మచిలీపట్నంఅర్బన్: కుష్ఠు వ్యాధి ఒక సంక్రమణ వ్యాధి కాగా, ప్రారంభ దశలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేయవచ్చని రాష్ట్ర లెప్రసి విభాగం (ఎస్.ఎల్.డి) జాయింట్ డైరెక్టర్ డాక్టర్ దేవసాగర్ తెలిపారు. సోమ వారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జాతీయ లెప్రసీ నిర్మూలనలో భాగంగా కెపాసిటీ బిల్డింగ్‌పై డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.యుగంధర్ ఆధ్వర్యంలో ఓరియెంటేషన్ ట్రైనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవసాగర్ మాట్లాడుతూ లేప్రోసి వ్యాధి ఒక బ్యాక్టీరియా వల్ల కలిగే సంక్రమణ వ్యాధని చెప్పారు. ఇది ప్రధానంగా చర్మం, నరాలు, కళ్లను ప్రభావితం చేస్తుందని తెలిపారు. సమ యానికి చికిత్స తీసుకుంటే వ్యాధి పూర్తిగా నయం అవుతుందని, త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే వికలాంగత్వాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. జిల్లా లెప్రసి వ్యాధి నియంత్రణాధికారి డాక్టర్ అంబటి వెంకట్రావు మాట్లాడుతూ వ్యా ధి నివారణ, గుర్తింపు, చికిత్సలో వైద్య సిబ్బంది సమన్వయం ఎంతో ముఖ్యమని చెప్పారు. జీజీహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పూర్ణిమ మాట్లాడుతూ లెప్రసి వ్యాధి ఉన్నవారిని సమాజం దూరం పెట్టాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఉచితంగా మందులు అందించి చికిత్స కల్పిస్తోందన్నారు. వ్యాధిని తొందరగా గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చని తెలిపారు. అసిస్టెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ, మెడికల్ అధికారులు, ఫార్మసీ అధికారులు, పిహెచ్‌సి నోడల్ అధికారులు పాల్గొన్నారు.
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 531 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో 97 కేంద్రాల్లో 30,820 మంది విద్యార్ధులను కేటాయించారు. అందులో 30,289 మంది హాజరయ్యారు. 531 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం గణితం–2బీ పరీక్షలను నిర్వహించారు.
ఓపెన్ ఇంటర్ పరీక్షకు..
ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల్లో భాగంగా జిల్లాలో సోమవారం నిర్వహించిన నాలుగో రోజు పరీక్షకు 241 మంది గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. సోమవారం 11 కేంద్రాల్లో భౌతికశాస్త్రం, రాజనీతిశాస్త్రం, పౌరశాస్త్రం కలిపి 1414 మందికి గాను 1173 మంది హాజరయ్యారు. మిగిలిన 241 మంది గైర్హాజరయ్యారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు 11 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు.82.39 శాతం హజరు శాతంగా అధికారులు ప్రకటించారు.
రాష్ట్ర లెప్రసీ విభాగం జేడీ డాక్టర్ దేవసాగర్


