ఐక్యత చాటిన సత్యసాయి రన్‌ రైడ్‌ 5కే ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

ఐక్యత చాటిన సత్యసాయి రన్‌ రైడ్‌ 5కే ర్యాలీ

Feb 9 2026 8:22 AM | Updated on Feb 9 2026 8:22 AM

ఐక్యత

ఐక్యత చాటిన సత్యసాయి రన్‌ రైడ్‌ 5కే ర్యాలీ

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): సేవా భావం, క్రమశిక్షణ శ్రీ సత్యసాయి భక్తుల ప్రత్యేకత అని.. యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ట్రాఫిక్‌ డెప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎస్‌కే షిరీన్‌ బేగం అన్నారు. స్థానిక సత్యనారాయణపురం బీఆర్టీఎస్‌ రోడ్డులో శ్రీసత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యాన సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సత్యసాయి రన్‌.. రైడ్‌.. 2026 5కే ర్యాలీ ఆదివారం జరిగింది. ర్యాలీలో డీసీపీ ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.లక్ష్మణరావుతో కలిసి ర్యాలీని ప్రారంభించారు.

రన్‌ రైడ్‌కు విశేష స్పందన

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం నగరంలో ఐక్యతా సందేశాన్ని చాటుతోందన్నారు. బాబా అందించిన ప్రేమ, కరుణ, సేవా వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఐక్యతా భావం వ్యాప్తి, ఫిట్‌ ఇండియా ఉద్యమానికి మద్దతు లక్ష్యంగా శ్రీ సత్యసాయి రన్‌ – రైడ్‌ – 2026 5కే రన్‌ నిర్వహించామన్నారు. కార్పొరేటర్‌ శర్వాణీ మూర్తి మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. 9 వేల మందికి పైగా 5కే రన్‌ రైడ్‌లో ఉత్సాహంగా పాల్గొని ఐక్యత, సమరసతకు ప్రతీకగా నిలిచారు. శ్రీ సత్యసాయి యూనివర్సల్‌ టార్చ్‌ ఆఫ్‌ పీస్‌ను బీఆర్టీఎస్‌ రోడ్డులో షిరీన్‌ బేగం, లక్ష్మణరావు మోశారు. ప్రపంచ వ్యాప్త్తంగా ఐక్యత, పవిత్రత, దైవత్వం సందేశాన్ని చాటేందుకు రూపొందించిన ఈ టార్చ్‌ను గతేడాది నవంబర్‌ 22న పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. తొలుత సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు, జాతీయ యువ సమన్వయకర్త లక్ష్మీకాంత్‌శర్మ, జిల్లా అధ్యక్షుడు జి.విశ్వనాథం, రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్‌ సురేంద్ర, సేవా సమన్వయకర్త కె.శ్యామ్‌ప్రసాద్‌ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు.

సర్వమత ప్రార్థనలు

శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన గాయకులు సర్వమత ప్రార్థనలు ఆలపించి, విశ్వ శాంతి కోసం ప్రార్థించారు. ప్రముఖ ఫిట్‌నెస్‌ కోచ్‌, జుంబా ఇన్‌స్ట్రక్టర్‌ బోదేష్‌ కుమార్‌ ఉత్సాహభరిత వార్మప్‌ సెషన్‌ నిర్వహించారు. బాలవికాస్‌ విద్యార్థుల సంగీత బృందం ఆకట్టుకునే ప్రదర్శనతో అందరిని మంత్రముగ్ధులను చేసింది. రన్‌లో పాల్గొన్న వారికి ప్రత్యేక టీ షర్టులు, ఫినిషర్‌ మెడల్స్‌ అందజేశారు.

ఐక్యత చాటిన సత్యసాయి రన్‌ రైడ్‌ 5కే ర్యాలీ 1
1/1

ఐక్యత చాటిన సత్యసాయి రన్‌ రైడ్‌ 5కే ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement