ఎలుకల మందు తాగి మహిళ ఆత్మహత్య
గుడివాడరూరల్: ఎలుకల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై గుడివాడ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తటివర్రు గ్రామానికి చెందిన కొల్లూరి జాన్ భార్య మరియమ్మ(40) గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోందన్నారు. ఈనెల 18వ తేదీ సాయంత్రం పొలం వెళ్లేందుకు మరియమ్మ భర్త అడుగగా కడుపునొప్పిగా ఉందని తాను రాలేనని చెప్పడంతో, సరేనని భర్త పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో పొలం నుంచి ఇంటికి వచ్చిన భర్తకు కడుపు నొప్పిగా ఉందని తాగేందుకు కూల్‌డ్రింక్ తీసుకురావాలని కోరిందని, ఈ క్రమంలో తీసుకువచ్చి ఇచ్చాడు. రాత్రి 11గంటల సమయంలో మరియమ్మకు వాంతులు అవుతుండగా కుమారుడు వచ్చి ప్రశ్నించగా తాను ఎలుకల మందు తాగినట్లు మరియమ్మ తెలిపిందన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వైద్య సేవల నిమిత్తం తరలించగా మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ తరలించారు. అక్కడ చిక్సిత పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందిందని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
కంకిపాడు: జాతీయ రహదారిపై ఒకే చోట రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాద స్థాయి ఊహించని విధంగా ఉన్నా, ప్రాణాపాయం లేకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం కంకిపాడు–గోసాల సెంటర్ గ్రామాల నడుమ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ప్రమాదాల వివరాల్లోకి వెళితే.. కంకిపాడు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆటోకి డీజిల్ అయిపోవటంతో మరో ఆటో డ్రైవరు తన కాలితో ఆటోను వెనుక నుంచి నెడుతూ ఆటో నడుపుతున్నాడు. కంకిపాడు బైపాస్ దాటగానే వాహనాలు అదుపుతప్పి జాతీయరహదారిపై పల్టీ కొట్టాయి. ఒక ఆటో ఏకంగా పంట బోదెలోకి దూసుకెళ్లింది. అయితే ఆటోలో డ్రైవర్లు మినహా ఎవరూ లేరు. వారికి కూడా స్వల్ప గాయాలే అయ్యాయి. గోసాల గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు జాతీయరహదారిపై పడ్డ ఆటోను రోడ్డు మార్జిన్‌కు తరలించి, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకున్నారు.
కారును ఢీకొట్టిన టిప్పరు..
ఇదే సమయంలో కంకిపాడు నుంచి గోసాల వైపు వెళ్తున్న కారును వెనుకగా వస్తున్న భారీ టిప్పరు ఢీకొంది. కారులో ఉన్న భార్యాభర్తలు, వారి కుమారుడు ప్రాణభయంతో కేకలు పెట్టారు. టిప్పరు ఢీకొనటంతో కారు డోర్లు ధ్వంసమై ఇరుక్కుపోవటంతో భయాందోళనలు చెందారు. అక్కడే ఉన్న పారిశుద్ధ్య కార్మికులు అతికష్టం మీద కారు డోర్లు తెరవటంతో ఆ కుటుంబం ఊపిరిపీల్చుకుంది. ఈ రెండు ప్రమాదాల్లోనూ ఎవరికీ ప్రాణాపాయం లేకపోవటంతో అంతా ఊపిరితీసుకున్నారు.
ఎలుకల మందు తాగి మహిళ ఆత్మహత్య
ఎలుకల మందు తాగి మహిళ ఆత్మహత్య


