breaking news
NTR district News
-
సర్వర్ మొరాయింపు.. సాగని రిజిస్ట్రేషన్లు
కంకిపాడు: సర్వర్ మొరాయింపుతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. స్లాట్ బుకింగ్స్ జరగకపోవటంతో రోజుల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. మూడు రోజులుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నా ప్రభుత్వం, అధికారులు ఏ ఒక్కరూ సమస్యను పట్టించుకోకపోవటంతో రిజిస్ట్రేషన్లకు వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 13 సబ్ రిజిస్ట్రారు కార్యాలయాలు ఉన్నాయి. అవనిగడ్డ, బంటుమిల్లి, చల్లపల్లి, గుడివాడ, కానుమోలు, కౌతవరం, మొవ్వ, పామర్రు, పెడన, మచిలీపట్నం, గన్నవరం, కంకిపాడు, ఉయ్యూరు సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో మూడు రోజులుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటే వరకూ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ తెరుచుకోవటం లేదు. ఈ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేస్తేనే కానీ స్థలాల రిజిస్ట్రేషన్లు, మార్టిగేజ్, ఇతర రిజిస్ట్రేషన్ కార్యాలయ సేవలు అందుబాటులోకి రావు. అయితే సర్వర్ మొరాయిస్తుండటంతో ఆయా సేవలు పొందేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్స్ చేయించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఖాళీగా దర్శనమిస్తున్న కార్యాలయాలు శ్రావణమాసం కావటంతో మంచి రోజులు అని ఎక్కువ మంది ప్రజలు తాము కొనుగోలు చేసిన స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొద్ది రోజులుగా రియల్ వ్యాపారం మందకొడిగా సాగుతోంది. స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరగటం లేదు. అయితే జరిగే అరకొర రిజిస్ట్రేషన్లు సైతం సకాలంలో జరగటం లేదని ప్రజలు వాపోతున్నారు. వెబ్సైట్ మొరాయింపుతో దస్తా వేజులు సిద్ధం చేసుకుని, చలానాలు చెల్లించి స్లాట్బుకింగ్స్ కోసం రోజంతా ఎదురుచూడాల్సి వస్తోందని చెబుతున్నారు. దీంతో మధ్యాహ్నం వరకూ మూడు రోజులుగా కార్యాలయాలు జనం లేక వెల వెల బోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రిజి స్ట్రేషన్ శాఖ వెబ్సైట్ తరచూ మొరాయిస్తుంది. సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో రిజి స్ట్రేషన్ సేవలు సజావుగా అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తరచూ సర్వర్ సమస్యలు నెలకొంటున్నా అటు అధికారులు, ఇటు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటం పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సేవలు మెరుగ్గా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఇంట్లో చెప్పకుండా బందరు బీచ్‌కి వెళ్లిన మైనర్లు
పటమట(విజయవాడతూర్పు): సముద్రంపై మోజుతో ఇంట్లో చెప్పకుండా సైకిళ్లు వేసుకుని బందరుబీచ్కి వెళ్లిన నలుగురు మైనర్ బాలుర ఆచూకీని పటమట పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. పటమటకు చెందిన నలుగురు మైనర్ బాలురు పవన్ కుమార్ (9వ తరగతి), పెద్దపల్లి శశిధర్ (9వ తరగతి), మురపాక కార్తీక్ (8వ తరగతి), తాడేపల్లి నిక్కీ (9వ తరగతి) స్థానికంగా గోవిందరాజులు మున్సిపల్ పాఠశాలలో చదువుతున్నారు. గురువారం సాయంత్రం పాఠశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ కలిసి బందర్ బీచ్‌కి వెళదామని అనుకున్నారు. గురువారం రాత్రి 9 గంటలకు నలుగురు బాలురు వారి వారి ఇళ్లలో నుంచి బయటకు వచ్చి పటమటలోని ఓ పార్క్ లో రాత్రి 11 గంటల వరకు ఉన్నారు. అనంతరం రెండు సైకిళ్లపై నలుగురు కలిసి బందర్ బీచ్‌కి వెళ్లారు. అర్ధరాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో వారి తల్లితండ్రులు ఎంత గాలించినా ఆచూకీ తెలియలేదు. దీంతో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వారు పటమట పోలీసులను ఆశ్రయించారు. సెంట్రల్ ఏసీపీ దామోదర్ సూచనల మేరకు పటమట సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో బాలుర ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా సైకిళ్ల మీద ఆటోనగర్ నుంచి బందరు రోడ్డులోకి వెళ్లినట్టు గుర్తించారు. వరుసగా సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి బందరు వెళ్లినట్టు గుర్తించారు. వెంటనే పటమట పోలీసులు బందరు బీచ్‌కి వెళ్లారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు బాలుర ఆచూకీని కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలురను పటమట స్టేషన్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. గంటల వ్యవధిలో బాలుర ఆచూకీని కనిపెట్టిన సిబ్బందిని సీఐ పవన్ కిషోర్ అభినందించారు. పటమటకు చెందిన నలుగురు బాలుర దుస్సాహసం గంటల వ్యవధిలో ఛేదించిన పటమట పోలీసులు -
ఎవరిదో ఈ పాపం
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): కన్నతల్లి కమ్మని కౌగిలో ఉండాల్సిన ఆ పసికందు... చెత్త చెదారాల నడుమ.. కారు చీకటిలో దోమలు, పురుగుల కాట్లకు గురై గుక్క పట్టి ఏడుస్తోంది. మానవత్వం విలువలు మంట గలిపేలా ఉన్న ఈ ఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నందమూరి నగర్, షణ్ముఖ సాయినగర్ ప్రాంతంలో బుడమేరు వెంబడి ఉన్న గేదెల షెడ్డు పక్కన ఓ పసికందు ఏడుపు వినబడటంతో అక్కడ ఉన్న నాగరాజు అనే పాడి రైతు వెళ్లి చూడగా మూడు నెలల వయసున్న పసికందు చెత్తకుప్పలో ఏడుస్తూ కనిపించింది. అతను ఆ పాపను బయటకు తీసి సింగ్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సింగ్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని పసికందుకు స్థానిక మహిళలతో పాలు పట్టించారు. ఆ చిన్నారి ఒంటిపై దోమల పురుగులు కుట్టిన గాయాలు ఉండటంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పరిశీలించి ఎవరు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారో తెలుసుకుంటామని, అప్పటివరకు చైల్డ్ వెల్ఫేర్ వారికి పాపను అప్పగిస్తామని సీఐ తెలిపారు. -
విద్యుత్ విజిలెన్స్ విస్తృత తనిఖీలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం, ఆపరేషన్ విభాగం, ఎన్టీఆర్ జిల్లా పర్యవేక్షణాధికారి టి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో విజయవాడ టౌన్ డివిజన్ పరిధిలోగల గొల్లపూడి సెక్షన్లో శుక్రవారం విస్తృత తనిఖీలు చేపట్టినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (విజిలెన్స్) పి.విజయకుమారి, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.రవీంద్రబాబు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో 48 మంది అధికారులు, 96 మంది సిబ్బంది 48 బృందాలుగా ఏర్పడి 3,958 సర్వీసులు తనిఖీ చేశారు. అనుమతి ఇచ్చిన లోడ్ కంటే అదనంగా విద్యుత్ వాడుతున్న 98 మందికి రూ.3,46,000 అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు వారి విద్యుత్ మీటర్లకు తప్పనిసరిగా సీలు ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఒక వేళ సీలు లేకపోయినా, తుప్పు పట్టి ఊడిపోయినా వెంటనే సంబంధిత విద్యుత్ సిబ్బందికి రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. విద్యుత్ చౌర్యం సామాజిక నేరం సీలు లేకపోవడం, ఉద్దేశపూర్వకంగా తొలగించడం, గాట్లు పెట్టడం వంటివి విద్యుత్ చౌర్యంగా పరిగణించి కేసులు నమోదు చేస్తారని ఈఈ విజయకుమారి హెచ్చరించారు. భారత విద్యుత్ చట్టం సెక్షన్ 135 ప్రకారం పనిచేయని మీటరు నుంచి విద్యుత్ వాడుకున్నా, ఉండవలసిన మీటర్ బదులుగా వేరే మీటరు పెట్టినా విద్యుత్ చౌర్యం కింద వస్తుందని వివరించారు. మొదటి తప్పిదానికి కాంపౌండింగ్ పద్ధతిలో అపరాధ రుసుము చెల్లిస్తే కేసు నుంచి విడిపిస్తారని, రెండవ సారి కూడా అదే తప్పు చేస్తే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపి కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అపరాధ రుసుము చెల్లించలేని పరిస్థితుల్లో రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా ఆస్తులు జప్తు చేస్తారని అన్నారు. మొదటిసారికి మూడు రెట్లు, రెండవసారికి ఆరు రెట్లు జరిమానా విధించే అవకాశం విద్యుత్ చట్టంలో ఉందని తెలిపారు. విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని, విద్యుత్ చౌర్యంపై ఫిర్యాదుల పూర్తి వివరాలతో 83310 20537, 8331014951 నంబర్లుకు నేరుగా లేదా వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చని అన్నారు. తమకు అందిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో డీఈఈలు ఎంవీవీ రామకృష్ణ, నాగేశ్వరరావు, ఆపరేషన్ డీఈఈ ఓ.బసవరాజు, ఏఈఈ వైవీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
అవగాహనతో దోమల నివారణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): వర్షాకాలంలో నీరు నిల్వ లేకుండా చూడటం ద్వారా దోమలను నివారించవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాచర్ల సుహాసిని అన్నారు. ఆమె శుక్రవారం రామలింగేశ్వర నగర్, కళానగర్ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇంటింటినీ సందర్శించి దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి ప్రజలకు అవగాహన కలిగించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దోమలను నియంత్రించాలంటే నీరు నిల్వ ఉండకుండా పాత టైర్లు, పాత సామాన్లు, తప్పనిసరిగా బోర్లించుకోవాలన్నారు. అక్కడే ఉన్న పాత టైర్లను చూపించి వాటిలో ఉన్న నిల్వ నీటి లోని లార్వాను చూపించి, దోమల అభివృద్ధికి ఇవే ప్రధాన కారణమన్నారు. ఇళ్లలోని రిఫ్రిజిరేటర్లు, పూలకుండీల్లో కూడా నీరు లేకుండా చూడాలన్నారు. మరో వీధిలో ఖాళీ స్థలంలో ఉన్న పెద్ద ట్రాక్టర్ టైరులో ఉన్న నిలువ నీటిలో ఉన్న లార్వాను చూపించి, ఆ టైర్ లో ఉన్న నీటిని పూర్తిగా తొలగించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సందీప్, ఏఎంఓ సూర్య నాయక్, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సూపర్వైజర్ జగదీష్, ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు, పీడీపీ వర్కర్లు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని -
ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మీ వత్రాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో అరుదుగా వచ్చే 5వ శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఐదో శుక్రవారం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు. మహా మండపం ఆరో అంతస్తులో వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాలు జరుపుకొన్నారు. రూ. 1500 టికెటుపై ఆర్జిత సేవగా నిర్వహించిన వరలక్ష్మీ వ్రతంలో 87 మంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం ఉచిత సేవగా నిర్వహించిన వరలక్ష్మీ వ్రతంలో 570కి పైగా మహిళలు అమ్మవారికి పూజలు జరిపించుకున్నారు. వీరిని రూ.100 క్యూలైన్లో అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతించారు. సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్టగా భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శన టికెట్లను రద్దు చేశారు. -
అనేక లోపాలు గుర్తించాం
విజయవాడలో నిర్వహించిన తనిఖీల్లో అనేక లోపాలు గుర్తించాం. హోటళ్లు, రెస్టారెంట్లలో వండిన రైస్, చికెన్, మటన్ వంటి వాటిని సైతం డీప్ ఫ్రిజ్‌లలో పెట్టి, మళ్లీ వాటిని వాడుతున్నారు. మితిమీరిన రసాయనాలు కలిసిన రంగులను ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా కాలపరిమితి ముగిసిన సరుకులను కూడా ఆహారం తయారీకి వాడుతున్నారు. బ్యాకరీ ప్రొడక్ట్స్‌పై సరైన లేబుల్స్ లేని విషయాన్ని తనిఖీల్లో గుర్తించాం. అంతేకాకుండా వంటనూనెనే రీ యూజ్ చేస్తున్నారు. అలా చేస్తే ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. –పూర్ణచంద్రరావు, జాయింట్ ఫుడ్ కంట్రోలర్, ఏపీ -
ఆహారం కల్తీ.. ఆరోగ్యం అంతే
లబ్బీపేట(విజయవాడతూర్పు): కల్తీ ఆహారం... ప్రజలను అనారోగ్యం పాల్జేస్తోంది. నగరంలోని హోటల్స్ నుంచి రెస్టారెంట్ల దాకా, కార్పొరేట్ స్వీట్స్ షాపుల నుంచి రోడ్డు పక్కన అమ్మే పానీ పూరి బళ్ల వరకూ అన్నీ కల్తీ జరుగుతున్నాయి. వాడిన నూనెనే ఐదారుసార్లు వాడటం, రంగు, రుచికోసం రసాయనాల వినియోగం వంటి వాటితో ప్రజలను అనారోగ్యం పాల్జేస్తున్నాయి. సమయపాలన లేని ఆహార అలవాట్లు కొంపముంచుతున్నాయి. అప్రమత్తం కాకుంటే పెనుముప్పే అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టుల్లో బిర్యానీలు లాగించేస్తుండటంతో తొలుత జీర్ణాశయ వ్యాధులు, అనంతరం ప్రాణాపాయ స్థితికి దారితీస్తున్నాయి. ఇటీవల నగరంలో నమోదవుతున్న, లివర్ సిర్రోసిస్, పాంక్రియాటైటీస్, క్యాన్సర్ కేసులు చూస్తుంటే ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగు పదుల వయస్సులోనే జీర్ణాశయ, పెద్దపేగు, లివర్ క్యాన్సర్ సోకుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిల్లో ఈ రకం వ్యాధులే ఎక్కువగా వస్తున్నాయి. అన్నవాహిక క్యాన్సర్లు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటికై నా అప్రమత్తం కాకుంటే రానున్న కాలంలో పెనుముప్పు పొంచి ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. ఇవే నిదర్శనం వీరద్దరే కాదు.. ఇటీవల వైద్యులను సంప్రదిస్తున్న వారిలో పెద్దపేగు, జీర్ణాశయ, లివర్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నట్లు చెపుతున్నారు. అందుకు కల్తీ ఆహారమే కారణంగా పేర్కొంటున్నారు. జీవనశైలి వ్యాధులకు దారి తీస్తున్న వైనం ఆహార నియమాలు పాటించక పోవడంతో ఒబెసిటీకి దారితీసి క్రమేణా జీవనశైలి వ్యాధులకు దారి తీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారిలో మధుమేహం, రక్తపోటుతో పాటు, హైపో థైరాయిడ్ వంటి వ్యాధులు సోకుతున్నట్లు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆహార నియమాలు పాటించడంతో పాటు, రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యమంటున్నారు. ఈ విషయంలో అప్రమత్తం కాకుంటే రానున్న రోజుల్లో వ్యాధుల ముప్పు పొంచి ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. నాన్‌వెజ్ వంటకాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు రసాయనాలు కలిసిన కారంపొడులు ఎక్కువగా వాడుతుంటారు. మృతజంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన కల్తీ నూనెలు వినియోగించి వంటలు చేస్తుండటంతో జీర్ణకోశ వ్యాధులు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అందుకు ఫుడ్ కంట్రోల్ శాఖ వారు నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. మాంసాన్ని నిల్వ ఉంచి వంటలు చేయడం, వాడిన నూనెనే మళ్లీ, మళ్లీ వడపోసి వాడటం వంటివి చేస్తున్నట్లు చెపుతున్నారు. బయట ఆహారం తినడం తగ్గించడం ఎంతో ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. జీర్ణకోశ, పెద్దపేగు, అన్నవాహిక క్యాన్సర్లకు కల్తీ ఆహారమే ప్రధాన కారణం అంటున్నారు. -
చినుకు పడితే నరకమే!
చిన్నపాటి వర్షానికే విజయవాడ వణుకుతోంది. చినుకుపడితే నగరంలో మురుగు కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు నీట మునుగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థ పడుతున్నారు. మురుగునీటి వ్యవస్థ అంతంతమాత్రంగా ఉంటే.. మరోవైపు అసంపూర్తి పనులు మరింత ఇక్కట్లు కలిగిస్తున్నాయి. వాననీరు, మురుగు కలవడంతో రహదారులు నిండిపోతున్నాయి. కొద్ది పాటి వర్షానికే ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఇలా చినుకు పడితే నగర ప్రజలు వణికిపోతున్నారు. వానలు పడినప్పుడు హడావుడి చేసే పాలకులు, అధికార యంత్రాంగం శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేయడం లేదు. బందరు రోడ్డులో నిలిచిన వాన నీరు సాక్షి ప్రతినిధి, విజయవాడ: కొద్దిపాటి వర్షానికే బెజవాడ నీటమునుగుతోంది. భారీ వర్షం వస్తే జనాల కష్టాలు మాటల్లో వర్ణించలేం. ప్రధాన రహదారులన్నీ మోకాలులోతు పైన నీటితో చెరువులను తలపిస్తున్నాయి. వాన ఆగిన తర్వాత నగరవాసులు గమ్యస్థానాలకు వెళ్లొచ్చని.. రోడ్డెక్కితే వారి అవస్థలు వర్ణనాతీతం. ప్రజలు రహదార్ల పైకి రాలేని దుస్థితి. ప్రధాన రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. పొరపాటున సందుగొందుల్లోకి వెళితే టూ వీలర్ అయితే బయటికి రాలేని పరిస్థితి. వర్షాలు పడినప్పుడు, నగరపాలక సంస్థ అధికారులు హడావుడి చేసి తాత్కాలిక ఉపశమనం చేయడమేగానీ, శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడమే ఈ దుస్థితికి కారణం. ప్రధానంగా నగరానికే తలమానికమైన బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, పాలిక్లిని రహదారులు వాగులను తలపిస్తున్నాయి. వాన నీరు ముందుగా రోడ్ల వెంట ఉన్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్‌లోకి వెళ్తుంది. అక్కడ నుంచి మేజర్ అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లోకి చేరుతోంది. ఈ డ్రెయిన్లు కంటిన్యుటీగా లేవు. నగరంలో ఇప్పుడున్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్లు, అవుట్‌ఫాల్ డ్రెయిన్లు సరిపోవడం లేదు. డ్రెయిన్లు ఎప్పుడో నిర్మించినవి కావడం.. అవి తగిన పరిణామంలో లేకపోవడం, చిన్నవిగా ఉండటంతో వర్షం నీరు వేగంగా ప్రవహించడం లేదు. ఎక్కడిక్కడ డ్రెయిన్లపై సిమెంటు నిర్మాణాలు చేపట్టడంతో ఇబ్బంది కరంగా మారింది. ప్రధానంగా విజయవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గంలో అవుట్‌ఫాల్ డ్రెయిన్లు బుడమేరులో కలుస్తాయి, ఇవి ఎప్పుడో నిర్మించినవి కావడంతో ప్రస్తుతం ఉన్న అవసరాలకు సరిపోవడం లేదు. తూర్పులో పుల్లేటి కాల్వ, గుంటతిప్ప కాల్వ పనులు అసంపూర్తిగా ఉండటంతో నీరు బయటికి వెళ్లడం లేదు. నగరంలో రఅవుట్ఫాల్ డ్రెయిన్లు సరిగా పని చేయడం లేదు. దీంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైన మోకాలి లోతుకుపైగా నీరు చేరి గంటల తరబడి నిలు స్తోంది. నగరం ఈ దుస్థితి నుంచి గట్టెక్కాలంటే అవుట్‌ఫాల్ డ్రెయిన్లలో నీరు ప్రవహించేలా ఆధునీకరించాల్సి ఉంది. వర్షం పడినప్పుడు, నగరపాలక సంస్థ అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టి మమ అనిపిస్తున్నా, పూర్తిస్థాయి పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. -
అత్యవసరమైతేనే బయట తినాలి
ఇటీవల కాలంలో జీర్ణాశయ, పెద్దపేగు క్యాన్సర్లు పెరిగాయి. అందుకు కల్తీ ఆహారం. నాన్‌వెజ్ ఎక్కువగా తీసుకోవడం కూడా కారణంగా చెప్పవచ్చు. ఆహార పదార్థాలు కల్తీ అవుతున్న నేపథ్యంలో అత్యవసరమైతేనే బయట తినాలి. మాంసాహారంలో కలిపే రసాయనిక రంగులు క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి. మహిళల్లో శారీరక శ్రమ తగ్గడంతో రొమ్ము క్యాన్సర్‌తో పాటు, గర్భాశయ క్యాన్సర్ కేసులు అధికమయ్యాయి. పట్టణ వాసుల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. క్యాన్సర్‌ను ముందు జాగ్రత్తలతో నివారించగలుగుతాం. –డాక్టర్ సుబ్బారావు, క్యాన్సర్ వైద్య నిపుణులు -
కలెక్టర్ లక్ష్మీశ
టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుదాం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుదామని కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు. జిల్లాలో అత్యంత ప్రాచుర్యం పొందిన కొండపల్లి ఖిల్లా, భవానీ ద్వీపం, గాంధీ హిల్, బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం, మొగల్రాజపురం గుహలు, మూలపాడు బటర్‌ఫ్లై పార్కు వంటి పర్యాటక ప్రాంతాలతో పాటు కనకదుర్గమ్మ దేవాలయం, గుణదల మేరీమాత, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం, వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, జగ్గయ్యపేట సమీపంలోని తిరుమలగిరి వెంకటేశ్వరస్వామి ఆలయం వంటి పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయన్నారు. వీటితో పర్యాటకులను ఆకర్షించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్లో పర్యాటక శాఖ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్‌ను శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక, సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను పర్యాటకులు సందర్శించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి తేవడానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. భవానీ ద్వీపంలో వారాంతాల్లో వినోద, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ వర్గాల్లో ప్రతిభను వెలికితీసే పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. పర్యాటక శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో కార్యాచరణను రూపొందించి ముందడుగు వేయాలని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప పాల్గొన్నారు. -
శాప్ చైర్మన్ రవినాయుడు
కానిస్టేబుళ్లుగా ఎంపికై న వారు.. రేపు హాజరుకండి లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికై న వారు ఈ నెల 23న గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉదయం పది గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషన్‌తో జతపరిచిన అన్ని ధ్రువపత్రాల ఒరిజినల్స్, గజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫొటోలను తీసుకుని రావాలని సూచించారు. సివిల్ కానిస్టేబుల్స్, ఏపీ ఎస్సీ, పురుష, మహిళ అభ్యర్థులు అందరూ అదే రోజు హాజరు కావాలని స్పష్టంచేశారు. ఉచితంగా చెస్ శిక్షణ శిబిరాలు మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): చెస్ ఆట విశేషాలను పాఠ్యాంశంగా చేర్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ రవినాయుడు చెప్పారు. స్థానిక పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఎస్ఆర్ఆర్ ఫీడే ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నమెంట్–2025ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాప్ ఆధ్వర్యంలోని స్టేడియంల్లో చదరంగం కోసం ప్రత్యేకంగా ఒక గది కేటాయించి పేద విద్యార్థుల కోసం శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ టోర్నమెంట్లో 8 చెస్ బోర్డులను లైవ్ గేమ్ కోసం అందుబాటులో ఉంచామన్నారు. 25వ తేదీ వరకు టోర్నమెంట్ జరుగుతుందన్నారు. సిద్ధార్థ అకాడమీ ఉపాధ్యక్షుడు కృష్ణరావు, జాయింట్ డైరెక్టర్ లలిత్ ప్రసాద్, ఎస్ఎల్వీ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీనివాసరాజు, శాప్ డైరెక్టర్ సంతోష్ కుమార్, టోర్నమెంట్ డైరెక్టర్ పి.రేణుక తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో లైజనింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్లు, వెన్యూ సూపర్వైజర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను లబ్బీపేట రెడ్ సర్కిల్ వద్ద నున్న బిషప్ అజరయ్య బాలికల కళాశాల పరీక్ష కేంద్రంలో ఈనెల 22, 23, 24, 30, 31 తేదీల్లో ఐదురోజుల పాటు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలకు 106 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు. పరీక్షల నిర్వహణకు 11మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ఆరుగురు విభిన్న ప్రతిభావంతులు పరీక్షలు రాసేందుకు అదే కళాశాలలో పరీక్ష కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షల నిర్వహణకు ఇద్దరు వెన్యూ సూపర్వైజర్లు, ఇద్దరు అసిస్టెంట్ సూపర్వైజర్లను నియమించామని తెలిపారు. అన్ని మౌలిక వసతులు.. పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా ఏపీఎస్ ఆర్టీసీ ఆ రూట్లో బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, యూపీఎస్సీ డెప్యూటీ సెక్రటరీ, ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ సునీల్‌కుమార్ అగర్వాల్, డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, ఆర్డీఓ కె. చైతన్య, బిషప్ అజరయ్య బాలికల కళాశాల ప్రిన్సిపల్ కె.సంధ్య, వైస్ ప్రిన్సిపాల్ వి.సునీత తదితరులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
విస్తరణకు వీడని గ్రహణం
నిలిచిన రహదారి నిర్మాణం కందులపాడు–గంగినేని స్టేట్ హైవే–242 విస్తరణ పనుల వివరాలు విస్తరణ పనుల పొడవు 14.44 కిలోమీటర్లు అంచనా విలువ రూ.34.11కోట్లు స్కీము న్యూ డెవలప్మెంట్ బ్యాంకు నిధులు సీసీ రోడ్ల నిర్మాణం 2.87కిలోమీటర్లు కొత్త కల్వర్టులు 4 బాక్సు, 16పైపు కల్వర్టులు కొత్త బ్రిడ్జిలు 4బ్రిడ్జిలు పూర్తైన పనులు 50శాతం జి.కొండూరు: కూటమి పాలకుల నిర్లక్ష్యంతో కందులపాడు, గంగినేని స్టేట్ హైవే పనులు ముందుకు సాగడం లేదు. సుపరిపాలనకు తొలి అడుగు అంటూ గొప్పులు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. అసంపూర్తి రహదారులు అస్తవ్యస్తంగా మారడంతో గ్రామీణ ప్రజలు నరకయాతన పడుతున్నారు. న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు నిధులు 70శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.30శాతం నిధులతో ఈ రహదారి విస్తరణ పనులు జరగాల్సి ఉంది. రెండున్నరేళ్ల క్రితం విస్తరణ పనులు ప్రారంభం కాగా గత ప్రభుత్వ హయాంలో రూ.4కోట్ల మేర బిల్లులను కూడా అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిగా రూ.6కోట్ల మేర బిల్లులను పెండింగ్‌లో పెట్టడంతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు. పనులకు అవసరమైన యంత్రాలు, కార్మికులను సైతం పూర్తిగా తరలించడంతో రహదారి విస్తరణ ప్రశ్నార్థకంగా మారింది. పనులు నిలిచిపోయింది ఇలా జి.కొండూరు గెయిల్ ఇండియా కంపెనీ వద్ద 9.430వ కిలోమీటరు నుంచి 9.740వ కిలోమీటరు వరకు 310 మీటర్లు మేర రహదారి విస్తరణ చేయాల్సి ఉంది. గడ్డమణుగు గ్రామ చివర 9.740వ కిలోమీటరు నుంచి 9.790వ కిలోమీటరు వరకు 50మీటర్ల మేర సీసీరోడ్డును నిర్మించాల్సి ఉంది. గడ్డమణుగు గ్రామ శివారు 9.790వ కిలోమీటరు నుంచి చెర్వుమాధవరం వద్ద 12వ కిలోమీటరు వరకు 2.210కిలోమీటర్లు మేర రహదారి విస్తరణ చేయాల్సి ఉంది. ఇక్కడే రెండు కిలోమీటర్లు మేర భూ సేకరణ సైతం చేయాల్సి ఉంది. చెర్వుమాధవరం ప్రారంభం 12వ కిలోమీటరు నుంచి గ్రామ చివరి వరకు 13.350వ కిలోమీటరు వరకు 1.350కిలోమీటర్లు మేర సీసీరోడ్డును నిర్మించాల్సి ఉండగా సగం మాత్రమే పూర్తైంది. చెర్వుమాధవరం గ్రామ చివర 13.350వ కి.మీ.నుంచి మునగపాడు గ్రామం 13.700వ కి.మీ వరకు 350మీటర్లు మేర రహదారి విస్తరణ చేయాల్సి ఉంది. మునగపాడు గ్రామ చివర 14.300వ కి.మీ నుంచి తెల్లదేవరపాడు వద్ద 18.360వ కి.మీ వరకు 4.60కిలోమీటర్లు మేర రహదారి విస్తరణ చేయాల్సి ఉండగా ఇక్కడ యాభైశాతం మాత్రమే పూర్తయింది. తెల్లదేవరపాడు గ్రామ చివర 18.680వ కి.మీ నుంచి గంగినేని గ్రామ ప్రారంభం 20.370వ కి.మీ వరకు 1.690కి.మీ మేర రహదారిని 50 శాతం విస్తరణ చేయాల్సి ఉంది. గంగినేని చివర 20.900వ కి.మీ నుంచి 23.530వ కి.మీ వరకు 2.630కి.మీ. వరకు రహదారి విస్తరించాల్సి ఉంది. ఇప్పటి వరకు పూర్తయి సీసీరోడ్లకు డ్రైనేజీలు నిర్మించలేదు. పలు చోట్ల కల్వర్టులు, వంతెనలను నిర్మించాల్సి ఉంది. ఈ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డును ఆనుకొని ఉన్న కృష్ణావాటర్ పైపులైను మార్చి కొత్తలైను వేసేందుకు అధికారులు రూ.3.30కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు. వాటిని కూడా విడుదల చేయకపోవడంతో పైపులైను ఏర్పాటు ఆగింది. ఇది కూడా విస్తరణకు అడ్డంకిగా మారింది. కందులపాడు నుంచి జి.కొండూరు మీదుగా గంగినేని వరకు ఉన్న స్టేట్ హైవే–242 23.53కిలోమీటర్లు ఉంది. ఇది జి.కొండూరు నుంచి గడ్డమణుగు, చెర్వుమాధవరం, మునగపాడు, సున్నంపాడు, తెల్లదేవరపాడు, గంగినేని గ్రామాల మీదుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం గ్రామాన్ని కలుపుతూ మధిర మీదుగా ఖమ్మం వరకు ఈ రహదారి షార్ట్‌కట్ రోడ్డుగా ఉంది. అయితే ఈ రహదారి భారీ వాహనాల రాకపోకలతో ధ్వంసమైంది. ఈ రహదారి జి.కొండూరు వద్ద 8.700కిలోమీటరు నుంచి 23.530కి.మీ వరకు 14.44 కి.మీలు మేర విస్తరణ పనులకు రూ.34.11కోట్లతో అంచనాలను తయారు చేశారు. ఈ పనులకు ఆగస్టు 27, 2022లో శంకుస్థాపన చేసినా ఆరు నెలలు తర్వాత పనులు ప్రారంభించారు. మొదటి దశ పనులకు నిధులు విడుదలైనా రెండో దశలో నిధులు విడుదలలో జాప్యం జరగడం, సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభం కావడంతో పనులు నిలిచాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు తర్వాత మళ్లీ పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ యాభై శాతం రహదారి విస్తరణ పనులు పూర్తి చేశారు. అయినా రూ.6కోట్ల మేర బిల్లులను విడుదల చేయకపోవడంతో చేసేదిలేక కాంట్రాక్టర్ పనులను ఆపేశారు. -
పర్యావరణహితంగా పండుగలు చేసుకుందాం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి చెక్ పెట్టి, పర్యావరణ హితంగా పండగలు జరుపుకొనేలా ప్రజలను జాగృతం చేసేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఈ ఏడాది గణేష్ ఉత్సవాలకు మట్టి ప్రతిమల తయారీతో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ లక్ష్మీశ గురువారం కలెక్టరేట్లో వివరించారు. కృత్రిమ రంగులు, రసాయనాలు, థర్మోకోల్ వంటి వినియోగంతో పర్యావరణానికి పెను ముప్పు కలుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి, విజయవాడ నగరపాలక సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ నెల 26న నగరంలో అత్యధిక సంఖ్యలో మట్టి ప్రతిమలను తయారు చేసి రికార్డు నెలకొల్పనున్నట్లు వివరించారు. వివిధ పాఠశాలలతో పాటు ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్లను కూడా పెద్దఎత్తున భాగస్వాములను చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు ఇళ్ల వద్ద మట్టి వినాయక ప్రతిమలను తయారుచేసి ఫొటోలను 91549 70454 నంబరుకు వాట్సాప్ చేయాలని సూచించారు. కొందరు సృజనాత్మకంగా గణపతి ప్రతిమలు చేస్తున్నారని.. రకరకాల గింజలు, ఆకులు, కూరగాయలు వంటివాటిని ఉపయోగించి చేస్తున్నారని.. ఇలాంటివి కూడా తయారుచేసి వాటి ఫొటోలను పంపాలని సూచించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియాలి వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా చూడాలని ఆయా శాఖల అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. జేసీ ఎస్.ఇలక్కియ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, అడిషనల్ సీపీ కేజీవీ సరితతో కలిసి గురువారం ఆయన వినాయక చవితి ఉత్సవాలపై రెవెన్యూ, పోలీస్, కాలుష్య నియంత్రణ మండలి, వైద్య ఆరోగ్యం, అగ్నిమాపక, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనుమతులు, పర్యావరణానికి అనుకూలంగా ఉత్సవాలు నిర్వహించుకునేలా కమిటీలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఉత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, పీసీబీ ఈఈ పి.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, నందిగామ, తిరువూరు ఆర్డీవోలో కె.బాలకృష్ణ, కె.మాధురి తదితరులు పాల్గొన్నారు. -
నేడు సామూహిక వరలక్ష్మీవ్రతాలు
ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు పూర్తిఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం ఐదో శుక్రవారాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఆచరించనున్నారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాలు రెండు కేటగిరీలలో నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటలకు వరకు రూ.1500 టికెట్‌పై ఆర్జిత సేవగా జరుగుతుంది. ఈ సేవలో పాల్గొన్న ఉభయదాతలకు, భక్తులకు రూ.300 టికెట్ క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇక ఉదయం 10 గంటలకు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరుగుతాయి. ఇప్పటికే భక్తులకు దరఖాస్తులను పంపిణీ చేయగా, దరఖాస్తులు స్వీకరించిన భక్తులు వాటిని పూర్తి చేసి దేవస్థానానికి సమర్పించారు. వ్రతంలో పాల్గొనే భక్తులకు ప్రసాదం కిట్‌ను ఉచితంగా అందజేస్తారు. వ్రతం అనంతరం రూ.100 క్యూలైన్లో భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాల నేపథ్యంలో మహా మండపం ఆరో అంతస్తులో దేవస్థానం ఏర్పాట్లు చేసింది. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. భక్తుల రద్దీకి తగిన విధంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సదుపాయాలు కల్పించాలని దేవస్థాన అధికారులు ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, వాటర్ విభాగాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. -
బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ఆఫర్
మధురానగర్(విజయవాడసెంట్రల్): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం అతి తక్కువ ధరలో త్రిపుల్ ప్లే సర్వీస్ ప్లాన్‌ను తీసుకొచ్చిందని బీఎస్ఎన్ఎల్ ఏపీసర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. శేషాచలం తెలిపారు. విజయవాడ చుట్టుగుంట బీఎస్ఎన్ఎల్ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ అందుబాటులో ఉండేలా కేవలం రూ. 400కే హైస్పీడ్ ఇంటర్నెట్, 9ఓటీటీ, 400కు పైగా లైవ్ చానల్స్‌తోపాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోందన్నారు. ఈ సదుపాయం వినియోగించుకోవటానికి బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్‌సెంటర్‌లో స్వయంగాకానీ, ఆన్లైన్లో కానీ సంప్రదించవచ్చన్నారు. అలాగే 18004444 నంబర్‌కు హెచ్ఐ (హాయ్) అని మెసేజ్ పంపటం ద్వారా కూడా సేవలు పొందవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఉన్న బీఎస్ఎన్ఎల్ ఎప్ఐటీహెచ్ కస్టమర్లు కేవలం రూ.140 నుంచి టీవీ సేవలు పొందవచ్చన్నారు. ఫ్రీడమ్ ప్లాన్ ఇదే.. అలాగే ప్రత్యేకమైన ‘ఫ్రీడమ్ ప్లాన్’ను ఆగస్టు 2025లో ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో కేవలం రూపాయికే ఉచిత బీఎస్ఎన్ఎల్ సిమ్, రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్‌కాల్స్‌తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు 30 రోజులపాటు అందిస్తున్నామన్నారు. ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్న దృష్ట్యా బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం స్పామ్ ఫ్రీ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా ప్రారంభించిందన్నారు. బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్లు రవి కుమార్ బుంగ, ఎల్ శ్రీను, జనరల్ మేనేజర్లు మురళీకృష్ణ, టి. వెంకట ప్రసాద్ డీజిఎంలు పాల్గొన్నారు. -
ఉద్ధృతంగానే కృష్ణవేణి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణానదిపై ఎగువున ఉన్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా ప్రకాశం బ్యారేజ్‌కు స్వల్పంగా వరద పెరిగింది. బుధవారం తగ్గినట్లే తగ్గి, మళ్లీ వరద వస్తోంది. ప్రకాశం బ్యారేజ్‌కు గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 5,04,969 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో.. సాయంత్రం 7 గంటలకు 5,08,849 క్యూసెక్కులకు చేరింది. ఇందులో 4,93,822 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు. మిగిలిన 15,027 క్యూసెక్కులు కాలువలకు విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 13.7 అడుగులకు చేరింది. బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నది పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక -
మృతదేహానికి 12 రోజుల తర్వాత పోస్టుమార్టం
గన్నవరం: ఓ వ్యక్తి మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు 12 రోజుల తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఘటన మండలంలోని చిక్కవరం శివారు చింతగుంట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. చింతగుంట గ్రామానికి చెందిన డోలా లక్ష్మణ్‌కుమార్(35) కారు డ్రైవర్. సుమారు 14 ఏళ్ల క్రితం జక్కంపూడికి చెందిన బిందుపావనితో అతనికి ప్రేమ వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. నాలుగు నెలల క్రితం కేసరపల్లి శివారు వీఎన్ పురం కాలనీలో లక్ష్మణ్‌కుమార్ ఇళ్లు అద్దెకు తీసుకుని కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ఈ నెల 10వ తేదీ తెల్లవారుజామున లక్ష్మణ్‌కుమార్ గుండెపోటుకు గురై మృతి చెందినట్లుగా బిందుపావని అతని తల్లిదండ్రులు, బంధువులకు తెలియజేసింది. దీంతో మృతదేహాన్ని చింతగుంటకు తీసుకువెళ్లి మత సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. కొన్ని రోజుల తర్వాత లక్ష్మణ్‌కుమార్ మృతిపై అతని కుటుంబ సభ్యులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు గన్నవరం పోలీసులను ఆశ్రయించి అతని తండ్రి డోలా ఏసుపాదం ఫిర్యాదు చేశారు. లక్ష్మణ్‌కుమార్ మృతి చెందినప్పుడు అతని స్నేహితుడు చింతగుంటకు చెందిన దేవరపల్లి ప్రదీప్ కూడా అక్కడే ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడు మృతి విషయంలో కోడలు బిందుపావని, అతని స్నేహితుడు ప్రదీప్‌పై అనుమానాలు ఉన్నట్లుగా ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తహసీల్దార్ కె. వెంకటశివయ్య సమక్షంలో లక్ష్మణ్‌కుమార్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని సీఐ బి.వి.శివప్రసాద్ తెలిపారు. -
కదిలించిన ఎడ్లంక కథనం
అవనిగడ్డ: వరదల వల్ల తీవ్ర కోతకు గురవుతున్న ఎడ్లంక దుస్థితిపై ‘సాక్షి’లో వచ్చిన ‘ఎడ్లంకకు గుండెకోత’ ప్రత్యేక కథనం అందరినీ కదిలించింది. పల్లెపాలెంకు చెందిన గ్రామస్తులు గురువారం ప్రత్యేక సమావేశమయ్యారు. రెండేళ్ల నుంచి పరిస్థితి చాలా దారుణంగా ఉందని, పాలకులు స్పందించకుంటే ఎడ్లంక కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామ పరిస్థితిని కథనంలో కళ్లకు కట్టినట్టు చూపించారన్నారు. శుక్రవారం నుంచి నది వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు గ్రామస్తులు తెలిపారు. హోం మంత్రికి వినతి.. ఎన్ఆర్ఐ, గ్రామవాసి, టీడీపీ నాయకుడు బొబ్బా గోవర్థన్ గురువారం అమరావతిలో రాష్ట్ర హోం మంత్రి అనితను కలిసి ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని చూపించి గ్రామ పరిస్థితిని వివరించారు. రక్షణ చర్యలు తీసుకోకపోతే కొద్ది రోజుల్లో ఎడ్లంక గ్రామం కనుమరుగయ్యే ప్రమాదముందని, విపత్తుల నిధుల నుంచి గ్రామంలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. -
సిద్ధార్థలో రోబో ఎక్స్ 2కె25 హాకథాన్ పోటీలు
పెనమలూరు: కానూరు సిద్ధార్థ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో జాతీయ స్థాయిలో రోబో ఎక్స్ 2కె25 హాకథాన్ పోటీలు నిర్వహిస్తున్నామని వైస్‌చాన్సలర్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు తెలిపారు. వర్సిటీలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 18, 19 తేదీల్లో జాతీయ స్థాయిలో రోబోటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం పెంపొందించటమే కాకుండా యువ ఇంజినీర్ల ఆవిష్కరణలకు వేదికగా ఉంటుందన్నారు. ఈ పోటీలు ప్రధానంగా ఇండస్ట్రీస్ 4.0, స్మార్ట్స్ ఆటోమేషన్, మెకాట్రోనిక్స్, ఏఐ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్‌పై ఉంటాయన్నారు. ప్రో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఏవీ రత్నప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యం పెంచే విధంగా చర్యలు చేపట్టామన్నారు.నూతన విద్యా విధానంలో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ ఎన్.రవికుమార్ మాట్లాడుతూ ఆరు సాంకేతిక పోటీలతో కార్యక్రమం ఉంటుందన్నారు. గెలుపొందిన వారికి రూ.2 లక్షల విలువ చేసే బహుమతులు ఇస్తామన్నారు. అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులు పాల్గొనవచ్చని అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్ర, ఐటీ హెడ్ ఎం.సునీత, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు డాక్టర్ దిల్లీబాబు, డాక్టర్ ఎం.సుమలత, డాక్టర్ బి.సుప్రజరెడ్డి, విద్యార్థుల కోఆర్డినేటర్ జె.తేజఅమరేశ్వర్, ఫయాజ్, ఎం.ప్రవల్లిక, ఎస్.హర్షిత పాల్గొన్నారు. -
దసరాలో పరిమితంగానే ఆర్జిత సేవలు
●ఉత్సవ ఏర్పాట్లపై దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష ●దుర్గా ఘాట్‌లో మరింత వైభవంగా కృష్ణమ్మ హారతులకు ఏర్పాట్లు ●టీటీడీ సహకారంతో అమ్మవారి ఆలయ బంగారు తాపడం పనులు ●కుమ్మరిపాలెంలో టీటీడీ స్థలాన్ని దుర్గగుడికి తీసుకునేందుకు చర్చలుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమ్మవారి సన్నిధిలో జరిగే ఉత్సవాలు అంటేనే పూజలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అసలు పూజలు లేకుండా ఉత్సవాలు ఏంటి...అయితే అన్ని పూజలు కలిపి 3 వేలకు అటు ఇటుగా పెట్టండి అంటూ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దుర్గగుడి అధికారులను ఆదేశించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే దసరా మహోత్సవాల ఏర్పాట్లపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో బోర్డు మీటింగ్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించగా, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, దుర్గగుడి ఈవో శీనా నాయక్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ముఖ్య అధికారులు హాజరయ్యారు. సమీక్ష సమావేశంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలు, గతంలో చోటు చేసుకున్న పలు అంశాల గురించి వీడియో ప్రజెంటేషన్ జరగ్గా, ఆ తర్వాత ఈ ఏడాది చేస్తున్న ఏర్పాట్లు, ఇతర మౌలిక సదుపాయాలపై చర్చ సాగింది. అయితే ప్రధానంగా ఈ ఏడాది ఆర్జిత సేవలను పరోక్షంగా నిర్వహించాలని దేవదాయ శాఖ చేసిన ప్రతిపాదనకు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే దసరా ఉత్సవాలు అంటేనే ఇంద్రకీలాద్రి గుర్తుకు వస్తుందని, అటువంటిది ఆర్జిత సేవలు లేకుండా ఉత్సవాలు ఏంటని ప్రశ్నించారు. అయితే ప్రత్యేక ఖడ్గమాలార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చనలన్నీ కలిపి మూడు నుంచి మూడున్నర వేల టికెట్లు భక్తులకు అందు బాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గత ఏడాది దసరా ఉత్సవాల వీడియో ఫుటేజీలను పరిశీలించిన మంత్రి, దేవాదాయ శాఖ అధికారులు కొన్ని కీలక అంశాల గురించి చర్చించారు. దుర్గాఘాట్‌లో నిర్వహిస్తున్న కృష్ణమ్మ హారతులను మరింత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, కుమ్మరి పాలెంలోని టీటీడీకి చెందిన రెండున్నర ఎకరాల స్థలాన్ని దుర్గగుడికి ఇచ్చేందుకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటి గురించి టీటీడీతో మాట్లాడినట్టు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. అమ్మవారి ఆలయ బంగారు తాపడం పనులను టీటీడీ సహకారంతో త్వరలోనే చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సమావేశంలో దేవస్థాన స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకుడు ఎల్డీ ప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్, శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. మీడియా సమావేశం లేకుండానే ముగింపు దుర్గగుడిలో జరిగే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి మీడియాకు ఆహ్వానం లేదని సిబ్బంది బహిరంగంగా పేర్కొనడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధానానికి దుర్గగుడి అధికారులు తెర లేపారు. సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత దేవస్థానమే ఫొటోలు, వీడియోలు పంపుతుందని ముందుగానే మీడియా ప్రతినిధులకు సమాచారం అందించారు. కనీసం సమీక్ష సమావేశం హాల్ వద్దకు కూడా మీడియా ప్రతినిధులు రాకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన సమీక్ష సమావేశ వివరాలను రెండు ముక్కల్లో తేల్చివేశారు. -
అరవై లోనూ అలవోకగా...
అరవై ఏళ్లు దాటితే నేమి...అలవోకగా చింతచెట్టు ఎక్కి చిటారు కొమ్మపై నిలబడుతుందామె... చింతచిగురు కోసి అమ్ముకుని ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడగలుగుతుంది. ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం తన స్వశక్తితోనే జీవనం సాగించాలనే పట్టుదల ఆమెది. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధి కందులపాడు గ్రామానికి చెందిన సుఖబోగి రాజమ్మ(60) భర్త ప్రసాద్ అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులు. రాజమ్మ తన ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం ఒకరి మీద ఆధారపడకూడదనే ఉద్దేశంతో తనకు వచ్చే పింఛన్‌తో పాటు సీజనల్‌గా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తొలకరి వర్షాలు ప్రారంభం అయితే చాలు రాజమ్మ చింతచెట్ల నుంచి చిగురును సేకరించి విక్రయించడం జీవనోపాధిగా ఎంచుకుంది. ఇరవై ఏళ్లుగా తాను ఈ విధంగా చింత చిగురు కోసి విక్రయిస్తున్నానని రాజమ్మ చెబుతోంది. జి.కొండూరు మండల పరిధి ఆత్కూరు గ్రామ శివారులో చెట్టుపై ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు సైతం వేగంగా కదలడం చూసి చిన్న వయసు వారే ఆశ్చర్యపోతుంటారు. శభాష్ రాజమ్మ అని అభినందిస్తుంటారు. –జి.కొండూరు -
నేరస్తుల కదలికలపై నిఘా పెట్టండి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో నేరాలను నియంత్రించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆర్.గంగాధర రావు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశపు హాలులో జిల్లాలోని పోలీసు అధికారులతో బుధవారం నేరసమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. జిల్లావ్యాప్తంగా డ్రోన్ కెమెరాల వినియోగం మరింత పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, చోరీలు జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరి శీలించాలన్నారు. రాత్రి గస్తీ నిర్వహించే సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల విషయంలో పోలీసులు వెంటనే స్పందించి కేసులు నమోదుచేయాలని స్పష్టంచేశారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన శక్తి టీం బృందాలు మరింత చురుగ్గా పని చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరి మొబైల్లో శక్తి యాప్ ఉండేలా చూడాలన్నారు. యాప్ ద్వారా ఫిర్యాదు అందితే తక్షణమే స్పందించాలన్నారు. వాహనాల తనిఖీలు నిరంతరం నిర్వహించాలన్నారు. సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి అధికారి తమ గ్రామాల్లో పల్లెనిద్రలు చేస్తూ అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు సిబ్బందికి రివార్డులు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. నేరసమీక్ష సమావేశంలో కృష్ణా జిల్లా ఎస్పీ -
తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ పర్యాటక రైలు
బైద్యనాథ్ ధామ్తో సహా అయోధ్య–కాశీ పుణ్యక్షేత్ర యాత్ర రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల యాత్రికుల కోసం బైద్యనాథ్ ధామ్తో సహా అయోధ్య–కాశీ పుణ్యక్షేత్ర పేరుతో భారత్ గౌరవ్ ప్రత్యేక పరర్యాటక రైలును నడపనున్నట్లు ఐఆర్సీటీసీ అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి ఈ రైలు బయలుదేరనుంది. తొమ్మిది రాత్రుళ్లు, పది రోజులు సాగే ఈ యాత్రలో పూరిలోని జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, డియోఘర్‌లోని బాబా బైద్యనాథ్ ఆలయం వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం, పరిసర పుణ్యక్షేత్రాలు, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయం, గంగా హారతి, అయోధ్యలోని రామ జన్మభూమి, హనుమాన్ గర్హి, ప్రయోగ్రాజ్లోని త్రివేణి సంగమ సందర్శన ఉంటుంది. తెలంగాణలోని కాజీపేట జంక్షన్, వరంగల్లు, ఖమ్మం, ఆంధ్రలోని విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో బోర్డింగ్/డీబోర్డింగ్ సదుపాయం కల్పించారు. ఈ యాత్రలో ఆన్‌బోర్డు/ఆఫ్‌బోర్డులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అల్పాహారం, భోజనం, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదుపాయం, రాత్రుళ్లు హోటళ్లలో బస తదితర ఏర్పాట్లతో పాటు కోచ్‌లలో సీసీ కెమెరాలతో నిరంతరం భద్రత ఏర్పాట్లు, టూర్ ఎస్కార్టులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్యాకేజీ ధరలు... ఈ యాత్రలో ఎకానమి (స్లీపర్ క్లాస్) పెద్దలకు ఒక్కొక్కరికి రూ.17,000, పిల్లలకు రూ.15,800, స్టాండర్డ్ (3 ఏసీ)లో పెద్దలకు రూ.26,700, పిల్లలకు రూ.25,400, కంఫర్ట్ (2 ఏసీ) పెద్దలకు రూ.35,000, పిల్లలకు రూ.33,300 టికెట్ ధర నిర్ణయించారు. ఆసక్తి కలిగిన వారు ఆర్ఆర్సీటీసీ వెబ్ సైట్ లేదా 9701360701, 9281030712 ఫోన్ నంబర్ల ద్వారా టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా సూచించారు. మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐ కళాశాలల్లో చేరేందుకు మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతితో పాటుగా 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐటీఐలో చేరవచ్చునని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 26వ తేదీలోగా ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ లోగాని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు స్వయంగా వచ్చి గాని దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 27వ తేదీన దరఖాస్తు చేసుకున్న కళాశాలకు స్వయంగా వెళ్లి సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకోవాలని తెలియజేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి అయిన వారు మాత్రమే కౌన్సెలింగ్‌లో హాజరు అవడానికి అర్హులని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చేరే విద్యార్థులకు ఈ నెల 29వ తేదీన, ప్రవేటు ఐటీఐ కళాశాలలో చేరే విద్యార్థులకు ఈ నెల 30వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కనకరావు వివరించారు. ఇతర వివరాలకు 0866–2475575, 94906 39639, 77804 29468 నంబర్లలో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. -
గూడూరు–విజయవాడ సెక్షన్లో డీఆర్ఎం తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా బుధవారం గూడూరు–విజయవాడ సెక్షన్లో విస్తతంగా తనిఖీలు చేపట్టారు. నెల్లూరు స్టేషన్లో అమృత్ భారత్ పథకంలో జరుగుతున్న స్టేషన్ పునరాభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ముందుగా అధికారులతో కలసి డీఆర్ఎం గూడూరు స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలు, స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, భద్రతా చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూ సకాలంలో పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. అక్కడ నుంచి నెల్లూరు స్టేషన్‌కు చేరుకుని స్టేషన్ ఆధునికీకరణ పనులను పర్యవేక్షించారు. నూతన భవన నిర్మాణాలు, ప్లాట్‌ఫాం పనులను పర్యవేక్షించి సకాలంలో పూర్తిచేయాలన్నారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక ప్రవేశ ద్వారాలు నెల్లూరు స్టేషన్‌కు ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. అనంతరం బిట్రగుంట, సింగరాయకొండ, ఒంగోలు స్టేషన్లను సందర్శించి సిబ్బందికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో గూడూరు–విజయవాడ సెక్షన్ అత్యంత కీలకమైనదన్నారు. ఈ సెక్షన్లో ప్రపంచ స్థాయి ఆధునిక సౌకర్యాల దిశగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో పనులు వేగంగా చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. నందిగామ టౌన్: ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు పట్టణంలోని పాతబస్టాండ్ ప్రాంతానికి చెందిన కాసర్ల లక్ష్మయ్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు మనోజ్ (24) జేసీబీ ఆపరేటర్‌గా పని చేస్తూ మద్యానికి బానిసై నిత్యం మద్యం తాగుతుండటంతో పలుమార్లు తండ్రి మందలించాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా మద్యం తాగి తండ్రితో వాగ్వాదానికి దిగగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన మనోజ్ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి మనోజ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వైవీఎల్ నాయుడు తెలిపారు. మృతుని తండ్రి లక్ష్మయ్య కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. కృష్ణలంక(విజయవాడతూర్పు): అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బెంజిసర్కిల్ సమీపంలోని ఐరా హోటల్ ముందు సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఒక వ్యక్తి మద్యం తాగి తూలుతూ నడుస్తూ రోడ్డు పక్కన పడిపోయాడు. కాళ్లు, చేతులు కొట్టుకుంటుండగా చుట్టుపక్కల వారు అతనిని 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. మృతుని వద్ద ఊరు, పేరుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని, వయస్సు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండవచ్చని తెలిపారు. హోటల్ వాచ్‌మన్ నర సింహారావు బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. మధురానగర్(విజయవాడసెంట్రల్): వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో పండ్ల వ్యాపారి మృతి చెందిన ఘటన గుణదల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుడమేరు మధ్య కట్ట లెనిన్‌నగర్‌కు చెందిన పొగిరి శ్రీనివాస్(41) మాచవరంలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయన మంగళవారం రాత్రి తన ద్విచక్రవాహనంపై నున్న బైపాస్ వైపు నుంచి గుణదల వైపు వస్తుండగా గుణదల రైల్వేగేటు సమీపంలో ఎదురుగా వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను చుట్టుపక్కలవారు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు శ్రీనివాస్ అప్పటికే మృతి చెందాడని ధ్రువీకరించారు. శ్రీనివాస్ భార్య పొగిరి రమాదేవి ఫిర్యాదు మేరకు గుణదల పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేగంగా వచ్చి ఢీకొట్టిన ద్విచక్రవాహన చోదకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
బాస్కెట్ బాల్ విజేత హిందుస్థాన్ జట్టు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు):సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఇన్విటేషనల్ పురుషుల బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ఫైనల్స్ బుధవారం రాత్రి సిద్ధార్థ కళాశాల మైదానంలో జరిగాయి. లయోలా కళాశాల(చైన్నె), హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(చైన్నె) జట్ల మధ్య ఫైనల్స్ పోటీ రసవత్తరంగా సాగింది. లయోలా జట్టుపై హిందుస్థాన్ జట్టు విజయం సాధించింది. హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ జట్టు 81 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. 46 పాయింట్లతో లయోలా కళాశాల రన్నరప్‌గా నిలిచింది. విజేత జట్టుకు రూ.75 వేల నగదు, రన్నరప్ జట్టుకు రూ.50 వేల నగదును సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, అకాడమీ సభ్యులు కలిసి అందజేశారు. ఏపీ సీఐడీ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్, శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్, అకాడమీ అడ్వయిజర్ ప్రొఫెసర్ ఎల్కే మోహనరావు, శాప్ మాజీ చైర్మన్ అంకమ్మ చౌదరి, సిద్ధార్థ కళాశాల క్రీడా విభాగాధిపతి డాక్టర్ బాలకృష్ణారెడ్డి క్రీడాకారులను అభినందించారు. -
పత్తి చేలల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపాలి
గరికపాడు కేవీకే శాస్త్రవేత్తలు రాజశేఖర్, శివప్రసాద్ పెనుగంచిప్రోలు: పత్తి చేలల్లో వర్షపునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గరికపాడు కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ శివప్రసాద్ రైతులకు సూచించారు. మండలంలోని వెంకటాపురం, శనగపాడు, పెనుగంచిప్రోలు గ్రామాల్లో బుధవారం పత్తి పంటలను పరిశీలించారు. పత్తి చేలల్లో వర్షపునీరు బయటకు పంపించిన వెంటనే 20 కేజీల యూరియా, 15 కేజీల పొటాష్‌ను కలిపి ఎకరాకు బూస్టర్ డోస్‌గా వేసుకోవాలని చెప్పారు. దీంతో పంట పెరుగుదల వస్తుందని తెలిపారు. నీరు తగ్గిన తర్వాత 19:19:19: ఎరువుల మిశ్రమాన్ని ఎకరానికి 1 కేజీ స్ప్రే చేసుకోవాలని, ఎండు తెగుల నివారణ కోసం కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములను నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. రసం పీల్చు పురుగులైన పేనుబంక, మైట్స్, త్రిప్స్ ఉన్నట్లయితే వేపనూనె 1000 పీపీఎం మందును 1 లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయాలన్నారు. వరి పంటలో 25 కేజీల యూరియా 15 కేజీల పొటాష్‌ను కలిపి వేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి.రామసుబ్బారెడ్డి, ఏఈఓ, వీఏఏలు రైతులు పాల్గొన్నారు. -
వేర్వేరు కేసుల్లో బంగారం దొంగలు అరెస్ట్
పటమట(విజయవాడతూర్పు): అత్యాశకు పోయి యజమాని ఇంటిలో బంగారు దొంగిలించిన వేర్వేరు కేసుల్లో నిందితులను పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై విజయవాడ కమిషనరేట్ సెంట్రల్ డివిజన్ ఏసీపీ దామోదర్, సీఐ పవన్ కిషోర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. గురునానక్‌నగర్‌లోని కనకదుర్గ గెజిటేట్ ఆఫీసర్స్ కాలనీలో నివాసం ఉండే దేవరకొండ తేజశ్రీ(24) శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలోని 5వ క్రాస్‌రోడ్డులో ఉండే అసుసుమిల్లి శివలీల ఇంటిలో పనిమనిషిగా చేరింది. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉన్న రూ.13లక్షల విలువ చేసే 40 గ్రాముల డైమండ్ గాజులు, 114 ఆభరణాలను దొంగింలించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితురాలిపై పటమట పోలీసులు నిఘా పెట్టగా ఆమె వద్ద ఉన్న నగలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. – అశోక్ నగర్, వెంకటప్పయ్య వీధిలో నివాసం ఉండే బైసాని జనార్ధన్ కుటుంబసభ్యులు కుమారుడి వివాహం అనంతరం జూలై 31వ తేదీన శ్రీశైలం వెళ్లగా, ఆగస్టు 1వ తేదీన ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఉన్నాయని పనిమనిషి సమాచారంతో పటమట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయగా బెంజ్ సర్కిల్, నర్మదా లాడ్జ్ దగ్గరలో, ఫ్లైఓవర్ పిల్లర్ నెంబర్:3, ఎన్‌హెచ్ –16 సర్వీస్ రోడ్డు మార్జిన్ లో నిందితుడిని అదుపులో తీసుకున్నామని పోలీసులు తెలిపారు. గుంటూరు అడవి తక్కెళ్లపాడుకు చెందిన ఉప్పల సురేష్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో ఉన్న 30 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.5 కేజీల వెండి వస్తువులు చోరీ చేయగా అతని వద్ద గుంటూరు జిల్లా పట్టాభిపురంలో దొంగతనం చేసిన 60 గ్రాముల బంగారు ఆభరణాలు, పల్నాడు జిల్లా వినుకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనం చేసిన 300 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు పాత నేరస్తుడని, అతనిపై ఉమ్మడి కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లాలో పలు కేసులు ఉన్నాయని, నిందితుడు జల్సాలకు అలవాటు పడి సుమారు 20 నేరాలకు పాల్పడ్డాడని చెప్పారు. సమావేశంలో మహిళా ఎస్ఐలు దుర్గా దేవి, రేవతి, ఏఎస్ఐ వి.గోపి, హెచ్.సి అబ్దుల్ రషీద్ కానిస్టేబుల్ నరేశ్, మహిళా కానిస్టేబుల్ సునీత పాల్గొన్నారు. -
ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి ఫొటో జర్నలిస్టులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, వాటిలో లోటుపాట్లు ఉంటే సరిదిద్దడంలోనూ ఫొటో జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. 186వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ (ఏపీపీజేఏ) ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు. వివిధ మోడళ్ల కెమెరాలను కలెక్టర్ క్లిక్ మనింపించారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలకు తొమ్మిది రాష్ట్రాల నుంచి స్పాట్ న్యూస్, జనరల్ కేటగిరీలో 552 ఫొటోలు రాగా 50 ఫొటోలకు బహుమతులు లభించాయి. విజేతలకు సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్‌కుమార్, కలెక్టర్ లక్ష్మీశ జర్నలిస్టు, ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ల ప్రతినిధులతో కలిసి అవార్డులు ప్రదానం చేశారు. ఏపీ సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. ఒక ఛాయాచిత్రం వేయి భావాల నేత్రమని, వేల కథనాలకు సరిసాటి అని పేర్కొ న్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్టు పి.వి.కృష్ణారావు, సీనియర్ ఫొటో జర్నలిస్టులు సీహెచ్.వి.మస్తాన్, సీహెచ్.నారాయణరావు, ఐ అండ్ పీఆర్ శాఖలో సీనియర్ ఫొటోగ్రాఫర్‌గా సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న వి.వి. ప్రసాద్‌ను సత్కరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
ఉత్సాహంగా 5కే మారథాన్ రెడ్ రన్
మధురానగర్(విజయవాడసెంట్రల్): యువతలో హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన పెంపొందించేందుకు మారథాన్ రెడ్ రన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ – టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ బి.భానూనాయక్ తెలిపారు. స్థానిక సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డులో మంగళవారం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ, నివారణ విభాగం, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఐదు కిలోమీటర్ల మారథాన్ పోటీలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ భానూనాయక్ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ శ్యాంసన్‌తో కలిసి మారథాన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. హెచ్ఐవీ బాధితులను ఆదరించాలని సూచించారు. పురుషులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ విభాగాల వారీగా పోటీలు నిర్వహించారు. 5కే మారథాన్ పోటీల్లో జిల్లాలోని పలు కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలు వీరే... ఈ పోటీలలో పి.వినయ్ (పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ – సైన్సు కళాశాల) ప్రథమ, వై.లక్ష్మీతిరుమలరావు (ఆంధ్ర లయోల కళాశాల) ద్వితీయ స్థానాల్లో నిలిచారు. మహిళా విభాగంలో ఎస్.నిషా(ఎస్డీఎం. సిద్ధార్థ మహిళా కళాశాల), వి.హన్నా (ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల) వరుసగా తొలి రెండు స్థానాలు సాధించారు. ట్రాన్స్‌జెండర్ విభాగంలో ఎం.రాజి ప్రథమ, బి.మాయ ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ పోటీలను ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వ్యాయామ విద్య విభాగాధిపతి యుగంధర్ సమన్వయం చేశారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.7వేలను త్వరంలో కలెక్టర్ చేతుల మీదుగా అందజేస్తామని డాక్టర్ భానూ నాయక్ తెలిపారు. -
నిత్యాన్నదానానికి పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు మంగళవారం విరాళాలను సమర్పించారు. పెనమలూరు మండలం కానూరు చనుమోలురావు నగర్‌కు చెందిన కొల్లి మోహనకృష్ణారెడ్డి, కొల్లి వీరవెంకటశివ ప్రసాద్‌రెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి శర్వరెడ్డి పేరిట రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. రామవరప్పాడుకు చెందిన కడియాల శాంతి సుభాష్ పేరిట నిత్యాన్నదానానికి రూ.1,00,008ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
26న ఆశ వర్కర్స్ యూనియన్ మహాసభ
మధురానగర్(విజయవాడసెంట్రల్): మైలవరంలో ఈ నెల 26వ తేదీన ఎన్టీఆర్ జిల్లా ఆశ వర్కర్స్ యూనియన్ ఆరో మహాసభ జరుగుతుందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి తెలిపారు. ఆశ వర్కర్ల యూనియన్ ఎన్టీఆర్ జిల్లా సమావేశం పి.జ్యోతి అధ్యక్షతన సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 20 ఏళ్లుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఆరోగ్యపరమైన సేవలు అందించ డంలో ఆశ వర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. షుగర్, బీసీ, లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ వంటి అనేక రకాల వ్యాధిగ్రస్తులకు, గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలకు ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. ఆశ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, పనిచేయని ఫోన్లు, సిమ్‌లు వంటి సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వకంగా జీఓలు ఇవ్వాలని, మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఆశ వర్కర్లకు వేతనాలు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.కమల, జిల్లా నాయకులు కె.బేబీరాణి, జి.దయామణి, పి.శ్రావణి, ఎస్.జోత్స్న, టి.రాజామణి కె.సైదమ్మ, వై.నాగలక్ష్మి ఎస్.హేమకుమారి, చిలకమ్మ పాల్గొన్నారు -
మంగళగిరిలో ఇన్నోవేషన్ హబ్
నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి మంగళగిరి టౌన్: యువతలోని వినూత్న ఆలోచనలను మెరుగుపట్టి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌ను మంగళగిరిలో ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నగర పరిధిలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న మయూరి టెక్ పార్క్‌లో ఈ హబ్ ఏర్పాటైంది. దీనిని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. యువతకు ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను సీఎం పరిశీలిస్తారని ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ సూర్యతేజ తెలిపారు. -
స్క్రబ్ టైఫస్.. అరుదైన జ్వరం
లబ్బీపేట(విజయవాడతూర్పు): సాధారణంగా వర్షాకాలంలో దోమ కాటు కార ణంగా మలేరియా, డెంగీ వంటి జ్వరాలు ప్రబలుతాయి. గడ్డి, పిచ్చి చెట్లలో పెరిగే సుట్సుగా ముషి కీటకం కుట్టిన వారికి స్క్రబ్ టైఫస్ జ్వరం సోకుతుంది. గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలువురు ఈ జ్వరాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. స్క్రబ్ టైఫస్ సోకిన వారు నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో పదేళ్ల బాలుడు తీవ్రమైన జ్వరంతో విజయవాడలోని ఓ ప్రైవేటు పిల్లల ఆస్పత్రిలో చేరాడు. రెండు రోజులైనా జ్వరం తీవ్రత తగ్గలేదు. డాక్టర్‌కు అనుమానం వచ్చి బాలుడి శరీరాన్ని నిశితంగా పరిశీలించగా ఓ మచ్చ కనిపించింది. వెంటనే పరీక్షలు చేయించగా బాలుడికి సోకింది స్క్రబ్ టైఫస్ జ్వరంగా తేలింది. గుంటూరు జిల్లాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి గత ఏడాది విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేరగా, వైద్య పరీక్షల్లో అతనికి సోకింది స్క్రబ్ టైఫస్‌గా తేలింది. అతనికి సకాలంలో వైద్య సేవలు అందడంతో ప్రాణాపాయం తప్పింది. స్క్రబ్ టైఫస్ కొన్నేళ్లుగా తరచుగా వింటున్న అరుదైన జ్వరం. విజయవాడలోని ప్రభుత్వాస్పత్రితో పాటు, పలు కార్పొరేట్ ఆస్పత్రులకు ఉమ్మడి జిల్లాతో పాటు, పొరుగు జిల్లాల నుంచి బాధితులు వస్తున్నారు. సాధారణ జ్వరంలా కనిపించే స్క్రబ్ టైఫస్‌ను సకాలంలో గుర్తించకుంటే ప్రాణాంతకమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తొలుత ఆకస్మిక జ్వరంతో ప్రారంభమై క్రమేణా లివర్, కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుందని, రక్తనాళాలు దెబ్బతినడం, తెల్ల రక్తకణాలపై ప్రభావం పడుతుందని వివరిస్తున్నారు. వ్యాధి ఎలా వ్యాపిస్తుందంటే దట్టమైన చెట్లు, వ్యవసాయ భూములు పక్కన నివశించే వారికి ఎక్కు వగా స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకు తుంది. గడ్డి, చెట్లు, పొలాల్లో ఉంటే సుట్సుగాముషి అనే కీటకం కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ కీటకాల్లో కొన్ని తీవ్రమైన ప్రభావం చూపుతాయి. కొందరికి కీటకం కుట్టిన వారం రోజుల వ్యవధిలో వ్యాధి సోకుతుంది. మరి కొందరిలో కొన్ని గంటల వ్యవధిలోనే తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు ఇలా... సుట్సుగాముషి కీటకం కుట్టిన వారిలో జ్వరం అకస్మాత్తుగా వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, చలి, కండరాల నొప్పి, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి. కళ్లు తిరగడం, మగత, వాంతులు కూడా అవుతుంటాయి. ఇలాంటి వారి శరీరంపై పరిశీలిస్తే కీటకం కుట్టిన ప్రాంతంలో నల్లటి మచ్చ కనిపిస్తుంది. ఈ వ్యాధిని నిర్ధారించేందుకు ఏలీసా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రభావం ఇలా.. స్క్రబ్ టైఫస్ సోకిన వారిలో అధిక జ్వరంతో పాటు, న్యూమోనైటీస్, తీవ్రమైన ఊపిరితిత్తుల గాయం, ఎక్యుట్రెస్పిరేటరీ డిస్ట్సెస్ సిండ్రోమ్ వంటి వాటికి గురవుతుంటారు. కిడ్నీలు పనిచేయకపోవడం, హృదయ కండరాల వాపు, సెప్టిక్ షాక్, అంతర్గత రక్తస్రావం, తెల్ల రక్తకణాలు తగ్గిపోవడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాలేయం, మూత్ర పిండాల పనితీరు అసాధారణ స్థితికి చేరకోవచ్చు. వ్యాధిని సకాలంలో గుర్తించి వైద్యం పొందడం ద్వారా ఎలాంటి ప్రభావం చూపకుండా బయటపడొచ్చు. కీటకం కుడితే శరీరంపై ఏర్పడే మచ్చ వ్యాధి కారక సుట్సుగాముషి కీటకం స్క్రబ్ టైఫస్ వ్యాధి మధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న వారికి సోకితే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. హెచ్ఐవీ రోగులకు సోకినా ప్రాణాంతకమే. చిన్నపిల్లలు, వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారికి వ్యాధి సోకితే ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి వారు తగిన సమయంలో చికిత్స పొందాల్సిన అవసరం ఉంది. -
ఫుడ్‌సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు
మధురానగర్(విజయవాడసెంట్రల్): కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్, లీగల్ మెట్రా లజీ ఆదేశాల మేరకు మంగళవారం నగరంలో పలు హోటళ్లు, స్వీట్ షాపులు, బేకరీలపై జాయింట్ ఫుడ్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ డెప్యూటీ కంట్రోలర్ ఆధ్వర్యాన విస్తృతంగా తనిఖీలు జరిగాయి. సత్యనారాయణపురం భగత్‌సింగ్‌రోడ్డులోని యూఎస్ బేక్ హౌస్‌లో ఫుడ్ కంట్రోలర్ ఎన్.పూర్ణచంద్రరావు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. బేక్ హౌస్‌లో కాలంచెల్లిన ఆహార పదార్థాలను, ఫ్రిజ్‌లో నాన్‌వెజ్ తోపాటు పాడైన బేకరీ పదార్థాలను నిల్వచేయడాన్ని, ఆహార పదార్థాల్లో రంగులను కలుపడాన్ని గుర్తించారు. కనీస పరిశుభ్రత లేకపోవటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బేకరీకి లైసెన్సు కూడా లేదని అధికారులు పేర్కొన్నారు. ఆహార పదార్థాల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబ్‌కు పంపించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. నగరంలో 20 బృందాలుగా ఏర్పడిన అధికారులు 39 హోటళ్లు, స్వీట్ షాపులు, బేకరీలను తనిఖీ చేశామన్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలను ఉల్లంఘించిన, పరిశుభ్రత పాటించని 13 వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేసి, నోటీసులు ఇచ్చారు. సుమారు 100 కిలోల నిల్వ ఉంచిన, పాడైన చికెన్‌ను పడేశారు. ల్యాబుల నుంచి ఫలితాలు వచ్చిన తదుపరి బాధ్యులపై ఫుడ్ సేఫ్టీ – స్టాండర్డ్స్ యాక్ట్, 2006 ప్రకారం చర్యలు తీసుకుంటామని పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. ఈ తనిఖీలలో వివిధ జిల్లాలకు చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, సహాయ ఆహార నియంత్రణాధికారులు, లీగల్ మెట్రోలాజీ అధికారులు పాల్గొన్నారు. -
కూటమి నిరంకుశానికి లక్ష్మి మృతి నిదర్శనం
మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్ కుమార్ పెదపూడి(మొవ్వ): కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు మేడం లక్ష్మి మృతి నిదర్శనమని, ఆమె మరణానికి సర్కారే కారణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే ౖకైలే అనిల్‌కుమార్ పేర్కొ న్నారు. పెన్షన్ తొలిగించారనే మనోవ్యథతో పెద పూడి గ్రామంలో దివ్యాంగురాలు మేడం లక్ష్మి మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి కైలే అనిల్‌కుమార్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్యాయంగా తన పెన్షన్ తొలగించారన్న మనోవ్యథతో లక్ష్మి మరణించటం బాధాకరమన్నారు. ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నది పరీవాహక ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలి పటమట(విజయవాడతూర్పు): నగరంలో కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం డ్యామ్ నుంచి మంగళవారం ఉదయం 5.5 లక్షల క్యూసెక్కుల వరద విడుదలవుతోందని, దీంతో హెచ్చరిక జారీ చేశారని తెలిపారు. పులిచింతల డ్యామ్ నుంచి కూడా వరద ప్రవాహం పెరుగుతోందని జలవనరుల శాఖ అధికారులు ప్రమాదక హెచ్చరికలు జారీ చేశారని వివరించారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని వివరించారు. బ్యారేజీ వద్ద వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరికకంటే ఎక్కువగా ఐదు లక్షల క్యూసెక్కులకు చేరుకుందని పేర్కొన్నారు. వరద ఆరు లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉన్నందున కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లోకి తరలి రావాలని కమిషనర్ సూచించారు. ఆయా ప్రాంతాల ప్రజలు వీఎంసీ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఐదు ఇసుక టిప్పర్ల పట్టివేత ఆటోనగర్(విజయవాడతూర్పు): ఇసుక తరలిస్తున్న ఐదు టిప్పర్ లారీలను విజయవాడ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. కృష్ణానదికి వరద వచ్చినప్పటికి పాత వీబీఎం డిగ్రీ కాలేజీ సమీపంలోని జంక్షన్ వద్ద ఇసుక తరలిస్తున్న లారీలను గుర్తించారు. లారీ డ్రైవర్లకు ట్రాఫిక్ ఎస్ఐ పి.రాజేంద్రబాబు కౌన్సెలింగ్ ఇచ్చారు. కృష్ణానదికి వరద వచ్చినా లారీల్లో ఇసుక ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు? అనుమతులు చూపాలంటూ ఎస్ఐ డ్రైవర్లను ప్రశ్నించారు. డ్రైవర్ల నుంచి సమాధానం రాకపోవడంతో ఒక్కో లారీకి రూ.2,035 జరిమానా విధించారు. వరద తగ్గేంత వరకు ఇసుక లారీలు, ట్రాక్టర్లు గాని రావడానికి వీలులేదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు. -
ఎలీసా టెస్ట్‌తో నిర్ధారణ
స్క్రబ్ టైఫస్ వ్యాధికి గురైన వారిని తరచూ చూస్తుంటాం. వ్యాధిని నిర్ధారించేందుకు ఎలీసా పరీక్ష అందు బాటులో ఉంది. స్క్రబ్ టైఫస్ వచ్చిన వారికి కచ్చితమైన యాంటిబయోటిక్ ఇవ్వడం ద్వారా నివారించవచ్చు. వ్యాధిని అశ్రద్ధ చేస్తే ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై ప్రభావం చూపి, ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఈ వ్యాధి వచ్చిన వారి శరీరంపై నల్లటి మచ్చలు ఉండటాన్ని గుర్తించవచ్చు. – డాక్టర్ టి.వి.మురళీకృష్ణ, జనరల్ మెడిసిన్ నిపుణుడు -
మహిళా సాధికారతే లక్ష్యం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ, సాధికారతే లక్ష్యంగా మహిళా కమిషన్ పనిచేస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. నగరంలోని కేబీఎన్ కళాశాలలో ‘మహిళల సంక్షేమం, భద్రత, రక్షణ, సాధికారతపై జిల్లా స్థాయి అవగాహన సమావేశం’ మంగళవారం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ సాధికారత సంస్థ, కేబీఎన్ కళాశాల ఉమెన్స్ స్టడీ సెంటర్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాయపాటి శైలజ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు సైబర్ నేరాల ముప్పు పొంచి ఉందన్నారు. మహిళలు డిజిటల్ భద్రతపై చైతన్యం పెంచుకోవాలని, అవసరమైన సమయంలో ప్రభుత్వ హెల్ప్‌లైన్స్, చట్టపరమైన రక్షణను ఉపయోగించుకోవాలని సూచించారు. బాలికలు, మహిళలపై అన్యాయాలు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యురాలు రాధాకుమారి, జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి షెక్ రుఖ్సానా సుల్తాన్ బేగం, మహిళా కమిషన్ కార్యదర్శి అనురాధ, కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి, కార్యదర్శి టి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణమ్మ దూకుడు
సాక్షి, ప్రతినిధి, విజయవాడ: కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. మంగళవారం ఉదయం 6గంటలకు 3.22 లక్షల క్యూసెక్కులు ఉన్న వరద నీరు సాయంత్రానికి 4.66లక్షలు, రాత్రికి 4.87లక్షలకు చేరింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు నుంచి వరద క్రమేపీ పెరగటంతో ఆ నీరు బ్యారేజీలోకి వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద 5 లక్షల నుంచి 6 లక్షలకు చేరుతుందన్న అంచనాతో కృష్ణా దిగువ ప్రాంతంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అధికారులకు సెలవులు రద్దు.. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వరద ప్రవాహం పెరగటంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను అప్రమత్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన క్షేత్ర స్థాయి అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతాలైన తోట్లవల్లూరు, పెనమలూరు, కోడూరు, నాగాయలంక తదితర మండలాలు.. బుడమేరు పరీవాహక ప్రాంతంలోని మండలాల అధికారులు, సిబ్బంది పనిచేసే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదల నియంత్రణకు వచ్చేంతవరకు ఎవరికీ ఎటువంటి సెలవులు ఉండవని స్పష్టం చేశారు. వరద నీరు 6 లక్షల క్యూసెక్కులకు దాటితే లంక గ్రామాల్లోని ప్రజలను తప్పనిసరిగా సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలన్నారు. ఇందుకోసం అవసరమైన పడవలను సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ● ఎస్పీ గంగాధర్ రావు మాట్లాడుతూ రాత్రి సమయంలో వరద నీటి పరిస్థితి ఎలా ఉందో తెలియక కాజ్‌వేలు దాటేందుకు కొందరు ప్రజలు ప్రయత్నిస్తుంటారని అక్కడ తప్పనిసరిగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. ● జల వనరుల శాఖ ఎస్ఈ మోహన్‌రావు మాట్లాడుతూ వరద ప్రవాహం 5.66 లక్షల క్యూసెక్కులకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తామన్నారు. సమావేశంలో జేసీ గీతాంజలి శర్మ, డీఆర్ఓ కె. చంద్రశేఖరరావు, జిల్లా అధికారులు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద బ్యారేజీ నుంచి 4.87లక్షలు క్యూసెక్కులు దిగువకు విడుదల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు స్థానికంగా వర్షం తగ్గుముఖం పట్టడంతో కొంత ఉపశమనం ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మునేరు ఉద్ధృతి తగ్గింది. మునేరుతో పాటు, స్థానిక వాగుల నుంచి 25వేల క్యూసెక్కుల నీరు మాత్రమే కృష్ణా నదికి వచ్చి చేరుతోంది. చిరు జల్లులు మాత్రమే కురవడంతో విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. బుడమేరు వరద నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు పడవలను సిద్ధం చేశారు. ప్రస్తుతం వస్తున్న వరదకు చెవిటికల్లు వద్ద ఉన్న గనిఅతుకులంక చుట్టూ నీరు చేరడంతో అక్కడి వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని చిన్నలంక, జూపూడి లంక, మూలపాడు, త్రిలోచనపురం లంకల్లోకి వరద నీరు చేరింది. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవలపైన ప్రయాణాలు చేస్తున్నారు. -
ఫీజులు లేకుండా అనుమతులివ్వండి
డీజీపీని కోరిన ఏపీ గణేష్ ఉత్సవ సమితి కృష్ణలంక(విజయవాడతూర్పు): స్థానిక రాణిగారితోటలో జాతీయ రహదారి పక్కన అన్న క్యాంటీన్‌ను మంత్రి సవిత మంగళవారం సందర్శించారు. అక్కడ పరిసరాలను, పాత్రలు శుభ్రం చేసే గదిని పరిశీలించారు. లైన్లో నిల్చొని రూ.5ల టోకెన్ తీసుకుని భోజనం చేశారు. తనతో పాటు భోజనం చేస్తున్న వారిని అప్యాయంగా పలకరించారు. అన్న క్యాంటీన్‌ను, ఎప్పటికప్పుడు ఆహార పదార్థాల పాత్రలను, ప్లేట్లను శుభ్రం చేస్తున్న సిబ్బందిని మంత్రి అభినందించారు. విజయవాడలీగల్: మాజీ సైనిక ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారం నిమిత్తం వీర పరివార్ సహాయక యోజన పేరుతో లీగల్ సర్వీస్ క్లినిక్‌ను కృష్ణాజిల్లా ప్రిన్సిపల్ జడ్జి, జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్ గుట్టల గోపీ మంగళవారం ప్రారంభించారు. నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోని మాజీ సైనికుల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డిఫెన్స్‌లో పనిచేసిన మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు న్యాయసేవలు త్వరితగతిన అందించే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశామన్నారు. మండల న్యాయ సేవాధికారి, రెండో అదనపు జిల్లా జడ్జి ఏ. సత్యానంద మాట్లాడుతూ న్యాయ సహాయక క్లినిక్‌లో ప్రతి శనివారం మాజీ సైనిక ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ కేవీ రామకృష్ణయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఏసీబీ కోర్టు జడ్జి పి. భాస్కరరావు, బెజవాడ బార్ అధ్యక్షుడు ఏకే బాషా తదితరులు పాల్గొన్నారు. నాగాయలంక: స్థానిక శ్రీరామ పాదక్షేత్రం ఘాట్‌లోని శ్రీగంగ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి మండపంలోని స్వామివారి శివలింగానికి మంగళవారం ప్రదోషకాలంలో 108 కేజీల పసుపు కొమ్ములతో మహాభిషేకం జరిపారు. శ్రావణమాసం బహుళ ఏకాదశి, ఆఖరి మంగళవారం విశిష్టతను పురస్కరించుకొని భక్తులు, దాతలు సమర్పించే పసుపు కొమ్ములతో ఈ అభిషేకం, అర్చన జరిపారు. -
క్షమాపణ చెప్పే వరకు ఆందోళన ఆగదు
మచిలీపట్నంటౌన్: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరించారు. నగరంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహం వద్ద జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి గుమ్మడికాయతో దిష్టి తీసి టెంకాయలు కొట్టారు. ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దహనం చేశారు. ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ చిత్రపటాన్ని చెప్పుతో కొడుతున్న జూ.ఎన్టీఆర్ అభిమానులు -
వికలాంగ పింఛన్‌దారులకు ‘పర్సంటేజీ’ల షాక్!
● పింఛన్లు ఎత్తివేసేందుకు కొత్త డ్రామాలు ● మరోసారి సదరం సర్టిఫికెట్ తెచ్చుకోవాలని మెలిక ● వికలాంగత్వం తక్కువగా ఉందని చూపిస్తూ రద్దు చేస్తున్న వైనం ● తెరపైకి నూతన నిబంధనలు ● గగ్గోలు పెడుతున్న లబ్ధిదారులు మంచానికే పరిమితమైన వారు, కండరాల క్షీణత, రెండు కాళ్లు ఏనుగు కాళ్లలా ఉండటం, పక్షవాతం వచ్చిన వారికి వికలాంగ పింఛన్ అందజేస్తున్నారు. కనీసం 40శాతం, ఆపైబడి వికలాంగత్వం ఉన్నవారికి రూ. 6వేలు, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ. 15వేలు ఇస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అర్హులకు కూడా సర్వేలు నిర్వహించి ఏదో ఒక సాకుతో రద్దు చేసే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా లబ్ధిదారులు నోటీసులు జారీ చేస్తూ.. రూ.15వేల పింఛన్‌ను రూ. 6వేలకు మార్పు చేయటం చేస్తోంది. చిలకలపూడి(మచిలీపట్నం): కూటమి ప్రభుత్వం వికలాంగ పింఛన్‌దారులకు కుచ్చుటోపీ పెట్టింది. పింఛన్ నగదు పెంచినట్లే పెంచి.. ఇప్పుడు పర్సంటేజీల షాక్ ఇస్తోంది. కొత్త పంథాలో ముందుకు వెళ్తూ.. మొత్తానికి పింఛన్నే రద్దు చేస్తోంది. కొత్తగా సదరం పరీక్షలు చేయించుకోవాలని చెప్పి, ఆ పరీక్షల్లో వికలాంగత్వం తక్కువగా ఉందని సాకులు చూపుతూ వారి పింఛన్లు ఎగ్గొట్టేస్తోంది. ఏళ్లుగా పింఛను పొందుతున్న వారికి కొత్త నిబంధనల పేరుతో అర్ధాంతరంగా మొండిచేయి చూపి.. వారిని నడిరోడ్డుపై నిలబెడుతోంది. రద్దయినట్లు నోటీసులు.. కృష్ణా జిల్లాలో ఆగస్టు 1వ తేదీన రూ.15వేలు పింఛన్ పొందుతున్న వారు 1,280 మంది ఉన్నారు. వీరిలో 482 మందికి మీ పింఛన్‌ను రూ. 6 వేలుగా మార్పు చేస్తున్నట్లు నోటీసులు అందజేశారు. మరికొంత మందికి మీ వికలాంగత్వం తాత్కాలికమైందని పింఛన్ రద్దు చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. ఎటువంటి పనిచేయలేని తాము పింఛన్ సొమ్ము రాకుంటే ఎలా జీవించాలని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. కోతల పింఛన్.. ఎన్నికల సమయంలో బాహాటంగా హామీలిచ్చి, నేడు అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీల్లో కోత విధించేలా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. దీనిలో భాగంగా నెలకు రూ. 15 వేలు పింఛన్ ఇచ్చే లబ్ధిదారులపై వేటు వేసేందుకు నిర్ణయించింది. జిల్లాలో 1280 మంది లబ్ధిదారులు రూ.15వేలు పింఛన్ తీసుకుంటున్నారు. వీరిలో ప్రస్తుతం సర్వే నెపంతో 482 మందిని రూ.15వేలు పింఛన్‌కు బదులుగా రూ.6వేలకు మార్పు చేశారు. మరికొంత మంది లబ్ధిదారులకు పక్షవాతం, ప్రమాదంలో పూర్తిగా వైకల్యం ఉండి మంచానికి పరిమితమైన వారికి మాత్రమే ఇస్తామని చెప్పి వారిని తొలగించింది. అన్ని అర్హతలు ఉన్న తమకు ఏళ్లుగా పింఛన్ ఇస్తూ.. అర్ధాంతరంగా తొలగించటం ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. రూ.6వేలు తీసుకునే వారికి కూడా.. మరో పక్క రూ. 6 వేలు పింఛన్ తీసుకుంటున్న వారిపై కూడా కోత విధిస్తోంది. 40 శాతం కంటే వికలాంగత్వం ఎక్కువ ఉంటేనే రూ. 6 వేలు వస్తుందని, మరలా సదరం సర్టిఫికెట్ సమర్పిస్తేనే పింఛన్‌ను కొనసాగిస్తామని లేకుంటే పింఛన్‌ను రద్దు చేస్తామంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. రీ–వెరిఫికేషన్ పేరుతో అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు తొలగిస్తున్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అర్హత ఉండి పింఛన్ తొలగిస్తున్నారని దివ్యాంగుల్లో ఆందోళన మొదలైంది. జిల్లా వ్యాప్తంగా తొలగించిన పింఛన్ల వివరాలను సేకరిస్తున్నామని ఆ జాబితాను కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం. అప్పటికీ స్పందించకుంటే వికలాంగుల పింఛన్ల పునరుద్ధరణకు ఉద్యమిస్తాం. – ఎన్ఎస్ నారాయణ, జిల్లా కార్యదర్శి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక -
కొనసాగుతున్న ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రకాశం బ్యారేజ్ వద్ద ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా ప్రకాశం బ్యారేజ్‌కి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. మంగళవారం రాత్రి 10 గంటలకు బ్యారేజ్‌కు 4,92,357 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. ఇందులో 4,87,194 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలివేస్తున్నారు. ఈస్ట్, వెస్ట్ కాలువలకు 4,849 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యారేజ్‌కు మరింత వరద వచ్చే అవకాశం ఉందని, పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లాలో 14.46 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం.. ఎన్టీఆర్ జిల్లాలోని 20 మండలాల్లో 14.46 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గంపలగూడెంలో 42.8మిల్లీమీటర్లు, ఏ కొండూరులో 33.4, విస్సన్నపేటలో 32.6, తిరువూరులో 28.8, వత్సవాయిలో 22.2, రెడ్డిగూడెంలో 18.2, వీరులపాడులో 16.8, పెనుగంచిప్రోలులో 12.8, జి కొండూరులో 12.8, జగ్గయ్యపేటలో 11.8, ఇబ్రహీంపట్నంలో 10.6, కంచికచర్లలో 7.0, విజయవాడ రూరల్‌లో 6.0, ఈస్ట్‌లో 5.8, సెంట్రల్లో 5.4, వెస్ట్‌లో 5.4, నందిగామలో 3.6, చందర్లపాడులో 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
స్టేషన్ ఆధునికీకరణ.. పలు రైళ్ల రద్దు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఖరగ్‌పూర్ డివిజన్లోని షాలీమార్ స్టేషన్లో జరుగుతున్న స్టేషన్ ఆధునికీకరణ పనుల కారణంగా విజయవాడ మీదుగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగాను, మరికొన్నింటిని పాక్షికంగానూ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.రద్దు చేసిన రైళ్లు ఇవే..చర్లపల్లి–షాలీమార్ (18046) నవంబర్ 19, 21, షాలీమార్–చర్లపల్లి (18045) నవంబర్ 20, 21, షాలీమార్–సికింద్రాబాద్ (22849) నవంబర్ 12, 19, సికింద్రాబాద్–షాలీమార్ (22850) నవంబర్ 14, 21, తిరువనంతపురం–షాలీమార్ (22641) నవంబర్ 13, 15, షాలీమార్–తిరువనంతపురం (22642) నవంబర్ 16, 18, షాలీమార్–వాస్కోడిగామా (18047) నవంబర్ 17, వాస్కోడిగామా–షాలీమార్ (18048) నవంబర్ 20, షాలీమార్–చైన్నె సెంట్రల్ (02841) నవంబర్ 10, 17, చైన్నె సెంట్రల్–షాలీమార్ (02842) నవంబర్ 12, 19, నాగర్‌కోయల్–షాలీమార్ (12659) నవంబర్ 16, షాలీమార్–నాగర్‌కోయల్ (12660) నవంబర్ 19 తేదీల్లో పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు.పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు..చైన్నె సెంట్రల్–షాలీమార్ (22826) అక్టోబర్ 29, నవంబర్ 12, 19 తేదీల్లోనూ, వాస్కోడిగామా–షాలీమార్ (180480) అక్టోబర్ 31, నవంబర్ 13, 16, 18 తేదీల్లో సంత్రగచ్చి–షాలీమార్ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు. అదే విధంగా షాలీమార్–చైన్నె సెంట్రల్ (12841) నవంబర్ 13 నుంచి 24 వరకు హౌరా–సంత్రగచ్చిల మధ్య పాక్షికంగా రద్దు చేశారు. -
పోలీస్ గ్రీవెన్స్‌కు 57 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితుల నుంచి 57 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె దివ్యాంగులు, వృద్ధుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు తీసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా తమకు వచ్చిన ఫిర్యాదుల అంశాలను సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలకు తెలియజేస్తూ సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 35, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి 4, కొట్లాటలపై 4, దొంగతనాలపై 3, చిన్న వివాదాలకు సంబంధించి 9, వివిధ మోసాలకు సంబంధించి, మహిళా సంబంధిత నేరాలపై ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదులు అందినట్లు డీసీపీ ఉదయరాణి తెలిపారు. -
వైఫల్యాలు బహిర్గతం అవుతాయనే భయం
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోకి విద్యార్థి సంఘాల ప్రవేశంపై కూటమి ప్రభుత్వం జారీ చేసిన నిషేధపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దగల అంబేడ్కర్ విగ్రహం ముందు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిరసన ధర్నా నిర్వహించారు. విద్యార్థి నేతలు అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రవిచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల్లోనే విద్యారంగాన్ని నీరుగార్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే విద్యార్థి సంఘాలను ప్రభుత్వ విద్యాసంస్థ ల్లోకి రాకుండా చీకటి ఉత్తర్వులు ఇచ్చిందని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలతో సమావేశాలు నిర్వహించిన లోకేష్ నేడు ఇలాంటి ఉత్తర్వులను ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పోరాటాలు చేసేది విద్యార్థి సంఘాలే.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసేది విద్యార్థి సంఘాలేనని రవిచంద్ర తెలిపారు. మెగా పేరెంట్, టీచర్ మీటింగ్‌లను రాజకీయ ఈవెంట్లుగా మార్చిన ఘనత చంద్రబాబు, లోకేష్లదేనని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి, సహాయ కార్యదర్శి బి. కొండలరావు, జిల్లా అధ్యక్షుడు జె. కోమల్ సాయి పాల్గొన్నారు. -
సాక్షి ఫొటో జర్నలిస్టులకు అవార్డులు
ఫొటోగ్రాఫర్ రూబేన్ తీసిన చిత్రంప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ–2025 పోటీల్లో సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు లభించాయి. సోమవారం విజయవాడ బాలోత్సవ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఫొటో జర్నలిజం విభాగంలో వి.రూబెన్ బెసాలియల్ స్పెషల్ అచీవ్మెంట్ అవార్డు కింద గోల్డ్‌మెడల్, నగదు, సర్టిఫికెట్ అందుకోగా, నడిపూడి కిషోర్ సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్, నగదు బహుమతి అందుకున్నారు. – కృష్ణలంక(విజయవాడతూర్పు)ఫొటోగ్రాఫర్ కిషోర్ తీసిన చిత్రం -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సీఎం చంద్ర బాబు ఇచ్చిన హామీ మేరు బీసీలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజు డిమాండ్ చేశారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లపై హామీని అమలు చేయా లని కోరుతూ బీఎస్పీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బచ్చలకూర పుష్పరాజు మాట్లాడుతూ.. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. ఎన్నికలు వచ్చిన ప్రతి సారీ చంద్రబాబు వాగ్దానాలతో బీసీలను మభ్య పెడుతున్నారని దుయ్యబట్టారు. బీసీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఎరగొర్ల ఉదయ్‌కిరణ్ యాదవ్, దొండపాటి శామ్యూల్ కుమార్, కె.వి. కోటేశ్వరరావు, దాసరి కృష్ణ, మల్లాది అశోక్, కె.వి.రత్నం, గాలంకి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సామూహిక వరలక్ష్మి వ్రతాలకు దరఖాస్తుల స్వీకరణ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఈ నెల 22వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆచరించనున్నారు. అమ్మ వారి సన్నిధిలో జరిగే ఈ వ్రతాల్లో పాల్గొనే మహిళలకు దేవస్థానం ఉచితంగా దరఖాస్తులను పంపిణీ చేస్తోంది. మంగళవారం వరకు భక్తులకు దరఖాస్తులు అందజేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను 20వ తేదీ సాయంత్రానికి దేవస్థానం టోల్‌ఫ్రీ కౌంటర్లో అందజేయాలని సూచించారు. తెల్లరేషన్ కార్డు కలిగిన భక్తులు తమ రేషన్ కార్డు జిరాక్స్ కాపీని కౌంటర్లో చూపించి దరఖాస్తును పొందాలని పేర్కొన్నారు. 22వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సామూహిక వరలక్ష్మీవ్రతం ప్రారంభమవుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. వ్రతం అనంతరం భక్తులకు దేవస్థానం ప్రసాదం కిట్లను అందజేస్తుంది. వ్రతంలో పాల్గొన్న మహిళలకు రూ.100 క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. మనిషి ఉన్నతికి మూలం విద్య మైలవరం: మనిషి ఉన్నతికి మూలం విద్య అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ సంయుక్త సంచాలకుడు, గిరిజన శాఖ ట్రైకార్ మేనేజింగ్ డైరెక్టర్ సి.ఎ.మణికుమార్ పేర్కొన్నారు. వార్షిక తనికీల్లో భాగంగా సోమవారం మైలవరంలోని శ్రీలీలావతి గిరిజన పాఠశాలను ఆయన సోమ వారం సందర్శించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. చదువులో రాణించడానికి భాషాభేదాలు, వర్గవైషమ్యాలు అడ్డురావన్నారు. అట్టడుగు వారు కూడా చదువు ద్వారా అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. ఇంగ్లిష్, లెక్కలు, సైన్స్ సబ్జెక్టులపై విద్యార్థులు పట్టు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఉడతా లక్ష్మీనారాయణ, కార్యదర్శి జంజనం రాధాకుమారి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజీకి నిలకడగా వరద గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి వరద నిలకడగా కొనసాగుతోంది. బ్యారేజీకి 2,51,783 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీనిలో 2,48,450 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలివేస్తున్నారు. మరో 3,333 క్యూసెక్కులు కాలువలకు మళ్లిస్తున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో 2,90,122 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, సాయంత్రానికి స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం నిలకడగా సాగుతోంది. సోమవారం ఎన్టీఆర్ జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 3.03 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మంగ ళవారం ఉదయానికి నీటి ప్రవాహం ఐదు లక్షల క్యూసెక్కులకు చేరుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. -
విజయవాడ జీజీహెచ్‌లో అరుదైన ఈఎన్టీ సర్జరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ జీజీహెచ్ ఈఎన్టీ విభాగంలో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తిరువూరు మండలం వావిలాల గ్రామానికి చెందిన 48 ఏళ్ల చిన్న కృష్ణయ్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. వైద్యులు అత డిని పరీక్షలు నిర్వహించి, ముక్కు శ్వాసనాళంలో కణితి ఉందని, సర్జరీ చేసి తొలగించాలని నిర్ధారించారు. దీంతో ఈ నెల ఆరో తేదీన రోగికి ఫేషియల్ రీజియన్‌ను ఓపెన్ చేసి ముక్కునాళంలో ఉన్న ఐదు సెంటీమీటర్ల కణితిని తొలగించారు. ఇది చాలా అరుదైనదిగా వైద్యులు పేర్కొన్నారు. శస్త్ర చికిత్స నిర్వహించిన ఈఎన్టీ వైద్యులు రవి, డాక్టర్ లీలాప్రసాద్ తదితరులను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు అభినందించారు. -
అధికారుల పనితీరు భేష్
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లా అధికా రుల పనితీరు భేష్ అని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అభినందించారు. వారి సమష్టి కృషితోనే మెగా ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించగలి గామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఉత్తమ ఫలితాల సాధనకు సమర్థవంతమైన అధికారులు, సిబ్బంది పాత్ర కీలకమని పేర్కొన్నారు. కలెక్టరేట్లో స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి విధి నిర్వహ ణలో ఉత్తమ పనితీరు కనబరిచిన 376 మంది అధికారులు, సిబ్బంది, పోలీసు అధికారులకు ప్రశంసాపత్రాలను సోమ వారం అందజేశారు. మున్ముందు ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావా లని కలెక్టర్ ఆకాంక్షించారు. అవార్డులు అందుకున్న ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, కళాకారులు ఇలా ప్రతిఒక్కరి భాగస్వామ్యం ఉందని, వారి సేవలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అవార్డుల ప్రదానం కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, విజయవాడ, నందిగామ, తిరువూరు ఆర్డీఓలు కావూరి చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం శాఖల వారీగా అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం పాల్గొన్నారు. -
అర్జీలు పునరావృతం కాకుండా చూడాలి
పీజీఆర్ఎస్లో కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని, నిర్ధిష్ట సమయంలో నాణ్యతతో వాటికి పరిష్కారం చూపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, పలువురు అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో మంచి ఫలితాలు సాధించాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలకు సంబంధించిన అర్జీలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఆదేశించారు. నిర్ధిష్ట గడువులోగా ఆ అర్జీలను పరిష్కరించేందుకు బృంద స్ఫూర్తితో పనిచేయాలని స్పష్టంచేశారు. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా నిబద్ధతతో, అర్జీల పరిష్కారానికి కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. అర్జీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రూపంలోనూ నిర్లక్ష్యం, కనిపించకూడదని స్పష్టం చేశారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారంచూపితే ఆ అర్జీలు పునరావృతం కావని పేర్కొన్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పీజీఆర్ఎస్కు 93 అర్జీలు ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమంలో మొత్తం 93 అర్జీలు అందాయని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 25 అర్జీలు అందాయి. మిగిలిన అర్జీలు ఆయా శాఖల వారీగా అందాయి. ఎంఏయూడీకు సంబంధించి 13, విద్య 10, పోలీస్ శాఖకు 9, హెల్త్ 7, ఇరిగేషన్ 4, విభిన్న ప్రతిభావంతులు 3, డీఆర్ డీఏ 3, ఇంటర్మీడియెట్ విద్య 3, పంచాయతీ రాజ్ 3, విద్యుత్ 2, పౌరసరఫరాలు 2, బ్యాంకు సేవలు 2 అర్జీలు వచ్చాయి. వ్యవసాయం, కళాశాల విద్య, ఎండోమెంట్, హౌసింగ్, మార్కెటింగ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రహదారులు భవనాలు (ఆర్ అండ్ బీ) శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ చొప్పున వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కేఆర్‌సీసీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఎ.పోసిబాబు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.పంట తీసుకెళ్లి డబ్బులు ఇవ్వడం లేదు జి.కొండూరు మండలం వెలగలేరు పరిసర గ్రామాల రైతులు ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన హైబ్రీడ్ విత్తనాల కోసం పంట సాగు చేశారు. కంపెనీ నిబఽంధనల మేరకు పంట పండించారు. కమీషన్ బ్రోకర్ల మాటలు నమ్మి పండిన పంటను అదే కంపెనీకి విక్రయించారు. రైతులకు రావాల్సిన డబ్బులు రెండు మూడు రోజుల్లో చెల్లిస్తామని చెప్పి నమ్మబలికారు. రైతులకు చెక్కులు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వలేదు. రైతులకు రూ.20 లక్షల వరకు రావాల్సి ఉందని తాడేపల్లికి చెందిన జమలయ్య పలువురు బాధిత రైతులతో కలిసి జేసీకి వినతి పత్రం అందజేశారు. -
ఉద్యోగ భద్రతపై భయాందోళన
ఏపీటీడీసీ యూనిట్లను ప్రైవేటీకరణ చేస్తే వచ్చే సంస్థలు కొన్ని దశాబ్దాలుగా పని చేస్తున్న తమను విధుల్లో కొనసాగనిస్తాయా అని కాంటాక్ట్/మ్యాన్‌పవర్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు ఇటీవల విజయవాడలోని ఏపీటీడీసీ ప్రధాన కార్యాలయంలో ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. పర్యాటక శాఖకు లీజుల పేరుతో ఇప్పటికే బకాయిలు ఉన్న సుమారు రూ.63 కోట్లను వసూలు చేయలేని ప్రభుత్వం కొత్తగా ఇచ్చే లీజు సొమ్మును క్రమం తప్పకుండా వసూలు చేయగలదా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించటం గమనార్హం. -
అక్రమ బిల్లుల నైవైద్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): బెజవాడలో మెడికల్ మాఫియా దందా సాగిస్తోంది. జబ్బు చేస్తే వైద్యానికి డబ్బులు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఉదారంగా ఇచ్చే సాయాన్ని సొమ్ము చేసుకుంటోంది. సచివాలయంలోని ముఖ్య మంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న కొందరు వ్యక్తులు లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్ఓసీ)ల దందా సాగిస్తున్నారు. వైద్యం పొందకుండానే ఆస్పత్రుల నుంచి బిల్లులు తెచ్చుకుంటే రీయింబర్స్ మెంట్ (సీఎంఆర్ఎఫ్) ఇప్పిస్తామంటూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. కమీషన్ కొట్టు.. ఎల్ఓసీ పట్టు వైద్యానికి అయ్యే ఖర్చులకు ప్రభుత్వం నుంచి ఎల్ఓసీ తీసుకొచ్చేందుకు కొందరు వ్యక్తులు 20 నుంచి 30 శాతం వరకూ కమీషన్ దండుకుంటున్నారు. విజయవాడలోని రెండు మూడు ఆస్పత్రుల కేంద్రంగా ఈ దందా సాగిస్తున్నారని, రోజుకు నాలుగైదు ఎల్ఓసీలు వాటికే ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని ఎల్ఓసీలు ఎమ్మెల్యేల లేఖలు లేకుండానే తీసుకొస్తున్నట్లు తెలిసింది. కొందరైతే ఎమ్మెల్యే లేఖలు కూడా తామే తెస్తామని బేరం కుదుర్చుకుంటున్నారు. రోగి స్వచ్ఛందంగా వెళ్తే, ఆస్పత్రి నిర్వాహకులు ఇచ్చిన అంచనా వ్యయంలో 40 శాతానికే ఎల్ఓసీ ఇస్తున్నారని, ఈ ముఠా సభ్యులు 60 శాతం వరకూ తీసుకొస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. చికిత్స అనంతరం వీళ్లు తీసుకొచ్చిన ఎల్ఓసీలకు సంబంధించిన బిల్లులు సైతం వెంటనే ఇప్పించేందుకు ఆస్పత్రుల నుంచి సైతం కమీషన్లు తీసుకుంటున్నారు. నిజాయ తీగా వైద్యం చేసిన ఆస్పత్రులకు నాలుగు, ఐదు నెలలకు కూడా బిల్లులు రావడం లేదని, కానీ కమీషన్ ఇచ్చిన వారికి నెలా రెండు నెలల్లోనే వచ్చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిశీలన ఏదీ..? ఆరోగ్య శ్రీలో చికిత్స అందించాలంటే నిపుణుల కమిటీ పరిశీలన తప్పని సరి. ఎల్ఓసీల జారీలో నిపుణుల పరిశీలన లేకుండానే ఆస్పత్రులు ఇచ్చే అంచనా వ్యయాన్ని ఇచ్చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక రోగికి ఎల్ఓసీ ఇస్తే చికిత్స అనంతరం ఆస్పత్రులు పెట్టే బిల్లులను కూడా సరిగ్గా పరిశీలించకుండానే మంజూరు చేయడంతో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయని సీనియర్ వైద్యులు పేర్కొంటున్నారు. సరైన పరిశీలన లేకపోవడంతో ప్రభుత్వం ఉదారంగా ఇచ్చే సాయంలో సగం దళారుల జేబుల్లోకి వెళ్తోందని వివరిస్తున్నారు. ప్రభుత్వానిదే బాధ్యత పేద రోగుల వైద్యం కోసం ఇచ్చే ఎల్ఓసీలకు కమీషన్లు దండుకునే ముఠా సభ్యులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు సూచించారు. ఒకే ఆస్పత్రి నుంచి ఎక్కువగా ఎల్ఓసీలు ఇస్తున్నప్పుడు కనీసం స్పెషాలిటీ, సూపర్స్ఫెషాలిటీ నిపుణులతో వాటిని పరిశీలించాలని, వైద్యం కోసం ఉదారంగా ఇచ్చే సాయం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని పేర్కొన్నారు. వైద్యం చేయకుండానే బిల్లులు కొన్ని ఆస్పత్రులు అక్రమ సంపాదనే లక్ష్యంగా వైద్యం చేయకుండానే చేసినట్లు అడిగినంత మొత్తానికి బిల్లులు ఇచ్చేస్తున్నాయని, అందులో 30 నుంచి 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ బిల్లులను సీఎంఆర్ఎఫ్, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రీయింబర్స్‌మెంట్‌కు వాడుతున్నట్లు తెలిసింది. ఇన్సూరెన్స్ ఉన్న వారు ఆస్పత్రిలో చేరకుండానే చేరినట్లు చూపించి వైద్యానికి అనుమతి తీసుకుంటున్నారని, అలా రూపొందించిన దొంగ బిల్లులతో ఆ ఇన్సూరెన్స్ సంస్థ నుంచి వచ్చిన మొత్తంలో రోగి, ఆస్పత్రి నిర్వాహకులు పంచు కుంటున్నారని, ఈ తరహా దందాలు విజయవాడ సీతారామపురం సమీపంలోని ఓ ఆస్పత్రిలో ఎక్కువగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరిన్ని ఆస్పత్రులు ఇదే మార్గంలో ఉన్నట్లు సమాచారం. -
నూతన బార్ పాలసీ నోటిఫికేషన్ జారీ
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూతన బార్ పాలసీకి నోటిఫికేషన్ జారీ అయ్యిందని, ఆసక్తి కలిగిన వారు ఈ నెల 26వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. మాచవరంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో సోమ వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 31వ తేదీతో బార్ల లైసెన్సు పూర్తవుతుందన్నారు. కొత్త లైసెన్సు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మూడేళ్లపాటు ఉంటుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఓపెన్ కాంపిటీషన్లో 130, కృష్ణా జిల్లాలో 39 చొప్పున మొత్తం 169 బార్ల లైసెన్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నూతన బార్ పాలసీ ప్రకారం ఉదయం పది నుంచి రాత్రి 12 గంటల వరకు విక్రయాలు చేసుకోవచ్చని వివరించారు. గతంతో పోలిస్తే రెండు గంటల సమయం పెరిగిందన్నారు. బార్లకు దరఖాస్తు చేసుకోవటానికి అప్లికేషన్ ఫీజు రూ.5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలు చెల్లించాలని స్పష్టంచేశారు. ఈ నెల 28న కలెక్టరేట్లో లాటరీ తీస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. గీత కులాలకు 10 బార్లు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నూతన బార్ పాలసీ 2025–28లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో జనరల్ కేటగిరీలో 130 బార్లు, గీత కులాల వారికి ప్రత్యేకంగా పది బార్లు కేటాయించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ లక్ష్మీశ గెజిట్ విడుదల చేశారు. కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ లక్ష్మీశ లాటరీ నిర్వహించారు. గీత కులాలకు కేటాయించిన పది షాపుల్లో గౌడ్ కులానికి మూడు, గౌడ కులానికి ఏడు బార్లు చొప్పున లాటరీ ద్వారా ఎంపిక చేశారు. గీత కులాల వారికి ప్రత్యేకంగా విజయవాడలో 9 బార్లు, కొండపల్లిలో ఒకటి కేటాయించారు. వీటికి వార్షిక లైసెన్సు ఫీజు విజయవాడలో రూ.37.50 లక్షలు, కొండపల్లిలో రూ.17.50 లక్షలుగా నిర్ణయించారు. ఈ నెల 28న కలెక్టరేట్లో బార్లు కేటాయించేందుకు లాటరీ తీయనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబీషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసరావు, గీత కులాల పెద్దలు పలువురు పాల్గొన్నారు. -
ఎరువులు పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఎరువులు పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్ లక్ష్మీశ.. వ్యవసాయ, సహకార, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కొరత అనే మాటకు ఆస్కారం లేకుండా సమృద్ధిగా ఉన్నాయన్నారు. పక్కదారి పట్టకుండా, ప్రతి రైతుకూ న్యాయబద్ధంగా ఎరువులు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం 6,388టన్నుల యూరియాతో పాటు డీఏపీ, ఎంవోపీ, ఎస్ఎస్పీ కాంప్లెక్స్.. ఇలా మొత్తం 23,820 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకే ఎరువులను సరైన విధంగా వినియోగించాలని, అవసరానికి మించి తీసుకోకుండా అవగాహన కల్పించాలని సూచించారు. నానో ఎరువుల వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఫిర్యాదుల కోసం.. ఎరువుల సరఫరాపై ఫిర్యాదులు లేదా సమాచారం అందించేందుకు కలెక్టరేట్లో 91549 70454 నంబరుతో కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ నంబర్‌ను ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జేసీ ఎస్. ఇలక్కియ, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, ఆర్డీవోలు కావూరి చైతన్య, కె.మాధురి, కె.బాలకృష్ణ, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
ఘనంగా ఉరుసు మహోత్సవం
భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక స్వాతీ సెంటర్లోని బాబాజీ హజరత్ సయ్యద్ అమీనుద్దీన్ చిష్తి ఔలియా దర్గా 41వ ఉరుసు (గంధం) మహోత్సవం ఘనంగా జరిగింది. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం సాయంత్రం 6 గంటలకు భవానీపురంలోని బాబా దర్గా నుంచి గంధం తీసుకుని వాహనంలో ఊరేగింపుగా బయలుదేరింది. ప్రకాశం బ్యారేజి, కాళేశ్వరరావు మార్కెట్ మీదుగా బాబా దేవుని ధ్యానం చేసిన ప్రదేశానికి (రైల్వే స్టేషన్ వెస్ట్ వైపు గల షాజహూర్ ముసాఫిర్ ఖానాలోని షాప్ నంబర్ 9) చేరుకుంది. తిరిగి అక్కడి నుంచి బయలుదేరి సొరంగం మీదుగా రాత్రి 9 గంటలకు బాబా దర్గాకు చేరుకుంది. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చిన సంధల్(గంధం)ను బాబా దర్బార్పైకి ఎక్కించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేత వెలంపల్లి శ్రీనివాసరావు దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయనతోపాటు కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణ, పార్టీ నాయకులు ఎస్కే నజీర్, అబ్దుల్ రెహమాన్, ఎండీ గౌసీ, షేక్ నయీం, ఎస్కే కలీం తదితరులు ఉన్నారు. కాగా దర్గా సజ్జాదె నషీన్, ప్రభుత్వ ఖాజీ సయ్యద్ షా మొహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ చిష్తి మాట్లాడుతూ ఉరుసు ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం చిరాగ (దీపారాధన), సాయంత్రం ప్రసాదం పంపిణీ జరుగుతుందని తెలిపారు. రాత్రి 9 గంటలకు బాబాను కీర్తిస్తూ భక్తి గీతాలతోకూడిన ఖవ్వాలీ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పారు. -
అధనపు అంతస్తులు!
యూఎల్‌సీకి ఇచ్చిన భూములను సైతం.. ఆ వ్యక్తి మధ్యవర్తిగా..! విజయవాడ వన్‌టౌన్‌లో అడ్డగోలుగా నిర్మాణం సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ వన్‌టౌన్ అక్రమ భవన నిర్మాణాలకు అడ్డాగా మారుతోంది. ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగటం లేదు. అనుమతి లేని అదనపు అంతస్తులు పైకి ఎగబాకుతున్నాయి. భవన నిర్మాణాల్లో డీవియేషన్లు అధికంగా ఉన్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల కనుసన్నల్లోనే పెద్ద ఎత్తున అక్రమ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఖరీదైన ప్రాంతం.. వన్‌టౌన్ ప్రాంతం ఇరుకుగా ఉండటం, ఎక్కువగా వాణిజ్య సముదాయాలు ఉండటంతో అక్కడ స్థలాల ధర భారీగా ఉంటుంది. బిల్డింగ్ మొత్తం చిన్నదైన రూ.కోట్లల్లో ధర పలుకుతుంది. దీంతో పార్కింగ్ ప్రాంతాన్ని సైతం షాప్స్, గోడౌన్లుగా వాడుతారు. జీప్లస్–2 భవన నిర్మాణానికి అనుమతి తీసుకొని అదనంగా ఫ్లోర్లు నిర్మిస్తున్నారు. ఇవిగో కొన్ని ఉదాహరణలు.. ఉపేక్షిస్తే కష్టం.. వన్‌టౌన్ ప్రాంతాన్ని పరిశీలిస్తే ఇలాంటి భవనాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించి, ఇలాంటి భవనాలను ఎన్ని ఉన్నా యో సర్వే చేసి, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. ఇలాంటి నిర్మాణాలను ఉపేక్షిస్తే, పార్కింగ్ సమస్యలు తలెత్తడంతోపాటు, రోడ్లపైనే వాహనాలు నిలుపుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయి. వర్షం వస్తే నీరు బయటకు పోయే దారి లేక రోడ్లపైన నిలుస్తుంది. రోడ్ల కింద అర్బన్ ల్యాండ్ సీలింగ్(యూఎల్ సీ) కింద ఇచ్చిన భూములను సైతం తిరిగి తప్పుడు రికార్డులతో కొంత మంది సబ్ రిజిస్ట్రార్ల సహకారంతో రిజిస్ట్రేషన్ చేసి, ప్లాన్‌లో కలుపుకొని ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతున్నారు. ప్రభుత్వానికి డబ్బు చెల్లించి కొనుగోలు చేస్తే రూ.14కోట్ల నుంచి రూ.18 కోట్ల వరకూ ఆదాయం వచ్చే స్థలాలు ఉన్నాయి. అయితే యూల్ఎసీ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా రూ.కోట్ల విలువైన యూల్ఏసీ భూములు భవానీపురం, గొల్లపూడి, పటమట, సింగ్‌నగర్, నున్న.. చుట్టు పక్కల ఉన్నాయి. వీటిపైన రెవెన్యూ శాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వన్ టౌన్ ప్రాంతంలో అడ్డగోలు నిర్మాణాలు చేపడుతున్నా అడ్డుకట్ట వేయటంలో అధికారులు విఫలం అవుతున్నారు. ప్రధానంగా నగర పాలక సంస్థ ముఖ్య అధికారి పర్యవేక్షణ కొరవడటంతోపాటు కొందరు పైస్థాయి అధికారులే క్షేత్ర స్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అదనపు అంతస్తుల నిర్మాణం చేసుకొనేందుకు రేటు పెట్టి మరీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలకు సెట్‌బ్యాక్, భారీగా డీవియేషన్లు ఉన్నా పట్టించుకోకుండా మమ అనిపిస్తున్నారు. ఇలాంటి కొన్ని వ్యవహారాలను నగరంలో ఎలక్ట్రానిక్ వస్తువులను రిపేరు చేసే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ చక్కబెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అనధికార కట్టడాలను ప్రారంభంలోనే గుర్తించడంతోపాటు ఆయా నిర్మాణాలు చేపట్టిన వారిపై చార్జిషీట్ వేసేలా చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. భవన అనుమతుల్లో నిబంధనలు అతిక్రమిస్తే వేటు తప్పదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న కొంత మంది సిబ్బంది పెడ చెవిన పెడుతున్నారు. గతంలో ఏసీబీ దాడుల్లో వెలుగు చూసిన అవకతవకలను సరిచేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు చేపట్టిన చర్యలు ముందుకు సాగటం లేదు. చీఫ్ సిటీ ప్లానర్ టౌన్ ప్లానింగ్ సిబ్బందికితో సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేస్తున్నా, క్షేత్ర స్థాయిలో సిబ్బందిలో మార్పు కనిపించటం లేదు. భవనాల అనుమతుల్లో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అనుమతుల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతూనే ఉన్నారు. -
క్యూ లైన్ల కోసం ఆర్చ్‌ఫ్రేమ్స్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై దేవదాయ శాఖ దృష్టి సారించింది. సింహచలం దేవస్థానంలో స్వామి వారి నిజరూప దర్శనం రోజున గోడ కూలి పలువురు భక్తులు మృతి చెందడం, ఆ తర్వాత సింహచలం గిరిప్రదక్షిణలో భారీ గాలులకు షెడ్డు కూలిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు ఘటనల నేపథ్యంలో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరిగే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై దేవదాయ శాఖ ఇంజినీరింగ్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై పలు కీలక మార్పులు చేయనున్నారు. గతంలో దసరా ఉత్సవాల సమయంలో ఎదురైన అనుభవాలకు తోడు ఈ రెండు ఘటనల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆర్చ్ఫ్రేమ్స్తో క్యూలైన్లు.. దసరా ఉత్సవాలలో భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకునేందుకు క్యూలైన్ల ఏర్పాటు చేస్తుంది. కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి అమ్మవారి ఆలయం వరకు దేవస్థానం ఐదు లైన్లలో క్యూలైన్లు ఏర్పాటు చేయనుంది. భక్తుల రద్దీని తట్టుకునేలా ఈ క్యూలైన్లను తీర్చిదిద్దేలా మార్పులు చేయనున్నారు. గత ఏడాది వరకు ఈ క్యూలైన్లను ఏర్పాటు చేసేందుకు రోడ్డుపై గోతులు తీసి గడ్డర్లు ఏర్పాటు చేసి, ఆ గడ్డర్లకు ఐరన్ మెస్ బిగించేవారు. రద్దీ సమయంలో ఈ మెస్ భక్తుల చేతులకు, కాళ్లకు గీసుకుని గాయాలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతే కాకుండా ఈ క్యూలైన్లపై భాగంలో టార్పాలిన్ పట్టాలు, ప్లాస్టిక్ పట్టాలను కప్పి ఉంచేవారు. భారీ వర్షం, భారీ గాలులు వీచినా ఈ కవర్లు చిరిగిపోయి భక్తులు తడిసి ముద్దయ్యేవారు. అయితే ఈ ఏడాది క్యూలైన్లో ప్లాస్టిక్ పట్టాలు కాకుండా ఆర్చ్ ఫ్రేమ్‌లను ఏర్పాటు చేసి వాటి మధ్య క్యూలైన్లను ఏర్పాటు చేసేలా దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సింహచలం దేవస్థానం నుంచి ఈ ఆర్చ్ఫ్రేమ్లను దుర్గగుడికి తీసుకువస్తున్నారు. ప్రయోగాత్మకంగా.. దేవదాయ శాఖ ఆదేశానుశారం దుర్గగుడి ఇంజినీరింగ్ విభాగం ఆదివారం సీవీ రెడ్డి చారిటీస్ కాటేజీల వద్ద ప్రయోగత్మకంగా ఈ ఫ్రేమ్‌లతో క్యూలైన్లను ఏర్పాటు చేసింది. వీటిని దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు, ఆలయ ఈవో పరిశీలించారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దేవదాయ శాఖ కీలక మార్పులు చేసినట్లు ఆలయ ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఆర్చ్ఫ్రేమ్ క్యూలైన్ల వల్ల ఎంతటి భారీ గాలులు వీచినా, ఇబ్బందులు ఉండవని దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. -
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వరస సెలవుల నేపథ్యంలో ఆదివారం ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణం చల్లగా ఉండటం, చిరు జల్లులు కురుస్తుండటంతో అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలోనే సేద తీరారు. ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, శ్రావణ మాస ప్రత్యేక కుంకుమార్చనతో పాటు చండీహోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ, వీఐపీ టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. రూ. 300 టికెటు కొనుగోలు చేసిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన అనంతరం భక్తుల రద్దీ మరింత పెరిగింది. భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. దుర్గమ్మ దర్శనానంతరం భక్తులు మహా మండపంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం అమ్మవారికి జరిగిన పంచహారతుల సేవలోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సూర్యోపాసనసేవ లోక కల్యాణార్థం, సర్వ మానవాళి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఇంద్రకీలాద్రిపై దు ర్గమ్మ సన్నిధిలో సూర్యభగవానుడికి ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి చిత్రపటానికి అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సూర్యనమస్కారాలు, సూర్యోపాసన సేవలో ఉభయదాతలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
చిత్రకళతో సృజన పెంపు
కృష్ణలంక(విజయవాడతూర్పు): చిత్రకళతో సృజనాత్మకత పెంపొందుతుందని అమరావతి బుద్ధ విహార్ ప్రధాన కార్యదర్శి శుభకర్ మేడసాని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్, అమరావతి బాలోత్సవం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రంగ్ తరంగ్ చిత్రకళా పోటీలకు విశేష స్పందన లభించింది. పోటీల్లో మూడు నుంచి ఐదో తరగతి విద్యార్థులు జాతీయ చిహ్నాలు, 6,7 తరగతి విద్యార్థులు భారత దేశ స్మారక చిహ్నాలు, 8,9,10 తరగతుల విద్యార్థులు భిన్నత్వంలో ఏకత్వం అనే అంశాలపై చిత్రాలు వేశారు. అనంతరం బహుమతీ ప్రదానోత్సవం జరిగింది. శుభకర్ మాట్లాడుతూ అద్భుతమైన చిత్రాలు వేసిన విద్యార్థులను ప్రశంసించారు. రోటరీ క్లబ్ మిడ్‌టౌన్ సెక్రటరీ నాగ వసంతకుమార్ మాట్లాడుతూ పిల్లలను ప్రోత్సహిస్తున్న ఫోరమ్ ఫర్ ఆర్టిస్ట్, అమరావతి బాలోత్సవం నిర్వాహకులను కొనియాడారు. కార్యక్రమంలో మోడరన్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కె.వెంకట సునీల్చంద్, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ నాయకులు ఎ.సునీల్‌కుమార్, అరసవిల్లి గిరిధర్, శ్రావణ్‌కుమార్, అమరావతి బాలోత్సవం కార్యదర్శి యు.వి.రామరాజు, కవి అనిల్ డ్యానీ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లడ్ రెస్పాన్స్ టీంలు అప్రమత్తంగా ఉండాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): రానున్న రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో నగరపాలక సంస్థ పరిధిలోని వరద ముంపు ప్రాంతాల్లో ఫ్లడ్ రెస్పాన్స్ టీంలు ముందు జాగ్రత్తగా అక్కడ మూడు షిప్ట్‌లలో అందుబాటులో ఉండాలని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన రామలింగేశ్వరనగర్‌లోని సాయిరామ్ కట్ పీసెస్ వీధి చివరన ఉన్న రిటైనింగ్ వాల్ వద్ద ఫ్లడ్ యాక్షన్ ప్లాన్‌లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాల్లో టీంలు అందుబాటులో ఉండటంతోపాటు మిషనరీని కూడా సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ కె.సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సామ్రాజ్యం పాల్గొన్నారు. విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో ఆంధ్ర, తెలంగాణనుంచి పర్యాటకులు నాగార్జునసాగర్ చేరుకొని స్థానిక లాంచీస్టేషన్ నుంచి నాగార్జునకొండకు నాగసిరి లాంచీ, శాంతిసిరి లాంచీలలో వెళ్లారు. అక్కడి చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. పచ్చని కొండల మధ్య ఉన్న అనుపులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, యాంపీ స్టేడియం, శ్రీ రంగనాథస్వామి దేవాలయాలను సందర్శించారు. ఎత్తిపోతల జలపాతాన్ని తిలకించారు. -
విద్యావ్యవస్థలో గందరగోళం!
మచిలీపట్నంఅర్బన్: కూటమి ఏకపక్ష నిర్ణయాలతో విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. క్లస్టర్, పాఠశాలల విలీనం వివాదం కొనసాగుతుండగానే మూల్యాంకన పుస్తకాల విధానం పాఠశాలల్లో గందరగోళం రేపింది. పూర్వం పేపర్లపై రాసే పరీక్షలు ఇప్పుడు మూల్యాంకన పుస్తకాలపై రాయడంతో ఉపాధ్యాయులపై పని భారం పెరిగింది. కృష్ణా జిల్లాలో 1,317 పాఠశాలల్లో 81,427 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. తాజాగా జిల్లాలో జరిగిన ఎస్ఏ–1 పరీక్షల్లో సిలబస్‌కు సంబంధం లేని ప్రశ్నలు రావడం, ఒకటో తరగతి హిందీ పేపర్ అసంపూర్తిగా ముద్రించడం, ప్రథమ తరగతి పిల్లలకు ఇంగ్లిష్ పేరాగ్రాఫ్ రాయాలని, మూడో తరగతి వారికి పుస్తక సమీక్ష చేయాలని అడగడం, నాలుగో తరగతి పాఠ్యాంశం నుంచి మూడో తరగతికి ప్రశ్నలు ఇవ్వడం పిల్లలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. విద్యార్థుల స్థాయి, సామర్థ్యాన్ని పట్టించుకోకుండా ప్రశ్నపత్రాలు తయారు చేశారు. బోధన కంటే ప్రధానంగా పేపర్ వర్క్ పాఠశాలల్లో బోధన క్రమంగా పక్కకు వెళ్తోంది. ప్రస్తుతం ఉపాధ్యాయులకు పేపర్‌వర్క్, ఆన్లైన్ అప్డేట్లు ప్రధానంగా ఉన్నాయి. పుస్తకం కంటే యాప్ స్క్రీన్షాట్లు, విద్యార్థి అభివృద్ధి కన్నా సెల్ఫీ అప్లోడ్లకే ప్రాధాన్యం పెరిగింది. ఆన్లైన్ అటెండెన్స్, టాస్క్ ట్రాకర్, అసెస్మెంట్ రిపోర్టులు, వాట్సాప్ అప్డేట్లతో ఉపాధ్యాయులకు సమయం గడిచిపోతోంది. విద్యార్థి కళ్లలోకి చూసి బోధించే అవకాశాలు తగ్గిపోయాయి. బోధనలో అనుభవం లేని వారు విధానాలను రూపొందిస్తున్నారు. గ్రామీణ పరిస్థితులు, పిల్లల స్థాయి, బోధన భాష వంటి అంశాలను పట్టించుకోకపోవడంతో విద్య నాణ్యత దెబ్బతింటోంది. సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్లో పరీక్షలు విద్యార్థుల అభ్యసన మదింపునకు ఏటా ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు జరుగుతున్నాయి. గత ఏడాది నుంచి ఫార్మేటివ్ పరీక్షలను సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1, 2, 3, 4 రూపంలో నిర్వహిస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు, రెండు సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి పరీక్షను ఈనెల 11 న నిర్వహించారు. అయితే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలు జూన్ 12 న ప్రారంభమైనా పరీక్షలు జూన్ 4 నుంచే జరగాల్సి ఉంది. కానీ అసెస్మెంట్ బుక్లెట్లు పాఠశాలలకు ఆలస్యంగా చేరుకోవడంతో షెడ్యూల్ వెనక్కి వెళ్లి సోమవారం నుంచే పరీక్షలు ప్రారంభమయ్యాయి. పని భారం రెట్టింపు.. నిల్వ సమస్యలు మూల్యాంకన పుస్తకాల్లోనే మార్కులు నమోదు చేసి, వాటి ఓఎమ్మార్ షీట్స్‌ను విద్యాశాఖ యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంది. పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో స్కూళ్లలోనే ఏడాది పొడవునా భద్రపరచాలి. ఈ పద్ధతిలో ఒక్కో పాఠశాలలో వందల కొద్దీ పుస్తకాలను భద్రపరచాల్సి పరిస్థితి ఏర్పడింది. గతంలో పరీక్ష పేపర్లను ఉపాధ్యాయులు ఇంటికి తీసుకెళ్లి దిద్దేవారు. ఇప్పుడు పెద్ద సంఖ్యలో పుస్తకాలు ఉండటంతో ఇంటికి తీసుకెళ్లి అవకాశం లేక ఇప్పుడు స్కూళ్లలోనే మూల్యాంకనం చేయాల్సి వస్తోంది. నిల్వకు తగిన సదుపాయాలు లేకపోవడంతో వాటి భద్రతపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులపై అదనపు పనిభారం మూల్యాంకన పుస్తకాల విధానంతో ఇబ్బంది పాత పద్ధతినే అనుసరించాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ పరీక్షలు జూన్, జూలై సిలబస్‌కు సంబంధించి ప్రశ్నలు రూపొందించారు. పరీక్షలను ప్రత్యేక మూల్యాంకన పుస్తకాలలోనే రాయాలనే నిర్ణయంతో 2వ తరగతికి మూడు, 3 నుంచి 5వ తరగతులకు నాలుగు, 6 నుంచి 7 వ తరగతులకు ఆరు, 8 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు ఏడు పుస్తకాలు చొప్పున అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థలో గందరగోళం నెలకొంది. అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వెంటనే ఆచరిస్తుండటంతో విద్యావిధానంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే క్రమంలో మూల్యంకన పుస్తకాల విధానం ఉపాధ్యాయులపై భారాన్ని పెంచింది. ‘అసెస్మెంట్’తో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థ పడుతున్నారు. అసెస్మెంట్ పుస్తకాల విషయంలో ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుంది. ఆరు నుంచి 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఆరు పుస్తకాలు అందించింది. ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలను వీటిలో రాయాల్సి ఉంటుంది. పరీక్షల అనంతరం ఉపాధ్యాయులు మార్కులు ఓఎమ్మార్ షీట్లో నమోదు చేసి, విద్యాశాఖ యాప్‌లో అప్లోడ్ చేయాలి. ఈ విధానం బోధనకంటే పరిపాలనా భారం పెంచుతోంది. ప్రభుత్వం ఈ పరీక్షల విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిలోనే నిర్వహించాలి. –అంబటిపూడి సుబ్రహ్మణ్యం, అధ్యక్షుడు, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ఒకే పుస్తకంలో ఏడాది మొత్తం పరీక్షలు, మార్కులు, ఓఎమ్మార్ డేటా భద్రపరచడం సమయ, స్థల పరమైన ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. పాత పద్ధతే మేలు. బోధనేతర పనులతో అలసిపోయిన ఉపాధ్యాయులపై ఈ కొత్త భారాన్ని మోపడం అన్యాయం. ప్రభుత్వం తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేయాలి. –ఎం.వి. మహంకాళరావు, వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
అద్భుతం.. అపూర్వం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏరా ప్రసాద్.. బాగున్నావా?.. ఏంటిరా మహేష్ ఏం చేస్తున్నావు? .. అంటూ 32 ఏళ్ల నాటి జ్ఞాపకాలను వారంత నెమరువేసుకున్నారు. అపూర్వ కలయిక .. అద్భుతం అంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆదివారం భవానీపురం క్రాంబ్వే రోడ్డులోని క్యాస్రోల్ హోటల్లో విద్యాధరపురం దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ 1992–93 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం జరిగింది. తమకు విద్యా బుద్దులు నేర్పిన గురువులు రామరాజు(సోషల్), వెంకటేశ్వరరావు( పీఈటీ)లను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు శోభనాచలపతిరావు, పెదబాబూరావు మాస్టార్లు జూమ్‌లో అటెండ్ అయి తమ పూర్వ విద్యార్థులను ఆశీర్వదించారు. రీయూనియన్ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు. టీకేఎన్వీ ప్రసాద్, దాది మహేష్, వినోద్పాల్, మున్వర్ బాషా, ముజీబ్‌పాషా, అన్నవరపు మురళీకృష్ణ తమ బ్యాచ్‌కు చెందిన వారి నంబర్లు సేకరించి రీయూనియన్ చేశారు. క్లాసులు ఎగ్గొట్టి ఆడుకున్న ఆటలు, అలనాటి అనుభూతులు, ఆప్యాయలతో తెలియని అనుబంధం పెనవేసుకున్న మనం మళ్లీ 32 వసంతాల తర్వాత కలవడం ఓ అద్భుతం’ అని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. పాఠశాల అభివృద్ధికి సహాయం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం -
వరద తగ్గు ముఖం
కంకిపాడు: మద్దూరు ఏటిపాయలో వరదనీటి ప్రవాహం తగ్గు ముఖం పట్టింది. ఎగువనుంచి వరదనీటి విడుదల తగ్గింది. ఏటిపాయ క్రమేపీ వెనక్కి వెళ్తోంది. ప్రస్తుతం పాయ అంచులు తాకుతూ నీటి ప్రవాహం ఉంది. అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ కూలీలు, రైతులు పడవల సాయంతో పొలాల్లో పనులకు వెళ్తున్నారు. బందోబస్తు పర్యవేక్షణ అంతా మొక్కుబడిగా సాగుతుందనడానికి ఇదొక ఉదాహరణ. ప్రకాశం బ్యారేజీ నుంచి రెండు రోజుల క్రితం 5.65 లక్షల క్యూసెక్కుల వరదనీటిని ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. దీంతో పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు మండలాల గుండా ఏటిపాయ ఉద్ధృతంగా ప్రవహించింది. ఏటిపాయ అంచుల నుంచి కరకట్ట వైపు చొచ్చుకువచ్చింది. కరకట్టకు దిగువన సాగు చేసిన పొలాలు, ఏటిపాయ మధ్యన ఉన్న లంక భూములో పొలాలు మునిగిపోతాయని రైతులు ఆందోళన చెందారు. వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో ముంపు భయం వీడింది. నిండుగా నీటిప్రవాహం వరద తగ్గినా నీటి ప్రవాహం మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. ప్రస్తుతం పాయ అంచులు తాకుతూ వరద ప్రవహిస్తోంది. ఏటిపాయ మాత్రం ఎగువ నుంచి వచ్చి చేరుతున్న నీటితో ఉరకలు వేస్తోంది. మద్దూరు వద్ద ఏటిపాయ మధ్యన ఉన్న రోడ్డు మార్గం ఇంకా వరదనీటిలో మునిగే ఉంది. కాసరనేనివారిపాలెం వద్ద శివాలయం పరిసరాల్లో వరదనీటి ముంపు నుంచి కోలుకుంటోంది. అధికారుల ఆదేశాలు బేఖాతర్ ఉద్ధృతి సమయంలో అధికారుల ఆదేశాలు బేఖాతరు అవుతున్నాయి. వరదనీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ఏటిపాయలోకి ఏ ఒక్కరూ వెళ్లవద్దని హెచ్చరిక చేస్తూ అధికారులు బ్యానర్లు ఏర్పాటుచేశారు. అయితే కొందరు రైతులు, కూలీలు మాత్రం పడవల సాయంతో పాయ మధ్యన ఉన్న లంక భూముల్లో వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. -
వాహనమిత్ర పథకంలో రూ. 25వేలు ఇవ్వాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): మహిళలకు అందుబాటులోకి తెచ్చిన ఉచిత బస్సుతో నష్టపోతున్న ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదు కోవాలని.. వారికి వాహన మిత్ర ద్వారా రూ. 25 వేలు ఇవ్వాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.శివాజీ, ముజఫర్ అహ్మద్ డిమాండ్ చేశారు. సంఘ నేతలు శనివారం బీఆర్టీఎస్ రోడ్డులోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీ్త్ర శక్తి పథకంతో రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారన్నారు. కరోనా అనంతరం ఆర్థికంగా దెబ్బతిన్న ఆటోడ్రైవర్ కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదన్నారు. ఉపాధి అవకాశాలు లేక ఒకరిపై ఆధారపడకుండా సొంత పెట్టుబడి, ఫైనాన్స్‌లతో స్వయం ఉపాధిగా ఆటోడ్రైవర్లు జీవనం సాగిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 115 పట్టణాల్లో విదేశీ సంస్థలు ర్యాపిడో, ఊబర్, ఓలా కంపెనీలకు అనుమతులు ఇచ్చారన్నారు. దీంతో ఆటోడ్రైవర్లు కిరాయిలు లేక అవస్థ పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆర్థికంగా నష్టపోతున్న ఆటోడ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అధికారంలోకి రాక ముందు ఆటోడ్రైవర్లను ఆదుకుంటామంటూ అనేక హామీలు ఇచ్చిన కూటమి నేతలు వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకం ప్రారంభించడానికి ముందు ఆటోడ్రైవర్ల సంఘాలతో చర్చించకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందన్నారు. ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలంటూ ఈనెల 18,19 తేదీల్లో ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రం ఇస్తామన్నారు. దీనిపై సీఎం స్పందించకపోతే ఈనెల 24న ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలో ఆందోళన కార్యక్రమానికి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కోశాధికారి కె.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 20257చిట్టూర్పు(ఘంటసాల): శ్రావణ మాసం సందర్భంగా ఘంటసాల మండలం చిట్టూర్పులో వేంచేసియున్న శ్రీగంగా భ్రమరాంబ దేవస్థానంలో అమ్మవారు శనివారం గాజుల అలంకారంలోదర్శనమిచ్చారు.అచ్చంపేట: ఎగువన నాగార్జున సాగర్, కృష్ణానది పరీవాహక ప్రాంతాల నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 1,39,044 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.భవానీపురం: ఇంద్రకీలాద్రిపై అన్నప్రసాదానికి విరాళాలు వెల్లువలా వచ్చాయి. గొల్లపూడి, విజయవాడ పరిసర ప్రాంత భక్తులు భారీగా విరాళాలు సమర్పించారు. –8లో -
కొండలమ్మ ఆదాయానికి గండి
గుడ్లవల్లేరు: కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా శ్రీ కొండలమ్మ ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయకపోవటంతో జవాబు దారీతనం లేకుండా పోయింది. జిల్లాలో అత్యధికంగా కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే శక్తి ఆలయాల్లో వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానానికి ఎంతో ఖ్యాతి ఉంది. ఆ ఆదాయానికి కొందరు స్వార్థశక్తులు 2008–09వ సంవత్సరం నుంచి గండి కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయానికి వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని అమ్మవారికి రావలసిన బకాయిలను వసూలు చేయకుండా ఏళ్ల తరబడి దేవదాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో భక్తులు చెల్లించే మొక్కుబడుల్లో భాగంగా కొబ్బరి చిప్పలు, చీరలు, ధాన్యం సేకరణ చేసే హక్కులను పొందేందుకు కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉండే పాటదారులకే కట్టబెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అధికారులను ప్రసన్నం చేసుకుంటే చాలు అమ్మవారి సన్నిధిలో పాటదారులకు ఆడిందే ఆటగా...పాడిందే పాటగా ఉంది. ఏళ్ల తరబడి రూ.40 లక్షల బకాయిలను ఐదారుగురు పాటదారులు చెల్లించవలసి ఉన్నా ఆ విషయం అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కొండలమ్మకు చెల్లించకపోతే ఆస్తుల జప్తే... అమ్మవారికి ఒకవేళ చెల్లించవలసిన సొమ్మును బకాయి పడిన సంబంధిత పాటదారులు చెల్లించకపోతే దేవదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం కోర్టు ద్వారా వచ్చే ఆర్డరుతో పాటదారుల ఆస్తుల్ని కూడా జప్తు చేసే హక్కు అధికారులకు ఉంది. కాని ఆ నిబంధనలను వర్తింపజేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారు. గతంలో ఒక ఆలయ ఈఓ రూ.40 లక్షల బకాయిల గూర్చి బకాయిదారులపై కోర్టులో కేసు వేశారు. కాని దానిని ముందుకు వెళ్లనివ్వకుండా కొన్ని దుష్ట శక్తులు తొక్కి పెడుతున్నాయి. రూ.40లక్షల బకాయిలు చెల్లించవలసిన ప్రతి ఒక్క బకాయిదారుడు ఆర్థికంగా చెల్లించే శక్తి ఉన్నవారే. కాని ఒకరు బకాయి చెల్లించలేదని మరొకరు తాత్సారం చేస్తూ అమ్మవారి ఆదాయానికి గండి కొడుతున్నారు. దేవస్థాన పాలనా వ్యవహారాల్లోకి కుల జాడ్యం అమ్మవారి ఆలయ పాలనా వ్యవహారాలకు కుల జాడ్యం పట్టింది. దాదాపుగా తెలుగు తమ్ముళ్లే ఆలయ పరిపాలనా వ్యవహారాల్లో ఉన్నా కులపరంగా కూడా ఆలయంలో పరిపాలన నడుస్తోందన్న ఆరోపణలు స్థానిక భక్తుల నుంచి వస్తున్నాయి. అధికారులు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని టీడీపీలోనే కొందరు తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాయటంతో దేవస్థానం ఆదాయానికి గండి పడుతోందని వారు ఆరోపిస్తున్నారు. పాటదారులు కొబ్బరి చిప్పలు, చీరలు, ధాన్యం సేకరణ చేసే హక్కులను పొందేందుకు బహిరంగ వేలంలో పాడుకుంటారు. బహిరంగ వేలం పెట్టే తరుణంలో ఎవరైనా పాటదారులు బయట నుంచి వస్తే వారిని తిట్టి, కొట్టి తరిమేయటం వంటి బెదిరింపులు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బయట నుంచి వచ్చిన పాటదారులను పంపించేసినా... వేలం తక్కువ ధరకు రాని పక్షంలో ఆ వేలం ఎన్నిసార్లు పెట్టినా...అన్నిసార్లు వాయిదా వేయిస్తున్నారు. ఒకవేళ పాడుకున్నా...హక్కు పొందే కాల వ్యవధిలో సగం రోజుల పాటే ఆ ఆ సేకరణ బాధ్యతను నిర్వహిస్తున్నారు. తమకు పాడుకున్న పాటలో నష్టం వచ్చిందని సొమ్ము చెల్లించకుండా ఎగవేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మళ్లీ అదే హక్కు కోసం జరిగే వేలంలో తమ బినామీల పేరిట పాత పాటదారులే పాడతారు. ఆ బకాయిదారులే అమ్మవారి సన్నిధిలో సేకరణ చేయటం స్థానిక భక్తులను విస్మయానికి గురి చేస్తోంది. ఈ ధాన్యం, చీరలు, కొబ్బరి చిప్పల సేకరణ హక్కుల విషయంలోనే గాక అమ్మవారి దుకాణ సముదాయాల విషయంలో కూడా ఇవే పరిస్థితులు తలెత్తటంతో అవి ఏళ్ల తరబడి మూతపడుతూనే ఉన్నాయి. -
నదీ తీరం.. అక్రమార్కుల పరం!
భవానీపురం(విజయవాడపశ్చిమ): కృష్ణానదీ తీర ప్రాంతం అక్రమార్కుల పరమవుతోంది. నదీ తీరాన శాశ్వత కట్టడాలు నిర్మించకూడదన్న జలవనరుల శాఖ(ఇరిగేషన్) నిబంధనలు గాలికి వది లేసింది. దర్జాగా ఇరిగేషన్ స్థలాలను కబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు జరిగినా అటు ఇరిగేషన్, ఇటు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. వరదలు వస్తే నదీ తీర ప్రాంతం కచ్చితంగా మునిగిపోతుందని తెలిసినా అప్పుడు చూసుకుందాంలే అన్నధీమాతో ఉన్నారు. టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు నదీ తీరాన షెడ్లు నిర్మించి అద్దెకు ఇచ్చేస్తున్నారు. మరోవైపు ఒక వ్యక్తి గుడి మాటున పక్కా కట్టడాలు నిర్మిస్తున్నాడు. ప్రతిరోజూ ఈ రెండు ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తున్న అధికారులు ఆ నిర్మాణాలను చూసి పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణదారుల నుంచి భారీగానే ముడుపులు దండుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుడి పేరుతో ఆక్రమణ! విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన భవానీపురం 40వ డివిజన్ పరిధిలోని పున్నమిఘాట్‌కు ఇవతల కరకట్ట సౌత్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించుకున్నాడు. గుడి పేరుతో అయితే ఎవరూ పట్టించుకోరన్న ఉద్దేశమో లేదా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరన్న భావనతోనో ఏకంగా పెద్ద స్థలాన్నే కబ్జా చేశాడు. ఇతను ఏ సామాన్యుడో కాదు.. ఒకప్పుడు ప్రజాప్రతినిధిగా వెలగబెట్టిన వ్యక్తి కావడం గమనార్హం. తొలుత షెడ్లు నిర్మించి ఇప్పుడు వాటిని తొలగించి శాశ్వత కట్టడాలు నిర్మించి శ్లాబు కూడా వేశాడు. ఈ అక్రమ నిర్మాణాల వైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా అధికారంలో ఉన్న ప్రభుత్వ ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటాడు. ప్రస్తుత పచ్చ ప్రభుత్వంలో గుడి మొత్తం పసుపు రంగులు వేసేశాడు. రోజూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇటు వైపు రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. అయినా పసుపు రంగు వేసి ఉండటంతో అధికార పార్టీకి చెందిన వ్యక్తి అయి ఉంటాడని భావించి మరోవైపు చూస్తూ వెళ్లిపోతారని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారుల చర్యలు శూన్యం భవానీపురం పున్నమిహోటల్కు ఆనుకుని విద్యాధరపురం హిందూ శ్మశానవాటికకు దక్షిణం వైపు గత కృష్ణా పుష్కరాల సమయంలో తొలగించిన చిన్న చిన్న గుడిసెల స్థానంలో ఇప్పుడు షెడ్లు దర్శనమిస్తున్నాయి. వాటికి మున్సిపల్ కార్పొరేషన్లో అసెస్మెంట్ నంబర్ గానీ, పన్నులు గానీ, అనధికార నిర్మాణాల్లో వ్యాపారాలు చేస్తున్న వారెవరికీ ట్రేడ్ లైసెన్స్‌లు గానీ లేవు. అదేమని అడిగితే ఈ స్థలం తమదేనంటూ బుకాయిస్తున్నారు. వాస్తవానికి నదీ తీరాన అక్రమ కట్టడాలపై జలవనరుల శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్‌కు 2023 డిసెంబర్ 27న కలెక్టర్ లేఖ రాశారు. ఫలితం లేకపోవడంతో గత ఏడాది జనవరి 17న ఇరిగేషన్ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ (కృష్ణా మధ్య విభాగం) పీవీఆర్ కృష్ణారావుకు జిల్లా కలెక్టర్ మరో లేఖ రాశారు. అయినా సంబంధిత అధికారులు కబ్జా వ్యవ హారంపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
ఉచిత అన్నప్రసాదానికి విరాళాల వెల్లువ
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో నిత్యం జరిగే ఉచిత అన్నప్రసాద పథకానికి విరాళాలు వెల్లువలా వచ్చాయి. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడికి చెందిన వీవీ రామప్రసాద్ దంపతులు, వారి కుటుంబసభ్యులు జ్యోతిర్మయి, ప్రథమ కుమారుడు తిరుమలేష్, మనస్విని దంపతులు, ద్వితీయ కుమారుడు సాయి తేజేష్ రూ.1,01,116 విరాళంగా సమర్పించారు. ఈ మొత్తాన్ని ఆలయ ఈఓ శీనా నాయక్‌కు అందజేశారు. శ్రీదుర్గా భవానీ ధర్మ ప్రచార పరిషత్ పక్షాన.. అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి శ్రీదుర్గా భవానీ ధర్మ ప్రచార పరిషత్ పక్షాన విజయవాడ సుందరయ్యనగర్‌కు చెందిన దారపు వెంకట రామ ప్రసాద్, ఇందుమతి దంపతులు, వారి తల్లిదండ్రులు దారపు కేశవరావు–లక్ష్మీకాంతమ్మ దంపతులు, మామ చింతల వెంకటేశ్వరరావు–నాగమణి దంపతుల పేరిట రూ.1,00,116 విరాళాన్ని ఆలయ అధికారికి అందజేశారు. విస్సన్నపేట వాస్తవ్యుల విరాళం రూ.1,00,116 ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలోని దుర్గమ్మ దేవాలయం సమీపంలో నివసిస్తున్న గణపవరపు ఉమాదేవి, వెంకట విజయ రామసాయి దంపతులు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116 విరాళంగా అందజేశారు. దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
ఇంద్రకీలాద్రిపై శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపైగల శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానంలోని ప్రధాన ఆలయ మండ పంలో నిర్వహించిన పూజల్లో దేవస్థానం ఈఓ శీనా నాయక్ దంపతులు పాల్గొన్నారు. తొలుత గోమాతకు ఘనంగా పూజలు చేసిన అనంతరం శ్రీకృష్ణ భగవాన్‌కు పూజలు నిర్వహించారు. ఈ వేడుకల నిమిత్తం దేవస్థానం స్థానాచార్యులు, వైదిక కమిటీ, అర్చక బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా విశేష సౌకర్యాలు కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం అనంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి దేవస్థాన పురాణ పండితులు శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి ఉపన్యసించారు. అనంతరం మల్లికార్జున మహామండపం 7వ అంతస్తులో రాజగోపురం ముందు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. నెమలిలో కృష్ణాష్టమి వేడుకలు తిరువూరు: గంపలగూడెం మండలం నెమలి శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వ హించారు. స్వామివారిని నవనీత కృష్ణుడిగా విశేష అలంకరణ చేసి తొమ్మిది రకాల ప్రసా దాలు నివేదించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వేణుగోపాలుడిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సంధ్య పర్యవేక్షణలో వేడుకలను సంప్రదాయబద్ధంగా జరిపారు. -
ఆడబిడ్డల అగచాట్లు
సీ్త్ర శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే సీఎంకు స్వాగతం చెప్పేందుకు జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలను బస్టాండ్ ప్రాంగణానికి బస్సుల్లో తరలించారు. అయితే సీఎం సాయంత్రం 4 గంటలు దాటినా రాకపోవడంతో మహిళలు ఎండలో పడిగాపులు పడాల్సివచ్చింది. సీ్త్ర శక్తి పథకం ప్రారంభం పుణ్యమా అని నగరంలో గురువారం రాత్రి నుంచి బస్సులు తిరగకపోవటంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
మహనీయుల త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం
చిలకలపూడి(మచిలీపట్నం): ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా ఆయన జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, దేశంలో విభిన్న వర్గాల ప్రజలు ఉన్నారని అందరూ ఐకమత్యంతో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య , పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో... కలెక్టరేట్లో స్వాతంత్ర దిన వేడుకల సందర్భంగా జాతీయజెండాను ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ ఎగురవేశారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. గీతాంజలిశర్మ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేశారని, వారిని స్మరించుకుంటూ మనందరం ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, కలెక్టరేట్ ఏవో రాధిక, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి -
మహనీయుల త్యాగఫలం
నేటి స్వాతంత్య్రంత్రివర్ణ పతాకం సగర్వంగా నింగికెగసింది. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఎల్లెడలా చాటింది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడిన సమరయోధులకు జిల్లా ప్రజలు నిండుమనసుతో నివాళులర్పించారు. భరతమాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని ఎనిమిది దశాబ్దాలకు చేరువవుతున్న తరుణంలో ఆ స్ఫూర్తిని భావితరాలకు చాటేందుకు స్వాతంత్య్ర దిన సంబరాలను వేడుకగా జరుపుకొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఉత్సవాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ త్రివర్ణ పతాకం ఎగురవేశారు.గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారత 79వ స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వేడుకలు నిర్వ హించి జాతీయ పతాకాలను ఎగురవేశారు. కేడీసీసీబీ రీజనల్ కార్యాలయం, డీటీసీ కార్యాలయం, గ్రంథాలయాల్లో వేడుకలు జరిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబునాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో జేసీ ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహంతో కలిసి కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ జాతీయ జెండాను ఎగురవేశారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర దార్శనికతకు అనుగుణంగా అడుగులేస్తూ జిల్లాను అభివృద్ధి, సంక్షేమంలో నెం.1గా నిలిపేందుకు సమష్టిగా అడుగులేద్దామని అన్నారు. మహనీయుల ధైర్యం, త్యాగాలను స్మరించుకుంటూ ముందడుగు వేస్తూ జిల్లా, రాష్ట్రం, దేశ ప్రగతికి కృషిచేద్దామన్నారు. స్వర్ణాంధ్ర కలను సాకారం చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పీ4 అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఆరోగ్య ఆంధ్ర సాకారానికి నిర్వహించిన యోగాంధ్రలో జిల్లాను ముందు వరుసలో నిలిపామని, ఇదే స్ఫూర్తితో అన్ని విధాలా ప్రగతికి చేయీచేయీ కలపాల్సిన అవసరముందన్నారు. జిల్లా, నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికల అమల్లో మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా జిల్లా జీడీపీ, తలసరి ఆదాయ లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. విజయవాడ నగర వీధుల్లో శకటాల ప్రదర్శనఆకట్టుకున్న శకటాల ప్రదర్శన... ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన 79వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. వేడుకల అనంతరం శకటాలను నగర వీధుల్లో యాత్రగా తీసుకెళ్లారు. బందరు రోడ్డు, బెంజ్ సర్కిల్, రామవరప్పాడు రింగ్, ఏలూరు రోడ్, కంట్రోల్ రూమ్, ఎంజీ రోడ్డు తదితర మార్గాల్లో ప్రదర్శించిన శకటాలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకల్లో ప్రదర్శించిన పట్టు పరిశ్రమ శాఖ, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ, మెప్మా శకటాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. -
కక్షిదారుల సౌలభ్యం కోసం ఈ–సేవ కేంద్రాలు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపీ చిలకలపూడి(మచిలీపట్నం): కక్షిదారులు, న్యాయవాదుల సౌలభ్యం కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ–సేవ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపీ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ–సేవ కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం న్యాయమూర్తి గోపి మాట్లాడుతూ.. ఈ కేంద్రాల ద్వారా ఉచితంగా కక్షిదారులకు, న్యాయవాదులకు కేసుల పరిస్థితి, తదుపరి విచారణ తేదీలు వంటి వివరాలను తెలు పుతారని వివరించారు. సెలవులో ఉన్న న్యాయ మూర్తుల వివరాలను కూడా తెలియజేస్తారని తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. న్యాయపరమైన ఆదేశాలు, తీర్పులు, సాఫ్ట్ కాపీలను ఈ–మెయిల్, వాట్సాప్, అందుబాటులో ఉన్న ఇతర యాప్‌ల ద్వారా ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. న్యాయశాఖలో తర్ఫీదు పొందిన సిబ్బంది ఈ–సేవ కేంద్రాల్లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్జి జి.వెంకటేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పోతురాజు, న్యాయవాదులు ఎల్.బాలాజీ, నగధర్నాథ్, పుప్పాల కామేశ్వరరావు, పామర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ కోర్టులో ఈ–సేవా కేంద్రాలు ప్రారంభం
విజయవాడలీగల్: విజయవాడ కోర్టులో గురువారం తొలి ఈ–సేవ కేంద్రాన్ని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎ.సత్యానంద్ ప్రారంభించారు. రెండవ ఈ–సేవ కేంద్రాన్ని 12వ అదనపు జిల్లా జడ్జి ఎస్.సునీల్, మూడవ ఈ–సేవ కేంద్రాన్ని కమర్షియల్ కోర్టు జడ్జి భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఇకనుంచి ఎటువంటి దావాలు కానీ, దావాకి సంబంధించిన దస్తావేజులు కానీ ఫైల్ చేసుకోవటానికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయి. దీని ద్వారా న్యాయవాదులకు కక్షిదారులకు ఖర్చు తక్కువ, పని సులభం అవుతుంది కక్షిదారులకు కావలసిన కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఈ కేంద్రంలో అడిగి తెలుసుకోవచ్చు. కార్యక్రమంలో పోక్సో కోర్టు జడ్జి వేల్పుల భవనమ్మ, ఎంపీ ఎమ్మెల్యే కోర్టు జడ్జి ఎ.అనిత, 13వ అదనపు జిల్లా జడ్జి శేషయ్య, ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు జడ్జి తిరుమల వెంకటేశ్వర్లు, సీనియర్ సివిల్ జడ్జి రమణారెడ్డి, ఏడో అదనపు జిల్లా జడ్జి అబ్రహం, నాలుగవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి టి.అంజనీ ఎస్ఎస్ రామ ఆదిత్య రిషిక, మూడవ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పి. తిరుమల రావు, ఇతర జడ్జిలు పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు: మునేరులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రం పెనుగంచిప్రోలులో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా ఆరేపల్లి మండలం వాకావారిపాలెం గ్రామానికి చెందిన వాకా శ్రీనివాసరావు(58) నాలుగు రోజుల కిత్రం పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మవారి ఆలయం వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో ఉదయం స్థానికులు మునేరులో మృతదేహం ఉందని సమాచారం ఇవ్వటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని జేబులో ఉన్న ఆధార్ కార్డుతో వారి కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టు ఎస్ఐ అర్జున్ తెలిపారు. ప్రమాదవశాత్తు మునేరులో పడి మరణించి ఉంటాడని అన్నారు. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని చెప్పారు. -
డీఎల్ఓ తీరుపై విచారణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): హెచ్ఐవీ బాధితులను ఉద్దేశించి అమానవీయంగా మాట్లాడిన జిల్లా లెప్రసీ, టీబీ అధికారి తీరుపై వైద్యశాఖ కమిషనర్ వీరపాండియన్ సీరియస్ అయినట్లు తెలిసింది. హెచ్ఐవీ బాధితుల సేవల విషయంలో ఓ వైద్యుడితో ఫోన్లో సంభాషించిన విషయమై సాక్షి జిల్లా ఎడిషన్‌లో ఈ నెల 12న పోతే పొమ్మనండి అంటూ కథనం ప్రచురితమైంది. దీనిపై కమిషనర్ విచారణకు ఆదేశించారు. దీంతో ఆయన ఫోన్లో మాట్లాడిన వైద్యుడి నుంచి డీఎంహెచ్ఓ వివరణ తీసుకున్నారు. డీఎంఓ, వైద్యశాఖ కార్యాలయంలో వైద్యుల పట్ల ప్రవర్తనా తీరుపై వారి వద్ద నుంచి కూడా వివరణ తీసుకున్నట్లు తెలిసింది. విచారణ నివేదికను డీఎంహెచ్ఓ వైద్యశాఖ కమిషనర్‌కు పంపించారని సమాచారం. ఈ విషయమై ఏపీ శాక్స్ అధికారులు సైతం సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి అధికారులతో హెచ్ఐవీ బాఽధితుల మనోభావాలు దెబ్బతింటాయని భావిస్తున్నట్లు సమాచారం. టీబీలోనూ అంతే.. నెలన్నర కిందట బాధ్యతలు చేపట్టిన ఆ అధికారి వచ్చిన వెంటనే కొందరు సిబ్బందిని ఇష్టారాజ్యంగా బదిలీలు చేసేసినట్లు తెలిసింది. వాస్తవంగా వారికి పోస్టింగు ఇచ్చిన సమయంలో ఏ సెంటర్లో పనిచేయాలో కూడా పేర్కొంటారు. కానీ దానికి విరుద్ధంగా బదిలీలు చేసినట్లు చెబుతున్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గురువారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో నిత్యాన్నదానానికి కంకిపాడుకు చెందిన బి.తుషార పేరిట రాజేష్ దంపతులు రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. ఉచిత ప్రసాద వితరణ పథకానికి విజయవాడ కామకోటి నగర్‌కు చెందిన సీహెచ్ రమేష్‌కుమార్, మాధురి దంపతులు తమ కుమారులు చుండూరి నాగరామ్, జశ్వంత్ పేరిట రూ.1,00,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. కృత్తివెన్ను: రపమాదవశాత్తు బైక్ రోడ్డు మార్జిన్లో పడిపోవడంతో వ్యక్తి మరణించిన సంఘటన మండల పరిధిలోని సంగమూడి సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. కృత్తివెన్ను ఎస్ఐ పైడిబాబు తెలిపిన వివరాల ప్రకారం చినగట్టు గ్రామానికి చెందిన మాటూరి బసవేశ్వరరావు (పెదబాబు) బుధవారం రాత్రి కృత్తివెన్ను వెళుతుండగా అతను ప్రయాణిస్తున్న మోటార్‌బైక్ అదుపుతప్పి రోడ్డు మార్జిన్లోకి దూసుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ గమనించలేదు. కొంత సమయం తరువాత వాహనదారుల సమాచారం మేరకు ప్రమాద స్థలాన్ని గుర్తించి చూడగా అప్పటికే పెదబాబు మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం గురువారం బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
బుడమేరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి
జి.కొండూరు: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుడమేరు వరద ప్రవాహాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. జి.కొండూరు మండలంలోని వెలగలేరు వద్ద బుడమేరుపై ఉన్న హెడ్ రెగ్యులేటర్‌ను ఆయన గురువారం ఉదయం పరిశీలించారు. హెడ్ రెగ్యులేటర్ గేట్ల పనితీరు, వరద ప్రవాహం, డైవర్షన్ కెనాల్ సామర్థ్యం వంటి అంశాలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. బుడమేరులో సాధారణ వరద ప్రవాహం కొనసాగుతున్నందున డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణానదిలోకి వెళ్తోందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. బుడమేరుకు వరద ప్రవాహం పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందుగానే సమాచారం అందించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. అనంతరం కొండపల్లి శాంతినగర్ వద్ద ఇటీవల బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు నిర్మించిన రిటైనింగ్‌వాల్, ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
భరోసా మాయం...సేవకు మంగళం
కంకిపాడు: కూటమి ప్రభుత్వ పాలనలో అన్నదాతలు అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఓ వైపు రైతు సంక్షేమం వల్లె వేస్తూ రైతులను మాత్రం గాలికొదిలేస్తున్న ఘనత కూటమి సర్కారుకే చెల్లుతుంది. రైతులకు భరోసా కల్పిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలను తీసుకొచ్చింది. అన్ని విధాలా అన్నదాతలకు బాసటగా నిలిచింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే పేరు మార్చి తద్వారా అందుతున్న సేవలకు సైతం మంగళం పాడేస్తోంది. రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది కుదింపుతో రైతు సేవా కేంద్రాలు మూతబడే ప్రమాదం కూడా గోచరిస్తోంది. నాడు సంక్షేమం...నేడు నిర్వీర్యం... వ్యవసాయం దండగ అన్న నేతలు ముక్కున వేలేసుకునేలా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసి చూసింది. పరిపాలన గ్రామస్థాయికి తీసుకొచ్చింది. సచివాలయ వ్యవస్థ ద్వారా సేవలను ప్రతి ఒక్కరికీ చేరువ చేసింది. ఇందులో భాగంగానే వ్యవసాయం చేసే రైతులకు అవసరమైన అన్ని సేవలకూ మండల కేంద్రాలకు పరుగులు పెట్టకుండా రైతుభరోసా కేంద్రాల్లోనే అందుబాటులోకి తెచ్చింది. ఎరువులు, విత్తనాలు, పంట చేతికి వచ్చిన తరువాత పంట కొనుగోళ్లు సైతం ఈ కేంద్రాల ద్వారానే చేసింది. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల్లో పేరులోనే సేవ ఉంది తప్ప రైతులకు ఎలాంటి సేవలు అందడం లేదు. ఎరువుల సరఫరా పూర్తిగా సొసైటీల ద్వారానే సాగుతోంది. విత్తనాల పంపిణీలోనూ జాప్యం జరగటంతో రైతులు బయటి మార్కెట్‌పై ఆధారపడి విత్తనం తెచ్చుకుని అతికష్టం మీద ఈ ఖరీఫ్‌లో సాగు చేపట్టాల్సి వచ్చింది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 390 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 367 వ్యవసాయ శాఖ పరిధిలోనూ, 27 ఫిషరీస్ శాఖ పరిధిలోనూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఈ కేంద్రాల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. కియోస్క్‌లు మరమ్మతులకు గురయ్యాయి. వీటిని అందుబాటులోకి తీసుకొచ్చి సేవలను అందించటంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నిర్మించిన రైతు సేవా కేంద్రాలు తుదిదశ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేయటంతో ఆ భవనాలు అలంకార ప్రాయంగా మారాయి. సిబ్బంది రేషనలైజేషన్‌తో సేవలు దూరం తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. గతంలో గ్రామ జనాభా ఆధారంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దాన్ని కూటమి ప్రభుత్వం సాగు విస్తీర్ణం ఆధారంగా సిబ్బంది మదింపు చేసింది. వ్యవసాయశాఖ పరిధిలోని 367 రైతు సేవా కేంద్రాలకు గానూ వీఏఏలు 302 మంది, వీహెచ్‌ఏలు 18 మందిని కేటాయించారు. ఏఈఓలు 19, ఎంపీఈఓలు ఒకరు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వీఏఏ, వీహెచ్ఏలే గ్రామాల్లో అందుబాటులో ఉండే పరిస్థితి. అది కూడా సాగు విస్తీర్ణం ఆధారంగా 337 కేంద్రాలకు పరిమితం చేయటంతో మిగిలిన కేంద్రాలకు తాళాలు పడినట్టే. ఆయా కేంద్రాలకు అదనపు బాధ్యతలు అప్పగించిన వీఏఏలు, వీహెచ్‌ఏలు గ్రామాల్లో అందుబాటులో లేక రైతులకు ఆ శాఖ ద్వారా సేవలు, సమాచారం కరువవుతోంది. అందుబాటులో రైతు సేవా కేంద్రాలు ఉన్నా అవి మూసి ఉంటుండటంతో సేవలు అందక అవస్థలు పడాల్సి వస్తోందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు సిబ్బంది మదింపుతో తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి విధులు నిర్వహించాల్సి రావటంతో పనిభారం పెరుగుతోందని వీఏఏలు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వ చర్యలతో రైతులకు అడుగడుగునా కష్టాలే. గతంలో రైతు భరోసా కేంద్రాలతో రైతులకు భరోసాగా ఉండేది. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేవి. కియోస్క్‌ల ద్వారా మెరుగైన సేవలు అందించారు. కూటమి పాలనలో అవేవీ అందడం లేదు. సిబ్బంది రేషనలైజేషన్‌తో సేవలు కూడా రైతులకు అరకొరగా అందే పరిస్థితి. ఈ దుస్థితికి ప్రభుత్వ విధానాలే కారణం. –కొండవీటి వెంకట సుబ్బారావు, రైతు, మంతెన రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చింది. మారిస్తే మార్చారు కాని... ప్రస్తుతం రైతులకు భరోసా లేదు...సేవా లేదు. ఈ ప్రభుత్వంలో తమ గోడు పట్టించుకునే నాథుడే లేడని రైతులు వాపోతున్నారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు!
లబ్బీపేట(విజయవాడతూర్పు): పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు గెలిచామని చెప్పుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని అక్కడి ప్ర జలను ఓట్లు వేయనీయకుండా, ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకు వచ్చి దొంగ ఓట్లు వేయించిన తీరును రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. గుణదలలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు ఒంటిమిట్ట, పులివెందుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి, దానిపై పేలాలు ఏరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యం వర్ధిల్లిందంటూ మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ వీడియోలో, పోలింగ్ బూత్‌లో కలెక్టర్ పరిశీలన చేస్తున్నట్లు విడుదల చేసి న వీడియోల్లోనే దొంగ ఓటర్లు ఉన్నారని అన్నారు. అలా దొంగ ఓట్లు వేసిన వారిపై పోలీసులు, ఎన్నిక ల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదని అవినాష్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసి, అత్యంత దారుణంగా ఎన్నికలు నిర్వహించారని, ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. టీడీపీ గూండాలు దాడులు చేసి, గాయపడిన వైఎస్సార్సీపీ వారిపైనే ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు పెట్టడం దుర్మార్గం అన్నారు. ఓట్లు వేసేందుకు వెళ్లిన వారిని అడ్డుకున్నారని, స్లిప్‌లు లాక్కుని తామే ఓటేశారని, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారని అవినాష్ మండిపడ్డారు. అధికార పార్టీ ఏ విధంగా గెలిచిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. -
వ్యాధుల ముప్పు.. అప్రమత్తతే మందు
వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కుసిరిన వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విజయవాడలోని పలు కాలనీలు నీటమునిగాయి. అన్ని రోడ్లలో మురుగుతో కలిసి వర్షపునీరు తిష్టవేసింది. దీంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరద ప్రాంతాలతో పాటు, అన్ని ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా చూడా లని, తాగునీటిని కాచి చల్లార్చిన తర్వాత మాత్రమే తాగాలని స్పష్టంచేస్తున్నారు. అంటు వ్యాధుల భయం ● వరదలు వచ్చిన ప్రాంతంలో ఆహారం, నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో వాంతులు, విరేచనాలు, అతిసార వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ వ్యాధుల లక్షణాలు ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం ఏర్పడవచ్చు. ● వరద ప్రాంతాల ప్రజలు కొన్ని రోజుల పాటు చేతి పంపులు, కుళాయిల ద్వారా వచ్చే నీటిని తాగకుండా ఉండటం మంచింది. మంచినీటి పైపులు, డ్రెయిన్లు పక్కపక్కనే ఉంటే, ఆ రెండింటిలో నీరు కలిసే ప్రమాదం ఉంటుంది. ఇలా నీరు కలిసి కలుషితమైతే అనేక రకాల బ్యాక్టీరియాలతో పాటు, ఈ–కోలి వంటివి శరీరంలోకి చేరి అనారోగ్యానికి గురిచేస్తాయి. ● ఆర్ఓ వాటర్ బాటిళ్లలోని నీరు కూడా సురక్షితమని చెప్పలేం. ఆ నీటిని కూడా 30 నిమిషాల పాటు కాచి చల్లార్చి తాగితే మంచిది. ● వరద ప్రాంతాల్లోని ప్రజలు కొన్ని రోజుల పాటు బయట ఆహారం తినకూడదు. ఇప్పటికే ప్రబలిన జ్వరాలు ఇప్పటికే విజయవాడతో పాటు, ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీజనల్ ఫ్లూ జ్వరాలు ఉన్నాయి. ఇప్పుడు వరద నేపథ్యంలో అవి ఇంకా విజృంభించే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటివి ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ● నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వ్యాప్తి చెందితే మలేరియా, డెంగీ, గున్యా వంటి విషజ్వరాలు సోకుతాయి. ప్రస్తుతం నగరంలో ఈ జ్వరాలు ఉన్నందున, ఈ వరదతో మరింత పెరిగే అవకాశం ఉంది. ● ఈగల ద్వారా కూడా బ్యాక్టీరియా ఆహార పదార్థాలపైకి చేరి వ్యాధులు సోకే అవకాశం ఉంది. ● విజయవాడలో ఇప్పటికే పారిశుద్ధ్య సమస్య ఉన్న నేపథ్యంలో వరదలతో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. వర్షాలతో పలు కాలనీల్లో నీళ్లు రావడంతో ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం. అంతేకాకుండా కాలనీల్లోకి నీరు వచ్చిన ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం 24 శిబిరాలు ఏర్పాటు చేశాం. ఇంకా అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు కూడా వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్జిల్లా -
మల్లవల్లి మహిషమ్మ తల్లి దేవస్థానంలో చోరీ
హనుమాన్‌జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఈదులగూడెం రోడ్డులో ఉన్న మహిషమ్మ తల్లి దేవస్థానంలో బుధవారం అర్థరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. గ్రామ శివారులో మామిడి తోటల మధ్య నిర్మానుష్య ప్రాంతంలో ఆలయం ఉండటంతో రాత్రివేళ దొంగలు సులువుగా దోపిడీ చేశారు. ఆలయ ప్రధాన ద్వారం తాళం ధ్వంసం చేసి గర్భగుడిలోకి ప్రవేశించిన దుండగులు హుండీ అపహరించుకుపోయారు. ఆలయ వెనుక ప్రాంగణంలో హుండీని ధ్వంసం చేసి అందులోని నగదు తీసుకుని పరారయ్యారు. ఆలయ గర్భగుడిలో బీరువాలో భద్రపర్చిన అమ్మవారి నూతన వస్త్రాలు, ఇతర ఆభరణాలను కూడా దుండగులు అపహరించారు. ముఖానికి మాస్క్‌లు ధరించిన ఇద్దరు యువకులు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి హుండీ అపహరించటం, బీరువా ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. గురువారం ఉదయం ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వీరవల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై వీరవల్లి ఎస్ఐ ఎం.శ్రీనివాస్ విచారణ చేపట్టారు. -
ప్రగతి సూచికలే ‘స్వర్ణాంధ్ర’ పునాదులు
●పీ4 అమలులో జిల్లాను ముందు వరుసలో నిలపాలి ●జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ●విజయవాడ రైతు శిక్షణ కేంద్రంలో డీఆర్సీ సమావేశం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర నిర్మాణానికి కీలక ప్రగతి సూచికలే (కేపీఐ) పునాదులని.. నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఇంచార్జి మంత్రి సత్యకుమార్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అన్ని రంగాల్లోనూ వృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. బుధవారం విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్‌లోని రైతు శిక్షణ కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా మూడో సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశతో పాటు ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకటరావు, వసంత వెంకట కృష్ణ ప్రసాద్, తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కొలికపూడి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు హాజరయ్యారు. తొలుత కలెక్టర్ లక్ష్మీశ.. సుపరిపాలనలో తొలి అడుగు పనుల్లో ప్రగతిని వివరించారు. మొత్తం రూ. 167.37 కోట్లతో శంకుస్థాపన చేసిన 1,661 పనుల్లో ఇప్పటికే 1,339 పనులు ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించి 18.5 శాతం వార్షిక వృద్ధి లక్ష్యాల సాధనకు తీసుకుంటున్న చర్యలను, రంగాల వారీగా జీవీఏ, జీడీడీపీ, తలసరి ఆదాయ లక్ష్యాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు సానుకూల దృక్పథంతో పని చేయాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకునేందుకు నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. డీఆర్సీ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. 2024–25లో జిల్లా జీడీపీ రూ. 94,561 కోట్లు కాగా దీన్ని 2025–26లో రూ.1,12,057 కోట్లకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. అదేవిధంగా 2024–25లో తలసరి ఆదాయం రూ. 3,53,150 కాగా దీన్ని 2028–29 నాటికి రూ. 6,38,946కు చేర్చాల్సి ఉందన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన పీ4 విధానం అమల్లో జిల్లాను ముందు వరుస లో నిలబెట్టేందుకు కృషి చేయాలని సూచించా రు. విజయవాడ నగర ఘన వారసత్వ సంపద ను భావితరాలకు అందించేందుకే విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. కీలక అంశాలను ముందుంచిన ఎమ్మెల్యేలు.. సమావేశంలో ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి వివిధ అంశాలను ప్రస్తావించారు. పీఎం సూర్యఘర్ పథకం అమలు, గహ నిర్మాణాల వేగవంతానికి రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతుల ఏర్పాటు, అడ్డంకులు లేని సురక్షిత తాగునీటి పథకాల పటిష్ట అమలు, ఆర్ అండ్ బీ రహదారుల మరమ్మతులు, గన్నవరం–విజయవాడ రహదారి, లింకు రోడ్ల అభివృద్ధి, విజయవాడ అర్బన్ పరిధిలో కొండ ప్రాంతాలకు రెయిలింగ్, ఆటోనగర్ల అభివృద్ధి, సౌకర్యాల కల్పన, వివిధ ప్రాజెక్టుల డీపీఆర్‌ల రూపకల్పన, వేదాద్రి–కంచల ఎత్తిపోతల పథకాల సమస్యల పరిష్కారం తదితరాలపై చర్చించారు. ఎ.కొండూరుకు కృష్ణా జలాల సరఫరాకు సంబంధించి ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయినందున, పైపులైన్ల పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎ.కొండూరు డయాలసిస్ కేంద్రంలో వారానికి ఒకసారి కా కుండా రెండు రోజులు నెఫ్రాలజిస్టు సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వీటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, సీపీవో వై.శ్రీలత, ఆర్టీఓలు కె.బాలకృష్ణ, కె.మాధురి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డ్వాక్రా బజార్ల ఏర్పాటు కీలకం : ఎంపీ శివనాథ్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి వివిధ అంశాలను ప్రస్తావించారు. విజయవాడ అర్బన్ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు డ్వాక్రా బజార్ల ఏర్పాటు, ఎర్రకట్ట పై వంతెన ఆధునికీకరణ, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ వర్క్ డీపీఆర్, అర్బన్ నియోజకవర్గాల పరిధిలో ఫుడ్ కోర్టుల ఏర్పాటు, మూడు కాలువల గట్ల సుందరీకరణతో పాటు గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనలు, గ్రేటర్ విజయవాడ ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను వివరించారు. -
విద్యార్థులూ.. డ్రగ్స్ జోలికెళ్లొద్దు!
●ఉన్నత లక్ష్య సాధన దిశగా అడుగులేయండి ●ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ కృష్ణలంక(విజయవాడతూర్పు): విద్యార్థులు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన దిశగా అడుగులేయాలని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. విజయవాడ గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో బుధవారం యునైటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల స్వాగత కార్యక్రమాన్ని సంయుక్త పేరుతో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐజీ విద్యార్థులతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలు వంటి దుర్వసనాల బారినపడితే జీవితం అంధకారంగా మారుతుందని హెచ్చరించారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారికి 20 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఈ చట్టం కింద విద్యార్థులపై కేసు నమోదైతే జీవితం అంధకారంగా మారుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాల వినియోగానికి, సరఫరాకు దూరంగా ఉండాలని హితవు పలికారు. డ్రగ్స్ రహిత సమాజం నిర్మించాలి.. విజయవాడ డీసీపీ కె.జి.వి.సరిత మాట్లాడుతూ జీవితంలో స్థిరపడి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని, దేశ ప్రగతికి కృషి చేయాలన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం విద్యా సంస్థల నిర్వాహకులు, విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. ఈగల్ ఎస్పీ కె.నగేష్‌బాబు మాట్లాడుతూ ఆతిధ్య రంగంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అపారమైన ఉపాధి అవకాశాలున్నాయన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ లక్ష్య సాధనలో విద్యార్థులే కీలకమన్నారు. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని కళా నైపుణ్యాలను వెలికితీసి వారిని బహుముఖ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దటమే సంయుక్త లక్ష్యమన్నారు. అనంతరం ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు అనే బ్యానర్లును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీ అబ్దుల్ రెహమాన్, యునైటెడ్ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కరీమా, ప్రిన్సిపాల్ జగదీష్ జంపన, ఈవెంట్ మేనేజర్ ఉష, ఈగల్ ఇన్స్పెక్టర్ ఎం.రవీంద్ర, ఎస్ఐ ఎం.వీరాంజనేయులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్‌తో ప్రొక్లెయిన్ డ్రైవర్ మృతి
వీరులపాడు: విద్యుదాఘాతంతో ప్రొక్లెయిన్ డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని జయంతి గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు... గ్రామానికి చెందిన వల్లబోయిన గోపి (32) ప్రొక్లెయిన్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం గ్రామ శివారులోని వ్యవసాయ పనులు ముగించుకుని ప్రొక్లెయిన్‌ను లారీపై ఎక్కించి గ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఎస్సీ కాలనీ వద్దకు వచ్చే సరికి 11 కెవీ విద్యుత్ తీగలు ప్రొక్లెయిన్‌కు అడ్డురావటంతో తప్పించబోయాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఉంది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ అనిల్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
టీడీపీ నేత వేధింపులే కారణం పెనమలూరు: టీడీపీ నేత బరి తెగించాడు. సచివాలయ మహిళా ఉద్యోగినిని బూతులు తిడుతూ బెదిరించాడు. దీంతో ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవటానికి బందరు కాలువలో దూకే యత్నం చేయగా మున్సిపాలిటీ ఉద్యోగులు, స్థానికులు ఆమెను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. యనమలకుదురులో గ్రామ నాయకుడు, మరో వార్డు నాయకుడు కొద్ది రోజులుగా వీధి దీపాల వ్యవహారంలో పెత్తనం చెలాయిస్తున్నారు. వీధి దీపాలు వేయాలంటే తమ అనుమతి తీసుకోవాలని హుకుం జారీ చేశారు. దీంతో సచివాలయ సిబ్బందికి ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. మరో టీడీపీ నేత తాను ఉండే ప్రాంతంలో రెండు రోజుల క్రితం వీధి దీపాలు వేయించాడు. ఇది తెలుసుకున్న గ్రామ టీడీపీ నాయకుడు ఆగ్రహంతో బుధవారం సచివాలయానికి వచ్చి విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగిని నిలదీస్తూ ఎవరిని అడిగి వీధి దీపాలు వేయిస్తున్నావని తీవ్రంగా దూషించాడు. బూతులు తిట్టడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆమె వెంటనే యనమలకుదురు లాకుల వద్దకు వచ్చి బందరు కాలువలో దూకబోయింది. సహచర సిబ్బంది ఆమెను వారించి రక్షించారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. ఈ విషయమై కమిషనర్ నజీర్‌ను వివరణ కోరగా ఘటనపై విచారిస్తానని, వీధి దీపాలు వేయటానికి ఎవ్వరి సిఫార్సు అవసరం లేదని చెప్పారు. బీరువా పగులగొట్టి నగలు చోరీ చిట్టినగర్(విజయవాడపశ్చిమ): బీరువా తాళాలు పగులగొట్టి వెండి, బంగారు నగలను చోరీకి పాల్పడిన ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబాపురం పరిధిలోని పైపుల రోడ్డు సమీపంలోని కృష్ణ బాబాయి హోటల్ వద్ద పన్నేరి దుర్గాప్రసాద్ తన భార్య సుమతో కలిసి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. దుర్గాప్రసాద్ ఎసీ టెక్నిషియన్‌గా పని చేస్తుంటాడు. ఈ నెల 10వ తేదీన దుర్గాప్రసాద్ భార్యకు ఇంట్లో సీమంతం జరిగింది. అదే రోజు సాయంత్రం సుమా పుట్టింటికి వెళ్లింది. 12వ తేదీ మధ్యాహ్నం దుర్గాప్రసాద్ తన ఇంటికి వచ్చి భార్యకు కావాల్సిన కొన్ని బట్టలు తీసుకుని అత్త గారి ఇంటికి వెళ్లాడు. అయితే బట్టలు సరిపోలేదని మరో డ్రెస్ తెచ్చేందుకు బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి కనిపించాయి. లోపలకు వెళ్లి చూడగా బీరువా తాళం పగలగొట్టి అందులో వస్తువులు చిందర వందరగా పడేసి కనిపించాయి. బీరువాలో ఉండాల్సిన నాలుగు గ్రాముల బంగారు నల్లపూసలు, 3 గ్రాముల బంగారపు చెవిదిద్దులు, 300 గ్రాముల వెండి వస్తువులు, కొంత నగదు చోరీకి గురయినట్లు గుర్తించాడు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అమరేశ్వరుని పవిత్రోత్సవాలు ప్రారంభం అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించే పవిత్రోత్సవాలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. తొలిరోజు బుధవారం ఉదయం 5గంటల నుంచి ఆలయ ఆవరణను శుద్ధిచేసి భక్తులకు 9 గంటలకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. రెండవరోజు గురువారం పవిత్రో త్సవాలలో మండప పూజలు, దీక్షాహోమాలు, మూలమంత్ర హవనములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చండీహోమం నిర్వహిస్తామని ఆలయ ఈవో రేఖ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. -
విద్యతోనే జ్ఞాన సముపార్జన
గుడ్లవల్లేరు: ఆకాశమే హద్దుగా విద్యార్థులు జ్ఞాన సముపార్జనకే విద్య అభ్యసించాలని స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ జి.వి.వి.సత్యనారాయణ మూర్తి అన్నారు. వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రిరావు 17వ స్మారక అవార్డుల ప్రదానోత్సవం బుధవారం నిర్వహించారు. గుడ్లవల్లేరు ఎ.ఎ.ఎన్.ఎమ్ అండ్ వి.వి.ఆర్.ఎస్.ఆర్. పాలిటెక్నిక్ కాలేజీలో బుధవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ అవార్డులను సాంకేతిక విద్యామండలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించారన్నారు. విద్యా విధానంలో మార్కులకు ప్రాతిపదికగా కాకుండా నైపుణ్యాలను పెంపొందించే దిశగా పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ వారితో ఒప్పందాన్ని కుదుర్చుకొనే దిశగా అడుగులువేస్తున్నామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యను అందించటంలో లాభాపేక్ష లేని ఒక విద్యా వ్యవస్థను స్థాపించడంలో దివంగత వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రిరావు ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు. గుడ్లవల్లేరు ఏఏఎన్‌ఎమ్ అండ్ వీవీఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ విద్యార్థిని ఆలూరి లలిత కోమలికు రూ.10వేల విలువైన బంగారు పతకాన్ని, రూ.10వేల నగదును, డి.టి.ఇ ధ్రువీకరించిన ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ద్వితీయ ర్యాంకు సాధించినందుకు గాను శ్రీ వాసవి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ – టెక్నాలజీ నందమూరు పాలిటెక్నిక్‌కు చెందిన విద్యార్థిని అంకెం అఖిలా దేవికి రూ.5ల విలువగల బంగారు పతకాన్ని, రూ.5 వేల నగదును, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కాలేజీ ప్రెసిడెంట్ వల్లభనేని సుబ్బారావు, గారు, కో– కరెస్పాండెంట్ వల్లూరుపల్లి రామకృష్ణ తదితనేఏ పాల్గొన్నారు. స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సత్యనారాయణమూర్తి -
పోలీసుల అదుపులో ఇద్దరు బాల నేరస్తులు
గన్నవరం: బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు బాల నేరస్తులను గన్నవరం పోలీసులు బుధవారం అదుపులో తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. హైదరాబాద్ జువైనల్ హోమ్ నుంచి ఈ ఏడాది జూలై 22న ఐదుగురు బాల నేరస్తులు పారిపోయారు. వీరిలో ఇద్దరు హయత్‌నగర్, చౌటుప్పల్‌లో రెండు బైక్‌లను చోరీ చేసుకుని విజయవాడ వచ్చి రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉంటూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక దావాజీగూడెం రోడ్డులోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేసి ఉన్న రెండ్ బైక్‌లు ఈ నెల 6వ తేదీ రాత్రి అపహరించారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ శ్రీధర్ నేతృత్వంలోని సిబ్బంది సాంకేతిక ఆధారాలు మేరకు స్థానిక కోనాయి చెరువు సమీపంలో బైక్‌పై వెళ్తున్న ఇరువురు బాల నేరస్తులను అదుపులో తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ. 4.30 లక్షల విలువైన మూడు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల గురించి హైదరాబాద్‌లోని జువైనెల్ హోమ్‌కు సమాచారం ఇచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. -
ఆటోపై కూలిన తాటి చెట్టు.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
నందమూరు(గన్నవరం): రోడ్డుపై వెళ్తున్న ఆటోపై తాటి చెట్టు కూలి డ్రైవర్ తీవ్రంగా గాయపడిన ఘటన ఉంగుటూరు మండలం నందమూరు వద్ద బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం... ఉంగుటూరు మండలం ముక్కపాడుకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీను తెల్లవారుజామున పెనమలూరులో ఉన్న బందువులను ఎక్కించుకుని వచ్చేందుకు బయలుదేరాడు. నందమూరు వద్దకు రాగనే భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి రోడ్డు పక్కనే ఉన్న తాడిచెట్టు కూలి ఒక్కసారిగా ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో శ్రీనుకు బలమైన గాయాలు కావడంతో ఉయ్యూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉంగుటూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. వర్షానికి కూలిన చెట్టును ఢీకొని బైకిస్టు దుర్మరణం గుణదల(విజయవాడ తూర్పు): వర్షానికి రోడ్డుపై కూలిన చెట్టును ఢీకొని మోటారు సైకిల్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెండాడు. ఈ ఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., గుణదల హరిజన వాడకు చెందిన తుళ్లూరి మహేష్ బాబు (37) యనమల కుదురు ప్రాంతంలో ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తుంటాడు. రెండేళ్ల క్రితం స్వాతి అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. రోజు ఉదయం షాపు నిర్వహించేందుకు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం యనమలకుదురు వెళ్లిన మహేష్‌బాబు రాత్రి 11.30 గంటలకు గుణదలలోని ఇంటికి ప్రయాణమయ్యాడు. అప్పటికే వర్షానికి లయోల కళాశాల రోడ్డులో ఓ చెట్టు పడిపోయింది. రాత్రి సమయంలో వేగంగా వెళుతున్న మహేష్‌బాబు రోడ్డు పై పడి ఉన్న చెట్టును ఢీ కొట్టాడు. బలమైన గాయాలు కావడంతో రోడ్డుపై అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు 108 సహాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమిక వైద్యం అందించేందుకు వచ్చిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. మహేష్‌బాబు బైక్ పై వచ్చి చెట్టుకు ఢీ కొట్టిన సీసీ కెమేరా ఫూటేజిలు లభ్యమయ్యాయని మాచవరం సీఐ ప్రకాష్ తెలిపారు. తండ్రి హత్య కేసులో కొడుకు అరెస్టు పెనమలూరు: తండ్రిని హత్య చేసిన కేసులో కొడుకు అరెస్టయ్యాడు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిగడప శ్రీనివాసానగర్కు చెందిన నన్నం శౌరి(68), నన్నం కేశవరావులు తండ్రీకొడుకులు. ఇద్దరూ పెయింటింగ్ పనులు చేస్తుంటారు. రెండు రోజల కిందట కేశవరావు తనతో పాటు పనికి రావడం లేదనే కోపంతో తండ్రిపై దాడి చేశాడు. గాయపడి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించగా శౌరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ఈ ఘటనను రోడ్డు ప్రమాదంలో శౌరి గాయపడ్డాడని తప్పుదారి పట్టించటానికి కేశవరావు యత్నించాడు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావటంతో పోలీసులు కేశవరావుపై హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయగా కోర్టు రిమాండ్ విధించింది. -
దుర్గమ్మ సన్నిధిలో 16న కృష్ణాష్టమి వేడుకలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆగస్టు 16వ తేదీ శనివారం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కృష్ణ భగవానుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. లక్ష్మీ గణపతి విగ్రహం ఎదురుగా ఉన్న గోశాల వద్ద గోమాతకు విశేష పూజలు, సాయంత్రం 5 గంటలకు మహా మండపం కళావేదికపై దేవస్థాన పురాణ పండితులచే ఉపన్యాసం ఉంటుందని తెలిపారు. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం రాజగోపురం ఎదుట ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. 19, 20 తేదీల్లో దరఖాస్తుల పంపిణీ.. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో నిర్వహించే ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తులకు 19, 20వ తేదీలలో దరఖాస్తులను అందిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. 22వ తేదీ 5వ శుక్రవారం మహా మండపం ఆరో అంతస్తులో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్న సంగతి తెలిసింది. ఈ వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొనే భక్తులకు మహా మండపం గ్రౌండ్ ప్లోర్లో ఉన్న దేవస్థాన టోల్ ఫ్రీ కార్యాలయంలో ఉదయం నుంచి దరఖాస్తుల పంపిణీ జరుగుతుందన్నారు. దరఖాస్తులను పూర్తి చేసి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని జత చేసి తిరిగి కార్యాలయంలో అందచేయాలని తెలిపారు. -
బందరులో ‘క్విట్ కార్పొరేట్’ నిరసన
మచిలీపట్నంటౌన్: వ్యవసాయ రంగంలో కార్పొరేట్ల ప్రవేశాన్ని అడ్డుకోవాలని సీఐటీయూ, వ్యవసాయ, రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు బుధవారం మచిలీపట్నం కోనేరు సెంటర్లో ధర్నా నిర్వహించారు. వ్యవసారంగంలో ఇప్పటికే చిన్న కమతాల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 20 సెంట్లు భూమి కలిగిన చిన్న రైతులకు అన్నదాత భరోసా పథకం వర్తించడం లేదని కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం నారాయణరావు మాట్లాడుతూ మన రాష్ట్రం నుంచి అత్యధికంగా పండే ఆక్వా ఉత్పత్తులపై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల భారం నుంచి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం కాపాడాలన్నారు. ఇతర దేశాలకు సరుకు ఎగుమతుల్లో ప్రోత్సహించి రొయ్యల రైతులకు గిట్టుబాటు ధర అదే విధంగా చూడాలని కోరారు. కృష్ణాజిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కోసూరు శివ నాగేంద్ర మాట్లాడుతూ అధిక వర్షాల బారిన పడి ముంపునకు గురైన వరి రైతులను ఆదుకోవాలన్నారు. వేలాది రూపాయల ఖర్చుపెట్టి వరి నాట్లు పూర్తి చేసిన రైతులకు నీటి ముంపు సమస్య తీరని నష్టం కలిగించిందన్నారు. డ్రెయిన్ల నిర్వహణ వేసవి కాలంలో చేపట్టి పనులు పూర్తి చేసి ఉంటే ముంపు నీరు త్వరగా తరలిపోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరావు మాట్లాడుతూ రైతుల పండించిన పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కాగితాల మేరకు ఉంటుందని ఆచరణలో అమలు జరగడం లేదన్నారు. రైతులు తమ పండించిన పంటలు అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఐటీయూ కృష్ణా జిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం, నగర కన్వీనర్ సీహెచ్ జయరావు, బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకుడు ఎండీ యూనస్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాల విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): పాఠశాల విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో పాఠశాల విద్య, నిర్మాణ అంశాలపై ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడతూ కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ దార్శనికత –2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంగా లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ క్రమంలో పాఠశాల విద్య మెరుగుదలకు విద్యాధికులు కృషి చేయాలన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో పాఠశాల స్థాయిలో వారికి సబ్జెక్టుపై పట్టు సాధించానికి నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన నైపుణ్యాలు అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం చాలా ముఖ్యమని పేర్కొంటూ ఆ దశలో వారికి వేయాల్సిన అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు అందించాలని చెప్పారు. రక్తహీనత నివారణకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని నైతిక విలువలు నేర్పిస్తూ మాదకద్రవ్యాల జోలికి పోకుండా చైతన్యవంతులను చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈవో పీవీజే రామారావు, సమగ్ర శిక్ష ఏపీసీ కుమిదినీసింగ్, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ శర్మిష్ట, జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్‌కుమార్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం.ఫణిదూర్జటి తదితరులు పాల్గొన్నారు. -
ఎడతెరిపి లేకుండా..
నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలతో పాటు పేట మున్సిపాల్టీలో మంగళవారం అర్ధరాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెనుగంచిప్రోలు మునేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. తిరుతపమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లింగాల బ్రిడ్జి వద్ద పది అడుగుల మేర మునేరు ప్రవహించడంతో వత్సవాయి మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. జగ్గయ్యపేట మున్సిపాల్టీలోని ఎర్రకాలువ ఉప్పొంగడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. -
ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ పంచాయతీల వివరాలు
గ్రామ పంచాయతీలు 288 గ్రామ సచివాలయాలు 255 మార్చిలో రావాల్సిన ఆర్థి సంఘం నిధులు రూ.11.76కోట్లు జగనన్న కాలనీలు 291 గ్రేడ్–1 కార్యదర్శులు 40 గ్రేడ్–2కార్యదర్శులు 43 గ్రేడ్–3 కార్యదర్శులు 41 గ్రేడ్–4కార్యదర్శులు 10 గ్రేడ్–5కార్యదర్శులు 175 గ్రేడ్–6 కార్యదర్శులు 233 పంచాయతీ కార్మికులు 2200 -
ముంచేసినది
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మంగళవారం అర్ధరాత్రి, బుధవారం జిల్లాలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాలో, విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. బుడమేరు వాగు ఉధృతి పెరుగుతోంది. విజయవాడ పశ్చిమలో డ్రెయిన్లు పొంగి, రోడ్ల మీద నాలుగు అడుగుల మేర నీరు చేరాయి. ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం.. టీడీపీ 53వ డివిజన్ అధ్యక్షుడు తిరువాయి పాటి మధుసూదరావు, టీడీపీ కార్యకర్త షేక్ ముర్తజ్ను పొట్టన పెట్టుకొంది. గులాం మొహద్గీర వీధిలో యూజీడీ కోసం అనేక చోట్ల 10నుంచి 14 అడుగుల గోతుల్ని తీసి రక్షణ చర్యలు చేపట్టలేదు. దీంతో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వర్షం నీరు మూడునుంచి నాలుగు అడుగుల మేర నిలిచింది. అక్కడ గోతులు ఉన్నాయనే విషయం తెలియక గీతా మందిరం వీధి చివర గొయ్యిలో మధుసూదనరావు, జెండా చెట్టు వద్ద వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకొని ముర్తాజ్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. విధ్యాధరపురం డిపో, జోనల్ వర్క్‌షాపు, వించిపేట, గణపతిరావునగర్, తారక రామనగర్, భవానీపురం, లేబర్ కాలనీ.. ఇలా పలు కాలనీలు నీట మునిగాయి. లయోల కాలేజీ సమీపంలో పటమట నివాసి అజయ్‌కుమార్‌పైన చెట్టు పడటం ప్రాణాలు విడిచారు. గుణదల సమీపంలోని పుల్లేటి డ్రెయిన్, టిక్కిల్ రోడ్డు, పన్నిమనేని పాలీక్లినిక్ రోడ్డు , ఈఎస్ఐ రోడ్డు, నిర్మల కాన్వెంట్ రోడ్డు, డెంటల్ కాలేజీ రోడ్డు , ఏలూరు రోడ్డు, బుడమేరు ఏలూరు కాలువ మధ్యకట్ట, ఆర్టీసీ లేబర్ కాలనీలో డ్రెయిన్లు పొంగాయి. కృష్ణా నదికి పెరుగుతున్న వరద కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో 3,44,638 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చింది. రెండు, మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు, పులిచింతల, మున్నేరు క్యాచ్మెంట్ ఏరియా నుంచి వరద నీరు పోటెత్తే అవకాశం ఉంది. దీంతో రానున్న రోజుల్లో ప్రకాశం బ్యారేజీకి 5లక్షల క్యూసెక్కులకు వరద నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ నం. 91549 70454 ఏర్పాటు చేశారు. 87.03 మిల్లీమీటర్ల వర్షపాతం ఎన్టీఆర్ జిల్లాలోని 20 మండలాల్లో మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం రాత్రి 6.30 గంటల మధ్య 87.03 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఇబ్రహీంపట్నంలో 170.5 మిల్లీమీటర్లు, కంచికచర్లలో 110.7, జగ్గయ్యపేటలో 146.5, వీరులపాడులో 123.2, విజయవాడ నార్త్‌లో 123.8, విజయవాడ సెంట్రల్లో 127. 4, విజయవాడ వెస్ట్‌లో 127.4 , విజయవాడ ఈస్ట్‌లో 121.4, చందర్లపాడులో 102.4, విసన్నపేటలో 55.2, ఏ కొండూరులో 68.8, రెడ్డిగూడెంలో 109.3, మైలవరంలో 43.0, విజయవాడ రూరల్‌లో 60.0, నందిగామలో 78.0, జి కొండూరు లో 38.1, వత్సవాయిలో 62.3, పెనుగంచిప్రోలులో 63.6, తిరువూరులో 17.6 , గంపలగూడెంలో 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడలో పలుప్రాంతాలు జలమయం బుడమేరుకు వాగుకు పెరుగుతున్న వరద ఉధృతి గుణదల వంతెనపై నుంచి ప్రవహించిన నీరు కృష్ణా నది ఎగువ నుంచి భారీగా వరద విజయవాడ వన్‌టౌన్‌లో డ్రెయిన్‌లో పడి ఇద్దరు, లయోల కాలేజీ సమీపంలో మరొకరు మృతి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 91549 70454 రెండు రోజులుగా దంచికొడుతున్న వాన -
నిత్యాన్నదానానికి రూ.2 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బెంగుళూరుకు చెందిన భక్తులు బుధవారం రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. బెంగుళూరుకు చెందిన పిళ్లా రవి దంపతులు కుటుంబం సమేతంగా అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి రూ. 2 లక్షల విరాళాన్ని ఇచ్చారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఏఈవో ఎన్.రమేష్‌బాబు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. సాగరంలో ‘అల’జడి కోడూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హంసలదీవి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. బుధవారం ఉదయం నుంచి పాలకాయతిప్ప బీచ్ వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం నీరు ముందుకు చొచ్చుకురావడంతో పాటు తీరంలో ఈదురుగాలుల తీవ్రత అధికమైంది. సముద్ర స్థితిగతుల్లో మార్పు కనిపిస్తోందని పాలకాయతిప్ప మైరెన్ పోలీసులు తెలిపారు. బీచ్ వద్ద నుంచి సాగరసంగమం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర ఇసుక తిన్నెలు భారీగా కోతకు గురై భయానకంగా మారింది. భారీ వర్షాలు కూడా ఉండటంతో తీరంలో అలజడి నెలకొంది. గ్రంథాలయాలకు కంప్యూటర్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్లు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గ్రంథాలయాల ద్వారా పౌరులకు డిజిటల్ సేవలు అందించేందుకు శివశ్రీ చారిటబుల్ ట్రస్ట్, శిక్షణ ఫౌండేషన్, బెంగుళూరు గ్రంథాలయాలకు కంప్యూటర్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్లు అందజేశారు. కృష్ణా జిల్లాలోని 70 శాఖా గ్రంథాలయాలను ఎంపిక చేశారు. బుధవారం ఎంజీ రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ కృష్ణమోహన్, ప్రాజెక్టు మేనేజర్ వి. స్వాతిదేవ్ ఆయా గ్రంథాలయాలకు అందజేశారు. డైరెక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ జిల్లాలో 70 శాఖా గ్రంథాలయాలను ఎంపిక చేసి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు అందజేశారన్నారు. యువతకు, నిరుద్యోగులు, విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ వ్యవస్థ ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ స్వాతిదేవ్ మాట్లాడుతూ ఎంపిక చేసిన గ్రంథాలయాలకు 2 కంప్యూటర్లు, ఒక స్మార్ట్ టీవీ, ఒక స్మార్ట్ ఫోన్, ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ ఫౌండేషన్ టీం ప్రతినిధులు డి. సత్యనారాయణ, రాజారావు, ఎ.బుచ్చిబాబు, ఎ. కార్తీక్, కార్యదర్శి వి. రవికుమార్ ఠాగూర్ గ్రంథాలయాధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కానూరులో వాలీబాల్ పోటీలు పెనమలూరు: కానూరు సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సీటీలో ఆలిండియా ఇన్విటేషన్ వాలీబాల్ పోటీల వేదికగా మార్చారు. మూడు రోజులుగా విజయవాడ పీబీ సిద్ధార్థలో జరుగుతున్న పోటీలను వర్షం కారణంగా కానూరు సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సీటీలో పోటీలను బుధవారం ఉపకులపతి పి.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. లీగ్ విభాగంలో మహిళల పోటీలో తమిళనాడు స్పోర్ట్స్ అకాడమీ జట్టు కేరళ అజంష్షన్ కాలేజీపై గెలిచింది.ఏపీ ఎంసీఎఫ్ జట్టు చైన్నె ఎస్ఆర్ఎం యూనివర్సిటీపై విజయం సాధించింది. పురుషుల విభాగంలో చైన్నె ఎస్ఆర్ఎం జట్టు గుజరాత్ స్పోర్ట్స్ అకాడమీ జట్టుపై, తివేండ్రం స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియా జట్టు కేరళ హోలీ గ్రేస్ జట్టుపై గెలిచింది. నాకౌట్ పోటీలు పూర్తయ్యాయని, లీగ్ పోటీలతో టోర్నమెంట్ ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. -
మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు
కోనేరుసెంటర్: జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పోలీసులతో పాటు ప్రజలూ పాటుపడాలని ఎస్పీ గంగాధరరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జరిగిన నషా ముక్త్ భారత్ అభియాన్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందితో జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తామని, యువతను మత్తు పదార్థాల జోలికి పోకుండా పాటు పడతామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాలైన గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సమూలంగా నాశనం చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. యువత జీవితాలను చిత్తు చేస్తున్న గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను నాశనం చేయడానికి పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ఎస్పీ గంగాధరరావు -
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): స్వాతంత్య్ర వేడుకల కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం పోలీస్ పరేడ్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు, వీవీఐపీలు, వీఐపీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని కట్టుదిట్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీజీపీ మధుసూదనరెడ్డి, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు, ఐజీ బి.రాజకుమారి, డీసీపీలు కేజీవీ సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఏడీసీపీలు, ఏసీపీలు, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆటో కార్మికుల ఉపాధికి ముప్పు
మచిలీపట్నంఅర్బన్: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల ఉపాధికి ముప్పు ఏర్పడనుందని కృష్ణా జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మర్రాపు పోలినాయుడు తెలిపారు. జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ధర్నాచౌక్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. జిల్లాలో ఆటో వృత్తిపై 50వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. మహిళలకు ఉచిత బస్సుతో ఆటోల బాడుగలు తగ్గి, ఆదాయం ఉండదనే ఆందోళనలో ఆటో కార్మికులు ఉన్నారే కానీ, మహిళల ఉచిత బస్సు పథకానికి వ్యతిరేకం కాదన్నారు. ఇంధనంపై వ్యాట్ తగ్గింపు, జీవో నంబర్ 21 రద్దు, రుణ సబ్సిడీ మంజూరు చేయాలన్నారు. వాహన మిత్ర పథకం కింద డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో కార్మికుడికి సంవత్సరానికి రూ.25 వేల సాయం డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గింపు, వాహన కొనుగోలుకు రూ.4 లక్షల సబ్సిడీతో వడ్డీ రహి త రుణాలను మంజూరు చేయాలన్నారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మకు వినతిపత్రం సమర్పించారు. యూనియన్ నేతలు కె. దావీదు, ఎ. వెంక టేశ్వరరావు, కె. పోతురాజు, కరీముల్లా పాల్గొన్నారు. -
ఉత్సాహంగా తిరంగా ర్యాలీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా విజయవాడ రైల్వే డివిజన్లో తిరంగా బైక్, సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఆర్ఎం మోహిత్ సొనాకియా ర్యాలీని ప్రారంభించారు. ముందుగా దేశ సమగ్రత, అభివృద్ధికి కృషి చేస్తామని పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు దేశ ఐక్యత, దేశభక్తి, స్వేచ్ఛ, సమానత్వానికి శక్తివంతమైన స్ఫూర్తినిస్తుందన్నారు. అనంతరం క్లాక్ టవర్ నుంచి త్రివర్ణ పతాకాలతో స్టేషన్ రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా సత్యనారాయణపురంలోని ఈటీటీసీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏడీఆర్ఎం కొండా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కృష్ణా యూనివర్సిటీలో.. కోనేరుసెంటర్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం అనే నినాదంతో మంగళవారం కృష్ణా విశ్వవిద్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ ప్రాంగణంలో 100 అడుగుల జాతీయ పతాకంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉపకులపతి ఆచార్య కె. రాంజీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు వీసీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రెక్టార్ ఆచార్య ఎంవీ బసవేశ్వర రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, బోధనా సిబ్బంది పాల్గొన్నారు. -
చోరీకి గురైన 600 సెల్ఫోన్లు రికవరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంతో పాటు, పలు ప్రాంతాల్లో చోరీకి గురైన 600 సెల్ఫోన్లను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు రికవరీ చేశారు. వాటి విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మంగళవారం రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు సీపీ అందజేశారు. ఆయన మాట్లాడుతూ దొంగిలించిన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్‌తో రికవరీ చేసినట్లు తెలిపారు. వేర్వేరు ప్రాంతాలకు చెందినవి.. రికవరీ చేసిన మొబైల్స్‌లో ఏపీకి చెందిన 504, ఒడిశావి 20్ల, కర్ణాటక 18, మహారాష్ట్రకు చెందిన 16, రాజస్తాన్ 13, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 12 ఫోన్లు, బిహార్ 10, వెస్ట్ బెంగాల్ 7 మొబైల్స్ రికవరీ చేశామని తెలిపారు. అలాగే ‘సురక్ష’ ద్వారా ఆరువేల సీసీ కెమెరాలు ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. -
గిరిజనుల ఆలోచన విధానం మారాలి
నాగాయలంక: ఆదివాసీల అభ్యున్నతికి దేశవ్యాప్తంగా నాబార్డు అందిస్తున్న భూమి ఆధారిత ఉపాధి అవకాశాల కంటే భిన్నంగా నాగాయలంక ‘యానాది గిరిజన సంఘం జీవావరణ వ్యవస్థ ఆధారిత జీవనోపాధి మెరుగుదల’ ప్రాజెక్ట్ చేపట్టడం ఆనందదాయకంగా ఉందని నాబార్డు డీఎండీ అజయ్‌కుమార్ సూద్ పేర్కొన్నారు. శ్రీరామపాద క్షేత్రం పుష్కరఘాట్‌లోని ఫుడ్‌కోర్టు భవనంలో మంగళవారం సంఘం అధ్యక్షుడు పరుచూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. చేపలు పట్టడం, కేజ్ కల్చర్ లాంటి సముద్రం, నదీ జలాల ఆధారిత కార్యక్రమంగా ఈ ప్రాజెక్టు మొదటిదని ఆయన పేర్కొంటూ మారుతున్న సామాజిక పరిణామాలకు దీటుగా ఆదివాసీ యానాదులు ఆలోచనా విధానాలను మార్చుకొని జీవన ప్రమాణాల్లో అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షించారు. 25మందికి రూ. 12.75లక్షల విలువైన.. ఈ సందర్భంగా లబ్ధిదారులైన పలువురు గిరిజనులు తమ అనుభవాలను డీఎండీతో పంచుకున్నారు. తదుపరి ఎన్జీఓ ఆధ్వర్యంలో నాబార్డు–ట్రైబల్ డెవలెప్మెంట్ ఫండ్ ఆర్థిక సహకారంతో నాగాయలంక మండలంలోని మర్రిపాలెం, కమ్మనమోలు, సంగమేశ్వరం గ్రామాలకు చెందిన 25 మంది ఎస్టీ లబ్ధిదారులకు రూ.12.75లక్షల విలువైన అయిదు బోట్లు, ఐస్ బాక్స్‌లను డీఎండీ అందజేశారు. కార్యక్రమంలో నాబార్డు ఏపీఆర్ఓ సీజీఎం ఎం.రామ్‌గోపాల్, జీఎంలు కేవీఎస్ ప్రసాద్, ఎంపీ పహడ్సింగ్, కేడీసీసీబీ సీఈఓ ఎ.శ్యామ్ మనోహర్, పీపీఎస్ఎస్ కోఆర్డినేటర్ నక్కా విజయబాబు తదితరులు పాల్గొన్నారు. నాబార్డు డీఎండీ అజయ్‌కుమార్ సూద్ -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 202511ఘనంగా వినాయకునికి సంకటహర చతుర్థి పూజలు అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరస్వామి ఉపాలయంలో మంగళవారం సంకటహర చతుర్థి పూజలను నిర్వహించారు. స్వామి వారికి పుష్పాలు, గరికతో విశేషాలంకారం చేశారు.18 నుంచి టీటీడీ పవిత్రోత్సవాలు వెంకటపాలెం(తాడికొండ): ఈ నెల 18 నుంచి 21 వరకు వెంకటపాలెంలోని టీటీడీలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ పర్యవేక్షణాధికారి మల్లికార్జున తెలిపారు.తిరుపతమ్మకు బోనాలు పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారికి మంగళవారం జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాలు, పొంగళ్లతో బోనాలు సమర్పించారు. తిరువూరు: అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తాం అంటూ టిడ్కో ఇళ్ల విషయంలో ప్రజాప్రతినిధులు, అధికా రులు దాటేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన టిడ్కో ఇళ్లను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి విస్మరించింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 12 ప్రదేశాల్లో 24,792 టిడ్కో ఇళ్లను నిర్మించి పట్టణ పేదలకు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2017లో పనులు చేపట్టారు. సొంతిల్లు లేని పేద కుటుంబాలకు మూడు కేటగిరీల ఇళ్లను కేటాయించడానికి నిర్ణయించారు. కేటగిరీ–1లో 300 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లను, కేటగిరీ–2లో 365 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను, కేటగిరీ–3లో 430 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిపారు. కేటగిరీ–1 ఇళ్లకు రూ.5.72 లక్ష లు యూనిట్ ధర కాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.1.50 లక్షల చొప్పున నిర్మాణ వ్యయం భరించాలి. మిగిలిన రూ.2.71లక్షలను బ్యాంకు ద్వారా రుణం తీసుకోవాలని కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. ఈ కేట గిరీ ఇళ్లకు లబ్ధిదారు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. సొమ్ము తిరిగి ఇవ్వలేదు కేటగిరీ–2లో యూనిట్ నిర్మాణ వ్యయం రూ.6.74 లక్షలు, రూ.50వేలను లబ్ధిదారు వాటాగా నాలుగు విడతల్లో చెల్లించాలి. కేటగిరీ–3 ఇళ్లకు రూ.లక్ష లబ్ధి దారు వాటా నాలుగు విడతల్లో చెల్లించే అవకాశం కల్పించారు. కేటగిరీ 2, 3 ఇళ్లకు లబ్ధిదారులు వాటా సొమ్ము చెల్లించినా డిమాండ్‌కు సరిపడా ఫ్ల్లాట్ల నిర్మాణం చేపట్టలేదు. ఆ యూనిట్లను రద్దు చేసినట్లు అధికారులు నోటీసులు జారీ చేసినా, లబ్ధిదారులు చెల్లించిన సొమ్ము తిరిగి ఇవ్వలేదు. హామీలు గాలికి... తాము ఎన్నికల్లో గెలిస్తే వెంటనే టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేసి లబ్ధిదారులందరికీ అప్పగిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల హామీలో పేర్కొన్నా ఇప్పటివరకు పనులు పునఃప్రారంభించలేదు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడలో 77 ఎకరాల్లో నిర్మించిన 8900 టిడ్కో ఇళ్లను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2023లో లబ్ధిదారులకు పంపిణీ చేసింది. బందరులో 2,304 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టగా 544 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారు. తిరువూరు శివారు పీటీకొత్తూరులో 1536, నందిగామ హనుమంతుపాలెంలో 240, జగ్గయ్యపేటలో 3,168, విజయవాడ జక్కంపూడిలో 6,576, ఉయ్యూరులో 2,496, మచిలీపట్నంలో 1,760 టిడ్కో ఇళ్లను పూర్తిచేయాల్సి ఉంది. దాటవేత ధోరణి కూటమి నేతలను టిడ్కో ఇళ్ల కోసం పలు సందర్భాల్లో ప్రజా సంఘాలు నిలదీస్తున్నా సరైన సమాధానం రావట్లేదు. లబ్ధిదారులకు అన్ని సదుపాయాలు కల్పించిన టిడ్కో ఇళ్లను త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్ప డం మినహా ఎప్పటికిస్తారో చెప్పలేకపోతున్నారు. న్యూస్‌రీల్ టిడ్కో ఇళ్ల కోసం ఎదురుచూపులు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మరచిన కూటమి మాట దాటేస్తున్న నేతలు సొంతింటి కోసం సొమ్ము చెల్లించిన పేదలువరదొస్తోంది.. అప్రమత్తంగా ఉండండి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వర్షాలతో పాటు ఎగువ నుంచి కృష్ణా నదికి వరద నీరు పోటెత్తే అవకాశం ఉందని, ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లో 24/7 అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. ప్రజలను కూడా అప్రమత్తం చేయాలన్నారు. మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ.. ఆర్డీవోలతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, వీఎంసీ తదితర విభాగాల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అంతేకాక ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోందని, క్రమేణా 4–5 లక్షల క్యూసెక్కులకు కూడా చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 91549 70454 నంబరుతో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌ను యాక్టివేట్ చేయాలని, పునరావాస శిబిరాలను కూడా సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానంమచిలీపట్నంఅర్బన్: జిల్లా స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కృషా జిల్లా విద్యాశాఖాధికారి రామారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రదానం చేయనున్నారన్నారు. దరఖాస్తులను రెండు ప్రతులుగా సంబంధిత తనిఖీ అధికారుల సిఫారసులతో పాటు ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. జాతీయ ఉపకారవేతనాల కోసం.. దివ్యాంగ విద్యార్థులు జాతీయ ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని వికలాంగ సంక్షేమశాఖ సహాయ సంచాలకుడు పి.కామరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9, 10వ తరగతి విద్యార్థులు ఆగస్టు 31లోగా, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు అక్టోబరు 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
సింగిల్ బ్లండర్!
కంకిపాడు: సింగిల్ నంబర్ లాటరీ మోజులో జీవితాలు చిత్తవుతున్నాయి. అత్యాశతో కుటుంబాలు గుల్లవుతున్నాయి. కూటమి ప్రభుత్వ పాలనలో సింగిల్ నంబర్ లాటరీ టికెట్ల విక్రయాలు అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్నాయి. పచ్చ నేతల అండదండలతో అమ్మకందారులు ప్రజల ఆశను సొమ్ము చేసుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా సింగిల్ నంబర్ లాటరీకి అడ్డాగా మారినా.. పోలీసు యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తోంది. చిన్నా పెద్దా తేడా లేదు.. ఎవరో ఒకరికి చిన్న లాటరీ తగిలిందన్న ప్రచారంతో ఎక్కువ మంది సొమ్ములకు ఆశ పడి సింగిల్ నంబర్ లాటరీ టికెట్లకు బానిసలవుతున్నారు. 15 ఏళ్ల బాలుడి నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ల వరకూ ఈ టికెట్లను కొనుగోలు చేస్తున్న వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇళ్లల్లో ఉన్న సొమ్మును తీసుకొచ్చి లాటరీ టికెట్లను కొనేవాళ్లు కొందరైతే, పగలంతా కష్టం చేసి ఆ కష్టాన్ని మరుసటి రోజు ఉదయాన్నే లాటరీ విక్రేతల వద్దకు వెళ్లి లాటరీ టికెట్లు కొనేవాళ్లు మరికొందరు. ప్రతి ఏరియాలోనూ వందల సంఖ్యలో వీటికి బానిసలయ్యారు. వీరి ఆశను సొమ్ము చేసుకుంటూ లాటరీ విక్రేతలు ప్రతి రోజూ కోట్లలో వ్యాపారం సాగిస్తున్నారు. అంతా బాహాటంగానే.. లాటరీ విక్రయాలు అంతా బాహాటంగానే సాగుతున్నాయి. పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండు ప్రాంగణాలే వీరికి సింగిల్ నంబర్ విక్రయ కేంద్రాలుగా మారాయి. చైన్నె, విజయవాడ కేంద్రాల నుంచి వ్యాపారులు ఇక్కడి విక్రేతలకు లాటరీ టికెట్ల వివరాలను చెబుతారు. ఇందులో నల్లనేరం రూ. 150, స్వర్ణలక్ష్మి రూ. 800, విష్ణు రూ. 400, కుమరన్ రూ. 300, తంగం రూ. 80, సిక్కిం సూపర్ రూ. 80, లయన్ రూ. 1200 ఇలా అనేక రకాల కంపెనీలకు చెందిన లాటరీ టికెట్లు అమ్ముడవుతున్నాయి. వాటికి సంబంధించిన టికెట్లకు బదులుగా ఐదంకెల టికెట్ నంబరును పేపరుపైన, లేదా సిగిరెట్ డొక్కులపైనా రాసి కొనుగోలుదారులకు అప్పగిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఓ వెబ్సైట్ ద్వారా లాటరీ ఫలితాలు చూసుకోవాలని సూచిస్తారు. లాటరీ వచ్చేది అరుదు. అయినా ఆశతో ప్రతి రోజూ లాటరీ టికెట్ల కొనుగోళ్లు మాత్రం చేస్తున్నారు. విక్రేతలకు భారీగా కమీషన్లు.. టికెట్ల విక్రయాల్లోనూ విక్రేతలకు భారీ మొత్తంలో కమీషన్లు అందుతాయని సమాచారం. ప్రధాన కేంద్రాల నుంచి లాటరీ టికెట్ల నంబర్లను స్థానిక విక్రేతలకు పంపుతారు. ఆ మొత్తాన్ని విక్రేతల ద్వారా అదే రోజు ఆన్లైన్లో పంపకాలు జరుగుతాయి. సుమారు 40 శాతం మార్జిన్ ఉంటుంది. అంతేకాకుండా లాటరీ తగిలితే కమీషన్ పేరుతో ప్రధాన విక్రేతలకు, స్థానిక విక్రేతలకు 60–65 శాతం పోనూ 35–40 శాతం మాత్రమే కొనుగోలుదారుడికి చేతికొస్తుంది. ఫేక్ టికెట్లతో కాసుల పంట.. చోద్యం చూస్తున్న పోలీసులు.. సుమారు 15 ఏళ్ల క్రితం జిల్లాను ఈ సింగిల్ నంబర్ లాటరీ టికెట్ల విక్రయాలు కుదిపేశాయి. అప్పట్లో పలువురు దీనికి బానిసలై అప్పులు చేయటంతో వాటిని తీర్చే పరిస్థితి లేక ఇళ్లు, స్థలాలు తాకట్టు పెట్టడం, ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డ ఘటనలు జరిగాయి. ప్రస్తుతం మరోమారు ఈ వ్యాపారం జోరందుకుంది. అడ్డూ అదుపు లేకుండా వ్యాపారం సాగిపోతోంది. బహిరంగంగా టికెట్ల నంబర్లు చేతులు మారుతున్నా పోలీసులు మాత్రం కిమ్మనటం లేదు. వ్యాపారులను నియంత్రించే చర్యలు తీసుకోవటం లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వ్యాపారుల నుంచి పోలీసు శాఖకు భారీ మొత్తం నెలవారీ మామూళ్లు ముడుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అందువల్లే ఆ వ్యాపారం జోలికి వెళ్లటం లేదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అత్యాశతో చిత్తవుతున్న జీవితాలు జిల్లాలో జోరుగా సాగుతున్న సింగిల్ నంబర్ లాటరీ విక్రయాలు ఆశల వలలో చిక్కుకుని బానిసవుతున్న వైనం లూఠీ అవుతున్న పేదల కష్టార్జితం చోద్యం చూస్తున్న పోలీసు యంత్రాంగం మత్తు పదార్థాలకు బానిసలైనట్లు లాటరీ టికెట్లకు సైతం ఎంతో మంది బానిసలు అవుతున్నారు. ఇంట్లో బంగారం, డబ్బులు సైతం తెచ్చి టికెట్లను కొనుగోలు చేస్తున్నారంటే ఎంతగా ఈ వ్యాపారం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిందో అర్థమవుతోంది. ప్రజల ఆశను వ్యాపారులు మాత్రం సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధాన కేంద్రాల నుంచి ఒక్కో వ్యాపారి రోజుకు రూ.లక్ష విలువైన టికెట్లను కొనుగోలు చేస్తే అమ్మకం మాత్రం రూ. 2 లక్షలకు పైగా అమ్ముతున్నారని వినికిడి. తద్వారా ఫేక్ నంబర్లను కాగితాలపై వేసి ఆ టికెట్ల విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును తమ జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఇతర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు, ఇతర మంత్రులు, వీవీఐపీలు పాల్గొననున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలన్నారు. బందోబస్తు పకడ్బందీగా ఉండాలన్నారు. కంటిజెన్సీ బృందాల కవాతు, ట్రాఫిక్ వంటి అంశాలపై చర్చించారు. అంతేకాకుండా స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు, ట్రాఫిక్ మళ్లింపుతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఇతర మార్గాలను నిర్ధేశించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో డీఐజీ ఐఎస్‌డబ్ల్యూ కె. ఆరిఫ్ హఫీజ్, డీసీపీ కేజీవీ సరిత, ఎస్వీడీ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 17న బాల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక మచిలీపట్నంటౌన్/గన్నవరం: ఉమ్మడి కృష్ణాజిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక ఈనెల 17వ తేదీ విజయవాడ మధురానగర్‌లోని కేంద్రియ విద్యాలయం–1 గ్రౌండ్లో జరుగుతుందని ఏపీ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.బాలాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బాల్ బ్యాడ్మింటన్ సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ జట్ల సెలక్షన్లు అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సెలక్షన్లకు వచ్చే సబ్ జూనియర్ క్రీడాకారులు 2010 జనవరి 2, జూనియర్ క్రీడాకారులు 2006 జనవరి 2 తర్వాత జన్మించిన వారు ఉండాలని వివరించారు. సెలక్షన్స్‌కు వచ్చే క్రీడాకారులు స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, బ్లడ్ గ్రూపు తప్పనిసరిగా తీసుకురావాలని, డ్రెస్ కోడ్ పాటించాలని ఆయన సూచించారు. జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలిమధురానగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలని.. కచ్చితంగా సమయ వేళలు పాటించేలా చూడాలని ఆర్జేడీ ఎం.ఆదినారాయణ సూచించారు. మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని ఇంటర్మీడియెట్ విద్యాధికారి కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళాశాలలో తప్పనిసరిగా ఉండాలన్నారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సైమన్ విక్టర్, డీఐఈఓ ప్రభాకరరావు మాట్లాడుతూ ఇక్కడ తెలుసుకున్న విషయాలను కళాశాలలో తప్పక అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణకాంత్, జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. ● ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న తరగతులను మంగళవారం ఆర్జేడీ అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందజేశారు. -
‘నులి’ నిర్మూలనతో బహుళ ప్రయోజనాలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ లబ్బీపేట(విజయవాడతూర్పు): నులి పురుగులు పిల్లలు, కిశోర బాలల్లో రక్తహీనత, పోషకాల లోపాలకు కారణమవుతాయని, అందుకే పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రను తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. పటమటలంకలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మంగళవారం జరిగిన జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అధికారులతో కలిసి చిన్నారులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నులి పురుగుల కారణంగా పలు శారీరక సమస్యలతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. దీంతో చదువులో రాణించలేక పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల బారిన పడకుండా చూసుకోవచ్చన్నారు. 20న మరోసారి పంపిణీ.. 1–19 ఏళ్ల వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశామని, ఇంకా ఎవరైనా వివిధ కారణాల వల్ల మాత్ర తీసుకోకుండా ఉంటే వారికి ఈ నెల 20న ఇస్తామని కలెక్టర్ చెప్పారు. నులిపురుగుల నిర్మూలనతో పిల్లలకు ఆరోగ్య పరంగా బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. నులిపురుగుల సంక్రమణా న్ని తగ్గించేందుకు డీవార్మింగ్‌కు అదనంగా పాటించాల్సిన విషయాలను కూడా వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని, ఆర్బీఎస్కే స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నిర్మలా గ్లోరి, పిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ రవితేజ, ఆర్బీఎస్కే జిల్లా అధికారి డాక్టర్ మాధవీనాయుడు, డీఈఓ డాక్టర్ సుబ్బారావు పాల్గొన్నారు. -
వైద్య రంగం ప్రైవేటీకరణపై 24న జాతీయ సదస్సు
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తీసుకొస్తున్న ఆరోగ్య రంగ సంస్కరణల వలన రాష్ట్ర ఆరోగ్య రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ రమణయ్య అన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో వైద్యరంగం ప్రైవేటీకరణ–ప్రభావాలు–పరిష్కారాలు అనే అంశంపై జాతీయ స్థాయి ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు సరైన వైద్యం అందక ప్రైవేట్ వైద్య ఖర్చులను భరించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు జరగబోయే వైద్య రంగంలోని మార్పుల వలన పేదల ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారే పరిస్థితి రాబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పబ్లిక్–ప్రైవేట్–భాగస్వామ్యం(పీపీపీ) నమూనా కింద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తోందన్నారు. ప్రజారోగ్యం ప్రైవేటీకరణ అంశంపై పలువురు ప్రొఫెసర్లు సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. సమావేశంలో ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా ప్లీనరీ సమావేశాల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆ సంఘ కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. సమావేశాలు 9, 10 తేదీల్లో కొండపల్లిలో జరిగాయన్నారు. ఈ ప్లీనరీ సమావేశాల్లో విద్యార్థుల సమస్యలపై తీర్మానాలు చేయడంతో పాటు నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా టి.కుమారస్వామి, సీహెచ్ వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. జిల్లాలో కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, విద్యార్థులు స్కిల్స్ పెంచడానికి విజయవాడ కేంద్రంగా సైన్స్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్–కాస్మొటిక్ చార్జీలు పెంచాలని, పెండింగ్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్‌లో విద్యార్థులను ఐక్యం చేసి పోరాటాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్లీనరీ అనంతరం నూతన జిల్లా కమిటీని 21 మందితో ఎన్నుకున్నామన్నారు. నూతన కార్యవర్గం.. నూతన కార్యవర్గంలో జిల్లా అధ్యక్షుడిగా టి.కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా ఎస్.ప్రణయ్, టి.కుమార్ నాయక్, టి.ప్రణీత, ఎస్కే ఖాజు, సహాయ కార్యదర్శులుగా బి.మాధవ్, వి.షణ్ముఖ, కె.యశస్వినీ దేవి, పెద్దబాబు, జిల్లా కమిటీ సభ్యులుగా ప్రసాద్, ఒజెస్విన్, జ్వాలిత, మోహన్‌కృష్ణ, కావ్య, కుషాల్ కుమార్, నరసింహ, సిద్దు, హస్మి, యశ్వంతీ ఉన్నారు. -
పోతే.. పొమ్మనండి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉంటే ఉండమనండీ.. పోతే పోమ్మనండీ ఎవరి కోసం వచ్చారు. ఏఆర్టీలో సిబ్బంది లేకుంటే నేనేమి చేస్తాను. వచ్చే వరకూ ఉండమనండీ అంటూ హెచ్ఐవీ బాధితుల పట్ల డీఎల్ఓ అమానుషంగా మాట్లాడారు. అసలు నీవు నాకెందుకు ఫోన్ చేశావు, నీ కేడర్ ఏమిటీ అంటూ విషయాన్ని ఆయనకు చెప్పేందుకు ఫోన్ చేసిన ప్రభుత్వాస్పత్రి నోడల్ ఆఫీసర్‌ను నోటికొచ్చినట్లు అనడంతో ఆయన చిన్నబుచ్చుకున్నారు. ఈ విషయం సోమవారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. హెచ్ఐవీ రోగులకు అందించే సేవలను పర్యవేక్షించాల్సిన అధికారే అలా బాధ్యతా రహితంగా వ్యవహరించడం ఏమిటనీ పలువురు అధికారులు అంటున్నారు. ఆయన తీరు నిత్యం వివాదస్పదంగా మారుతోందని వైద్యశాఖలోని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. అసలేమి జరిగిందంటే.. తిరువూరు నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతం నుంచి హెచ్ఐవీ బాధితులు మందుల కోసం కొత్తాస్పత్రిలోని ఏఆర్టీ కేంద్రానికి వచ్చారు. అక్కడ గంట సేపు కూర్చున్నా వారికి కార్డులు ఇచ్చే కో ఆర్డినేటర్ రాలేదు. దీంతో తిరిగి వెళ్లేందుకు ఆలస్యం అవుతుందని, అక్కడి సిబ్బందిని ఎంత బతిమిలాడినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సూపరింటెండెంట్ చాంబర్ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న అభయ్ నోడల్ అధికారిని కలిసి వివరించారు. దీంతో ఆయన ఏఆర్టీ కేంద్రాలను పర్యవేక్షించే డీఎల్ఓకు ఫోన్ చేసి విషయం చెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా అసలు నాకు ఫోన్ చేయడానికి నీవు ఎవరూ, నీ కేడర్ ఏమిటీ, నాకెందుకు ఫోన్ చేశావంటూ చివాట్లు పెట్టారు. అయినా సిబ్బంది లేకపోతే వచ్చేదాకా కూర్చోమనండీ, లేకపోతే పొమ్మనండీ అంటూ అమానుషంగా మాట్లాడారు. దీంతో ఆ నోడల్ అధికారి చిన్నబుచ్చుకోవడమే కాకుండా, రోగి సైతం చేసేది ఏమి లేక, మళ్లీ ఏఆర్టీ దారి పట్టారు. ఓ గంట తర్వాత కానీ సిబ్బంది రాలేదు. గతంలో పనిచేసిన చోట్ల అంతే.. జిల్లాలో పనిచేస్తున్న డీఎల్ఓ గతంలో ఏలూరులో పనిచేస్తున్న సమయంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కోవిడ్‌లో పనిచేయని వారికి సైతం చేసినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు, అనుభవం పత్రాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా అనంతరం భీమవరంలో పనిచేసిన సమయంలో రెండు నెలలో ఇన్చార్జి డీఎంహెచ్‌ఓగా చేసి అవినీతికి పాల్పడటంతో, ఆ పోస్టు నుంచి తప్పించినట్లు వైద్యశాఖ సిబ్బంది చెబుతున్నారు. ప్రతి పనికి డబ్బులు వసూలు చేయడం, ఇతరులపై పెత్తనం చేలాయించాలని చూడటం అతని నైజమని సిబ్బంది వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో జిల్లా వైద్య శాఖ పరువు బజారున పడటం ఖాయమంటున్నారు. మా కోసం వచ్చారా.. ఉండక ఏమి చేస్తారు హెచ్ఐవీ రోగుల పట్ల డీఎల్ఓ అమానుష ప్రవర్తన ప్రభుత్వాస్పత్రి నోడల్ అధికారిపై చిందులు నిత్యం వివాదస్పందంగా మారుతున్న డీఎల్ఓ తీరు గతంలో పనిచేసిన చోట్ల అనేక అవినీతి ఆరోపణలు ఆయన ప్రవర్తన నిత్యం వివాదస్పదమే.. నెలన్నర కిందట జరిగిన బదిలీల్లో జిల్లాకు వచ్చిన డీఎల్ఓ ప్రవర్తన వివాదస్పదంగా మారుతుంది. అంతేకాకుండా, ఆయన విధులు ఆయన చేయకుండా, డీఎంహెచ్ఓ కార్యాలయంలో చేసే ఇతర వైద్యులపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నాడంటూ పలువురు ఆరోపించారు. రెండు రోజుల కిందట సీనియర్ వైద్యుడైన డీఎంఓను కూడా ఇలాగే మాట్లాడారని, డీఎంహెచ్ఓ కార్యాలయంలో పనిచేసే వైద్యుల పట్ల అమానుషంగా మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా పనులు సాగుతున్నాయని, ఇప్పుడు డీఎల్ఓ తీరు నిత్యం వివాదంగా మారుతున్నట్లు వాపోతున్నారు. నా దృష్టికి వచ్చింది.. డీఎల్ఓ చులకనగా మాట్లాడుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇంకా డీఎల్ఓ అలాగే ప్రవర్తిస్తే కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్తా. ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటనపై కూడా వివరాలు తెలుసుకుంటా. – డాక్టర్ ఎం.సుహాసిని, డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్ జిల్లా -
భారీ వర్షానికి పొంగిన వాగులు
పెనుగంచిప్రోలు: మండలంతో పాటు ఎగువన ఆదివారం రాత్రి భారీ వర్షం పడటంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం వరకు లింగగూడెం వద్ద గండివాగు పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పక్కన ఉన్న పొలాలు మొత్తం నీట మునిగాయి. నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి పొలాలపై వరద ప్రవహించటంతో పాటు పంటలు పూర్తిగా నాశనమవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముండ్లపాడు గ్రామంలోని వాగు చప్టాపై వరద నీరు ప్రవహించటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పెనుగంచిప్రోలు చెరువు నిండి అలుగులు గుండా నీరు ఉధృతంగా ప్రవహించటంతో సమీప వరి పొలాలు నీట మునిగాయి. రాకపోకలకు అంతరాయం -
పోలీస్ గ్రీవెన్స్‌కు 73 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 73 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించి 36 ఫిర్యాదులు, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 7, కొట్లాటకు సంబంధించి 3, వివిధ మోసాలపై 3, మహిళా సంబంధిత నేరాలు 5, దొంగతనాలపై 3, ఇతర చిన్న వివాదాలకు సంబంధించి 16 ఫిర్యాదులు అందాయి. ఆయా ఫిర్యాదులను సంబంధిత పోలీస్స్టేషన్లకు తెలిపి సత్వర పరిష్కారం చేయాలని డీసీపీ ఉదయరాణి ఆదేశాలు జారీ చేశారు. -
వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి
ఆత్కూరు(గన్నవరం): కృష్ణా జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం జరిగిన ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనపై ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. పెద్దఆవుటపల్లి గ్రామ శివారు లూర్థునగర్కు చెందిన దొప్పల సురేష్(39) రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇంటిలో సురేష్ ఉరి వేసుకుని ఉండటాన్ని అతని భార్య గమనించింది. ఇరుగుపొరుగు వారి సహాయంతో అతడిని కిందకు దింపి చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సురేష్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగా తన భర్త ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అతని భార్య అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. గుడివాడలో వ్యక్తి మృతి గుడివాడరూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలోని నీలామహాల్ రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నీలామహాల్రోడ్డులో నివాసముంటున్న పోలుకొండ భద్రయ్య(48) ఆదివారం జరిగిన గంగానమ్మ సంబరంలో పాల్గొని మద్యం సేవించాడన్నారు. రోజు మాదిరిగానే రాత్రి ఇంట్లో పడుకున్న భద్రయ్య తెల్లారి సోమవారం చూసే సరికి చనిపోయి ఉండటంతో పరిసర ప్రాంత ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. వన్‌టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్, తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి పిన్ని కుమారుడు వల్లూరు రాము ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా ఓ స్థలం విషయమై మృతునికి, అతని బంధువులకు గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రెండు సార్లు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. ఈ క్రమంలో మృతుడిది హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. తల్లి చెంతకు చేరిన బాలుడు లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇంటి నుంచి తల్లితో పాటు బయలుదేరి, బస్టాండ్‌లో తప్పిపోయి తిరుగుతున్న బాలుడిని మహిళా పోలీసులు తిరిగి తల్లి చెంతకు చేర్చారు. ఈ ఘటన సోమవారం విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మహిళా కానిస్టేబుళ్లు ఎస్కేబీబీ శైలజ, అనూష సోమవారం పీఎన్‌బీఎస్‌లో శక్తి యాప్‌పై అవగాహన కలిగించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో బస్టాండ్‌లో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని వారు గుర్తించి అతని వద్దకు వెళ్లి వివరాలు అడగా, తల్లి పేరు మాత్రమే చెబుతూ, అడ్రస్ చెప్పలేక పోతున్నారు. దీంతో చుట్టుపక్కల విచారించినా ఎవరూ తెలియదని చెప్పడంతో, బాలుడిని మహిళా పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడ ఇన్స్పెక్టర్ వాసవి బాలుడిని వివరాలు అడుగుతూ ఎక్కడకి వచ్చారని అడగ్గా హాస్పిటల్‌కు వచ్చినట్లు తెలపడంతో పాత ప్రభుత్వాస్పత్రికి వెళ్లి విచారించారు. దీంతో అక్కడ తల్లి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు బాలుడిని క్షేమంగా అప్పగించారు. ఈ సందర్భంగా బాలుడి తల్లి పోలీసులకు వివరాలు చెబుతూ, తనది చిట్టినగర్ అని, భర్త మృతి చెందగా, తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. పిల్లల్లో ఇద్దరికి అనారోగ్యం కారణంగా పాత ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయిస్తున్న క్రమంలో రెండో బాబు కనిపించక పోవడంతో చుట్టుపక్కల విచారించి ఏమి చేయాలో తెలియని సమయంలో మహిళా పోలీసులు, శక్తి బృందం బాలుడిని తీసుకువచ్చి అప్పగించారన్నారు. మహిళా కానిస్టేబుళ్లకు బాలుడి తల్లి అభినందనలు తెలిపింది. -
కార్మికుల ఆర్తనాదాలు పట్టని కూటమి సర్కారు
మా పొట్ట కొట్టినట్లే.. 18 ఏళ్లుగా ఆటో నడుపుతున్నా. ఇదే మా జీవనాధారం. దీని ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఆటోలో ప్రయాణించే వారిలో 80శాతం మహిళలే. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే ఆటో ఎక్కేవారే ఉండరు. మా పొట్ట కొట్టినట్లే. మేం ఉపాధి కోల్పోతాం. ఆటో అప్పు తీర్చడం కష్టమే. – వెన్నబోయిన కృష్ణ, మల్కాపురం, జగ్గయ్యపేట గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం సీ్త్రశక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 15 నుంచే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో ఆటో డ్రైవర్లలో ఆందో ళన మొదలైంది. సీ్త్ర శక్తి పథకం తమ భుక్తిని లాగేసుకుంటుందని భయపడుతున్నారు. అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసిన తాము.. రేపటి నుంచి ఉపాధి కోల్పోయి రోడ్డున పడడం ఖాయమని, కుటుంబాలను పోషించుకోవడం ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతింటుంటే ప్రభుత్వం తమతో కనీసం చర్చలు జరపలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ఎన్నికల హామీలో ఈ ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన నాటి నుంచి ఆందోళన చేస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదంటూ వాపోతున్నారు. ఇదీ జిల్లాలో పరిస్థితి.. ఎన్టీఆర్ జిల్లాలో 25వేల ఆటోలు ఉన్నాయి. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాని యువత సైతం ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థికంగా స్తోమత లేకపోయినప్పటికీ ఫైనాన్స్‌లో ఆటో తీసుకొని వచ్చే ఆదాయంతో అప్పులు తీరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకంతో కార్మికుల నెత్తిన పిడుగుపడినట్లు అయ్యింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తే తమకు కిరాయిలు ఉండవని, ఇప్పటికే ఈ రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఆటో నిర్వహణ పెనుభారం కానుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఆటో కార్మికులు కన్నీరు పెట్టుకుంటున్నారు. హామీలు అమలు చేయలేదు.. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సహాయం ఇస్తామన్న హామీ అమలు కాలేదు. ఏడాది కాలంగా అనేక ఆందోళనలు చేశాం. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. రుణాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఉచిత బస్సు వల్ల ఉపాధి కోల్పోతాం. కనీసం కార్మికులను పిలిచి ప్రభుత్వం చర్చించలేదు. ఆర్థిక సహాయం ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టమైన హామీ ఇవ్వలేదు. మమ్మల్ని బిచ్చగాళ్లుగా మార్చొద్దు. – దాది శ్రీనివాసరావు, ఆటో కార్మికుడు తాము అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏటా రూ. 15వేలు ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఆర్థిక సహాయంతో పాటు సంక్షేమ బోర్డు, తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని నమ్మబలికింది. అధికారం చేపట్టి 14 నెలలు గడుస్తున్నా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ అమలు కాలేదు. ఇకనైనా అమలు చేస్తామని భరోసాను కల్పించలేదు. సంక్షేమ బోర్డు ఊసేత్తడం లేదు. తక్కువ వడ్డీతో ఆటోలు రుణాలు ఇస్తామన్న హామీకి అతీగతీ లేదు. తీరా సీ్త్ర శక్తి పథకం అమలు చేయబోతుండడంతో ఆటో కార్మికులు తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. ఉచిత బస్సు ప్రభావంతో ఫైనాన్స్ కిస్తీలు చెల్లించలేని పరిస్థితి వస్తుందని, ఫైనాన్షియర్లు ఒత్తిడి చేసే ప్రమాదం ఉందని వాపోతున్నారు. హామీలు అమలు చేయాలని పలు రూపాల్లో కార్మికులు ఆందోళన చేసిన ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదు. రూ. 15వేల ఊసెత్తని సర్కారు ఏడాదిగా ఆందోళన చేస్తున్నా కనీసం పట్టించుకోని వైనం ఏకపక్షంగా ఉచిత బస్సు పథకం ప్రకటనతో ఆగ్రహం దిక్కుతోచని స్థితిలో 23వేల కుటుంబాలు ఫైనాన్స్ బకాయిలు చెల్లించేదెలా అంటూ ఆందోళన గత ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. వారి సంక్షేమానికి వాహన మిత్ర పథకం ప్రవేశపెట్టింది. ఆటో ఉన్న ప్రతి కార్మికుడికి ఏటా రూ.10వేలు వాహన మిత్ర కింద ఆర్థిక సహాయం చేసింది. కరోనా లాంటి కష్టకాలంలోనూ ఆదుకుంది. వరుసగా క్రమం తప్పకుండా ఆర్థిక సహాయం అందించింది. ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది. రూ. 3వేలు పెన్షన్ ఇవ్వాలి.. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికులకు 50 నుంచి 60శాతం ఉపాధి పోతుంది. ఇప్పటికే పలు రకాల సమస్యలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని ఇవ్వలేదు. ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఉపాధి కోల్పోతున్న కార్మికులకు నెల నెలా రూ. 3వేలు పెన్షన్ ఇవ్వాలి. – కె. పోలారి, ఇఫ్టూ రాష్ట్ర నాయకుడు -
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. పెండింగ్, బియాండ్ ఎస్ఎల్ఏ, రీ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. ఎప్పటికప్పుడు పరిష్కరించడంతోపాటు పెండింగ్ వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులను అధికారులు ఎప్పటికప్పడు లాగిన్‌లో పరిశీలించి పరిష్కరించాలన్నారు. రీ ఓపెన్ కేసులను కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని, గడువులోగా వినతులకు సమాధానాలు పంపాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కేఆర్‌సీసీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె. పోసిబాబు, ఏసీపీ కె. వెంకటేశ్వరరావు వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. వచ్చిన అర్జీల వివరాలు.. పీజీఆర్ఎస్లో మొత్తం 126 అర్జీలు అందాయని జేసీ చెప్పారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 36, పోలీస్ 20, డీఈఓ 16, వీఎంసీ 9, సర్వే 7 ఏీపీసీపీడీసీఎల్ 5, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు 4, విభిన్నప్రతిభావంతులు 3, డీఎంహెచ్‌వో 3, డీఆర్డీఏ 3, పౌరసరఫరాలు 2, ఎంపీడీఓ 2, ఆర్ఐవో (ఇంటర్మీడియట్) 2, పశుసంవర్ధక, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, డీసీహెచ్ఎస్, డీసీఓ (సహకార శాఖ), జిల్లా జలవనరులు, ఎకై ్సజ్ పోలీసు, మత్స్యశాఖ, అటవీ, జీజీహెచ్, హౌసింగ్, పరిశ్రమలు, మైనారిటీ, ఆర్అండ్బీ, సోషల్ వెల్ఫేర్‌కు సంబంధించి ఒక్కొక్క అర్జీ చొప్పున అందాయన్నారు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ -
ప్రతి గుండె ఉప్పొంగేలా ‘హర్ ఘర్ తిరంగా’
కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి గుండె ఉప్పొంగేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పంద్రాగస్టు వేడుకులకు సిద్ధమవుతున్నామని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రి వద్ద జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో విజయవాడ నగరపాలక సంస్థ, రెవెన్యూ, పోలీస్, యువజన సంక్షేమం, వైద్య ఆరోగ్యం తదితర శాఖల అధికారులు, సిబ్బందితో పాటు వాకర్స్ క్లబ్ వంటి వివిధ అసోసియేషన్ల నుంచి పెద్దఎత్తున ప్రతినిధులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. బైక్, సైకిల్ ర్యాలీతో పాటు స్కేటింగ్ చేస్తూ చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సైనికుల త్యాగాలు చిరస్మరణీయం.. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సరిహద్దుల్లో మన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని.. ఆపరేషన్ సిందూర్ మన దేశ సత్తాను చాటి చెప్పిందని పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ మనం నేడు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎందరో మహనీయుల త్యాగ ఫలితమని.. మనకు స్వాతంత్య్రం వచ్చాక ఎన్నో రంగాల్లో ముందుకెళ్లామని అన్నారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్.మల్లికార్జునరావు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, ఆర్డీవో కావూరి చైతన్య, జిల్లా యువజన సంక్షేమ అధికారి యు.శ్రీనివాసరావు, వీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని పాల్గొన్నారు. -
నేడు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లా వ్యాప్తంగా మంగళవారం నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని సోమవారం తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు 5.26 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రలు మింగించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. నులి పురుగులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు. ఏటా ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పిల్లల్లో నులిపురుగులు నిర్మూలించి రక్తహీనత నివారణ, శారీరక. మానసిక ఎదుగుదలకు పోషకాహారలోం, పిల్లల్లో అలసట, బలహీనత వంటి సమస్యలను నిర్మూలించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా డాక్టర్ సుహాసిని తెలిపారు. అందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో డీ వార్మింగ్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్య సంరక్షణకు ప్రతి ఒక్క చిన్నారికి ఈ మాత్రలు వేయాలని సూచించారు. మాత్రల పంపిణీ ఇలా.. ఎన్టీఆర్ జిల్లాలో 192 కళాశాలలు, 1,446 పాఠశాలలు, 1,475 అంగన్వాడీ కేంద్రాల్లో 19 ఏళ్లలోపు గల 5,26,323 మంది చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించనున్నట్లు తెలిపారు. అందుకోసం 5.64 లక్షల మాత్రలను సిద్ధం చేశామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 5.64 లక్షల మాత్రలు సిద్ధం -
ఏదయా.. యూరియా!
ఎరువుల కోసం బారులు తీరిన రైతన్నలు చిలకలపూడి(మచిలీపట్నం): ఎన్నికల సమయంలో రైతుల సంక్షేమానికి తాము పాటుపడతామని రైతులకు ఎటువంటి కష్టం రానివ్వకుండా తాము అధికారంలోకి వస్తే రైతులకు అన్ని అందిస్తామని మాయమాటలు చెప్పి నేడు రైతులను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుద్దాలపాలెం సొసైటీ పరిధిలో ఉన్న బుద్దాలపాలెం, బొర్రపోతుపాలెం, పిల్లవానిగొల్లపాలెంతో పాటు కొంతమేర కొత్తపూడి, కాకర్లమూడి గ్రామాలకు చెందిన భూములకు చెందిన రైతులు పంట రుణాలు తీసుకున్నారు. సుమారు 2 వేల ఎకరాలు ఆయకట్టులో వరిసాగు చేస్తున్నారు. వీరికి ఎకరానికి నాలుగు బస్తాల ఎరువులు కావాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం ఇంత వరకు వారికి ఒక్క బస్తా కూడా ఇవ్వకపోవటంతో పంట ఎదుగుదల లేక ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్కన వర్షం లేక ఎండలు కాస్తుండటం, కాలువల్లో సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో పొలాల్లో ఎరువు వేసుకోవటం ఎంతో అవసరమైనప్పటికీ కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవటంతో సక్రమంగా ఎరువులు సరఫరా కాలేదు. దీనికోసం రోజుల తరబడి సొసైటీ చుట్టూ తిరుగుతూ రైతులు ఎప్పుడు ఎరువులు ఇస్తారో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఎరువుల కోసం రైతుల ఆందోళన.. బుద్దాలపాలెం సొసైటీకి సోమవారం అరకొరగా ఎరువులు రావటంతో రైతులు తమకు అందుతాయో, లేదోనని ఆందోళన చేపట్టారు. వచ్చిన ఎరువులు అందరికీ అందజేయాలని ఆందోళన చేపట్టారు. దీంతో సొసైటీ ప్రతినిధులు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి రైతులను నిలువరించేందుకు ప్రయత్నం చేశారు. రైతులు అంతటితో ఆగకుండా ఎరువులు అందరికీ సమానంగా పంచాలని పూర్తిస్థాయి ఎరువులు అందించకపోతే తమ పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సొసైటీ సిబ్బంది, పోలీసుల జోక్యంతో రైతులకు రెండు కట్టలు చొప్పున అందజేస్తామని చెప్పి టోకెన్లు అందజేసి వాటి ఆధారంగా ఎరువులు పంపిణీ చేస్తామని చెప్పారు. కూటమి నాయకులు చెప్పిన వారికే.. బుద్దాలపాలెం సొసైటీలో ఎరువుల పంపిణీలో కూడా కూటమి నాయకుల హవా కొనసాగింది. కూటమి నాయకులు చెప్పిన పేర్లకే టోకెన్లు ఇచ్చి ఒక్కొక్కరికీ రెండు కట్టలు చొప్పున ఎరువులు అందజేశారు. అయితే కొంత మంది రైతులకు అందకపోవటంతో సొసైటీ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో త్వరలో మరో ఎరువుల లోడ్ వస్తుందని అప్పుడు అందరికీ అందజేస్తామని చెప్పటంతో ఆందోళన విరమించారు. అయితే అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే ఎరువులు పంపిణీ చేశారని మా పరిస్థితి ఏమిటని మిగిలిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నాయకులు చెప్పిన వారికే టోకెన్ల వారీగా పంపిణీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు బుద్దాలపాలెం సొసైటీ వద్ద ఆందోళన నష్టపోతున్నాం.. ఆదుకోవాలని వేడుకోలు రుణం ఉన్న వారికి మాత్రమే.. పెడన: మండలంలోని పలు పీఏసీఎస్‌లకు యూరియా లోడు రావడంతో సోమవారం వేకువ జాము నుంచే రైతులు ఆయా పీఏసీఎస్‌లు వద్ద బారులు తీరారు. రైతుల రద్దీని చూసి ఆయా పీఏసీఎస్‌లు వద్ద ఒక్కో కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేసి పంపిణీ చేయాలని అనుకున్నారు. పెనుమల్లి పీఏసీఎస్ వద్ద పరిస్థితి అదుపుతప్పడంతో కానిస్టేబుల్‌ను సైతం తోపులాటలో పక్కకు లాగేశారు. దీంతో అక్కడ ఎస్ఐ సత్యనారాయణ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది క్యూలైన్లో రైతులు నిలబడేలా చర్యలు తీసుకున్నారు. పీఏసీఎస్ సిబ్బంది బ్యాంకులో రుణం ఉన్న వారికి మాత్రమే యూరియా కట్టలు ఇస్తామని పేర్కొనడమే కాకుండా దండాలు పెట్టి మరీ చెబుతుండటంతో మిగిలిన రైతులు తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు. దీంతో ముందుగా వారికి ఇచ్చిన తరువాత మిగిలినవి ఇస్తామని చెప్పడంతో చేసేది లేక రైతులు అలాగే క్యూ లైన్లో వేచి తమ వంత వచ్చేదాక ఉండి తీసుకువెళ్లారు. అరకట్ట చొప్పున మాత్రమే ఇవ్వడంతో ఇద్దరి రైతులకు ఒక కట్ట చొప్పున అందజేశారు. -
క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): యువత చదువుతో పాటు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు ఎం.రాజయ్య అన్నారు. సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా సిద్ధార్థ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఇన్విటేషనల్ వాలీబాల్(సీ్త్ర, పురుషులు) టోర్నమెంట్‌ను సోమవారం సాయంత్రం పీబీ సిద్ధార్థ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. తమ విద్యా సంస్థల్లో చదువుతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. క్రీడల వల్ల చదువుపై ఏకాగ్రత పెరుగుతుందన్నారు. సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ తమ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామన్నారు. సిద్ధార్థ అకాడమీ జాయింట్ సెక్రటరీ నిమ్మగడ్డ లలిత ప్రసాద్, పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్, కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు పాల్గొన్నారు. హోరాహోరీగా పోటీలు.. ప్రారంభ సభ అనంతరం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ(చైన్నె) జట్టుతో బిషప్ మోర్ కళాశాల(కేరళ) జట్టు, సిద్ధార్థ కళాశాల జట్టుతో హోలీ గ్రేస్ అకాడమీ(త్రిసూర్, కేరళ) టీమ్‌లు తలపడ్డాయి. కపార్గామ్(కోయంబత్తూర్) టీమ్‌తో శాయ్(గుజరాత్) జట్టు, లయోలా కళాశాల(చైన్నె)జట్టుతో శాయ్(త్రివేండ్రం) జట్ల మధ్య పోటీలు జరిగాయి. వాలీబాల్ పోటీలను క్రీడాకారులతో పాటు క్రీడాభిమానులు, విద్యార్థులు వీక్షించారు. ఆల్ ఇండియా ఇన్విటేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో అతిథులు -
ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటైంది. విజయవాడ ఎంజీ రోడ్డులోని లెమన్ ట్రీ హోటల్లో ఆదివారం జరిగిన సమావేశంలో ఉత్సవ సమితిని ఏర్పాటు చేశారు. సమితికి గౌరవ అధ్యక్షుడిగా గోకరాజు గంగరాజు, అధ్యక్షుడిగా చలసాని ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా త్రినాథ్‌ను నియమించారు. వీరితో పాటు అన్ని జిల్లాల నుంచి సమితి సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా గౌరవా ధ్యక్షుడు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీ నుంచి జరిగే గణపతి నవరాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ విభాగాల నుంచి సహకారం అందించాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో పద్ధతిలో మండపాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ.. గణపతి నవరాత్రుల కోసం మండపాలు ఏర్పాటు చేసుకునేవారికి స్థానిక పరిపాలన వ్యవస్థ పోలీసు, విద్యుత్, వైద్య, ట్రాఫిక్, నీటిపారుదల శాఖ నుంచి సహాయ, సహకారాలు అందించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి త్రినాథ్ మాట్లాడుతూ.. ‘గణేష్ విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు, అనుమతుల కోసం రకరకాల రుసుముల పేరుతో ఇబ్బంది పెట్టకుండా చూడాలన్నారు. ఉత్సవ సమితికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. అనంతరం ఉత్సవాల వాల్ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. -
అమ్మ సన్నిధిలో
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అన్నదానం (అన్నప్రసాదం) అంటే భక్తులకు విశ్వాసం మెండు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తజనం జగజ్జనని దర్శనానంతరం అన్నప్రసాదం తీసుకునే వెనుదిరుగుతారు. అయితే దేవస్థానంలోని కొందరు సిబ్బంది, కాంట్రాక్టర్లు లాలూచీ పడటంతో తిన్నవారికంటే.. లెక్క అధికంగా చూపుతున్నట్లు తెలుస్తోంది. అన్నదానంలో అంకెల మాయ చేస్తూ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడ కనక దుర్గమ్మను భక్తులు మనసారా పూజిస్తారు. అందుకే అమ్మవారిని నియమ నిష్టలతో కొలుస్తారు. అయితే ఆలయంలో సిబ్బంది, అధికారులు, కాంట్రాక్టర్లు మాత్రం ఎలాంటి భీతి లేకుండా అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దేవస్థానంలో జరిగే నిత్యాన్నదానంలోనూ వీరు నిత్యం అక్రమాలకు పాల్పడుతున్నారు. అన్నదానంలో తినేవారి కంటే ఎక్కువ సంఖ్య చూపిస్తూ ఈ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సాధారణ రోజుల్లో.. జనం సాధారణంగా ఉండే సోమ, మంగళ, బుధ, గురువారాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకే అన్న ప్రసాదం భక్తులకు ఇస్తారు. అంటే మొత్తం 4.30 గంటల సమయంలో 14 బ్యాచ్‌లు. బ్యాచ్‌కు 300 మంది చొప్పున 4,200 మందికి మాత్రమే ఉచిత అన్నప్రసాదం వడ్డిస్తారు. ఆ రోజుల్లో బఫే ఉండదు. అయితే ఈ రోజుల్లో దాదాపు 5000 నుంచి 6000 మంది భక్తులకు భోజనం పెడుతున్నట్లు లెక్క చూపుతున్నారు. సరుకులు దేవస్థానం ఇస్తుండగా, పాలు, కూరగాయలు, గ్యాస్, క్లీన్అండ్ సర్వీసింగ్‌ను కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు. స్వీపింగ్లో 40 మంది సిబ్బంది పనిచేయాల్సిండగా అక్కడ కేవలం 30 మంది మాత్రమే చేస్తున్నారు. అధికంగా.. ఈ లెక్కన సాధారణ రోజుల్లో 2 వేల మంది, రద్దీ రోజుల్లో వెయ్యి మందిని ఎక్కువగా చూపి చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో భక్తుడికి అన్న ప్రసాదం పెట్టేందుకు దాదాపు రూ.40 ఖర్చు అవుతుంది. ఈ లెక్కన సరాసరి రోజుకు 1000 నుంచి 1500 మందిని అదనంగా చూపి బిల్లులు పెట్టి దోపిడీ చేస్తున్నారు. రోజుకు రూ.50 వేలకు పైగా దండు కొంటున్నారు. ఇలా నెలకు రూ.15 లక్షల మేర దోపిడీ పర్వం జరుగుతోంది. గత ఏడాది జూన్, జూలై, ఈ ఏడాది జూన్, జూలై నెలలకు సంబంధించిన అన్నదానం లెక్కలు తీస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. సీసీ పుటేజ్‌ను పరిశీలిస్తే.. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆలయ కార్య నిర్వహణ అధికారి.. అన్నదానం పెట్టే ప్రాంతంలో జూన్, జూలై నెలల్లో సీసీ పుటేజీని పరిశీలిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. ఏ సయమంలో భక్తులకు అన్నదానం ప్రారంభిం చింది, క్లోజ్ అయిన విషయాలు స్పష్టంగా ఉంటాయి. ఒక్క రోజు పరిశీలిస్తే ఎన్ని బ్యాచ్‌లకు భోజనాలు పెట్టింది తెలుస్తుంది. అక్కడ భోజనాలు చేసే ముందు వేసే వేలి ముద్రల్లో సిబ్బంది మాయ చేస్తున్నారని సమాచారం. సీసీ పుటేజీలు పరిశీలిస్తే అన్నదానంలో జరిగే దందా మొత్తం బయటికి వస్తుంది. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉచిత అన్నదాన ప్రసాదాన్ని భక్తులకు పెడతారు. మూడో ఫ్లోర్ నుంచి క్యూలైన్ మొదలవుతుంది. రెండో ఫ్లోర్లో భక్తులకు ఒక హాలులో 180మంది, ఇంకో హాలులో 120 మందికి రెండు హాళ్లల్లో 300 మందికి ఒకేసారి భోజనం పెడతారు. ఒక్కో బ్యాచ్ భోజనం చేసేందుకు 20 నిమిషాలు పడుతుంది. ఈ లెక్కన 6 గంటల సమయంలో 18 బ్యాచ్‌లు అంటే అత్యధికంగా 5,400 మందికి భోజనం పెట్టే వెసులుబాటు ఉంది. ఈ రోజుల్లో ఫస్ట్ ఫ్లోర్లో దాదాపు 1500 మందికి బఫే పద్ధతిలో పెడతారు. అంటే అత్యఽధికంగా 7000 మందికి భోజనం పెట్టే వీలుంది. బఫే బ్యాచ్ భోజనం 10 నుంచి 13 నిమిషాల్లోనే పూర్తైనట్లు చూపి, రోజుకు 8000 నుంచి 9000 మందికి భోజనం పెడు తున్నట్లు లెక్క చూపుతున్నారని సమాచారం. ఎక్కువగా చూపిన భక్తుల సంఖ్యకు సంబంధించిన లెక్కను ఆలయ అన్నదాన సిబ్బంది, క్లీన్ అండ్ సర్వీంగ్ కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చేతివాటంలో అన్నదానానికి సంబంధించి ఇద్దరు గుమాస్తాలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. -
ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
పెనమలూరు: మండల పరిధిలో ఆదివారం విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సీఎం చంద్రబాబునాయుడు పోరంకి రావడం, మండల పరిధిలోని కల్యాణ మండపాల్లో శుభకార్యక్రమాలు జరగడంతో ఒక్కసారిగా వాహనాల రాకపోకలు పెరిగాయి. దీంతో బందరురోడ్డుపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సీఎం చంద్రబాబు పోరంకిలో జరిగిన శుభకార్యక్రమానికి రోడ్డు మార్గంలో రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలపై నియంత్రణ విధించారు. ముఖ్యంగా చంద్రబాబు వచ్చిన సమయంలో పది నిమిషాల ముందుగానే బందరురోడ్డుపై వాహనాలు నిలిపివేయడంతో వాహనచదోకులు చాలా ఇబ్బందులు పడ్డారు. సీఎం తిరిగి వెళ్లిన తర్వాత బందరురోడ్డుపై ట్రాఫిక్ వదలటం, బందోబస్తులో ఉన్న పోలీసులు ట్రాఫిక్ సమస్యలు పట్టించుకోకుండా విధుల నుంచి వెళ్లిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనచోదకులు అవస్థ పడ్డారు. ట్రాఫిక్ నియంత్రణ ఏది..? జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు తరచూ విఫలమవుతున్నారు. ప్రజల కష్టాలను పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో బందరు రోడ్డుపై ట్రాఫిక్ పెరిగినా దాని నియంత్రణపై పోలీసు ఉన్నతాధికారులు శ్రద్ధ చూపడం లేదని వాహనచోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పోలీసు ఉన్నతాధికారులు మండల పరిధిలో తరచూ తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
No Headline
జగ్గయ్యపేట అర్బన్: శ్రావణ మాస ఉత్సవాల్లో పట్టణంలోని శ్రీముత్యాలమ్మ ఆలయంలో మూడో ఆదివారం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. రూ.5 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. కుమ్మరి శాలివాహన వంశస్తులతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు అప్పన మణికుమార్, కొత్తా రమేష్‌కుమార్, కార్యవర్గ సభ్యులు నోముల శివకుమార్, కొంకిమళ్ల సురేష్, అప్పన పిచ్చయ్య, సభ్యులు చేడె శ్రీరంగం, నాగప్రసాద్, తునికిపాటి మల్లేశ్వరాచారి, ఆరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. మోపిదేవి: మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తజనంతో నిండిపోయింది. తెల్లవారుజామునుంచే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. దేవస్థానంలో నిర్వహించే స్వామివారి శాంతి కల్యాణంలో 73 మంది దంపతులు పాల్గొన్నారు. 203 మంది సర్పదోషనివారణ పూజలు చేశారు. సేవా టికెట్ల ద్వారా ఒక్కరోజులో స్వామివారి ఆదాయం రూ. 10,00,605 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
దుర్గమ్మ దర్శనంతో పులకించిన భక్తజన మది
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనంతో భక్తజన మది పులకించింది. దుర్గమ్మ దర్శనానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివాహ సుముహూర్తాలు, గృహ ప్రవేశాలు వంటి శుభ కార్యాల అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఘాట్‌రోడ్డు, మహా మండపం మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు సర్వదర్శనంతో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 క్యూలో ఆలయానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటల వరకు రద్దీ ఓ మోస్తరుగా ఉండగా, తర్వాత అనూహ్యంగా పెరిగింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మహానివేదన అనంతరం మధ్యాహ్నం 12.20 గంటలకు తిరిగి దర్శనాలు ప్రారంభమవగా మధ్యాహ్నం రెండు గంటల వరకు రద్దీ కొనసాగింది. రాత్రి 7 గంటల తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలుఇంద్రకీలాద్రిపై మూడు రోజులుగా జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాలు ముగిశాయి. ఆదివారం ఉదయం మల్లేశ్వరస్వామి ఆలయ సమీపంలోని యాగశాలలో అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు పూర్ణాహుతి చేశారు. తొలుత పవిత్రోత్సవాలను పురస్కరించుకుని పలు ప్రత్యేక వైదిక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం జరిగిన పూర్ణాహుతిలో ఈవో శీనానాయక్ దంపతులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పవిత్రోత్సవాలు పూర్తి కావడంతో సోమవారం నుంచి అన్ని ఆర్జిత సేవలు యధావిథిగా ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణం, నవగ్రహ హోమాలు వంటి ఆర్జిత సేవల టికెట్లు కౌంటర్లలో అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. -
అభ్యసన మదింపునకు సెల్ఫ్ అసెస్మెంట్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థి అభ్యసన మదింపునకు విద్యాశాఖ ఏటా ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నెల 11 నుంచి ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను గతేడాది నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1, 2, 3, 4గా వ్యవహరిస్తున్నారు. 2025– 26 విద్యా సంవత్సరంలో నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్, రెండు సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో తొలి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్–1 (శాంప్) ఈ నెల 11 నుంచి నిర్వహించనున్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడానికి నిర్వహిస్తున్న పరీక్షలను 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మక విధానంలో ‘క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్’ను ప్రవేశపెట్టారు. గతేడాది 1నుంచి 8 తరగతుల వరకూ సీబీఏ అమలు చేయగా, ఈ ఏడాది 9వ తరగతికి కూడా సీబీఏ విధానాన్ని తీసుకొచ్చారు. టెన్త్ విద్యార్థులకు మాత్రమే ఫార్మేటివ్–1 జరపనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇలా.. సీబీఏ విధానంలో నిర్వహించే పరీక్షలు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఎయిడెడ్, ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లో 1నుంచి 5 తరగతుల వరకు 33,983 మంది, 6 నుంచి 10 తరగతుల వరకు 56,094 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో సుమారు 90,077 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ యాజమాన్యంలో సుమారుగా 540 విద్యాసంస్థలు ఉన్నా వాటిల్లో కొద్ది విద్యాసంస్థలే అనుసరిస్తున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం... ప్రస్తుత విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభమైంది. ముందుగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు ఈ నెల నాలుగు నుంచి నిర్వహించాల్సి ఉండగా, అసెస్మెంట్ బుక్లెట్స్ జిల్లాకు చేరుకోవడం ఆలస్యం కావడంతో ఈ నెల 11కు వాయిదా వేశారు. జూన్, జూలై సిలబస్‌లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మదింపునకు సీబీఏ, ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సిలబస్‌తో పాటు, ఆరో తరగతికి రెడీనెస్ ప్రోగ్రామ్‌పై పరీక్ష ఉంటుంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు కొన్ని మార్పులతో పరీక్షలను నిర్వహిస్తున్నారు. 10వ తరగతికి నాలుగు ఎఫ్ఎలు, రెండు సమ్మేటివ్ పరీక్షలు పాత విధానంలో అమలు చేస్తారు. బైలింగ్విల్ ప్రశ్నపత్రాలు సీబీఏ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలకు విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రం బైలింగ్విల్ విధానంలో ఉంటుంది. విద్యార్థికి ఇంగ్లిష్ ప్రశ్నపత్రం అర్థం కాకుంటే తెలుగులో చదివి ప్రశ్నను అర్థం చేసుకునేందుకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి బైలింగ్విల్ ప్రశ్నపత్రాలను ప్రవేశపెట్టారు. కొండపల్లి జెడ్పీ హైస్కూల్లో విద్యార్థినులు (ఫైల్) -
ఐపీఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఐపీఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏపీఐపీఎంఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీఐపీఎంఈఏ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ డిపార్ట్మెంట్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తమ సంఘం రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తూ ఉద్యోగుల పదోన్నతులకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. డిపార్ట్మెంట్ అధోగతి పాలుకావడానికి ఆయనే కారణమన్నారు. అతడిని తక్షణమే తొలగించి అదేస్థాయి అధికారిని పరిపాలన అధికారిగా నియమించాలని కోరారు. 150 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.. ఐపీఎంకు డైరెక్టర్‌ను నియమించాలని రాజారావు కోరారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల పదోన్నతులు కల్పించాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన సింగిల్ పోస్టులను వెంటనే మంజూరు చేయాలని, మంత్రి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు 150 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 50 శాతం పోస్టులు ల్యాబ్‌లోనే భర్తీ చేయాలన్నారు. జూనియర్ అనలిస్ట్‌లకు సర్వీసు రెగ్యులర్ చేయాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లకు డిపార్ట్మెంట్లో అవకాశం కల్పించాలని కోరారు. సీఐటీయూ నాయకులు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఐపీఎం నిర్వీర్యం కావడానికి అధికారులే కారణమన్నారు. ఐపీఎంను నిలబెట్టుకోవాలన్నా, పదోన్నతులు పొందాలన్నా, ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలన్నా పోరాటాలే శరణ్యమని పేర్కొన్నారు. సమావేశంలో యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తాళ్లూరి వెంకటేశ్వర్లు, నేషనల్ హెల్త్ మిషన్ జేఏసీ నాయకులు దయామణి, చలం, బి. శ్రీనివాసరావు, సతీష్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అభిమాన హీరో బ్యానర్ కట్టేందుకు వచ్చి.. అనంత లోకాలకు
పమిడిముక్కల: అభిమాన హీరో బ్యానర్ కట్టేందుకు వచ్చి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పెనుమత్స గ్రామానికి చెందిన జుజ్జువరపు హర్ష(26) విజయవాడ గూడవల్లిలో నివాసం ఉంటూ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన ఓ సినీ హీరో పుట్టిన రోజు సందర్భంగా స్వగ్రామంలో బ్యానర్ కట్టేందుకు వెళ్లాడు. బ్యానర్ కట్టి బైక్‌పై తిరిగి విజయవాడ వెళ్తుండగా మార్గమధ్యలో మంటాడ రెడ్డిపాలెం వద్ద ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొంది. దీంతో హర్ష తలకు తీవ్ర గాయమైంది. రెడ్డిపాలెం వాసులు పోలీసులకు, పెనుమత్స గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతడిని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. మృతునికి ఏడాది క్రితం వివాహమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీను తెలిపారు. -
విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): విద్యారంగం, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు విమర్శించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు కొండపల్లి క్రాంతి హైస్కూల్లో ఆదివారం జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు కోరుతుంటే, విద్యార్థి సంఘాలను పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అనుమతించవద్దని సర్క్యూలర్ తీసుకురావడం అత్యంత దారుణమన్నారు. సర్క్యూలర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా ఏడాది ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నప్పటికీ సంక్షేమ హాస్టళ్లలో, విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదని మండిపడ్డారు. ఆఫ్‌లైన్‌లో డిగ్రీ ప్రవేశాలు జరపాలని, పీజీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నారా లోకేష్ ఇచ్చిన హామీ నెరవేర్చడంలేదని విమర్శించారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ నగదు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు గోపి నాయక్, ఉపాధ్యక్షులు కుమారస్వామి, కుమార్ నాయక్, మాధవ్, ప్రణీత, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు. -
వైద్య విజ్ఞానంపై విస్తృత ప్రచారం జరగాలి
గన్నవరంరూరల్: వైద్య విజ్ఞానంపై ప్రజల్లో మరింత విస్తృతంగా ప్రచారం జరగాలని చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు ఆకాంక్షించారు. సిద్ధార్థ అకాడమీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కళాశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ అండ్ హెల్త్ ఎగ్జిబిషన్లను 3,400 మంది సందర్శించారు. మొత్తం 26 వేల మందికి పైగా ఈ ఎగ్జిబిషన్లను సందర్శించినట్లు చెప్పారు. వైద్యం పట్ల అవగాహన ఎంతో అవసరమన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు పెరుగుతున్నా ఆ మేరకు విజ్ఞాన ప్రగతి సాధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో భారతదేశం అన్ని రంగాల్లో దూసుకువెళ్తోందని, వైద్య రంగంలో ఎంతో ప్రగతి సాధించామన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ భీమేశ్వర్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన వారిని అభినందించారు. ప్రతి ఒక్కరూ మానవ శరీర నిర్మాణంలో తమను తాము దర్శించుకున్నారని చెప్పారు. మెడికల్ అండ్ హెల్త్ ఎగ్జిబిషన్లలో అన్ని డిపార్టుమెంట్లు, నర్సింగ్ స్కూల్ అండ్ కాలేజ్ విద్యార్థులు పాల్గొని సేవలందించారని కొనియాడారు. డైరెక్టర్ సీవీ రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.అనిల్‌కుమార్, డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.కళ్యాణి, ఏవోలు, డాక్టర్ రాజగోపాల్ పాల్గొన్నారు. డెంటల్ కళాశాలలో.. చిన అవుటపల్లి డాక్టర్స్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో ఆదివారం 9 విభాగాల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను విద్యార్థులు తిలకించారు. గ్రహణం మొర్రి, అంగిలి చీలిక విభాగంలో ఇప్పటి వరకు ఆస్పత్రిలో నిర్వహించిన ఆపరేషన్ల వివరాలను ప్రిన్సిపాల్ విద్యార్థులకు తెలియజేశారు. కమ్యూనిటీ విభాగం ద్వారా పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సేవలు ప్రదర్శించారు. హెచ్వోడీలు కాళేశ్వరరావు, అజయ్బెనర్జీ, ఏవో వై.మధుసూదనరావు పాల్గొన్నారు. -
కలగా మిగిలిన రైలు మార్గం
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం, తిరువూరు నియోజకవర్గాలకు రైలు సదుపాయం కల్పించేందుకు ప్రతిపాదించిన కొండపల్లి – కొత్తగూడెం రైలుమార్గం గత 40 సంవత్సరాలుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. అప్పటి ఎమ్మెల్సీ కొల్లి పావన వీరరాఘవరావు విజయవాడ పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న దివంగత చెన్నుపాటి విద్యకు ఈ రైలుమార్గం ప్రాధాన్యతను తెలియజేసి పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపాదింపజేశారు. వరుసగా నాలుగు బడ్జెట్లలోనూ ఈ రైలుమార్గాన్ని నిర్మించడానికి గల అవకాశాలపై సర్వే చేయడానికి కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా నిధులు కూడా కేటాయించింది. 2010లో తొలిసారి ఈ రైలుమార్గానికి రూ.10 కోట్లు కేటాయించి సర్వే చేయడానికి రైల్వేశాఖ కార్యాచరణ రూపొందించింది. గత పార్లమెంటు సభ్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, పర్వతనేని ఉపేంద్ర, లగడపాటి రాజగోపాల్ మినహా ఈ రైలుమార్గం గురించి విజయవాడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇతర పార్లమెంటు సభ్యులెవరూ పార్లమెంటులో ప్రస్తావించలేదు. బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన తదుపరి ఈ రైలుమార్గాన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించడంతో పాటు కొండపల్లి నుంచి నున్న, వెలగలేరు, వెల్వడం, మైలవరం, తిరువూరు మీదుగా రైలుమార్గం ఏర్పాటుకు సుముఖత చూపినా ఇంత వరకు తదుపరి చర్యలు తీసుకోలేదు. రెండు రాష్ట్రాలకు అనుసంధానం.. కొండపల్లి – కొత్తగూడెం రైలుమార్గం నిర్మిస్తే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. గతంలో ఈ రైలుమార్గాన్ని ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని కిరండల్ వరకు నిర్మించాలనే ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉంది. దీనికి అనుసంధానంగా కొవ్వూరు – భద్రాచలం రైలుమార్గాన్ని గత పదేళ్లలో చేపట్టి పూర్తి చేశారు. ప్రస్తుతం కొండపల్లి నుంచి ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి వరకు రైలుమార్గం నిర్మిస్తే కొత్తగూడెం వరకు రైలు సదుపాయం కల్పించే అవకాశం ఉంటుంది. కొండపల్లి నుంచి పెనుబల్లికి 65 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండటంతో తక్కువ ఖర్చుతో రైలుమార్గం పూర్తయ్యే అవకాశం ఉంది. ఇటీవల కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏపీలో కొత్త రైలుమార్గాల జాబితాలో కొండపల్లి – కొత్తగూడెం మార్గం లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కీలకమైన రైలుమార్గం కొత్తగూడెం సింగరేణి బొగ్గు గనులు, భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి పుణ్యక్షేత్రం తదితర ప్రాంతాలను కలిపే ఈ రైలుమార్గం ఆవశ్యకతను ఇకనైనా విజయవాడ పార్లమెంటు సభ్యులు గుర్తించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి త్వరితగతిన కార్యరూపం దాల్చే విధంగా చూడాలని పలువురు కోరుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇటీవల అసెంబ్లీలో ఈ రైలుమార్గం నిర్మాణం గురించి ప్రస్తావించినా అధికార పార్టీ స్పందించలేదు. 40 ఏళ్లుగా సర్వేలతో సరి ప్రతి బడ్జెట్లో నామమాత్రంగా నిధుల కేటాయింపు ఆచరణకు నోచుకోని కొండపల్లి – కొత్తగూడెం రైలుమార్గంనాయకులు శ్రద్ధ చూపాలి.. అన్ని రంగాల్లో వెనుకబడిన పశ్చిమ కృష్ణాకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే కొండపల్లి – కొత్తగూడెం రైలుమార్గం గురించి ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం శోచనీయం. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో కొత్త రైలుమార్గాల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం సుముఖంగా ఉన్నా తదనుగుణంగా ప్రతిపాదనలను పంపకపోవడం తగదు. ఇకనైనా ఈ రైలుమార్గాన్ని నిర్మించడానికి ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపాలి. – నల్లగట్ల స్వామిదాసు, వైఎస్సార్ సీపీ తిరువూరు ఇన్చార్జి రైలు మార్గం కల్పించాలి.. ఎన్టీఆర్ జిల్లాలోనే కాక రాష్ట్రంలో మారుమూల ఉన్న తిరువూరు, మైలవరం నియోజకవర్గాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే రైలుమార్గం ఏర్పాటు ఎంతో అవసరం. ఈ రెండు నియోజక వర్గాల్లో ప్రభుత్వభూములు, అటవీ భూములు వేలాది ఎకరాలున్నందున వీటిని పారిశ్రామిక వాడ ఏర్పాటుకు కేటాయించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైలుమార్గం నిర్మాణంతో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. – ఐవీకే కిషోర్, స్థానికుడు, తిరువూరు -
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు
పెడన: మచిలీపట్నం – గుడివాడ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సేకరించిన, పోలీసులు తెలిపిన వివరాల మేరకు నందిగామ గ్రామానికి చెందిన పోలగాని పెదబోదయ్య(45), పోలగాని సాయి(23)లు గుడివాడ నుంచి పెడన వైపు వస్తున్నారు. వడ్లమన్నాడుకు చెందిన మరో ఇద్దరు గుడివాడ వైపు వెళ్తున్నారు. వీరి వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీ కొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పెడన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆటోలో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బోదయ్య మినహా మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు రిఫర్ చేసినట్లుగా సమాచారం. జరిగిన సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
మెడికల్ టెక్నీషియన్ల హక్కుల సాధనకు కృషి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లేబొరేటరీస్, రేడియాలజీ టెక్నిషియన్స్ హక్కుల సాధనకు కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఇన్చార్జి మల్లాది విష్ణు అన్నారు. గాంధీనగర్‌లోని కందుకూరి కల్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లేబొరేటరీస్, రేడియాలజీ టెక్నిషియన్స్ అసోసియేషన్ 3వ రాష్ట్ర మహాసభ ఆదివారం జరిగింది. సభకు మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను మల్లాది విష్ణుకు తెలియజేశారు. బీమా సదుపాయం కూడా లేని పరిస్థితి ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ రోగులకు సేవలు అందించడంలో మెడికల్ లేబొరేటరీస్, రేడియాలజీ టెక్నిషియన్లదే కీలక పాత్ర అన్నారు. వారి సేవలను ప్రశంసించారు. రేడియాలజీ టెక్నీషియన్స్,ల్యాబ్ అసిస్టెంట్స్ ప్రభుత్వ సహాయ, సహకారాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం బీమా సదుపాయం కూడా లేదన్నారు. తాము అధికారంలో లేకపోయినా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
అక్షరం ప్రభాకర్ ‘రణం’ ఉత్తమ కవితగా ఎన్నిక
విజయవాడ కల్చరల్: ఎక్స్‌రే సాహిత్య మాసపత్రిక జాతీయ స్థాయిలో నిర్వహించిన తెలుగు కవితల పోటీ విజేతలను ప్రధాన కార్యదర్శి బోడి ఆంజనేయ రాజు, అధ్యక్షుడు కొల్లూరి ఆదివారం ప్రకటించారు. తెలంగాణ మానుకోటకు చెందిన అక్షరం ప్రభాకర్ రచించిన రణం కవితను ఉత్తమ కవితగా న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారన్నారు. విజేతలకు రూ.10 వేల నగదు బహుమతి ఎక్స్‌రే అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు. కె.మునిసురేష్ పిళ్లే హైదరాబాద్, మామిడిశెట్టి శ్రీనివాస్ దొడిపట్ల, డాక్టర్ రాధాశ్రీ నాగరం, అవ్వారు శ్రీధర్‌బాబు నెల్లూరు, చిత్రాడ కిషోర్‌కుమార్ విజయవాడ, జాగారపు శంకరరావు గజపతి నగరం, శ్రీ కంఠస్ఫూర్తి విజయవాడ, దుప్పటి రమేష్‌బాబు నెల్లూరు, ధవశ్వేరపు రవికుమార్ విశాఖపట్నం, కోరుప్రోలు హరినాథ్ హైదరాబాద్ ఎక్స్‌రే అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. త్వరంలో విజయవాడలో జరిగే సభలో వారికి నగదు బహుమతి, జ్ఞాపికలతో సత్కరిస్తామని పేర్కొన్నారు. -
త్వరలో వేద పాఠశాలలో తరగతులు ప్రారంభం
తాడేపల్లి(ఘంటసాల): శ్రీపరిపూర్ణానందగిరి స్వామి ఆశీస్సులతో తాడేపల్లి ఆశ్రమంలోని బ్రహ్మ విద్యా కేంద్రం ప్రాంగణంలో తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారి శృతిభారతి వేద పాఠశాలలో సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభించనున్నట్లు విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య గుళ్లపల్లి శ్రీరామ కృష్ణమూర్తి తెలిపారు. ఘంటసాల మండలం తాడేపల్లిలో కృష్ణామండలం వ్యాసాశ్రమంలో ఎన్నారై మూల్పూరి వెంకట్రావు, సావిత్రి దంపతుల సౌజన్యంతో వేద పాఠశాల తరగతులు నిర్వహించనున్నారు. బ్రహ్మ విద్యా కేంద్రం ప్రాంగణంలో తిరుపతి రాష్ట్రీయ(జాతీయ) సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారా గుర్తించబడిన సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్‌లో అర్చకత్వ పౌరోహిత్య(కర్మకాండ) అధ్యయన కేంద్రం, విశ్వవిద్యాలయ ప్రాక్ శాస్త్రి కార్యక్రమాలకు ప్రవేశం కల్పించి తరగతులు నిర్వహిస్తారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య శ్రీరామ కృష్ణమూర్తి మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో మొదటసారిగా ఏర్పాటు చేస్తున్న వేద పాఠశాలలో కులరహితంగా ప్రవేశాలు పొంది వేదాలు అభ్యసించాలన్నారు. ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు, డిప్లమో ఒక సంవత్సరం, ప్రాక్ శాస్త్రి కోర్సు రెండేళ్లు ఉంటుందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని చెప్పారు. కార్యక్రమంలో ఉపకులపతి సతీమణి రామలక్ష్మి, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం డైరెక్టర్, శృతిభారతి వేదపాఠశాల కోఆర్డినేటర్ డాక్టర్ జ్ఞాన్ రంజన్ పాండా, ఆశ్రమ నిర్వాహకులు కావూరి కోదండరామయ్య, గొర్రెపాటి రామకృష్ణ, మొవ్వ శ్రీరామమూర్తి, గొర్రెపాటి సురేష్, పి.శివకోటేశ్వరరావు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శృతిభారతి వేదపాఠశాల విద్యార్థుల వసతి గదుల నిర్మాణానికి ఎన్నారై మూల్పూరి వెంకట్రావు – సావిత్రి దంపతులు శంకుస్థాపన చేశారు. మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నం చేయనున్నట్లు వారు చెప్పారు. -
‘వర్ణం’ కవితా సంపుటి ఆవిష్కరణ
విజయవాడకల్చరల్: వర్ణం కవితా సంపుటి ఆవిష్కరణ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ గ్రంథాలయంలో ఆదివారం వైభవంగా జరిగింది. ‘సాక్షి’ స్టేట్ బ్యూరో రిపోర్టర్ బోణం గణేష్ రచించిన ఈ పుస్తకాన్ని ఆర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కామ్రేడ్ జీఆర్కే పోలవరపు సాహితీ సమితి వ్యవస్థాపకుడు గోళ్ల నారాయణరావు, అమరావతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు బెల్లంకొండ విజయలక్ష్మి, కార్యవర్గ సభ్యులు లహరి మహేంద్రగౌడ్, నందివాడ చిన్నాదేవి తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ నాయకులువెంకటాపురం(పెనుగంచిప్రోలు): మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కందిమాల సత్యనారాయణ, నల్లబోతుల రామకృష్ణ(బుల్లబ్బాయి) వారి కుటుంబ సభ్యులు శఽనివారం రాత్రి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, జెడ్పీటీసీ సభ్యురాలు వూట్ల నాగమణి, సర్పంచ్ కూచి నర్సయ్య, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.లేజర్ ఎన్యుక్లియేషన్, అడ్వాన్స్డ్ ప్రొస్టేట్ సర్జరీలపై శిక్షణపటమట(విజయవాడతూర్పు): ప్రశాంత్ హాస్పిటల్ 37వ వార్షికోత్సవం సందర్భంగా లేజర్ ఎన్యుక్లియేషన్ అండ్ అడ్వాన్స్డ్ ప్రొస్టేట్ సర్జరీ ప్రోగ్రామ్(లీప్)ను అత్యాధునిక ప్రొస్టేట్ సర్జరీలు, వైద్య చికిత్సల నిర్వహణపై వైద్యులకు శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. లబ్బీపేటలోని ప్రశాంత్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధానంగా.. అడ్వాన్స్డ్ లేజర్ ఎన్యుక్లియేషన్ ప్రొస్టేట్ చికిత్స గురించి, లైవ్ సర్జరీలు, చికిత్సలో మెలకువలు, యూరాలజిస్టులకు ప్రయోగాత్మక శిక్షణ అందించారు. వాటితో పాటు రెజుమ్ వాటర్ వేపర్ థెరపీ వంటి సూక్ష్మ విధాన శస్త్రచికిత్సలు, యూరోలిఫ్ట్, రోబోటిక్ సింపుల్ ప్రొస్టటెక్టమీ, ఐటిండ్ తదితర చికిత్స విధానాలపై శిక్షణనందించారు. కార్యక్రమంలో ప్రశాంత్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ ధీరజ్ కాసరనేని, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉన్మాద పాలన
నందిగామటౌన్: రాష్ట్రంలో గత 13 నెలలుగా ఉన్మాద పాలన సాగుతోందని మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అన్నారు. ఇందులో భాగంగానే నందిగామలో అధికారులు గురువారం అర్ధరాత్రి అరాచకానికి పాల్పడ్డారన్నారు. హైకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లం ఘించి గాంధీ సెంటర్లో ఉన్న మహానేత విగ్రహాన్ని క్రేన్లతో తొలగించి తీసుకువెళ్లి మున్సిపల్ కార్యా లయంలో పడేశారన్నారు. మహానేత విగ్రహాన్ని తొలగించటాన్ని నిరసిస్తూ డాక్టర్ మొండితోక జగన్ మోహనరావు నాయకత్వంలో శుక్రవారం పార్టీ కార్యాలయం నుంచి గాంధీ సెంటరులోని మహానేత విగ్రహం వరకు పాదయాత్రగా వెళ్లి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జగన్మోహనరావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని కూటమి నేతలు తొలగించి ప్రజల హృదయాలలో ఆయన స్థానాన్ని మరింత సుస్థిరం చేశారని అన్నారు. అధికార పార్టీ నేతల మెప్పు పొందేందుకు అధికారులు కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించారని అన్నారు. అధికార పార్టీ నేతల ధన దాహానికి రాఘవాపురం కొండ విరిగి పడి ఓ వ్యక్తి మృతి చెందితే రెండవ కంటికి తెలియకుండా సెటిల్మెంట్ చేసి బాధిత కుటుంబానికి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. వినతిపత్రం అందజేత.. గాంధీ సెంటరులోని రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించిన కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కన్వీనర్ దేవినేని అవినాష్, నాయకులు నల్లగట్ల స్వామిదాసు, పూనూరు గౌతమ్‌రెడ్డి, ఇంటూరి రాజగోపాల్‌తో కలిసి సీఐ వైవీఎల్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. విగ్రహాన్ని తొలగిస్తున్న సమయంలో అటుగా వస్తున్న మహిళా సర్పంచ్‌ను, ఆమె భర్తను సైతం ఇష్టారీతిన అసభ్య పదజాలంతో దూషించి కారు అద్దాలపై గుద్దుతూ భయభ్రాంతులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు లాక్కుని దిక్కున్న చోట చెప్పుకోండంటూ వ్యవహరించిన తీరు అమానవీయమని అన్నారు. ఇప్పటికై నా పోలీసులు స్పందించి విగ్రహాన్ని తొలగించేందుకు సహకరించిన వారితో పాటు తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు ముక్కపాటి నరసింహారావు, వేల్పుల ప్రశాంతి, ఎంపీపీలు పెసరమల్లి రమాదేవి, మలక్ బషీర్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు మంగునూరి కొండారెడ్డి, కాలవ వాసుదేవరావు, చిరుమామిళ్ల శ్రీనివాసరావు, పట్టణ, మండల కన్వీనర్లు మహ్మద్ మస్తాన్, వేమా సురేష్‌బాబు, మంచాల చంద్రశేఖర్, బండి మల్లికార్జునరావు, ఆవుల రమేష్ బాబు, కందుల నాగేశ్వరరావు, నెలకుదిటి శివనాగేశ్వరరావు, షేక్ షహనాజ్ బేగం, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నందిగామలో అర్ధరాత్రి మహానేత విగ్రహం తొలగింపు హైకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు చేసిన అధికారులు కూటమి నేతల మెప్పు పొందేందుకే ఈ దుశ్చర్య నిరసనగా పాదయాత్ర చేసిన మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అవినాష్, పార్టీ నేతలు -
కోరిన వరాలిచ్చే వరలక్ష్మిగా..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కోరిన వరములిచ్చే వరలక్ష్మిగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. మరో వైపు పవిత్రోత్సవాల నేపథ్యంలో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లతో పాటు ఇతర ఉపాలయాల్లో దేవతా మూర్తులకు పవిత్రాలను అలంకరించారు. ఉదయం 9.20 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభం కాగా భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. ఆన్ లైన్లో రూ.500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం అంతరాలయ దర్శనం కల్పించారు. బంగారు వాకిలితో పాటు మొత్తం 5 క్యూలైన్ల ద్వారా భక్తులకు ఉచితంగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ... పవిత్రోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం దుర్గగుడి ఈవో శీనానాయక్ దంపతులతో పాటు పలువురు ఆలయ అధికారులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతాలను పురస్క రించుకుని అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఆలయ ప్రవేశ మార్గాలలో వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలో మామిడి తోరణాలు, అరటి చెట్లతో అలంకరించడంతో పండుగ వాతావరణం కనిపించింది. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం మజ్జిగ పంపిణీ చేసింది. రాత్రి 7 గంటల నుంచి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు... శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పవిత్రోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు పవిత్రాలను సమ ర్పించి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద మంత్రోచ్చారణ మధ్య పవిత్రమాలలను అమ్మవారితో పాటు మల్లేశ్వర స్వామి వారికి, ఉపాలయాల్లో దేవతా మూర్తులకు ఆలయ అర్చకులు అలంకరించారు. మూడు రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలు ఆదివారం ఉదయం పూర్ణాహుతితో ముగుస్తాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తజనం భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి రద్దీ సమయంలో టికెట్ల విక్రయాలు రద్దు అన్ని క్యూలైన్లలోనూ ఉచితమే -
పొంగిన వాగులు..
రాకపోకలకు అంతరాయంపెనుగంచిప్రోలు: పెనుగంచిప్రోలు మండలంలో గురువారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లింగగూడెం వద్ద గండివాగు పొంగడంతో రాకపోకలు నిలిచి పోయాయి. ముచ్చింతాల–తాళ్లూరు మధ్య, పెనుగంచిప్రోలు–అనిగండ్లపాడు మధ్య కూచివాగు, గుమ్మడిదుర్రు వద్ద వాగు పొంగడంతో చప్టాలపై పెద్ద ఎత్తున నీరు చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పక్కన ఉన్న పొలాలు నీట మునిగాయి. పెనుగంచిప్రోలు చెరువు నిండి అలుగుల నుంచి పెద్ద ఎత్తున జలపాతంలా నీరు ప్రవహిస్తూ రోడ్డుపైకి చేరింది. దీంతో పెనుగంచిప్రోలు–సుబ్బాయిగూడెం రోడ్డు వరద నీటికి కొట్టుకు పోయింది. చెరువు అలుగు కాలువ పూడి పోవడంతో నీరు మొత్తం నాట్లు వేసిన పొలాలపై ప్రవహించింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు వాగుల వద్ద రాకపోకలు నిలిచి పోయాయి. పత్తి సాగు చేసిన పొలాల్లో వర్షం నీరు చేరి తటాకాలుగా మారాయి. -
నగరంపై చెత్తపోటు!
పటమట(విజయవాడతూర్పు): నగరవాసులపై చెత్త పోటు పడనుంది. విజయవాడలో మళ్లీ కూటమి పెద్దలు పాతపద్ధతిలో పారిశుద్ధ్య విధానాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్(ఆర్‌డబ్ల్యూఎ)లతో 50 శాతం కాంట్రిబ్యూషన్తో ఎంవోయూ(మెమెరాండం ఆఫ్ అండర్స్టాండింగ్) చేయడానికి పకడ్బందీగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు వీఎంసీ ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యాన ఈ నెల 6వ తేదీన వీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్న నూతన భవనం సమావేశ మందిరంలో స్కూళ్లు, కాలేజీలు, రెస్టారెంట్లు, ఆర్డబ్ల్యూఏలు, బార్లు, మాంసం దుకాణాల యజమానులు, హోటళ్లు తదితర వ్యాపార సంస్థలతో సమావేశం నిర్వహించారు. దీని ప్రధాన ఉద్దేశం నగరవాసుల నుంచి 2014–19లో కూటమి ప్రభుత్వం పాలనలో మాదిరి మళ్లీ ఇంటింటి చెత్తసేకరణకు 50శాతం కాంట్రిబ్యూషన్ పేరుతో పన్నును వసూళ్లు చేయడమే. 1204 మైక్రోపాకెట్లు విజయవాడలో ఇంటింటి చెత్తసేకరణకు వీఎంసీ డివిజన్లు, ఏరియాల వాకీగా 1204 మైక్రోపాకెట్లు ఏర్పాటు చేసింది. 300 కుటుంబాలను ఒక మైక్రోపాకెట్గా నిర్ధారించారు. సుమారు 300 కుటుంబాల చొప్పున కార్మికులు/కార్మికురాలు ఇంటికి వెళ్లి ప్రతినిత్యం చెత్తను సేకరించడం, వాటిని గార్జేజ్ లోడర్పాయింట్కు అక్కడి నుంచి గార్బేజ్ ట్రాన్స్ఫర్స్టేషన్కు వాహనాల్లో తరలించేవారు. దీనికి పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే వేతనాన్ని 50 శాతం వీఎంసీ, 50 శాతం రెసిడెన్షియల్ వేల్ఫెర్ అసోసియేషన్లు, బల్క్ వేస్ట్ జనరేటర్స్, వివిధ వ్యాపారాలు చేసేవారు చెల్లించాలి. ప్రతినెలా కార్మికుల వేతనాలను కాలనీ పెద్దలు, వ్యాపారస్తులు వీఎంసీకి జతచేసిన తర్వాతే కార్మికులకు వేతనాలను అందించేవారు. ఒక్కో కాలనీకి సుమారు 4 నుంచి 15 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తారు. అయితే కాంట్రిబ్యూషన్ సరిగా జరగకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడ్డారు. మళ్లీ ఇలాంటి కాంట్రీబ్యూషన్ విధానాన్ని వీఎంసీ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. నాడు వైఎస్సార్ సీపీపై దుష్ప్రచారం.. నేడు ప్రజలపై భారానికి కూటమి సిద్ధం చెత్త తరలింపు ప్రక్రియను నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. సచివాలయ వ్యవస్థతో నగరంలోని కుటుంబాలను మ్యాపింగ్‌చేసి క్లాప్(క్లీన్ ఆంధ్రప్రదేశ్) ద్వారా ఇంటింటి చెత్తసేకరణ చేసి డంపింగ్‌యార్డుకు వెళ్లడానికి పకడ్బందీగా అమలుచేసింది. నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులను ఆప్కాస్ (ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్) కిందకు తీసుకువచ్చి వారి వేతనాలను ఠంచనుగా అందించింది. ఇంటింటి చెత్త సేకరణకు యూజర్ చార్జీలు స్లమ్ ఏరియాలో నెలకు రూ. 30, కామన్ ఏరియాల్లో అయితే నెలకు రూ.50 వసూలు చేసేవారు. దీనిపై కూటమి నాయకులు నగరవాసుల నుంచి ప్రభుత్వం చెత్త పన్నంటూ దుష్ప్రచారం చేసింది. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్నును రద్దుచేస్తామని ప్రకటించిన వారు ఇప్పుడే అదే విధానాన్ని నగరవాసులపై రుద్దుతున్నారు. నగరంలో మొత్తం 3.70 లక్షల అసెస్మెంట్లు నగరంలో 3.70లక్షల అసెస్మెంట్ల నుంచి ప్రతినిత్యం 550–650 మెట్రిక్‌టన్నుల చెత్త ఉత్పత్తవుతుంది. దీనికోసం 3500 మంది పైచిలుకు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలో 111 నోటిఫైడ్ స్లమ్ఏరియాలు ఉన్నాయి. అత్యధికంగా కొండప్రాంతాలు, అజిత్సింగ్నగర, కృష్ణలంక, పటమట, భవానీపురం, పాయకాపురం, కండ్రిక, ఒన్న్టౌన్లో స్లమ్ ఏరియాలు నమోదయ్యాయి. కొండప్రాంతాల్లో సుమారు లక్షన్నరమంది జనాభా, మిగిలిన స్లమ్ ఏరియాల్లో నాలుగు ఐదు లక్షలకుపైగా నివాసాలుంటున్నారు. నగరంలోని నోటిఫైడ్ కాలనీలు సుమారు 250 కాలనీలు ఉన్నాయి. వాటిలో స్లమ్ఏరియాల్లోనే అత్యధికంగా 150 వరకు కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీల్లో ఉండేవారికి, కొండప్రాంతాల్లో ఉండేవారికి ఇప్పుడు కాంట్రిబ్యూషన్ విధానం ఆర్థిక భారమవుతుంది. కాలనీల్లో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పూర్వ విధానంలో చెల్లించడానికి చర్యలు వీఎంసీలో చెత్తసేకరణకు ఆర్‌డబ్ల్యూఏల నుంచి 50 శాతం కాంట్రిబ్యూషన్ పద్ధతి విజయవాడలో 2014–19లో ఇదే విధానాన్ని అమలు చేసిన కూటమి నాడు వైఎస్సార్ సీపీపై కూటమి దుష్ప్రచారం చెత్తసేకరణ సక్రమంగా జరగడం లేదు కాలనీల్లో చెత్తసేకరణ కూడా సక్రమంగా జరగడం లేదు. గతంలో ఇంటింటికీ చెత్తసేకరణకు ఆటోలు వచ్చేవి. ఇప్పుడు సమయ పాలనలేదు. వచ్చినా కాలనీల్లో కొన్ని ఇళ్ల నుంచి మాత్రమే సేకరించి వెళ్లిపోతున్నారు. అదేమంటే మొన్నటివరకు కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారని, ఇప్పుడేమో తక్కువగా వస్తున్నారని కారణాలు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు కాలనీ వాసులే కాంట్రిబ్యూషన్ చేయాలనడం శోచనీయం. – శ్రీలక్ష్మీ, పటమట -
11 నుంచి ఆహ్వాన క్రీడా పోటీలు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు):సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవం సంవత్సర సందర్భంగా ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఆలిండియా ఇన్విటేషనల్ టోర్నమెంట్స్ (ఆహ్వాన క్రీడా పోటీలు)ను తమ కళాశాల ఆవరణ మైదానంలో నిర్వహిస్తున్నామని సిద్ధార్థ అకాడమీ అకడమిక్ అడ్వైజర్ ఎల్కే మోహనరావు చెప్పారు. సిద్ధార్థ కళాశాల ఆవరణలోని సెమినార్ హాలులో టోర్నమెంట్స్‌కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. మోహనరావు మాట్లాడుతూ ఈ నెల 11 నుండి 14 వరకు వాలీబాల్ (సీ్త్ర, పురుష జట్లు) ఇన్విటేషనల్ టోర్నమెంట్స్ జరుగుతాయని చెప్పారు. ఈ టోర్నమెంట్లో కేరళ, మద్రాస్, కోయంబత్తూరు, గుజరాత్, ఆంధ్రపదేశ్ టీమ్‌లు తలపడతాయని పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు బాస్కెట్‌బాల్ (పురుషులు) టోర్నమెంట్ ఉంటుందన్నారు. ఈ టోర్నమెంట్లో చైన్నె, బెంగళూరు, కేరళ, తమిళనాడు, ఏపీ టీమ్‌లు పోటీ పడనున్నాయని వెల్లడించారు. 11వ తేదీ మధ్యాహ్నాం టోర్నమెంట్స్ ప్రారంభ సభ నిర్వహిస్తామన్నారు. కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, కళాశాల ప్రిన్సిపాల్స్ మేకా రమేష్ మాట్లాడుతూ నగరంలోని క్రీడాకారులు, క్రీడాభిమానులతో పాటుగా విద్యార్థులు కూడా ఈ టోర్నమెంట్స్‌ను వీక్షించవచ్చునన్నారు. సిద్ధార్థ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చుండి వెంకటేశ్వర్లు, శాప్ పూర్వ అధ్యక్షుడు అంకమ్మచౌదరి, సిద్ధార్థ కళాశాల క్రీడా విభాగాధిపతి టీ.బాలకృష్ణారెడ్డి, ఉపాధి కల్పనాధికారి కావూరి శ్రీధర్, వ్యాయామ అధ్యాపకులు పాల్గొన్నారు. -
యాసిడ్ లోడుతో వెళ్తున్న ట్రక్కు ఆటో బోల్తా
హనుమాన్‌జంక్షన్ రూరల్: చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై హనుమాన్‌జంక్షన్ బైపాస్‌రోడ్డులో యాసిస్ లోడుతో వెళ్తున్న ట్రక్ ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందింది. వివరాల్లోకి వెళ్లితే.. గుంటూరుకు చెందిన ఆటోడ్రైవర్ షేక్ అల్లాభక్షు శుక్రవారం యాసిడ్ లోడుతో ఏలూరుకు కిరాయి కోసం బయలుదేరాడు. అతనితో పాటుగా తోడు ఉంటుందని తన భార్య షేక్ షంషాద్ (47)కు కూడా వెంట తీసుకెళ్లాడు. భార్యభర్తలిద్దరూ ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మార్గమధ్యంలో దుర్ఘటన చోటు చేసుకుంది. అదుపుతప్పి బోల్తా హనుమాన్‌జంక్షన్ బైపాస్‌రోడ్డు వద్దకు రాగానే ట్రక్కు ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ క్యాబిన్లో ఉన్న భార్య షంషాద్ రోడ్డుపైకి పడిపోయింది. ఆటో బోల్తా కొట్టడంతో ట్రక్కులో ఉన్న యాసిడ్ డ్రమ్ములు కూడా కిందకు ఒరిగిపోయాయి. దీంతో షంషాద్‌పై అధిక మొత్తంతో యాసిడ్ పడటంతో ఆమె శరీరంగా తీవ్రంగా కాలిపోయి, అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఆటో నడుపుతున్న ఆమె భర్త షేక్ అలాభక్షు కంటిలో యాసిడ్ పడటంతో పాటుగా శరీరంపై పలుచోట్ల గాయాలైయ్యాయి. రహదారిపై యాసిడ్ పడి ప్రమాదకరంగా మారడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న హనుమాన్‌జంక్షన్ ఫైర్ ఆఫీసర్ వి.అమరేశ్వరరావు సిబ్బందితో రహదారిపై పడిన యాసిడ్‌ను శుభ్రం చేయించారు. క్రేన్ సాయంతో ట్రక్కు ఆటోను రహదారిపై నుంచి పక్కకు తొలగించారు. ఘటనపై పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొలుత ఆటోడ్రైవర్ షేక్ అల్లాభక్షును చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మృతురాలు షేక్ షంషాద్‌కు ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వాచ్మెన్ అనుమానాస్పద మృతి మధురానగర్(విజయవాడసెంట్రల్): వాచ్మెన్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గుణదల పీఎస్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుణదల అయ్యప్పనగర్‌కు చెందిన బద్దూరి ప్రసాద్(45) అపార్ట్మెంట్లో వాచ్మెన్. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గురువారం ఉదయం 5 గంటలకు ప్రసాద్ ఇంటినుంచి బయటకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఏలూరు రోడ్డులో కొబ్బరికాయలు అమ్ముకునే వ్యక్తి ప్రసాద్ కుమార్తె నీలవేణికి ఫోన్ చేసి మధురానగర్ శివాలయం రైవస్కాలువ పక్కన మీ నాన్న ఫిట్స్వచ్చి చనిపోయారని తెలిపారు. దీంతో నీలవేణి తల్లి గౌరికి ఫోన్‌చేసి సమాచారం తెలియజేశారు. సమాచారం అందుకున్న గౌరి ఘటనాస్థలికి చేరుకుని చూడగా అప్పటికే ప్రసాద్ మృతి చెంది ఉన్నారు. దీంతో గౌరి ఫిర్యాదు మేరకు గుణదల పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టమ్‌కు పంపించారు. ప్రసాద్‌కు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయని వాటితో చనిపోయి ఉండవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రైవర్ భార్య దుర్మరణం -
సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాల అమలుకు నోచుకోలేదని ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రామకృష్ణ అన్నారు. సంక్షేమ బోర్డును అమలు చేయాలని కోరుతూ ఈ నెల 19న మహాధర్నా జరుగుతుందన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్, ఇఫ్టూఆధ్వర్యంలో మహాధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అందడానికి చర్యలు తీసుకుంటామని కూటమి ప్రకటించిందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని తెలిపారు. రాష్ట్రంలో 36 లక్షల మంది భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్నారని ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో ‘నా వంతు కర్తవ్యంగా కోటి రూపాయలు సంక్షేమ బోర్డుకి’ విరాళం ఇస్తున్నానని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విస్మరించడం కార్మికులను మోసం చేయడమేనని మండి పడ్డారు. కార్యక్రమంలో బీసీడబ్ల్యూ రాష్ట్ర నేతలు జి. హరికృష్ణరెడ్డి, షేక్ మీరావలి, సుబ్బారావు, వెంకటేశ్వరరావు, ఆసియా బేగం, కనకారావు, మధు, కలాం, అల్లూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు 19న విజయవాడలో మహా ధర్నా ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ -
చౌకబారు మాఫియా..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని అధికార పార్టీ నేతలే పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో పార్లమెంట్ ముఖ్యనేత డైరెక్షన్లో అధికారుల కనుసన్నల్లో బియ్యం పక్కదారి పడుతోందని తెలుస్తోంది. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని పార్లమెంటు ముఖ్యనేత, ప్రజాప్రతినిధులు మెక్కేస్తున్నారు. పౌరసరఫరాల అధికారులు, విజిలెన్స్ అధికారులను పావులుగా మార్చుకొని రేషన్ డీలర్లపై ప్రయోగిస్తున్నారు. పార్లమెంటు ముఖ్యనేత డైరెక్షన్ మేరకు వారు చెప్పిన వ్యక్తికే, బియ్యం ఇవ్వాలని అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. దాంతో ప్రతి నెలా ఒకటో తేదీనే చాలా రేషన్ దుకాణాల్లో బియ్యం సంచులు ఖాళీ అయి పోతున్నాయి. నియోజకవర్గానికి సగటున 500 టన్నులకు పైగా బియ్యం మాఫియా చేతుల్లోకి జిల్లాలో ప్రతి నియోజక వర్గంలో సగటున 500 టన్నులకు పైగా రేషన్ బియ్యం మాఫియా చేతుల్లోకి పోతున్నాయి. రైస్ మిల్లుల్లో ఈ బియ్యాన్ని పాలిష్ చేసి, నేరుగా కాకినాడ పోర్టు మీదుగా విదేశాలకు తరలిస్తున్నారు. ప్రతి నెలా బియ్యం మాఫియా నుంచి పార్లమెంటు ముఖ్యనేతకు కోటి రూపాయలు, నియోజక వర్గాల ప్రజాప్రతి నిధులు రూ.25 లక్షల చొప్పున దండుకున్నారు. వ్యవస్థీకృతంగా సాగుతున్న బియ్యం లీలలు ఇవి. విష ప్రచారం చేసి.. గత ప్రభుత్వం మొబైల్ వాహనాల్లో ఇంటింటికీ రేషన్ ఇచ్చిది. వీటితో అక్రమాలు పెరిగిపోతున్నాయంటూ నాడు కూటమి విష ప్రచారం చేసింది. ఈ వాహనాలను తొలగించి పాత పద్ధతిలోనే డీలర్లకు బాధ్యతలు అప్పగించారు. రేషన్ దుకాణాలకు ప్రతి నెలా 26వ తేదీ బియ్యం సరఫరా చేస్తారు. 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ చేయాల్సింటుంది. అయితే రేషన్ దుకాణాలు తెరిచిన రెండు, మూడు రోజులలోపే బియ్యం ఉండటం ల్సి ఉంటుంది. అయితే పార్లమెంటు ముఖ్యనేత, నియోజక వర్గ ప్రజాప్రతినిధులు పౌర సరఫరాలు, విజిలెన్స్ అధికారులతో రేషన్ డీలర్లపై ఒత్తిడి తెచ్చి, వారు సూచించిన రేషన్ మాఫియా సభ్యులకే బియ్యం ఇచ్చేలా హుకుం జారీ చేస్తున్నారు. రేషన్ మాఫియా.. రేషన్ డీలర్లకు ముందే అడ్వాన్స్‌లు ఇస్తున్నారు. దందాకు సహకరించని డీలర్లపై రేషన్ షాపులు తనిఖీ చేసి, సీజ్ చేస్తున్నారు. పోలీసులు సైతం మామూళ్లు తీసుకుని దందాకు సహకరిస్తున్నారని తెలుస్తోంది. పార్లమెంటు ముఖ్యనేత డైరెక్షన్...అధికారుల యాక్షన్...! వ్యవస్థీకృతమైన రేషన్ బియ్యం మాఫియా ప్రతి నెల 26న డీలర్లకు బియ్యం సరఫరా పావులుగా మారిన అధికారులు! ప్రతి నియోజకవర్గం నుంచి 500 టన్నులు.. బియ్యం మాఫియా చేతిలో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు..సూరంపల్లిలో డంప్! పార్లమెంటు ముఖ్యనేత కనుసన్నల్లో తిరువూరు, మైలవరం, విజయవాడ తూర్పు, పశ్చిమ నియోజక వర్గాలో రేషన్ దందా జరుగుతోంది. ఈ దందా అంతా రామచంద్రరావు అనే వ్యక్తి నడిపిస్తున్నారు. ఇతను పార్ల మెంటు ముఖ్యనేతకు నెలవారీగా దాదాపు కోటి రూపాయలకుపైగా ముడుపులు ఇస్తూ దర్జాగా దందా చేస్తున్నారు. జగ్గయ్యపేటలో నియోజక వర్గ ప్రజాప్రతినిధి, నందిగామలో కంచికచర్లకు చెందిన టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ నియోజక వర్గ ప్రజాప్రతినిధి అనుచరులు, పెనమలూరులో క్రాంతి కిరణ్, గుడివాడలో నియోజక వర్గ ప్రజాప్రతినిధి పేరుతో గిరి అనే వ్యక్తి రేషన్ బియ్యం అక్రమ దందాలో పలు పంచుకొంటున్నారు. ఈ బియ్యాన్ని పామర్రుకు చెందిన మాఫియా డాన్ గొట్టపు రమేష్ సేకరిస్తున్నారు. ఆయన గన్న వరం సమీపంలోని సూరంపల్లి వద్ద డంపు చేసి, అక్కడ నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. ఇటీవల ఈ డంపుపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా జిల్లా పౌర సరఫరాల ఉన్నతాధికారికి, ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిడి రావడంతో ఆయన చేతులెత్తేసినట్లు చర్చ సాగుతోంది. కొంత బియ్యం ఇబ్రహీపట్నం పంట పొలాల్లో లోడ్ చేసి, పోర్టుకు పంపుతున్నారు. రేషన్ మాఫియా దందాకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్‌పై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. -
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తేలప్రోలు(గన్నవరం): ఇంజినీర్లు తమ శ్రమ, పట్టుదల, మేధస్సుతో దేశాభివృద్ధికి దోహదపడే మంచి ఫలితాలు సాధించాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు పరిధిలోని ఉషారామ కళాశాలలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు చేతుల మీదుగా బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో నేడు భారతదేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. భారత్‌లో ఉన్న యువత ప్రపంచంలోని మరే దేశంలోను లేదన్నారు. అటువంటి యువత దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డిగ్రీ పట్టాలు అందుకున్న విద్యార్థుల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. కళాశాల చైర్మన్ సుంకర రామబ్రహ్మం, కార్యదర్శి, కరస్పాండెంట్ సుంకర అనిల్, ప్రిన్సిపాల్ జీవీకేఎస్‌వీ. ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ లంక అరుణ్, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగ ప్రచార ర్యాలీ రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ’ ప్రచార ర్యాలీ గురవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఆర్ఎం మోహిత్ సోనాకియా జాతీయ జెండాను చేతపట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ రైల్వే నిర్మాణంలో సిబ్బంది కృషి ఎనలేనిదని ప్రశంసించారు. విజయవాడ రైల్వేస్టేషన్, డీఆర్ఎం కార్యాలయాలలో సెల్ఫీ బూత్‌లను సృజనాత్మకంగా ఏర్పాటు చేశారు. అధికారులు, సిబ్బంది, స్కూల్ విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలతో ర్యాలీ చేశారు. అనంతరం డివిజన్ ఆడిటోరియంలో జరిగిన పేట్రియాటిక్ ఫిల్మ్ ఫెస్టివల్లో 300 మంది జాక్ అండ్ జిల్, కేంద్రీయ విద్యాలయం, ఐకాన్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్):నారాయణ కళాశాల యాజమాన్యం తీరుతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేదారేశ్వరపేట 8వ లైన్లో నివసిస్తున్న మల్లవరపు పద్మప్రసన్న, దుర్గాప్రసాద్ దంపతుల కుమారుడు మనుచక్రవర్తి (15) బందరు రోడ్డులో పీవీపీ మాల్ వెనుక ఉన్న నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఇటీవల ఆ కళాశాలలో జరిగిన పరీక్షల్లో మనుచక్రవర్తికి మార్కులు తగ్గాయి. దీంతో కళాశాల యాజమాన్యం ఈ నెల 6న అతన్ని వేరే సెక్షన్‌కు మార్చారు. బాగా చదివే తనను తక్కువ మార్కులు సాధించే సెక్షన్లో వేయడంతో చక్రవర్తి జీర్ణించుకోలేకపోయాడు. కళాశాల యాజమాన్యం తీరుతో అవమానకరంగా అనిపించి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కళాశాల నుంచి ఇంటికి వచ్చి ఫ్యానుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య పెనమలూరు: తాడిగడప గ్రామంలోని ఓ కుటుంబంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురైన వివాహిత ఆత్మహత్య చేసకున్న ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... ఎన్.భానుప్రకాష్ గత 9 సంవత్సరాల క్రితం శివరంజని (30)ని వివాహం చేసుకున్నాడు. కారు డ్రైవర్‌గా పని చేస్తాడు. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. శివరంజనికి గత 8 నెలల క్రితం గర్భస్రావం జరిగింది. అలాగే గత 7 నెలల క్రితం ఆమె తండ్రి అనారోగ్యం కారణాలతో మృతి చెందాడు. ఈ ఘటనలతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. కాగా శివరంజని ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. నిద్రపోయిన భర్త లేచి చూసేసరికి భార్య ఉరేసుకొని వేలాడుతూ కనబడటంతో కానూరులో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. పరీక్షించిన వైద్యులు ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. -
మాతాశిశు మరణాల నివారణే లక్ష్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్):జిల్లాలో మాతా, శిశు మరణాల నివారణే లక్ష్యంగా ఆశా కార్యకర్త నుంచి వైద్యాధికారి వరకు ప్రతిఒక్కరూ నిబద్ధతతో, క్రమశిక్షణతో సేవలందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మాతా శిశు మరణాల నివారణకు పర్యవేక్షణ, ప్రతిస్పందన కమిటీ సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం మొదలు నమోదైన రెండు మాతృ, ఐదు శిశు మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ, వైద్యాధికారులు, స్పెషలిస్ట్ వైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షించారు. మరణాలకు కారణాలను విశ్లేషించడంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రతి ప్రాణమూ అత్యంత విలువైనదని చెప్పారు. తీసుకున్న చిన్నచిన్న జాగ్రత్తలే మాతాశిశు ప్రాణాలకు రక్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. హైరిస్క్ ఉన్న గర్భిణులపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శిశువులకు టీకాలు కూడా సరైన విధంగా వేసేలా మార్గదర్శనం చేయాలన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని, డెప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ జె.ఇందుమతీదేవి, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమం, సాధికారత అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం పాల్గొన్నారు. సాగు నీటి యాజమాన్యం ప్రధానం.... వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో సాగునీటి యాజమాన్యం చాలా ప్రధానమైనదని జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏపీ మైక్రో ఇరిగేషన్ పథకం (ఎంఐపీ) కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటుచేసిన ఇగ్నైట్‌సెల్‌ను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. సాగునీటి వనరుల సద్వినియోగంలో భాగంగా బిందు, తుంపర సేద్యంపై రైతులకు అవగాహన పెంచాలని సూచించారు. జిల్లాలో 2024–25 వరకు 23,937 హెక్టార్లు సూక్ష్మ సేద్యం కింద ఉందని, 2025–26లో కొత్తగా 2,200 హెక్టార్లను ఈ విధానంలోకి తీసుకొచ్చేలా అధికారులు కృషిచేయాలని ఆదేశించారు. సూక్ష్మ సేద్యంపై అవగాహన పెంచేందుకు రూపొందించిన కరపత్రాలను, డ్రిప్, స్ప్రింకర్, రైన్ గన్లకు సంబంధించిన పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సాగునీరు, కరెంటు వినియోగంలో 50 శాతం పొదుపు సూక్ష్మ సేద్యంతో సాధ్యమవుతుందని వెల్లడించారు. పీడీ పి.ఎం.సుభాని, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. వయోవృద్ధుల సంరక్షణ విస్మరిస్తే చర్యలు వయోవృద్ధుల సంరక్షణ బాధ్యతల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం– 2007, వారి పోషణ, సంరక్షణ నియమావళి– 2011 పై జిల్లా స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు సంరక్షణ, పోషణ చూడాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు. వయోవృద్దులు ఎవరైనా కార్యాలయాలకు వస్తే వారికి సరైన మార్గదర్శనం చేయాలన్నారు. కార్యక్రమంలో ముందుగా హెరిటేజ్ ఫౌండేషన్ ప్రాజెక్టు హెడ్ టి.రవి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చట్టం పై అధికారులకు అవగాహన కల్పించారు. ఏడీ వి. కామరాజు, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు
నాకు, నా కుటుంబసభ్యులకు కలిపి సుమారు 30 ఎకరాలు వరకు ఉంది. ఇప్పటికే ఒకసారి పంట ఎండి పోయింది. ప్రస్తుతం నీరు వస్తుంది. ఈ సమయంలో యూరియా వేయాలి. కనీసం ఒక్క కట్ట కూడా ఇవ్వలేదు. ఇప్పటికే రెండు దఫాలుగా యూరియా వచ్చిందన్నారు. ముందుగా బుక్ చేసుకున్నా కూడా ఇవ్వని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు. అధికారులు స్పందించి యూరియా అందించేలా చూడాలి. -పుట్టి వెంకమ్మ, మాజీ సర్పంచు, రైతు, మర్రిగుంట, చేవేండ్ర పంచాయతీ -
దుర్గమ్మకు కానుకగా బంగారు ముక్కుపుడక, బొట్టు, నత్తు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు గురువారం బంగారు ముక్కుపుడక, బొట్టు, నత్తును కానుకగా సమర్పించారు. బెంజ్‌సర్కిల్‌లోని ఆచార్యరంగ నగర్‌కు చెందిన పోసాని బసవయ్య, మనోహరమ్మ దంపతులు, వారి కుమారుడు ప్రసాదరావు సుమారు 24.7 గ్రాముల బంగారం, నవ రత్నాలతో తయారు చేయించిన ముక్కుపుడక, బొట్టు, నత్తును ఆలయ అధికారులకు అందచేశారు. సుమారు రూ. 3.05 లక్షలతో బంగారు ఆభరణాలను తయారు చేయించినట్లు దాతలు పేర్కొన్నారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. నానో ఎరువులతో బహుళ ప్రయోజనాలు విజయవాడ రూరల్: నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల వినియోగంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నున్న పీఏసీఎస్‌ను గురువారం ఆయన సందర్శించారు. రైతులకు ఎరువుల సరఫరా స్థితిగతులను పరిశీలించారు. ఈ పోస్ మెషిన్ పనితీరు పరిశీలించి, అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలను తెలుసుకున్నారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణం, గోదాము తనిఖీ చేశారు. ఫిజికల్, ఆన్లైన్ రికార్డుల లావాదేవీలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సాగుకు సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. 5,403 మెట్రిక్ టన్నుల యూరియా, 2,251 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1,052 మెట్రిక్ టన్నుల ఎంవోపీ, 2,310 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ, 12,292 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువులు, పురుగు మందులపై ఫిర్యాదులకు కలెక్టరేట్లో 91549 70454 నంబర్ అందుబాటులో ఉందని చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ నాగమల్లిక ఉన్నారు. ముగిసిన షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికలుగన్నవరం: కేవీఆర్ ఇండోర్ స్టేడియంలో గురువారం కృష్ణాజిల్లా క్రీడా ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్–19 బాల, బాలికల షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు జరిగాయి. సెలక్షన్స్‌కు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బాలిబాలికలు హాజరయ్యారు. తొలుత పోటీలను జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ అధికారి కె.ఝాన్సీలక్ష్మి ప్రారంభించారు. అనంతరం బాల, బాలికల విభాగాల్లో వేర్వేరుగా పోటీలు నిర్వహించి క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. వీరు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని ఝాన్సీలక్ష్మి తెలిపారు. పోటీలను కేవీఆర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి కేవీఆర్ కిషోర్ పర్యవేక్షించారు. వ్యాయామ ఉపాధ్యాయులు రామారావు, బాలకృష్ణ, చంద్రశేఖర్, నాగరాజు, శాంతికిరణ్, రాంబాబు ఎంపికలు చేశారు. ఓటమి భయంతోనే కూటమి దాడులుభవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రజలకు మేలు చేసి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో దిగజారుడు రాజకీయాలకు పాల్పడాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి రాదని, కేవలం ఓటమి భయంతోనే దాడులకు తెగబడుతోందని వైఎస్సార్ సీపీ నాయీ బ్రాహ్మణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తొండమల్ల పుల్లయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై టీడీపీ రౌడీ మూకల దాడిని ఖండించారు. ఇది అమానుష చర్య అని, రాజకీయం అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాబలంతో గెలవాలి తప్ప దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, తద్వారా ఎన్నికల్లో గెలవాలనుకోవడం దుర్మార్గ చర్యే అవుతుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి వ్యతిరేకతను మూటకట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేష్ యాదవ్‌పై జరిగిన దాడి బీసీ వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించారు. -
దసరా ఏర్పాట్ల పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కనకదుర్గనగర్, మహా మండపం, దుర్గాఘాట్ పరిసరాల్లో పర్యటించి దసరా ఉత్సవాల పనులపై ఆలయ అధికారులతో మాట్లాడారు. దసరాపై గత నెల తొలి సమీక్ష సమావేశం నిర్వహించగా, అధికారులు పలు సూచనలు చేశారు. దీంతో గురువారం కలెక్టర్ ఆలయానికి విచ్చేసి కనకదుర్గనగర్ నుంచి మహా మండపం వరకు నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ పనులపై అడిగారు. గోశాల వద్ద లడ్డూ పోటు, మహా మండపం వద్ద నిర్మిస్తున్న అన్నదాన భవనం పనులపై ఆరా తీశారు. దసరా నాటికి పనులు ఏ మేరకు జరుగుతాయి, ఉత్సవాల నేపథ్యంలో ఆయా భవనాల వినియోగంపై ఈవో శీనానాయక్, ఈఈ రాంబాబులను అడిగారు. మహా మండపం దిగువన ప్రసాదాల కౌంటర్లను పరిశీలించే క్రమంలో అక్కడ విక్రయిస్తున్న కవర్లను పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కనకదుర్గనగర్, చైనావాల్, రథం సెంటర్ల మధ్య ఆక్రమణలు తొలగించిన తర్వాత చేసిన పనులను కలెక్టర్ పరిశీలించారు. సకాలంలో వైదిక క్రతువులు దసరా ఉత్సవాల్లో అమ్మవారికి జరిగే వైదిక క్రతువులు సకాలంలో జరిగేలా చూడాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దుర్గగుడి అధికారులను ఆదేశించారు. దుర్గగుడి మహా మండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబర్లో గురువారం దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రామచంద్రమోహన్, ఫెస్టివల్ ఆఫీసర్ భ్రమరాంబ, దుర్గగుడి ఈవో శీనానాయక్‌తో పాటు ఇంజినీరింగ్ అధికారులు, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అర్జిత సేవలపై భక్తులలో అనేక గందరగోళాలు ఉన్నాయని, సేవలకు తగిన ప్రణాళిక ఉండాలని సూచించారు. -
యూరియా దొరక్క ఇక్కట్లు!
పెడన: పీఏసీఎస్‌ల పరిధిలోని కూటమి నాయకులు వచ్చిన యూరియా కట్టలను గద్దల్లా తన్నుకుపోతున్నారు. పీఏసీఎస్‌ల సిబ్బంది చేసేదేమీ లేక చూస్తూ మిన్నకుండిపోతున్నారు. కనీసం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకురాకపోవడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెడన మండలంలో యూరియా దొరక్క రైతులు రోజు రోజుకు ఆందోళన చెందుతున్నారు. పీఏసీఎస్‌లు ద్వారా ఇప్పటికే ముందుగా బుక్ చేసుకున్న వారికి కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. చేవేండ్ర పీఏసీస్ పరిధిలో యూరియా కట్టలు రావడతో ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడొకరు సుమారు 70 యూరియా కట్టలను ట్రాక్టరులో వేసుకుపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇది గ్రామంలో తీవ్రస్థాయిలో చర్చనీయాంశ మైంది. ఇలా చేయడం చాలా దారుణమని వాపోతున్నారు. అధికారులు సైతం చూిసీచూడనట్లుగా వ్యవహరించడం చాలా అన్యాయమని, రైతులందరికి సమన్యాయంగా యూరియా అందించాల్సిన బాధ్యత లేకుండా నడుచుకోవడం పట్ల పరిస్థితి మరింత చేయిదాటే ప్రమాదం ఉందన్నారు. బయట మార్కెట్లో గుళికలతో.... బయట మార్కెట్లో గుళికలు కూడా కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామనే వాదనను ఎరువుల దుకాణాల వారు స్పష్టం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో రూ.200 పెట్టి యూరియా కొంటే రూ.600 పెట్టి గుళికలు కొనుగోలు చేయాల్సి వస్తుందని, ప్రస్తుతం గుళికలతో పని లేదని, అయినా అంటగడుతుండటంతో బయట యూరియా కొనుగోలు చేయడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఎరువుల దుకాణంలో ఆ పరిస్థితి ఉంటే పీఏసీఎస్‌లలో మరింత దారుణంగా ఉందని పేర్కొంటున్నారు. పీఏసీఎస్‌లలో రుణం తీసుకున్న వారికి మాత్రమే యూరియా ఇస్తామని పేర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణాలు పొందిన వారికి యూరియా కట్టలు దొరకడం లేదని, రెండు దఫాలుగా చేవేండ్ర పీఏసీఎస్‌కు 800 కట్టలు వచ్చినా ఇవ్వలేదంటూ పలువురు రైతులు వాపోతున్నారు. గద్దల్లా తన్నుకుపోతున్న టీడీపీ నాయకులు రుణాలు తీసుకున్న వారికే కట్టాలంటూ మెలిక బయట మార్కెట్లో గుళికలతో లింకు నో స్టాక్ అంటున్న ఎరువుల దుకాణాలు పక్కాగా పంపిణీ చేస్తున్నాం చేవేండ్ర పీఏసీఎస్ పరిధిలో 70 కట్టలు ఒకరే తీసుకుపోయారనే విషయం వాస్తవం కాదు. విచారణ చేశాం. చేవేండ్ర పీఏసీఎస్‌కు యూరియా కట్టలు రావడంతో రైతులు అధిక సంఖ్యలో వచ్చారు. రాత్రి కావడంతో తాళాలు వేసేందుకు సిద్ధం అవ్వగా ఆ వ్యక్తి వచ్చి రైతుల పేర్లు నమోదు చేసుకుని అందజేశారు. దానిని కావాలని కొందరు వక్రీకరించారు. అంతా పక్కాగా పంపిణీ చేస్తున్నారు. అయితే తీసుకువెళ్లిన వారే మళ్లీ మళ్లీ వచ్చి తీసుకుపోతున్నారు. – ఎస్.జెన్నీ, ఏవో, పెడన మండలం -
ఇతర రాష్ట్రాలకు ధీటుగా రాజధాని నిర్మాణం
గుణదల(విజయవాడ తూర్పు): దేశానికి తలమానికంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి నారాయణ అన్నారు. విజయవాడ భారతీనగర్ నోవోటెల్ హోటల్లో గురువారం గ్రీన్ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ – 2025 నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఉంటుందని చెప్పారు. విజయవాడ నగర ప్రతిష్టతను ఇనుమడింప చేసే విధంగా పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. అధునాతన నిర్మాణ శైలిని అనుసరిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పర్యాటక రంగంలో రాజధాని గుర్తింపు సాధిస్తుందని వెల్లడించారు. అనంతరం గ్రీన్ ఆంధ్రప్రదేశ్ బ్రోచర్‌ను విడుదల చేశారు. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ పెనమలూరు:పూర్వార్జిత ఇంటి స్థలాన్ని కొందరు వ్యక్తులు కాజేయటానికి ఏకంగా తహసీల్దార్ గోపాలకృష్ణ సంతకాన్ని ఫోర్జరీ చేయటంతో పోలీసులు 11 మందిపై గురువారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం..... కానూరు గ్రామంలో ఆర్ఎస్ నెంబర్లు 249/3,4,5ఎలో 300 చదరపు గజాల ఇంటి స్థలం ఉంది. తహసీల్దార్ గోపాలకృష్ణ ఎండార్స్ చేసినట్లుగా నకిలీ ధ్రువీకరణ పత్రాన్ని కొందరు వ్యక్తులు సృష్టించారు. దీంతో పోలుకొండ వెంకటాచలం అనే మహిళ తన మనవడు కౌశిక్‌కు అనుకూలంగా కంకిపాడు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గిఫ్టు డీడ్ (16032/2024) ఇచ్చింది. దీనికి పలువురు వ్యక్తలు సహకరించి ఇంటి స్థలాన్ని అమ్మే యత్నం చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావటంతో తహసీల్దార్ గోపాలకృష్ణ తన సంతకం ఫోర్జరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామోదుల సూరిబాబు, (ఎర్రసూరిబాబు), షేక్.వలి, బోరుగడ్డకుమార్, పోలుకొండ వెంకటాచలం, పోలుకొండ కౌశిక్, బి. వెంకటేశ్వరరావు, వి.లక్ష్మణరావు, వేములపల్లి శ్రీనివాసరావు, రాఘవమ్మ, అవనిగడ్డ స్వాతీ, సూరిబాబులని నిందితులుగా గుర్తించారు. -
ఒక్క కట్ట కూడా ఇవ్వలేదు
చేవేండ్ర పీఏసీఎస్‌లో రూ.16 లక్షలు రుణం తీసుకున్నా. రుణం తీసుకున్న వారికే యూరియా కట్టలు ఇస్తామన్నారు. ఉదయమే వచ్చా. అయినా ఒక కట్ట కూడా ఇవ్వలేదు. ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడా చూడలేదు. నాకు, నా కుటుంబసభ్యులందరికీ కలిపి 15 ఎకరాలున్నాయి. యూరియా కొట్టకపోతే పంటకు బలం రాదు. బయట కొందామంటే గుళికలకు లింకు పెడుతున్నారు. ప్రస్తుతం గుళికలతో పని లేదు. యూరియా మాత్రమే కొట్టాలి కాబట్టి పీఏసీఎస్‌లో తీసుకువెళ్లడానికి వచ్చా. -గంగుమోలు వెంకటేశ్వరరావు, రైతు, మర్రిగుంట, చేవేండ్ర పంచాయతీ ●