ఉప్పొంగిన ఆవిర్భావోత్సాహం | - | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన ఆవిర్భావోత్సాహం

Mar 13 2026 8:59 AM | Updated on Mar 13 2026 8:59 AM

ఉప్పొంగిన ఆవిర్భావోత్సాహం వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యం ● గన్నవరం నియోజకవర్గంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో స్థానిక నాయకులు జెండాను ఎగురవేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామిశెట్టి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ ఎలిజిబెత్‌రాణి, ఎంపీపీ ఆనగాని రవి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ● పెనమలూరు నియోజకవర్గంలో పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లో వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించారు. ● మైలవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. మైలవరం, ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేశారు.

కార్యకర్తలకు వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ పిలుపు జిల్లాలో ఘనంగా వైఎస్సార్‌ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేస్తాం : అవినాష్‌

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేళ ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేసింది. పార్టీ శ్రేణుల్లో నవోత్సాహం పెల్లుబికింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా... అభిమానుల్లో ఏమాత్రం తరగని ఉత్సాహం... అదే పార్టీకి ప్రాణవాయువు... పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామ స్థాయి లో సైతం పార్టీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో జరుపుకొన్నారు.
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ జిల్లాలో వైఎస్సార్‌ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. భారీ కేక్‌లు కట్‌ చేసి మిఠాయిలు పంచుకున్నారు. పేదలు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. విజయవాడ పోలీసు కంట్రోల్‌ రూం వద్ద ఉన్న వైఎస్సార్‌ పార్క్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ను మరోసారి సీఎంను చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో...

విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గుణదలలోని నియో జకవర్గ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. పార్టీ సీనియర్‌ నేత కడియాల బుచ్చిబాబు, డెప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గలతో పాటు మండల పార్టీ అధ్యక్షులు ప్రభుదాస్‌, గద్దె కళ్యాణ్‌ రామ్‌, సన్నీ, తుళ్లూరు ఉదయ్‌, సాయి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో...

నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్‌లలో వైఎస్సార్‌ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ముత్యాలంపాడులో నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లాది విష్ణు పాల్గొని వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్‌ కట్‌ చేశారు.

విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గంలో...

విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గంలో 43వ డివిజన్‌ ఊర్మిళానగర్‌ వైఎస్సార్‌ విగ్రహం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్‌ బాపతి కోటిరెడ్డి తో కలిసి వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళుర్పించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ కట్‌ చేశారు. అనంతరం పేదలు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, బండి పుణ్యశీల, కార్పొరేటర్లు యరడ్ల ఆంజనేయరెడ్డి, నాయకులు గౌస్‌ మొహిద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్రంలో 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పోలీసు కంట్రోల్‌ రూం వద్ద గల వైఎస్సార్‌ పార్క్‌లో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం వైఎస్సార్‌ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత మహానేత విగ్రహానికి పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. భారీ కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్‌, వెస్ట్‌ నియోజకవర్గాల సమన్వయ కర్తలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గ, పూనూరు గౌతంరెడ్డి, పోతిన మహేష్‌, గౌస్‌ మొహిద్దీన్‌, దొడ్డా అంజిరెడ్డి, బండి పుణ్యశీల, తంగిరాల రామిరెడ్డి, పోలి మెట్ల శరత్‌, సర్నాల చలపతిరావు, ఆళ్ల చెన్నారావు, అవుతు శ్రీనివాసరెడ్డి, కడియాల బుచ్చిబాబు, కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement