మహిళాభ్యుదయంతోనే దేశ ప్రగతి
విజయవాడ కల్చరల్: మహిళాభ్యుదయంతో దేశ ప్రగతి సాధ్యమని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశ్వసాహితీ కళా వేదిక ఆధ్యర్యంలో బందరు రోడ్డులోని బాలోత్సవ్ భవన్‌లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ మహిళల్లోని ప్రగతిని స్వాగతించాలని సూచించారు. తమ పార్టీ అధ్యక్షుడి ప్రోత్సాహం కారణంగా తాను ఐదేళ్లు విజయవాడకు మేయర్ పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాజకీయాలకు కొత్తగా వచ్చినా పట్టుదల, కృషి, చిత్తశుద్ధితో నగరానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేశామన్నారు. గజల్ మాస్ట్రో శ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించారు. విశ్వసాహితీ కళావేదిక వ్యవస్థాపకురాలు కొల్లి రమావతి, వివిధ రంగాలకు చెందిన డాక్టర్ జీవీ పూర్ణచందు, కలిమి శ్రీ, రచయిత్రి తేళ్ల, గోళ్ల నారాయణరావు, మంచాల సుధాకర్, అంజూ ప్రసంగించారు.
125 మందికి సీ్త్రశక్తి పురస్కారాలు..
సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, కవిత్వం, న్యాయవాద వృత్తి, పోలీస్ విభాగం, సేవారంగం తదితరల రంగాలలోని ప్రతిభ కలిగిన వారిని గుర్తించి సీ్త్ర శక్తి పురస్కారాలను, జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను మేయర్ భాగ్యలక్ష్మి చేతుల మీదుగా అందించారు.
విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి


