ముగిసిన లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహిస్తున్న లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ గురువారం సాయంత్రం ముగిసింది. శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో పాటుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీల్లో పాల్గొన్నారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడతూ.. వచ్చే ఏడాది సౌత్ ఇండియా ప్రీమియర్ లీగ్ పేరుతో ఆరు రాష్ట్రాల శాసన సభ్యులకు విశాఖపట్నంలో క్రీడాపోటీలు నిర్వహిస్తామన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. సౌత్ ఇండియా ప్రీమియర్ లీగ్‌కు తమ పూర్తి సహాయ సహాకారాలను అందిస్తామన్నారు. శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి పాల్గొన్నారు. స్పోర్ట్స్ మీట్ చివరి రోజు క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్, టెన్నిస్, క్యారమ్స్ పోటీలు జరిగాయి.


