సివిల్‌ సర్వీసెస్‌ విద్యార్థులకు ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

సివిల్‌ సర్వీసెస్‌ విద్యార్థులకు ఉచిత శిక్షణ

Mar 15 2026 4:51 AM | Updated on Mar 15 2026 4:51 AM

కేతనకొండ(ఇబ్రహీంపట్నం): సివిల్‌ సర్వీసెస్‌ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆంఽధ్రప్రదేశ్‌ వెటర్నరీ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ లక్ష్మయ్య తెలిపారు. మండలంలోని కేతనకొండ గ్రామంలో ఉన్న సీబీఆర్‌ అకాడమీలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్‌ లక్ష్మయ్య ఏఏఎస్‌ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో పారా అసోసియేషన్‌ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ నిర్వహిస్తున్న వెంకటపతి విద్యా దీవెన పథకం కింద సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థులకు మూడేళ్ల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 15న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈనెల 23 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. సమావేశంలో సీబీఆర్‌ అకాడమి చైర్మన్‌ చలసాని బలరామప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement