దుర్గమ్మ సేవలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం దర్శించుకున్నారు. అమ్మ వారి దర్శనానికి విచ్చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అర్చకులు ఆలయ మర్యా దలతో స్వాగతం పలకగా, అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆలయ ఏఈఓ వెంకటరెడ్డి అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విద్యార్థులు భాషలపై పట్టు సాధించాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ సూచించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని 20 మండ లాల్లో తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు శనివారం విజయవాడలో జిల్లాస్థాయి లాంగ్వేజ్ ఫెస్టివల్ నిర్వహించారు. ముగింపు సభకు డీఈఓ చంద్ర కళ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు ప్రదానం చేశారు. ‘భాష ప్రాముఖ్యత – భాష ఔన్నత్యత’పై వక్తృత్వం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అకాడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్ ఎస్.అశోక్‌బాబు, ఎంఈ ఓలు ఆర్.విజయరామారావు, శ్యాంప్రసాద్, అధికారులు శిరీష రాణి, చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను శనివారం పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పరిశీలించారు. జస్టిస్ సూర్యకాంత్ విజయవాడలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ సంద ర్భంగా లోక్ భవన్, హోటల్ నోవోటెల్, పట మట డొంక రోడ్డులోని ఆంట్రా లక్స్ ఫంక్షన్ హాల్‌లో చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీపీ వెంట డీసీపీ కృష్ణకాంత్‌పటేల్, జేసీ ఇలక్కియ, ఏడీసీపీ మురళీకృష్ణ, సెంట్రల్ ఏసీపీ దామోదర్, ట్రాఫిక్ ఏసీపీ వంశీధర్‌గౌడ్, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్య ఉచిత ప్రసాద విత రణకు విజయవాడ పటమటకు చెందిన టి. వెంకట కృష్ణారావు, నాగప్రియ రూ.1.45 లక్షల విరాళం సమర్పించారు. వారు అమ్మ వారి దర్శనానికి శనివారం ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులను కలిసి ఉచిత ప్రసాద వితరణకు విరాళం అందజేశారు. విజయవాడ ఏపీఐఐసీ కాలనీకి చెందిన రెడ్డి రాధ, రెడ్డి నాగేశ్వరరావు దంపతులు ఆలయ చైర్మన్ రాధాకృష్ణను కలిసి నిత్యాన్నదానం నిమిత్తం రూ.1.08 లక్షల విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు.
దుర్గమ్మ సేవలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి


