సీజేఐకు ఎన్టీఆర్‌ జిల్లా అధికారుల స్వాగతం | - | Sakshi
Sakshi News home page

సీజేఐకు ఎన్టీఆర్‌ జిల్లా అధికారుల స్వాగతం

Mar 2 2026 7:21 AM | Updated on Mar 2 2026 7:21 AM

సీజేఐకు ఎన్టీఆర్‌ జిల్లా  అధికారుల స్వాగతం

సీజేఐకు ఎన్టీఆర్‌ జిల్లా అధికారుల స్వాగతం

సీజేఐకు ఎన్టీఆర్‌ జిల్లా అధికారుల స్వాగతం రేపు ఉదయం 10 గంటల వరకే దుర్గమ్మ దర్శనం నిత్యాన్నదానానికి విరాళం దురహంకారంతోనే ఇరాన్‌పై దాడి ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితా సరిచూసుకోవాలి

కృష్ణలంక(విజయవాడతూర్పు): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ని ఎన్టీఆర్‌ జిల్లా అధికారులు మర్యాదపుర్వకంగా కలిశారు. ఆదివారం జస్టిస్‌ సూర్యకాంత్‌ విజయవాడ పర్యటనలో భాగంగా పటమటకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ కలెక్టర్‌ జి. లక్ష్మీశ, సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు, జేసీ ఎస్‌. ఇలక్కియ పుష్పగుచ్ఛాలు అందజేశారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 10 గంటల వరకే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మంగళవారం తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ, వస్త్ర సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహ హోమం, గణపతి హోమాలు మాత్రమే జరుగుతాయి. ఉదయం 7.30 గంటలకు ప్రారంభమయ్యే చండీహోమం, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణాలను దేవస్థానం రద్దు చేసింది. అదే విధంగా ఉదయం 10గంటల తర్వాత అమ్మవారి లడ్డూ, పులిహోర, చక్కెర పొంగలి ప్రసాదాల విక్రయాలను నిలిపివేస్తుంది. అదే విధంగా అమ్మవారి అన్న ప్రసాద వితరణ సైతం నిలిపివేయనుంది. పది గంటల తర్వాత భక్తులెవరినీ కొండపైకి అనుమతించరు.

4న ఉదయం 8 గంటలకు దర్శనం..

4వ తేదీ తెల్లవారుజామున అమ్మవారి ఆలయం తెరిచిన తర్వాత సంప్రోక్షణ, అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజల అనంతరం ఉదయంం 8 గంటలకు దర్శనాలు ప్రారంభమవుతాయి.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చి మ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుడివాడకు చెందిన పి.పిచ్చంశెట్టి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): అమెరికా, ఇజ్రాయేల్‌ కలసి ఇరాన్‌పై దాడి చేయడాన్ని 10 వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు 10 వామపక్ష పార్టీలు ఆదివారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇరాన్‌ ప్రజలతో పాటు ఆ దేశ సుప్రీం ఖమేనీ భవనంపై దాడిచేసి, హత్యచేయడం, పాఠశాలలపై బాంబులు వేసి పిల్లల్ని చంప డం సామ్రాజ్యవాద దురహంకారానికి పరాకాష్ట అని ఆయా పార్టీల నేతలు పేర్కొన్నారు. ఈ దాడులు ఇరాన్‌ దేశ సార్వభౌమాధికారాన్ని, ఐక్యరాజ్య సమితి నిబంధనావళిని, అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను దారుణంగా ఉల్లంఘించడమేనన్నారు. ఈ దాడులను ఖండించాలని ప్రజాతంత్రవాదులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ దాడిని ఖండిస్తూ భారత ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రకటన విడుదల చేసిన వారిలో సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ కార్యదర్శి జి.ఈశ్వరయ్య, సీపీఐ (ఎంఎల్‌) ఎన్‌డీ పి. ప్రసాద్‌, బి.బంగార్రావు (లిబరేషన్‌), కాటం నాగభూషణం(ఎంసీపీఐ(యూ), జాస్తి కిషోర్‌బాబు(సీపీఐ,ఎంఎల్‌) తదితరులు ఉన్నారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఉమ్మడి జిల్లా లోని అన్ని కేడర్ల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు సంబంధించిన సాధారణ సీనియారిటీ జాబితాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఒకసారి సరి చూసుకోవాలని కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు ఆదివారం తెలిపారు. సాధారణ సీనియారిటీ జాబితాల ప్రచురణకు సంబంధించి డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఆదేశాల మేరకు జాబితాను జిల్లా వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు ఉన్న వారు సంబంధిత ఆధారాలతో ఈ నెల రెండు నుంచి నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నందు సమర్పించాలని తెలిపారు. నిర్ణీత సమ యం తరువాత వచ్చిన అభ్యంతరాలను స్వీకరించబడవని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం మండల, ఉప విద్యాశాఖాధికారులను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement