మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీని నియమిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 86 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం ఈనెల 17వ తేదీతో ముగుస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం 284 జీవోను బుధవారం విడుదల చేసింది. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీని నియమించారు. ఈ జీవోను రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.సురేష్‌కుమార్ జారీ చేశారు. ఈ జీవో ప్రకారం ఈనెల 18వ తేదీ నుంచి నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ వ్యవహరించనున్నారు.


