ఉత్సాహంగా లెజిస్లేటివ్ స్పోర్ట్స్‌మీట్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్ శాసనమండలి, శాసనసభ్యులు(లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్–2026) నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాలాచారి ఇండోర్ స్టేడియంలలో ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగుతోంది. స్పోర్ట్స్ మీట్‌లో రెండో రోజైన బుధవారం క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్(పురుషులు, మహిళలు), పికల్‌బాల్ (మెన్), మ్యూజికల్ చైర్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ విభాగాల్లో పోటీలు జరిగాయి. క్రికెట్ పోటీల్లో మొదటి మ్యాచ్‌లో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, సత్యకుమార్ యాదవ్ జట్ల మధ్య పోటీ జరిగింది. పల్లా శ్రీనివాసరావు జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 69 పరుగులు సాధించింది. 70 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన మంత్రి సత్యకుమార్ యాదవ్ జట్టు 7 వికెట్ల తేడాతో సునాయాసంగా 70 పరుగులు సాధించి విజయం సాధించింది.
ఉత్సాహంగా లెజిస్లేటివ్ స్పోర్ట్స్‌మీట్


