నిర్వహిస్తాడని, మరొకాయన హత్యలు జరిగితే నిందితులకు కొమ్ముకాస్తాడని, మరొకరు అక్రమంగా డీజిల్ విక్రయాల దందా చేస్తున్నారని వివరించారు. వారిపై కూడా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
వాస్తవాలు రాసే సాక్షిపై కేసులా?
వాస్తవాలను నిర్భయంగా ప్రచురిస్తున్న సాక్షి దినపత్రికపై కూటమి ప్రభుత్వం కేసులు బనాయించడం హేయం. సాక్షి ఎడిటర్‌తో పాటు పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టులపై నమోదు చేసిన అక్రమ కేసులను బేషరతుగా ఉపసంహరించాలి. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి ప్రజల గొంతుకను వినిపిస్తున్న సాక్షిపై కక్షపూరిత చర్యలకు పాల్పడడం అప్రజాస్వామికం. పత్రికలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయించడం అంటే కలానికి సంకెళ్లు వేయడమే. పత్రికల్లో వచ్చిన వార్తలు అభ్యంతరకరంగా ఉంటే వివరణ కోరాలే తప్ప కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరైనది కాదు. – చిటికిన వెంకటేశ్వరమ్మ, మేయర్, మచిలీపట్నం -
అమ్మవారి ప్రతిష్ట తగ్గించేందుకే విజయవాడ ఉత్సవ్
వైఎస్సార్ సీపీ నేత పోతిన మహేష్ వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగే దసరా ఉత్సవాలను అపహాస్యం చేయటానికి, అమ్మ వారి ప్రతిష్టను, ఖ్యాతిని తగ్గించడానికి కూటమి నేతలు విజయవాడ ఉత్సవ్ పేరుతో అడ్డగోలు కార్యక్ర మాలు నిర్వహిస్తున్నారని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ విమర్శించారు. తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘దసరా ఉత్సవాల పేరుతో కూటమి నేతలు చేస్తున్న కార్యక్రమాల్లో అమ్మవారిని గుర్తు పెట్టుకుంటారా? మీ సినిమా పాటలు గుర్తు పెట్టుకుంటారా?’ అని ప్రశ్నించారు. విజ యవాడ ఉత్సవ్ పేరుతో రూ.100 కోట్లు దోచుకోవడానికి ఎంపీ కేశినేని చిన్ని తదితర నేతలు పథకం పన్నారని దుయ్యబట్టారు. శ్రేయస్ మీడియాతో కుదుర్చుకున్న ఒప్పందం ఎంతో విజయవాడ ఎంపీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. విజయవాడలో వందేళ్లగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని గుర్తుచేశారు. సంక్రాంతి రోజు విజయవాడ ఉత్సవ్ నిర్వహించొచ్చు కదా? అని ప్రశ్నించారు. హిందూ భక్తులను దోచుకోవడానికి సీఎం చంద్రబాబు అధికారిక ఉత్తర్వులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు వ్యామోహంతో విష సంస్కృతిని వ్యాప్తి చేస్తున్నారని దుయ్యబట్టారు. విజయవాడ ఉత్సవ్‌కు పర్యటన శాఖ సహకారం, నిధులు ఇస్తోందని కూటమి నేతలు చెప్పటం సిగ్గుచేటన్నారు. బందరు గొడుగుపేట వెంకటేరస్వామికి గొల్లపూడిలో ఉన్న భూముల్లో విజయవాడ ఉత్సవ్ ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. అమ్మవారి దసరా ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. కూటమి ప్రజాప్రతినిధులు విజయవాడ ఉత్సవ్ ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారు తప్ప, అమ్మవారి దసరా ఉత్సవ్ పత్రికలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. దసరా ఉత్సవాల్లో మిస్ విజయవాడ పోటీలా? దసరా ఉత్సవాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని చాటే విధంగా జరగాలని కానీ విజయవాడ ఉత్సవ్ పేరుతో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మిస్ విజయవాడ పోటీలు పెట్టడం సిగ్గుచేటని పోతిన మహేష్ విమర్శించారు. సంస్కృతి, సంప్రదాయాలను కాలరాసేలా విజయవాడ ఉత్సవ్ పేరుతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ర్యాంప్ వాక్‌లు పెట్టడానికి సిగ్గు, బుద్ధి ఉందా అని మండి పడ్డారు. తిరుపతి లడ్డూలో జరగని కల్తీ కోసం ప్రాయశ్చితం చేసుకున్న డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దుర్గమ్మ ఉత్సవాల పవిత్రను దెబ్బతీసేలా నిర్వ హిస్తున్న విజయవాడ ఉత్సవ్ గురించి ఏమి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మవారితో పెట్టుకొని దోపిడీ చేయాలంటే పతనం తప్పదని హెచ్చరించారు. -
ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
సాక్షి పత్రికపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. జర్నలిస్టులపై విచారణ, అరెస్టులు అంటూ వేధింపులకు పాల్పడుతోంది. ప్రశ్నించే మీడియా గొంతు నొక్కేయటం అంటే స్వేచ్ఛను, వాక్ స్వాతంత్య్రాన్ని హరించడమే. కూటమి ప్రభుత్వ పెద్దలకు నిజాలు మింగుడు పడటంలేదు. సాక్షి పత్రికపై కక్షసాధింపు చర్యలను మానుకోవాలి. సాక్షాత్తూ ఎడిటర్ పైనే కేసులు నమోదు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్న కూటమి ప్రభుత్వపు పోకడలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలే తగిన బుద్ధి చెబతారు. – బెల్లం దుర్గ, డెప్యూటీ మేయర్, విజయవాడ -
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు త్వరితగతిన ఇవ్వండి
మచిలీపట్నంటౌన్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను త్వరితగతిన మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.పుల్లారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయంలో పలు అంశాలపై ఆయన శనివారం విద్యుత్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ డైరెక్టర్ (టెక్నికల్) మురళికృష్ణ యాదవ్‌తో కలసి ఈ సమీక్ష చేశారు. ఈ సంద ర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా సర్కిల్ పరిధిలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి రైతులకు ఇబ్బందిలేకుండా చూడాలని సూచించారు. అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు. ఆర్డీఎస్ఎస్ స్కీం కింద మంజూరయిన పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగదారులకు లో వోల్టేజీ సమస్యను నివారించాలని పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగదారులకు విస్తృతంగా ప్రచారం చేసి ఎక్కువ సోలార్ సర్వీస్‌లు చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం.సత్యానందం, సర్కిల్లోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లు, జూని యర్ అకౌంట్స్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
పత్రికలపై అక్రమ కేసులు సరికాదు..
ప్రభుత్వాలు ఐదేళ్లకొకసారి మారుతూ ఉంటాయి. కానీ నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెస్తూ.. ప్రజల తరఫున పొరాడే పత్రికలు శాశ్వతంగా ఉంటాయి. అటువంటి పత్రికలపై అక్రమ కేసులు బనాయించి పత్రికా స్వేచ్ఛని హరిస్తే.. ప్రజా స్వామ్యానికే ప్రమాదం తలెత్తుతుంది. ప్రభుత్వాలు ఆ విధంగా వ్యవహరించకూడదు. ఇప్పటికైనా ప్రభుత్వం తన పంథాను మార్చుకోవాలి. సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేసి, ప్రభుత్వానికి మీడియా పట్ల ఉన్న విశ్వాసాన్ని చాటుకోవాలి. – జ్యేష్ఠ రమేష్‌బాబు, మైలవరం మాజీ ఎమ్మెల్యే -
రెండు స్లాట్లలో వీఐపీ దర్శనాలు
● 18 గంటల పాటు ఉచిత ప్రసాద వితరణ ● దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి విచ్చేసే వీఐపీల కోసం రెండు స్లాట్లను కేటాయించామని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన శుక్రవారం మోడల్ గెస్ట్ హౌస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఫెస్టివల్ ఆఫీసర్ భ్రమరాంబ, దుర్గగుడి ఈవో శీనానాయక్, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఏడీసీపీ గున్నం రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు పాల్గొన్నారు. దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి విచ్చేసే వీఐపీలకు ఉదయం 7గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి 5 గంటల వరకు రెండు స్లాట్లుగా నిర్ణయించామన్నారు. రూ. 500 టికెట్ల విక్రయాలను పూర్తిగా రద్దు చేసి రూ. 300, రూ. 100 టికెట్లతో పాటు సర్వ దర్శనం క్యూలైన్లు నిరంతరం కొనసాగుతాయన్నారు. శనివారం సాయంత్రం నాటికి పనులు పూర్తి చేసి అధికారులు తుది నివేదిక ఇవ్వనున్నారన్నారు. ఏర్పాట్ల పరిశీలన.. మరో వైపు శుక్రవారం ఉదయం దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆలయ ప్రాంగణంతో పాటు మహా మండపం, గోశాల, కనకదుర్గనగర్, అన్నదాన భవనం, ప్రసాదాల పోటును పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. -
ఇది ప్రజాస్వామ్యంపై దాడి
ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభం. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావటం, అవకతవకలను బహిర్గతం చేయడం మీడియా బాధ్యత. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్న సాక్షి పత్రికపై అణచివేత చర్యలు తీసుకో వడం దురదృష్టకరం. ప్రజల నిజమైన స్వరాన్ని వినిపిస్తూ ప్రజాస్వామ్య రక్షణలో ముందుండే పత్రికపై ప్రభుత్వం అక్రమంగా కేసులు మోపడం ఆక్షేపణీయం. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ రక మైన చర్యలకు పాల్పడుతోంది. ఇది సాక్షి పత్రికపై దాడి మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంపై దాడి కూడా. – పోతిన మహేష్, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, వైఎస్సార్ సీపీ -
ప్రయోగం ఫలించిందిరొయ్య
నాగాయలంక: బయోఫ్లోక్ సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులలో రొయ్యల పెంపకం ఒక పర్యావరణ అనుకూల పద్ధతిగా పరిగణిస్తారు. ఇది తక్కువ నీటి వినియోగంతో రొయ్యల రోజువారీ వృద్ధి, మనుగడ రేటు ను పెంచుతుంది. ఈ పద్ధతిలో సూక్ష్మజీవుల వ్యర్థా లను, ఆహార అవశేషాలను ఫ్లోక్(ఫ్లోక్యులేట్ చేసిన సూక్ష్మజీవుల ద్రవ్యరాశి) రూపంలోకి మార్పుచేసి రొయ్యలకు ప్రొటీన్ మూలంగా ఉపయోగపడతాయి. పర్యవసానంగా నీటి నాణ్యతను స్థిరంగా ఉంచుతూ అధిక సాంధ్రతలో రొయ్యలను పెంచడానికి బయోఫ్లోక్ టెక్నాలజీ సహాయపడుతుందనేది శాస్త్రవేత్తల వివరణ. ఇవి కావాలి.. హెచ్డీపీఈ లేదా కాంక్రీట్‌తో పూత పూసిన, లీకేజీ లేని చెరువులు, సౌండ్, ఎయిరేషన్(గాలి సరఫరా)వ్యవస్థలు అవసరం. బయోఫ్లోక్ వ్యవస్థకు అవసరమైన ప్రోబయోటిక్ బ్యాక్టీరియాను ఎంచుకోవడంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వనామీ వంటి సాగుకు అనుకూలమైన రొయ్యల జాతులను ఎంచుకోవాలి. చెరువులలో నీటి ఉప్పదనం(సైలెనిటీ)రొయ్యలకు అనుకూలంగా స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. 700 టన్నుల సామర్థ్యం కలిగిన నర్సరీ ట్యాంకులో 15లక్షల రొయ్య పిల్లలు వేస్తామని వీటి ఒక నెల తర్వాత కల్చర్ చెరువుల్లోకి మారుస్తామని, మొదటి నెల చెరువులో సాగుకు అయ్యే ఖర్చు నర్సరీలో చాలా తక్కువగా ఉంటుందని ఈ విధానాన్ని అవలంభిస్తున్న ఆక్వా రైతు సతీష్ చెబుతున్నారు. బయోఫ్లోక్ టెక్నాలజీ ముఖ్యాంశాలు తక్కువ నీటి వినియోగం: నీటి వృథాను సున్నా లేదా కనిష్టంగా తగ్గిస్తుంది. మెరుగైన వృద్ధి రేటుతో రొయ్యలు వేగవంతమైన పెరుగుదలకు సహాయ పడుతుంది. పోషక రీసైక్లింగ్: వ్యర్థాలను సూక్ష్మజీవులు ఫ్లోక్గా మార్చి రొయ్యలకు సహజ ఆహారంగా అందించడంతో దాణా వ్యయం తగ్గిస్తుంది. అధిక సాంద్రత పెంపకం: క్యూబిక్ మీటర్‌కు 400–600 రొయ్యల వరకు అధిక సాంద్రతలో పెంచడానికి వీలు కల్పిస్తుంది. స్థిరమైన నీటి నాణ్యతను నియంత్రించడం ద్వారా రొయ్యల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కలెక్టర్ సందర్శన.. కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా ఈ ఆక్వా ఫామ్‌ను సందర్శించి సాగు తీరును పరిశీలించారు. ఆయన ఫామ్ యజ మాని సతీష్‌తో మాట్లాడి వనామీ రొయ్యల సాగు విధానం, పెట్టుబడి, ఖర్చులు, రాబడులు, ఎగుమతులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సాగు విధానం ఎంతమేరకు విజయవంతం అయిందన్న విషయాన్ని పరిశీలించి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో సైతం అవలంబించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారులకు సూచించారు. -
జనవరిలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నీ
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): వచ్చే జనవరిలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ (మహిళలు) టోర్నీ నిర్వహిస్తామని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. 2025–2026 సంవత్సరానికి స్పోర్ట్స్ క్యాలెండర్‌ను ఖరారు చేయడానికి హెల్త్ వర్సిటీ పరిధిలోని అన్ని మెడికల్ కాలేజీల ఫిజికల్ డైరెక్టర్ల సమావేశం విజయవాడలోని వర్సిటీ ఆవరణలో గురువారం జరిగింది. ఈ సమావేశంలో నిర్ణయించిన వివరాలను చంద్రశేఖర్ వెల్లడించారు. న్యూఢిల్లీలోని ఇండియన్ యూనివర్సిటీల సంఘం కేటాయించిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ (మహిళలు) టోర్నీని జనవరిలో నిర్వ హించాలని నిర్ణయించారు. నెల్లూరులోని నారా యణ మెడికల్ కాలేజీలో పురుషుల గేమ్స్ మీట్, విశాఖపట్నంలో ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో ఉమెన్స్ గేమ్స్ మీట్, శ్రీవెంకటేశ్వర వైద్య కళాశాలలో పురుషుల క్రికెట్ టోర్నీ, కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో అథ్లెటిక్ మీట్, విజయనగరంలోని మహారాయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి సైన్సెస్‌లో పురుషులు–మహిళల కోసం గేమ్స్ మీట్, నారాయణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో నర్సింగ్ ఉమెన్ గేమ్స్ మీట్, రాజమండ్రి లోని మెడికల్ కాలేజీలో పీజీల కోసం పురుషుల క్రికెట్ టోర్నీ, గన్నవరం మండలం చిన్నఅవుటుపల్లిలోని డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పురుషులు–మహిళల పీజీలకు గేమ్స్–స్పోర్ట్స్ మీట్ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికరెడ్డి, వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ ఇ.త్రిమూర్తి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం క్రీడా కార్యకలాపాలకు ప్రోత్సాహం అందించినందుకు వీసీ చంద్రశేఖర్‌ను సత్కరించారు. -
లాటరీ ద్వారా 7 బార్లు కేటాయింపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల కాలానికి (2025 నుంచి 2028 వరకు) ప్రకటించిన కొత్త బార్ పాలసీలో భాగంగా ఏడు బార్లకు లాటరీ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఎకై ్సజ్ అధికారులు, దరఖాస్తుదారుల సమక్షంలో గురువారం లాటరీ తీశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో సాధారణ కేటగిరీ విభాగంలో 130 బార్లు, గీత కులాల వారికి ప్రత్యేకంగా 10 బార్లు కేటాయించామన్నారు. తొలి విడత నోటిఫికేషన్లో భాగంగా ఓపెన్ కేటగిరీలో 69 బార్లు, గీత కులాల వారికి కేటాయించిన 10 బార్లు మొత్తం 79 బార్ల కేటా యింపు గతంలోనే పూర్తయిందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఓపెన్ కేటగిరీలో మిగిలిపోయిన 61 బార్ల కేటాయింపునకు ఈ నెల మూడో తేదీన మరోసారి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని, దీనికి 17వ తేదీ గడువు ముగిసే సమయానికి ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 61 బార్లకు గాను ఏడు బార్లకు మాత్రమే మొత్తం 28 దరఖాస్తులు వచ్చాయన్నారు. 54 బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదన్నారు. వీటిలో నిబంధనల ప్రకారం కనీసం నాలుగు దరఖాస్తులొచ్చిన ఏడు బార్లకు లాటరీ నిర్వహించి కేటాయించామని, 54 బార్లకు దరఖాస్తులు రాని కారణంగా కేటాయింపులు నిలిచిపోయాయన్నారు. తిరువూరు నగర పంచాయతీ పరిధిలో ఒకటి, జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలో ఒకటి, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆరు బార్లు, విజయవాడ నగర పరిధిలో 46 బార్లు దరఖాస్తులు రాక మిగిలిపోయాయ న్నారు. లాటరీలో బార్లు దక్కించుకున్న దరఖాస్తుదారులు నిర్ణయించిన వార్షిక లైసెన్స్ ఫీజులో ఆరవ వంతు సొమ్ము ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించాలని కోరారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం పేద, మధ్యతరగతి వర్గాలకు వైద్యం, వైద్య విద్యను దూరం చేయడమేనని పలువురు రాజకీయ, ప్రజా సంఘాల నేతలు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ, ప్రజా, విద్యార్థి సంఘాలను కలుపుకొని విజయవాడ ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. జీవోలు దగ్ధం మహాధర్నా ప్రాంగణంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ మోడ్‌కు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను జడ శ్రావణ్‌కుమార్, ఇతర నేతలు కలిసి దగ్ధం చేశారు. ధర్నాలో పాల్గొన్న వ్యక్తులు, సంఘాలివే... వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, వికలాంగుల విభాగం పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు బందెల కిరణ్‌రాజ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి దేవీప్రసాద్, హైకోర్టు న్యాయమూర్తి, మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ కో ఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు, వీసీకే పార్టీ నేత గంజి రామారావు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి, లోక్‌జనశక్తి నేత చింతా వెంకటేశ్వర్లు, సుమమాల అధ్యక్షుడు భాస్కరరావు, మాలమహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు మంచ నాగమల్లీశ్వరి, ఐయూఎంఎల్ ఖాజావలి పాల్గొన్నారు. మున్సిపల్, రైల్వే ఉద్యోగ సంఘాలు, విశ్రాంత ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. తెలంగాణకు చెందిన రాజేష్ ప్రసంగం, పాట అందరినీ ఆకట్టుకుంది.జార్ఖండ్ తరహాలో ఉద్యమిద్దాం జార్ఖండ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే ప్రజలు తిరగబడి మళ్లీ ప్రభుత్వ అధీనంలోకి తీసుకు వచ్చేలా చేశారు. అదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, పార్టీలల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ప్రభుత్వం మెడలు వంచుదాం. –శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి అగ్రవర్ణ పేదలకు నష్టమే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకే కాకుండా అగ్రవర్ణ పేదలకు సైతం వైద్య విద్యను దూరం చేయడమే అవుతుంది. దీనిపై అందరినీ కలుపుకొని వచ్చే నెలలో ఏలూరులో బహిరంగ సభ నిర్వహిస్తాం. –జడ శ్రావణ్‌కుమార్, జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడుబాబు ఆలోచన కార్పొరేట్ల గురించే.. పేదల గురించి ఆలోచన చేసే నైజం చంద్రబాబుకు లేదు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, తన కార్పొరేట్లకు, బంధువులకు సంపద సృష్టించే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు. –పేర్ని నాని, మాజీ మంత్రి ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తామంటున్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం –విడదల రజని, మాజీ మంత్రి చాలా దుర్మార్గం భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే, వాటిని చంద్రబాబు ప్రైవేటు పరం చేస్తాననడం చాలా దుర్మార్గం. –దేవినేని అవినాష్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్జిల్లా ప్రైవేటీ కరణ చేస్తే ఉద్యోగాలు కోల్పోతాం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రయివేటు పరం చేస్తే వైద్య సీట్లతో పాటు వైద్య కళాశాల, ఆస్పత్రుల్లో పారా మెడికల్, నర్సింగ్, మినిస్టీరియల్ సిబ్బంది వంటి వేలాది ఉద్యోగాలు కోల్పోతాం. –డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు, మెడికల్ స్టూడెంట్స్ పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు -
మృతదేహానికి రీపోస్ట్‌మార్టం
నాగాయలంక: మండలంలోని నాలి గ్రామంలో గత నెల 28వ తేదీన ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందిన యువకుడు నాయుడు దానియేలు(19) మృతదేహానికి గురువారం రీపోస్ట్ మార్టమ్ నిర్వహించారు. రిపోర్టు సమయంలో ఈ ఘటనను పోలీసులు అనుమానాస్పద కేసు కింద నమోదు చేశారు. దానియేలు మృతిపై అతడి తల్లి అమ్మాయమ్మ, ఇతర బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తూ మళ్లీ శవపరీక్ష జరి పించి న్యాయం చేయాలని గత వారం నాగాయలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు స్థానిక ఎస్ఐ కలిదిండి రాజేష్ ఫోరెన్సిక్ నిపుణులను గురువారం రప్పించారు. అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ, నాగాయలంక తహసీల్దార్ సీహెచ్.వి.ఆంజనేయ ప్రసాద్, అవనిగడ్డ సీఐ పి.యువకుమార్, మృతుని కుటుంబ సభ్యుల సమక్షంలో శవాన్ని బయటకు తీయించారు. బందరు నుంచి వచ్చిన ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం దానియేలు మృతదేహానికి రీ–పోస్ట్‌మార్టమ్ నిర్వహించింది. ఈ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్ఐ రాజేష్ తెలిపారు. -
ఎంపీగా చిన్ని అన్‌ఫిట్
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఎంపీగా అన్‌ఫిట్ అని, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని ధ్వజమెత్తారు. ఎంపీ అంటే దండుకోవడం, దాచుకోవడం అని ఆయన కొత్త నిర్వచనం చెప్పారని ఎద్దేవా చేశారు. విజయవాడ చరిత్రలో ఎంతో మంది ఎంపీలుగా పనిచేశారు కానీ.. చిన్ని వంటి అవినీతి, అసమర్థ ఎంపీని తానెప్పుడూ చూడలేదన్నారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ ఆంధ్రప్రభకాలనీలోని జనహిత సదనంలో గురువారం వైఎస్సార్ సీపీ నేతలతో కలసి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ అయినా కూడా చిన్ని ఇంకా రియల్ ఎస్టేట్ బ్రోకర్లానే మాట్లాడుతున్నాడని, కనీస జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థాన భూములు పేర్ని నాని కొట్టేశాడంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2007 మార్చి 29వ తేదీన 5.30 ఎకరాలకు వేలం వేస్తే అందులో 135 మంది సభ్యులు మనిషికి రూ.2 లక్షల చొప్పున చెల్లించి పాల్గొన్నారని, వారిలో 50 శాతానికి పైగా టీడీపీ వారే ఉన్నారని, ముఖ్యంగా మంత్రి కొల్లు రవీంద్ర గుండెకాయగా చెప్పుకునే వ్యక్తులు కూడా ఉన్నారని గుర్తుచేశారు. ఎండోమెంట్స్ చట్టం, హైకోర్టు వేలం ద్వారా మాత్రమే దేవస్థాన భూములను లీజుకు ఇవ్వాలని చెబుతుంటే కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ దేవస్థాన భూముల్లో మట్టి తరలించా రని, అమ్మవారికి పోటీగా ఉత్సవాలు పెట్టడం వల్ల ఎవరికి లాభమో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికై నా అన్నయ్య కేశినేని నానిని చూసి ఎలా హుందాగా బతకాలో, ప్రజలకు ఎలా సేవ చేయాలో నేర్చుకోవాలని చిన్నికి హితవు పలికారు. పాపపు సొమ్ముతో ఉత్సవాలా? ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గమ్మ చరిత్ర తెలి యకుండా విజయవాడ ఉత్సవాలను నిర్వహించాలని చూడటం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లాది విష్ణు పేర్కొన్నారు. వ్యాపారుల వద్ద బలవంతంగా చందాలు వసూలు చేస్తూ.. ఆ పాపపు సొమ్ముతో ఉత్సవాలు చేయడం దుర్మార్గమన్నారు. దేవుడి స్థలాల్లో గోల్ఫ్‌లు పెడతారా అని ప్రశ్నించారు. అమ్మవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ ఉత్సవాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన, నేడు కూటమి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు రావాలని కోరిన ఎంపీ చిన్ని సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని విష్ణు ప్రకటించారు. అమ్మవారి ఖ్యాతిని తగ్గించొద్దు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. విజయవాడ ఉత్సవాల పేరుతో ఆధ్యాత్మికతను దెబ్బతీసి, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఖ్యాతిని తగ్గించే పనులు చేయవద్దని హితవు పలికారు. విజయవాడ ఉత్సవాల పేరుతో ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా అక్రమ వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. ఎంపీ చిన్ని 15 నెలల్లోనే కనీవినీ ఎరుగనంత అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఇసుక, మట్టి, బూడిద, స్థలాలతో పాటు ఇప్పుడు అమ్మవారి పేరుమీద కూడా అక్రమార్జన చేస్తున్నారని వివరించారు. అసలు ఈ సంఘం దేనికి పెట్టారు? 40 ఎకరాలకు కట్టిన రూ.45 లక్షలు ఎవరివి అని ప్రశ్నించారు. అక్కడ రూ.45 లక్షలు కట్టి ఇక్కడ ఒక్కో షాపునకు రూ.3.50 లక్షల చొప్పున రూ.కోట్లు దండుకుంటున్నారని వివరించారు. అసలు ఎండోమెంట్స్ భూములను ఇవ్వాలని కలెక్టర్ లెటర్ రాసివ్వడం ఎక్కడా చూడలేదని, దీనిపై కోర్టులకు వెళ్తామని, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఉత్సవాల ఖ్యాతిని దిగజార్చి, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్టు
మైలవరం(జి.కొండూరు): మైలవరంలో తన రెండో భార్య కూతురు గాయత్రిని హత్య చేసి వాగులో పడేసిన చిందే బాజీపై పోలీసులు పీడీ యాక్టును అమలు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ హత్య చేసిన కేసులో బాజీ నేరం ఒప్పుకున్నప్పటికీ గాయత్రి శవం పోలీసులకు లభించకపోవడంతో ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నాడు. అతనిపై గతంలో ఉన్న గంజాయి కేసులు, క్రిమినల్ కేసులు ఆధారంగా పోలీసులు పీడీ యాక్టును ప్రయోగించారు. గంజాయి విక్రయిస్తూ, రవాణా చేస్తూ పట్టుబడడంతో బాజీపై మైలవరం పోలీసుస్టేషన్లో మూడు గంజాయి కేసులు, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మంలో ఒక గంజాయి కేసు నమోదైంది. జి.కొండూరు పోలీసుస్టేషన్లో ఒకటి, మైలవరం పోలీసుస్టేషన్లో ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతను పట్టుబడిన నాలుగు గంజాయి కేసుల్లో ఇప్పటి వరకు 27.170 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బాజీ మాదక ద్రవ్యాలు విక్రయిస్తూ, యువతలో వ్యసనాన్ని పెంచుతూ, సమాజ శాంతికి ముప్పు కలిగిస్తున్నందున అతని నేర స్వభావాన్ని పరిగణలోకి తీసుకుంటూ పీడీయాక్టును అమలు చేసినట్లు సీఐ దాడి చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
డీఆర్ఎం విస్తృత తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు, రైల్వే స్టేషన్ల పరిశుభ్రతకు విజయవాడ డివిజన్ అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఆ దిశగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో అనేక స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో సరికొత్త హంగును తీర్చిదిద్దుతోందని డీఆర్ఎం మోహిత్ సోనాకియా తెలిపారు. బ్రంచ్ అధికారులతో కలసి ఆయన విజయవాడ డివిజన్లోని మచిలీపట్నం–గుడివాడ, భీమవరం టౌన్–నర్సాపూర్ సెక్షన్లలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ముందుగా మచిలీపట్నం చేరుకుని అమృత్ భారత్ పథకంలో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. రన్నింగ్ రూమ్, కోచింగ్ డిపోలను తనిఖీ చేశారు. స్వచ్చతా హీ కార్యక్రమంలో భాగంగా స్టేషన్లో పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం గుడివాడ స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు. స్టేషన్‌లోని ప్రీమియం వెయిటింగ్ హాల్ ఆధునికీకరణ పనులు, మాడ్యులర్ టాయిలెట్ల ఏర్పాటు, స్టేషన్ ప్రవేశ ముఖద్వారం అభివృద్ధి పనులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తనిఖీ చేశారు. ఈ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అక్కడ నుంచి భీమవరం టౌన్ స్టేషన్ చేరుకున్న డీఆర్ఎం దివ్యాంగ ప్రయాణికుల సౌకార్యలను పరిశీలించారు. వారి సౌలభ్యం కోసం ర్యాంపు నిర్మాణాలు, మాడ్యులర్ టాయిలెట్లు, 12 మీటర్ల ఎఫ్ఓబీ నిర్మాణ పనులను సమీక్షించారు. నర్సాపూర్ స్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించిన అనంతరం నర్సాపూర్–నిడదవోలు సెక్షన్లో రియర్ విండో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ.. స్టేషన్లోకి అడుగుపెట్టే ప్రతి ప్రయాణికుడికి ప్రపంచస్థాయి సౌకర్యాలతో పాటు ఆహ్లాదకర ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. -
ఆలయ పరిసరాల్లోనూ ప్రచారార్భాటం
విజయవాడ దుర్గగుడి పరిసరాలలో ఎటువంటి రాజకీయ ప్రచార కటౌట్లు ఏర్పాటు చేయరాదనే నిబంధనను తోసిరాజని గుడి సమీపంలో, తూర్పు కెనాల్ వద్ద రాజకీయ నాయకుల చిత్రాలతో దసరా ఉత్సవాలు, ఇతర ప్రచార భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. నిత్యం వాహనాలు, భక్తులు తిరిగే ప్రధాన రోడ్డు ఇది. దసరా ఉత్పవాల భక్తుల క్యూలైన్లు కూడా ఈ కటౌట్స్ ఎదుటే ఉంటాయి. ఇటీవల భారీ వర్షం, ఈదురుగాలులకు సీఎం చంద్ర బాబు, మంత్రి లోకేష్‌ల కటౌట్ కూలిపోయింది. ఆ సమయంలో భక్తుల రద్దీ, వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మళ్లీ ఇప్పుడు అదే ప్రదేశంలో నాయకుల ఫొటోలతో భారీ కటౌట్లు వెలిశాయి. అధికారులు వీటిని గుర్తించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.– నడిపూడి కిషోర్, సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ -
ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చూడాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో విజయవాడ మీదుగా ప్రయాణం సాగించే వారికి ఎటువంటి అవాంత రాలూ లేకుండా చూడాలని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సావ్ జరగనున్న నేపథ్యంలో వాహనదారుల సౌలభ్యం కోసం వెస్ట్ బైపాస్ ఏరియాను కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఇతర అధికారులతో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ నేపథ్యంలో ప్రయాణికులు, వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలకు సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ సౌలభ్యం కోసం వెస్ట్ బైపాస్‌ను ఉపయోగించాలని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని వాహనదారుల ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యాలని నిర్ణయించినట్లు తెలిపారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో పాటుగా ఏపీ ట్రాన్స్‌కో, వెస్ట్ బైపాస్ ప్రాజెక్టు డైరెక్టర్లు, ఇతర అధికారులు వెస్ట్ బైపాస్ ఏరియాను పరిశీలించారు. వాహనదారుల ప్రయాణాలపై సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అనంతరం పార్కింగ్ ఎరియాలను, కుమ్మరిపాలెం నుంచి దుర్గాఘాట్ వరకు క్యూలైన్లను, దుర్గాఘాట్ నుంచి మహామండపం, కనకదుర్గానగర్, రథం సెంటర్, వినాయక టెంపుల్, సీతమ్మ వారి పాదాలు, హోల్డింగ్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి, ఏడీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ అంటే మనీ ప్యాకింగ్ సర్వీస్‌లా మార్చారు..
గొల్లపూడి దేవస్థానం స్థలంతో తనకు సంబంధం లేదని, తాను కేవలం సభ్యుడినేనని ఎంపీ కేశినేని చిన్ని అబద్ధాలు ఆడుతున్నారని, సొసైటీ ఫర్ విజయవాడ వైబ్రెంట్కు అధ్యక్షుడిగా మొదటి పేరు ఆయనదే ఉందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. ఉత్సవాల పేరుతో డబ్బులు దండుకోవాలని ముందే పక్కా ప్రణాళికతో ఆ ప్రాంతంలో ఆరడుగుల ఎత్తున మట్టి పోశారని, ఇంత మట్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తోలించారో చెప్పాలని నిలదీశారు. అమ్మవారి ఉత్సవాలను దెబ్బతీస్తున్నారనే బాధతో ఆర్ఎస్ఎస్ వాళ్లు కోర్టుకు వెళ్తే ఎంపీ చిన్ని వైఎస్సార్ సీపీపై ఆరోపణలు చేస్తు న్నారని విమర్శించారు. ఎంతో ఖ్యాతి ఉన్న ఇంద్రకీలాద్రి అమ్మవారి ఉత్సవాల ప్రతిష్టను దిగజార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అమ్మవారి ఉత్సవాలకు ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టని ఎంపీ విజయవాడ ఉత్సవాలకు పదిసార్లు రివ్యూ మీటింగ్‌లు ఎలా పెట్టారని ప్రశ్నించారు. తమ జేబులు నింపుకోవడం కోసం ఏటా పిన్నమనేని గ్రౌండ్లో జరిపే దసరా ఉత్సవాలను ఆపేయాలని అక్కడి నిర్వాహకులను ఎంపీ చిన్ని బెదిరించడం నిజం కాదా, విజయవాడ ఉత్సవాల కోసం మెడికల్ షాపు అసోసియేషన్‌ను రూ.2 కోట్లు డిమాండ్ చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. -
సమాచార శాఖ ఏడీకి కలెక్టర్ అభినందనలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర సమాచార కేంద్రం విజయవాడ కార్యాలయంలో సహాయ సంచాలకుడిగా ఉద్యోగోన్నతి పొందిన ఎన్టీఆర్ జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్.వి.మోహన్‌రావుకు కలెక్టర్ జి.లక్ష్మీశ అభినందనలు తెలిపి ఘనంగా సత్కరించారు. సమాచార పౌర సంబంధాల శాఖ విజయవాడ సహాయ సంచాలకుల కార్యాలయంలో సహాయ సంచాలకుడిగా ఉద్యోగో న్నతి పొందిన మోహన్‌రావును బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం అభినందనలు తెలిపి సత్కరించారు. 2008లో సహాయ పౌర సంబంధాల అధికారి (ఏపీఆర్వో)గా విజయవాడ రాష్ట్ర సమాచార కేంద్రంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన ఎస్.వి.మోహన్‌రావు విజయవాడ డివి జనల్ పీఆర్వోగా, డీపీఆర్వోగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయవాడ సహాయ సంచాలకుడిగా ఉద్యోగోన్నతి పొందారు. ఉద్యోగోన్నతి పొంది నప్పటికీ జిల్లాకు సంబంధించిన కార్యక్రమాలకు కూడా కవరేజ్ చేస్తూ మీడియా ప్రతినిధులు, అధికారులను మరింత సమన్వయం చేసుకోవాలని కోరారు. దసరా మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ డీపీఆర్వోగా బాధ్యతలు చేపట్టిన వై.బాలకృష్ణ కలెక్టర్ లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో డీఐపీఆర్వో కె.వి.రమణరావు, ఇన్చార్జ్ డీపీఆర్వో వై.బాలకృష్ణ, డివిజనల్ పీఆర్వో కె.రవి, ఏవీఎస్ వి.వి.ప్రసాద్, సిబ్బంది కె.గంగా భవాని, వై.గౌరి మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
అసమర్ధతను కప్పిపుచ్చుకోవటానికే కేసులు..
కూటమి ప్రభుత్వం తన అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే ప్రశ్నిస్తున్న వారిపై కేసులకు తెగబడు తోంది. ప్రజలకు అలవికాని హామీలిచ్చి వాటిని విస్మరించిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పత్రికలపై, వాటి సంపాదకులపై కేసులు పెట్టడం దుర్మార్గం. ప్రజల ముందు సాక్ష్యాలు ఉన్నప్పటికీ బుకాయించటం, ప్రశ్నించిన వారిపై కూటమి పాలకులు ఎదురు కేసులు పెట్టడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. సాక్షి పత్రికపైనా, దాని సంపాదకుడు, జర్నలిస్టులపై పెట్టిన దుర్మార్గపు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. – షేక్ ఆసిఫ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ -
కేసరపల్లిలో కేంద్ర బృందం పర్యటన
కేసరపల్లి(గన్నవరం): మండలంలోని కేసరపల్లి గ్రామాన్ని బుధవారం నేషనల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డెప్యూటీ డైరెక్టర్ అదితి అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం పర్యటించింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్వర్ణ పంచా యతీ పోర్టల్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీల్లో స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో పన్నుల వసూళ్ల గురించి రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2021లో తమ పాలకవర్గం అధికారంలోకి వచ్చినప్పుడు రూ.45 లక్షలు ఉన్న గ్రామపంచాయతీ వార్షిక ఆదాయాన్ని ప్రస్తుతం రూ.2 కోట్లకు పెంచినట్లు సర్పంచి చేబ్రోలు లక్ష్మీమౌనిక తెలిపారు. పెరిగిన ఆదాయంలో గ్రామంలో పలు సీసీ రోడ్లు, డ్రెయిన్లు వంటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. కాఫీ స్టాల్ పరిశీలన అనంతరం ఈ బృందం దుర్గాపురం వద్ద గ్రామపంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన కుంభకోణం కాఫీ స్టాల్‌ను పరిశీలించింది. ఈ స్టాల్ ద్వారా నెలకు రూ.70 వేలు వరకు పంచాయతీకి ఆదాయం సమకూరనున్నట్లు ఇన్చార్జ్ ఈఓపీఆర్డీ రాజబాబు తెలిపారు. పంచాయతీలు ఆదాయం పెంచుకోవాలి అనంతరం అదితి అగర్వాల్ మీడియాతో మాట్లా డుతూ రాష్ట్రంలో గ్రామపంచాయతీల స్వయం సమృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు వచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామపంచాయతీల ఆదాయం పెంచుకునేందుకు కాఫీ స్టాల్, క్రికెట్ నెట్ వంటివి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఉపసర్పంచ్ జాస్తి శ్రీధర్‌బాబు, ఎంపీటీసీ సభ్యులు శొంఠి కిషోర్, పంచాయతీరాజ్ అసిస్టెంట్ డైరెక్టర్లు చందన, హర్ష, చైతన్య, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీలో రాణించిన 17 మందికి సత్కారం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇటీవల జరిగిన డీఎస్సీలో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు పొందిన 17 మంది అభ్యర్థులను గ్రంథాలయాధికారులు సత్కరించారు. బందరు రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, డైరెక్టర్ ఎ.కృష్ణమోహన్, కార్యదర్శి వి. రవికుమార్ అభ్యర్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీఎస్సీ పరీక్షలకు అభ్యర్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకున్నారని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో మరింత మంది ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వసతి లేని విద్యార్థులు గ్రంథాలయాల్లో చదువుకోవాలన్నారు. ఉద్యోగాలు సాధించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఠాగూర్ గ్రంథాలయ అధికారి కె.రమాదేవి, గ్రేడ్ 3 గ్రంథ పాలకురాలు వై.ధనలక్ష్మి, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో రూ.42.20 లక్షలకు టోపీ లబ్బీపేట(విజయవాడతూర్పు): డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని బెదిరించి రూ.42.20 లక్షలు స్వాహాచేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు.. 76 ఏళ్ల నరపరెడ్డి సత్యనారాయణమూర్తి నంద మూరినగర్ ఆరో లైన్లో నివశిస్తున్నారు. అతనికి ఈ నెల 11న ఎస్కే చౌదరి డేటా ప్రొటెక్టింగ్ బోర్డు ఆఫీసర్ పేరుతో కాల్ చేశారు. అతని ఆధార్ కార్డు చెల్లనిదిగా మారిందని, సేఫ్టీ కోసం మరో అకౌంట్ తెరవాలని నమ్మబలికారు. అనంతరం క్రైమ్ పోలీసుల మంటూ మరో రెండు నంబర్ల నుంచి వీడియో కాల్ చేసి బెదిరింపులకు దిగారు. వృద్ధుడిపై అరెస్టు వారెంట్ ఉందంటూ బెదిరించారు. పదే పదే ఫోన్లు చేసి డిజిట్ అరెస్టు అంటూ వేధింపులకు గురి చేశారు. వారి వేధింపులు తాళలేక వృద్ధుడు ఈ నెల 15న ఆర్టీజీఎస్ ద్వారా రూ.42,20,280 వారు చెప్పిన బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం మోసపోయానని గ్రహించి బుధవారం సైబర్ క్రైమ్ స్టేషన్లో సత్యనారాయణ మూర్తి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు మైలవరం(జి.కొండూరు): మైలవరం మండలంలోని పోరాటనగర్ గ్రామానికి చెందిన యువకుడు అజ్మీరా రమేష్‌నాయక్‌పై పోలీసులు బుధవారం పోక్సో కేసు న మోదు చేశారు. మైలవరం పోలీసుల కథనం మేరకు.. పోరాటనగర్ గ్రామానికి చెందిన అజ్మీరా రమేష్‌నాయక్ అదే గ్రామానికి చెందిన 17 బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. అనంతరం ఆమైపె లైంగికదాడి చేశాడు. రమేష్‌నాయక్ వేధింపులు తాళలేక ఆ బాలిక ఈ నెల 9వ తేదీన ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్సఅనంతరం కోలుకున్న బాలిక అసలు విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. బాలిక తల్లి మైలవరం పోలీసులకు బుధవారం పిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రమేష్‌నాయక్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈరోడ్–జోగ్బాని మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల కోరిక మేరకు విజయవాడ మీదుగా తమిళనాడులోని ఈరోడ్ స్టేషన్ నుంచి బిహార్‌లోని జోగ్బాని స్టేషన్ మధ్య స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపేందుకు రైల్వేబోర్డు పచ్చజెండా ఊపింది. ఈ నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వారంలో ఒక రోజు నడిచేలా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నెల 25 నుంచి పార్రంభ మయ్యే ఈరోడ్–జోగ్బాని ఎక్స్‌ప్రెస్ (16601) ప్రతి గురువారం ఉదయం 8.10 గంటలకు ఈరోడ్‌లో బయలుదేరి గూడూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్లు, మంచిర్యాల మీదుగా శనివారం రాత్రి ఏడు గంటలకు జోగ్బాని చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (16602) ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటలకు జోగ్బానిలో బయలుదేరి బుధవారం ఉదయం 7.20 గంటలకు ఈరోడ్ చేరుతుంది. -
గవర్నర్‌కు ఆహ్వానం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై 22వ తేదీ నుంచి నిర్వహించే దసరా ఉత్సవాలకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు దేవదాయ శాఖ అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. బుధవారం గవర్నర్‌ను దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, దుర్గగుడి ఈవో శీనానాయక్‌లతో పాటు ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అంతకు ముందు దసరా ఉత్సవాల ఏర్పాట్ల గురించి దేవదాయ శాఖ కమిషనర్ గవర్నర్‌కు వివరించారు. తొలుత ఆలయ అర్చకులు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వేద ఆశీర్వచనం అందజేసి, పట్టువస్త్రాలు, పవిత్రాలను అందించారు. అదే విధంగా ప్రభుత్వంలోని పలువురికి కూడా ఆహ్వాన పత్రికలను దేవదాయ శాఖ, దుర్గగుడి అధికారులు అందజేశారు. స్వర్ణాంధ్ర సాధనలో ఎన్ఎస్ఎస్ కీలకం కోనేరుసెంటర్: స్వర్ణాంధ్ర సాధనలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె. రాంజీ పేర్కొన్నారు. బుధవారం సెనేట్ హాల్లో విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం ఎన్ఎస్ఎస్ యూనిట్లు గ్రామాల్లో చేపట్టవలసిన సేవా కార్యక్రమాలపై చర్చించారు. విద్యార్థులకు డిజిటల్ లిటరసీ శిక్షణపై అవగాహన కల్పించాలని కోరారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా గ్రామస్తులను భాగస్వాములను చేసి శుభ్రతా డ్రైవ్‌లు చేపట్టాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష, ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. ఘనంగా విశ్వకర్మ జయంతి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. బుధవారం కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సంప్రదాయ కళలు, కళాకారుల క్షేమం, సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. విశ్వకర్మ యోజన ద్వారా సాధికారిత కల్పించేందుకు కృషి చేస్తున్నాయన్నారు. అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చేతివృత్తుల కళాకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఆధునిక నైపుణ్యాల సము పార్జన ద్వారా చేతివృత్తులకు కొత్త వైభవం వస్తుందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. -
విమానాశ్రయంలో ఘనంగా యాత్రి సేవ దివస్
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో బుధవారం యాత్రి సేవ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. తొలుత విమానాశ్రయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వేర్వేరుగా మొక్కలు నాటారు. అనంతరం విమానాశ్రయ టెర్మినల్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన ఎయిర్పోర్ట్ ఉద్యోగులు, భద్రత దళాలను ఆయన అభినందించారు. అనంతరం జరిగిన ఉచిత వైద్య శిబిరంలో ట్యాక్సి, క్యాబ్స్ డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు, సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలో ప్రయాణికులకు సాధరణ హెల్త్ చెకప్‌లు నిర్వహించారు. వంద మంది జెడ్పీ హైస్కూళ్ల విద్యార్థులకు విమానాశ్రయ సందర్శనకు అవకాశం కల్పించారు. ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, విమానయాన రంగంలో ఉద్యోగ అవకాశాలు గురించి వివరించారు. యాత్రి సేవ దివస్‌ను పురస్కరించుకుని విమానాశ్రయానికి విచ్చేసిన ప్రయాణికులకు ప్రత్యేకంగా తిలకం దిద్ది స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులకు, బాల ప్రయాణికులకు డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక, జానపద నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి, పలువురు విమానాశ్రయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
వేద పాఠశాల ప్రారంభం
తాడేపల్లి(ఘంటసాల): కృష్ణాజిల్లా ఘంటసాల మండలం తాడేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శృతి భారతి వేద పాఠశాల, కంప్యూటర్ల గదిని ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామిజీ, అసంగానందగిరి స్వామిజీలు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీలు మాట్లాడుతూ.. ఎన్నారై మూల్పూరి వెంకట్రావు–సావిత్రి దంపతుల చేయూతతో ఈ వేద పాఠశాల ఏర్పాటైందని చెప్పారు. తిరుపతికి చెందిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం డైరెక్టర్ జ్ఞానరంజన్ పాండా మాట్లాడుతూ వేద పాఠశాలో అక్టోబర్ 1 నుంచి రెండేళ్ల సంస్కృత కోర్సు తరగతులు ప్రారంభిస్తామన్నారు. ముందుగా స్వామీజీలు శ్రీ సద్గురు మళయాళ స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో విశ్రాంత సంస్కృత ఉపాధ్యాయులు రంగాచార్యులు, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
ఇబ్రహీంపట్నం: బూడిద డంపింగ్‌లు, అక్రమ రవాణా, కాలుష్య నివారణపై వైఎస్సార్ సీపీ చేపట్టిన పోరుబాటను పోలీసులు భగ్నం చేశారు. మూలపాడు, జూపూడిలో టీడీపీ నేతలు అక్రమంగా డంపింగ్ చేసిన బూడిద నిల్వలు పరిశీలించి, లారీ ఓనర్లకు అప్పగించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి బుధ వారం ర్యాలీగా బయలుదేరిన మాజీ మంత్రి జోగి రమేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తమను వెళ్లనీయాలని జెడ్పీ వైస్ చైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి భర్త గరికపాటి రాంబాబు పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించని పోలీసులు జోగి రమేష్‌తో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేసి వాహనంలో భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో నాయకులు, కార్యకర్తలు జోగి రమేష్‌కు అండగా నిలిచి ప్లకార్డులు పట్టుకుని.. ప్రభుత్వం, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదా లు చేశారు. ఏసీపీ దుర్గారావు నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, 60మంది పోలీసు సిబ్బంది ర్యాలీని అడ్డుకోవడం గమనార్హం. సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మించాలి.. అరెస్ట్‌కు ముందు జోగి రమేష్ మాట్లాడుతూ బూడిద కాలుష్యం, అక్రమ బూడిద రవాణాపై వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌కు బూడిద లోడింగ్ అప్పగించి లోకల్ లారీ ఓనర్ల పొట్టకొట్టిందన్నారు. సుమారు 500 కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. కాలుష్యంతో నిండిపోయిన ఈ ప్రాంతంలో ఏపీ జెన్కో సంస్థ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మించి పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. కాలుష్య నివారణకు మొక్కలు పెంచి, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోందని స్పష్టం చేశారు. అరెస్ట్ అయ్యింది వీరే.. జెడ్పీ వైస్ చైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి, జి.కొండూరు ఎంపీపీ వేములకొండ లక్ష్మీతిరుపతమ్మ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి వేములకొండ తిరుపతిరావు, మేడపాటి నాగిరెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు పచ్చిగోళ్ల పండు, గుంజా శ్రీనివాస్, మిక్కిలి శరభయ్య, మండల, పట్టణ అధ్యక్షులు రెంటపల్లి నాగరాజు, పోరంకి శ్రీనివాసరాజు, విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడు బయ్యారపు రవికిషోర్‌ను అరెస్ట్ చేసి భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బూడిద కారణంగా కాలుష్యంతో ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్న వారికి దిక్కెవరని చంద్రబాబు, లోకేష్, పోలీసులను జోగి రమేష్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే అయినంత మాత్రాన మైలవరం నియోజకవర్గంలో సహజవనరులు దోచుకోవచ్చా అని పోలీసులను నిలదీశారు. లారీ ఓనర్లు, కాలుష్యం, ప్రజలకు మెరుగైన వైద్యం, తాగునీటిపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్న మైందన్నారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్, జన సేన నాయకులు అందరూ పార్టీలను పక్కనబెట్టి వస్తే సమైక్యంగా పోరాడదామని పిలుపునిచ్చారు. ప్రజల కోసం చేస్తున్న పోరాటానికి పోలీసులు సైతం సహకరించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ అక్రమ బూడిద వ్యాపారంలో నిమగ్నమై ఉన్నట్లు మాజీ మంత్రి విమర్శించారు. లారీ ఓనర్ల పొట్టకొట్టి మూలపాడు వద్ద వేల లారీల బూడిద నిల్వ చేసి, ప్రతిరోజూ వందలాది లారీలు హైదరాబాద్ తరలిస్తూ లారీకి రూ.20వేల నుంచి రూ.25వేలు వరకు విక్రయిస్తున్నారన్నారు. ఇలా రోజుకు సుమారు రూ.25లక్షల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ వ్యాపారం అరికట్టాలని కలెక్టర్, సీపీ, విద్యుత్ సౌధా, గ్రీన్ ట్రిబ్యూనల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయాల్లో ఇప్పటికే ఫిర్యాదులు అందజేశామన్నారు. డంపింగ్ చేసి న ఎమ్మెల్యే వసంత, అతని బావమరిది పోసానిపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీశారు. బూడిద అక్రమ రవాణా మంత్రి లోకేష్ కనుసన్నల్లో నడుస్తోందని టీడీపీ నేతలు చెప్పటంపై ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర కూడా ఉందని తేటతెల్లమవుతుందన్నారు. పోలీసులు తనను అరెస్ట్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్నారు. -
బందరు టీడీపీలో ముసలం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ గొల్లపూడిలోని మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 40 ఎకరాలకు సంబంధించిన తాజా పరిణామాలపై మచిలీపట్నం టీడీపీ ముఖ్య నేతల మధ్య ముసలం ముసురుకుంది. మచిలీపట్నం ముఖ్య నాయకులు విజయవాడకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యాపారులతో కుమ్మక్కై దేవస్థానం భూముల విషయంలో సహకరించారనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఆ పార్టీ అధిష్టానం దృష్టికి వాస్తవాలను తీసుకెళ్లి దేవస్థానం భూములను కాపాడుకోవాలనే ఆలోచన కూడా చేయకపోవడాన్ని బట్టి నాయకుల తీరు తేటతెల్లమవుతోందని పార్టీలు, వర్గాలకు అతీతంగా బందరు వాసులు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలిక ఎత్తుగడతో.. దసరా ఉత్సవాల సమయంలో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు వినోద, ఆహ్లాద కార్యక్రమాల కోసం ‘విజయవాడ ఉత్సవ్’ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. దీని వెనుక దీర్ఘకాలిక ఎత్తుగడ ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గొడుగుపేట ఆలయానికి చెందిన 35 ఎకరాల్లో విజయవాడ ఉత్సవ్ పేరిట శాశ్వత ప్రాతిపదికన వార్షిక ఎగ్జిబిషన్, అయిదు ఎకరాల్లో గోల్ఫ్‌కోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు ఉన్నట్లు బందరు వాసుల దృష్టికి పదిరోజుల కిందటే వెళ్లింది. విజయవాడ పార్లమెంటు ముఖ్యనేత, విజయవాడకు చెందిన రాష్టస్థాయి కార్పొరేషన్ చైర్మన్, బందరు రోడ్డులోని ఓ ప్రముఖ హోటల్ యజమాని, మరో ఇద్దరు ప్రజాప్రతినిధులు విజయవాడ ఉత్సవ్ పేరిట ఆలయ భూములను శాశ్వత ప్రాతిపదికన పొందేలా గూడు పుఠాణి చేస్తున్నారని అక్కడి ప్రజలు అంచనాకు వచ్చారు. ఇదే విషయాన్ని ముందుగానే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది కూడా. అఖిలపక్షం సమావేశంలో చర్చించి.. ఆలయ భూముల విషయంలో ఏదో తేడా జరుగుతోందని భావించిన బందరులోని ధార్మిక సంస్థలు, వైఎస్సార్ సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ తదితర పార్టీలతో పాటు పలు సంఘాలు సమావేశమయ్యాయి. తమకు గాని, తమ పార్టీ నాయకులకు గాని ఏమీ తెలియదని టీడీపీ వారు తెల్లముఖం వేశారు. సమావేశం నుంచే జనసేన నాయకుడు ఎం.రాము మంత్రి కొల్లు రవీంద్రకు ఫోన్ చేసి ఆలయ భూములకు సంబంధించి ఏం జరుగుతోందని ప్రశ్నించగా.. తాను స్థానికంగా అందు బాటులో లేనని, గొడుగుపేట ఆలయ భూముల విషయం తన దృష్టికి రాలేదని, ఈ విషయంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌తో కూడా మాట్లాడతానని నమ్మబలికారు. ఆ సమావేశంలో పాల్గొన్న వైఎస్సాఆర్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఆలయానికి సంబంధించి తమ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందనేది వివరించారు. దేవస్థానానికి విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ సరైన ఆలనాపాలనా లేదని, వర్షం వస్తే స్వామి విగ్రహంపై చినుకులు పడుతుండటాన్ని గమనించి రూ.2 కోట్లతో త్రిదండి చినజీయర్ స్వామి ద్వారా ఆలయ పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయించి పూర్తి చేసినట్లు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే ఆలయ భూములను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందనే ఏకాభిప్రాయం వ్యక్తమైంది. మరుసటి రోజే కొల్లు మాట మారింది.. సమావేశం మరుసటి రోజు ఉదయాన్నే ఆలయం వద్దకు వచ్చి ఎవరికీ, ఏ సొసైటీకి, ఏ అవసరాలకు భూములు ఇవ్వడంలేదని, కలెక్టర్‌కు చెప్పి ఆపించేస్తామని చెప్పిన మంత్రి కొల్లు రవీంద్ర మాట 24 గంటల్లోగా మారిందని సమావేశంలో పాల్గొన్న వారు గుర్తుచేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కొమ్మారెడ్డి పట్టాభి తదితరులను వెంటబెట్టుకుని మంత్రి రవీంద్ర రూ.45లక్షల చెక్కును దేవస్థానం వారికి అందజేశారని సుజయ్ కుమార్, రాజశేఖర్, అయోధ్యరామయ్య తదితరులు వివ రించారు. తాము పరిస్థితులను అంచనా వేసుకున్నందునే న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. విదేశీ టూర్‌కు కొనకళ్ల.. స్థానికంగా టీడీపీలోని తాజా పరిస్థితులను అంచనా వేసుకున్న ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ముఖం చాటేస్తూ బుధవారం విదేశాలకు పయనమయ్యారు. అమెరికాతో పాటు టర్కీ, మక్కా తదితర ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. బంధువుల వద్దకు అంటూ బయలుదేరిన ఆయన దసరా ఉత్సవాల తరువాతే తిరిగి రానున్నారు. గొడుగుపేట ఆలయ భూములే కాదు రాష్ట్రంలోని ఏ ఆలయం, మరే ధార్మిక సంస్థకు చెందిన సెంటు భూమి కూడా పరులకు దక్కనీయకుండా అడ్డుకుంటా మని బందరుకు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు బూరగడ్డ సుజయ్‌కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. స్వామి భూమిని కాపాడుకోవడానికి తనతో పాటు వీహెచ్‌పీ, బీజేవైఎం నాయకులు రాజశేఖర్, అయోధ్యరామయ్య కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. కాగా సుజయ్‌కుమార్ పెడన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ బాబాయ్ కుమారుడు. స్థానిక టీడీపీ నాయకులు సైతం ఆలయ భూముల విషయంలో మంత్రి కొల్లు తీరును తప్పుపడుతుండటం గమనార్హం. -
కక్షసాధింపులో భాగమే..
సాక్షి దినపత్రిక నిజాలను నిర్భయంగా రాస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతోంది. వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్‌గా నిలిచింది. పాలకుల అవినీతిని ఎత్తిచూపుతోంది. ఇది జీర్ణించుకోలేని ప్రభుత్వం సాక్షిపై కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఆ పత్రిక జర్నలిస్టులను అక్రమ కేసులతో వేధిస్తోంది. ఎడిటర్ ధనంజయరెడ్డిపైనా కేసులు నమోదు చేసింది. ఇది పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే. ఇది సరైన విధానం కాదు. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. – అవుతు శ్రీశైలజారెడ్డి, డెప్యూటీ మేయర్, విజయవాడ -
డిగ్రీతో దాగుడుమూతలు!
అగమ్యగోచరంగా విద్యార్థుల భవిత వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లాలో డిగ్రీ అడ్మిషన్లపై గందరగోళం నెలకొంది. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విద్యార్థుల్లోను, వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలై నేటికి ఐదు మాసాలు కావొస్తున్నా డిగ్రీ చదువుకునే విద్యార్థులకు నేటికీ అడ్మిషన్లు కాక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డిగ్రీ ప్రవేశాలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఈ ఏడాదిలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో ఆలస్యం జరగటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పక్క రాష్ట్రాల్లో ముగిసిన డిగ్రీ అడ్మిషన్లు.. ఏటా జూలై మాసం లేదా ఆగస్టులో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసి అధికారికంగా తరగతులను సైతం ప్రారంభిస్తారు. కానీ ఈ ఏడాది సెప్టెంబర్ 15 దాటినా ఇప్పటి వరకూ డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయలేదు. దాంతో విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. పక్క రాష్ట్రాల్లో విడతల వారీగా చేపట్టిన ప్రవేశాలు ఇప్పటికే పూర్తయి తరగతులు నిర్వహిస్తున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాకపోయినట్లయితే వాటి పరీక్షలు సైతం తీవ్రంగా ఆలస్యం జరిగే అవకాశముంటుంది. తత్ఫలితంగా పీజీ అడ్మిషన్లతో పాటుగా ఇతర పోటీ పరీక్షలు తదితర అంశాల్లో అవకాశం కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయని విద్యార్థులు వాపోతున్నారు. వాయిదాలపైన వాయిదాలు.. సెప్టెంబర్ ఒకటో తేదీన డిగ్రీ తరగతులు ప్రారంభిస్తామని అధికారులు నోటిఫికేషన్లో ప్రకటించారు. దానిని సాంకేతిక లోపాలంటూ సెప్టెంబర్ మొదటి వారం అని ప్రకటించారు. దానిని సైతం వాయిదా వేసి ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారు. దాంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం విద్యారంగంలో అనుసరిస్తున్న విధానాల ఫలితంగా గందరగోళ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని, విద్యార్థులతో పాటుగా విద్యారంగ నిపుణులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనధికారికంగా తరగతులు ప్రారంభం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రైవేట్ కళాశాలలు డిగ్రీ అడ్మిషన్లు అధికారికంగా ఖరారు కాకపోయినా తరగతులను ప్రారంభించేశారు. అయితే సీట్ల కేటాయింపు జరగకుండా తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వచ్చే అవకాశముందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సీట్లు ఆయా కళాశాలలో రాకపోయినట్లయితే వారి పరిస్థితి ఏమిటని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కళాశాలలు కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయి. విశ్వవిద్యాలయం పరిధిలో సుమారుగా 140 కళాశాలలు కొనసాగుతున్నాయి. అందులో సుమారుగా 90 కళాశాలల వరకూ డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. సుమారుగా 30వేల నుంచి 35వేల సీట్లు ఆయా కళాశాలలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరట సింగిల్, డబుల్ మేజర్ విధానంలో మార్పులు తెచ్చేందుకు మూడు నెలల క్రితం దానికి సంబంధించి షెడ్యూల్ ఇచ్చి కళాశాలల ద్వారా దరఖాస్తులు తీసుకుంది. అయితే ప్రక్రియ అంతా ముగిసిన వెంటనే మళ్లీ పాత విధానం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మళ్లీ కళాశాలల యాజమాన్యాలను కొత్తగా కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కళాశాలలకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని హడావుడి చేశారు. ఈ ప్రక్రియ కూడా పూర్తయ్యాక గత నెలలో అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు ప్రక్రటించారు. అయితే దానిని వాయిదాలు వేసుకుంటూ వచ్చి ఆగస్టు 20న ఆన్లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. సెప్టెంబర్ మొదటి తేదీన తరగతులు ప్రారంభిస్తామని చెప్పి దానిని వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. ఆందోళనలో 30వేల మంది.. విద్యారంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు గందరగోళంగా ఉన్నాయి. డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను అస్తవ్యస్తంగా మార్చేశారు. సెప్టెంబర్ గడచిపోతున్నా ఇప్పటి వరకూ సీట్లు కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయలేదు. ముఖ్యంగా ఇంటర్ ఫలితాలు వచ్చి ఐదు మాసాలు దాటినా ఇప్పటి వరకూ డిగ్రీ అడ్మిషన్లు పూర్తికాకపోవటం వల్ల అందరిలోనూ గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఈ విధంగా డిగ్రీ విద్యార్థులతో ఆటలాడుకోవడం సరికాదు. ఇంకా ఆలస్యం చేస్తే భవిష్యత్‌లో విద్యార్థుల ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతుంది. – సీహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ -
ఆటో కార్మికులతో చెలగాటం
ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ఆటో కార్మికుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా అన్నారు. విజయ వాడ అజిత్‌సింగ్‌నగర్ లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్‌కు చెందిన ఆటో కార్మి కులు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్సీ రుహుల్లాను కలిశారు. తమకు ఆటో స్టాండ్ ఏర్పాటు చేయించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ అన్ని వర్గాల కార్మికులకు సంక్షేమాన్ని అందించినది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే అన్నారు. ప్రస్తుతం చేతకాని ప్రభుత్వం అధికారంలో ఉందని, కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తోందని విమర్శించారు. ఆటో కార్మికుల సమస్యలపై త్వరలో జరగనున్న శాసనమండలి సమావేశాలలో ప్రస్తావిస్తామన్నారు. పలువురు ఆటో కార్మికుల మాట్లాడుతూ తమకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం లోనే సంతోషంగా ఉందని, ఈ ప్రభుత్వంలో సరైన ఉపాధి లేకుండా పోయిందని వాపోయారు. ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి నాల్గో విడత అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టామని విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకరావు ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతితో పాటుగా 8వ తరగతి ఉత్తీర్ణులైన వారికి కూడా ఐటీఐలో ప్రవేశానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 27వ తేదీలోగా ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకో వాలని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో చేరాలనుకునే వారికి ఈ నెల 29వ తేదీ, ప్రైవేటు ఐటీఐలో జాయిన్ కావాలనుకునే వారికి ఈ నెల 30వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు 0866–2475575, 94906 39639, 77804 29468లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. మరో ముగ్గురికి డయేరియా లక్షణాలు అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): న్యూరాజరాజేశ్వరీపేటలో డయేరియా నిలకడగా ఉంది. మంగళవారం నలభై మంది వరకూ అనారోగ్యాలతో వైద్య పరీక్షలు చేయించుకోగా వారిలో ఇద్దరికి వాంతులు, మరో ముగ్గురికి విరేచనాలతో బాధపడుతుండగా.. ముగ్గురికి మాత్రమే డయేరియా లక్షణాలు కనిపించాయి. ఆరోగ్య శాఖ అధికారులు బాధితులకు వైద్య పరీక్షలు అందిస్తున్నారు. ఇంకా తెలియని కారణం.. న్యూఆర్‌ఆర్‌పేటలో ‘డయేరియా’కు గత కారణాలు ఇంకా తెలియకపోవడంతో అధికారులు సింగ్‌నగర్, న్యూఆర్‌ఆర్‌పేటలోని మాంసం దుకాణాలు, బిర్యానీ హోటళ్లు, టీ సెంటర్లు, బేకరీలు, తినుబండరాల వ్యాపారాలతో పాటు బార్లు, వైన్ షాపులను మూసి వేయించారు. -
సమాజాభివృద్ధికి దోహదపడే రచనలు చేశా
భవానీపురం(విజయవాడపశ్చిమ): తెలుగు భాష, సాహిత్యంపై ఉన్న మక్కువతో వైద్య రంగాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ తాను మాత్రం సాహిత్యం వైపే అడుగేసి సమాజానికి దోహపడే అనేక నవలలు, కథలు, నాటకాలు రచించానని తెలుగు, సంస్కృత భాషల అకాడమీ చైర్మన్ ఆర్డీ విల్సన్ (శరత్చంద్ర) పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం సంపాదకులు, రచయితలు, భాషాభిమానులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగు భాష సౌందర్యం మాట్లాడటంలో, సాహిత్యం చదవడంలో ఇమిడి ఉందన్నారు. కులానికి, మతానికి భాషను ఆపాదించవద్దని కోరారు. తెలుగు, సంస్కృత అకాడమీలో పనిచేసే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం శరత్‌చంద్రను ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఏపీ లైబ్రరీ అసోసియేషన్ చైర్మన్ కోటేశ్వరరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పే జానపద గేయాలు, తెలుగు సాహిత్య పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు, సంస్కృత భాషల అకాడమీ చైర్మన్ ఆర్డీ విల్సన్ -
సంస్కరణల పేరుతో విద్యారంగం నిర్వీర్యం
గన్నవరం: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆర్థిక, విద్యారంగ సమస్యలపై మంగళవారం యూటీఎఫ్ చేపట్టిన రణభేరి జిల్లా బైక్ ర్యాలీని గన్నవరంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నప్పటికీ ఉపాధ్యాయులకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. విద్యారంగంలో సమస్యలను పరిష్కరించకపోగా ఉపాధ్యాయులను సమాజంలో దోషులుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందన్నారు. విద్యాహక్కు చట్టం, ప్రపంచ బ్యాంక్ సాల్ట్ పథకం అమలు వల్ల మూడో వంతు పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్స్‌గా మారా యని చెప్పారు. ఉపాధ్యాయులను చదువులకు కాకుండా బోధనేతర పనులకు ఉపయోగించడం వల్ల విద్యా రంగం కుంటుపడుతుందన్నారు. కనీసం ఉపాధ్యాయ, ఉద్యోగ నేతలతో మాట్లాడే తీరిక కూడా సీఎం చంద్రబాబుకు లేకపోవడం శోచనీయమన్నారు. విద్యారంగ సంస్కరణల వల్ల విద్యార్థులకు జరిగిన మేలు ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 25న బహిరంగ సభ.. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసి పదిహేను నెలలు గడిచినప్పటికీ కొత్త కమిషనర్‌ను ప్రభుత్వం నియమించలేదన్నారు. కనీసం ఒక డీఏ కూడా ఇవ్వలేదని, పెండింగ్ బకాయిలు చెల్లించడం లేదన్నారు. ప్రభు త్వం తాడోపేడో తేల్చుకునేందుకు ఈ నెల 25న వేలాది మంది ఉపాధ్యాయులతో బహిరంగ సభ జరుగుతుందన్నారు. సంస్కరణలపేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారని మరో ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ధ్వజ మెత్తారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సౌకత్ హుస్సేన్, కార్యదర్శి బి. కనకరావు, కోశాధికారి మరీదు వరప్రసాద్, గౌరవాధ్యక్షుడు లెనిన్‌బాబు, నాయకులు పాల్గొన్నారు. సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉద్యమించాల్సిందే యూటీఎఫ్ రణభేరిలో వక్తలు -
కృష్ణా వర్సిటీలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం
కోనేరుసెంటర్: ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు కృష్ణా విశ్వవిద్యాలయంలో మంగళవారం విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. విశ్వవిద్యాలయ పరిధిలో ఎన్సీసీ కేడెట్లు జాగృతి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో క్యాడెట్లు ఓజోన్ పరిరక్షణ, వాయు కాలుష్యం నివారణ, ప్రకృతి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు బోర్డింగ్ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ డి.రామశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మన వాతావరణాన్ని కాపాడేది ఓజోన్ పొర, దానిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కాలుష్య నియంత్రణ, జీవనశైలి మార్పులు, ప్రకృతి వనరుల సంరక్షణ ద్వారానే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన భూగోళాన్ని అందించగలమని ఆయన చెప్పారు. ఎన్సీసీ యూనిట్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని, పర్యావరణ పరిరక్షణకు తాము కట్టుబడినట్లు ప్రతిజ్ఞ చేశారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
కోడూరు: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడి గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు. ఎస్ఐ చాణిక్య కథనం ప్రకారం.. మండలంలోని లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన కంతేటి నాగవెంకట శ్రీనివాసరావు(28) ఈ నెల 14న ఉల్లిపాలెం వారధి సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ నదిలో పడి గల్లంతయ్యాడు. శ్రీనివాసరావు తండ్రి నాగబసవయ్య ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి, శ్రీనివాసరావు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్, స్థానిక మత్స్యకారుల సహకారంతో రెండు రోజుల పాటు నదిలో ప్రత్యేక బోట్లపై గాలింపు చేపట్టగా, మంగళవారం ఉదయం శ్రీనివాసరావు మృతదేహాన్ని గుర్తించారు. హంసలదీవి–ఉల్లిపాలెం గ్రామాల సమీపంలో మడ అడవుల్లో చిక్కుకొని శ్రీనివాసరావు మృతదేహం ఉన్నట్లు ఎస్ఐ చెప్పారు. శవపంచనామా అనంతరం ఘటనాస్థలంలోనే పోస్టుమార్టం జరిపి మృతదేహాన్ని బంధువులకు అప్పగించామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి నందివాడ: విద్యుత్ షాక్‌తో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి గాయాల పాలైన ఘటన నందివాడ మండలం లక్ష్మీనరసింహపురంలో మంగళవారం చోటుచేసుకుంది. పెదవేగి మండలం గార్లమడుగు గ్రామనికి చెందిన 10మంది వ్యక్తులు దేవీశరన్నవరాత్రులు సందర్భంగా ఇనుప పందిరి వేస్తుండగా అందులో పోతురాజు పవన్ కుమార్(25), అర్జున్(22) పందిరి పైన ఉండి పైపులు తగిలిస్తున్నారు. ఈ క్రమంలో పైన ఉన్న కరెంట్ వైర్లు ప్రమాదవశాత్తూ పవన్ చేతికి తగలటం వల్ల షాక్ తగిలి కిందకి పడిపోయాడు. తలకి గాయం కాగా హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అదే పైపు పట్టుకొని అర్జున్‌కి కూడా కరెంట్ షాక్ తగలడంతో తను కూడా కిందపడిపోయాడు. దీంతో చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అతడిని గుడివాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుని బాబాయి అయిన పోతురాజు వెంకటేశ్వరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె. శ్రీనివాస్ తెలిపారు. 18న జిల్లా స్థాయి పోటీలు గూడూరు: ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18న అండర్ 14, 17 బాలురు, బాలికల విభాగాలలో జిల్లా స్థాయి షూటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీలు మత్తి అరుణ, గంపా రాంబాబు ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలను విజయవాడ భవానీపురంలోని గ్లోరియస్ షూటింగ్ అకాడమీలో ఏర్పాటు చేశామన్నారు. ● అండర్–17 బాలురు, బాలికల విభాగం వెయిట్ లిఫ్టింగ్ జిల్లా స్థాయి ఎంపికలు చిల్లకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోను, అండర్–14, 17 బాలురు, బాలికల విభాగం స్విమ్మింగ్ పోటీలను ఈడుపుగల్లులోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ నందు జరుగుతాయని వెల్లడించారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులు స్టడీ సర్టిఫికెట్స్, వయస్సు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు. -
పునరావాసం పొందిన వారితో సహనంగా ఉండాలి
నున్న(విజయవాడరూరల్): మాదకద్రవ్యాలు, మద్యపాన వ్యసనాలను మానుకునేందుకు చికిత్స అనంతరం, పునరావాసం పొందిన వ్యక్తుల పట్ల కుటుంబ సభ్యులు కరుణ, సహనంతో వ్యహరించాలని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి సూచించారు. వారు పిల్లల మాదిరిగానే ఉంటారని, సమాజంలో సజావుగా తిరిగి కలిసిపోవడానికి వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలోని ఇండ్లాస్ శాంతివన్ ఏర్పాటు చేసి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శాంతివన్‌ను త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మంగళవారం సందర్శించారు. తొలిసారిగా నున్న గ్రామం విచ్చేసిన ఆయనకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, డైరెక్టర్లు డాక్టర్ ఇండ్ల రామ సుబ్బారెడ్డి, డాక్టర్ విశాల్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. మానసిక ఆరోగ్యం, వ్యసనంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ మానసికంగా బాధపడుతున్న, వ్యసనానికి గురైన రోగులకు పునరావాసం కల్పించడంలో డాక్టర్ విశాల్ రెడ్డి చేస్తున్న సేవలను ప్రశంసించారు. మచిలీపట్నంఅర్బన్: మహిళల ఆరోగ్య పరిరక్షణకు జిల్లా వ్యాప్తంగా స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభిస్తున్నట్లు కృష్ణా జిల్లా ఇన్చార్జి వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ. వెంకట్రావు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు రెండు వారాలపాటు జిల్లాలోని 357 ఎంఎల్హెచ్పీసీ కేంద్రా లు, 49 పీహెచ్‌సీలు, 14 యూపీహెచ్‌సీలు, 7 సీహెచ్‌సీలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 54 వైద్య శిబిరాల్లో వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులపై నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పరీక్షలు, రక్తహీనత నివారణ చర్యలు, మానసిక ఆరోగ్య సమస్యల గుర్తింపునకు ప్రత్యేక కౌన్సెలింగ్ కూడా చేపడుతున్నట్లు తెలిపారు. తొలుత ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారని, ఆయన ప్రసంగాన్ని వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డాక్టర్ వెంకట్రావు తెలిపారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి -
మాస్టర్ ట్రైనర్లు, సచివాలయ సిబ్బందికి శిక్షణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్థానిక ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధ్యక్షతన మంగళవారం జీరో పావర్టీ 94 పాలసీపై శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని అన్ని మండలాలు, మునిసిపాలిటీల నుంచి మొత్తం 315 మంది మాస్టర్ ట్రైనర్లు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అర్థగణాంక శాఖ డెప్యూటీ డైరెక్టర్ కె.సౌజన్య, ప్లానింగ్ విభాగం పీఎం యూనిట్ నుంచి హారిక పాల్గొని శిక్షణ ఇచ్చారు. జీరో పావర్టీ, పీ4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాల దత్తత అనంతర చర్యల కోసం ప్రామాణిక విధానాన్ని రూపొందించారని సౌజన్య, హారిక తెలిపారు. పీ–4కు దాతలు అందించే విరాళాలకు ప్రస్తుత చట్టాల ప్రకారం పన్ను మినహాయింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. కొత్త కుటుంబాల చేర్పు, డూప్లికేట్, తప్పుల తొలగింపు, సవరణలు, మార్పులు సీఈఓ అండ్ ఎస్ఏపీఎప్ ఆమోదంతోనే అమలవుతాయని వివరించారు. మార్గదర్శుల ప్రామాణీకరణ కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించారని తెలిపారు. నిజమైన దాతలు, మెంటార్లు మాత్రమే బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి అనుమతి లభిస్తుందన్నారు. శిక్షణ కార్యక్రమానికి సీపీఓ వై.శ్రీలత, ఎస్ఓడీ వి.ఎస్.ఆర్.ప్రసాద్, డెప్యూటీ కలెక్టర్లు ఎ.రవీంద్ర, కె.పోసిబాబు, జిల్లాలోని డీవైఎస్ఓ, ఏఎస్ఓలు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ జిల్లాలో 32 మలేరియా కేసులు
పెనుగంచిప్రోలు: ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 32 మలేరియా కేసులు ఉన్నాయని జిల్లా మలేరియా అధికారి మోతీలాల్ తెలిపారు. పెనుగంచిప్రోలు గ్రామంలోని తుఫాన్ కాలనీలో ఆయన మంగళవారం పర్యటించారు. డెంగీ లక్షణాలతో ఆదివారం మృతి చెందిన యువతి పెద్ది రూప కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇచ్చిన రిపోర్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం మలేరియా కేసులు 32, డెంగీ కేసులు ఏడు ఉన్నాయని తెలిపారు. టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువగా ఉన్నా యని పేర్కొన్నారు. విజయవాడ జక్కంపూడి కాలనీలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. పెద్ది రూప మెడికల్ రిపోర్టుల్లో టైఫాయిడ్‌తో పాటు కిడ్నీ సమస్యలతో మృతి చెందినట్లు ఉందన్నారు. తుఫాన్ కాలనీతో పాటు మోడల్ కాలనీలో ఐదు వైద్య బృందాలు ఇంటింటి సర్వేతో పాటు రక్త నమూనాలు సేకరిస్తున్నాయని తెలిపారు. గ్రామ పంచాయతీ సహకారంతో దోమ లార్వా నాశనం చేసేందుకు అబేట్తో పాటు ఫాగింగ్ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, వైద్యాధికారి నాగలక్ష్మి, జగ్గయ్యపేట డివిజన్ సబ్యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సీహెచ్ఓ వెరోనిక, పంచాయతీ కార్యదర్శి శ్యామ్ పాల్గొన్నారు. -
దసరా ఉత్సవాలకు దుర్గగుడి ముస్తాబు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయం ముస్తాబవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై అమ్మవారి, అయ్య వార్ల ఆలయాలను ఇప్పటికే రంగులతో అందంగా అలంకరించారు. దుర్గగుడి ప్రాంగణంలోని ఉపాలయాలు, ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న కారిడార్‌ను ముస్తాబు చేస్తున్నారు. గత ఏడాది దసరా ఉత్సవాలకు ఆలయానికి రంగులు వేయకపోవడంతో భక్తుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది అమ్మవారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను రంగులు వేస్తున్నారు. ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఉత్సవ ఏర్పాట్లను ఈఓ శీనానాయక్ మంగళవారం పరిశీలించారు. తొలుత ఉత్సవాలకు విచ్చేసే ఇతర ఆలయాల సిబ్బందికి కేటాయించే వసతి గృహాలను తనిఖీచేశారు. సీతానగరంలోని దత్తత ఆలయంలో సిబ్బంది గదులు, భోజన వసతిపై ఆరా తీశారు. అనంతరం ఆలయానికి చేరుకుని లక్ష్మీగణపతి విగ్రహం వద్ద వివిధ ప్రభుత్వ శాఖలకు కేటా యించే పోడియాలు, టికెట్ స్కానింగ్ పాయింట్లు, మీడియా పాయింట్లు, చెప్పుల స్టాండ్, ఓం టర్నింగ్ నుంచి క్యూలైన్లను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. వృద్ధుల కోసం బ్యాటరీ వాహనాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈఈ కోటేశ్వరరావు, రాంబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
లీజు మంత్రం.. దోపిడీ తంత్రం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గొల్లపూడిలోని మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూమిలో విజయవాడ ఉత్సవ్ మాటున ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తోలి చదును చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘సాక్షి’ లో వరుస కథనాలు రావడంతో ఉత్సవాల వెనుక ఉన్న టీడీపీ నాయకులు, అధికారులు తడబడ్డారు. సీఎం కార్యాలయం సైతం జిల్లా యంత్రాంగంతో ఆరా తీసి, పనులు నిలిపివేయాలని ఆదేశించింది.దీంతో ఈ ఉత్సవాల మాటున దేవుని మాన్యంకు ఎసరు పెట్టి, భారీ ప్రణాళిక రచించిన పార్లమెంట్ ముఖ్యనేతతో కూడిన ఐదుగురి బృందంకు ఎటూ పాలు పోలేదు. ఈ ఉత్సవాలు జరపకపోతే తమ పరువు పోతుందని, తాత్కాలికంగా లీజుకు ఇప్పించాలని ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న యువనేత వద్ద గోడు వెళ్లబోసుకున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దేవుని మాన్యం భూమిలో ఉత్సవాలు జరిపేందుకు నిబంధనలు ఒప్పుకోవని, ఇప్పటికే లీజు ఉండటంతో, ఆ లీజు రద్దు చేస్తే తప్ప వీలు కాదని తేల్చారు. దీంతో రంగంలోకి దిగిన పార్లమెంటు ముఖ్యనేత, నియోజక వర్గ నేత లీజుదారులను ఎలాగోలా ఒప్పించారు. ఆలయ కమిటీ సభ్యులనుంచి నిరసన రాకుండా ఆగమేఘాల మీద టీడీపీ పెద్దలంతా మచిలీపట్నం వెళ్లి రూ.45 లక్షల చెక్కును అందజేయటం వెనుక భారీ కుట్ర దాగి ఉందని టీడీపీ వర్గాలే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.ఈ ప్రశ్నలకు బదులేది?● రూ.400 కోట్ల విలువైన 39.99 ఎకరాల భూమిలో వరల్డ్ క్లాస్ గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పేరుతో 5 ఎకరాలు, ఏటా విజయవాడ ఉత్సవాల పేరుతో ట్రేడ్ ఎక్స్పో, సాంస్కృతిక కార్య క్రమాలు, ఎస్‌హెచ్‌జీ మేళా, అగ్రిటెక్ షోకేసు, టూరిజం ప్రమోషన్ ఈవెంట్లతో ఎగ్జిబిషన్ నియమించేందుకు శాశ్వత వేదిక నిర్మించడం పేరుతో మరో 34.99 ఎకరాల భూమి లీజు కోసం ప్రతిపాదనలు జిల్లా యంత్రాంగం నుంచి దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్లాయి. ఆ ప్రతిపాదనల వెనుక మర్మం ఏంటని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు.● ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉండగానే ఈనెల మొదటి వారంలోనే దేవుని మాన్యం భూమిలో దేవదాయ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా, పంటలు పండే పొలంలో 4 నుంచి 6 అడుగుల మేర మట్టి తోలి చదును ఎలా చేశారని ప్రశ్నిస్తున్నారు. మట్టి ఎక్కడ నుంచి తెచ్చారు. దానికి మైనింగ్ శాఖ నుంచి అనుమతులు ఉన్నాయా, దేవస్థానం భూమిలో అక్రమంగా మట్టి తోలుతుంటే స్థానిక రెవెన్యూ అధికారులు ఏం చేశారనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.● ఇదిలా ఉంటే సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ పేరుతో 30 ఎకరాలకు రూ.45 లక్షల లీజు మొత్తం తీసుకుని దేవదాయశాఖ లీజు ఇస్తూ ఈ నెల 13న మెమో ఇవ్వడం గమనార్హం. ఈ భూములను శాశ్వతంగా కొట్టేసేందుకు భారీ వ్యూహం రచించినట్లు టీడీపీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది.● 56 రోజుల తరువాత ఆ మట్టి ఎవరు తొలగిస్తారని, దానిని మళ్లీ పంట పొలంగా మార్చాలంటే ఎంత కష్టమని భక్తులు అంటున్నారు. మళ్లీ ఆ భూమి వ్యవసాయానికి పనికి వస్తుందా అనే చర్చ సాగుతోంది. ఆలయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు ఓ ప్రైవేటు సంస్థ ఈ స్థలాన్ని తీసుకోవడం, అందునా టీడీపీ నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా విజయవాడ నగరంలో ఎన్నో స్థలాలు ఉన్నా లక్షలాది రూపాయలను ఖర్చు చేసి ఆలయ భూముల్ని తీసుకోవడంలోని ఆంతర్యం ఏమిటని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం 56 రోజుల ఉత్సవాల కోసం పంటలు పండే వ్యవసాయ భూమిని చెర పట్టి, కోట్ల విలువైన మట్టిని 4 నుంచి 6 అడుగుల మేర తోలి చదును చేయడం ఏంటని భక్తులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రజల సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జేసీ ఎస్.ఇలక్కియ అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో అర్జీ ఇస్తే తప్పనిసరిగా తమ సమస్యకు ఓ పరిష్కారం లభిస్తుందనే ఆశతో ప్రజలు వస్తారని, అధికారులు నిబద్ధతతో అర్జీలపై దృష్టి పెట్టి పారదర్శకంగా సమస్యలు పరిష్కరించాలన్నారు. నిర్దేశ గడువులోగా అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కేఆర్‌సీసీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె.పోసిబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్కు 168 అర్జీలు జిల్లా స్థాయిలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో 168 అర్జీలు వచ్చాయన్నారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 44, పోలీస్ 26, డీఆర్డీఏకు 17, ఎంఏయూడీ 16, విద్య 9, పంచాయతీరాజ్ శాఖకు 8 అర్జీలు వచ్చాయి. ఆరోగ్యం, గృహ నిర్మాణం, విభిన్న ప్రతిభావంతుల శాఖకు సంబంధించి నాలుగు చొప్పున, ఇరిగేషన్, కాలేజీ విద్య, పౌర సరఫరాలు, వ్యవసాయం, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌కు సంబంధించి మూడు చొప్పున, సర్వే, సహకారం, సాంఘిక సంక్షేమం, కాలుష్య నియంత్రణ, విద్యుత్, ఎండోమెంట్స్ శాఖలకు సంబంధించి రెండు చొప్పున అర్జీలు వచ్చాయి. మైన్స్, నైపుణ్యాభివద్ధి, బీసీ సంక్షేమం, ఉపాధి కల్పన, పర్యాటకం, గ్రామీణ నీటి సరఫరా, బ్యాంకు సేవలు, సాంకేతిక విద్య, గ్రామ–వార్డు సచివాలయాల శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ వచ్చాయి. మొత్తం 168 అర్జీలు రాగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. -
పోలీస్ గ్రీవెన్స్‌లో 86 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 86 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగుల వద్దకే వెళ్లి ఆమె ఫిర్యాదులు తీసుకున్నారు. అనంతరం వాటిని సంబంధిత ఎస్హెచ్ఓలకు పంపి పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 86 అర్జీలు అందగా వాటిలో భూ వివాదాలకు, ఆస్తి వివాదాలకు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 40, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 5, కొట్లాటకు సంబంధించినవి 2, వివిధ మోసాలకు సంబంధించినవి 5, మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి 9, దొంగతనాలకు సంబంధించి 5, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, సంఘటనలకు సంబంధించినవి 20 ఫిర్యాదులు అందాయి. -
అప్పుల బాధతో బలవన్మరణం
తాడేపల్లిరూరల్: పొట్టకూటి కోసం వలస వచ్చిన ఓ పండ్ల వ్యాపారి మద్యానికి బానిసై అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తాడేపల్లి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ సతీష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళానికి చెందిన వెంకన్న (45) జీవనోపాధి కోసం విజయవాడ వచ్చి సాంబమూర్తిరోడ్లోని బావాజీపేట 1వ లైన్లో నివసిస్తున్నాడు. అతను పండ్ల వ్యాపారి. వెంకన్న మద్యానికి బానిసై అందినచోటల్లా అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో అప్పులు తీర్చలేక తాడేపల్లి రూర ల్ కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై పోలీసుల సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన షెడ్డులో తాడుతో ఉరి వేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
కృష్ణానదిలో యువకుడు గల్లంతు
గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కోడూరు: బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడి గల్లంతైన ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ చాణిక్య సోమవారం తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన కంతేటి నాగవెంకట శ్రీనివాసరావు (28) ఆదివారం సాయంత్రం తన భార్యను కోడూరులోని ఓ ప్రైవేట ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఆ సమయంలో శ్రీనివాసరావు ఉల్లిపాలెం సమీపంలోని కృష్ణా నది వద్దకు వెళ్తున్నట్లు తన తండ్రి నాగబసవయ్యకు చెప్పి వెళ్లాడు. అయితే రెండు గంటలు దాటినా కూడా శ్రీనివాసరావు రాకపోవడంతో తండ్రి నాగబసవయ్య బంధువులతో కలిసి ఉల్లిపాలెం వారధి వద్దకు వెళ్లాడు. శ్రీనివాసరావు బైక్, చెప్పులు ఉల్లిపాలెం వారధిపై ఉండడాన్ని గమనించారు. కిందకి చూడగా.. నదిలో పడి కొట్టుకుపోతున్నట్లు గమనించి, కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు.. ఉల్లిపాలెం వద్ద కృష్ణానదిలో గల్లంతైన శ్రీనివాసరావు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. స్థానిక మత్స్యకారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో నదిలో బోట్లపై గాలింపు జరిపారు. నాలుగు బృందాలుగా విడిపోయి ఉల్లిపాలెం నుంచి హంసలదీవి వరకు నదిని జల్లెడ పట్టారు. సముద్ర పోటుతో పాటు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో శ్రీనివాసరావు ఆచూకీ సోమవారం సాయంత్రం వరకు కూడా దొరకలేదని ఎస్ఐ చెప్పారు. మంగళవారం గాలింపు చర్యలు కొనసాగుతాయన్నారు. -
ఆటో కార్మికులను ఆదుకోండి
రవాణా శాఖ మంత్రి ఇంటి వద్ద నిరసన లబ్బీపేట(విజయవాడతూర్పు): సీ్త్ర శక్తి పథకం వల్ల నష్టపోతున్న తమను ఆదుకోవాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బృందావన కాలనీ నందమూరి రోడ్డులోని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నివాసం వద్ద సోమవారం ఉదయం ఏఐటీయూసీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తొలుత పలువురు ఆటో కార్మికులు మంత్రి రాంప్రసాద్‌రెడ్డిని కలిసి సీ్త్ర శక్తి పథకం అమలు చేసిన తర్వాత తమ పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. అనంతరం ఇంటి ముందు బ్యానర్‌తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ.. డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేక వేలాది మంది ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారన్నారు. సజావుగా సాగుతున్న వారి జీవితాలు, ప్రస్తుతం అగమ్యగోచరంగా మారాయన్నారు. ప్రతి కార్మికునికి నెలకు రూ.5వేల పింఛన్ ఇవ్వాలని, ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, జీఓ 21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రభుత్వం ప్రమాద బీమా అమలు చేయాలని కోరారు. -
మహిళ మృతదేహంతో ధర్నా
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళ మృతదేహంతో భారీ సంఖ్యలో దళితులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటలకు కూడా ఆ నిరసన కొనసాగుతూనే ఉంది. మహిళ మృతికి కారణమైన వారిని ఇక్కడికి తీసుకురావాలని, వారితో క్షమాపణలు చెప్పించడంతో పాటు వారిని నగర బహిష్కరణ చేయాలనే డిమాండ్‌తో నిరసన కొనసాగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి నచ్చజెప్పినా ఆందోళన కారులు పట్టు వీడటం లేదు. అసలేం జరిగిందంటే.. గిరిపురానికి చెందిన గోపీచంద్, మంజుల కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వారిద్దరూ ఒకచోట మాట్లాడుకుంటుండగా, అమ్మాయికి సమీప బంధువు అయిన దానియేలు(హిజ్రా) వారిని చూశాడు. అనంతరం యువకుడు గోపిని పిలిచి దానియేలు మందలించే ప్రయత్నం చేయగా, అతడు తిరగబడి కొట్టాడు. దానిని మనస్సులో పెట్టుకున్న దానియేలు ఈ నెల 11న మరో నలుగురు హిజ్రాలను తీసుకుని గోపిచంద్ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గోపిచంద్‌తో పాటు, తండ్రి కుమార్‌బాబు, తల్లి కుమారి రోడ్డు మీదకు వచ్చారు. ఆ సమయంలో మరింత మంది హిజ్రాలు అక్కడకు చేరుకుని తల్లి కుమారి బట్టలు చించేసి దాడి చేశారు. మనస్తాపంతో ఆత్మహత్య.. హిజ్రాలు తన బట్టలు చించేసి రోడ్డుపై కొట్టడంతో కుమారి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 13న మృతి చెందింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్షమాపణలు చెప్పాలని ఆందోళన.. మహిళపై దాడి చేసి, మృతికి కారణమైన హిజ్రాలను తీసుకొచ్చి, ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరాలని డిమాండ్ చేస్తూ గిరిపురానికి చెందిన దాదాపు వెయ్యి మంది రోడ్డుపై బైఠాయించారు. డీసీపీ కె.జి.వి.సరిత, ఏసీపీ దామోదర్‌తో పాటు, సీపీ ప్రకాష్ వారి వద్దకు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. హిజ్రాలు స్టేషన్లో ఉన్నారని, అక్కడకు రావాలని చెప్పినా వినడం లేదు. అంతేకాకుండా వారిని నగర బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా మహిళ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న వారి వద్దకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవ్గ ఇన్చార్జి మల్లాది విష్ణు, స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత వచ్చి సమస్య తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. -
కృష్ణా జేసీ గీతాంజలిశర్మ బదిలీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గీతాంజలిశర్మను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను ఏపీ ఫైబర్ నెట్ డిజిటల్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది. ఆమె స్థానంలో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. గీతాంజలిశర్మ సోమవారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు ముంబై ఐఐటీలో డేటా ఎనలటిక్స్పై శిక్షణ కార్యక్రమానికి వెళ్లారు. ప్రస్తుతం ఇన్చార్జ్ బాధ్యతలను డీఆర్వో చంద్రశేఖరరావు నిర్వర్తిస్తున్నారు. జాయింట్ కలెక్టర్‌గా గీతాంజలిశర్మ 2024 జనవరి 5వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. 20 నెలల పాటు జిల్లాలో పనిచేశారు. ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాల్లో ఆమె తనదైన ముద్ర వేసుకున్నారు. -
ఏటిపాయకు మళ్లీ వరద
కంకిపాడు: ఏటిపాయకు మళ్లీ వరద వచ్చి చేరింది. వరదనీటితో ఏటిపాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. పరవళ్లు తొక్కుతూ వరదనీరు సముద్రం వైపు పరుగులు పెడుతోంది. ఏటిపాయ రహదారి మార్గం మరలా ముంపునకు గురికావటంతో రైతులు, కూలీలు పడవలను ఆశ్రయించి లంక పొలాల్లో పనులకు వెళ్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీ నుంచి అధికారులు నీటిని విడుదల చేయటంతో ఏటిపాయ మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తుంది. మండలంలోని మద్దూరు, కాసరనేనివారిపాలెం పరిధి గుండా ప్రవహించే కృష్ణానది ఏటిపాయ రెండు రోజులుగా నీటితో నిండుకుండలా మారింది. ప్రస్తుతం ఏటిపాయ అంచులు తాకుతూ నీరు దిగువకు ప్రవహిస్తోంది. మద్దూరు వద్ద ఏటిపాయ గుండా లంక పొలాల్లోకి వెళ్లేందుకు రహదారి మార్గం ఉంది. మొన్నటి వరకూ ఏటిపాయలో నీటి ఉధృతి సాధారణ స్థితికి చేరింది. రాకపోకలు సాధారణ స్థితికి చేరుతాయని భావించారు. అయితే మరలా వరద వచ్చి చేరటంతో లంకపొలాల్లోకి వెళ్లేందుకు రాకపోకలు బంద్ అయ్యాయి. రహదారి ముంపునకు గురికావటంతో రైతులు, కూలీలు పడవల సాయంతో లంక భూముల్లోకి వెళ్లి పొలం పనులు చూసుకుంటున్నారు. కొద్ది రోజులుగా ఏటిపాయలో వరదనీటి చేరికతో రాకపోకలు సాగటం లేదు. దీంతో రైతులు, కూలీలు పడవలను ఆశ్రయిస్తుండటంతో పడవలకు డిమాండ్ పెరిగింది. -
కక్ష సాధింపు మానుకోవాలి
నిజాలను నిర్భయంగా రాసే సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయించడం వంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. పత్రికా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణపై దాడులు చేయడం అమానుషం. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం నిజాలు రాస్తే జీర్ణించుకోలేకపోతోంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై కేసులు పెట్టడం, విచారణ పేరుతో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించడం సరికాదు. ప్రభుత్వ చర్యలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. – దేవినేని అవినాష్, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు -
దసరా ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లను, హోల్డింగ్ ఏరియాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదివా రం పరిశీలించారు. వినాయ టెంపుల్ నుంచి ఏర్పా టు చేసిన క్యూలైన్స్ను స్వయంగా నడుచుకుంటూ పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చారు. అదే విధంగా వాహనాల కోసం ఏర్పాటు చేసే పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్స్ లలో స్వయంగా నడుచుకుంటూ వెళ్లారు. భక్తులు లోనికి వెళ్లడానికి బయటకు రావడానికి ఏర్పాటు చేసిన మార్గాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. అదేవిధంగా వాహనాల పార్కింగ్ కోసం భవానీపురం, పున్నమిఘాట్ మొదలగు ప్రాంతాల్లో అనువైన ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలను అందించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్‌జోన్ డీసీపీ జి. రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సౌత్ ఏసీపీ పవన్‌కుమార్, ట్రాఫీక్ ఏసీపీ జె. రామచంద్రరావు, వన్‌టౌన్ సీపీ గురుప్రకాష్ పాల్గొన్నారు. -
నగరాలు సంఘం ఆధ్వర్యంలో పలువురికి సత్కారం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): శ్రీనగరాలు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పలువురు ప్రముఖులను సత్కరించారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్వీ.రావు ప్రారంభ ఉపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమానికి మాజీ శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు, పోతిన వెంకటమహేష్ విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నగరాలు రాష్ట్రంలోని 15 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించగలరని చెప్పారు. ఉత్తరాంధ్రలోని పదికిపైగా నియోజకవర్గాలు, పిఠాపురం, పాలకొల్లు, గన్నవరం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బలంగా ఉన్నామని పేర్కొన్నారు. సామాజిక నగరాల కార్పొరేషన్ చైర్మన్ మరుపిళ్ళ తిరుమలేశ్వరరావు, డైరెక్టర్లతో పాటు బుద్దా వారి దేవస్థాన కమిటీ చైర్మన్ పిళ్లా సుదర్శనరావు, ఏపీసీఎస్ చైర్మన్ పోతిన ప్రసాద్, గొల్లపూడి మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్ అడ్డూరి లక్ష్మీ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బెవర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛను హరించడమే
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అణిచి వేస్తే తమను ప్రశ్నించేవాళ్లు ఉండరని కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన అలోచన చేస్తుంది. పత్రికలపై, జర్నలిస్టులపై కేసులు బనాయించి కొత్త సంప్రదాయానికి ఈ ప్రభుత్వం తెరలేపింది. ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. పత్రికా స్వేచ్ఛని హరిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం తలెత్తుతుంది. కూటమి ప్రభుత్వం ఇకనైనా తమ తప్పును తెలుసుకొని అక్రమ కేసులపై దృష్టి వీడి, ప్రజా సమస్యలను పరిష్కరించాలి. – నల్లగట్ల స్వామిదాస్, వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జ్