ముగిసిన నవదిన ప్రార్థనలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన నవదిన ప్రార్థనలు

Feb 9 2026 8:22 AM | Updated on Feb 9 2026 8:22 AM

ముగిస

ముగిసిన నవదిన ప్రార్థనలు

ముగిసిన నవదిన ప్రార్థనలు గుణదల(విజయవాడ తూర్పు): గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన నవదిన ప్రార్థనలు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజు ప్రార్థనలకు మోన్సిగ్నోర్‌ ఫాదర్‌ మువ్వల ప్రసాద్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భక్తులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ గుణదల పుణ్యక్షేత్రం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది యాత్రికులు తరలి వస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ మరియతల్లిని దర్శించుకుని ఆమె దీవెనలు పొందుకుని, సంతోషంగా తిరిగి వెళ్లాలని కాంక్షించారు. మరియమాతను ఆశ్రయించిన భక్తులకు సకల ఆశీర్వాదాలు లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం మరియమాత స్వరూపం వద్ద గల ప్రత్యేక వేదిక వద్ద సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. అంతకు ముందు పలు విచారణల నుంచి వచ్చిన భక్తులు దివ్య జపమాల ధ్యానంతో కొండ పైకి చేరుకున్నారు. పుణ్యక్షేత్ర రెక్టర్‌ ఫాదర్‌ యేలేటి విలియం జయరాజు, ఫాదర్‌ సునీల్‌ రాజు, ఫాదర్‌ మరియన్న తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సులను రెగ్యులర్‌ చేయాలి మార్కెట్‌ రేటు ప్రకారమే పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ కంచికచర్ల: అవుటర్‌ రింగ్‌ రోడ్డు కింద భూములు కోల్పోయే వారికి ప్రభుత్వం మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఓఆర్‌ఆర్‌ కింద భూములు కోల్పోతున్న రైతులు ఆదివారం కంచికచర్ల ఓసీ క్లబ్‌ వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతుసంఘ జిల్లా కార్యదర్శి పగడాల వీరాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్‌ మాట్లాడుతూ ఓఆర్‌ఆర్‌ మొదట 140 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదించారని, కాని ప్రస్తుతం గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం 250 మీటర్ల వెడల్పు ఉంటుందని పేర్కొనడం అన్యాయమన్నారు. బఫర్‌ జోన్‌ పరిధిలో 500 మీటర్లు ఉంటుందని ప్రచారంలో ఉందని, దీని ఫలితంగా ప్రైవేటు భూమిలో ఎక్కువ విస్తీర్ణం సేకరిస్తున్నారని ఆరోపించారు. 250 మీటర్ల వెడల్పుతో సేకరణ అనేది మితిమీరిన ఏకపక్ష నిర్ణయమన్నారు. ప్రభుత్వం మొదట చెప్పిన దానికి కన్నా ఎక్కువ భూమిని సేకరించడం తగదన్నారు. ఓఆర్‌ఆర్‌ వెడల్పును 70 మీటర్లకు కుదించాలని, సెక్షన్‌ 26(1) భూ సేకరణ చట్టం ప్రకారం భూమిని కోల్పోయే రైతులకు నాలుగు రెట్లు అధిక ధరను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో రైతు సంఘ నాయకులు గోపీ నాయక్‌, గంగిరెడ్డి రంగారావు, అల్లాడి కోటేశ్వరరావు, నన్నపనేని భాస్కరరావు, మల్లెల సుబ్బారావు, కాపా శ్రీనివాసరావు, సాయిరాం, పూర్ణ, జ్ణానరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరావు తదితరుల పాల్గొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సులను రెగ్యులర్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సెస్‌ స్ట్రగుల్‌ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గవర్నర్‌పేటలోని ఓ హాలులో ఆదివారం కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జి. కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎ. సులోచన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 8వేల మంది కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులు విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. వీరంతా 2016 నుంచి విధుల్లో ఉన్నారని.. పదేళ్లుగా పనిచేస్తున్నా రెగ్యులర్‌ చేయలేదని, వేతనాలు కూడా పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మెడికల్‌ లీవ్‌లు, డీఏలు, హెచ్‌ఆర్‌ఏ, నైట్‌ డ్యూటీ అలవెన్స్‌లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులు పాల్గొన్నారు.

ముగిసిన నవదిన ప్రార్థనలు 1
1/2

ముగిసిన నవదిన ప్రార్థనలు

ముగిసిన నవదిన ప్రార్థనలు 2
2/2

ముగిసిన నవదిన ప్రార్థనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement