దుర్గమ్మ సేవలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సీఎస్ విజయానంద్‌ను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో శీనానాయక్ సీఎస్ విజయానంద్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను సమర్పించారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాష్ట్ర దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. హరి జవహర్‌లాల్ మంగళవారం తెల్లవారుజామున అమ్మవారి ఖడ్గమాలార్చనలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అమ్మవారి ఖడ్గమాలార్చనలో పాల్గొనేందుకు తెల్లవారుజాము 4 గంటలకు ఆలయానికి చేరుకున్న హరిజవహర్‌లాల్‌కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారి ఖడ్గమాలార్చన, మల్లేశ్వర స్వామి వారి విశేష అభిషేకాలలో పాల్గొన్న అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటం, పట్టువస్త్రాలను అందించారు.
వీరులపాడు: ఒంటరిగా తిరుగుతున్న మానసిక స్థితి సరిగా లేని ఆరేళ్ల బాలుడిని ఆటో డ్రైవర్ గమనించి పంచాయతీ కార్యాలయంలో అప్పగించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం ప్రకారం.. మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన దార్ల నాగరాజు కుమారుడు అనీష్ మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చి మధిర రోడ్డు మీదుగా నడుచుకుంటూ జుజ్జూరు గ్రామానికి చేరుకున్నారు. గ్రామ శివారులో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని గమనించిన ఆటో డ్రైవర్ హనుమంతరావు ఆటోలో ఎక్కించుకుని వచ్చి జుజ్జూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలోని ఉద్యోగులకు అప్పగించాడు. పంచాయతీ సిబ్బంది విషయాన్ని సర్పంచ్ రమావత్ కోటికి తెలుపగా సర్పంచ్ భర్త రాము బాలుడి ఫొటోతో సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశారు. విషయం తెలుసుకుని జుజ్జూరు గ్రామానికి వచ్చిన తల్లిదండ్రులకు సర్పంచ్ బాలుడిని అప్పగించారు. తమ కుమారుడిని క్షేమంగా అప్పగించిన సర్పంచ్ కోటి, భర్త రాము, ఆటో డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
దుర్గమ్మ సేవలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
దుర్గమ్మ సేవలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి


