● ఇంటి వద్దకే పసుపు గానుగ
ఆలోచన ఉంటే ఉపాధి మార్గం వెతుకోవచ్చు అంటారు.. అదే ఆలోచనతో స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు హైదరాబాద్‌కు చెందిన ఇస్సాక్ కుటుంబ సభ్యులు. రూ. లక్ష పెట్టుబడితో పసుపు గానుగ పట్టే యంత్రాన్ని కొనుగోలు చేసి వ్యాన్‌లో అమర్చారు. తమతో పాటుగా నాణ్యమైన నిజామాబాద్ పసుపు కొమ్ములను తీసుకొచ్చి పసుపు గానుగ ఆడిస్తున్నారు. వీరు మంగళవారం కంకిపాడు పరిసరాల్లో సంచరిస్తూ విక్రయాలు చేపడుతున్నారు. పావుకిలో పసుపు రూ. 100, కిలో రూ. 400 చొప్పున విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. నాణ్యమైన పసుపు, కళ్లెదుటే గానుగ ఆడించి ఇవ్వటంతో పసుపు కొనుగోళ్లు చేసేందుకు కంకిపాడు పట్టణ వాసులు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా ఇస్సాక్‌ను ‘సాక్షి’ పలుకరించగా, ప్రజలు మన వద్దకు రావాలని చూడటం కంటే వారి వద్దకే వెళ్లి విక్రయాలు చేపట్టడం మేలని, ఈ తరహాలో విక్రయాలు చేస్తున్నట్లు చెప్పారు. – కంకిపాడు


