పటిష్ట భద్రతలో ఈవీఎం గోడౌన్‌ | - | Sakshi
Sakshi News home page

పటిష్ట భద్రతలో ఈవీఎం గోడౌన్‌

Feb 27 2026 7:48 AM | Updated on Feb 27 2026 7:48 AM

పటిష్ట భద్రతలో   ఈవీఎం గోడౌన్‌

పటిష్ట భద్రతలో ఈవీఎం గోడౌన్‌

పటిష్ట భద్రతలో ఈవీఎం గోడౌన్‌

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఈవీఎం, వీవీ ప్యాట్ల గోదాంకు పకడ్బందీ భద్రత ఏర్పాట్లు కల్పించినప్పటికీ నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలలో భాగంగా ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గురువారం విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలోగల ఈవీఎం, వీవీప్యాట్ల గోదాంను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేశారు. డెప్యూటీ సీఈఓ, ఈవీఎంల నోడల్‌ ఆఫీసర్‌ ఆంజనేయులు, డీఆర్‌ఓ ఎం. లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement