పెట్టుబడులు చేతికి అందేనా..?
ఎకరాకు రూ.35 వేల వరకూ కౌలు ఒప్పందాలు చేసుకుని కౌలు రైతులు పసుపు సాగు చేశారు. విత్తనానికి, యాజమాన్య చర్యలకు రూ.1.50 లక్షల వరకూ పెట్టుబడులు అయ్యాయి. రైతులకు మాత్రం కౌలు సొమ్ము మినహాయింపు అవుతుంది. పంట దున్ని, వంట పూర్తి చేసి ఎండబెట్టి మార్కెట్‌కు తరలించే నాటికి మరో రూ.30 వేల వరకూ పెట్టుబడులు అయ్యాయని రైతులు అంటున్నారు. గతేడాది అక్టోబర్‌లో సంభవించిన మోంథా తుపాను కారణంగా పంటకు దుంప కుళ్లు తెగులు సోకింది. తెగుళ్ల ప్రభా వంతో ఈ దఫా కొన్ని చోట్ల దిగుబడులు తగ్గుతా యని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో మార్కెట్‌లో ధర తగ్గుముఖం పట్టడం మరింత కలవరపెడుతోంది. కూలీల ఖర్చు, పెట్టుబడులు అన్నా చేతికి అందుతాయో? లేదో? అన్న ఆందోళన రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.


