దళితులపై అక్రమ కేసులు ఎత్తివేయండి | - | Sakshi
Sakshi News home page

దళితులపై అక్రమ కేసులు ఎత్తివేయండి

Mar 11 2026 8:56 AM | Updated on Mar 11 2026 8:56 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ముంజేరు దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని బాధితుల న్యాయ పోరాట కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం కమిటీ ఆధ్వర్యలో ఆత్మగౌరవ దీక్ష నిర్వహించారు. కేసులు ఎత్తివేయాలని, ఎమ్మెల్యే లోకం మాధవి దళిత ద్రోహి అంటూ నినాదాలు చేశారు.

కనీసం స్పందించడం లేదు..

బాధితుల న్యాయ పోరాట కమిటీ అధ్యక్షుడు బోనెల జోగేంద్ర సిద్ధార్థ మాట్లాడుతూ ముంజేరు దళిత కాలనీ సిద్ధార్థ నగర్‌కు మురుగు నీరు కాల్వను మళ్లించి దళితులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ విషయమై అధికారులు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. 94 రోజులుగా ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నా జిల్లా అధికారులు స్పందించడం లేదన్నారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి దళితులకు న్యాయం చేయకపోగా, వారికి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. ఎస్సీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ దళితవాడ గుండా మురుగు కాలువ తవ్వించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఆత్మగౌరవ దీక్షలో ముంజేరు బాధితుల న్యాయ పోరాట కమిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement