గ్యాస్ సరఫరాపై భారీ ప్రభావాన్ని చూపుతున్న యుద్ధం ఎన్టీఆర్ జిల్లాలో 56 గ్యాస్ ఏజెన్సీలు ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు నిలిచిపోవడంతో అవస్థలు ఏజెన్సీలకు వినియోగదారుల క్యూ బ్లాక్ మార్కెట్‌కు భారీగా గృహావసర గ్యాస్!
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను అధికారులకు అందజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన నిమ్మగడ్డ సత్యనారాయణ కుటుంబం అమ్మవారి అన్నదానానికి రూ. లక్ష విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్ మల్కాజ్‌గిరికి ృచెందిన ఎస్. సంధ్యారాణి కుటుంబం అమ్మవారి గోసంరక్షణ పథకానికి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అధికారులు చందు శ్రీనివాస్, డీవీవీ సత్యనారాయణలు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
రేపు ఏ ప్లస్ కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈనెల 16వ తేదీ నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందు వేదిక మార్పు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ముందుగా నిర్ణయించిన విధంగా విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో కాకుండా ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఇఫ్తార్ విందు కార్యక్రమానికి సంబంధించిన వేదిక మార్పు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఇఫ్తార్ విందులో పాల్గొనే మత పెద్దలు, ముస్లింలు, ప్రజాప్రతినిధులు వేదిక మార్పును అంశాన్ని గమనించాలన్నారు. ఇఫ్తార్ ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన శనివారం కలెక్టరేట్‌లో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రత, వసతులు, ట్రాఫిక్ వంటి విషయాల్లో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ సీఈవో యాకూబ్ బాషా, విజయవాడ ఆర్డీవో టి.వి.సతీష్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, ప్రొటోకాల్ డైరెక్టర్ టి.మోహన్‌రావు, వక్ఫ్ బోర్డు అధికారులు ఆదం షఫీ, మస్తాన్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇరాన్ యుద్ధ నేపథ్యంలో నిత్యావసర వస్తువైన గ్యాస్ కొరత భయం వినియోగదారులను వెంటాడుతోంది. దీంతో ప్రజలు సిలిండర్ల కోసం ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
జిల్లాలో నెలకు 1.50 లక్షల సిలిండర్ల సరఫరా
ఎన్టీఆర్ జిల్లాలో సరాసరి నెలకు 1.50 లక్షల సిలిం డర్‌లను సరఫరా చేస్తారని అధికార నివేదికలు వివరిస్తున్నాయి. జిల్లాలో సుమారుగా 56 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ఒక్కొక్క ఏజెన్సీ 200 నుంచి గరిష్టంగా వారివారి సామర్థ్యం, సీనియార్టీ మేరకు రోజుకు 500 వరకూ గృహావసరాలకు సిలిండర్లు సరఫరా చేస్తారు. యుద్ధ నేపథ్యంలో బుకింగ్‌లు రెట్టింపు కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారాయని ఏజెన్సీల నిర్వాహకులు వివరిస్తున్నారు. ఆన్‌లైన్ బుకింగ్ జరగకపోవడం, సరఫరా సరిగా లేకపోవడంతో ప్రజల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
బ్లాక్ మార్కెట్‌కు..
కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో హోటల్స్ తమ వినియోగానికి గృహావసర సిలిండర్‌లను భారీగా బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నాయి. రెట్టింపు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు హోటల్స్ నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా హోటల్స్ సంఘ ప్రతినిధులు ఇటీవల ఆర్థిక మంత్రి కేశవ్‌ను కలిసి వారి ఇబ్బందులను వివరించారు. జిల్లాలో చాలా హోటల్స్ కట్టెల పొయ్యిల వంటి ప్రత్యామ్నాయాల వైపు మరలుతున్నాయి.
రేట్లు పెంచిన రెస్టారెంట్‌లు
సిలిండర్లను బ్లాక్‌లో కొనుగోలు చేయడంతో రెస్టా రెంట్ల నిర్వాహకులు పదార్థాల ధరలను రూ.5 నుంచి రూ.50 వరకు పెంచారు. దాంతో వినియోగదారులపై భారీగా భారం పడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
7


