జోగి సోదరుల బెయిల్‌ రద్దు పిటీషన్‌పై నోటీసులు | - | Sakshi
Sakshi News home page

జోగి సోదరుల బెయిల్‌ రద్దు పిటీషన్‌పై నోటీసులు

Feb 25 2026 10:41 AM | Updated on Feb 25 2026 10:41 AM

జోగి సోదరుల బెయిల్‌ రద్దు  పిటీషన్‌పై నోటీసులు

జోగి సోదరుల బెయిల్‌ రద్దు పిటీషన్‌పై నోటీసులు

జోగి సోదరుల బెయిల్‌ రద్దు పిటీషన్‌పై నోటీసులు కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

విజయవాడ లీగల్‌: నకిలీ మద్యం కేసులో బెయిల్‌ పొందిన జోగి రమేష్‌, ఆయన సోదరుడు రాము షరతులకు విరుద్ధంగా మీడియాతో మాట్లాడటం, ర్యాలీ నిర్వహించారనే అభియోగంపై వారి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు 7వ అదనపు జిల్లా జ్యూడీషియల్‌ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై వారిరువురికీ న్యాయమూర్తి నోటీసులు పంపించారు. దీనిపై విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న సీపీ సెంథిల్‌ బెయిల్‌ పిటీషన్‌పై విచారణను ఎకై ్సజ్‌ కోర్టు న్యాయమూర్తి వచ్చే నెల 2వ తేదీకి, ఆయన్ను కస్టడీకి కోరుతూ ఎకై ్సజ్‌ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్‌పై తీర్పును ఈనెల 26వ తేదీకి వాయిదా వేశారు. మద్యం అక్రమ కేసులో గుంటూరు రిమాండ్‌లో ఉన్న వాసుదేవరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్‌ అధికారులు మంగళవారం ఏసీబీ న్యాయస్థానంలో పిటీషన్‌ దాఖలు చేశారు.

పెనమలూరు: కరెంట్‌ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేసే లింగాల కిరణ్‌తేజ(30) పెనమలూరు ఆశ్రమం వెనుక కాలువకట్టపై భార్య తులసి, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. కాగా కిరణ్‌తేజ తన ఇంటి మరమ్మతులు చేయటానికి ఇంటి పక్కనే ఉన్న మరో ఇంట్లోకి వారం క్రితమే అద్దెకు మారాడు. బాత్‌రూమ్‌లో లైట్‌ వెలగక పోవటంతో మంగళవారం రాత్రి లైట్‌ వెలిగించటానికి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్‌షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. స్పాట్‌లోనే ప్రాణాలు వదిలాడు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చారు. కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement