విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Mar 1 2026 7:23 AM | Updated on Mar 1 2026 7:23 AM

విజయవ

విజయవాడ సిటీ

ఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026 రైతుల కష్టాన్ని దోచేందుకు సిండి‘కేటు’ యత్నం ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహిద్దాం పెళ్లి కుమారుడిగా వేణుగోపాలుడు సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి బీఎడ్‌–3 ఫలితాలు విడుదల గన్నవరంలో మహారాష్ట్ర బృందం పర్యటన

న్యూస్‌రీల్‌

పసుపు ధర పతనంలో వ్యాపారులే కీలకం పంట చేతికొచ్చే తరుణంలో బహిరంగ మార్కెట్‌లో ధర తగ్గుముఖం ఆందోళన చెందుతున్న పసుపు రైతులు

ముమ్మాటికీ వ్యాపారుల పనే

ఎన్టీఆర్‌ జిల్లా
ఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026
రైతుల కష్టాన్ని దోచేందుకు సిండి‘కేటు’ యత్నం

7

చిలకలపూడి(మచిలీపట్నం): కాలుష్య నివారణతో ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ కోరారు. వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా ఆయన సైకిల్‌పై శనివారం విధులకు హాజరయ్యారు.

గంపలగూడెం: నెమలి శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని ఆలయ ఎన్‌.సంధ్య తెలిపారు. శనివారంస్వామి వారిని పెళ్లి కుమారుడిగా అలంకరించారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్‌ నేరాలు, డిజిటల్‌ అరెస్టు వంటివి జరగకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు విశ్రాంత పోలీసు అధికారులు కృషి చేయాలని పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు కోరారు. ఉద్యోగ విర మణ చేసిన పోలీసు అధికారులతో శనివారం కమిషనరేట్‌లోని తన చాంబర్‌లో సీపీ సమావేశ మయ్యారు. సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. ప్రజలు డిజిటల్‌ అరెస్టులు, సైబర్‌ నేరాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రిటైర్డ్‌ పోలీసు అధికారుల సేవలను వినియోగించుకుని ప్రజలను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సైబర్‌ క్రైమ్‌ డీసీపీ కృష్ణప్రసన్న, రిటైర్డ్‌ పోలీసు అధికారుల సంఘ ప్రెసిడెంట్‌ ఎ.ఎస్‌.ఎన్‌.రెడ్డి, కార్యదర్శి టి.హరికృష్ణ, ఎల్‌.నాంచారయ్య పాల్గొన్నారు.

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన బీఎడ్‌, స్పెషల్‌ బీఎడ్‌ –3 సెమిస్టర్‌ (రెగ్యులర్‌, సప్లిమెంటరీ) ఫలితాలను ఉపకులపతి ఆచార్య కూన రాంజీ శనివారం విడుదల చేశారు. విద్యార్థులు ఈ ఫలితాలను విశ్వ విద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య డాక్టర్‌ పి.వీరబ్రహ్మచారి సూచించారు. పునఃమూల్యాంకనానికి అభ్యర్థులు ఈ నెల తొమ్మిదో తేదీలోగా వెబ్‌సైట్‌లో సూచించిన రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకో వాలని పేర్కొన్నారు.

యూజీ –1 సెమిస్టర్‌ ఫలితాలు

యూజీ –1 సెమిస్టర్‌ ఫలితాలను వీసీ రాంజీ విడుదల చేశారు. రెగ్యులర్‌లో 53.03 శాతం, సప్లిమెంటరీలో 63.66 శాతం ఉత్తీర్ణత నమో దైంది. ఈ నెల 12వ తేదీలోగా అభ్యర్థులు రీవాల్యూయేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంది. వర్సిటీ రిజిస్ట్రార్‌ ఉష పాల్గొన్నారు.

కంకిపాడు: ఆరుగాలం కష్టం ఫలించి రైతుల చేతికి పంట వస్తున్న తరుణం. ధర ఆశాజనకంగా ఉంది, దిగుబడులు కూడా బాగుంటే అప్పుల ఊబి నుంచి గట్టెక్కుతామని రైతులు సంబర పడ్డారు. ఇంతలోనే మార్కెట్‌లో సిండికేటుగాళ్లు మాయాజాలం సృష్టించారు. ధరలను ఇష్టారీతిన తగ్గిస్తూ రైతుల రెక్కల కష్టాన్ని దోచుకునేందుకు తెగబడుతున్నారు. సిండికేట్ల దందాతో పసుపు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో సాగయ్యే ప్రధాన ఉద్యాన పంటల్లో పసుపు ఒకటి. రైతులు ఈ పంటను పచ్చ బంగారంగా కూడా పిలుచుకుంటారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 720 ఎకరాల్లో, కృష్ణా జిల్లాలో 5,071 ఎకరాల విస్తీర్ణంలో ఖరీఫ్‌ సీజన్‌లో పసుపు సాగు చేశారు. కడప, టేకూరుపేట, దుగ్గిరాల, శీలం, ప్రగతి, ఎర్రశీలం, ఇతర స్థానిక రకాలను ఎంపిక చేసుకుని రైతులు సాగు చేపట్టారు. పంట కాలం తుది దశకు చేరుకుంది. కొద్ది రోజులుగా పసుపు ఆకుతీత, ఆకు నిల్వ వంటి పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో పసుపు కల్లాలు దున్నటం కూడా మొదలు పెట్టారు. ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతోషపడ్డారు.

దోచుకునేందుకు పక్కాగా స్కెచ్‌

మరో పది నుంచి 15 రోజుల్లో రైతులు పూర్తి స్థాయిలో పసుపు పంట దున్ని కల్లాల్లో వంట పనులు చేపట్టనున్నారు. కల్లాల వద్దే పంటను ఎండబెట్టి ఎండిన కొమ్ములను మార్కెట్‌కు తర లించేందుకు సమాయత్తం అవుతున్నారు. పది రోజులు క్రితం వరకూ క్వింటా ఎండుపసుపు కొమ్ములు గ్రేడ్‌–1 ధర బహిరంగ మార్కెట్‌లో రూ.15,500 వరకూ పలికింది. సాధారణ రకానికి సైతం రూ,14,500 వరకూ ధర దక్కింది. అలాంటిది రైతుల వద్ద నుంచి పంట సిద్ధమవుతున్న సమయంలో క్వింటా పసుపు కొమ్ముల ధర ఒక్క సారిగా రూ.12,400లకు పడిపో యింది. ఇన్నాళ్లూ మార్కెట్‌లో ఊరించిన ధరలు అమాంతం తగ్గుముఖం పట్టడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మార్కెట్‌ను కొందరు వ్యాపారులు తమ చేతుల్లోకి తీసుకుని ధర నిర్ణయం సాగిస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగా వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారులు సిండి కేట్‌ అయ్యి పంట నాణ్యతను సాకుగా చూపి తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు పన్నాగం పన్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టడం వ్యాపారుల పనేనంటూ ఆందోళన చెందుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం పంట మార్కెట్‌కు చేరిన తరువాత రైతులకు రూ.15 వేల వరకూ ధర దక్కింది. ఈ ఏడాది కూడా అదే ధర దక్కుతుందని పసుపు సాగుచేసిన రైతులు అంతా ఆశించారు. వారి ఆశలు అడియాశలు చేస్తూ వ్యాపారులు దోచుకునేందుకు రెడీ అయ్యి ధరపై తమ ప్రభావం చూపుతున్నారు. ఫలితంగానే మార్కెట్‌లో పసుపు ధర పడిపోతుందని రైతులు చెబుతున్నారు.

మద్దూరు గ్రామ పరి ధిలో మూడు ఎకరాల్లో పసుపు సాగు చేశాను. పంట పది రోజుల్లో తీస్తాం. మొన్నటి వరకూ క్వింటా పసుపు ధర రూ.16 వేలు అన్నారు. ఇప్పుడేమో రూ.12,500 అని చెబుతున్నారు. పంట చేతికి వస్తున్న సమయంలో వ్యాపారులు అంతా ఒక్కటైపోతున్నారు. మా రెక్కల కష్టాన్ని దోచుకునేందుకు సిద్ధపడుతున్నారు. అడ్డగోలుగా ధరను నిర్ణయిస్తూ రైతులను కష్టాల పాలు చేస్తున్నారు. ధర పతనం ముమ్మాటికీ వ్యాపారుల పనే.

– వై.వెంకటేశ్వరరావు,

రైతు, మద్దూరు

విజయవాడ సిటీ1
1/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ6
6/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ7
7/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ8
8/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ9
9/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ10
10/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ11
11/11

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement