ఇంగ్లిష్–2 పరీక్షకు 36,579 మంది హాజరు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ పరీక్షలు ఎన్టీఆర్ జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష జరిగింది. జిల్లాలోని 98 కేంద్రాల్లో ఇంగ్లిష్–2 పరీక్ష జరిగింది. ఆయా కేంద్రాల్లో 37,083 మంది విద్యార్థులకు 36,579 మంది హాజరై పరీక్ష రాశారు. 504 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆఐఓ ప్రభాకరరావు పరీక్షలను పర్యవేక్షించారు.
కలెక్టర్‌కు ఆహ్వానం
గంపలగూడెం: మండలంలోని నెమలి గ్రామంలో వేంచేసిన శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆలయ ఏసీ ఎన్. సంధ్య గురువారం కలెక్టర్ లక్ష్మీశను కలసి ఆహ్వాన పత్రికను అందజేశారు. బ్రహ్మోత్సవాలు సమర్థంగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించినట్లు ఏసీ వివరించారు.


