మహిళల సాధికారతతో సమాజాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

మహిళల సాధికారతతో సమాజాభివృద్ధి

Mar 8 2026 7:17 AM | Updated on Mar 8 2026 7:17 AM

మహిళల సాధికారతతో సమాజాభివృద్ధి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): మహిళా సాధికారతతోనే సామాజిభివృద్ధి సాధ్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎ.సూర్యకుమారి అన్నారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగ ణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం మహిళా విభాగం చైర్‌ పర్సన్‌ పారే లక్ష్మి, సెక్రటరీ జనరల్‌ పొన్నూరు విజయలక్ష్మి సారథ్యంలో జరిగింది. తొలుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధి, కుటుంబ పురోగతి, దేశ ప్రగతిలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వ సేవల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం శుభపరిణామమని అన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ మాట్లాడుతూ.. మహిళల హక్కులు, సంక్షేమం, సాధికారత కోసం అన్ని స్థాయిల్లో కృషి కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏపీ జేఏసీ కృషి చేస్తోందన్నారు. పంచా యతీ రాజ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కె.విజయకుమారి, ఏపీ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటస్టిక్స్‌ జేడీ బి. అనుపమ చేతుల మీదుగా మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి స్టేట్‌ అసోసియేట్‌ చైర్మన్‌ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బి.కిషోర్‌ కుమార్‌, కో చైర్మన్‌ సంసాని శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ మల్లేశ్వరరావు, వి.ఆర్లయ్య, సిటీ యూనిట్‌ చైర్మన్‌ రవి ప్రసాద్‌, జనరల్‌ సెక్రెటరీ మందపాటి శంకర రావు, బత్తిన రామకృష్ణ, వై.ఎస్‌.రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement