సుబ్బారాయుడి ఆదాయం రూ. 8.88లక్షలు | - | Sakshi
Sakshi News home page

సుబ్బారాయుడి ఆదాయం రూ. 8.88లక్షలు

Mar 2 2026 7:21 AM | Updated on Mar 2 2026 7:21 AM

సుబ్బారాయుడి ఆదాయం రూ. 8.88లక్షలు

సుబ్బారాయుడి ఆదాయం రూ. 8.88లక్షలు

సుబ్బారాయుడి ఆదాయం రూ. 8.88లక్షలు

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి వివిధ సేవా టికెట్ల ద్వారా ఆదివారం రూ. 8,88,745 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీ రామ వరప్రసాదరావు తెలిపారు. స్వామివారి సేవా టికెట్ల ద్వారా రూ. 4,81,422, లడ్డూ ప్రసాదం నుంచి రూ. 1,52,050, నిత్యాన్నదాన కార్యక్రమం ద్వారా రూ. 1,37,651, శాశ్వత అన్నదానం ద్వారా రూ. 5,001, స్వామివారి కల్యాణ కట్ట టికెట్ల నుంచి రూ. 20,920 కలిపి మొత్తం రూ. 8,88,745 వచ్చాయన్నారు.

రేపు ఆలయం మూసివేత..

ఈనెల 3వ తేదీన చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం ఉదయం 5 గంటలకు స్వామివారికి సుప్రభాతసేవ, నిత్యాభిషేకం అనంతరం ఉదయం 6 గంటలకు మహానివేదన సమర్పించి తదుపరి దేవాలయాల తలుపులు మూసి వేస్తామని డీసీ తెలిపారు. మరుసటి రోజు బుధవారం ఉదయం 6 గంటలకు స్వామివార్లకు సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement