కంకిపాడు సెక్షన్ వద్ద పేరుకుపోయిన
గుర్రపుడెక్క, వ్యర్థాలు
గుర్రపుడెక్కతో నిండిన
పునాదిపాడు చానెల్
కోమటిగుంట రెగ్యులేటర్ వద్ద
తూడుతో నిండిన కాలువలు
చలివేంద్ర పాలెం వద్ద పుల్లేరు కాలువలో గుర్రపుడెక్క
పంట కాలువలన్నీ గుర్రపుడెక్కతో నిండిపోయాయి. ఎగువ నుంచి వచ్చే కొద్దిపాటి సాగునీరు కూడా దిగువకు వెళ్లే ఆస్కారం లేదు. కంకిపాడు సెక్షన్, కోమటి గుంట రెగ్యులేటర్‌ల పరిధిలోని పలు ప్రధాన కాలువలు, అనుబంధ కాలువలు అన్నిట్లోనూ గుర్రపుడెక్క, తూడు మేట వేసుకున్నాయి. అధికారులు ఏమాత్రం దృష్టి సారించటం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. –కంకిపాడు


