అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): సమాజంలో పెరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని కవి, రచయిత, సామాజిక విశ్లేషకులు జి. లక్ష్మీ నరసయ్య పిలుపునిచ్చారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రథమ జాతీయ మహాసభలు మంగళవారం విజయవాడ సింగ్‌నగర్ గుజ్జల సరళ దేవి ఫంక్షన్ హాల్‌లో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పీడీఎస్‌యూ జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ రామకృష్ణ పీడీఎస్‌యూ బిగి పిడికిలి జెండాను ఆవిష్కరించారు. ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు పి.టాన్య, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు అశోక్ ఘాయల్, పరిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ కోశాధికారి ఎల్ .భాను సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ జాతి ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఇ .విజయ్ కన్నా, యు. గనిరాజు తదితరులు పాల్గొన్నారు.


