20 శాతం పెద్దలే..
మండలం గృహాలు, డిమాండ్ వసూలైంది
భవనాలు
చందర్లపాడు 15,408 76.13 57.09
జగ్గయ్యపేట 17,265 473.4 247.74
కంచికచర్ల 17,963 391.4 208.97
నందిగామ 11,986 157.7 119.22
పెనుగంచిప్రోలు 14,046 173.9 104.34
వత్సవాయి 14,981 119.5 71.68
వీరులపాడు 12,998 79.83 64.08
ఎ.కొండూరు 11,296 54.33 33.53
గంపలగూడెం 17,104 146.7 76.62
రెడ్డిగూడెం 8,838 68.55 27.35
తిరువూరు 10,120 50.12 32.28
విసన్నపేట 13,152 152.3 82.59
జి.కొండూరు 15,142 244.2 145.45
ఇబ్రహీంపట్నం 11,036 423.5 202.6
మైలవరం 16,122 343.8 220
55,693 2444 1475
జి.కొండూరు: గ్రామాల్లో పన్నుల చెల్లింపులో పెద్దలు వెనుకంజలో ఉండగా.. తప్పించకోవడానికి ముందంజలో ఉన్నారు. ప్రసంగాల్లో నీతులు వల్లించే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఇంటి పన్నుల చెల్లింపులో మాత్రం అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. సామాన్యులను ముక్కుపిండి వసూలు చేసే అధికారులు.. ఏళ్ల తరబడి ఇంటి పన్నులు చెల్లించని బడాబాబులను ఏమీ చేయలేక, రాజకీయ ఒత్తిళ్లతో చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ఇంటి పన్నులను బడాబాబులే ఎగవేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాది చివరికి వచ్చినా పన్నుల వసూళ్లు పాత బకాయిలతో కలిపి 58 శాతం మాత్రమే పూర్తవడం ఆందోళనకరంగా మారింది. గ్రామ పంచాయతీలకు ఆదాయం లేక, స్టాంపు డ్యూటీ లేక, బడాబాబుల నుంచి ఇంటి పన్నుల వసూళ్లు కాకపోవడంతో కనీస మౌలిక వసతుల కల్పన లేక, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు అందించలేని దుస్థితి నెలకొంటోంది .
ఎన్టీఆర్ జిల్లాలోని 16మండలాల పరిధిలో 288 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2025 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి చివరిరే రూ.53.99కోట్లు ఇంటి పన్ను వసూలు చేయాల్సి ఉంది. దీనిలో పాత బకాయిలే రూ.11.97కోట్లు ఉంది. గతేడాది ఆగస్టు నుంచి ఇంటి పన్ను వసూళ్లు ప్రారంభించిన అధికారులు ఇప్పటి వరకు పాత బకాయిలు రూ.4.60కోట్లు, నూతన ఇంటి పన్ను రూ.27.08కోట్లు కలిపి మొత్తం రూ.31.68కోట్లను వసూలు చేశారు. ఇప్పటి వరకు పేద, మద్య తరగతి వారి నుంచి మాత్రమే ఈ ఇంటి పన్నును అధికారులు వసూలు చేయగలిగారు.
విజయవాడ
రూరల్
ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పన్నుల వివరాలు రూ.లక్షల్లో
నగర, గ్రామ ఆర్థిక వ్యవస్థకు పన్నులు ప్రధాన ఆధారం. అయితే ఇటీవల పన్నులు కట్టకుండా దారులు చూస్తున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో అధిక ఆదాయం కలిగిన పెద్దలు, సంస్థలు ఇంటి పన్నులు చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని కోసం బడాబాబులు పావులు కదుపుతున్నారు. పన్ను చెల్లింపులో సామాన్యులు నియమాలు పాటిస్తుంటే.. పెద్ద ఆదాయ వర్గాలు పన్నుల నుంచి తప్పించుకోవడం ఆర్థిక సమానతకు సవాల్‌గా మారుతోంది. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది.
సామాన్యులను ముక్కు
పిండి వసూలు చేస్తున్న వైనం
ఎన్టీఆర్ జిల్లాలో 2025–26లో
ఇంటి పన్ను డిమాండ్ మొత్తం
రూ.53.99కోట్లు
ఇప్పటి వరకు 58.69 శాతం
మాత్రమే వసూలు
ఇంకా వసూలు చేయాల్సిన పాత బకాయిలు రూ.7.37కోట్లు, నూతన పన్ను రూ.14.93కోట్లు కలిపి మొత్తం రూ.22.30కోట్లలో 20 శాతం మొండి బకాయిలు ఉండగా మరో 20 శాతం కార్పొరేట్ విద్యా సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తల నుంచి వసూలు చేయాల్సి ఉంది. వీరు రాజకీయ నేతల నుంచి ఫోన్లు చేయించడం, మాట్లాడించడం వంటి దారులతో పంచాయతీ అధికారుల చేతులు కట్టేస్తున్నారు. సంబంధిత అధికారులు వచ్చినా బడాబాబులు లెక్కచేయడం లేదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన ఇంటి పన్నును వసూలు చేసేందుకు ఉన్నతాధికారులే రంగంలోకి దిగారు.


