పవర్‌ లిఫ్టర్‌ చంద్రికకు ఆర్థిక సాయం | - | Sakshi
Sakshi News home page

పవర్‌ లిఫ్టర్‌ చంద్రికకు ఆర్థిక సాయం

Mar 11 2026 8:56 AM | Updated on Mar 11 2026 8:56 AM

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అంతర్జాతీయ స్థాయిలో పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన బొల్లినేని చంద్రిక త్వరగా కోలుకొని మళ్లీ క్రీడా మైదానంలో అడుగు పెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌) ఛైర్మన్‌ ఏ.రవినాయుడు ఆకాంక్షించారు. ఆనారోగ్యంతో వైద్య చికిత్సలు పొందుతున్న చంద్రికను సోమవారం ఆయన ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవర్‌ లిప్టింగ్‌లో చంద్రిక సాధించిన విజయాలు యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. వైద్య చికిత్స కోసం లక్ష రూపాయలను అందచేశారు. కార్యక్రమంలో శాప్‌ డైరెక్టర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement