నేత్రపర్వం.. ఆంధ్ర నాట్య వైభవం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం.. ఆంధ్ర నాట్య వైభవం

Feb 9 2026 8:22 AM | Updated on Feb 9 2026 8:22 AM

నేత్ర

నేత్రపర్వం.. ఆంధ్ర నాట్య వైభవం

విజయవాడ కల్చరల్‌: స్వరనర్తన సంగీత నృత్య శిక్షణా సంస్థ, బందరురోడ్డులోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఆంధ్రనాట్య పోటీ విజేతలకు బహు మతి ప్రదానం, నాట్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా అవనిగడ్డ శాసన సభ్యుడు మండలి బుద్ధప్రసాద్‌ హాజరవగా.. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి. లక్ష్మీశ, ఏపీ సృజనాత్మక సమితి చైర్‌ పర్సన్‌ పొగడపాటి తేజస్వి, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునిరత్నం నాయుడు, విశ్రాంత హైకోర్ట్‌ న్యాయమూర్తి జస్టిస్‌ శేషసాయి, నాట్యాచార్యుడు కళాకృష్ణ ఆంధ్రనాట్య వైభవం గురించి ప్రసంగించారు. నాట్యాచార్యుల బృంద సభ్యులు ప్రదర్శించిన నృత్యాలు నేత్ర పర్వంగా సాగాయి.

బహుమతి ప్రదానం..

● జూనియర్‌ విభాగంలో శారదా రామకృష్ణ బృందానికి ప్రథమ స్థానం, తమ్మిన జ్యోత్స్న బృందం, పెడమల్లు క్షీరసాగరానికి ద్వితీయం, కె. సాహితీ లక్ష్మి, ఉమామహేశ్వర పాత్రుడికి తృతీయ స్థానం లభించింది.

● సీనియర్స్‌ విభాగంలో శారదా రామకృష్ణకు ప్రథమం, సాయిమాధవికి ద్వితీయం, ఉమామహ్వేర పాత్రుడుకి తృతీయ బహుమతి లభించింది. ఆయా బృందాలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు.

నేత్రపర్వం.. ఆంధ్ర నాట్య వైభవం 1
1/1

నేత్రపర్వం.. ఆంధ్ర నాట్య వైభవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement